-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Gopichand Malineni"



చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
నటీనటులు: బాలకృష్ణ , శృతి హసన్ 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్, యలమంచిలి 
విడుదల తేది: 12.01.2023



Songs List:



జై బాలయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కరిముల్లా

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

(జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు

గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు  పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా



సుగుణ సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రామ్ మిరియాల, స్న్గిగ్డ శర్మ 

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే..
పిచ్చి ప్రేమ పుట్టిందే..
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

నువ్వు హాట్’యు హాట్’యు
ఘాటు నాటు సీమ పటాస్ యే
నా స్వీట్'యు స్వీట్'యు
లిపు యు నీకు జ్యూసు యూ గలసే

నీ సోకు టాప్ క్లాసే
నిన్నొద్దులుకుంటే లాసే
మన క్లాస్’యు మాసూ
కలయిక అబ్భో అదుర్స్ యే

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాధే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి ధూరీ ధూరీ
మంట పెడదమ్మా

ఊపు తగ్గని, ఉడుకు తగ్గని
ఊర మాస్’యూ చీమా
తీపి చెరుకు జంట చూసి
గంటా కొడతాదమ్మా

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

సన్నజాజి తీగనడుం ఒంపుల్లో
సన్న ధరం ఉయ్యాలేసి ఊగలే
సీమకారం కోర మీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే

బాగా నచ్చవే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగ ఐతే ఈ అందాలను
నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునేయ్
చుట్టలైపోనీ..

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాదే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే..



మా బావ మనోభావాలు పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, యామిని, రేను కుమార్ 

బావ బావ బావ
బావ బావ బావ
చుడీదారు ఇస్తామంటా ఆడికి
వొద్దొద్దు అన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లె పూలే చుట్టి
వెళ్లేలోపే ముఖం ముడుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చుస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరెసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటికొస్తేను
ఈడేందుకు వచ్చిండని
ఇంతెత్తుని ఎగిరి రేగాడిండే
ఓటర్ లిస్ట్ ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లలేసి
గోడలు బీరువాలు గుద్దేసిండే
యేటి సేద్ధమే తింగరి బుచ్చి
ఆదికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జగించి
చేసేసుకో లాలూచి
హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సిటీకి మాటికీ సిన్నబుచ్చుకుంటాడే

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ





మాసు మొగుడొచ్చాడే పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో, రమ్యా బెహ్రా

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
ఏడ నుంచి తన్నుకొస్తదో
తాటదీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానేలేడు నీ దరిదాపు
పుటకతోనే మనలో ఉన్నాయ్
నాన్న గారి జీన్స్లో జీన్సు
సేమ్ టు సేమ్ ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు
నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
నీ లాగుడు ఊగుడు
నను అట్టుడుకిస్తాందే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
హే జింగి జింగి లాలలో
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
జింగి జింగి జింగి జింగిలాలో

ఏ రంగు రంగు రెక్కలా గుర్రంలా
చెంగు చంగునోస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కళ్ళేమిచ్చి నాకిలా
మంచి చెడ్డ చూసుకో మరదలా
హే సీమ కత్తి చూపుతో
సిగ్గులేని కొస్తివె సిలుకు లుంగీ చుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా
పుట్టుమచ్చతో భలే
పులకరింతలొచ్చెనే నీ దయ వల్ల
కులుకు చుస్తే కులుమనాలి
పట్టపగలే పొగలో సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
నీ మాటకి ధాటికి బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెత్తవ రాతిరి రాసి కథలే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

Palli Balakrishna Friday, November 25, 2022




చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
నటీనటులు: రవి తేజ, శ్రుతి హసన్, వరలక్ష్మి శరత్ , అప్సర, సముద్ర ఖని
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: బి.మధు
విడుదల తేది: 09.01.2021



Songs List:



భూం బద్దలు పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ

ఊళ్ళో యాడ ఫంక్షన్ జరిగిన
మనమే కదా ఫస్టు గెస్టు
దద్దరిల్లే దరువుల లెక్కన
మన ఐటమ్ సాంగ్ మస్తు

అల్ ది బెస్టు

చీమకుర్తిలో కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

ఏ చోటుకి పోయినా అదే పాత వరసా
చిన్నా పెద్దా నన్ను చూసి వచ్చేస్తారు వలస
ఆ కష్టం పల్లేక ఆళ్ళ గోల సూల్లేక
గాల్లోన ముద్దులని ఎగరేసా

ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్మ

భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముద్దిస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటే గుండెకింద సలుపొస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా నలుపొస్తాందే
స్టేజి మీదకెక్కనియ్యి వంద నోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ కందకుండా పిండేస్తా
కరువుతీరా ఒక్కసారి కావులించి వదిలేస్తా

నీ ఉంగరాల జుట్టు చూస్తే ముదొస్తాందే
మా టంగుటూరు లతా లచ్చిమి గుర్తొస్తాందే

డీజే డీజే డీజే డీజే డీజే కాదురొరేయ్
ఇది ఓజే ఒంగోలు జాతర ఓజే ఓజే ఓజే

యమ ఆర్కెస్ట్రా డాన్సు మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యు మై ఫ్యాన్సు అందరికీ థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్ మీల్స్
దిమ్మ తిరిగే రిలాక్సు అడగన్లే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు

నీ జోషు, నీ గ్రేసు అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందర జుజూబీలే
మిస్ ఇండియా ఫిగర్స్
ఎయ్..! వన్ టౌన్ రాజా నీ ఫన్ టౌన్ కి వచ్చానే
వినిపించెయ్ నా జ్యూక్ బాక్సు

ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్మ్

భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్ అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిసా
చినగంజాంలో నా ఒళ్ళు ఇరిసా
అట్టా అట్టా అందాలను పరిసా
ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా




భలేగా తగిలావే బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్ర

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా


ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకుమారం అబబో
సురుకు ఎటకారం కారం అబబో అబబబ్యాబో

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం
హో హో..! భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా

తిండిమాని తిండిమాని తిండిమాని
తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా
నిదురమాని నా కలల్లో దొంగలా నిను చూస్తున్నా

మైళ్ళకొద్ది వెంట తిరిగి నిన్ను ఫాలో చేస్తున్నా
నిన్ను కలిసిన రోజునుంచి బొత్తిగా నే నిన్నే మరిచి
నీతో ఉంటున్నా

భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం
హోహో..! భలేగా తగిలావే బంగారం
భలేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామ
ఒకటోసారి పుట్టినాది ప్రేమ
డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని చుట్టి వద్దామా

పగనిధలోక రారా ఆశిధజన మందార రారా

తగిలావే తగి తగి తగిలావే భలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం
తగిలావే తగి తగి తగిలావే భలేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం





కోరమీసం పోలీసోడా పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్ర

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి

నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది
నన్నెల్లి పొమ్మంది సవతి..!!
రవ్వంత నీ పక్క సోటివ్వనంటుంది
పోట్లాటకొస్తుంది దండెత్తి

ఆ సంగతేందో ఓ కాస్త నువ్వే తేల్చుకోరా పెనిమిటీ
కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి

పనిలో పడితే నీకేది గురుతురాదు
నువ్వలా వెళితే నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత చెరొక సగముగా
సమయమంత నీవే ఆక్రమించినావురా

ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ నిన్నేగా నే
మెల్లోని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి నీ క్షేమమే
కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా నీతో ఉన్నదంటా

కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి




మాస్ బిర్యానీ పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: కసార్ల శ్యామ్
గానం: రాహుల్ నంబియార్, సాహితి చాగంటి

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)

హే సింగారాల సివంగి
వయ్యారాల ఫిరంగి
కొంటె చూపు కోనంగి
పైట సెంగే పతంగి

హే పిస్తోల్ లాగే ఉన్నాదే
పిట్ట నడుం సంపంగి
బుల్లెట్ దాగి ఉన్నాదే
సొట్టబుగ్గల సారంగి

హో స్వీటీ నా డ్యూటీ
ఇకపైన ఇంట్లో నీతోటి
ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

బంగారం రా నీ బలుపు
బాంబులు మోతే నీ పిలుపు
పొట్టెలంటి నీ పొగరు
తట్టి లేపే నా ఫిగరు

AK 47 లా దూకేస్తార నీతోడు
ఏకంగా నీ వంటింట్లో చేయిస్తారా పెరేడ్
నన్ను కొట్టు నన్ను చుట్టు
ఇన్నినాళ్ళ ఆకలి తీరేట్టు

ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)

బేడీలు రెడిలే - జోడీగా వేయాలే
చెరసాల లుండాలే - చెలి కౌగిలి చాలే
దొరగారు హుషారే - దొరసాని తయారే

చిన్ని గుండెల్లో నువ్వు సిరెనాల
మోగుతుంటావే ఎదలో నిలిచి ఇలా
పొద్దు మాపుల్లో యూనిఫాంలా
అంటి ఉంటానే నీలో ఒదిగేలా

హే అందాలకే ఇయాల బందోబస్తు ఇయ్యాల
చందమామై తెల్లార్లు నువ్వే గస్తీ కాయాల
నే నచ్చి నిన్ను మెచ్చి
ముద్దులిచ్చి కుంటా రెచ్చి రెచ్చి

ఓసి నా క్లాస్ కళ్యాణి
పెట్టావే మాస్ బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాక్ మారాజా
ఫ్యామిలీ ప్యాక్ నువ్  లేజా
నువ్ లేజా నువ్ లేజా

డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
డండ నకర నకర నకర
టక టక టక టక (2)




కటారి థీమ్ సాంగ్ సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: కసార్ల శ్యామ్
గానం: రాహుల్ నంబియార్, సాహితి చాగంటి

కట కట కటారోడు కస కస కస కసాయోడు


Palli Balakrishna Sunday, January 17, 2021



చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రవితేజ , శ్రేయా శరన్, అంజనా సుఖాని
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: ఆర్. ఆర్.వెంకట్ , వి.సురేష్ రెడ్డి
విడుదల తేది: 06.08.2010



Songs List:



ఐదేళ్ళ వయసు పాట సాహిత్యం

 
చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: బాబా సెహగల్ 

ఐదేళ్ళ వయసు 




రాజా రాజా రవితేజా పాట సాహిత్యం

 
చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్రీకృష్ణ , గీతామాధురి

రాజా రాజా రవితేజా 




నాయనకాన పాట సాహిత్యం

 
చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు , రీటా, భార్గవి పిళ్ళై 

నాయనకాన




అడుగుతుంది పాట సాహిత్యం

 
చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: హేమచంద్ర, మాళవిక 

అడుగుతుంది 




అందమేమో విస్తరాకు పాట సాహిత్యం

 
చిత్రం: డాన్ సీను (2010)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర , మాళవిక

అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు
ఎహే చిరాకు చెడ్డ చిరాకు

చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు
లంగరేసి లాగ మాకు సందు చూసి దువ్వమాకు
నేను వచ్చి అల్లుకుపోతా
నువ్వు రామాకు అహ రామాకు ఇటు రామాకు
బంగారు పిట్ట వంపుల పుట్ట
సొంపుల చిట్టా చూస్తూ ఉంటే నోరూరే

చీమల పుట్ట చంపకు ఇట్టా
ముద్దుల పట్టా కావాలంటే లేజారే

అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
గుప్పెడు గుండెను పట్టుకు లాగావే
అల్లాడే పిల్లాడే మిర్చిలా ఉందే
మెంటర్ ఉంటే కి మాటలు పెట్టాడే

దిమ్మతిరిగి బొమ్మడి పోయే
నా దిమ్మకు దిం దిమ్మకు ధం ధమ్మకు ధమ్మకు
అత్తరు బుడ్డీ చుక్కల మిడ్డీ
చక్కర వడ్డీ చూడాలంటే నాతో రా
బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే నాతో దా దా ధా
కన్నేసి వచ్చాడే పిన్నీసు గుచ్చాడు
ఎక్కడి వక్కడ తక్కెడ వేసేడే

నక్కేదో తొక్కావే లక్కీగా దక్కానే
ఎప్పటికప్పుడు తప్పుకు పోతావే

వీడే స్పీడు చూస్తూవుంటే
లవ్ ఎటాక్ హ లవ్ అటాక్ అబ్బాబ్బా లవ్ ఎటాకు

అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
అందమేమో విస్తరాకు మడత చూస్తే మావిడాకు
తళుకు బెళుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని ఉండి అందక పోతే మహా చిరాకు
ఎహే చిరాకు చెడ్డ చిరాకు

చాకులా చెలరేగ మాకు
మీద మీదకి దూకమాకు
లంగరేసి లాగ మాకు
నీకు నాకు లింకువుందని
బయట తళుకు బయట తళుకు బయట తళుకు

Palli Balakrishna Sunday, November 26, 2017


చిత్రం: పండగ చేస్కో (2015)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మేఘ
నటీనటులు: రామ్ పోతినేని,  రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: రవికిరీటి
విడుదల తేది: 29.05.2015

తొలిసారి కలవరం ఏంటో చలిజ్వరం ఏంటో ఈ కళవేంటొ
ఆ పైన మైమరపేంటో మతిమరుపేంటో ఈ గొడవేంటో
బుగ్గల్లో భూకంపాలే రప్పించేలా చేశాడెంటో
మనసంతా మాగ్నెట్లాంటి చూపులతో లాగేశాడేంటో

దునియాలో నీలాంటోడ్ని కలలోనూ చూడలే
నిను చూసిన దగ్గరనుంచి నా కలలు ఆగలే
పరువాన్నే పడగొట్టే చిఛ్చర పిడుగళ్ళె

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

ఈ గుఱ్ఱం లాంటి వయసుని ఆపే కళ్లెం నువ్వేలే
నీ హై వోల్టేజ్ టెంపర్ చూసి టెంప్టయిపోయాలే
అయ్ సూదంత నువ్ చోటిస్తే
నీ ఒళ్ళంతా టాటూ అయిపోనా
నువ్ చారణ సీన్ అందిస్తే
నే బారాణా బొమ్మయి చూపైనా

దొరికాడే దొరికాడే నా రేంజోడే దొరికాడే
నచ్చాడే నచ్చాడే పిచ్చెక్కేలా నచ్చాడే
ఎవడీడే ఎక్కడోడే నమిలేసేలా తగిలాడే
గెలికాడే గెలికాడే మైండంతా గెలికేశాడే

Palli Balakrishna Monday, September 4, 2017



చిత్రం: బలుపు (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవితేజ
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, అంజలి
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: ప్రసాద్ వర పొట్లూరి
విడుదల తేది: 28.06.2013

హల్లొ బాయ్స్ అండ్ గర్ల్స్
థిస్ సాంగ్ ఇస్ డెడికెటెడ్ టు ఆల్ థి యూత్ ఆఫ్ ఎపి

అమ్మాయిలను చూసి టెంప్ట్ అయ్ పోయి
మెల్ట్ అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
లైఫ్ లొ హర్ట్ అయ్ పోయి మట్టై పోయిన కుర్రాల్లందరికీ ఈ పాట అంకితమ్

కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా

కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా

అయిన లవ్ చెస్తే ఫోజే కొడతవె
మనసె నీకిస్తే ఇజ్జత్ తీస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవే

ఇనవె కన్యా కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి

హే కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా


నా గుండెల్లొన కుక్కర్ కేమో మంటెట్టింది నువ్వెగా
విజిల్ కొట్టి పిలుస్తుంటె పిల్ల విసుక్కుంటావా

సరదా పుట్టి చీమల పుట్ట లాంటి వాడ్ని కెలికితె
ఎట్టుంటాదొ ఏమౌతాదో నేడే చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనే

ఇనవె కన్యా కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి

మీరు ప్రెమ ధొమ తొక్కా తోలు ఎన్నొ ఎన్నో అంటారే
నీలల్లొకి రాలే రువ్వి కల్లొలాన్నె చూస్తరే

ఎహె ఇన్నాల్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింస పెడితె ఉసురు తగిలి పొతరే

ఇనవె కన్య కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి



********   *********   ********


చిత్రం: బలుపు (2013)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మిక సింగ్, రనైనా రెడ్డి

బసన్నధేె... బసన్నధేె...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
బసన్నధేె... బసన్నధేె...

హోయ్ అస్సలేమి ఎరగనట్టుగ ఓ పిల్లడ అంతలాగ ఫొజు కొట్టకా
ఓ తస్సదీయ ఉన్నపాటుగ రొమాన్సులొ రెచ్చిపొతె తప్పులేదుగా

గండుచీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు
మందు పాతరెట్టినట్టు  ముందుకొచ్చి ముద్దు పెట్టు రా రా రా రా రే...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
బసన్నధేె... బసన్నధేె...

హెయ్ పాడుకల్లు నిన్ను నన్ను చూడకుండ
వచ్చి కొంగు చాటు దూరిపోర సుబ్బరంగా

హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ
నిన్ను దిండు లాగ అత్తుకుంటానే

నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండ
నీకు అత్త మామ ఎంత ప్రేమ బుజ్జికొండ

మూడు ముల్ల ముచ్చటవ్వగానె ఆరోజు నువ్వు ఏడు వంకీలిస్తానంటవా
బిందేలొన ఉంగరాలనీ తమాషాగా వంగి వంగి తీస్తనంటవా

లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు
రా రా రా రా రే...

పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
బసన్నధీ... బసన్నధీ...

హే ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే...
బసన్నధేె... బసన్నధేె...

హే గల్ల చీర కట్టినావె సామిరంగా
నువ్వు సన్న రైక చూడలేదు అమ్మ దొంగ

హే సన్నజాజులెట్టుకోవే రంగ రంగ
జాము రాతిరంత జాతరైతదే

హెయ్ ఎడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా
నువు అందమంత ఎత్తుకెల్లు అప్పనంగా

హెయ్ వెన్నపూస లాగ ఉంటవె నా రొమ్ములో నల్లపూస నంజుకుంటవే
ఆవురావురావురంటవె హయబ్బో ఆగమన్న ఆగనంటవే

హెయ్ పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
రా రా రా రా రే...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
బసన్నధీ... బసన్నధీ...

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదె హే
బసన్నధేె... బసన్నధేె...


********   *********   ********


చిత్రం: బలుపు (2013)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, గీతా మాధురి

నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో
చైజారిన మన్నస్సు ఏమైందో

మలుపేం కనిపించిందో పిలుపేం వినిపించిందో
మైమరచిన మన్నస్సు ఏమైందో

ఒహొ ఒహొ ఒహొ అలా అలా తను అటు ఇటు
తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా
అని ఎవరిని అడగను ఏమైందో...

ఏమైందో... ఏమైందో...
నువొక్కసారి చూడు ఏమైందో...
ఏమైందో... ఏమైందో...

ఓ నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో
చైజారిన మన్నస్సు ఏమైందో...

త త రత్తా రుబి రుబి డర
రుబి రుబి డర తు తు రుబి రుబి
దిబ ది రుబి రుబి దర తు రుబి రుబి ద

నాకు నీ పరిచయం మరొక జన్మేనని
నీతొ పైకెలా చెప్పటం నమ్మనంటావో
ఏమొ తెలియని ఆ నిజం నీకు ఏనాటికో
ఇన్నాల నా ఏకాంతమింక ముగిసిందనో
నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో

అలా అలా తను అటు ఇటు
తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా
అనెవరిని అడగను ఏమైందో...

ఏమైందో... ఏమైందో...
నువొక్కసారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో...


Palli Balakrishna Tuesday, August 1, 2017



చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: వెంకటేష్ , త్రిష , సలోని
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2012



Songs List:



బాడీ గార్డ్ (నువు పుట్టగానే) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బాబా సెహగల్ , రమ్యా, నవీన్ మాధవ్ 

బాడీ గార్డ్  (నువు పుట్టగానే)





హోసన్నా (అడుగడుగునా నిను చూశా) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: శ్రీవర్ధిని , రాహుల్ నంబియార్ 

హోసన్నా   (అడుగడుగునా నిను చూశా)



ఓ మై గాడూ పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రంజిత్, గీతామాధురి , బిందు 

ఓ మై గాడూ




ఎవ్వరో... ఎవ్వరో... పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్

ఎవ్వరో... ఎవ్వరో... 
నను తియ్యని గొంతుతొ పిలిచిందెవ్వరో
ఎవ్వరో... ఎవ్వరో... 
తన మాటల తేనెలు పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో
తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో
చిలిపి సిరి మువ్వరో కలిపి తను ఎవ్వరో
ఏమో ఏమో...
నా గుండెతొ గుసగుసలాడిందెవ్వరో
హే... ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో

ఎవ్వరో... ఎవ్వరో... 
ఈ దాగుడు మూతలు ఆడేదెవ్వరో 

హే హే... ఇంతలా ఏమార్చినా ఊరూ పేరూ జారవే
నిన్నిలా నే మరచినా నువు మాత్రం నను వీడవే
అందగాణ్ణి అంటావే మరి అందకుండ ఉంటావే
హే ఆ ప్రాణ వాయువల్లే నువుకూడ కానరావే
ఇంతిలా నన్ను ఊరిస్తావే నువ్వెంత అందానివే
ఆ అందం కళ్ళకు కట్టేదెవ్వరో 
తన చిరునామా చూపెట్టేదెవ్వరో

ఏ ఏ... నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే
తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నన్ను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దాస్తావే
హే... అరె నిన్ను చూడాలని మైమరచి పోవాలని
నా ఒళ్ళే కళ్ళై వలేస్తున్నా ఆచూకి చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో 
ఆ చక్కెర పలుకుల టక్కరి ఎవ్వరో

ఎవ్వరో... ఎవ్వరో.... 
అరె ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో  




జియా జియాలే పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిహరన్, హరిణి 

జియా జియాలే 



ఎందుకో (కలవాలనుకున్నా ప్రేమని) పాట సాహిత్యం

 
చిత్రం: బాడీ గార్డ్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరన్, శ్వేతా మోహన్, ఎస్. ఎస్. థమన్

ఎందుకో (కలవాలనుకున్నా ప్రేమని)

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default