-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anandhi"



చిత్రం: ప్రేమంటే (2025)
సంగీతం: లియోన్ జేమ్స్ 
నటీనటులు: ప్రియదర్శి, ఆనంది 
దర్శకత్వం: నవనీత్ శ్రీరామ్ 
నిర్మాతలు: జాన్వీ నారంగ్, పి. రామ్మోహన్ రావు 
విడుదల తేది: 21.11.2025



Songs List:



పెళ్లి షురు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే (2025)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: శ్రేయా ఘోషల్, దీపక్ బ్లూ 

సాంగ్ : పెళ్లి షురు

మీరా మీరా లాడుతూ
మిరపకూ మెరుపల్లే
అందానికి పొగరద్దిన మగువే వధువేలే
సరసా లాడుతూ
చిలిపిగా చోరవల్లే
మురిపాల గోపాలుడు వరుడయ్యెనులే

భాజాలే డీజేలా భారిగా మోగెలా
పండగల ఊరంతా హోరెత్తెలా
అందాల అమ్మాయి
అల్లరిగా అబ్బాయి
మనసుపడి ఒకటయ్యే సందడిలా
హే ఇక సంగీతే ఊపెక్కించెలా
హే మరి వయసంతా ఊరకెత్తేలా
హే ప్రతి చిరునవ్వు అక్షింతయ్యెలా
హృదయమే ఆదమరిచి ఆడే వేళా

హే పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
హే హే ధంచికొట్టు మేళం
అధరగొట్టి తాళం
పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
విచ్చుకుందీ ప్రేమ
చెయ్యి పట్టు భామ

హే పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
హే హే ధంచికొట్టు మేళం
అధరగొట్టి తాళం
పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
విచ్చుకుందీ ప్రేమ
చెయ్యి పట్టు భామ

చమక్ చమక్ చందనమే
చమక్ చమక్ చిందెనులే
చమక్ చమక్ చిందుల వేళా

చమక్ చమక్ చెనుకులనే
చమక్ చమక్ చిలికెనులే
చమక్ చమక్ చిలిపిగా బాలా

వేగంగా వెళుతూ ఉన్నా..
చెలి అందంతో ఆపేసావే
నా ఈ ఒంటరితనమే
నిజంగా జంటల్లే మలిచావే..
నాలాగే నీలో ఉన్నా కొంటెతనమేదో కవ్వించిందే
అదే సంకేతంగా మదే సంతోషంగా
నీకె నా జీవితమే పంచాలందే ..

హే నా పెదవేనుక దాగిన మాటల్నే
హే నువ్వుంటుంటే చాల బాగుందే
హే నీ పాదములతో పాదములు కలిపేసి
చెరిసగం సరిగమప రాగం తీసేలా

హే పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
హే హే ధంచికొట్టు మేళం
అధరగొట్టి తాళం
పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
విచ్చుకుందీ ప్రేమ
చెయ్యి పట్టు భామ

హే పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
హే హే ధంచికొట్టు మేళం
అధరగొట్టి తాళం
పెళ్లి షురూ హే హే పెళ్లి షురూ
విచ్చుకుందీ ప్రేమ
చెయ్యి పట్టు భామ




దోచావే నన్నే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమంటే (2025)
సంగీతం: లియోన్ జేమ్స్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: ఏబీ వి (Abby V)

రాయంచతో రాసలీలా
నడిరేయి వేళ
ఊరంతట నిదుర గోల
మనకి తెలవారిందిలా

నా హృదయం అనే గది లోపల
తోలి అడుగులే నీవే
వెలుతురు తేర మరి పరిచేసి రంగుల్ని నింపేసేలా..

దోచావే నన్నె నువ్విలా
దాచావే నన్నె నీలో వెన్నెలా
దోచావే నన్నె నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా..

దోచావే నన్నె నువ్విలా
దాచావే నన్నె నీలో వెన్నెలా
దోచావే నన్నె నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా..

రాయంచతో రాసలీలా
నడిరేయి వేళ
ఊరంతట నిదుర గోల
మనకి తెలవారిందిలా

చలి లేని గాలే ఇన్నాళ్లు నేనే
చలి తాకి ఒనికించే ఈ వేళన

తడి లేని నీరై నడిచేటి వాన్నె
సడిచేసే అలా మది చాటున

కాదని అనలేక
అవునని రాలేక
వేరే దారిలేక
నీతో ఈ కథనం

ప్రణయపు వేళైనా
మరి ప్రళయమూ ఎదురైనా
ప్రతి క్షణమిక నా ప్రయాణం నీతోనే ఇలా..

దోచావే నన్నె దొంగలా
దాచావే నన్నె నీలో వెన్నెలా
దోచావే నన్నె నువ్విలా
రాధా కూడా దొంగైతే ఎలా..

Palli Balakrishna Wednesday, April 8, 2026




చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
నటీనటులు: ఆనంది, రాగ్ మయూర్ 
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్, టి.జి. కృతి ప్రసాద్ 
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము
విడుదల తేది: 09.01.2026



Songs List:



నా నల్ల జిలకర మొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు 
అదనపు సాహిత్యం: జానకిరామ్ 
గాయకులు: అనన్య భట్, జానకిరామ్,  గౌరీ నాయుడు జమ్ము 

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే..
అ.. ఎలగా ?
మావ.. నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు

ఆహా !
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు
అవును

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
అవును అవును
రూపాయి కావాలా
ఆహా !
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు

ఓహో
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు
అవునా

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ

పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?
పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?

నా పాదాలు సల్లగుంటే…
ఆ.. ఏటి సల్లగుంతే..

నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు
అయ్యా నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?

సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
ఆహా!
సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
అదే

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ….



కోసింది కొయిగూర పాట సాహిత్యం

 
చిత్రం: గరివిడి లక్ష్మి (2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు 
గాయకులు: అనన్య భట్, షకలక శంకర్ ,  గౌరీ నాయుడు జమ్ము 


కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

ఆహా ఏస్కో

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

ఎలాగేలాగా

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండా ఊంగారాలోయ్ సందమామ
ఉండదోయి ముండ మనసు

హ కడవమీద కడవ పెట్టోయ్ కామరాజు
కాకినాడ రేవుకెలితే
ఆ కాకినాడ కారణంగారోయ్

ఆ కాకినాడ కారణంగారోయ్ సందమామ
కడవ దించి కన్ను కొట్టే

కోసింది కోయగూర దుంపోయ్ సందమామ
వాసనకి సంపంగి మొగ్గ
యేళ్ళనిండ...

Palli Balakrishna Saturday, April 4, 2026



చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (2022)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
నటీనటులు: అల్లరి నరేష్ , అనంది 
దర్శకత్వం: ఎ. అర్. మోహన్ 
నిర్మాత: రాజేష్ దండు 
విడుదల తేది: 11.11.2022



Songs List:



లచ్చిమి పాట సాహిత్యం

 
చిత్రం: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (2022)
సంగీతం: సాయి చరణ్ పాకాల 
సాహిత్యం: శ్రీమణి
గానం: జేవేద్ ఆలి

నా తెలుగు భాషలో
కొత్త అక్షరం నువ్వు
నా చేతి గీతలో కొత్త రేఖవైనావా 

మట్టి తీగలో దాచి పెట్టిన
చందమామవే నువ్వా
చిట్టి గుండెనె చిన్ని కొంగుకే చుట్టి కెళ్ళినావా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

ఆ గోదారి అందమే దారి తప్పిలా నా దరికొచ్చే
ఈ మందార పువ్వుతో మాటలాడిలా నా మనసుకు మురిసెనే 

అమ్మమ్మో మాటలావి
ఇళయరాజా గారి పాటలా 
నా గుండె తబలానిలా
జాఖిర్ హుస్సేన్ వాయించేలా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

చిటారు కొమ్మవై మిఠాయి పొట్లమే
నా గుండెలో గిటారు మీటెనే
చిరాకు రేగితే ఆ మూతి ముడుపులే పటాకు పేలుడే 

అమ్మమ్మో కుళుకులా అవి
కూచిపూడినే మరిచి పోయేలా
ఓలమ్మో నడకలా అవి
నెమలి నాట్యాన్నే మరిపించేలా 

హే లచ్చిమి... నీ ఎనక ఎనక వస్తా కనక లచ్చిమీ
మనకి రాసి పెట్టివుంది గనక లచ్చిమి 
ఇంకా ముందు ఎనక సూడక మనసుతో మటలాడమ్మి  (2)

Palli Balakrishna Wednesday, October 19, 2022



చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
నటినటులు: సుధీర్ బాబు, అనంది
దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి
విడుదల తేది: 27.08. 2021



Songs List:



నాలోనే ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: అనురాగ్ కులకర్ణి

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

నిమిషాలు లేని కాలమేదో… నిరసించలేక నీరసించే
నిశి లేని తెల్ల చీకటేదో… చితి లేక మంటలేఖలే రచించే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా

నాలోనే ఉన్నా నీలోనే లేనా
ఈ దూరమింక నమ్మలేకున్నా
నీతోనే ఉన్నా నిన్నా మొన్నా
లేదన్న మాట నిజమేనా

వివరించలేని భాష ఏదో… ప్రకటించలేక మూగబోయే
దిగమింగలేని బాధ ఏదో… ఒదిగుండలేక కన్ను దాటి పోయే
ఏ కారాగారం కనలేదీ దూరం… కనరా నీ నేరం కాలమా
ఏ గీతాసారం వినిపించని వైరం… విధి రాసిన శ్లోకం శోకమా






మందులోడా ఓరి మాయలోడా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: సాహితి చాగంటి, ధనుంజయ

ఆఆ, అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే…!
సింగపూర్ రంగబాబు ఫ్లైట్ ఎక్కమన్నాడు
ఉంగరాల గంగిరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్కరేగి యమబాబు ముహర్తలు పెట్టేసీ
పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసినారురో

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా

పెద్దూరి నాయిడుకి నిన్నిచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్దిరెడ్డి మద్దెల వాయించినాడే
సిన్నూరి సిట్టిబాబు సిడతలు కొట్టాడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

నా మొగుడు నాయుడు. ఏ పనిపాట సేయ్యకుండా మూలికలు ఏర్లు తేత్తానని అడువులు పట్టుపోయి
నన్ను మరిసే పోనాడు..!!
అవునా..! ఏ ఊర్లేల్లాడు..? ఏ ఏర్లు తెచ్చాడు..?

తూరుపు ఎల్లాడు… తుమ్మేరు తెచ్చాడు
పడమర ఎల్లాడు… పల్లేరు తెచ్చాడు
దచ్చినమెల్లాడు… దబ్బెరు తెచ్చాడు
ఉత్తరమెల్లాడు… ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులని మాయమై పోయినాడు, ఊఉ

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే
మందులోడే ఆడు మాయలోడే
మళ్ళీ రాడే మందుల సిన్నోడే

పైటే పట్టమంటే… పల్లేరు తెచ్చాడా
నడుమే గిల్లమంటే… నల్లేరు అల్లాడా, ఆ
ముద్దులు పెట్టమంటే… మూలికలు ఇచ్చాడా
ముచ్చట తీర్చమంటే… మూడుర్లు తిరిగాడా
మేమున్నమే పిల్లా… వద్దు నీకు మందుమాకు

మందులోడా ఓరి మాయలోడా
మామ రాకు మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మళ్ళీ రాకు మందుల సిన్నోడా

మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా
మందులోడా ఓరి మాయలోడా
మామ రారా మందుల సిన్నోడా




నాలో ఇన్నాళ్ళుగా… పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: దినకర్, రమ్యా బెహ్రా

నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ
అదో ఇబ్బందిగా అనిపించినా… అది కూడా బానే ఉంది
మరి కన్నెర్రగా కసిరేసినా… చిరునవ్వులా ఉందే
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానే అందేనా
ఎంతో దూరాన ఉండే ఆ తారకా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

కొంచం గమనించదేం… దరిదాపుల్లోనే తారాడినా
వైనం గురుతించడేం… కనుబొమ్మతోనే కబురంపినా
ఎలా చెప్పాలో వయస్సేమందో… ఎలా చూపాలో రహస్యం ఏదో
ఇదేమి చిక్కో… నువ్వే కనుక్కో
తెగిస్తా, వరిస్తా… మరెందుకని పరాకనీ
లేపే కిరణాల పిలుపే… తొలిమేలు కొలుపై నను గిల్లగా
తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
నాలో ఇన్నాళ్ళుగా… కనిపించని ఏదో ఇదీ
లోలో కొన్నాళ్ళుగా… నాతో ఏదో అంటున్నదీ

పోన్లే పాపం అని… దరి దాటి రానా నది హోరుగా
సర్లే కానిమ్మనీ… చుట్టేసుకోనా మహాజోరుగా
అలా కాకుంటే మరో దారుందా
ఇలా రమ్మంటే కలే రానందా
తయారయుందాం… తథాస్తు అందాం
అటైనా, ఇటైనా… చెరె విడే హడావిడీ
తరిమే తొలివాన చినుకో మురిపాల
మునకో నను అల్లగా

తానా తందానా
మహదానందానా… మనసే చిందేయగా
తానేనె తందానే తానే తననానే తానే తననానేనా
తానే తన్నానే తానే తననానే తానే తననానేనా





చుక్కల మేళం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీదేవి సోడా సెంటర్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అనురాగ్ కులకర్ణి

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం వాసంతం

అక్కరలేక అక్కున చేరే దక్కని చొరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తే విలువ మరుగేరా
ఓ ఓఓ..! చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం

బతుకు పదుగురితో అడుగు పడినదనీ
నడక నలుగురితో కలిసి నడవమనీ
ఉన్నతంగా చూడరామరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడదాకా ఓ నేస్తం

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం

కలతలే దాటీ… కలుపు దూరాన్నీ
కొరత ఏపాటీ కొలత వెయ్ దాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తొలిముచ్చటీమాట, ఆ ఆ
ఇష్టపడటం నేర్చుకో విలువిచ్చి ప్రతిచోటా, ఆఆ

హో ఓఓ, చుక్కల మేళం దిక్కుల తాళం ఒకటయే
ఈ సంబరం… ఓ ఓఓ, ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
మా సొంతం, హో ఓ ఓ… వాసంతం




Love Themeయం

 
Song Details

Palli Balakrishna Wednesday, September 29, 2021
Zombie Reddy (2021) Telugu Songs Lyrics Album Cover

Zombie Reddy (2021) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Zombie Reddy (2021)
Music : Mark K. Robin
Actors : Teja Sajja
Actresses : Anandi , Daksha Nagarkar
Director : Prasanth Varma
Producer : Raj Sekhar Varma
Release Date : 5 February 2021

GO Corona Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'GO Corona' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Mama Sing, Sri Krishna and Anudeep.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
Lyricist : Mama Sing
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: మామ సింగ్ గానం: అనుదీప్, శ్రీ కృష్ణ, మామ సింగ్ ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటామా రోడ్లన్నీ ఖాళీగుంటే రాక ఉంటమా ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా మా వీపు పగిలే వరకు మానుకుంటమా హే వడియాలు ఆరబెట్టి వాడలంత ఉంటాం మా బ్రాండు ఉప్పు కోసం ఊర్లు తిరుగుతుంటాం మా చింత చెట్టు కింద పేకలాడుకుంటాం ఇవన్ని చేసి కూడా పాట పాడుకుంటాం గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో (2) ఏ రోగం అయితే ఎందీ మనకుంది కదా బ్లీచింగ్ పౌడర్ ఈ వైరస్ పీకేదేంది మా జేబు నిండ పారాసిట్మల్ మా రాష్ట్ర బడ్జెట్ అంతా వైన్ షాపులుంది కాబట్టే మందు కొరకు రోడ్డు నిండ మంది ఏది ఏమైనా కాని మత్తు వదలమంది లాక్ డౌన్ పెడితే ఏది ఉచ్చ ఆగదండి ఆన్ లైన్ లో పాటాలంటాం బ్యాక్ గ్రౌండ్ లో పాటలు వింటాం సిక్స్ ప్యాక్ కలలే కంటు ఏప్పుడు చూసినా తింటాం పంటాం సరికొత్త వంటలు చూస్తాం మంటెట్టి పెంటే చేస్తాం ఇన్స్టాంటు నూడుల్ చేసి ఇన్స్టాలోన బిల్డప్ ఇస్తాం మ్యాచింగు మాస్కులు వేస్తాం మరు నిమిషం జేబులో దాస్తాం దగ్గొచ్చినా తుమ్మే వచ్చినా పూలతో డాక్టర్ పూజలు చేస్తాం సరుకులపై సర్ఫ్ ఏసేస్తాం సానిటైజర్ స్నానం చేస్తాం సీక్రెటుగా పార్టీ పెట్టి హత్తుకు పోతాం హత్తుకు పోతాం ఎత్తుకు పోతాం ఎత్తుకు పోతాం (3) హే చప్పట్లు కొట్టామంటే పీఎం హే పళ్ళెంతో చావు డబ్బులేద్దాం హే చీకట్ల పెట్టామంటే దీపం హే అడ్వాన్స్ దీపావళి చేద్దాం ఇల్లే హెల్ అయిపాయే... ఐపాయ్ ఒల్లే గుల్లైపాయే... ఐపాయ్ పెళ్ళే లొల్లై పాయే... ఐపాయ్, పిల్లే తల్లై పాయే గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో గో కరోనా గో కరోనా గోగో (4)

Zombie Reddy Theme Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'Zombie Reddy Theme' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Mama Sing.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
Lyricist : Mama Sing
Singer : Mama Sing
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: మామ సింగ్ గానం: మామ సింగ్ కోరస్: అనుదీప్ దేవ్, పి. వి. యన్. ఎస్. రోహిత్, రఘురాం ద్రోణవజ్జల , మార్క్ కె. రాబిన్ కళ్ళు ఎర్రగా గోళ్ళు నల్లగా వళ్ళు చల్లగా చావు మెల్లగా ఆకలాగక ఊగే నాలుక తనివి తీరగా నిన్ను కొరుకుతా కొరుకు కొరుకు కొరుకు కొరుకు నరుకుతున్నా కొరుకుతా ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు దొరికే వరకు ఉరుకుతా (2) మనిషి కరిచెనే మెదడు దొబ్బెనే జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి దొరికే దేహమే రక్త దాహమే జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి వావి వరుస లేనే లేదు వాసనొస్తే వల్లకాడు రాత్రి పగలు తేడా లేదు ఊరు వాడ వల్లకాడు జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి నన్ను పొడిచినా నొప్పి లేదులే కాలు నరికినా అడుగు ఆగదే పిచ్చి కుక్కలా నిన్ను తరుముతా నరుల జాతినే రూపు మాపుతా కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు కొరుకు జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు ఉరుకు జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి తొడలు కొట్టే వీరులైన మెదడు కొరుకుతాను నేను జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి కలికాలమందు యముడు నేను కాలయముడు మొగుడు నేను జాంబీ రెడ్డి జాంబీ రెడ్డి

Burn Down Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'Burn Down' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Harika Narayan.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
Lyricist : Harika Narayan
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: హారిక నారాయణ్ గానం: హారిక నారాయణ్ Burn Down

Game of Life Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'Game of Life' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Tharun Jain, Manmohan Raj and Mark K. Robin.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
Lyricist : Mama Sing
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: Mama Sing గానం: Tharun Jain, Manmohan Raj, Mark K. Robin Game of Life

Natu Kodi Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'Natu Kodi' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Mark K. Robin.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
Lyricist : Nagendra
Singer : Mark K. Robin
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: నాగేంద్ర గానం: మార్క్ కె. రాబిన్ పెద్దాపులి బోనులోకి నాటుకోడి దుమికే చూడు హా పులి ఆకలికి అది ఏటే ఐతదా లెక్కే తప్పి కోడి కోటే దాటేనా ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్... ఆయ్యో... ఆయ్యో... కోడి దాటేను కోడి దాటేను కోడి దాటే... దాటే... దాటే...

Mrithyunjaya Song Lyrics in Telugu – Zombie Reddy (2021)

'Mrithyunjaya' song from Zombie Reddy (2021) movie is composed by Mark K. Robin and sung by Kaala Bhairava.

SONG INFORMATION
Movie : Zombie Reddy (2021)
చిత్రం: జాంబీ రెడ్డి (2021) సంగీతం: మార్క్ కె. రాబిన్ సాహిత్యం: శివ శక్తి దత్తా గానం: కాలభైరవ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రికుంజయ పురంధర హరోం హర హర హర హర హర హర హరోం హర హర హరోం హర హర హర హర హర హర పురంధర హరోం హర హర హరోం హర హర హర హర హర హర హరోం హర హర ప్రళయ భయంకర, విష విలయంకర విధి వికృత విన్యాసం మారణహోమ విషానల కీలల మరణమృదంగ ధ్వానం ఒక మహమ్మారి లయ తాండవం కాలాగ్ని దగ్గ జన కాండవం ఆయం భయంకర సంతుల విధ్వంసంకర సంకట సమయం సంఘ మరణ వినివారణ తరుణం శంకరా త్వమేవ శరణ్ అభయంకరా త్వమేవ శరణ్ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రికుంజయ సహస్ర, సహస్ర సంఖ్యా నియమం తంత్ర పిశాచ సమూహం త్రినేత్ర జగత్రయేశ్వర సహయుస్వీయంత్రాహం దుష్ట సమూహం ప్రతిఘటన శక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ ప్రజా ప్రాణ రక్షణ దక్ష యుక్తి భువమయచ్ఛ ప్రయచ్ఛ త్రిపురంజయ సమరంజయ అసురంజయ మృత్యుంజయ త్రిపురంజయ సమరంజయ అసురంజయ మృత్యుంజయ పురంజయ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రికుంజయ జయ మృత్యుంజయ శివ మృత్యుంజయ భవ మృత్యుంజయ త్రికుంజయ

Palli Balakrishna Wednesday, March 10, 2021



చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
నటీనటులు: ప్రిన్స్ , శ్రీ దివ్య, ఆనంది
రచన: నందిని రెడ్డి.వి 
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 11.11. 2012



కళలకే కనులొచ్చిన పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రేవంత్

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది 
ని వల్లే నివల్లే కథ మొదలై ఇవాళే
జతపడి నడకలై సాగిందే 
ఓ శైలు నివల్లే నా శైలే మారెలే
పడి పడి మనసిలా ఊగిందే

కళలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది

ఇంకొంచెం అందంగా నిఎదుటనే ఒంటరిగా ఉండాలనే ప్రతినిమిషము అనుకుంటున్నా
నా సొంతం నువ్వనగా పదిమందిలో బిగ్గరగా చెప్పాలనే ఎద కదలిక వినిపిస్తున్నా
కలిసిన వేళల్లో అల్లరి నేనై
పెదవుల అంచుల్లో పుడుతున్నా

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu

నువ్వుంటే దగ్గరగా ఈ సమయమే తొందరగా గడిచిందని గురుతుండదె ఏదేమైనా 
నీ వెంటే వుంటానుగా నన్నొదిలిన దూరంగా ఊహాలలో ఊపిరిలో తోడై రానా
సాగే దారుల్లో సాయంత్రం నేనై
చలి చలి గాలుల్లో తడుస్తున్నా

యూ మై లవ్లీ ప్రిసిస్ బర్డ్
మై హార్ట్ ఈస్ యువర్ సోల్ 
నెవెర్ ఎవర్ లీవ్ మీ గో
యువర్ మై సోల్
యువర్ ఇన్ మై లవ్లీబర్డ్

You’re my lovely precious pearl
My heart is your shell never ever leave me girl
You’re my soul you’re in my lovely heart
Just don’t tear me apart trust me girl
Touch the soul o sailu




రెక్కలొచ్చిన ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బస్ స్టాప్ (2000)
సంగీతం: JB (జీవన్ బాబు)
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళ

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా

రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం 
గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం 
బ్రతుకంతా ఈడుంటుంద చివరంత తోడుంటుంద 
నది దాటని నావల కోసం ఎందుకు ఈ ఆత్రం 
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా 
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక 
కలలే నిజమవున కలవరమేమైన

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకి వరిగిందా

నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యాక రగిలింద గాయం 
పువ్వులనే పెంచే మాలి ముల్లలో వెతకడు జాలి 
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం 
ఏనాడో రాశాడమ్మ తలరాతే బ్రహ్మ 
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ 
బ్రతుకే నవలైనా కథలింతే ఏవైన

గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా

Note: This Lyric was Donated by Runku Ramprasad


Palli Balakrishna Thursday, May 21, 2020




చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: రామ్ చరణ్ తేజ్, అమలాపాల్, కాజల్ అగర్వాల్; ఛార్మి కౌర్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: డి.వి.వి.దానయ్య
విడుదల తేది: 09.01.2013



Songs List:



లైలా ఓ లైలా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ నంబియార్, రంజిత్, నవీన్ 

లైలా ఓ లైలా 



కత్తిలాంటి పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్. ఎస్. థమన్, శఫారి అల్వారిస్


కత్తిలాంటి పిల్లా



శుభలేఖ  రాసుకున్నా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, శ్రేయగోషల్

(ఈ పాట చిరంజీవి  నటించిన కొండవీటి దొంగ (1990) సినిమా నుండి తీసుకొని  రీమిక్స్ చేశారు. పాడినవారు: బాలు, చిత్ర.  సంగీతం: ఇళయరాజా )

శుభలేఖ  రాసుకున్నా ఎదలో  ఎపుడో
అది నీకు  పంపుకున్న  అపుడే  కలలో
పుష్యమి పువ్వుల పూజ  చేస్తా బుగ్గన  చుక్కలతో
ఒత్తిడి  వలపుల  గంధమిస్తా పక్కలలో

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే  ఎపుడో
శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో
శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎప్పుడో

చరణం: 1
చైత్రమాసమొచ్చెనేమో  చిత్రమైన  ప్రేమకి
కోయిలమ్మ  కూసెనేమో  గొంతునిచ్చి  కొమ్మకి
మత్తుగాలి  వీచెనేమో  మాయదారి  చూపుకి
మల్లెమబ్బు  లాడెనేమో  బాలనీలవేణికి
మెచ్చి  మెచ్చి  చూడసాగే  గుచ్చే  కన్నులు
గుచ్చి  గుచ్చి  కౌగిలించే  నచ్చే  వన్నెలు
అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
తొలిముద్దు జాబు రాశా  చెలికే  ఎప్పుడో
పుష్యమి  పువ్వుల  పూజ  చేస్తా  బుగ్గన  చుక్కలతో
ఒత్తిడి వలపుల  గంధమిస్తా పక్కలలో

శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో
శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో

చరణం: 2
హంసలేఖ  పంపలేక  హింస  పడ్డ  ప్రేమకి
ప్రేమలేఖ  రాసుకున్నా  పెదవి  రాని  మాటతో
రాధలాగ  మూగబోయా  పొన్న చెట్టు నీడలో
వేసవల్లె  వేచివున్నా  వేణుపూల  తోటలో
వాలుచూపు  మోసుకొచ్చే  ఎన్నో  వార్తలు
ఒళ్ళో  దాటి  వెళ్ళ  సాగే ఎన్నో  వాంఛలు
అంతేలే,  కథ  అంతేలే,  అదంతేలే

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
అది  మీకు  పంపుకున్న  అపుడే  కలలో
శారద  మల్లెల  పూలజల్లే  వెన్నెల  నవ్వులలో
శ్రావణ  సంద్యను  రంగరిస్తా  కన్నులతో

శుభలేఖ  రాసుకున్నా  ఎదలో  ఎపుడో
శుభలేఖ  అందుకున్నా  కలయో  నిజమో



ఒక చూపుకే పడిపోయా పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: విజయ్ ప్రకాష్, బిందు మహిమ 


ఒక చూపుకే పడిపోయా 



నెల్లూరే పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: జస్ప్రీత్ జస్జ్, సుచిత్ర 


నెల్లూరే



హే నాయక్ పాట సాహిత్యం

 
చిత్రం: నాయక్ (2012)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శ్రేయ ఘోషల్, నవీన్ మాధవ్ 


హే నాయక్

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default