Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangaru Bullodu (2021)
చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
నటీనటులు: అల్లరి నరేష్ , పూజా జెవేరి
దర్శకత్వం: పి. వి. గిరి
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 23.01.2021Songs List:స్వాతిలో ముత్యమంత పాట సాహిత్యం

 

చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: వేటూరి
గానం: ఎల్.వి.రేవంత్, నాధప్రియ

(ఈ పాట నందమూరి బాలకృష్ణ , రవీనా టాండన్ కలిసి నటించిన బంగారు బుల్లోడు (1993) చిత్రంలోనిది. ఈ సినిమాకు దర్శకత్వం రవిరాజా పినిశెట్టి, నిర్మాత వి. బి.రాజేంద్ర ప్రసాద్, సంగీతం రాజ్-కోటి, పాడినవారు బాలు, చిత్ర)

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల...

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

కనక మహాలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: దత్తు, M.L. గాయత్రి

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు
నేను నీకు గాగుల్సు నువు నాకు బ్యాంగిల్స్
మన ఇద్దరి జోడికి షాక్ అయిపోతారే
కపుల్పు కపుల్పు కపుల్సు
ఆకాశం తాకేలా విజిల్సు
చలో రయ్ రయ్ రయ్ రయ్ వచ్చింది లైసెన్సు
ఒకటైపోయేలా చిక్కింది చాన్సు
తక తై... తై... ... తై... గాల్లో తేలే డ్రీమ్సు
ఇక చూసుకో నీలో నాలో హ్యాపీ ఫీలింగ్సు

ఓయ్ కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో ఆటాచ్మీ
కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
రోజు రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు

అట్టా ఎట్లా పుడితివే బబ్లీ బార్బీ బొమ్మలా
సెటిలైపోతివే దిల్ మొబైల్ సిమ్ములా
చెప్పమంటే కష్టమే నా అందాల ఫార్ములా
చెయ్యి పట్టి ఏలుకో 2 ఇన్ 1 స్కీములా
లెఫ్ట్ రైట్ తళ తళ ఫ్రంట్ బ్యాక్ గళ గళ
అయ్యబాబోయ్ ఏ యాంగిల్ లో నిన్నే చూడాలే
ఆశ పడ్డ కొంటె కల అంత దూరమెందుకలా
గుండెపై నెక్కలేసులా పెట్టేసుకుంటాలే

ఓయ్ కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
లైఫ్ అంతా నీతో ఉంటా నీ అందంతో ఆటామ్మో
కనక మహాలక్ష్మి బొడ్డు కనక మహాలక్ష్మి
రోజు రోజా ఇస్తా నీకు రొమాన్స్ గట్రా టీచ్ మీ

నేనేమో పటాసు నువ్వేమో మాచిసు
నువు నేను జంటైతే బ్రేక్ అయిపోతాది
సైలెన్సు సైలెన్సు సైలెన్సు
భూగోళం తప్పుదే బ్యాలన్సు
యానాం పంతులు గారు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (2021)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాకేత్

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు

నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు

కృష్ణమాయే నీకు నాకు ఇలా 
వేసినాదే పూల సంకెలా
దక్కినావే కన్నె రాధాల 
నా మనసే విన్నట్టే

తేలిపోయా నింగి తారల 
పేలిపోయా గాలి బూరల
ఇంత హాయా 
కుందనాల బొమ్మలాగా నాతో నువ్వుంటే

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు

ఒక్కటంటే ఒక్క జీవితం 
నువ్వు పక్కనుంటే ఎంత అద్భుతం
నువ్వుగా వందేళ్ల పండుగైనా
గుండె నిండెనే స్వర్గాల అమృతం
బుజ్జి గుండె తెల్ల కాగితం 
దానిపైన నువ్వు ప్రేమ సంతకం

నవ్వులే గులాబీ పువ్వులై 
నీ కాలి బాటకు వరాల స్వాగతం
సీతాకోక నువ్వుగా నీపై చుక్క నేనుగా
చుక్కలదాకా సాగనే నాలో సంబరం
అందమైన మత్తు మందులా 
లక్షకోట్ల లంకె బిందెలా 
చేరినావే ప్రేమ లేఖలా
నా రంగుల రసగుల్లా...

యానాం పంతులు గారు ఎప్పుడో చెప్పేసారు
నాకై పుట్టిన పారు నువ్వే బంగారు
నీ నా ఇంటి పేరు ఎప్పుడో కలిపేసారు
ఇకపై మిగిలిందొకటే దండల తారుమారు


No comments

Most Recent

Default