-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vinod Kumar"



చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సహాయ సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్, మీనా (తొలి పరిచయం)
దర్శకత్వం: కె. ఆదిత్య
నిర్మాత: ఎం. నాగేశ్వర రావు
విడుదల తేది: 05.10.199



Songs List:



యువతరం శివమెత్తితే పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

యువతరం శివమెత్తితే



జిన్ని తారా జిన్ని పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: అదృష్ట దీపక్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

జిన్ని తారా జిన్ని



చూస్కో చూస్కో పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: గుండవరపు సుబ్బారావు
గానం: వందేమాతరం శ్రీనివాస్

చూస్కో చూస్కో



నల్లకోటు బావా పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: కె. అప్పలాచారి
గానం: ఎస్. జానకి, వందేమాతరం శ్రీనివాస్

నల్లకోటు బావా



ఏవిటో తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: నవయుగం (1990)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: నార్ల చిరంజీవి
గానం: వందేమాతరం శ్రీనివాస్

ఏవిటో తల్లి

Palli Balakrishna Wednesday, April 29, 2026



చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సుహాసిని, వినోద్ కుమార్, రవీనా టాండన్
దర్శకత్వం: శరత్
నిర్మాత: బి.బుల్లి సుబ్బారావు
విడుదల తేది: 14.08.1993



Songs List:



అబ్బరే జబ్బరే కొబ్బరే పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
అబ్బరే జబ్బరే కొబ్బరే 
అందని యబ్బ నీ లబ్బరే 
అబ్బిగో సుబ్బిగో నిబ్బరే 
ఆపరో యబ్బ నీ అల్లరే 

జివ్వుమన్న ఎర్ర బుగ్గ సిగ్గులంటుంటే 
యవ్వనాలే ఆగలేక భగ్గు మంటుంటే 
ఏటిలో లోగిలో పైగిలో కౌగిలై

చరణం: 1
రెమ్మలో పూవుకై తుమ్మెద తొందర 
తుమ్మెద రాకడ తెనేకే తీపిరా 
గులాబీ సెంట్ మొగ్గల్లో జిలేబి నందుకుంటాలే 
మజాల మల్లె పంటల్లో భజాన దోచి పెడతాలే 
అందమో చందమో చిందర వందరే 

చరణం: 2
ఆశ ముదిరైనచో ఆడదే ఊపిరి 
ఐనను ఆగునా జాజుల జాతరే 
తగాదాలాడుకుంటూనే సగాల విందు చేసేస్తా 
సరేలే సందెవేళల్లో వసంతాలాడి చూపిస్తా
వలదురో వద్దురో ముట్టుకోవద్దని 




మేఘమా ప్రియ స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం
చదివింది ఈడు చెలి దండకం
తెలిసింది నేడే చలి నాటకం
ఆషాడ మాసాలజల్లు
గుండెల్లో గుచ్చింది ముల్లు రానీ మామూలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం

తడి చీర కొంగు తాళాలన్ని
కోడిగట్టిపోనీ తాపాలైతే
ముడి జారి పోనీ కొణాలన్ని
మురిపాల పూల బాణాలైతే
వానొస్తే ఎం నేనోచ్చాగా వాటేసుకో
ఎంతిస్తున్న కొంతెకాదా ఈ జోరులో
వానలో జడివానలో
జాణవో చలి వీణవో
శృంగారం ముగ్గేసుకున్న
వయ్యారి గొబ్బిల్లకొచ్చే నీతో తంటాలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం

బుడమేటి పొంగు బుగ్గంటిన
బులిపించకుండా బుద్దాగునా
ఎండమ్మ కళ్లు చల్లారినా
యదలోని పొంగే వేడాగునా
ఎరుచ్చిందో ఎమొచ్చిందో ఈ ఈడులో
ముద్దోచ్చింది ముంచెత్తింది నీ తోడులో
పై యెద అటు పై యెద
చూపుకే శ్రుతి మించదా
కార్తిక కౌగిళ్ళు దాటి
వైశాక వేవిళ్ళు కొచ్చే నీలో అందాలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం
చదివింది ఈడు చెలి దండకం
తెలిసింది నేడే చలి నాటకం
ఆషాడ మాసాలజల్లు
గుండెల్లో గుచ్చింది ముల్లు రానీ మామూలు

మేఘమా ప్రియ స్వాగతం
ముడి వేసిపో వడి బంధనం
వర్షమా అభివందనం
ఇక చల్లిపో తడి చందనం




నర్మదా నది తీరంలో పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట

ఎగుడు దిగుడు ఎదలోనా
మొగలి పొదలు రగిలేనే
పగలే మసక పడుతుంటే
పెదవి పెదవినడిగేనే

పూయకే మల్లెలా మాయలో, మత్తులా
చేయకు చిట్టిల అందని ఎత్తులా
సొంపుకో సొగసును చూపి
దింపకే దిగులు సఖీ
చెంపకో చెఱుకుల ముద్దు
పంపరా పనస రుచి
ప్రేమలో ఏదేటూ ఏదిటో, ఓఓ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో
సుఖ వీణలో చలిగంట

చిలిపి చిలిపి కలలెన్నో
నెమలి కనులు నెమరేసే
వదులు వదులు వలదంటే
చిగురు వలపు ముదరేసే

పాడకే కోకిలా… ఈడులో కోడిలా
ఆడితే శోకిలా… వేడిలో వెన్నెలా
సందెకో చలిరుతువొచ్చి
అందమే వణికెనురో
పొద్దుకే పొడుపులు వచ్చి
నిద్దరే చిరిగెనులే
ప్రేమలో ఏమిటో ఏదిటో, ఓ హొ

నర్మదా నది తీరంలో
నవమన్మధా అనుకుంట
గౌతమీ నది తీరంలో
సుఖవీణలో చలిగంట

కన్నులా గీటుకో… గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో… ఊపులో, ఓ ఓ



సీతమ్మ చిలికింధి పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

సీతమ్మ చిలికింధి



టప్పు టప్పు టప్పంగుత్తి పాట సాహిత్యం

 
చిత్రం : రథసారధి (1993)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్.పి. బాలు

టప్పు టప్పు  టప్పంగుత్తి

Palli Balakrishna Tuesday, April 28, 2026



చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: సీనారే , వేటూరి, జొన్నవిత్తుల 
నటీనటులు: నాగేశ్వరరావు, వినోద్ కుమార్, కస్తూరి, వాణి విశ్వనాథ్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: ప్రత్యూష
విడుదల తేది: 01.01.1995



Songs List:



నీతి శాస్త్రమా పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: యస్.పి.బాలు

నీతి శాస్త్రమా 



ఎదటున్నవాడే మా పెళ్ళికొడుకు పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఎదటున్నవాడే మా పెళ్ళికొడుకు 



కిరాతకుడు వాడే పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: యస్.పి.బాలు

కిరాతకుడు వాడే 




చిటపట చినుకుల పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

చిటపట చినుకుల 




వళ్ళంత పూలజల్లు పాట సాహిత్యం

 
చిత్రం: గాడ్ ఫాదర్ (1995)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

వళ్ళంత పూలజల్లు 

Palli Balakrishna Sunday, August 29, 2021



చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారద
దర్శకత్వం: కె.సదాశివరవు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.10.1996s



Songs List:



మాఘమాసం పాట సాహిత్యం

 
చిత్రం: తాత మనవడు (1996)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: జలదంకి సుధాకర్ 
గానం: యస్. పి. బాలు, కవితా కృష్ణమూర్తి 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 
కలలే చాలిక లేమ్మంటూ 
తనువే మనసుని లేపింది 
మనసే నిద్దర మేలుకొని 
కరగని కలలను చూసింది 
ఈ మాయ మహిమేమిటో 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

విరబూసే ప్రతి మల్లితీగని బ్రతిమలాడుకున్నా 
నువ్వీదారిలో మెత్తగా పూలు పరువాలని 
నను తాకే ప్రతి పిల్లగాలిలో 
పిలుపు పోల్చుకున్నా 
నీ గుండెలో పలికిన భావ గీతాలని 
హారతిగ ఇవ్వనా నా ఆశని 
బహుమతిగ పొందనా అందాలని 
పరువాలన్నీ వలువాలల్ని అందించే సమయమిది 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

ప్రతి పూట పదహారేళ్ళపాటుగ పెంచుకున్న పరువం 
కానుకే ఇచ్చుకో కాముడే సాక్షిగా 
పుడుతూనే ముడేశారు పెద్దలు తెంచలేని బందం 
వెచ్చగా పుచ్చుకో నోములే పండగా 
మబ్బులను దాటని ఈ మాటని 
చుక్కలకు తాకని  శుభవార్తని 
తెగ సందడిగా కనువిందులుగా 
కళ్యాణం జరుగునని 

మాఘమాసం ముహూర్తం చూసుకుంది 
పెళ్లి మేళం తదాస్తూ పాడుతుంది 

Palli Balakrishna Friday, March 1, 2019



చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
నటీనటులు: వినోద్ కుమార్ , రోజా
దర్శకత్వం: ఇ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 03.09.1992



Songs List:



మేఘమా మరువకే పాట సాహిత్యం

 
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర

మేఘమా మరువకే 
మోహమా విడువకే

మాఘమాస వేళలో మల్లె పూల మాలగ 
మరుని గూడి మెల్లగా మరలి రావె చల్లగా 
మదిలో మెదిలే మధువై 

మేఘమా మరువకే 
మోహమా విడువకే

నిదుర కాచిన కన్నె పానుపే రా రా  రమ్మంటుంటే
కురులు విప్పిన అగరువత్తులే అలకలు సాగిస్తుంటే
సిగ్గే ఎరుగని రెయిలో తొలి హాయిలో అలివేణి
రవికే తెలియని అందము అందించనా నెరజానా
కలలా అలలా మెరిసి

మేఘమా మరువకే
మోహమా విడువకే

గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందడిలోన
తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామా
మరుగే ఎరుగని కోనలో ఆ మోజులు మహారాజా
నలిగే మల్లెగా సవ్వడి వినిపించనా నెరజానా
జతగా జరిగే అలుసీ

మేఘమా మరువకే
ఆమోహమా విడువకే




మత్తుగా గమ్మత్తుగా పాట సాహిత్యం

 
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర

నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన 

ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పసిడి పైట పాన్పు చేయనా
పడుచు తనపు పొగరు చూపనా

ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా

నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం  దిరినా  దిరినా
నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం  దిరినా  దిరినా
త్రిల్లాన దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన 
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన 

లే వయసా తెలుసా తొలిపరువపు పిటపిటలు
నా ఎదలో మెదిలే తొలి ముద్దుల కిటకిటలు
ఓ మనసా వినవే చిరు పెదవుల గుసగుసలు
లాలనగా తడిమే చిరు స్వాసల సరిగమలు
పుట్టిందమ్మా ఈడు ఆ ఆ ఆ...
కోరిందయ్యో తోడు ఆ ఆ ఆ...
తపించి తపించి తరించనా నీలో నేనూ
జపించి జపించి జయించనా నిన్నే నేనూ
తాకాలి ఒళ్ళు ఒళ్ళు కురవాలి ప్రేమ జల్లు గుండెల్లో

ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా

తాంకు జంతై కిటతక జకుతై తాంకు జంతై (2)

ఈ రగిలే సెగలు తొలి వలపుల రిమరిమలే
నీ ఒడిలో పొదిగే అలుపెరుగని విరహములే
ఓ సుఖమే కలిగే కుడిఎడమల నడుమలలో
యవ్వనమే కరిగే తడి తమకపు గడబిడలో
పట్టిందయ్యో పిచ్చి ఆ ఆ ఆ...
గిట్టేంచెయనా వచ్చి ఆ ఆ ఆ...
నిషాలు రసాలు పుట్టించుకో మళ్ళి మళ్ళీ
నషాల నిషాలు రెట్టించుకో తుళ్ళి తుళ్ళి
కూసింది కన్నె కోడి కుదిరింది మంచి జోడి వారేవా

ఆ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పడుచు తనపు పొగరు చూపనా
పసిడి పైట పాన్పు చేయనా
ఓ...మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా




పసివాడో ఏమిటో ఆ పైవాడు పాట సాహిత్యం

 
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి బాలు

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

తాళెరుగని తల్లోక్కరు
తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక
సతులుండి పతి కాలేక
తన తలరాతకు తలవంచి 
శిలలాగే బ్రతికే దొకరు

బంధాలే సంకెళ్లు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగా మారగా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చేజేతులా ఏ ఒక్కరు 
ఏ నేరము చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు
ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు 
ఐనా అంతా పగవారు

ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ...





నా మొగుడే బ్రహ్మచారి పాట సాహిత్యం

 
చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్, పి. సుశీల, యస్. పి. శైలజ

యాహూ... 
రంగమ్మత్తా, అనుసూయక్క
సీతమ్మొదినా, చెల్లాయమ్మా 
ఇది విన్నారా
ఏమిటే
కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కి పెళ్ళికాలేదు
అలాగా ఐతే మా మనవరాల్నిచ్చి చేస్తాను
మనవరాలికిచ్చి చేస్తావా 
పోనీ నువ్వే చేసుకోకూడదు
మా ముసలోడొప్పుకోడెమోనే
సిగ్గులేకపోతే సరి 
వాడు నా మొగుడూ

నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది 
ముదురు బెండకాయ చూసి మూడొచ్చింది

నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి

సోదెమ్మా సోదెమ్మా 
ఎలా ఉంది మా జంట
జంట అది ఇప్పపూల పంట
ఐతే మా పెళ్ళేప్పుడంటా
చెబుతాను చెబుతాను 
కంచి కామాక్షి మధుర మీనాక్షి 
బెజవాడ కనకదుర్గ మీన ఆన
ఇనుకోయే కూనా 
నీ పక్కనున్న పోటుగాడే 
నిన్ను ఎదుక్కుంటా వచ్చిన ఏటగాడు
ఈడే నీ మెడ్లో తాళి కడతడు
నీ ఒళ్ళో తల పెడతడు
నీ ఊపుకు పగ్గమేస్తడు
ఉయ్యాలకి పాపనిస్తడు
ఇది ఎరుకల సాని మాట

యాహూ...

ఒడ్డు చుస్తే పొడుగు నాకు తెలిసివచ్చింది
బొడ్డు కింద చీరకట్టు అలిసిపోయింది
వాడి చూపు కన్నే వయసు పోపు పెట్టింది
రేపునైనా చేయ్యమంటూ రెచ్చగొట్టింది
ఉలకడు అసలే పలకడు
ఉలకడు అసలే పలకడు
రవికుల తిలకుడు రవికే అడగడు

నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి

చారి గారు పూజారి గారు 
మేము చేసేసు కుంటున్నాము
ఏమిటి
లవ్వు
అవ్వా నువ్వా లవ్వా
అవునోయ్ చెవిలో పువ్వా
పెట్టుమరి పెళ్లి ముహూర్తం
పెడతా పెడతా చూసి మరీ పెడతా
స్వస్తి శ్రీ ప్రజాపతి నామ
ప్రజాపతి హలోపతి హోమియోపతి ఏమిటీ సుత్తి 
ముందు ఈ పతి సంగతి చెప్పు
వస్తున్నా వస్తున్నా 
వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశి నాటి రాత్రి 
తొమ్మిది ఘడియల పంతొమ్మిదివిఘడియలకు
ఘడియా ఐతే వేసేసు కుంటాం
వేసికుందురు గాని వేసికుందురు గాని
వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది
ముహూర్తమా ములక్కాయ హ హ హ...

ముహుర్తాలు చూసుకోవు ముద్దు ముచ్చట్లు
మూడు ముళ్ళు కోరుకోవు మూతి చప్పట్లు
అందమంతా అగ్గిమంట రాజుకుంటుంటే
లగ్గమంటూ ఆపమాకు లవ్వు మీదుంటే
జడవను అసలే విడువను
జడవను అసలే విడువను
పెళ్ళికి ముందే తొలిరేయంటా

నా మొగుడే బ్రహ్మచారి 
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి




ఆ పాపి కొండల్లో పాట సాహిత్యం

 
చిత్రం: సీతారత్నంగారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు

తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి
తడిగా పొడితడిగా తమకాన దాగితే
తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు
తడిగా మడితడిగా తొలి హద్దు దాటితే
తెరిచేయనా ఆ తెరచాపని
విడదీయని ఓ విడిధీయనా
తపనలే తగలనీ లాయి లాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు

కొరికే కోరికలే కరిచే కౌగిలిలో
ఎదతో పై ఎదతో సయ్యాటలాడితే
కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై
కదిపి నిను కుదిపి కేరింతలాడితే
కవ్వించనా కొంగు కొసరించనా
ఊరించకే ఊయలూగించకే
మనువులే కుదరనీ వెన్నెలమ్మ లాయి లాయి లో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

Palli Balakrishna Thursday, July 27, 2017



చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: వినోద్ కుమార్, ఐశ్వర్య, దాసరి నారాయణరావు
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: ఏ. మోహన్, సి.ఎమ్.కృష్ణ
విడుదల తేది: 30.08.1991



Songs List:



దండాలు పెట్టాము దుర్గమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి.బాలు

దండాలు పెట్టాము దుర్గమ్మ 



ఈ రాతిరి శివరాతిరి పాట సాహిత్యం

 
చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: డి.నారాయణ వర్మ
గానం: మంజుల

ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా
ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా
దీపము తీసి రాతిరినాపి
పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా

ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా

ఆకలి కాదు తోచగ రాదు
మరి లోలో ఎదో బాధ అదేమో
చూపుల కోన కాపురమేల
ఇక చేసేదేమి లేదా అదేదో
ఆలన పాలన ఏమిలేదాయే
మోహము తాపము ఆటు పోటాయే
తోటలో రాజుగా పాగా వేయాలి
శోభన కార్యము నేడే కావాలి
రారా చాటు మాటు ఏలా నా ఒడి నీదేరా
రాజా గాలి నీరు తోడు ఈ గుడి నీకేరా

ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా

ఊర్వశి గాను మేనక గాను
నిను ఏమో మాయచేయ పనేది
ఆలిని నేను అయినా గాని
నిరజాన గానా గానాభజాన
నాట్యము చేయన నాథ నీకోసం
కామిని కోహిని కాదా దాసోహం
నా బిగి తాకగా కాదా బేజారు
నా ఎదా ఏలరా నీకే జోహారు
రారా ఏతా వాత ఎద లోతులు చూడాలి
రాజా ఖాన పీనా సోనా దోపిడి చేయాలి

ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా
హాయ్ ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా
దీపము తీసి రాతిరినాపి
పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా



ఈ యాలె అచ్చమైన దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి.బాలు, స్వర్ణలత 

ఈ యాలె అచ్చమైన దీపావళి 




కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ పాట సాహిత్యం

 
చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. పి.బాలు, మంజుల

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ
బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా
హద్దే దాటేయమంది కన్నె బెట్టు
ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు
గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు
పెట్టె మంచాన చేరి గోలపెట్టు
నాయనమామా.... ఓ ఓ ఓ

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ
గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా

కన్నె చొక్క జున్ను ముక్క కన్నుకొట్టెరో
దాని వెన్నదోచి వెన్నుతట్టరో...
ముద్దబంతి ముద్దులన్ని మూటగట్టరో
వాలే పోద్దికింక ఆట కట్టరో...
కిర్రెక్కినా కుర్రీడునే జుర్రేసుకో...
మంచాలలో లంచాలనే పంచేసుకో
ఒంటి సోకున్నది - హొయ్ హొయ్
కొంటి షాకున్నది  - హ హ
ముద్దులందుతుంటే నిద్దరుండదంట
ఇంక చుక్క పొద్దు ఒక్కపొద్దులొద్దురో...

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - యబ్బా
బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా - హ అబ్బా

ముక్కుపచ్చ లారకున్న ముద్దబంతిరో
నిన్ను ముక్కుతాడు వేయమందిరో
ఆరుబయట అందమంత ఆరబెట్టెరో
ముద్దు బారసాల చేయమందిరో...
పండుందిరో దిండుందిరో పండించరో
చుక్కుందిరో చక్కందిరో చిక్కిందిరో
పాడు ఈడుందిరో - హై హై
గోడు చూడందిరో -  హై హై
మంచి మాట ఉంది మంచెమాటు ఉంది
కంచెదాటుతున్న వాటముంది పదరో...

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ
బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా
హద్దే దాటేయమంది కన్నె బెట్టు
ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు
గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు
పెట్టె మంచాన చేరి గోలపెట్టు
నాయనమామా.... ఓ ఓ ఓ

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - అబ్బా
గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా - దెబ్బ




శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే పాట సాహిత్యం

 
చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేదవ్యాస్
గానం: చిత్ర, యస్.పి.బాలు

ఓ ఓ ఓ ఓ ఆ ఆ

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే
ఏ వంక లేనోడే
ఏ మచ్చలేని జాబిల్లి మల్లె
ఎన్నెల్లు చల్లాడే

నింగి ఒంగింది నెల పొంగింది
ఊహ ఊగింది ఉయ్యాలో
పేద రాగంలో మారు మోగింది
పెళ్లి సన్నాయి అమ్మమ్మో

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే
ఏ వంక లేనోడే
ఏ మచ్చలేని జాబిల్లి మల్లె
ఎన్నెల్లు చల్లాడే

ఊరుపేరు లేని నన్ను
గుండెల్లో దాచుకున్నవే
ఏరికోరి నిన్నే యేరు
వాగల్లె చేరుకున్నానే

తానుగా మెచ్చెనే
తావిలేని పువ్వుని
పూలకే తావిలే
చిన్ని నీ నవ్వే

ఏ జన్మలోనో ఏనాడో
ఏ పూజలే చేశానో
పుణ్యాలు పండే ఈనాడు
ఈ దేవుడే నావాడు

ఏనాడూ నీవు నాలోనే
నేను నీలోనే అమ్మమ్మో

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే
ఏ వంక లేనోడే
ఏ మచ్చలేని జాబిల్లి మల్లె
ఎన్నెల్లు చల్లాడే

నింగి ఒంగింది నెల పొంగింది
ఊహ ఊగింది ఉయ్యాలో
పేద రాగంలో మారు మోగింది
పెళ్లి సన్నాయి అమ్మమ్మో

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే
ఏ వంక లేనోడే
ఏ మచ్చలేని జాబిల్లి మల్లె
ఎన్నెల్లు చల్లాడే

తోడునీడలోని ముద్దు ముచ్చట్లు
ఇంత వింతయే
ఎన్ని జన్మలైనా వీడిపోలేని
బంధం ఇంతేలే

పల్లవి నీవయి కోయిలమ్మ పాటలో
నిత్యమూ ఆమనే నిండు నీ ఒడిలో

మా వాడకొచ్చీ మావాడై
మా మంచినే కోరారే
చుక్కల్లే మీరే నా తోడై
నా పక్కనే చేరారే

చక్కన్ని చుక్క నీవేలే
వేల చుక్కల్లో అమ్మమ్మో

శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే
ఏ వంక లేనోడే
ఏ మచ్చలేని జాబిల్లి మల్లె
ఎన్నెల్లు చల్లాడే

నింగి ఒంగింది నెల పొంగింది
ఊహ ఊగింది ఉయ్యాలో
పేద రాగంలో మారు మోగింది
పెళ్లి సన్నాయి అమ్మమ్మో

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default