Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Kamalakara Kameswara Rao"
Shakuntala (1966)



చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సహాయకులు: జె.వి.రాఘవులు
సాహిత్యం: సముద్రాల, శ్రీ శ్రీ , సినారె, దాశరధి, కొసరాజు, ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి.సుశీల , పి. లీల , వైదేహి, మాధవపెద్ది రమేష్, పిఠాపురం, రాఘవులు
నటీనటులు: యన్.టి.రామారావు , బి.సరోజ దేవి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: లక్ష్మిరాజ్యం , శ్రీధర్ రావు 
విడుదల తేది: 03.03.1966



Songs List:



కనరా మణిశేఖర పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల 

కనరా మణిశేఖర



సదాశివా ( శ్లోకం) పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: DEVOTIONAL
గానం: ఘంటసాల

సదాశివా  ( శ్లోకం)



మధుర మధుర సుమసీమ పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
హాయ్ హాయ్ నీ నిగనిగ చెలువాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
నీ నిగనిగ చెలువాలు
కన్నియ చిరునవ్వు, కమ్మని నునుసిగ్గు
ఎన్నటికైనా వాడని సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
హాయ్ హాయ్ తొలివలపుల మంత్రాలు
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
తొలివలపుల మంత్రాలు
పువ్వుల కళ్యాణం నవ్వుల వైభోగం
ముచ్చటలన్ని తీరే సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ




అనార్గ్రాతాం పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కాళిదాస్ 
గానం: ఘంటసాల

అనార్గ్రాతాం




మదిలో మౌనంగా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల

మదిలో మౌనంగా 




నిర్ధయా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల, ఘంటసాల 

నిర్ధయా




చల్లని పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కందుకూరి వీరేశలింగం
గానం: ఘంటసాల

చల్లని 



తరతమా బేధము పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: ఘంటసాల

తరతమా బేధము



నీవు నేను కలిసిన నాడే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే
నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే

అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో
నీలో సాగే అనురాగాలే నీలో సాగే అనురాగాలే
వేణువులూదెను నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే జీవనరాగం తెలిసెనులే

నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
నీలో విరిసే దరహాసాలే పాలవెల్లులై పొంగెను నాలో
జగమును దాటి గగనము మీటి
జగమును దాటి గగనము మీటి
ఎగిసెను ఊహలు నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే





సరసన నీవుంటే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి.సుశీల 

సరసన నీవుంటే జాబిలి నాకేల అహ
సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు ఆ ఉం
నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు
తారలలోని తరుణిమ నీవై
తారలలోని తరుణిమ నీవై
నన్నే మురిపింతువే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
కౌగిలిలోన ఊగిన వేళ
కౌగిలిలోన ఊగిన వేళ
కాలమే ఆగిందిలే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల




యస్యేస్తజ్యే పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కాళిదాస్ 
గానం: ఘంటసాల

యస్యేస్తజ్యే



గురు జనముల పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: ఘంటసాల

గురు జనముల 




చెంగావి కట్టిన పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల

చెంగావి కట్టిన 



అమ్మా చకుంతుల పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి.లీల 

అమ్మా చకుంతుల



పాతకాలం నాటి పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం, రాఘవులు

పాతకాలం నాటి 




నాకంటి పాపవైనా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల 

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర

నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నీయందు నిండి నా కలలు పండి
యువరాజువవుదులేరా
రారా సుకుమార ఒహో వీర

హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
లోకాలనేలి భోగాల తేలి
చిరకీర్తినందుకోర
రారా సుకుమార ఒహో వీర

ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
సురవరుల నరుల జేజేలనంది
వర్ధిల్లు భరతవీర
రారా సుకుమార ఒహో వీర

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
రారా ఓ వీర




అమ్మా శరణమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: శకుంతల (1966)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల సినియర్
గానం: పి.సుశీల

అమ్మా శరణమ్మా

Palli Balakrishna Tuesday, July 19, 2022
Shri Vinayaka Vijayamu (1979)



చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, వీటూరి, కొసరాజు
నటీనటులు: కృష్ణంరాజు, రామకృష్ణ, వాణిశ్రీ, ప్రభ
మాటలు, పద్యాలూ, శ్లోకాలు: వీటూరి 
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి
విడుదల తేది: 22.12.1979



Songs List:



జగన్మాత శ్లోక పాట సాహిత్యం

 
శ్లోకం 1

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి.వి. రంగాచార్యులు
గానం: శైలజ 

-; జగన్మాత శ్లోకం :-

వందేలోక హితం కరీమ్ శుభకరీమ్
శర్వార సంపత్కరీమ్
వందే శ్రీ భువనైక పాలన ప్రభామ్
వందే జగన్మాతరమ్




విఘ్నేశ్వర స్తుతి పాట సాహిత్యం

 
శ్లోకం 2

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి.వి. రంగాచార్యులు
గానం: సాలూరి రాజేశ్వరరావు 

-: విఘ్నేశ్వర స్తుతి :-

సర్వ విఘ్న హరమ్ దేవమ్ 
పార్వతీ ప్రియనందనమ్ సర్వసిద్ధి ప్రదాతారమ్ 
వందేశ్రీ గణనాయకమ్ వందే శ్రీ గణనాయకమ్!




నమో నమో తాండవకేళీలోలా పాట సాహిత్యం

 
శ్లోకం 3

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి 
గానం: యస్.పి.బాలు & కోరస్ 

“శివలీలలు-నారద దేవతల బృందనృత్యగానం”

ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ
సాకారరూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ 
హరాయ శుభకరాయ నమశ్శివాయ

నమో నమో తాండవకేళీలోలా
నమో నమో ఆశ్రితజనపాలా
దయాకిరణముల ప్రసరించే - మీ
చూపుల సుమధుర భావనలు
ఈ జగతికి చల్లని దీవెనలు

అలనాడు - అమృతమును ఆశించి
పాలకడలి మదియించగా
హాలాహలమే ప్రభవించీ - విష జ్వాలలే వెదజల్లగా
అభయమొసంగీ - గరళము మింగీ
జగములగాచిన జగదీశా పరమేశా

పృధివి రధముగా - రవి చంద్రులే చక్రాలుగా
నాల్గు వేదములె హయములుగా
బ్రహ్మ దేవుడే సారధిగా - మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రముకాగా
ప్రళయకాల పర్జన్య గర్జనగ- భీషణ శంఖము పూరించి
పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధియించి 
లోకాలను గాచిన దేవా మా
శోకము మాపిన మహానుభావా 





విలాసాల వేళ లాలించనీ పాట సాహిత్యం

 
పద్యం 4

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.జానకి 

-: ప్రియం వద పూజ పాట :-

అన్నిలోకాల నేలెడు కన్నతల్లి
కామితము లెల్ల దీర్చెడు - కల్పవల్లి
పూజలను గొని - దయగని భువన జనని
కావరావె - కల్యాణి - శంకరుని రాణి

శోకం :
ఓం... ఐం.... హ్రీం.... శ్రీం.... శ్రీ మాతాయైనమః
చిదగ్నికుండ సంభూతాయైనమః
హర విలాసి న్యైనమః
మనోరూపేక్ష కోదండాయెనమః
శ్రీ చక్రనగర సామ్రాజ్యేశ్వర్యైనమః
శ్రీ రాజ రాజేశ్వర్యైనమః

-:పాట:-

విలాసాల వేళ లాలించనీ
సరాగాలతో - మనోహర లీల
హృదయ వీణనే - ఇలా మేళ వించు - సదా
వలపు గుండెలో - మోహాలా పాన్పు వేయనీ
ఆరని - కోరికా హారతీ ఇవ్వనీ
పొందులోన నిందు సేయనీ
ఆడినీ - పాడనీ - రాజా !

నీ బిగి కౌగిట - పులకించనీ నీలోనన్నే లీనముకానీ
రాగలహరిలో రాసకేళిలో
సరసాలలో - అంచులే చూడనీ
ఆడనీ – పాడనీ - రాజా !




ఎవరవయా ఏ దివ్య భువినుండి పాట సాహిత్యం

 
పాట 5

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి.సుశీల 

[వినాయకుని జన్మము - పార్వతి పాట]

ఎవరవయా ఎవరవయా ఏ దివ్య భువినుండి దిగి
ఈ అమ్మ ఒడిలోన ఒదిగి - ఎవరవయా ఎవరవయా
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులోగాని
ఆ నవులు పలికేని ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలివేల్పువోయేమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో !

చిట్టిపొట్టి నడకలు - జిలిబిలి పలుకులు 
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో ఎన్నెన్ని వింతలో
ఎన్నెన్ని కోరికలు నిండినే కన్న
ఎన్నెన్నొ స్వప్నాలు పండి చిన్నారి ఈమూర్తివై నావో
ఈరేడు లోకాలు ఏలేవో




డూ - డూ - డూ - బసవన్నా పాట సాహిత్యం

 
పాట 6

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: రామకృష్ణ, రమోల & కోరస్

[గంగిరెద్దు వాళ్ళ నృత్యగానం]

-: శివస్తోత్రం :-

వచనం :
శుభోజ్జయం - శుభోజ్జయం
మహా ప్రభూ - గంగిరెద్దుల వాళ్ళం
భూలోక, భువర్లోక, స్వర్గలోక, మహాలోక
జనలోక, తపోలోక, సత్యలోకాలను
అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల పాతాళలోకాలు తిరిగి మా విద్యను ప్రదర్శించి
బహుమానాలు పొందాం - మీ ఖ్యాతి విని,
మీ దర్శనానికి వచ్చాం। మా విద్యను తిలకించాలి ప్రభూలు

-: పాట :-

డూ - డూ - డూ - బసవన్నా
భళిరా అందెల బసవన్నా
ఏడేడూ పదునాల్గు లోకముల
మెప్పించావు గదరన్నా 

ప్రభువుగారికి దణ్ణం పెట్టు - ప్రతాపమంతా చూపెట్టు 
గజ్జెలు ఘల్లనగంతులు వెయ్- వినోదాలతో వింతలు చెయ్
రత్న కంబళం కప్పిస్తారు. బంగారపు తొడు వేయిస్తారూ

విష్ణువు మోహిని రూపుతొ చేసిన నృత్యవిలాసం చూడండి
నటరాజుగ శివమూర్తి చేసినా నాట్య కౌశలం తిలకించండి
గంధర్వులె మా ఆట పాటలకు సిగ్గుతో తల వంచాలండీ
కర్మవశమున మేము వేషాలు వేశాము
దేశ దిమ్మరులమై యాచింప వచ్చాము

ధాటి గల్గినా ధర్మప్రభువులు ఓహో ఓహో
మాట తప్పనీ మహారాజులూ ఓహో ఓహో
అడిగిందానికి కాదనబోరు - ప్రాణమైనా ఇచ్చేస్తారూ !
పరమశివుని నిజగర్భంలో దాచుకున్న శివభకులు మీరూ

-: శివ స్తోత్రం :-

సాంబ సదా శివ - శంభో శంకర
పరమ దయాకర - భక్తవశంకర
నంది వాహనా- నాగభూషణా
ఫాలలోచనా - భయ విమోచనా
కాలకూట - విషకంఠాభరణా
చంద్ర చూడహే - గిరిజా రమణా

శ్రీకర శుభకర - త్రిపురాసురహర
సురగణ వందిత - మునిజన సన్నుత
ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ
శివ శివ శివ శివ - శత్రుభయంకర
హర హర హర హర వ్యాఘ్రాంబరధర
జయ జయ జయ జయ - జగదోద్దారా
ఓం నమశ్శివాయ । ఓం నమశ్శివాయ
ఆఁడపిండ బ్రహ్మాండమునంతా
నిండియున్న అఖిలాండేశ్వరా
దీనులగాచే దీన శరణ్యా
భ క్తులబ్రోచే పరమపావనా
మా మొర వినవా - రావా - రావా

శంభోశంకర సాంబసదా శివ
శంభోశంకర సాంబసదా శివ
హర హర హర హర శంభోశంకర
శంభోశంకర సాంబసదా శివ





బాలను లాలించరా గజననా పాట సాహిత్యం

 
పాట 7

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

[లాలస నృత్యగానం]

బాలను లాలించరాగజననా-మేలిమి నెరజాణరా
కళలను తెలిసిన రసికండవనుకొని ఏరికోరి చేరినాను
కదరా - కనరా - కొనరా
కన్నెలేడిరా - ఇది వన్నెలాడిరా
కనులు విప్పరా - మనసు చెప్పరా
లేత వయసులో తపము లేలరా
నీ మీద మరులాయె నన్నేలుకోరా.. ఈ లాలసను మన్నించి
అంతులేని వింతహాయి నిడరా
లేరా - రారా - ఔరా

పంతమాడితే - కేరింత లాడనా
నువు బిగువు చూపితే - నే తెగువ చేయనా
కౌగిలించకా కదలి పోనురా
నీ బెట్టు సడలింతు పట్టి వలపింతు
కాంత కోరితే - కరిగి పోవనీ
హొంతకారి - యింతదాక - భువిలో
దీవిలో కలడా చెలుడా




ఏది చల్లనా పాట సాహిత్యం

 
సాకీ 8

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, విజయలక్ష్మీ శర్మ

[శివపార్వతుల ప్రణయ నృత్యగానం]

మ్రోగిమ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణలతీగెలు
ఆగనేలా పరుగు సందడుల గలగలలు
ఆ మంచు మలలందు వాగులు
ఆవైపు ఆకాశ సౌధాని కెందుకో అడ్డుగా మేఘాల తెరలు
ఆ వెనుసాగునేమో ఆది దంపతుల
పార్వతీ పరమేశ్వరుల ప్రణయ లీలలు

-: పాట :-

పార్వతి : ఏది చల్లనా 
శివుడు : ఏది తియ్యనా 
పార్వతి : శిరసున ఆ జాబిల్లి మల్లి పువ్వా
శివుడు : అరవిరిసిన ఆ పెదవుల లేతనవ్వా
 
శివుడు : ఇటు చూడు గిరిరాజ నందినీ
ఈ పూలు పరచిన వేడినీ
పార్వతి : ఎవ్వారు పరచారో గాని ఎవరి పవ్వళింపులకో
శివుడు : ఏ సురవల్లీ సుమములో
ఏరి ఏరి ఈమేసు నొచ్చునని
పార్వతి : ఏ ప్రేయసీ ప్రియుల కోసమో !
శివుడు : చేరి చేరి - ఇలా, ఇలా ఒరగవచ్చునని




కోటి నదులందు మునిగిన మేటి ఫలము పాట సాహిత్యం

 
పద్వం 9

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: రమేష్ 

-: వినాయకుని పద్యం :-

కోటి నదులందు మునిగిన మేటి ఫలము
భూమి ముమ్మారు చుట్టిన పుణ్య ఫలము
కన్న తలిదండ్రులకు ప్రదక్షణము సేయ
కలుగుననుచు - వేదాలు తెలుపలేదే |





ఒక వంక వరినీల కబరీ భరమ్ము పాట సాహిత్యం

 
దండకం 10

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: శైలజ, రమేష్ 

[అర్ధనారీశ్వర స్తుతి]

ఒక వంక వరినీల కబరీ భరమ్ము
ఒక వంక ఘనజటా జూట భరితమ్ము
ఒక వంక మణి మయోజ్వల కుండలాలు
ఒక వంక భయద పన్నగ భూషణాలు
ఒక వంక కారుణ్య అవలోకనాలు
ఒక కంట విస్ఫులింగ గచ్చటాలు
ఒక వంక రమణీయ కాంచనాంబరము
ఒక వంక నిర్వికారము దిగంబరము

ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము
ఒక పదమ్మున ప్రళయ తాండవ విజృంభణము
విశ్వశ్రేయార్దకము సృష్టి పరమార్థమ్ము
శక్తి శివశక్తుల సంగమ స్వరూపమ్ము
సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము - అనశ్వరము
శుభకరము - అర్ధనారీశ్వరము



విశ్వరూప సందర్శనం పాట సాహిత్యం

 
స్తోత్రం 11

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: శైలజ, రమేష్ 

[విశ్వరూప సందర్శనం]

శ్రీమన్మహా దేవదేవా అమేయ ప్రభావా భవా
భవ్య కారుణ్య భావా శివా!
భవానీ ప్రియా చిన్మయానంద హృదయా అద్వయా
దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా! అవ్వయా
ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధారచక్రాన
విహరించి - సంరక్తితో సృష్టి గావించి పాలించవే
సూర్య చంద్రాగ్నులే - నీదు నేత్రాలుగా ।
నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా
భూమి నీ పాదపీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా
___జమే నీకు నీరాజనమ్ముగా

వాయువే వింజామరమ్ముగా - నభము భత్రమ్ముగా
పంచ భూతాలు సతతమ్ము సేవించగా
సప్తపాదోనిధుల్ – సుప్త శైలేంద్రముల్
సర్వలోకాలు - తీర్ధాలు నీ కుక్షిలో సదా
ప్రక్షి ప్తమై యుండవే
నిశ్వరూపా నమో వేద భువన ప్రదీపా
సంతతానంద కేళీకలాపా 
జగద్గిత కీర్తి లసత్ భూకవర్తీ 
సదానందమూర్తీ నమో దేవతా
చక్రవర్తీ
నను స్తే.... నను స్తే....నమః ...




కిల కిల నగవుల జలకము లాడగ పాట సాహిత్యం

 
పాట 12

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: వాణీ జయరాం

[వైశాలీ గంధర్వ కన్యల జలక్రీడలు]

కిల కిల నగవుల జలకము లాడగ
జలి బిలి పలుకుల సరసము లాడగ
మేను పొంగాలి - నెమ్మేను పొంగాలి

తేలి తేలి తూలిపోయి ఆటలాడాలీ సయ్యాట లాడాలి
ప్రేమలోనా - తొలి ప్రేమలోనా
దోరవయసు వాడే - నను కోరి చేరుతాడే
దొంగాటలూ - దోబూచులూ ఆడించునే

అందానికి ఋతురాజు చందానికి నెలరాజు
విందుల తన పొందులనన్నేలే
చెలికాడు నా మదిలో నెలకొన్న రతిరాజు

నిన్న రేయి కలలో ఆ వన్నెకాడు పొదలో
నన్నెంతగా - గిలిగింతల ఆలరించెనే
నా సొగసును మెచ్చాడే - బిగి కౌగిలి యిచ్చాడే
నే సిగ్గుతో వారించినా విడలేదే
ఆ స్వప్నమె పండాలి – సౌభాగ్యం నిండాలి





కండకావరమున కాంతల చెరబట్టి పాట సాహిత్యం

 
పద్యం 13

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.పి.బాలు 

-: యుద్ధభూమి వినాయకుని పద్యం :-

కండకావరమున కాంతల చెరబట్టి
ఏడ్పించి నందులకిది ఫలమ్ము
తాపసులను బట్టి తాళ్ళ తోడను గట్టి
ఈడ్పించి నందుల కిది ఫలమ్ము
సురయక్ష కిన్నర గరుడోరగాదుల
హింసించి నందుల కిది ఫలమ్ము
మాన నీయుల డాసి మతిభ్రష్టులను చేసి
ఇకిలించి నందుల కిది ఫలమ్ము 

ధరణి నీ వంటి విశ్వ విధ్వంసకులను
సర్వమును ఖర్వమును చేసి శాస్తి చేతు
తులువ ఇకనైన మా శక్తి తెలుసు కొమ్ము
పొమ్ము దిక్కున్నచోటుకి పొమ్ము.. పొమ్ము 




యుద్ధ భూమి మూషికుని పద్యం పాట సాహిత్యం

 
పద్యం 14

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: మాధవపెద్ది సత్యం

[యుద్ధ భూమి మూషికుని పద్యం]

ద్వేషము మీర కేశవుడు దివ్య సుదర్శనమెత్తి వచ్చినన్
రోషకషాయ నేత్రుడయి రుద్రుడు పాశుపతాగ్ని చిమ్మినన్
భీషణ సంగరాంగణ విభీషణుడాహవదుర్నిరీక్ష్యుడు
ఈ మూషిక చక్రవర్తినిల మోహర ముందున గెల్వ శక్యమే



పాహిమాం - పాహిమాం హే జగన్మాతా పాట సాహిత్యం

 
స్తోత్రం 15

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: యస్.జానకి 

[ప్రియంవద స్తోత్రం]

పాహిమాం - పాహిమాం హే జగన్మాతా
సౌభాగ్య నిర్ణేత - శ్రిత పారిజాతా
హ్రీంకార సుప్రీత - సురలోక వినుతా
శ్రీచక్ర పురనేత - శ్రీ మహాలలితా

పసుపుకుంకుమలేని - పడతి బ్రతుకేలా
చరణంటి నీ దివ్య చరణాల మ్రోలా
దయతోడ పతిభిక్ష దయసేయవమ్మా
కాంతునీ ప్రాణాలు కాపాడవమ్మా 
నిరతమ్ము నీపూజనే చేసితేనీ
సతతమ్ము నీ పేరే స్మరియించి తేనీ
భక్తజన వరదవను బిరుదు నిజమేనే
జగములను శాసించు శక్తి నీవేనే
మాంగళ్యమును నిలుపు సర్వ మంగళవేనే
కాపాడరాదా ! కరుణ రాలేదా !
పతిలేని సతిబ్రతుకు వ్యర్థమే కాదా
ప్రాణాల నర్పింతు చేకొనవె తల్లీ 
నీలోన చేర్చుకో...ఓ కల్పవల్లీ...ఓ కల్పవల్లీ 





జగన్మాతస్తుతి పాట సాహిత్యం

 
స్తోత్రం 16

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: వీటూరి
గానం: జయదేవ్, వసంత & కోరస్

-: జగన్మాతస్తుతి :-

హే పరమేశ్వరి - భక్త వశంకరి
చంద్రకళాధరి లోకశుతే - వేద వినోదిని నాదస్వరూపిణి
త్రిపుర విహరిణి - కల్పలతే శ్రీ జగదంబ కళా నికురంబ
మనోజ్ఞనితంబ దయా కరితే
జృంభిత శుంభ నిశుంభ విలాసిని
వింధ్య నివాసిని శ్రీ లలితే
పాహిమాం - పాహిమాం త్రైలోక్యమాతా
రక్షమాం - రక్షమాం - ప్రణవసంజాతా
నమో దేవ దేవీ ప్రసీద ప్రసీద
నమో సర్వ శుభదా ప్రసీద - ప్రసీద




మంగళ శాసనం పాట సాహిత్యం

 
శ్లోకం 17

చిత్రం: శ్రీ వినాయక విజయం (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జి. వి. రంగాచార్యులు
గానం: సాలూరి రాజేశ్వరరావు, శైలజ, రేఖ

-: మంగళ శాసనం :-

వేద వేదాంత రూపాయ  బ్రహ్మ విష్ణు శివాత్మకే
పంచ వదనాయ దివ్యాయ విఘ్న రాజాయ మంగళమ్
పార్వతీ వరపుత్రాయ దేవాసురసుపూజితే
పంచ భూత స్వరూపాయ విఘ్నరాజాయ మంగళమ్

Palli Balakrishna Tuesday, April 30, 2019
Sri Krishna Tulabharam (1966)



చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.08.1966



Songs List:



జయహొ జై జయహొ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య 
గానం: ఘంటసాల, పి.సుశీల & బృందం

జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి



ఓహొ మోహనరూపా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: ఘంటసాల, పి.సుశీల

ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను 



ఓ చెలి! కోపమా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

ఓ చెలి! కోపమా అంతలో తాపమా

చరణం: 1
అందాలు చిందేమోము కందేను ఆవేదనలో
పన్నీట తేలించెదనే మన్నించవే

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

చరణం: 2
ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల?
దరిచేరి అలరించెదనే దయచూపవే...

ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా
ఓ చెలి! కోపమా అంతలో తాపమా
సఖీ నీ వలిగితే నే తాళజాలా

చరణం: 3
ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే
తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే

నను భవదీయ దాసుని మనంబున
నియ్యపుకింకబూని కాచిన అది నాకు మన్ననయ
చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుకులకాగ్ర
కంఠక విథానముతాకిన నొచ్చునన్చు నేననియదా
అల్క మానవుగదా ఇకనైన అరాళకుంతలా...





కొనుమిదే కుసుమాంజలి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల & బృందం 

కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి




ఇది సరాగాల తోట పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 

ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి



ఎందుకె నామీద నీకింతకోపం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఎల్. ఆర్. ఈశ్వరి 

ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో





కరుణించవే తులసిమాత.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల, ఎస్.జానకి

పల్లవి:
కరుణించవే తులసిమాత..
కరుణించవే తులసిమాత..
దీవించవే దేవీ మనసారా..
కరుణించవే తులసిమాత..

చరణం: 1
నిన్నే కోరి పూజించిన సతికీ... కలుగుకాదే సౌభాగ్యములన్ని
నిన్నే కోరి పూజించిన సతికీ... కలుగుకాదే సౌభాగ్యములూ

కరుణించవే తులసిమాత.. కరుణించవే తులసిమాత
దీవించవే దేవీ మనసారా... కరుణించవే....దీవించవే..
పాలించవే.. తులసిమాత

చరణం: 2
వేలుపురాణి....వాడని వయసు... వైభవమంతా నీ మహిమేగా...
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ
వేలుపురాణి.... వాడని వయసు... వైభవమంతా నీ మహిమేగా...
అతివలలోనా అతిశయమందే... భోగమందీయ్యవే..

కరుణించవే కల్పవల్లీ...
కరుణించవే కల్పవల్లీ...దీవించవే తల్లీ ... మనసారా
కరుణించవే.... దీవించవే... పాలించవే... కల్పవల్లీ

చరణం: 3
నిదురనైనా నా నాధుని సేవా.. చెదరనీక కాపాడగదే
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ
నిదురనైనా నా నాధుని సేవా... చెదరనీక కాపాడగదే

కలలనైనా గోపాలుడు నన్నే... వలచురీతి దీవించగదే....
కలలనైనా గోపాలుడు నన్నే... వలచురీతి దీవించగదే

కరుణించవే కల్పవల్లీ... కరుణించవే తూలసిమాత
దీవించవే తల్లీ మనసారా..
కరుణించవే... దీవించవే...
పాలించవే.... తులసిమాత




మీరజాలగలడా...పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: స్థానం నరసింహారావు
గానం: పి.సుశీల

పల్లవి:
మీరజాలగలడా...
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 1
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 2
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 3
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా...




భలే మంచి చౌక బేరము పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: చందాల కేశవదాసు
గానం: ఘంటసాల, పి.సుశీల & బృందం

భలే మంచి చౌక బేరము ఇది సమయమున్ 





విధుడు నీ మాట పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఎస్. వరలక్ష్మి 

విధుడు నీ మాట



ఇంద్ర కృష్ణ పారిజాత పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం

ఇంద్ర కృష్ణ పారిజాత



రుక్మిణి పుట్టిననాడు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, పి.సుశీల , పి.లీల 

రుక్మిణి పుట్టిననాడు




తులాభార యోజన పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, పి.సుశీల

తులాభార యోజన




కృష్ణ తులాభారం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల

కృష్ణ తులాభారం 




సత్యభామ గర్వభంగం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, పి.సుశీల 

సత్యభామ గర్వభంగం 

Palli Balakrishna Saturday, February 16, 2019
Mahakavi Kalidasu (1960)


చిత్రం:  మహాకవి కాళిదాసు (1960)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కాళిదాసు
గానం:  ఘంటసాల
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరంజని
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: కె.నాగమణి, పి.సూరిబాబు
విడుదల తేది: 02.04.1960

మాణిక్యవీణా.. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి

చతుర్భుజే చంద్రకళావతంసే..
కుచోన్నతే కుంకుమరాగశోణే..
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే... జగదేకమాతః ... జగదేకమాతః

మాతా.. మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

జయ మాతంగతనయే.. జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే.. జయ లీలాశుకప్రియే

జయ జనని...
సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ
బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్ప
కాదంబ కాంతారవాసప్రియే... కృత్తివాసప్రియే

సాదరారబ్ధ సంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే

కామలీలా ధనుస్సన్నిభ భ్రూ లతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే.. సురామే.. రమే

సర్వ యంత్రాత్మికే.. సర్వ తంత్రాత్మికే
సర్వ మంత్రాత్మికే.. సర్వా ముద్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే.. సర్వ చక్రాత్మికే
సర్వ వర్ణాత్మికే.. సర్వ రూపే
జగన్మాతృకే... హే... జగన్మాతృకే
పాహి మాం.. పాహి మాం.. పాహి... పాహి

Palli Balakrishna
Ekalavya (1982)


చిత్రం: ఏకలవ్య (1982)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  మల్లెమాల
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , జయప్రద
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: యం. యస్.రెడ్డి
విడుదల తేది: 07.10.1982

పల్లవి:
ఇది మల్లెలు విరిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 1
గాజులు గలగల నవ్విన ఉదయం
పూజలు పాలై పొంగిన ఉదయం
గాజులు గలగల నవ్విన ఉదయం
పూజలు పాలై పొంగిన ఉదయం

రోజుల తరబడి వేచిన ప్రణయం
రోజుల తరబడి వేచిన ప్రణయం
మేజువాణిగా మారిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 2
పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి ఈడొచ్చిన ఉదయం
పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి ఈడొచ్చిన ఉదయం
పసుపూకుంకుమ గుసగుసలెన్నో
పసుపూకుంకుమ గుసగుసలెన్నో
తరుణం చెడియం ఊరిన ఉదయం
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం: 3
పరిమళాలు పురి విప్పిన ఉదయం
పరవశాలు తెర తీసిన ఉదయం
పరిమళాలు పురి విప్పిన ఉదయం
పరవశాలు తెర తీసిన ఉదయం
పారే యేరు పెరిగిన ఊరు
పారే యేరు పెరిగిన ఊరు
నోరారా దీవించిన ఉదయం

ఇది మల్లెలు విరిసిన ఉదయం..
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..
ఇది మల్లెలు విరిసిన ఉదయం


******   *******   *******


చిత్రం:  ఏకలవ్య (1982)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది..ఆఁ
మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అది పనిగా పలురుచులు అందీయనున్నది

మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు..ఆఁ..
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
ముచ్చట.. అచ్చట.. ముప్పూటలా మెక్కి
తొక్కి నా ఎద మీద సోలిపోనున్నడు
మనసు మెచ్చిన చిన్నది.. నను మనువాడబోతున్నది

చరణం: 1
పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా..ఆ.. ఆ..
పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా

అమ్మబాబు.. మూడు ముళ్ళెసినంత దాకా
అట్టె బులిపించి మానం ప్రాణం తీయమాకా
అయితే గంగనో మంగనో నే చూసుకుంటాను
అది కనక నిజమైతే రెండిచ్చుకుంటాను
రెండా? ఏంటి?
మ్చ్.. మ్చ్..

హేయ్ .. మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు

ఆహహా.. ఆహాహహాహహా.. హాహా..
ఆహహా.. ఆహాహహాహహా.. ఆహహా..

చరణం: 2
అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..
అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆ..ఆ..

మంచిదేలే కదా అందాక వచ్చినాకా
ముద్దుమురిపాలు తీరే దాకా మూయవాకా
అవ్వా.. ఆశకు ఆటకు అద్దుండాలంటాను
అద్దంటూ గిరి గీస్తే ఐదిచ్చుకుంటాను
ఐదా? ఏంటి?
మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్..
హేయ్ ..

మనసు మెచ్చిన చిన్నది.. నన్ను మనువాడబోతున్నది
ఆలన.. పాలన.. నా మీద తోసేసి
అదిపనిగా పలురుచులు అందీయనున్నది
మదికి నచ్చిన చిన్నడు.. నన్ను మనువాడబోతున్నడు
లలలాలాలలాలలల.. లలలాలాలలాలలల..

Palli Balakrishna Monday, February 12, 2018
Sri Krishnavataram (1967)


చిత్రం: శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: సుశీల, ఘంటసాల
నటీనటులు: యన్.టి. రామారావు, శోభన్ బాబు, దేవిక
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: అట్లూరి పుండరీకాక్షయ్య
విడుదల తేది: 12.10.1967

సాకీ:
మెరుగు చామన ఛాయ మేని సొంపుల వాడు
నును మీగడల దేలు మనసున్న చెలికాడు
దొరవోలె నా మనసు దోచుకున్నాడే..

పల్లవి:
జగములనేలే గోపాలుడే
జగములనేలే గోపాలుడే... నా సిగలో పూవవును ఈనాడే
మగువుల నేలే గోపాలుడే... నీ మనసే దోచెను ఈనాడే
మగువుల నేలే గోపాలుడే..

చరణం: 1
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
ఘుమఘుమలాడే మమతల మల్లెలు
కోరినంతనే దొరకవులే...
మదనుని గెలిచిన మగరాయని గని
మదనుని గెలిచిన మగరాయని గని
మల్లెలు తామే వలచునులే
మగువా నీ మది తెలిసెనులే
జగములనేలే గోపాలుడే... నీ మనసే దోచెను ఈనాడే

చరణం: 2
భామా మానస పంజరమ్ములో
భామా మానస పంజరమ్ములో.. రామ చిలుకవై నిలిచేవా
పంజరమైనా ప్రణయ దాసునికి
పంజరమైనా ప్రణయ దాసునికి ... పసిడి మేడయే ప్రియురాలా
బాసయె చేసెద ఈ వేళా..
జగములనేలే గోపాలుడే.. నీ మనసే దోచెను ఈనాడే

చరణం: 3
చేసిన బాసలు చిగురులు వేయగ
చేసిన బాసలు చిగురులు వేయగ... గీసిన గీటును దాటవుగా
అందముతో నను బందీ జేసిన
అందముతో నను బందీ జేసిన... సుందరి ఆనతి దాటేనా
ఉందునే ఓ చెలి నీలోనా
జగములనేలే గోపాలుడే ... నా సిగలో పూవాయే ఈనాడే
మగువుల నేలే గోపాలుడే ... నీ మనసే దోచెను ఈనాడే


******   *******   *******


చిత్రం: శ్రీకృష్ణావతారం (1967)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సముద్రాల(జూ)
గానం: పి. సుశీల

పల్లవి:
ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు

ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు...

చరణం: 1
పువ్వులు... మువ్వలు...
పువ్వలు పులకరించి నవ్వులొలుకుతున్నవి... ఈ.. ఈ..
మువ్వలు పరవశించి సవ్వడి చేస్తున్నవి.. సవ్వడి చేస్తున్నవి

ఏమేమో అవుతుంది... ఎగిసి ఎగిసి పోతుంది
రేలుపవలు తెలియని నా మనసు... రేకులు విప్పిన తొలి వయసు
రేకులు విప్పిన తొలి వయసు...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ....ఆఆ.... ఆ..ఆ..

చరణం: 2
నీలాల మబ్బు తునక  నేలకు దిగి వచ్చెనా
నీలాల మబ్బు తునక  నేలకు దిగి వచ్చెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముత్యాల చందమామ ముంగిటనే నిలిచెనా
ముంగిటనే నిలిచెనా...


Palli Balakrishna Sunday, November 19, 2017
Sri Krishna Vijayam (1971)


చిత్రం: శ్రీకృష్ణ విజయం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, జమున
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: కౌముది ప్రొడక్షన్స్
విడుదల తేది: 1971

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు!
ఈ రతనాల బొమ్మకు తెలుసు!

వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట
వెన్నెలలో ఆడుకున్నావటా
ఎన్నో నేర్చిన వన్నె కాడవట
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట!

వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము
ఎన్నో నేర్చితినన్నదీ నిజము
చిన్నారీ......చిన్నారీ!
నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన
ఆ మాట నిజము..వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు
నా డెందము నందొక మెరుపు
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు!

అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో
అలవోకగా కనుగొన్నాను..అలవోకగా కనుగొన్నాను!

ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును
చెంగును ముడిచిన చెలువవులే
చెలువవులే చెంగలువవులే !

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు!

Palli Balakrishna Wednesday, November 8, 2017
Panduranga Mahatyam (1957)



చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్ (సముద్రాల వెంకట రామానుజాచార్యులు)
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, బి.సరోజాదేవి, విజయనిర్మల
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: నందమూరి త్రివిక్రమ రావు
విడుదల తేది: 28.11.1957



Songs List:



ఆనందమూ...ఓ పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పి. సుశీల

ఆనందమూ...ఓ
ఆనందమిదేనోయి సఖా
ఆగదు కాలం
మనేది కొద్దికాలం
క్షణాల ఇంద్రజాలం 

ఉన్నది నేడు
మరి రేపనుమానం...ఓ 
పనిలేనిపని పరాలని
 
తలచు విధానం
ఈ జీవిత బహుమానం
సుఖసారపు పానం
ముచ్చటగొన్నా
చెలి నీజతనున్నా...ఓ

మురిపాల సరాగాల
సుఖలీలల కన్నా
ఆనందపు పరమావధి
వేరే ఇక సున్నా  



అమ్మా... నాన్నా... పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల 

అమ్మా... నాన్నా...
అమ్మా.... అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
పదినెలలు నను మెసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ
తలచకమ్మా తనయుని
తప్పులు క్షమించవమ్మా.... అమ్మా... అమ్మా...

దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళుకడుగుతా నాన్నా... నాన్నా....నాన్నా...
మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
మీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా
మాతాపిత పాదసేవ మాధవసేవేయని మరువనమ్మ 
నన్ను మన్నించగరారమ్మా... అమ్మా... అమ్మా 

ఏ పాద సీమ కాశీ ప్రయాగాది ప
విత్ర భూములకన్న విమలతరము
ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ
పూజలకన్నను పుణ్యతమము
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని
ఆర్చగా జాలిన అమృతఝరము
ఏ పాదస్మరణ నాగేంద్రశయ సుధ్యా
నమ్ముకన్నను మహానందకరము
అట్టి పితురుల పదసేవ ఆత్మ మరచి
ఇహపరమ్ములకెడమై తప్పించువారు
కావగలవారు లేరు ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా....




చెబితే వినవా గురూ గారూ పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం 

చెబితే వినవా గురూ గారూ 




ఎక్కడోయ్ ముద్దుల బావా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , ఎ. పి. కోమలి 

ఎక్కడోయ్ ముద్దుల బావా 




హర హర శంభో పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల 

హర హర శంభో 




జయ జయ గోకుల పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: చిత్తూరు వి. నాగయ్య 

జయ జయ గోకుల 




జయ కృష్ణా ముకుందా మురారి పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల

ఆలాపన:
హే కృష్ణా... ముకుందా... మురారీ...

పల్లవి:
జయ కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి

చరణం: 1
దేవకి పంట వసుదేవు వెంట
దేవకి పంట వసుదేవు వెంట
యమునను నడిరేయి దాటితివంటా...
ఆ... ఆ... ఆ...

వెలసితివంట నందుని ఇంట
వెలసితివంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయెనంటా...

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి

చరణం: 2
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నిను రోట బంధించెనంట...
ఆ... ఆ... ఆ...

ఊపున బోయి మాకుల గూలిచి
ఊపున బోయి మాకుల గూలిచి
శాపాలు బాపితి వంటా...

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి

ఆలాపన: 2
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఎదన్నా నీ నోరు చూపుమనగా
ఆ... ఆ... ఆ...

చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యతగాంచెన్

జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందావిహారీ
కృష్ణా ముకుందా మురారి

చరణం: 3
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీ ఘటించిన గోపకిశోరా
ఆ... ఆ...ఆ...

కంసాది దానవ గర్వాపహార
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా పాప విదారా

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి

ఆలాపన: 3
కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం
కంఠేచ ముక్తావళీం
గోపస్త్రీ పరివేష్ఠితో
విజయతే గోపాల చూడామణీం
విజయతే గోపాల చూడామణీం

చరణం: 4
లలిత లలిత మురళీ స్వరాళీ
లలిత లలిత మురళీ స్వరాళీ
పులకిత వనపాళీ గోపాళీ
పులకిత వనపాళీ
విరళీకృత నవ రాసకేళీ
విరళీకృత నవ రాసకేళీ
వనమాలీ శిఖిపింఛ మౌళి
వనమాలీ శిఖిపింఛ మౌళి

కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారీ
కృష్ణా ముకుందా మురారి
జయ కృష్ణా ముకుందా మురారి

హే కృష్ణా... ముకుందా... మురారీ...




కనవేరా మునిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పి. లీలా 

కనవేరా మునిరాజా 



నీవని నేనని తలచితిరా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా
నిజమిదే ఋజువేదీ
ఉహు హు...ఆహా హా...
నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా

చరణం: 1
కలయగ జూచితి నీకొరకై నే కలయగ జూచితి నీకొరకై నే
కనుపాపలలో కనుగొన్నారా కనుపాపలలో కనుగొన్నారా
అవునో కాదో నే చూడనా
నీవని నేనని తలచితినే నీవే నేనని తెలిసితినే

చరణం: 2
కలవర పాటున కల అనుకొందూ కలవర పాటున కల అనుకొందూ
కాదనుకొందు కళా నీ ముందూ కాదనుకొందు కళా నీముందూ
కాదు సఖా కల నిజమేలే
నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా
నీవే నేనని తెలిసితిరా

ఆహ...ఆహ..హా...హా....ఉమ్మ్...ఉమ్మ్..ఉమ్మ్...





ఓ దారి కనని పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: యం. యస్. రామారావు 

ఓ దారి కనని 



పెదవుల రాగం పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) 

పెదవుల రాగం 



సన్నుతి సేయవె మనసా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: చిత్తూరు వి. నాగయ్య 

పల్లవి:
సన్నుతి సేయవె మనసా
ఆపన్న శరణ్యుని హరిని...
సన్నుతి సేయవె మనసా
ఆపన్న శరణ్యుని హరిని...

సన్నుతి సేయవె మనసా
చక్రధారి కౌస్తుభహారి 
సన్నుతి సేయవె మనసా
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారరి
పాపహారి కృష్ణమురారరి

సన్నుతి సేయవె మనసా

చరణం: 1
మరులు గొలిపే సిరులు మేను 
నిలువబోవే మనసా 
మరులు గొలిపే సిరులు మేను 
నిలువబోవే మనసా 
స్థిరముగానీ ఇహభోగము 
పరము మరువకె మనసా
గోపబాలుని మురళీలోలుని
గోపబాలుని మురళీలోలుని

సన్నుతి సేయవె మనసా

చక్రధారి కౌస్తుభహారి
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారి
పాపహారి కృష్ణమురారి

సన్నుతి సేయవె మనసా

చరణం: 2
ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావ
ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావ
పరమయోగులు చేరగగోరే పరమపదవికి దోవ
శేషశాయిని మోక్షాదాయిని
శేషశాయిని మోక్షాదాయిని

సన్నుతి సేయవె మనసా
ఆపన్న శరణ్యుని హరిని
సన్నుతి సేయవె మనసా
చక్రధారి కౌస్తుభహారి
చక్రధారి కౌస్తుభహారి
పాపహారి కృష్ణమురారి
పాపహారి కృష్ణమురారి
సన్నుతి సేయవె మనసా





తరం తరం నిరంతరం పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల 

తరం తరం నిరంతరం 



తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం 

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం
తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం

ఉబ్బుతబ్బులై ఉరుకులుతీయకు గబ్బువేను జీవా
అవునూ గబ్బిలాయి జీవా...
ఉబ్బుతబ్బులై ఉరుకులుతీయకు గబ్బువేను జీవా
అవునూ గబ్బిలాయి జీవా
ఎంత పెట్టినా ఏమి కట్టినా కట్టెల పాలౌ పాడు కట్టెరా

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం

మూడు రోజుల ముచ్చటరా ఈ చింత కట్టె దేహం
కాయం బుగిలి పోవు ఖాయం
మూడు రోజుల ముచ్చటరా ఈ చింత కట్టె దేహం
కాయం బుగిలి పోవు ఖాయం
నువు కట్టుకు పోయేదొట్టిదిరా 
ఈ మట్టిని పుట్టి మట్టిని కలిసి

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం

వెలుతురుండగా తెరువు చూసుకో
తలచి రామ నామం
జీవా చేరు రంగధామం (2)

పట్టుబట్టి ఈ లోకకపు గుట్టు
రట్టుచేసె ఈ రంగదాసుడు 

తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం 




వన్నెల చిన్నెల నెరా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి. లీల 

వన్నెల చిన్నెల నెరా
కన్నెల వేటల దొరా

జాణవు నా హృదిరాణివి నీవె
కూరిమి చేరగ రావే చెలీ

వెన్నెల చిన్నెల నెరా
కన్నెల వేటల దొరా

కనివిని ఎరుగముగదా
ఇది ఎంతో వింత సుమా
చాలులే సతికి కన్నులే గీటు
చతురులే పెనిమిటైనా

వన్నెల చిన్నెల నెరా
కన్నెల వేటల దొరా

అలక లేలనే చెలీ
అలవాటున పొరపాటదీ
అలక లేలనే చెలీ
అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లనీ రేయి
పరిమళించాలి హాయీ

వన్నెల చిన్నెల నెరా
కన్నెల వేటల దొరా
జాణవు నా హృదిరాణివి నీవె
కూరిమి చేరగ రావే చెలీ





లక్ష్మీ నృసింహ విభువే పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: చిత్తూరు వి. నాగయ్య 

లక్ష్మీ నృసింహ విభువే



శ్రీ కామిని కమితాకర పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల

శ్రీ కామిని కమితాకర 



ఆది భీజ ఏకలే పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల

ఆది భీజ ఏకలే 




తుమ బిన మోరే పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఎ. పి. కోమలి 

తుమ బిన మోరే 



ఆజ్ కా సున్హెర దిన్ హై పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల 

ఆజ్ కా సున్హెర దిన్ హై 



ఆటలాడ రారా పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఎ. పి. కోమలి 

ఆటలాడ రారా 




అక్కడ ఉండే పాండురంగడు పాట సాహిత్యం

 
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి. సుశీల

అక్కడ ఉండే పాండురంగడు

Palli Balakrishna Wednesday, October 4, 2017
Pandava Vanavasamu (1965)



చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాత: ఎ.యస్.ఆర్.ఆంజనేయులు
విడుదల తేది: 14.01.1965



Songs List:



హిమగిరి సొగసులు పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, సుశీల

అ..అ..అ..అ...అ..అ..అ..
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
హిమగిరి సొగసులు
హ్మ్.. ఆపావే పాడు

హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు

యోగులైనా మహాభోగులైనా
మనసుపడే మనోజ్ఞసీమ
అ..అ..అ..అ...అ..అ..అ..
యోగులైనా మహాభోగులైనా
మనసుపడే మనోజ్ఞసీమ
సురవరులు సరాగాల చెలుల
అ..అ..అ..అ...అ..అ..అ..
సురవరులు సరాగాల చెలుల
కలిసి, సొలిసే అనురాగసీమ

హిమగిరి సొగసులు
మురిపించును మనసులు

ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించేనేమో
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
ఈ గిరినే ఉమాదేవి హరుని
సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి
అ అ అ అ అ అ అ ఆ
సుమశరుడు రతీదేవి జేరి
కేళీ... తేలి... లాలించెనేమో

హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
అ అ అ అ...ఆఆఅ..ఆఅ...
హిమగిరి సొగసులు
మురిపించును మనసులు
అ అ అ అ...ఆఆఅ..ఆఅ..
మ్మ్మ్..మ్మ్మ్...




దేవా ! దీనబాంధవా! పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి. లీల

కృష్ణా! కృష్ణా! కృష్ణా!
దేవా ! దీనబాంధవా!  అసహాయురాలరా! కావరా
దేవా! దీనబాంధవా! అసహాయురాలరా!కావరా
కాలుని ఐనా  కదనములోనా
గెలువజాలిన   నా పతులూ
కాలుని  ఐనా  కదనములోనా 
గెలువజాలిని  నా పతులూ
ధర్మ బంధము  త్రెంచగలేక  మిన్నకుండేరు  స్వామి
నినే మదిలో  నమ్ముకొనేరా
నీవే  నా దిక్కు  రారా!!                                    

మకరిపాలై శరణము  వేడిన  కరిని  కాపాడినావే  
 హిరణ్యకశిపు   తామసమణచి ప్రహ్లాదు  రక్షించినావే
కుమతులు చేసే  ఘొరమునాపి  
కులసతి  కాపాడలేవా

గోవిందా...!  గోపీ జనప్రియా!
శరణాగత   రక్షకా!
పాహిమాం  పాహి!  పాహి! కృష్ణా!



విధి వంచితులై పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

సాకీ: న్యాయానికే పరాజయమా!

వంచనకే ధర్మము తలవంచేనా
విధి వంచితులై విభవము వీడీ
అన్న మాటకోసం అయ్యో అడవి పాలయేరా

నీ మది రగిలే కోపానలమూ
ఈ మహినంతా దహియించేనని
మోమునుదా చేవ ధర్మరాజా!

కోరస్: 
అయ్యో అడవిపాలయేరా
సభలో చేసిన శపధముదీరా
పాపులననిలో త్రుంచెద నేనని
బాహువులూ చేవ భీమసేనా!

కోరస్: 
ఆ..ఆ..ఆ.. అడవిపాలయేరా
అలములోన కౌరవసేనా ఆమ్ములవానా ముంచెద నేనని
ఇసుమును చల్లేవ సవ్యసాచీ!   
                 
ఏ యుగమందూ ఏయిల్లాలూ
ఎరుగదు తల్లీ ఈ అవమానం           
నీ పతిసేవయే నీకు రక్ష   !





మహినేలే మహారాజు నీవే పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, పి. లీల 

మహినేలే మహారాజు నీవే
మనసేలే నెరజాణ నేనే         
ప్రియభామల  సరసలీలల 
ప్రేమమీర ఏలుకోరా రాజా
మహినేలే మహరాజు నీవే
అందచందాలలోన
వలరాజు
మధుమందహాసాలలోనా
నెలరాజు
అందచందాలలోనా
వలరాజు
మధుమందహాసాలలోనా
నెలరాజు
తనువూనినా తరుగమానినా
సరిరారు నీకు  రాజరాజా                       
చతురహస్యాలలో ఓ  ఓ  ఓ
లలిత లాస్యాలలో ఆ ఆ  ఆ  ఆ  ఆ   ఆ
రసిక విద్యా రహస్యాలలో...
అనురాగ పరవశ్యాలలో..
మాసరి రామని రంభామేనకలే
అమరసీమ చేరినారురా  రాజా
హ  హ  హ                                             



మనోజం మారుత తుల్యవేగం పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: Treditional
గానం: ఘంటసాల

ఆంజనేయా-మహానుభావా..

శ్లో॥ 
మనోజం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్దిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి॥


శ్లో॥ 
భజే రమ్య రంభావనీ నిత్యవాసం
భజే బాల భాను ప్రభా చారుభాసం...
భలే చంద్రికా కుంద మందార హసం
భజే సంతతం రామ భుపాల దాసం॥

దండకము: 
జయ! జయ! మహాసత్వబాహా! మహా వజ్రదేహా!
పరీభూత  సూర్యా! కృతామర్త్య  కార్య!
మహావీర,హంవీర, హేమాద్రి ధీరా!
ధరాజాత,శ్రీరామ, సౌమిత్రి సంవేష్టితాత్మా, మహాత్మా!
నమో వాయుపుత్రా! నమో సచ్చరిత్రా!
నమో జానకీ ప్రాణదాతా! భవిష్యద్విధాతా!
హానుమంతా! కారుణ్య వంతా! ప్రశాంతా!
నమస్తే! నమస్తే!  నమస్తే!  నమ:॥

శ్లో॥ 
శ్రీరామచంద్రం శ్రితపారిజాతం
సలక్ష్మణం భూమి సుతా సమేతం 
లోకాభిరామం  రఘువంశ సోమం
రాజాధిరాజం శిరసా నమామి॥




ఓ వన్నెకాడ పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: యస్. జానకి 

యక్షిణి: 
ఆ...ఆ...ఆ...ఆ..ఆ..ఆ..ఓ వన్నెకాడ  ఊ..
ఓ వన్నెకాడ నిన్ను చూచి నామేను  పులకించెరా
ఓవీ రా నన్నేలి కులికించరా                 
మరులు పెంచే  మంచిగంధం
మల్లెపూపాన్పు వేచేనోయి            
నీ దయగోరి  నిలచేనోయీ      
       
ఉరుకుల  పరుగుల దొరా
మగసిరికిది తగదురా
ఉరుకుల పరుగుల  దొరా నీ మగసిరికిది తగదురా
ఆ...ఆ...ఆ..ఉరుకుల  పరుగుల దొరా..
చూడరా యిటు చూడరా
సరి యీడుజోడు  వన్నెలాడినేరా!ఓయ్       

వలపు గొలిపే బింకాల
కళలతనిపే పొంకాల
వదిలిపోకురా ...ఆ...ఆ...ఆ  

తాళలేరా మదనా! మదనా మదనా మదనా...
నే తాళలేరా మదనా  మదనా మదనా  మదనా
నే తాళలేరా మదనా
విరులశరాల వేగితి చాల విరహమోర్వజాల...ఆ...ఆ
విరులశరాల  వేగితిచాల విరహమోర్వజాల...
ఇలలో లేని అమరసుఖాల
తేలజేతు వేగ ఎదను గదియర
తాళలేరా మదనా! మదనా మదనా మదనా
నే తాళ, నే తాళ, ఇకతాళ లేరా మదనా





రాగాలు మేళవింప పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, పి. సుశీల  

శశి: ఓ...ఓ...
అభి: రాగాలు మేళవింప
శశి: ఆహా!
అభి: హృదయాలు  పరవశింప
శశి:ఓహొ!
అభి: ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ!
శశి: రాగాల మేళవింప
అభి: ఆహొ!
శశి హృదయాలు  పరవశింప
అభి: ఓహొ!
శశి: ఆడేము మధురసీమ
తనిసేము  అమరప్రేమ
మురిపించు  మల్లె సరమౌచు నీదు
ఉరమందు విరిసిపోయెనా            

అభి: విరితేనెలాను  మధుపమ్మువోలె
నే మేను మరచి పోయేనా
శశి: రాగాలు మేళవింప
హృదయాలు పరవశింప
అభి: ఆడేము  మధురసీమ
తనిసేము అమరప్రేమ
అభి: ఆనంద మొలక నా డెందమందు
నిను దాచుకొందునోబాలా                     

శశి: నాకన్నుదోయి నీరూపె నిలిపె
పూజించుకొందు  బావా
అభి: రాగాలు  మేళవింప
శశి: హృదయాలు  పరవశింప
అభి: ఆడేము  మధుర సీమ 
శశి: తనిసేము      అమరప్రేమ!
ఇద్దరు: రాగాలు మేళవింప
హృదయాలు   పరవశింప... ఆహా...ఆహా..హా...




మొగిలీరేకుల సిగదానా పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల,  ఎల్.ఆర్.ఈశ్వరి 

గోపాల: మొగిలీరేకుల సిగదానా
మురిడి గొలుసుల చినదానా
రావే నా సిలక ఏమే ఈఅలక 
గోపిక: చిలిపీ చూపుల చిన్నోడా చెవులా పోగుల పిల్లోడా!
చాలూ నీ గోలా నా వూసు నీకేలా!
(మంత్రములు)
గోపాల: కొసరి  కొసరి  రమ్మంటేనూ
ఇసురుకుంటు అటు ఉరికావూ!
బృం: ఒయ్! ఇసురుకుంటు  అటు ఉరికావూ!
గోపిక: ఏటినీళ్ళకెడుతుంటే పైట పట్టుకొని  గుంజావూ
బృ: పైట పట్టుకొని గుంజావూ
గోపాల: సరసానికి చేశానే
గోపిక: ఓ ఓ 
గోపాల:  వరసలాడి మురిశానే
గోపిక:  ఊ ఊ    
గోపాల: సరసానికి
గోపిక: నలిగురిలోనా కొంటెతనానా నవ్వులపాలూ చేశావూ

బృందం: చిలిపీ చూపుల చిన్నోడా 
చెవులా పోగుల పిల్లోడా!
చాలూ నీ గోలా నా వూసు నీకేలా!
(మంత్రములు)

గోపాల: బుద్ధి తెలిసేనే వయ్యారి
ముద్దు తీర్చవే ఒకసారీ
బృం: ఒయ్.. ముద్దు తీర్చవే ఒకసారి
గోపిక: వగలమారి మొనగాడా
ఇక వదలకోయి నా నీడ
బృం:వదలకోయి ఇక నా నీడ
బృం:వదలకోయి ఇక నా నీడ
గోపాల: ఇద్దర మొకటైతేను
బృం: ఓ..ఓ..
గోపిక:  ఎడమే లేకుంటేను
బృం: ఊ...ఊ...
గోపాల: ఇద్దర మొకటైతేను
బృం: ఓ..ఓ..
గోపిక:  ఎడమే లేకుంటేను
బృం: ఊ...ఊ...
ఇద్దరూ: అలకలు తీరా, పులకలు మీరా
కమ్మగ కాలం గడచేనూ
గోపికల బృందం: చిలిపీ చూపుల చిన్నోడా
గోపాలకుల బృందం: మొగలీ రేకుల సిగదానా
గోపికల బృందం: హా హా హా





నా చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, పి. సుశీల 

అభి: నా చందమామ నీవె భామ
తారలే అన నీ నీడనే నా ప్రేమసీమ
నీ నీడనే నా ప్రేమసీమ
శశి :(రాగం) ఆ ఆ  ఆ ! ఓ  ఓ  ఓ  ఆ  ఆ.. 
అభి: నా చందమామ

అభి: నీ కంఠవీణా రాగాలు తీయ
నీ కన్నుదోయీ మోహాలు పూయ
శశి: (రాగం)  ఆ  ఆ  ఆ ....
అభి: నీ కంఠవీణా రాగాలు తీయ
నీ కన్నుదోయి మోహాలు పూయ
నీపాద మంజీరాలా నా ప్రేమ మ్రోయ           
నటియించరావే మెరుపుతీవ హాయిగా
శశి : ఓ  ఓ  ఓ
అభి:  ఎలకోయిల గొతుమూయ ఎలుగెత్తి  పాడవే
శశి: (రాగం)   ఆ..  ఆ .. ఆ
అభి: వనమయూరి పరువుమాయ వలపునాట్యమాడవే
అడుగడుగున లయలుగులికి
హొయలు చిలికి  ఏలవే
ప్రేమ మధుర శిల్పచిత్రా రేఖా శశిరేఖా!
శశి : ఆ ఆ ఆ 




బావా బావా పన్నీరు పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

మాయాశశి: బావా బావా పన్నీరు 
బావకు మరదలు బంగారు
బాజాలు మోగందె బాకాలు ఊదందే
ఎందుకు కంగారు                                       
లక్ష్మణకుమారుడు: అయ్యో! అబ్బ! అమ్మ!

మాయాశశి: చిలిపి చేష్టలతో వలపెకోరునట
ముద్దూతీర్చమని సద్దుచేయునట                
మరులుకొనే బాల తను మనసుపడే వేళ 
ఉలికిపడి ఉనికిచెడి ఉక్కిరి బిక్కిరి అవుతాడంట
ఓ....బావా !బావా!
లక్ష్మణకుమారుడు: మరదలా!
మాయాశశి: బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
పరుగులుతీసే ఉరకలు వేసే బావను ఆపేరు
సుందరాంగుడట గ్రంధసాంగుడట
ఏడు మల్లియల ఎత్తు తూగునట
కలికికొనగోట ఆ చెంప ఇలా మీట
అబలవలె అదిరిపడి లబోదిబో అంటాడంట
ఓ బావా!
లక్ష్మణకుమారుడు: మరదలా!

మాయాశశి: బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోనా జలకమూలాడ బావను తిప్పేరు
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోనా జలకములాడ బావను తిప్పేరు
బావాబావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను ముంచేరు





శ్రీకృష్ణా! కమలానాధా! పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

శ్లో॥  
శ్రీకృష్ణా! కమలానాధా!
వాసుదేవా! సనాతనా!
గోవిందా! పుండరీకాక్ష!
రక్షమాం కరుణానిధే

గీ॥ 
ధర్మ పరుడైన పతిని శోధనము చేయ
వచ్చె శాపాయుధుండు దుర్వాసమౌని
ఏవిధి ముగింపజేతువో ఈ పరీక్ష
భక్త సంత్రాణశీల  గోపాలదేవా...ఆ  ...ఆ..గోపాలదేవా




# పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం 

దురో: సీ॥
ఏక చక్రపురాన యెగ్గు సిగ్గులు మాని
తిరిపెమెత్తిననాడె తెల్లమాయె

భీమ: తిరిపెమెత్తుటెగాదు తిగిచి జరాసందు
మట్టిజేసిన జగజెట్టి నేను

దుర్యో: మాధవు మాయతో మగధేశు కూల్చిన
జయమెంచి జబ్బులు చరచుకొనకు

భీమ: గంధర్వపతి పాశబంధమ్ము విప్పి నీ
పరువుగాచినమాట మరచినావె

దుర్యో: హా! మరుతునే కులసతి నవమానపరుప
మౌన మూనిన నాటి నీ మగతనంబు

భీమ: ఆ! ధర్మ నిరతి నశక్తిగా తలచునీదు
కనుల పొరలు మాపెదను ఈక్షణమె తులువ




మాయలతో జనియించి పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

మాయలతో జనియించి మటుమాయలు వృత్తిగనెంచు నీవు అహా
మాయల నిందసేతువె అమాయకులైన పృధాకుమారులన్
మాయలుపన్ని నాడు అవమానము చేయగ లేదే ఆ గతిన్
మాయలతోనె నీ దురభిమానము మాపెదనో సుయేధనా




ఓ... కమలాననా పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి.బి.శ్రీనివాస్ 

ఉ॥ 
ఓ... కమలాననా వికసితోత్పల లోచన నీలవేణి ఓ...
కోకిలవాణి దీనులగు కుంతి కుమారుల పొందికన్న చీ
కాకులు చాలునింక సరికాంతల కందని భోగభాగ్యముల్
చేకుర జేతునన్ బతిగజేకోని యేలవె కౌగలీయవే




మాయలమారివై మొయిలు పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: మాధవపెద్ది సత్యం

మాయలమారివై మొయిలు మాటునడాగి వృధాట్టహాసముల్
చేయకు నీ ప్రగల్భములు చేతలలో కనిపింపజాలినన్
ఆయుధమున్ ధరించి సమరావని నన్నెదిరింప రమ్మువ
జ్రాయుధుడడ్డ నీ మదము నార్చెద కూల్చెద గర్వమోహితా




అన్నదమ్ములలోన పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: ఘంటసాల

అన్నదమ్ములలోన అతి ప్రియతముని
నకులుని  ధర్మనందనుడు  కోల్పోయె...
అసమాన  శూరుడు అమర  సన్నిభుడు
పార్ధుడు కురురాజు  బందయైపోయె
అమిత బాహుబలుండు  అపరాజితుండు
భీమసేనుడు కూడ విజితుడై పోయె
ధర్మావతారుడౌ  ధర్మసూనుండె
తన్నొడ్డిపణముగా  తానోడిపోయె ... ఓడిపోయె




# పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: పి. లీల 

ఉ॥ 
శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము
క్తాతతశైలకందర గుహాంతర సుప్తమృగేంద్ర కేసర
వ్రాతము పట్టి ఊతునని రంకెలు వేయగబోకు క్రోధ ని
ర్ఘాత మహొగ్రు భీము నెదురన్ నశియింతువు నీవు సైంధవా





# పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: మాధవపెద్ది సత్యం

కారుంగూతలు కూయబోకుమిక నో గర్వాంధ సర్వస్వమున్
చూరుంబుచ్చినవారు చూపునది వాక్శూరత్వమే ఇప్పడే
ఈ రాజేంద్రులు వృద్ధ బాంధవులముందే నేను నీకర్హ  స
త్కారంబున్ ఒనరింతు నీ భుజబలౌద్ధత్యమ్ము చూపించుమా!




# పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)
గానం: బాలమురళి కృష్ణ 

శ్లో॥ 
శ్రీవిష్ణుం  జగతాం  నాధం!
జ్ణాన  విజ్ణాన మౌక్షదం!
మహాపాప హరం దేవం!
తం సూర్యం ప్రణమామ్యహం॥

శ్లో॥ 
అరుణాయ శరణ్యాయ
కరుణారస సింధవే!
అసమాన బలాయ
ఆర్త  రక్షణాయ నమో నమ:॥





# పాట సాహిత్యం

 
చిత్రం: పాండవ వనవాసం (1965)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: 
గానం: ఘంటసాల

ధారుణి  రాజ్య సంపదమదంబున గోమలి గృష్ణజూచి  రం
భోరు నిజోరు దేశమున  నుండగ బిల్చిన యిద్దురాత్ము!దు
ర్వార మదీయ  బాహుపరివర్తిత చండ గదాభి ఘాత భ
గ్నోరు తరోరు జేయుదు సుయోధను  నుగ్ర  రణాంతరంబునన్!
కురువృద్దుల్  గురువృద్ధ  బాంధవులనేకుల్   చూచుచుండన్  మదో
ద్ధురుడై! ద్రౌపదినిట్లు చేసిన  ఖలున్!  దుశ్శాసనున్  లోకభీ
కర లీలన్  వధియించి  తద్విపుల  వక్షశ్శ్తెల  రక్తౌఘ ని
ర్ఝర  ముర్వీపతి  చూచుచుండ అని  నాస్వాదింతు  నుగ్రాకృతిన్

Palli Balakrishna Tuesday, October 3, 2017

Most Recent

Default