-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Haranath"



చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: కాంతారావు,కృష్ణకుమారి, హరనాథ్, రాజశ్రీ
నిర్మాత, దర్శకత్వం: బి.విఠలాచార్య
విడుదల తేది: 09.11.1962



Songs List:



జనని బద్రకరాల కాళి పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

జనని బద్రకరాల కాళి



నా కోటి స్వప్నాలు పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్

నా కోటి స్వప్నాలు 



చిక్కును విప్పవే చినదానా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: జిక్కీ , నాగేంద్ర 

చిక్కును విప్పవే చినదానా




ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ప్రేమతో సరి అయినది భూమిలో ఏమున్నది 



ఓ ప్రియతమా రావా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. సుశీల 

ఓ ప్రియతమా రావా 



నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Male) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్,

నీలి మేఘ మాలవో... నీలాల తారవో





నీలి మేఘ మాలవో... నీలాల తారవో (Duet) పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

పల్లవి:
నీలి మేఘ మాలవో... నీలాల తారవో
నీ సోయగాలతో...మదినీ దోచిపోదువో..ఓ ఓ ఓ..
నీలి మేఘ మాలనో...నీలాల తారనో
నా సోయగాలతో...మదినీ ఈ ఈ దోచిపోతినో..ఓ ఓ ఓ..

నీలి మేఘ మాలనో...

చరణం: 1
నీ రాక కోసమే చెలి... నే వేచియుంటినే...
ఆరాటమేలనో ప్రియా... నే చెంత నుంటినే...
ఆనంద మధుర గీతములా.. ఆలపింతమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో....

చరణం: 2
చివురించు వలపు తీవెల... విరి పూలు పూయగా...
చిరునవ్వు విరుపు లోపల... హరివిల్లు విరియదా...
నెలవంక నావలోన మనము కలసిపోదమా ఆ ఆ ఆ ...

నీలి మేఘ మాలవో...

చరణం: 3
మనలోని కలత మాయమై... మన ఆశ తీరెగా...
అనురాగ రాగమే ఇక...మన రాగమాయెగా....
మనసార ప్రేమ మాధురుల సాగి పోదమా ఆ ఆ ఆ ...
నీలి మేఘ మాలనో... నీలాల తారనో...
నీ సోయగాలతో... మదినీ దోచి పోదువో...





తేలిపోదామా పాట సాహిత్యం

 
చిత్రం: మదనకామరాజు కథ (1962)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: జి. కృష్ణమూర్తి 
గానం: పి. బి. శ్రీనివాస్, పి. సుశీల 

తేలిపోదామా 

Palli Balakrishna Sunday, July 17, 2022



చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
నటీనటులు: హరనాథ్, జమున, జి. వరలక్ష్మి
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: వి. సత్యన్నారాయణ
విడుదల తేది: 01.11.1968



Songs List:



అందం ఉరికింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల 

అందం ఉరికిందీ 
వయసుతో పందెం వేసింది.
మనసులో బందీ అయింది
ఇదేమి బంధం అంటుంది 
అందాలొలుకు చంద్రుని అందుకోవాలనుకొని 
ఎగసే అలలు తెలిపే దేమని ?
రోహిణి : ఏమని?
రవి : జగమంతా ప్రేమ బంధం
సొగసంతా నీది నీదే రారమ్మని !
రోహిణి : విరిసే నిండు జాబిలి కడలి పూచిన పూవులే
ఎగసే అలలబాల అదే కడుపున సంటలే
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం .....
రవి : ఎదిగే మావి కొమ్మల కౌగలించాలనుకొని
ఒదిగే మాధవీలత వలపు పిలుపే యేమని?
రోహిణి : ఏమని?
రవి : తనలోనే కరిగి పొమ్మని
తనువంతా నీదినీదే రా రమ్మని !
రోహిణి : ఎదిగే గున్న మావిని పుడమితల్లే కన్నది
ఒదిగే మాధవీలత తోడబుట్టిన చిన్నది
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం ..




ఆడితప్పని వాడని (పద్యాలు) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు, సుమిత్ర, అప్పారావు  

హరి:
ఆడితప్పని వాడని యశముగాంచ
అఖిల రాజ్యమ్ము విడనాడి - ఆలి నమ్మి
కడకు నన్నమ్ముకొన వీధి బడితి నేడు
భానువంశ హరిశ్చంద్ర ప్రభుడ నేను -
నన్ను కొనరండి ! రండి  కొనండి! రండి 

నక్షత్ర : 
కొండంత యేనుగు కుంభస్థలము మీద
తాడియంత మనిషి తాను నిలిచి
రత్నమొకటి నింగి రయ్యని విసిరిన
ఎంత దవ్వుపోవు, అంత ఎత్తు ధనము
కుప్పపోసి వీని కొనగవలయు .

వీర : 
తొలగండె హె బాబు .. తొలగండెహె!
సిన్నోల్లో పెద్దోల్లో - తొలగండె హె !
మందు మీదున్నాను  మత్తెక్కి వున్నాను మక్కిలిరగదన్నేను 
ఏపాటి  ఓళ్లైనా ఏనాటి ఓళ్లైనా
ఎప్పటికో అప్పటికి చేరేటి చోటికి
ఆ కాటికి - వల్ల కాటికి కాపరిని - యీరబాహువుని...




ఎవరికి పుట్టిన పాప పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల 

ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా యీ పాప
శాపానికి ప్రతిశాపమా. పుణ్యానికి మణి దీపమా
నెత్తుట తడిసిన యీ చేతులతో
నీకు పాలు పట్టేనా? పాపా ! నేను పాలు పట్టేనా ?
నిప్పులు చెరిగిన యీ గొంతుకతో
నీకు జోల పాడేనా, పాపా !   నేను జోల పాడేనా ?

లాలీ  జోగో లాలీ 

ఎన్ని గండములు ఎదురౌతున్నా
నిన్ను వదలు కోగలనా  పాపా !
నిన్ను మరువ గలనా
కరచిన పాము కోరలు తీయక
కన్ను మూయగలనా  పాపా !
కన్ను మూయగలనా |

లాలీ  జో లాలీ




చతురాశాంత పరీత (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు

చతురాశాంత పరీత భూరి వసుధన్ శాసించు చిహ్నంబుగా
క్షితి రాజిల్లేడు రాజదండము బదుల్ చేతనే రహించెన్ గదా,
చితిలో కాలేడు కాష్టమంచు నకటా ! చింతించకన్ సాహసో
ద్ధతి, సత్కీర్తి గణించి, మించి, ఘన సత్యశ్రీని కాపాడుమా 




చిన్నవాణ్ని చూడగనే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల

చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే 
రాగాలు సాగెనే మొహాలు మూగెనే
అవేనే శృంగార శృంఖలాలు బంగారు సంకెలలు 

నూనూగు మీసమూ జానైన వేసమూ
వానిగని, వాని విని మనసు జారి పోయెనే 
దినుసె మారి పోయెనే  ఏమేమో ఆయెనే
దీపముగని మిణుగురులు  రూపముగని కన్నియలు 
ఒళ్లు మరచి పోయారే ఒళ్ళోవాలి సోలేరే 
అది ప్రేమే అంటావా ? కాదే, అది కామమే 
నాలో వగ మొదలాయె  అది గోదావరి వరదాయె
పరువముతో రొమ్ము చరచి చొరవగాను చేరగనే
ఆ కోడెగాని చూపులలో అది యేమో తోచెనే
ఒక్క నెమలి కన్నులో ఎన్ని వన్నె చిన్నెలో
యువకుని ఒక భంగిమలో అన్ని కళలు మెరయునే 
పెళ్లిగాక ఆ ప్రేమల సంగతికే పోరాదే పోరాదే



మనసైన నాసామి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

మనసైన నా స్వామి రాడేలనే !
నా మదిలోని నెలరాజు లేడేలనే !
జిలిబిలి నవ్వులు చిలికినవాడే
వలపే తానై  పిలిచిన వాడే
నంద శోరుడే నా వగ కాడే
వేణుగాన ఝరిలోన ముంచెనే
నితాంత లతాంత వసంత వేళల
మరులు గొలిపినాడే - మరచినాడే
దరికిరాడే - మగువరో

అల్లరి గాలి చల్లగ వీచె
సిగలో పూలె నగవులు దాచే
విరివిలుకాడె తరుణము వేచె
పొంచి పొంచి పులకించి మించి
బిరబిరాన వరాల శరాలు దూసె

కలల బరువు పెరిగె - నిదుర తరిగె
రేయి కరిగె చెలియరో ...






రండయ్యా రండయ్యా (బుర్రకథ) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
నిర్వహణ: రాఘవకుమార్ అండ్ పార్టీ విజయనగరం.

క్రిష్ణ వేణి : 
రండయ్యా ! రండయ్యా !
పిన్నలు పెద్దలు రారండయ్యా: ఎన్నడు వినని ఎన్నడు కనని
మహా ద్రోహి కధ వినరండీ ! ప్రజలే రాజ్యం చేసే రోజులు
ప్రజలే తీర్పును చెప్పాలి,  ప్రజలే న్యాయం చెయ్యాలి..

వంతలు : 
రండయ్యా  రండయ్యా  పిన్నలు పెద్దలు రారండయ్యా !

క్రిష్ణ వేణి : ఊరుకు పట్టిన గ్రహచారం  ఘోరకలీ ! ఘోరకలీ !
వచనం : కధకాదు, కట్టుకథకాదు, ఉట్టుట్టి కథకాదు !
ఊరికి నడి బొడ్డున నడిచిన మహా పాపికధ !

వంతలు : రండయ్యా  రండయ్యా   పిన్నలు పెద్దలు రారండయ్యా

క్రిష్ణ వేణి : ఖూనీల్ చేసిన పాపం పోవగ - చందాల్తో గుడి కట్టిస్తాడు 
కుప్పలు కాల్చిన పాపం పోవగ అన్న దానములు చేయిస్తాడు
మగువల చెరచిన పాపం పోవగ పూజలు భజనలు చేయిస్తాడు
పొగిడే వారిని చేరదీస్తడు తెగడు వాని పై తుపాకి తీస్తడు

వంతలు : అమ్మలారా వినుడీ ! యీ అన్యాయము గనుడీ !

క్రిష్ణవేణి : రావణుని మించేటివాడు - కీచకుని తలదన్ను వారు
కామ క్రోదాలతో వాడు కన్నె పడచుల చరచువాడు,
ముందు నీతులు చెప్పి - వెనక గోతులు తీయ పెద్ద మనిషిని తెలుసుకొండయ్యా 
ఆ పెద్ద మనిషికి సోదరా - ఇద్దరు నమ్మిన బంట్లురా
బుద్ధిలేని ఒక కుంటి నక్కరా  - బుర్రలేని ఒక గడేకారిరా 
పైసా కోసం ఫలహారంగా - పచ్చగడ్డినే తింటారా !

వంతలు : భళానంటి భళి తమ్ముడా - మేల్ భళానోయ్ దాదానా !
క్రిష్ణ వేణి వచనం : ఈ బలగంతో ఆ పెద్ద మనిషి సాగించిన దురంతాలు ఎట్లాంటి వనగా
ఎడ్ల పందెం వేయదలచి - పేద రైతును కోరి పిలిచి
పందెమందున ఓడిపోయి - పౌరుషంబున పగలబడ్డాడా
పగబట్టి పామై బుసలు కొట్టాడా !
పరువు నిలవదని గడేకారినే - రయమున పిలిపించె
దొంగ చాటుగా రైతు కొంపకే - అగ్గిని పెట్టించే !
కణకణ మండే మంటల - రైతు కనుల జూచినాడా
ఇంట సావిడిని పందెపు బెడ్లు - యిరుకున బడ్డాయి
వాటి రక్షణకు తెగించి రైతు - మంటల దూకాడా!
పేరు మోసిన పందెపు టెడ్లు పేద రైతుకూడా
భగ భగ పొగ లెగ జిమ్మే మంటల బూడిద అయినారా !
ఆ గ్రామానికి ఏమి వచ్చినా - పెద్ద మనిషియే గతి అన్నట్టు
పిల్లల నిద్దరి సాకే బాధ్యత - పెద్ద మనిషి కే కైవశమయ్యిందా !
 అనాధలకు ఆశ్రయమిచ్చిన పెద్దమనిషి 
ఆ కన్నెపై తాను - కన్నేసి వున్నాడా !
ఇంట నెవ్వరులేని - అదునుకై జూచాడా
చీకటే ముసిరింది - కోరికే రేగింది.
క్రూరంగా చెరబట్టి  ఘోరమే చేశాడా
అతి నేరమే చేశాడా

వచనం : పాపం ! ఆ దురదృష్టవంతురాలు 

కృష్ణవేణి : మానం పోయిన ప్రాణ మేలయని
వంతలు : రామరామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : ఆత్మహత్యకై సాహసించగా
వంతలు : రామ రామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : గడేకారి గని రక్షించెను - ఆ దీనురాలినండీ !
వచనం : విపరీతం, విడ్డూరం అన్నట్టు - యింకా ఏం జరిగింది .
కృష్ణవేణి : పెద్ద మనిషి చెరపట్టగా - కన్య గర్భవతి ఆయెరా !
నెలలు నిండి ఒక బిడ్డనుగని  - తా  కన్ను మూసెనయ్యో :
వంతలు : జాలిగుండెగల సోదరా! - యీ కరుణ గాధనే విన్నావా !
విషాద గాధనే విన్నావా !
వంతలు వచనం : మరి ఆగడేకారి పసి బిడ్డను ఏం చేశాడు ?
వంతలు వచనం : ఒక అభాగ్యవతి గడపలో పసిపాపను వదలి  పెట్టి
పెద్ద మనిషి పుణ్యాన గడేకారి - జైలు పాలయ్యాడు.

కృష్ణవేణి : తల్లి కాని తనలోటు తీరగా తల్లి తనము పై తీపివారగా
ముద్దు ముద్దుగా  పెంచినపాప కళకళలారుతు పెరిగి పెద్దదై
కళారంగమున గజ్జేనుకట్టి  - నర్తకిగానే ఆరితేరినది.
వంతలు : అమ్మలారా వినుడు  అయ్యలరా వినుడీ

కృష్ణవేణి  వచనం :   ఇంకా శోచనీయమైన విషయం ఏం జరిగింది ?
శాంతినికేతన్ చదువు పూర్తియై తిరిగి వచ్చిన నవీన యువకుడు
పెద్దమనిషి ఏకైక పుత్రుడు - నర్తకి నేగని ప్రేమించాడండి! -
ఎవరు చేసిన పాపం వారిని - చివరికి మానదని
తెలిసి వచ్చినది నర్తకి  జన్మ - తెలిసి వచ్చినది నర్తకి జన్మ
తెలిసి వచ్చినది కొడుకు పట్టుదల
తా కన్న కూతురే తన యింటి కోడలా దారుణంబని మధన పడ్డాడు
తన పాపమే పండి బ్రద్దలై యీ నాడు తన పరువు నట్టేట గలియునన్నాడు
కూడని ధర్మం సాగడమాయని - కొర కొర లాడాడ 
కఠిన చిత్తుడై నర్తకి నే - మటు మాయం చేశాడా ?
ప్రజలే రాజ్యం చేసేరోజులు - ప్రజలే తీర్పును చెప్పాలి
ప్రజలే న్యాయం చెయ్యాలి !





లోకమెల్ల నీది (అభినవ కుచేల పిల్లల నాటిక) పాట సాహిత్యం

 

చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఉడుతా సరోజిని, సుమిత్ర 

లోకమెల్ల నీది లోకమే నీ పంచు
కల్లబొల్లి కబురులల్లి తొల్లి
మానవులను చాటు మాటు మాయచేశావు
దేవుడసలు నీవు కావు కావు...

తిండిని దాచే వ్యాపార్లు
లంచం మరిగిన అధికార్లు
మోసంచేసే మొనగాళ్లు
లోకం నిండా నిండారు,

తాండవించుచుండె దారిద్ర్య దేవత
కాలి యినుప గజ్జె ఝల్లుమనగ
ఆటలాడసాగె ఆకలి రాకాసి
జనుల గుండె ఝల్లు ఝల్లుమనగ 

శ్రీ కృష్ణ :
నీవు పలికెడి మాటలు నిక్కువములు
కాని తొందర పాటును మాని, దీని
అసలు నిగ్గును తేల్చుటే అవసరమ్ము
బుద్ధి బలమించుక చూపుము కుచేలా 
ప్రజలే ప్రభువులై రాజ్య పాలనమ్ము
జరుపు కొనెడు ప్రజాస్వామ్య జగతి నీది
నీ ప్రభుత్వము నీవె నిందింతువేని
నీవె నిన్ను నిందించు చున్నావు వినుము


Palli Balakrishna Friday, April 8, 2022


చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల
నటీనటులు: హరనాథ్, జమున, బేబీ (కుట్టీ) పద్మిని, గరికపాటి వరలక్ష్మి
దర్శకత్వం: కృష్ణన్-పంజు
నిర్మాతలు: ఏ.వి.మరియప్పన్
విడుదల తేది: 1966

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం: 1
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
అంత మనిషిలో దేవుడే మాయమగునులే
అంత మనిషిలో దేవుడే మాయమగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం: 2
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 3
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
మాయమర్మమేమి లేని బాలలందరు
మాయమర్మమేమి లేని బాలలందరు
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే


***********   ********  *********


చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్, పి. సుశీల


పల్లవి :
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

చరణం: 1
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం: 2
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురుల మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడి సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం: 3
నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


***********   ************  ************



చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు

హల్లో మేడం సత్యభామ పైనకోపం లోన ప్రేమా
నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..
నీవులేని జీవితమే పెద్ద శాపం..
లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ...డూ... భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా......

హల్లో మేడం సత్యభామ .. భామా
పైనకోపం లోన ప్రేమా .. ప్రేమా..
నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..లోకం..
నీవులేని జీవితమే పెద్ద శాపం..
లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ..

చరణం: 1
ఇంకా బిడియమేలా ... ఏలా.. నన్నే నమ్మలేవా....లేవా
నాపై జాలిరాదా... రాదా.. హృదయం విప్పరాదా....
లా లా లా..లా..లా...లా...లా... లా..లా....లా...లా....లా
దైవం ఏమిచేసే... చేసే.... స్త్రీనే సృష్టి చేసే ... చేసే..
స్త్రీనే సృష్టి చేసి....చేసి... మాపై విసిరివేసే....
లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ...డూ... భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !!
లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ..

చరణం: 2
హంసా..లాంటి వాకింగ్....వాకింగ్..
హల్వా.. వంటి టాకింగ్.....టాకింగ్
చాలూ చాలు కాలేజీ... కాలేజ్.. చేస్కో ఇంక మ్యారేజ్....
అమ్మాయిగారి మౌనం... మౌనం.. తెలిసే... మాకు అర్థం.... అర్థం
మదిలోన వున్నమాట.... మాట.. కనులే పలుకునంటా...
లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ...డూ... భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !!
లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ..


Palli Balakrishna Tuesday, August 22, 2017

Most Recent

Default