Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Abhimanavanthulu (1973)





చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
నటీనటులు: కృష్ణంరాజు, శారద, అంజలీ దేవి
దర్శకత్వం: కె.ఎస్.రామిరెడ్డి
నిర్మాతలు: ఎమ్.రామకృష్ణారెడ్డి, బి. నరసింహారావు
విడుదల తేది: 01.01.1973



Songs List:



ఈ వీణ పై న పలికిన రాగం పాట సాహిత్యం

 
చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం:  సి. నారాయణ రెడ్డి
గానం:  పి.సుశీల

ఈ వీణ పై న పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం
మీటితే మోగేది రాగం
ఎదమాటుగా పెరిగేది. అనురాగం
కలిమిలోన మిడిసిపడనిది
లేమిలోన కలతపడనిది
ఇరువురి నడుమ ఎల్లలు లేనిది
వలచిన హృదయాల తొలి కలయిక

కనిపించే ఆతని చిరునవ్వులోన
కవితల కందని మధురభావన
ఆ భావనయే ఆరాధనగా
అతనికి నేనే ఒక కానుక




ఓ మనసు దోచిన చెలికాడా పాట సాహిత్యం

 
చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం:  దాశరథి
గానం: యస్.పి. బాలు,  పి.సుశీల

ఓ మనసు దోచిన చెలికాడా
మమత పెంచిన చినవాడ
ఎన్ని జన్మల పుణ్యఫలమో
నిన్ను నన్నూ కలిపితే

ఓ చిలిపి నవ్వుల చిలకమ్మా
వన్నె చిన్నెల చిన్నమ్మా
నీకు నా పై ఇంత ప్రేమ
ఎందుకోసమొ చెప్పవా

చందమామ చెలిమి కోడను
కలువభామ ఎందుకోసం?
గోరువంకను రామచిలుక
కోరుకుంది ఎందుకోసం
మనలోని అనురాగం
పెనవేసింది అందుకే

వలపుకోరీ కన్న వారికి
దూరమైన చిన్నదానా
నీవు నన్ను వలచినపుడే
జీవితంలో పూలవాన
నీమనసే నాదైతే
లేనిది ఏదీ లేదులే



చేయగలిపీ మనసు నిలిపి పాట సాహిత్యం

 
చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం:  కొసరాజు
గానం: యస్.పి. బాలు,  పి.సుశీల, నవకాంత్ , కౌసల్య బృందం

చేయగలిపీ మనసు నిలిపి
చేలు దున్నాలిరా
సిరులు పొంగాలిరా

చేయగలిసి మనసు నిలిపీ
చేలు దున్నాలిరా
సిరులు పొంగాలిరా

చెమటదీసీ, వళ్ళువంచి
చాకిరి చెయ్యాలిరా

వీటు టోయిన బీటినేలను
పాటుకు తేవాలిరా

కన్నతల్లిగా
కల్పవల్లిగా

కన్నతల్లిగా కల్పవల్లిగా
ఏ ప్రొద్దు భూమాత
వెన్నాని నిలవాలిరా
చేయగలిపి...

ఇంటి ఇల్లాలు జంటగావుండి
వెంటరావాలిరా
కంటి సైగతో గట్టు పైనుండి
కలకల నవ్వాలిరా

పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా
సంసారం ముందడుగు వెయ్యాలిరా
చేయగలిపి...

మనిషిని నమ్మితే ఫలితం లేదురా
మట్టిని నమ్మాలిరా
కడవల పాలూ కమ్మగ పిండే
గోవును నమ్మాలిరా

కరువు తీరగా
ఆశలూరగా
కరువుతీరగా, ఆశలూరగా
సరదాగ మన బ్రతుకు జరిగేనురా

చేయగలిపీ...



ఉయ్యాలా.... జంపాలా పాట సాహిత్యం

 
చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం:  దాశరధి
గానం: పి.సుశీల, రామకృష్ణ

ఉయ్యాలా.... జంపాలా
ఊగరా ఊగరా
ఊగరా ఊగరా అందాల బాబూ
కన్నుల్లో కలలెన్నో కదిలేటి వేళ
ఊగరా ఊగరా ఉయ్యాలా... జంపాలా...

భోగాలు భాగ్యాలు విడిచీ
తనవారినందరినీ మరిచి
నిరు పేదనగు నన్ను మెచ్చిందిరా
మీ అమ్మ నా వెంట వచ్చిందిరా

ఆలనాడు గౌరి ఆ శివునికోరి
తనతండ్రి నెదిరించి రాలేదా
మగువలకు ఆతల్లి ఆదర్శమే కాదా
ఉయ్యాలా.... జంపాలా.....
బంగారు వుయ్యాల లేదురా నీకు
అద్దాల మేడల్లు లేవురా
మీ అమ్మ ఒడి నీకు ఉయ్యాలరా
మీనాన్న హృదయమే ఆదాల మేడరా
అనురాగమొలికే పతి చెంతవుంటే
చిరునవ్వు చిలికే : సిపాషవుంటే
ఇల్లాలి కింకేమి కావాలిరా
ఉయ్యాలా... జంపాలా....



ఎప్పటివలె కాదురా పాట సాహిత్యం

 
చిత్రం:  అభిమానవంతులు (1973)
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
సాహిత్యం:  సి. నారాయణ రెడ్డి
గానం:  వాణీజయరామ్

పల్లవి:
ఎప్పటివలె కాదురా ఎప్పటివలె కాదురా
నా స్వామీ..   ఎప్పటివలె కాదురా
ఈ ముద్దు ఈ మురిపెమే పొద్దు ఎరుగవు లేరా
ఎప్పటివలె కాదురా నా స్వామీ  ఎప్పటివలె కాదురా

చరణం: 1
పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ ఆ...ఆ...ఆ..
పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ

నిన్నలేని రమణీయరూప నవనీతకాంతితో వున్నానురా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
కులుకు కులుకులో పలుకు పలుకులో లలితరాగములు చిలకరింతురా

ఎప్పటివలె కాదురా..
నా స్వామీ   ఎప్పటివలె కాదురా

చరణం: 2
పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..

అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
లాలనం నాదిరా పాలనం నీదిరా
లాలనం నాదిరా పాలనం నీదిరా
వసంతవేళల రసైకలీలల నిశాంతముల పరవశించేమురా

ఎప్పటివలె ఎప్పటివలె కాదురా
నా స్వామి ఎప్పటివలె కాదురా
పా ని స ని గసనిదమ మగసనిదగమగ రినిస
స స రి రి గ గ రిగ రిగ గమ ని గ రి దమని
ఎప్పటివలె కాదురా నా స్వామి 
ఎప్పటివలె కాదురా



ఈ వీణ పైన పాట సాహిత్యం

 
చిత్రం: అభిమానవంతులు (1973) 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
సాహిత్యం: సినారె 
గానం: సుశీల 

పల్లవి:
ఈ వీణ పైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం 
మీటితే మ్రోగేది రాగం
ఎదమాటుగా పెరిగేది అనురాగం 
మీటితే మ్రోగేది రాగం
ఎదమాటుగా పెరిగేది అనురాగం 

ఈ వీణ పైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం 

చరణం: 1
కలిమిలోన మిడిసిపడనిది
లేమిలోన కలత పడనిది 

కలిమిలోన మిడిసిపడనిది
లేమిలోన కలత పడనిది 
ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 
ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 
వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ.. 

ఈ వీణ పైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం 

చరణం: 2
కనిపించే ఆతని చిరు నవ్వులోనా
కవితలకందని మధురభావన.. ఆ.. 

కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  కవితలకందని మధురభావన 
ఆ భావనయే ఆరాధనగా...  
ఆ భావనయే ఆరాధనగా
అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ 

ఈ వీణ పైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం
మీటితే మ్రోగేది రాగం
ఎదమాటుగా పెరిగేది అనురాగం 

ఈ వీణ పైన పలికిన రాగం
నాలోన విరిసిన అనురాగం 

No comments

Most Recent

Default