Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ongole Githa (2013)




చిత్రం: ఒంగోలు గిత్త (2013)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్ , మణిశర్మ
నటీనటులు: రామ్ పోతినేని, కృతి కర్బంద
దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: బి.వి.యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 01.02.2013



చిత్రం: ఒంగోలు గిత్త (2013)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: వనమాలి
గానం: శంకర్ మహదేవన్

ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం

ఎర్రా మిరపల్లొ ఎంతుందో కారం
కుర్రా గుండెల్లో అంతే అంగారం
జారి పొకుండా చుస్తా ఈ బేరం
వెసే దమ్ముందా నాతో పందేరం
మిర్చి మార్కెట్టె ఆదారం మంచే మా ఆచారం
రామ రామ జై సీతరామ
గుండె లోతుల్లొ లోడ్ ఎంత ఉన్నా
దిక్కు నేనంటు దించేస్త బారం
మల్లా పండిస్త ఈ వైపు సారం
కొట్టు మొత్తంగా ఈడె బంగారం

ఈ మర్కెట్టేగా నా పుట్టిల్లంటా
నన్ను మోసింది ఈ ధర్మ కాంట
మీ మంచి చెడ్డా నా చుట్టాలంట
నన్ను పెంచింది మీ అండ దండ
హె మిర్చి కన్నా హాటు మీ పంచే ప్రేమ ఘాటు
కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ
హె మిర్చి కన్నా హాటు మీ పంచే ప్రేమ ఘాటు
కొరేదొక్కటెగా మీలోనె ఇంత చోటూ

నా మాటల్లొ చేతల్లో గుండెల్లొ
లెదయ్యొ లోటు ప్యూరు వైటు
నేను కొట్టేది అచ్చంగ నాటు
మాట తప్పింద నా మీద ఒట్టు
రాములోరింట హనుమయ్య లాగ
వీడు వెయ్యెల్లకి మీకు బంటు

నేనుండె చోటు సందల్లేనంట
నా దోస్తికి నీ చెయ్యి చాపు
ఓ నేస్తం లాగ నేనొచ్చానంట
మీ అందరికి నేనేరా చూపు
ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసే ఏ నిజాన్నైన చంపు
ఓ నిజం చావకుండ వెయ్యి అబద్దాలు చెప్పు
ఈ క్షణం కీడు చేసే ఏ నిజాన్నైన చంపు
ఈ లోకం నీ వెన్నంటే సాగేల
నీ సత్తా చూపు దుమ్ము రేపు
నేను యాడుంటె ఆడేరా ఊపు
నువ్వు చిందెసెయ్ ఇంకొంచెం సేపు
మల్లీ రాదింక ఈ చిన్ని లైఫు
నువ్వేం చెయ్యాలొ చెసై ఈలోపు





చిత్రం: ఒంగోలు గిత్త (2013)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: వనమాలి
గానం: జి. వి. ప్రకాష్ కుమార్

రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...
ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా
ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు
ఒ ఎన్నడయిన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా...

రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...

ఏడుస్తున్నా చిరాగ్గా
కాదంటుంటే ఎలాగా
ఈ సరదాలె నిజంగ
ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతము మీకు తోడుగా…

ఓ రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...

ఓ ముల్లు పువ్వు ముడేస్తె
అంతో ఇంతో అవస్తే
పాలు నీరై కలుస్తే
తదాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వగా.. నీకు శ్రీమతే…

రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...
ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా
ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు
ఒ ఎన్నడయిన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా..

రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...





చిత్రం: ఒంగోలు గిత్త (2013)
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్యం: వనమాలి
గానం: రంజిత్

నీకిచ్చిందీ సరిపోదె ఇంకా మిగిలుందే
ఏ పిల్లా...
నీ అందమంత అర్దరేత్రి గోల చేసెనా
అందుకే నే గోడ దూకినా
ఏ పిల్లా...
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా
ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుమొంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దే
ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే

ఏ పిల్లా... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గోడ దూకినా
ఏ పిల్లా... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా

పెదవుల్లో తియ్యగుంటదా
నీ యెదపైనే వెచ్చగుంటదా
నడుమైతే మస్తు మస్తుగా ఉంటదా
చెంపల్లో హాయిగుంటదా
నీ వొంపుల్లో ఘాటుగుంటదా
ఎక్కడె కొత్తగా మత్తుగా ముద్దుగా
నిన్ను ముద్దాడె చోటే
ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే

ఏ పిల్లా.... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గోడ దూకినా
ఏ పిల్లా.... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా

దొంగల్లే ఒక్కటిచ్చినా ఆ ముద్దేమొ కమ్మగుంటదా
నలుగురిలో ఎన్ని ఇచ్చినా నచ్చదా
ఇంకానే ఇవ్వకుండనే ఊపేస్తోంది కొంటె ఊహనె
నేరుగా ఇప్పుడె ఈ ముద్దులో తేలితె ఇంకెట్టాగుంటాదో
ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే

ఏ పిల్లా... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గోడ దూకినా
ఏ పిల్లా... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా
ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుమొంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దే
ఇన్నాల్లు తోచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే





చిత్రం: ఒంగోలు గిత్త (2013)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేంద్ర, సాహితి

చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె
లంగా వోనితో అబో అబో అబో
లంగరే వేశావె చాల్ చాల్లె
గల్లా లుంగితో గబా గబా గబా
గత్తరే చేశావె చాల్ చాల్లె
వొలె వొలె వొలె పుల్లటి గోంగూర కట్టా
పులుపుతొ చంపింది చాల్లె
వొరె వొరె వొరె పిల్లడ ఒంగొలు గిత్త
యెగబడి దూకింది చాల్లె

చాల్ చాల్లె చాలు చాల్లె చూసింది చాలు చాల్లె
చాల్ చాల్లె చాలు చాల్లె చేసింది చాలు చాల్లె

నువ్వట్ట నవ్వుతు ఉంటె
యెడాపెడా యెడాపెడా కిందపడి దొర్లేసి
గిల గిల లాడిపోద్ది నా చిట్టి గుండెకాయ్
మిల మిల మెరిసిపోద్ది నా కంటి పాపాయ్
నీ చెయ్యి తగిలిందంటె
దడ దడ దడ దడ పిడుగేదొ మీద పడి
పట పట రాలిపోద్ది సిగ్గి సీమ సింతకాయ్
తేరగ దొరికిపోద్ది దోర దోర జాంకాయ్
రోకలెట్టి ధనా ధనా దంచకు చాల్లె
ఆకలినె యమా యమా పెంచకు చాల్లె
వచ్చేశ కదా వడ్డిస్త పదా
పస్తుల్నే పడి పడి ఉన్నది చాల్లె
పిట పిట పిట నడుములో తిరగలి పుత్రాన్ని
గర గర తిప్పింది చాల్లె
కిట కిట కిట పెదవుల పటికబెల్లాని
కొర కొర కొరికింది చాల్లె

హై రామ వయ్యారి భామ
హొయ్ రామ ఎం హొయలొ యమ యమ

నీ అందం ఇరగేస్తుంటె యెకా యెకి లగెత్తుకు
వచ్చానె కునుకుచెడి
చక చక వదులుకోన ఒంపుల దానిమ్మకాయ్
ఒదులొదిలున్న గాని ఎక్కడి ఈ కొక్కిరాయి
నన్నిట్టా పొగిడేస్తుంటె యెగాదిగా నీదేకదా
నా వయసు వక్కపొడి
నలుగురి ముందరిలా టాం టాం చెయ్యకొయ్
చనువుగ నెత్తిమీద వేస్తా మొట్టికాయ్
జీలకరా బెల్లం పెట్టి మొగుడవుతాలె
తాలిబొట్టు మెడ్లో కట్టి తోడవుతాలె
అయితె నెన్ రెడీ అమ్మోరు గుడి
యాడుందొ గల్లీ గల్లీ వెతికేద్దాం లే
గుడు గుడు గుడు గుంజమె ఆడేద్దాం రావె
గొడవలు చేసింది చాల్లె
రుచి మరిగిన కొడిలా గోడెక్కి చూస్తు
తలగడ నలిపింది చాల్లె

Most Recent

Default