Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sravana Sandhya (1986)
చిత్రం : శ్రావణ సంధ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని, విజయశాంతి
దర్శకత్వం: కొండల రామిరెడ్డి
నిర్మాత:
విడుదల తేది: 1986

రండి శ్రీవారు రాదు ఈ రోజు
కలహాలు  పెంచనేల విరహాన ముంచనేల
పాలు పులు పడుచందాలు మరిగేవేళల్లో
హ హ హ ..ఆ..ఆ..ఆ..

రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు
కోపాలు పెంచానేలా
తాపాన ముంచనేల
కళ్ళు ఒళ్ళు నిదరే రాక కుమిలె వేళ్ళల్లో
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

రండి శ్రీవారు రాదు ఈ రోజు
ఎలా ఈ కంగారు

కావేరి లేనిచోట శ్రీరంగమా
కౌగిళ్ళు లేని బ్రతుకు సంసారమా
ముద్దు మురిపాలు ఇక చెల్లించరా
తప్పో మరి ఒప్పో నను మన్నించరా
బెట్టు బింకం తకంతుంటే మాకేంతుండాలి
పట్టు పంతం విడవకపోతే మేమేం చెయ్యాలి
సంసారమంటే సంగీతమమ్మ
శ్రుతి మించిపోతే సుఖముండదమ్మ
వేళాపళా లేనేలేదా వెనకటి గోడవేలా
హా..హా..హా.

రండి శ్రీమతిగారు ...రండి శ్రీవారు ...

అలకోచ్చినమ్మకేంతో అందాలంట
అదికాస్తా తగ్గగానే అందాలంట
చాల్లెండి
నెలలు వెన్నెలలు ఇక పండించవా
చెలిగా నెచ్చెలిగా నను లాలించవా
పెళ్ళామిప్పుడు గుర్తొచ్చిందా
దారికి వచ్చారా ...పోదు
గూట్లో దీపం పెట్టన్గానే గదిలోకోచ్చారా
కయ్యాలు కూడా కవ్వింతలంట
వయ్యరమింకా మీ సొంత మంట
మాట మంచి అన్ని ఉండి మనకీ తగవేలా
ఆ.ఆ.ఆ...హ.. హ

రండి శ్రీవారు రాదు ఈ రోజు
రండి శ్రీమతిగారు ఎలా ఈ కంగారు
చిత్రం : శ్రావణ సంధ్య (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి, పి. సుశీల

పప పపపపా పపపపప
పప పపపపా పపపపప

ప్రియతమ లలనా
గోరింటాకు పొద్దుల్లోన
తాంబూలాల ముద్దిస్తావా కొసరీ కొసరీ
సన్నాయంటి నడుమే ఇచ్చి సందేళలో

ప్రియతమ వదనా
తాంబూలాల ముద్దే ఇస్తే
పరువాలన్ని పండిస్తావా వలచీ పిలచీ
కవ్వించేటి కన్నే కొట్టి కౌగిళ్ళతో

లాలాల లలలలలాల
లాలాల లలలలలాల

సంపంగి పువ్వుల యెన్నలలోన
పచ్చని సాయంత్రమే దాగిపోయే
పున్నమిలో పువ్వుల దోసిలిలోన
గాలికి గంధాలు చెలరేగిపోయే

సొగసుల రుచులే చూడాలంట
వయసులు పరువం రావాలంట
కలలే నిజమై కలలే నిజమై
సిగ్గేపుట్టి చిరునవయ్యే రసలీలలో
ప్రియతమ వదనా

తాంబూలాల ముద్దేఇస్తే
పరువాలన్ని పండిస్తావా - కొసరీ కొసరీ
సన్నాయంటి నడుమే ఇచ్చి సందేళలో

వేసంగి నీ ఎద ఊపిరి సోకి 
పెదవులలో తేనెలే కాగి పోయే
అలకల్లో అందాలెన్నో పెరిగి 
తీరని దాహాలు సుడిరేగిపోయే
వదలో జీర్ణం వెలగాలంట
ఎదలో వెన్నెల చిలకాలంటా
మనలో మనమై మనలో మనమై
కాలం లోతు అన్నీ మరిచే బంధాలలో

ప్రియతమ లలనా
గోరింటాకు పొద్దుల్లోన
తాంబూలాల ముద్దిస్తావా కొసరీ కొసరీ
సన్నాయంటి నడుమే ఇచ్చి సందేళలో

ప్రియతమ వదనా
తాంబూలాల ముద్దే ఇస్తే
పరువాలన్ని పండిస్తావా వలచీ పిలచీ
కవ్వించేటి కన్నే కొట్టి కౌగిళ్ళతో


No comments

Most Recent

Default