Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Folk Song: Kallajodu College Papa



పాట: కళ్ళజోడు కాలేజి పాప  
సంగీతం:  సాగర్ కొండు
సాహిత్యం: 
గానం: సాగర్ కొండు
విడుదల: 2021



కళ్ళజోడు కాలేజి పాప పాట సాహిత్యం

 
పాట: కళ్ళజోడు కాలేజి పాప  
సంగీతం:  సాగర్ కొండు
సాహిత్యం: 
గానం: సాగర్ కొండు

కళ్ళజోడు కాలేజి పాప

ఓహో కాలేజి పాప...
ఎవరూ...
కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది

కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది (2)

మిడ్డీ పాప, అరెరరే మిడ్డీ పాప
మిడ్డీ పాప మిడ్డీ పాప మిడ్డీ వేసుకోనున్నది
షెటిల్ ఆడమంటున్నది
చెంగు చెంగు నెగురు తున్నది
షాట్ కొట్టి సై అన్నది

కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది

జీను ప్యాంట్, అరెరరే జీను ప్యాంట్
బలే బలే జీను ప్యాంట్ పాపను చూస్తే
మనసు లాగుతవున్నది మంత్రమేసినట్టున్నది
మత్తు ఎక్కిస్తున్నది మందాకిని కళ్ళది

కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది

అబ్బా అబ్బా అబ్బా అబ్బా
అబ్బబ్బబ్బాబ్బా....
సిమ్రాన్ రేసు... అరెరె సిమ్రాన్ రేసు సైడ్ బల్బ్ 
చిత్రమైన గా చిన్నది చిగ్గులడుగుత ఉన్నది
చిన్న నవ్వు నవ్వుతున్నది నన్ను వెంట రమ్మన్నది

కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది

లక్స్ పాప అరెరే లక్స్ పాప
అరెరరే లక్స్ పాప లక్స్ పాప లంచ్ కొస్తనన్నది
ఐ లవ్ యూ అంటున్నది
లవ్లీ కనుల చిన్నది లైఫ్ లాంగ్ ఉంటన్నది

కళ్ళజోడు కాలేజి పాప కాలేజ్ పోతున్నది
ఖతర్నాక్ గా ఉన్నది
కత్తిలాంటి గా కుర్రది కందిరీగ నడుమున్నది

లవ్లీ కనుల చిన్నది లైఫ్ లాంగ్ ఉంటన్నది
లవ్లీ కనుల చిన్నది లైఫ్ లాంగ్ ఉంటన్నది
అరెరె లవ్లీ కనుల చిన్నది లైఫ్ లాంగ్ ఉంటన్నది

Palli Balakrishna Saturday, May 27, 2023
Folk SOng: O Pillo Mounika



పాట: ఓ పిల్లా మౌనిక
సంగీతం: రవి నాయక్
రచన: సింధూరం రమేష్ 
సింగర్: వీరేంద్ర నాయక్
ఆడియో లేబుల్: లలితా రికార్డింగ్ స్టూడియో



ఓ పిల్లా మౌనిక పాట సాహిత్యం

 
పాట: ఓ పిల్లా మౌనిక
సంగీతం: రవి నాయక్
రచన: సింధూరం రమేష్ 
సింగర్: వీరేంద్ర నాయక్ 

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

నీ సన్నాని... నీ సన్నాని
నీ సన్నాని నడుములో చైనావాలే ఊగుతుందే పిల్లో
నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో

నీ సన్నాని నడుములో చైనావాలే ఊగుతుందే పిల్లో
నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఎర్రా ఎర్రాని కుర్రాదాన నేరేడు కల్లదాన
వస్తినే పిల్లో దోర పల్ల కోసం
కోరి వచ్చా పిల్లో నీ సాయం కోసం
నీ తమలపాకు సోకు చూసి నీ గంపలో పల్లు చూసి  
వస్తిని పిల్లో దానిమ్మలకోసం 
నువు చెయ్యక పిల్లో నా కళ్ళకు మోసం 

ఆ గంపల్లో... నీ గంపల్లో...
నీ గంపల్లో దాచిన దానిమ్మ పల్లె నాకు కావాలమ్మో
తనివి తీరాలంటే కొరికి చూడాలమ్మో

నీ గంపల్లో దాచిన దానిమ్మ పల్లె నాకు కావాలమ్మో
తనివి తీరాలంటే కొరికి చూడాలమ్మో

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

నీ ఊట బావి పొలంకాడ వంగతోట వలపు కాడి 
వస్తిని పిల్లో నీ కాయల కోసం
బుట్ట తెస్తిని పిల్లో కూరగాయల కోసం
నీ హంస లాంటి నడక చూసి
నెలవంకల రూపు చూసి వస్తిని పిల్లో నీ కాయల కోసం
గేలమేస్తిని పిల్లో యా పిల్లాకోసం

నీ ఎర్రాని నీ ఎర్రాని
నీ ఎర్రాని నిగనిగలా యాపిల్ పండే
ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగేదెట్టా పిల్లా నిను చూస్తుంటే

నీ ఎర్రాని నిగనిగలా యాపిల్ పండే
ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగేదెట్టా పిల్లా నిను చూస్తుంటే

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఓ రింగు రింగు బిళ్ళదాన 
రూపాయి దండ దాన
చూస్తవ పిల్లో నా బారెడు మీసం
చూపిస్తవ పిల్లో నిమ్మకాయల రోషం
నా మీసాల రంగు నలుపు నీ నిమ్మకాయ పులుపు 
తిరిగెను పిల్లో మన కథలో మలుపు 
కాదనకే పిల్లో నీ చెయ్యే కలుపు 

ఓ వయ్యారి... ఓ వయ్యారి...
ఓ వయ్యారి వన్నెలాడి నిన్నే చూసి మతి పోయేటట్టు 
అలా తిప్పకె నడుము ఆకలయ్యే టట్టు 

ఓ వయ్యారి వన్నెలాడి నిన్నే చూసి మతి పోయేటట్టు 
అలా తిప్పకె నడుము ఆకలయ్యే టట్టు 

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఓ వాలు జడల పిల్లదాన సిగపూల చిన్నదాన
నమ్మవే పిల్లో నీ పువ్వు నాకోసం
కొని తెచ్చా పిల్లో వెండి మువ్వలు నీకోసం 

నీ బట్టలోని బంతిపూలు సన్నని జాజిపూలు 
చూస్తావ పిల్లో కనకాంబరాలు మల్లెలు
ఇస్తవ పిల్లో నీ చామంతి వరహాలు 

నీ సిగలోన... నీ సిగలోన...
నీ సిగలోన తెల్లాని మల్లె పూలే నను లాగుతుంటే 
నే ఆగేదెట్టా నడుం ఊగుతుంటే 

నీ సిగలోన తెల్లని మల్లె పూలే నను లాగుతుంటే 
నే ఆగేదెట్టా నడుం ఊగుతుంటే

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

Palli Balakrishna
Song: Manduloda Ori Mayaloda



సాంగ్: మందులోడో ఓరి మాయలోడా...
ఆల్బమ్: జానపద నవరాత్రులు 
సంగీతం: జి.ఆనంద్ (ఒరిజినల్)
రచన: భూషణ్ దువ
సింగర్: కె.మునయ్య, స్వర్ణలత (ఒరిజినల్) సునీత, జంగిరెడ్డి
తేది: 06.02.1995 



మందులోడో ఓరి మాయలోడా... పాట సాహిత్యం

 
సాంగ్: మందులోడో ఓరి మాయలోడా…
ఆల్బమ్: జానపద నవరాత్రులు 
సంగీతం: జి.ఆనంద్ (ఒరిజినల్)
రచన: భూషణ్ దువ
సింగర్: కె.మునయ్య, స్వర్ణలత (ఒరిజినల్) సునీత, జంగిరెడ్డి
తేది: 06.02.1995 

రాళ్ళ నకిలేసు పెట్టేటిదాననురా
రాళ్ళ నకిలేసు, రాళ్ళ నకిలేసు
రాళ్ళ నకిలేసు పెట్టేటిదాననురా
రాగి ఉంగరాల… రాత రాసినావురో
మందులోడో మందులోడో… ఏయ్
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
తకదినకిరి తకదినకిరి… తకిట తకిట తకిట తకిటత

మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మందులోడన్న సంగతి ముందెరెకవంటే… నాంచారమ్మో, ఓయ్
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
తకజనకిరి తకజనకిరి… తకిట తకిట తకిట తకిటత

మేడ మిద్దెల్లో, మేడ మిద్దెల్లో
మేడ మిద్దెల్లో… బతికేటి దాననురా
మేడ మిద్దెల్లో… బతికేటి దాననురా
పూరి గుడిసెలో… రాత రాసినావురా

మందులోడో మందులోడో… ఏయ్
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
తకదినకిరి తకదినకిరి… తకిట తకిట తకిట తకిటత

మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మందులోడన్న సంగతి ముందెరెకవంటే… నాంచారమ్మో, ఓయ్
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
తకజనకిరి తకజనకిరి… తకిట తకిట తకిట తకిటత

సిలుకు చీరెలు, సిలుకు చీరెలు
సిలుకు చీరెలు… కట్టేటిదాననురా
చిరిగిన చీరలోన… రాత రాసినావురా

మందులోడో మందులోడో… ఏయ్
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
మందులోడో ఓరి మాయలోడా… మామ రారో గోగు చిన్నవాడా
తకదినకిరి తకదినకిరి… తకిట తకిట తకిట తకిటత

మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మాట మాటకు మాటిమాటికి… మాట మాటకు మందులోడంటావ
మందులోడన్న సంగతి ముందెరెకవంటే… నాంచారమ్మో, ఓయ్
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
నాంచారమ్మో నాంచారమ్మో… నా ముద్దుల గుమ్మా
గోవిందమ్మో గోడ మీది బొమ్మా
తకజనకిరి తకజనకిరి… తకిట తకిట తకిట తకిటత

Palli Balakrishna Friday, May 26, 2023
Song: Allahe Allaha



సాంగ్ : అల్లా హే అల్లా…
సంగీతం: మదీన్ SK
రచన: లక్ష్మ న్
సింగర్: రామ్ (అద్నాన్)
ఆర్టిస్ట్స్: టోనీ కిక్ , సునీత , నజ్మా మున్నా 
డైరెక్టర్: బుల్లెట్ బండి లక్ష్మన్
ప్రొడ్యూసర్: రఘు లవాద్య



అల్లా హే అల్లా... పాట సాహిత్యం

 
సాంగ్ : అల్లా హే అల్లా…
సంగీతం: మదీన్ SK
రచన: లక్ష్మ న్
సింగర్: రామ్ (అద్నాన్)


కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే

సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు

యే ధువా మిల్ జాయె వఫా యే తో
అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండానిపించెనే పిల్లా

నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
ఇలా కలిపెను… మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా ఆమెలే… నజుమా అందదే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
అల్లా మహిమనే అనుకుందున పిల్లా

నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
తోడుగొస్తదా పేదోడి ఇంటికి
జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
(యే ధువా మిల్ జాయె వఫా యే తో)

అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

Palli Balakrishna
Folk Song: Pulsar Bike (Female Version)



సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version)
సంగీతం: సాయి,& సంతోష్ 
రచన: యల్లింటి రమణ 
సింగర్: దివ్య జ్యోతి 
ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్



పల్సరు బైక్ (Female Version) పాట సాహిత్యం

 
సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version)
సంగీతం: సాయి,& సంతోష్ 
రచన: యల్లింటి రమణ 
సింగర్: దివ్య జ్యోతి 

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ

నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ

నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావ

కాలేజీ టైములోన… కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురా
నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ

కాలేజీ టైములోన… కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురా
నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ

పంచ మామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురా
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ

పంచ మామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురా
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సనువివ్వను బావ

నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పిలవగా నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రాను బావా

Palli Balakrishna
Folk Song: Pottidayi Kadammo Gatti Dayammo



సాంగ్: పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
రచన: యల్లింటి రమణ 
సింగర్: యల్లింటి రమణ 
సంగీతం: సాయి,& సంతోష్ 
ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్



పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో పాట సాహిత్యం

 
సాంగ్: పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
రచన: యల్లింటి రమణ 
సింగర్: యల్లింటి రమణ 
సంగీతం: సాయి,& సంతోష్ 
ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది
ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాది
కాకినాడ సెంటర్లో కన్ను కొట్టినాది
ఆ శ్రీకాకుళం జంక్షన్లో చెయ్యి పట్టినాదీ

మధురవాడ సెంటర్లో ముద్దులాడినాదీ
ఆ బుగ్గ మీద మరక జూస్తే… మనసే లాగింది

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది
అష్టపురం సెంటర్లో ఆటలాడినది
చీపురుపల్లి జంక్షన్లో సరసమాడినాది
ఆ అష్టపురం సెంటర్లో ఆటలాడినాది

బెజ్జిపురం సెంటర్లో బాలుడు పుట్టాడే
ఆ బాలుడికి రమణగాడు పేరే పెట్టాడే

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి
ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి
గుంటూరు రోడ్డు మీద గొడవలయ్యినాయి
ఆ విజయవాడ కోర్టులోన విడాకులయ్యినాయి
మల్కాపురం సెంటర్లో మళ్ళీ కలిసినాది
మల్లెపూలు చూపించి మంచమెక్కినాది

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
పావుసేరు ముక్కు పుడక ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
దీనికి పావుసేరు ఉగరము ఎక్కువాయమ్మో
పొట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మో
ఇది మొగడు కొట్టిన దెబ్బలకు లొంగదయమ్మో

Palli Balakrishna
Folk Song: Pulsar Bike (Male Version)



సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version)
సంగీతం: సాయి,& సంతోష్ 
రచన: యల్లింటి రమణ 
సింగర్: యల్లింటి రమణ 
ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్



పల్సరు బైక్ మీద రార బావ పాట సాహిత్యం

 
సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version)
సంగీతం: సాయి,& సంతోష్ 
రచన: యల్లింటి రమణ 
సింగర్: యల్లింటి రమణ  

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గి పెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ...

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ….

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రార బావ

కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజేసినావురా
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ

కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజేసినావురా
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ

పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ

పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావురా
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ

నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావో
పిలవగా నేను రాను బావ
నేనట్టాంటిట్టాంటాడదాన్ని కాదు బావ
పల్సరు బైక్ మీద రాను బావా

Palli Balakrishna
Folk Song: Maa Oori Maradala Pilla



సాంగ్ : మా ఊరి మరదలు పిల్లా 
సంగీతం: గణేష్ & జాన్ 
సాహిత్యం: గణేష్ & జాన్ 
సింగర్: యల్లింటి రమణ 
ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్


మా ఊరి మరదలు పిల్లా ు పాట సాహిత్యం

 
సాంగ్ : మా ఊరి మరదలు పిల్లా 
సంగీతం: గణేష్ & జాన్ 
సాహిత్యం: గణేష్ & జాన్ 
సింగర్: యల్లింటి రమణ 

మా ఊరి మరదలు పిల్లా 
ఒక్క చూపు తోటి చంపేస్తావే
మా ఊరి మరదలు పిల్లా 
నీ సొగసులన్ని దోచేస్తాలే 
లాలించే నువ్వు పూజించే పువ్వు 
నాలోనే నువ్వు నిలిచి పోయావు
లాలించే నువ్వు పూజించే పువ్వు 
నాలోనే నువ్వు నిలిచి పోయావు

మా ఊరి మరదలు పిల్లా 
బెంగాలి నా రసగుల్లా
మా ఊరి మరదలు పిల్లా 
నీ గుండెల్లో నిలిచేదెలా

అందమైన ఓ చిన్న దాన
నడుమును చూస్తుంటే నా గుండెలోన
అలజడి ఏదో రేగిందే జాణ 
నిలిచిపోతావే నా మనసులోన (2)

నడిసొచ్చే నెలవంకవి నువ్వే 
నా మనసు నిట్టా దోచేశావే (2)

మా ఊరి మరదలు పిల్లా 
ఒక్క చూపు తోటి చంపేస్తావే
మా ఊరి మరదలు పిల్లా 
నీ సొగసులన్ని దోచేస్తాలే 

వంపు సొంపులున్న ఓ కుర్రదాన
నడకను చూస్తుంటే నా గుండెలోన
లవ్యూ అంటు నీ వెంట నేను పడుతున్నా
ఓకే చెప్పవా ఒక్కసారి ఓ మైనా (2)

బెట్టు చేయకో మరదలా
నీకు కలకాలం తోడుంటాగా
అంత బెట్టు చేయకో మరదలా
నీకు కలకాలం తోడుంటాగా

మా ఊరి మరదలు పిల్లా 
ఒక్క చూపు తోటి చంపేస్తావే
మా ఊరి మరదలు పిల్లా 
నీ సొగసులన్ని దోచేస్తాలే  (2)

Palli Balakrishna
Adipurush (2023)



చిత్రం: ఆదిపురుష్ (2023)
సంగీతం: అజయ్-అతుల్ 
నటీనటులు: ప్రభాస్, సైఫ్ ఆలీఖాన్ , క్రుతిసనన్ 
దర్శకత్వం: ఓం రౌత్ 
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్  కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, వంశి ప్రమోద్ 
విడుదల తేది: 16.06.2023



Songs List:



జై శ్రీరాం పాట సాహిత్యం

 
చిత్రం: ఆదిపురుష్ (2023)
సంగీతం: అజయ్-అతుల్ 
సాహిత్యం: రానజోగయ్య శాస్త్రి 
గానం: 

ఎవరు ఎదురు రాగలరు మీ దారికి
ఎవరికుంది ఆ అధికారం
పర్వత పాదాలు వణికి కదులుతాయి
మీ హుంకారానికి

నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం

మా బలమేదంటే నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం

జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

ధరణి మూర్చిల్లు
నీ ధనస్సు శంకారానాదానికి, జారే హో
గగన గోళాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి, జారే హో

సూర్యవంశ ప్రతాపం, ఓ ఓ
శౌర్యమే నీ స్వరూపం, ఓ ఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం, ఆ ఆ ఆ

సంద్రమైన తటాకం, ఓ ఓ
సాహసం నీ పతాకం, ఓ ఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం

మా బలమేదంటే నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం

జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం

జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం

Palli Balakrishna
Malli Pelli (2023)



చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
నటీనటులు: Dr. నరేష్ VK, పవిత్ర లోకేష్ 
దర్శకత్వం: M.S. రాజు
నిర్మాత: Dr. నరేష్ VK
విడుదల తేది: 26.05.2023



Songs List:



ఉరిమె కాలమా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: అనురాగ్ కులకర్ణి 

ఉరిమె కాలమా ఉరికేదాపుమా
బదులీ ఒకటే ప్రాణమయ్యే
ఇరు దేహాలిలా
ఉండే మాటే నిజమా సెలవియ్

ఏమో ఏమో ఏం చేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

ఏ, ఊరేదైనా తీరేదైనా
దారేదో వేస్తావే ఇద్దరికీ
ఈరోజేది లేనట్టున్నా
ఏం తెస్తావో రెప్పయ్యేసరికి

మౌనంలో ఏ వైనం దాచావో ఓ ఓ
పయనంలో ఏ మార్గం మార్చేస్తావో ఓ ఓ

ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

సత్యం తెలుసు సర్వం తెలుసు
అయినా మాయేదో లాగేస్తుందా
పైనే వయసు లోలో నలుసు
ఏదో చూమంత్రం వేస్తూ ఉన్నా

ఏ మైకం కమ్మిందో మనసంతా ఓ ఓ
ఈలోకం కళ్లల్లో పడితే ఎట్టా ఓ ఓ

ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

ఉరిమే కాలమా, ఆ ఆ ఆ
ఉరికేదాపుమా ఆ ఆ ఆ




రారా హుస్సారు నాతో పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: ఇందు సనత్ 

రారా హుస్సారు నాతో 



కావేరి గాలిలా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: నరేష్ అయ్యర్ 

కావేరి గాలిలా తాకేసి పోకలా
నేనింక ఉండేదెలా
కావేరి గాలిలా తాకేసి పోకలా
నేనింక ఉండేదెలా… ఆ ఆ ఆఆ ఆ

ఆ ఆ తేనె అలల్లో తెలుతుందే
నా మనసే నీ ఊసులు వింటే
సోగ కనుల్లో సోలుతు ఉందే
నా సమయం నీ ఊహన ఉంటే

నీ వెనకాలే నీడగ మారి
సాగుతు ఉందే జన్మే నీ వెంటే

కావేరి గాలిలా తాకేసి పోకలా
కావేరి గాలిలా తాకేసి పోకలా

చేరువలోనే దూరము చూపి
చిన్నగ నవ్వే నీ చెలిమేంటో
జాబిలి నేడు చెంతనే ఉన్నా
వెన్నెల మాత్రం అందదేంటో

ఇంకొక జన్మే అనిపిస్తున్నా
జీవితమింకా మొదలే కాదేంటో

కావేరి గాలిలా తాకేసి పోకలా
కావేరి గాలిలా తాకేసి పోకలా




ఆకాశమే పడిపోని పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ పెళ్లి (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: సంతోష్

ఆఆ ఆ ఆ
ఆఆ ఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ ఆ

ఆకాశమే పడిపోని
భూగోళమే విడిపోని
మేం ఆపములే
ఈ పయనాన్నే

మాది మాకథ మేము గాక
ఎవ్వరు రాస్తారంట
మాయ రాతకు మోసపోక
సాగదా ఇక మా జంట

ఓ ప్రేమా,ఆ ఆ ఆ
ఈ ధీమా, ఆ ఆ ఆ
నీవల్లేనమ్మ ప్రేమ
ఓ ప్రేమా ఆ ఆ ఆ

ఆకాశమే పడిపోని
భూగోళమే విడిపోని
మేం ఆపములే
ఈ పయనాన్నే

Palli Balakrishna
Vimanam (2023)



చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్
నటీనటులు: సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్, రాహూల్ రామక్రిష్ణ 
దర్శకత్వం: శివప్రసాద్ యానాల
నిర్మాతలు: కిరణ్ కొర్రపాటి & జీ స్టూడియోస్
విడుదల తేది: 09.06.2023



Songs List:



రేలా రేలా పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: మంగ్లీ 

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టూ ఉన్నవాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంతకన్న స్వర్గం ఇంకేడా లేదో

ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెఱుకురో
తన హృదయం ఓ కోటరో
నువ్వే దానికి రారాజురో

రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రం ఎక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావాలా

నువ్వు కన్న కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే నాన్నై పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగర నేడు

చరిత్రలు ఎన్నడు చూడనీ
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకుమించి ఏది లేదురో

రేలా రేలా రేలా రేలా
నీదే నింగీ నేలా
నిత్యం పండగల్లె
బతుకు జన్మే ధన్యమయ్యేలా

సిన్నోడా ఓ సిన్నోడా
సిన్న సిన్న మేడ
సిత్తరంగ జూపిస్తాది
సంబరాల జాడ

ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకుమించిన సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా

రేలారేలా రేలారేలా
మనసు ఉరకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా




సుమతే సుమతే పాట సాహిత్యం

 
చిత్రం: విమానం (2023)
సంగీతం: చరణ్ అర్జున్ 
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్

సుమతే సుమతే
నీ నడుములోని మడత చూస్తే
పాణమొనికే వనిత

నువ్ పూసే రంగులన్నీ జూస్తే
నేను పొంగిపొర్లుతా
మత్తెక్కుతాది జూస్తే
ఒల్లంత కల్లు ముంత

తైతక్కలాడుతుందే
నర నరము నాగులాగా

నీ సొత్తు మస్తుగుందే
షాపుల కొత్త చెప్పులెక్క
నీ ఎత్తు పొడవు జూస్తే
పుడుతది మునులకైన తిక్క

సుమతే సుమతే
నువ్వు ఓ లెదరు బూటు లెక్క
నాది హవాయి బతుకు తొక్కా
యాడ తేనే వెయ్యి నీకు
శెప్పు జర ఓ సుమతీ

కలరు జూడ మెరుస్తావు నువ్వు
కయ్యిమని ఎందుకరుస్తావు
రాంగు సైజు చెప్పులెక్క
కరవకే నా సుమతీ

ఎడమకి కుడికి
గింత తేడాలు తెలియకుండా
కుడతనే మట్టసంగ
పాదాల కొత్త జోడు

మట్టిలో కలువలాంటి
నీ మనసు గెలవమంటే
తెలియదే కిటుకు ఏమిటో
నాకు అమ్మ తోడు

ఏ సదువు సంధ్య లేదే
నాకే ఆస్థి పాస్తిలేదే
ఈ గరీబోని మొఖము జూసి
గనువ ధియ్యరాదే

నా కొట్టు సిన్నదైనా
ప్రేమ గట్టిదమ్మ సుమతి
సీ కొట్టకుండ నాపై
దయ సూపరాదే సుమతీ
సుమతే సుమతే

Palli Balakrishna
Mem Famous (2023)



చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
నటీనటులు: సుమంత్ ప్రభాస్ , మణి ఏగుర్ల, మౌర్య  చౌదరి 
దర్శకత్వం: సుమంత్ ప్రభాస్ 
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి, చరత్ చంద్ర , చంద్రు మనోహరన్ 
విడుదల తేది: 26.05.2023



Songs List:



దోస్తులం పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: కాల భైరవ 

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చెనా

మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా

తప్పుల్లోను నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా

నీతో ఉంటూ మాటలు రాని
మౌనం చూడకురా
మౌనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల

స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎపుడు ఉండే
ఆకాశమే కదరా

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

కళ్లలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగనే
ఏమయ్యింది మామా అంటూ
అడిగె గొంతువిరా

నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నువ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా

నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్నా
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తు ఆపనా

గమ్యం చేరే పయనాన్నీ
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమే మాకు లేదు

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం




మినిమమే పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: రాహుల్ సిప్లిగంజ్

ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము
ఏదో లొల్లి జేసేదాక
మేము గమ్మునుండము
దావత్తు బారతుల్ల ఊగుతుంటము
మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము

పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము
పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము
మందికాడ మాటల్లో రెచ్చిపోతము
మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము

మేమంతా చిల్లు రా
లైఫ్ అంతా చిల్లురా
మాతోటి వెట్టుకుంటే
గిప్ప గిప్ప గుద్దుడేరా
వద్దురా వద్దురా
మమ్మల్ని గెలకొద్దురా

మాతోటి మినిమమే మినిమమే
మినిమమే చల్
అరె క్రికెట్ లా మినిమమె
మినిమమే మినిమమే చల్

మాతోటి మినిమమే
మినిమమే మినిమమే
క్రికెట్ లా మినిమమే
మినిమమే మినిమమే

ఆటాడితే మినిమమే
మినిమమే మినిమమే
డైలాగేస్తే మినిమమే
మినిమమే మినిమమే చల్

నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే
ఇడ్లీ వడ ఏదీ లేదు
ఫస్ట్ ఫస్ట్ ఛాయే

మామ రోజు వంద పెట్రోలు
గల్లి గల్లి తిరుగుడే
అన్ని చోట్ల ఖాతాలే
జీవితంలో కట్టేద్ లే

బీరు రేటు పెరిగితే
బాధ పడుత తాగుతాం
బాధ గిట్ల పెరిగితే
రెండెక్కువ తాగుతాం

గెలికింది ఎవ్వడని
చిట్టి మొత్తం తీస్తాం
కొట్టాలనిపించినోడ్ని
దవడ పగలగొడతాం

వద్దురా వద్దురా
ఊరమాస్ గ్యాంగ్ రా
స్కెచ్చేసి పంచిస్తే
ఆగమై పోతవ్ రా
వెళ్లిపో వెళ్లిపో
మేంకొడితే ఫేమసైతవ్

డిస్టెన్స్ మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్
అరె మాతోటి మినిమమే
మినిమమే మినిమమే ప్లీజ్



అయ్యయ్యయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: మేమ్ Famous (2023)
సంగీతం: కళ్యాణ్ నాయక్ 
సాహిత్యం: కళ్యాణ్ నాయక్ & కోటి మామిడాల 
గానం: రాహుల్ సిప్లిగంజ్

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

తన మాటలు చెక్కెరలా
బుక్కినట్టు మస్తుంది లో లోపల
ఎంతుండాలో అంతలా
తియ్యగుంది తన సోపతిలా
అరె రోజులేని ఓ అలజడేదో
పుట్టే గుండె లోతుల్లోన

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఏడు రంగులు నీ నవ్వులొక్కటే
ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే
ఆ మబ్బుల వర్షం లాంటిదే
మన జంటనే

ఎప్పుడొస్తావంటూ ఎదురు చూస్తనే
ప్రతి గంటను ముందుకు తోస్తనే
ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే
కాలాన్ని ఆపేస్తనే

మనసు మనసులా ఉండదే నువ్వొదిలెల్లక
బండరాయిలా బీరిపోత ప్రతి రోజలా
అరె నాకై నువ్వు నీకై నేను
పోదాం పద పై పై కలా

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏవయ్యింది గుండెలోన
నాకు నచ్చిన నా పిల్ల
నాతోనె నడవంగ
ఆగమాయే లో లోనా

ఒట్టేసి నే సెప్పలేనులే
నువ్వు ప్రాణం కన్న నాకు ఎక్కువే
నా మాటల్లోన ప్రేమనెతికితే
ఎట్ల తెలుపనే

నీ కండ్లకు కవితలు సాలవే
నీ సూపుకు వంతెన వెయ్యవే
ఇట్ల రాలిపోని కొత్త పువ్వలే
ఎట్లా పుట్టావే

ఓణీ సొగసులో పడిపోయా మాయదారి పిల్ల
ఏమందం సరస్సువే
నువ్వే నా మల్లె పూలమాల
అరె రోజు లేని ఓ అలజడేదో
పుట్టె గుండె లోతుల్లోనా

అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో
ఏముందిర ముద్దుగుమ్మ
కంటి కింద కాటుకెట్టి
కన్ను కొట్టగానే
కింద మీద ఆయే జన్మ





# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna
Custody (2023)



చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: నాగ చైతన్య , కృతి శెట్టి 
దర్శకత్వం: వెంకట్ ప్రభూ 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల తేది: 12.05.2023



Songs List:



హెడప్ హై లుకింగ్ ఫ్లై పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ 

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా
మఫ్టిలో ఉన్నా మన పవరే పట్టాకీరా
డ్యూటీ లో రౌండ్ ద క్లాక్ ఫుల్ టు చలాకీర
ఈ లాఠీతో జర్నీ చేసే లైఫే ఎంతో లక్కీరా

రోజువారి సర్వీస్ కి రోజాపూల సన్మానాలే
వద్దులే అస్సలే
వెన్నుతట్టి వెల్ డన్ అనో
థాంక్యూ అనో పబ్లికే అంటే
అది చాలే, హ్యాపీలే

శాంతి ఓం శాంతి
మంత్రం మా నినాదం
జాలీ జాలీగా
జనంతో కలిసిపోతాం

కంటి నిద్దర్లు మాని
కావలుంటాం
రక్షించే కర్తవ్యం
మాదంటాం

ఎలాంటి చిక్కులు
చిటికేసి పిలిచినా
శ్రీ విష్ణుమూర్తిల హలో అంటాం
ఏ రాతి వేళలో ఏ గొడవ జరిగినా
చక్రాలకాల్లతో చలో అంటాం

ఉండీ లేన్నట్టు ఉన్నదే
ఫ్యామిలీ టైము
ఫస్ట్ వైఫేగా వేసుకున్న యూనిఫార్మ్
ప్రతి పోలీస్ లైఫే ఇది
సేము టు సేము
ఎంత కష్టాన్నైనా కష్టమనుకోము

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్

హెడప్ హై లుకింగ్ ఫ్లై
గాట్ దా ఫీలింగ్స్
దట్ ద వల్డ్ ఈస్ మైన్
ఫ్రమ్ ద స్ట్రీట్స్ డ్రీమింగ్ బిగ్
బట్ ఏంట్ నో లాంగర్ డ్రీమిన్
దిస్ లెజిట్  




లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్  

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

జల్లులాయె జ్ఞాపకాల చినుకులు
తలుచుకుంటు తడిసిపోన
చిన్ననాటి గుర్తులు

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా

చక్రాల్లా కళ్ళు ముత్యాల్లా పల్లు
నవ్వుకు పడిపోయా
రంగు రిబ్బన్లా ఆ రెండు జెల్లు
ఓ వలేసి లాగుతుంటే కాదనలేకపోయా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అంతే అయ్యిందలా
చూస్తూనే ఎంతో నచ్చేసిందా
బుజ్జి పిల్లా హెయ్ ఏ

స్కూలుమేటు తానే సోలుమేటు తానే
స్కూలుమేటు తానే సోలుమేటు తానే

హే స్కూలుమేటు తానే సోలుమేటు తానే
కలల పుస్తకాన కలరు పెన్సిలైనది

కాలేజి జంట గువ్వలా
నాతోనే ఉన్నది
వంద ఏళ్ళు నీడలా
నీతోనే అన్నది

ఇల్లాంటమ్మాయి ఇల్లాలై వస్తే
అంతకన్నా ఇష్టమైన రాజయోగమేది

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా
కోటలోని రాకుమారి లాలన
తోటరాముడల్లే నేను పాట కట్టి చెప్పనా

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా

నాకై పుట్టింది నన్నే చేరింది
ఆరో తరగతిలో
ఒట్టే పెట్టింది… నా చెయ్ పట్టింది
నన్ను తనలో దాచుకుంది
ఎంత మంచి పిల్లో

టిక్ టాక్ టిక్ టోక్ ఫ్లైటే ఎక్కించనా
నా ప్రేమ స్టోరీ భారీ తెరపై చూపించనా




అమ్మున్ని రుక్కుమణీ పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యువన్ శంకర్ రాజా, ప్రేమ్జి అమరెన్, మనసి మహాదేవన్ 

అమ్మున్ని రుక్కుమణీ
అందమంత నింపుకొని
హత్తేరి అట్టా ఎట్టా పుట్టేసావే నువ్వు

వేళాపాళా చూడనని
యాడనున్నా రయ్యిమని గుర్తుకొచ్చి
కుర్రాన్నేమో కిర్రెక్కిస్తావు

ఇంతమందిలో ఏదైతే అయ్యిందని
నీ మీదికొచ్చి నన్ను చుట్టేస్తావే
ఏందా మోజని ఎవరెన్ని చెప్పినా
పోండ్రా పొమ్మని గెంటేస్తావే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

హెయ్ అల్లరోడు నువ్వు
యెహ వల్ల కాదు నీతో
పడుచందాలతో బిల్లంగోడు ఆడేస్తున్నావే

ఆ, ఎలా చెప్పుకోను
సొద ఇదీ అంటూ నీతో
సోకు తాయిలాలు
నోరూరించి తిప్పిస్తున్నావే

సుట్టూరా కళ్లన్నీ
నిన్ను నన్నే చూస్తుంటే
కూసింత కాసింతైనా పట్టించుకోవే
ఐతే కానీమ్మని సూత్తే సూడనిమ్మని
నీ మైకానా మునిగిపోయా

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

కుర్రా మనసిది
ఇరక్క ఇరక్క పోయెనే
నీపై ప్రేమకు
దొరికి దొరికి పోయెనే

ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే
ఇరక్క ఇరక్క పోయెనే
దొరికి దొరికి పోయెనే





అన్నా తమ్ములంటే పాట సాహిత్యం

 
చిత్రం: కస్టడి (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం:  యువన్ శంకర్ రాజా , విజయ్ యేసుదాస్ 

అన్నా తమ్ములంటే 

Palli Balakrishna

Most Recent

Default