ఫోక్ సాంగ్ : నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా (2023) సంగీతం: మదీన్ SK సాహిత్యం: కుమార్ కోట గానం: హనుమంత్ యాదవ్, అపర్ణ నందన్ నటీనటులు: అమరదీప్ చౌదరి, ప్రియాంక జైన్ దర్శకత్వం: రాజ్ నరేంద్ర నిర్మాత: నివ్రితి వైబ్స్ మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్ విడుదల తేది: 27.10.2023
నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా పాట సాహిత్యం
ఫోక్ సాంగ్ : నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా (2023) సంగీతం: మదీన్ SK సాహిత్యం: కుమార్ కోట గానం: హనుమంత్ యాదవ్, అపర్ణ నందన్ తెల తెల్లవారంగ తెల్లవారంగా తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా ఓ.. బుజ్జి నీ మనసే ముద్దు మాటల మూట సద్ది ఓ.. ఓ కన్నా నిన్ను జూత్తె కరిగిపోయె వెన్నా కుక్కు కుక్కు కూనలమ్మా కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా దింతక్కు దిన్నా బుజ్జి కన్నా భాగ్యమేముందిర అంతకన్నా నింగి నేల సాక్షి నిప్పు నీరు సాక్షి గాలిపటమోలే ఎగిరిపోదామా నువ్వు నేను గూడి గువ్వగోరింకాయి ప్రకృతమ్మ ఒడిలో సేదదీరుదామా నీ ముదుట పలికే కోయిలమ్మా ప్రేమ కురిపించే చల్లని జాబిలమ్మా నీ గుణము మచ్చ సల్లకుండా నీ చెలిమి బంగారుకొండా ఓ కుక్కు కుక్కు కూనలమ్మా కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా దింతక్కు దిన్నా బుజ్జి కన్నా భాగ్యమేముందిర అంతకన్నా ఊడుగు సెట్టుకు ఉయ్యాల గట్టి ఊపనా రత్తాల సారంగి ఊపర ఉయ్యాల నను నిదురపుచ్చగ రావయ్యా బంగారుసామి నిండు పున్నమోలే నీ మోము మెరువవట్టె ఎంత సక్కదనమూ పండు వెన్నెల్ల తీరు నీ నవ్వు అయ్యో వెలుగుతూందిరో ఈ జాము కుక్కు కుక్కు కూనలమ్మా కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా దింతక్కు దిన్నా బుజ్జి కన్నా భాగ్యమేముందిర అంతకన్నా ఇంద్రధనస్సు తెచ్చి నింగి నక్షత్రాల రంగవల్లి సీర నీకు కట్టనా చంద్రవంక తిలకం నీకు నుదుటవెట్టి ఇంద్రలోకానికే రాజు సెయ్యనా గా గలగల పారేటి గోదారి మనకు సూపబట్టే మనువు రహదారి గా కిలకిల పలికేటి పక్షులు పాటబాడి వేస్తున్నాయి అక్షింతలు ఓ కుక్కు కుక్కు కూనలమ్మా కూడి బతుకుదాము రాయే బుజ్జమ్మా దింతక్కు దిన్నా బుజ్జి కన్నా భాగ్యమేముందిర అంతకన్నా తెల తెల్లవారంగ తెల్లవారంగా తొలిపొద్దు రూపమే నీది బుజ్జమ్మా నల నల్ల మబ్బుల్ల నల్ల మబ్బుల్లా నల్ల సాయలు పిలగా రారా కన్నయ్యా
Folk Song: Nalla Nalla Mabbulla (2023)
Palli Balakrishna
Saturday, April 11, 2026
ఫోక్ సాంగ్: కు కు కుమారి సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి సంగీతం: మదీన్ SK గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల
కు కు కుమారి పాట సాహిత్యం
ఫోక్ సాంగ్: కు కు కుమారి సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి సంగీతం: మదీన్ SK గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ… గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క… కుకు కుకుకు కుకు… లష్కర్ జాతర్లనా.. ఆర్మూరం గట్లనా తిరుపతి తిరునాళ్ళనా… అమెరికా ఆగంట్లనా కు కు కుమారి సీరలేడ కొన్నవే సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే కు కు కుమారి సీరలేడ కొన్నవే..? సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే ఆ కంచివరముకు… గా గద్వాల్ సీరకు ఉప్పాడ పట్టుకు… సిద్ధిపేట సీరకు పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని… అన్నిటిని ఫేమస్ జేసినా చిరుగాలికి సీరెగురుతుంటే… యెహె యెహె యెహెయ్ కు కు కుమారి… కెవ్వు కేక ఉన్నవే బొట్టు పెట్టుకున్న… బుట్ట బొమ్మలెక్కగున్నవే కు కు కుమారి సీరలేడ కొన్నవే..? సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే ఆ సందమామను… ఆ వెండి సుక్కను గా మెరుపు తీగను… రంగుల హరివిల్లును కు కు కుమారి… బువ్వ లెక్క తిన్నవా నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే, హెయ్ చింతపండు పిసుకుతూ నిమ్మకాయ పిండుతూ ఇంగువాను సల్లుతూ పులిహోర కలుపుతూ… పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ నీ కోపమెంత ముద్దుగుందే, యే యె ఉమ్మ కు కు కుమారి సుర్రు సూపరున్నవే సూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే… నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ… గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క… కుకు కుకుకు కుకు… ఏనుగెక్కి వస్తనే ఎదురు కట్నమిస్తనే ఏలు పట్టుకుంటనే నిన్ను ఏలుకుంటనే కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే, హే హేయ్ నీ మాయ మాటలు నీ చిలిపి చేష్ఠలు నీ కొంటె సూపులు తెచ్చినాయి నవ్వులు కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా గట్లుంటదే మనతోని మరి కుకు కుకు కుకు కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
Amardeep Chowdary
,
Ku Ku Kumari
,
MovieLyrics
,
Ravi Peetla
,
Sai Prasad Poojari
,
Saketh Komanduri
,
Sekhar VJ
,
SK Madeen
,
Spoorthi Jithender
,
Vishnu Priya
Album: Ku Ku Kumari
Palli Balakrishna
Monday, March 24, 2025
పాట: మోసమే చేయకే ప్రేమా సంగీతం: మదీన్ SK సాహిత్యం: నవ సందీప్ గానం: నవ సందీప్ ఆర్టిస్ట్స్: ప్రేమలత, నవ సందీప్ దర్శకత్వం: రాజ్ నరేంద్ర ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్ విడుదల: 21.01.2021
మోసమే చేయకే ప్రేమా పాట సాహిత్యం
పాట: మోసమే చేయకే ప్రేమా సంగీతం: మదీన్ SK సాహిత్యం: నవ సందీప్ గానం: నవ సందీప్ ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా గుండెల్లొ తన్నావు నొప్పిలేదె నా సొమ్మంత తిన్నావు బాధలేదే మనసుని కాల్చావె మంటలేదె నాపరువంత తీసావు మరపురాదే ఎన్ని చేసినా ఎమి జరిగినా నీపై ఆశ చావదే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా ఊరిలో గాలికే తిరిగేటి నన్నే సక్కనీ దారిలో నడిపించినావే మొద్దుగా మొరటుగా ఉండేటి నాకే స్టైలుగా బ్రతకడం నేర్పించినావే నాపసిడి పాలపిట్టా బంగారు పూలబుట్టా నన్నొదిలిపోతె ఎట్టా నామీద నీకు బెట్టా నాజింక పూల చెట్టా సొగసైన సిరులగుట్టా నువువె ల్లిపోతె ఎట్టా నేనుండలేను ఇట్టా తిట్టినా కొట్టినా సర్దుకుపోతానే ఇల ఒంటరిగా ఒదిలేస్తే తట్టుకోలేనే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా అనాదగా ఉన్న నన్ను ఆదరించినావే ఆలనా పాలనా చూసుకున్నావే ముందు వెనక ఎవరు లేని ఏకాకి నేను తల్లిలా నీఒడిలో జోలపాడినావే నువు రావన్న మాటా అది అగ్నిశకలకూట నిను పొందలేని చోట ఆగిపోదా నాపాట నే కలలు కన్న కోట కూల్చేస్తివె ఈపూట ఇది బొమ్మ బొరుసు ఆట అనుకుంటివె నా తాతా సచ్చినా బతికినా నీతో ఉంటానే నువు లేకుంటే ఈ క్షణమే సచ్చిపోతానే మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ద్రోహమే చేయొద్దమ్మా మోసమే చేయకే ప్రేమా ప్రేమా ఆ ప్రేమకే ప్రాణమే తీయొద్దమ్మా ఓ ముద్దూ ముద్దూ గుమ్మా నా మాయలమారీ బొమ్మా నువ్వు గారడి చెయ్యకె కొమ్మా నన్ను ఆడించమాకే అమ్మా
Song: Mosame Cheyyaku Prema
Palli Balakrishna
Saturday, May 27, 2023
పాట: నీలి నీలి కల్లవాడే సంగీతం: మదీన్ SK సాహిత్యం: మానుకోట ప్రసాద్ గానం: బాసని మమత ఆర్టిస్ట్స్: దేతడి హారిక కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్ విడుదల: 13.03.2021
నీలి నీలి కల్లవాడే పాట సాహిత్యం
పాట: నీలి నీలి కల్లవాడే సంగీతం: మదీన్ SK సాహిత్యం: మానుకోట ప్రసాద్ గానం: బాసని మమత నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే వాని సూపులు సన్నని కత్తుల తీరు అగొ తియ్యని గాయాలు సేసెను నాకు వాని మాటలు మాయలు సేసెను సూడు ఇగ తీరని ఆరాటమయ్యెను నాకు (2) పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2) నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే నిద్దుర పట్టదు ఇదేం రోగం వాని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగాడు (2) పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండ కట్టేసుకుందునా (2) నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే సీకటి కమ్మిన సిత్రం సూడు నాకు పగలే రాత్రై పోయెను సూడు నిన్నెట్టాగైనా ఏలుకుంటా ఏడేడు జన్మల బంధం అట (2) రారా ఓ పిలగా రాలుగాయి పొల్లగా రంధి లేని రాత నాకు రాసిపోరాదురా (2) నీలి అరె నీలి… అరె నీలి నీలి కల్లవాడే వాని మాయన నిలువున దించినాడే నిండు పున్నమి ఎన్నెల తీరు వాడు నిండు మనసు అందగాడే
Song: Neeli Neeli
Palli Balakrishna
పాట: ఏమే పిల్ల అంటాటే సంగీతం: మదీన్ SK సాహిత్యం: మానుకోట ప్రసాద్ గానం: శ్రీలత యాదవ్ ఆర్టిస్ట్స్: భాను శ్రీ కోరియోగ్రాఫర్: రఘు మాస్టర్ ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్ విడుదల: 23.03.2021
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే పాట సాహిత్యం
పాట: ఏమే పిల్ల అంటాటే సంగీతం: మదీన్ SK సాహిత్యం: మానుకోట ప్రసాద్ గానం: శ్రీలత యాదవ్ ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే సెయ్యి పట్టుకొని సెరదీస్తే సిగ్గుపుట్టుకొచ్చే సెంపలోన సీరకొంగు వట్టి ఇడవకుంటే గాలికావరయే గుండెలోన బొట్టుపెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేరా కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు ఎండ వానలు మారిపాయే సల్లని సలిలో సేమాటలాయె గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు ఎండ వానలు మారిపాయే సల్లని సలిలో సేమాటలాయె వాని మటలింటే మాయాజాలం మత్తులోకి జారుకుంటా గోలం వాని నవ్వు సూస్తేనే లేనిరోగం వెయ్యిజన్మలైన పోదుభందం ఒట్టు వెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత సూపుకు నచ్చినపోరాడీడు సూసిగూడ సుడనట్టు సూడు కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత సూపుకు నచ్చినపోరాడీడు సూసిగూడ సుడనట్టు సూడు గుంజుకొని జర్రనీడనిస్తే కాదంట అన్నాసెప్పునువ్వు ఎండతాపానికి దాహమిస్తే వద్దంట అన్నాసెప్పునువ్వు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేర కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న వాడులేకుండా నా రతం ఆరువాలు శాతం మురువాలు వాడు ఎదురుగాఉంటే అమ్మతోడు మాటన్నరాదు ఏమిగోరం వోట్టువెట్టుకున్న... వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో ఐతాందే నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నాదే
Song: Yeme Pilla
Palli Balakrishna
పాట: రింగు జుట్టు సంగీతం: మదీన్ SK సాహిత్యం: రాజేందర్ కొండా గానం: ప్రభా ఆర్టిస్ట్స్: అక్షా ఖాన్ కోరియోగ్రాఫర్: టీనా ప్రొడ్యూసర్: జ్యోతి కున్నూరు మ్యూజిక్ లేబుల్: నివ్రితి వైబ్స్ విడుదల: 15.07.2022
రింగు జుట్టు పాట సాహిత్యం
పాట: రింగు జుట్టు సంగీతం: మదీన్ SK సాహిత్యం: రాజేందర్ కొండా గానం: ప్రభా పల్లవి: రింగు జుట్టు రంగులోడా మావల్లో ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ రింగు జుట్టు అరెరె రింగు జుట్టు అబబ్బా రింగు జుట్టు రింగు జుట్టు రంగులోడా మావల్లో ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో చరణం: 1 గా ఎంకటి తాత పొలము ఆ పక్కనే పులా వనము ఆ పువ్వొలే నీ గుణముర నా కెంత సక్కటి వరము నిను సూడకుండ దినము ఇడిసుంటాన ఓ క్షణము నువ్వు గాణరాకపోతే రా బావోత్తది నాకు జొరము నువ్వేడుంటే గా సోట ని తొవ్వెంటే నా బాట ను సెప్పిందే నే ఇంట నేనుంటారా ని జంట కాసుకుంటా ఓర కంట ఎన్ని తంటలైన నీతోనుంటా రింగు జుట్టు అరెరె రింగు జుట్టు అబబ్బా రింగు జుట్టు రింగు జుట్టు రంగులోడా మావల్లో ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో చరణం: 2 మట్టిపెళ్ల లాంటి తనము దిట్టంగా ఉందే ధనము ఒట్టేసి సెబుతా ఇనవు మావ నిన్నే గోరె తనువు ఎంత సెప్పుకున్న ఇనవు సక్కాగున్నావన్న పొగరు గి సిగ్గులు నాకు తెగవు నిన్నే జేసుకుంటా మనువు నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే నా కళ్ళల్లో నీ ధ్యాసే నా కలల్లో నీ ఊసే గిదేందయ్య నా గోసే నేనుంటారా నీతోటే రింగు జుట్టు అరెరె రింగు జుట్టు అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో ఆ రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల రింగు జుట్టు రంగులోడా గుండెల్లోన నీదే గోల నిను ఇడిసి ఉండదంట నా మనసు అడ ఇడ రింగు జుట్టు రింగు రింగు రింగు జుట్టు అబబ్బా రింగు జుట్టు రంగులోడా మావల్లో ఏమైయ్యిందో పాడుగాను నీవల్లో ఎంకల నువ్వొస్తావుంటే మావల్లో ఎద బరువైతుందిరా మామా ఎందుల్లో
Song: Ringu Juttu Ranguloda
Palli Balakrishna
సాంగ్ : అల్లా హే అల్లా… సంగీతం: మదీన్ SK రచన: లక్ష్మ న్ సింగర్: రామ్ (అద్నాన్) ఆర్టిస్ట్స్: టోనీ కిక్ , సునీత , నజ్మా మున్నా డైరెక్టర్: బుల్లెట్ బండి లక్ష్మన్ ప్రొడ్యూసర్: రఘు లవాద్య
అల్లా హే అల్లా... పాట సాహిత్యం
సాంగ్ : అల్లా హే అల్లా… సంగీతం: మదీన్ SK రచన: లక్ష్మ న్ సింగర్: రామ్ (అద్నాన్) కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు (యే ధువా మిల్ జాయె వఫా యే తో) రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే (యే ధువా మిల్ జాయె వఫా యే తో) అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే (యే ధువా మిల్ జాయె వఫా యే తో) అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా... నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా... నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
Song: Allahe Allaha
Palli Balakrishna
Friday, May 26, 2023
సాంగ్ : వద్దన్న గుండెల్లో సేరి (2021) సంగీతం: మదీన్ SK రచన: అజయ్ మెంగాని (Ajay Mengani) సింగర్: దివ్య మాలిక కొరియోగ్రఫి, డైరెక్టర్: విజయ్ బిన్ని నిర్మాత: జ్యోతి కున్నూరు విడుదల తేది: 2021
వద్దన్న గుండెల్లో సేరి పాట సాహిత్యం
సాంగ్ : వద్దన్న గుండెల్లో సేరి (2021) సంగీతం: మదీన్ SK రచన: అజయ్ మెంగాని (Ajay Mengani) సింగర్: దివ్య మాలిక కొరియోగ్రఫి, డైరెక్టర్: విజయ్ బిన్ని నిర్మాత: జ్యోతి కున్నూరు విడుదల తేది: 2021 వద్దన్న గుండెల్లో సేరి గాయి గాయి ఐతుందిరో….. గంజాయి చెట్టు గుండెలో నాటి నట్టు.. జ్ఞాపకాలు గావు పట్టేరో ఇదిసి ఒందమంటే నీ మీద ఒట్టు నా మెత్తని పాదాలు ఒత్తుకుపోకుండా ఎత్తుకుని నడిసినవురా
2021
,
Folk Songs
,
Lahari Shari
,
Oddanna Gundello Seri
,
Private Songs
,
SK Madeen
,
Telangana Janapadalu
Oddanna Gundello Seri (2021)
Palli Balakrishna
Saturday, December 17, 2022
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి 2 సంగీతం: మదీన్ SK రచన: గను నటినటులు: మేఘన, గను సింగర్: మధు ప్రియ, హన్మంత్ యాదవ్ ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి 2 పాట సాహిత్యం
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి 2 సంగీతం: మదీన్ SK రచన: గను నటినటులు: మేఘన, గను సింగర్: మధు ప్రియ, హన్మంత్ యాదవ్ ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మోకీనానే నీకు రావద్దు కష్టం సిటీకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే బండ తీరు ఉండేటీ నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే నువ్వు నా తోడు లేక పోయే నాకు సావన్న రాకపాయే వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే నీకు రావద్దు కష్టం నీ మెడలోన మూడు ముళ్ళేసి వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ నీ మెడలోన మూడు ముళ్ళేసి వందేళ్లు నీతోనే ఉంటన్నగానీ నీ తలమీద కుంకుమనయ్యి సావుల తోడొస్తనన్నానుగానీ మాటను తప్పిన మన్నించవే నిన్ను ఇడిసివెట్టి ఎళ్ళిపోతున్ననే ఆ దేవుణి మీద మన్నుపొయ్య నీ ప్రేమకు బాకీ లేదేందే నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే ఆ కండ్లు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం దూరమైతున్ననే పిల్ల నీకు నిన్ను సూడాలనుందే నాకు దూరమైతున్ననే పిల్ల నీకు నువ్వంటే సచ్చేంత ప్రేమనే నాకు దూరమైతున్ననే పిల్ల నీకు నీతోనే బతుకాలని ఉందే నాకు బతుకంతా నీతోనే అనుకున్ననే ఏడు జన్మాలు నీతోనే కలగన్ననే నా బతుకంతా నీతోనే అనుకున్ననే బ్రహ్మ రాతలాగా గీత ఇంతేనే నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే నేను లేకుంటే ఎట్లుంటవే మల్ల రానంటే ఏమైతవే ఆ కండ్లు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్నస్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం నేను పుట్టిన నా ఈ మట్టికైనా పాణాలు ఇచ్చేటి రోజొచ్చెనే నేను సత్తే గర్వంగా జెప్పుకోయే భారత జెండాను గుండెలగత్తుకోయే అన్నాన్ని వెట్టేటి రైతన్నకే ఆకలితో సావు వచ్చినట్టు భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పానమిచ్చినట్టు నిలిసిపోతానే మీ గుండెలా కలిసిపోతున్న ఈ మట్టిలా సల్లగుండే నువ్వక్కడా సచ్చిపోతున్న నేనిక్కడా నువ్వు లేకుంటే ఎట్లుంటనే మల్ల రానంటే ఏమైతనే ఆ కళ్ళు లేని దేవుడే నిన్ను నన్నూ ఎడబాపెనే
Situkesthe Poye Pranam (Part 2)
Palli Balakrishna
Friday, December 16, 2022
సాంగ్: సిటీకేస్తే పోయేటి ప్రాణానికి సంగీతం: మదీన్ SK రచన: గను సింగర్: హన్మంత్ యాదవ్ ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్
సిటీకేస్తే పోయేటి ప్రాణానికి పాట సాహిత్యం
సాంగ్ : సిటీకేస్తే పోయేటి ప్రాణానికి సంగీతం: మదీన్ SK రచన: గను సింగర్: హన్మంత్ యాదవ్ ప్రొడ్యూసర్: బైరా దేవ్ యాదవ్ వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే నీకు రావద్దు కష్టం సిటీకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే బండ తీరు ఉండేటీ నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేక పోయే నాకు సావన్న రాకపాయే వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే నీకు రావద్దు కష్టం ఎందుకే పిల్ల నామీద కోపం గుండె కోసి చూడు నీ రూపం ఎందుకే పిల్ల నామీద కోపం నువ్వే కదానే నా లోకం ఎందుకే పిల్ల నామీద కోపం ఏ జన్మలో చేసిన పాపం నా గుండెల్లో దాగున్న ఈ బాధని నేను ఎవరితో చెప్పుకోనే ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మిదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే నాకూ సావన్నా రాకపాయే వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇష్టం కొండగట్టు అంజన్న స్వామినీ మొక్కిననే నీకు రావద్దు కష్టం నువ్వు ఎట్లా ఉన్నావు ఇంటికాడ నేను రాలేను నిన్ను చూడ 2 నేను ఉన్నది బార్డర్ కాడ చచ్చిపోయిన తేలువది జాడ నా ప్రాణం పోతున్నది ఇంట్లో చీకటి అయితె ఉన్నది నువ్వు నాతోవ చూడ బోకు నా అడుగులో నువ్వు రాకు కంట కన్నీరు పెట్టబోకు ఇంట్లొ దుఃఖాల పాలుగాకు సిటీకేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సీక్కులు పెటీనవేందే బండ తీరు ఉండేటీ నా గుండె ఇన్ని బాధలు పెడుతున్నవ్ ఏందే ఆ దేవుని మీద మన్ను వోయా నీ ప్రేమకు బాకీ లేవేందే బువ్వ తింటే పొతలేదే నీ మీదే పానమయే పిల్ల నీ తోడు లేకపాయే నాకు సావన్నా రాకపాయే
Situkesthe Poye Pranam (2022)
Palli Balakrishna
పాట : జరీ జరీ పంచె కట్టి (2022) సంగీతం: మదీన్ SK సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్ నటీమణులు: మానస్, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ నిర్మాత: జ్యోతి కున్నూరు
జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి పాట సాహిత్యం
పాట : జరీ జరీ పంచె కట్టి (2022) సంగీతం: మదీన్ SK సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: శ్రావణ భార్గవి, సాకేత్ కొమండురి, స్ఫూర్తి జితేందర్ జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో ఏలికి, నా కాలికి నా కంటికి, నా ఒంటికి జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్ జరీ జరీ జరీ జరీ జరీ జరీ చీరె కట్టి జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్ రానే రమ్మంటి నా రాణి నువ్వంటి రానే రమ్మంటి నా రాణి నువ్వంటి వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో ఓయ్, రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నయ్ రింగు రింగుల రొమ్ము మీద రింగుల రోమాలున్నయ్ రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో రింగోలున్నవ్ రో పులి రంగోలున్నవ్ రో ఎత్తుకి నా నెత్తికి పూ గుత్తికి కసి కత్తికి వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో వంగకున్నవ్ రో నాకు లొంగకున్నవ్ రో ఏయ్, ఎందరెందరున్నాగాని మందలో గోవిందులాగ ఎందరెందరున్నాగాని మందలో గోవిందులాగ మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో మందగున్నవ్ రో హరి చందంగున్నవ్ రో పోరుకు, మెడ పేరుకు నా జోరుకు పదహారుకు అందకున్నవ్ రో బాగందంగున్నవ్ రో అందకున్నవ్ రా బాగందంగున్నవ్ రో ము ము ము ముందారెందరు, ముందరెందరు ముందరెందరు ఉన్నాగాని పొందుకోరి వచ్చినోన్ని ముందరెందరు ఉన్నాగాని పొందుకోరి వచ్చినోన్ని తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే తొందరెందుకే ఈ రద్దీ ఏందాకే పోరుకు మెడ పేరుకు నీ జోరుకు పదహారుకు బంధినైతే నీ బంధాన్నైతినే బంధినైతే నీ బంధాన్నైతినే జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో పిలగా, జారుతున్నవ్ రో చేజారుతున్నవ్ రో వేలికి, నీ కాలికి నీ కంటికి, మునిపంటికి యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే యాడా జారిన్నే నీ కాడనే ఉన్నే
Zari Zari Panche Katti (2022)
Palli Balakrishna
Tuesday, September 20, 2022
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: అసుర (ద నవాబ్ గ్యాంగ్), సురేష్ బొబ్బిలి, మదీన్ ఎస్.కె. నటీనటులు: ఆకాష్ పూరీ, గేహ్న సిప్పీ దర్శకత్వం: బి.జీవన్ రెడ్డి నిర్మాత: వి.ఎస్.రాజు విడుదల తేది: 24.062022
Songs List:
చోర్ బజార్ పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: అసుర (ద నవాబ్ గ్యాంగ్) సాహిత్యం: అసుర సెల్విన్ ఫ్రాన్సిస్ గానం: శృతి రంజిని యెహె చోర్ బజార్ ఇది చోర్ బజార్, ఎ ఆజ చోర్ బజార్ ప్రతి బస్తీలో ఉంటా నేను లేదు నాకు ఆధార్ నచ్చినట్టే బతుకుతుంటా లేదు నాకు బాధ ఖద్దర్ అయినా కాకీ అయినా లేదు నాకు తేడా రంగు రంగు జీవితాలు చోర్ బజార్ ఆజా పార్కింగ్ లో కార్లు ఉంటె టైర్లన్ని మాయం మీ ఇంటి బయట బైక్ పెడితే పార్టలన్నీ మాయం జేబులోంచి కింద పడితే పర్సు చేస్తా మాయం చీకటైతే ఎక్కడైనా నొక్కడం కాయం యే, కిందపడితే మా సొంతం భూమి తల్లి బిడ్డలం గద్దలెన్ని ఉన్న గాని చేత చిక్కని ఈగలం ఇస్మార్ట్ దిమాక్ పోరాల్లం అలెర్టు ఉంటం అందరం దేనికైనా సిద్ధముంటం లేదు తాడు బంగరం మా గల్లి అంత మా జనం మా బస్తీ అంతా మా దళం నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్ నువ్ కుస్తీకొస్తే పాతడం మా గల్లి అంత మా జనం మా బస్తీ అంతా మా దళం నువ్వు కూడ్నీకి వస్తే భాయి సలామ్ నువ్ కుస్తీకొస్తే పాతడం యె చోర్ బజార్ యెహె చోర్ బజార్ మన చోర్ ఎసార్ హమ్ చోర్ ఎసార్ ఇది చోర్ బజార్ యెహె చోర్ బజార్ ఆజా చోర్ బజార్ ఆజా చోర్ బజార్ యెహె చోర్ బజార్ యెహె చోర్ బజార్ మన చోర్ ఎసార్ హమ్ చోర్ ఎసార్ ఇది చోర్ బజార్ యెహె చోర్ బజార్ ఆజా చోర్ బజార్ ఆజా చోర్ బజార్ ఆ ఆఆ ఆఆ న ఆఆ ఆ ఆఆ ఆఆ న ఆఆ యెహె చోర్ బజార్ మన చోర్ ఎసార్ ఇది చోర్ బజార్ ఆజా చోర్ బజార్ హువా రాత్ చాలు మేర కామ్ కర్నా చాలు కియా జోల్ నా సోచ్ కి న కౌన్ ముజే పక్డేకా కౌన్ ముజే రకేగా పాండు భయ్యా పీచే బైట సీదా గూమ్నాయే తేరా స్కూల్ రహ్నా తుజే శాతిర్ సమీర్ మేరా మజ్బూత్ కర్తే కాలే కర్తోస్ యే తో మేర దస్తూర్
జడ పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: సురేష్ బొబ్బిలి సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ గానం: రామ్ మిరియాల ఏ, అబ్బబ్బా అది ఏం పోరి చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో దాని జడపై మనసు పడి మెడకి నడుముకి నడుమ నాగుపాములాగా కదలాడి ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి చార్మినారు లాంటి లైఫునే ప్యార్మినారు లాగ మార్చెనే దిల్లునే దీవాను జేసి దీపం పెట్టిందే ఓ ఓ, గోల్కొండ కోట లాంటి నన్నే రాణి వాసమల్లె మార్చుకుంటూ రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి చోరు బజారుకే… నేను జమిందారు నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్ ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ సిన్నబోయి కూసున్న… ప్రేమ జంట సాయంకాల వేళ మరుగు మీద అలిగి పొద్దుగాల ప్రేమలోన పడి పోయే జంట కోయిలలే, జంట కోయిలలే కుదురుగుండదే మనసంతా కునుకే పట్టదే రేయంతా తనే లోకమై రోజంతా… తిరిగేస్తూనే ఉంటా ఎవరు ఏమన్నా వినపడదే ఎదురు ఎమున్నా కనపడదే పిల్ల ప్రేమలో పడ్డాక… నను నేనే విడిపోయా ఓ ఓ, పోలీసుల వేట… డైలీ దొంగాట మరిచే పోయానే… ఈ పిల్ల బాట బట్టినాక సమస్య లేకుండా సరెండరై పోయా నేరమేమి జెయ్యకుండానే ప్రేమ ఖైదీనైపోయా చోరు బజారుకే… నేను జమిందారు నన్ను దోచే వారే… ఎవరు లేనే లేరు అనుకునే లోగ నన్ను… చేసేసావే చోరీ ఓయ్ ఓయ్ ఓయ్, పాత బస్తీకి నేను పహిల్వాన్ ఎంత వస్తాదునైనా పడగొట్టే నన్ను జడ గంటలతో పడేసావే పోరి, ఓ ఓఓ అబ్బబ్బా అది ఏం పోరి చూడగానే కళ్ళు చెదిరి కోసేసానమ్మో దాని జడపై మనసు పడి మెడకి నడుమకి నడుమ నాగుపాములాగా కదలాడి ఉరి పోసిందమ్మో దాని కురులతో ఊపిరికి
నూనుగు మీసాల పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: సురేష్ బొబ్బిలి సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: లక్ష్మి మేఘన నూనుగు మీసాల పోరడు సూడు ఎదురు సూరీడే నా మీద నజరు ఏసిండే రంగుల డబ్బల గుండెను ముంచి ఎత్తుకపోయిండే వాని గుండెల్ల దాసిండే వాని బొమ్మ గీసీ మాటముచ్చట సెప్పుకున్న గాలిలో వాన్ని సేరితే సాలయ్యో మల్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జర సెప్పి పోండయ్యో నూనుగు మీసాల పోరడు సూడు ఎదురు సూరీడే నా మీద నజరు ఏసిండే రంగుల డబ్బల గుండెను ముంచి ఎత్తుకపోయిండే వాని గుండెల్ల దాసిండే హా, ఎండ పొద్దు ఎక్కుతాంటే వాని నీడ నిక్కి చూస్తదే బండి మీద కూసోనున్నా వాని ఒళ్ళో ఉన్నట్టుంటదే దస్తీ మెల్ల ఏసుకుంటే సేతులేసినట్టు ఉంటదే సెమట సుక్క జారుతుంటే నా సెంప నిమిరినట్టు ఉంటదే నేను కండ్లు తిరిగి సోయి తప్పుతున్న వాని కండ్లార సూస్తుంటే సాలునంటా వాడు నిమ్మకాయ సోడా తెస్తనంటే తిండి తిప్పల్నే మానుకుంటా వాడు పహిల్వాన్ లా నాకు పక్కన ఉంటే నేను దునియాల ఏడున్నా సల్లగుంటా దొరసానిలా వాని తోడు ఉంటా నా పాణంలా సూసుకుంటా సీమ సిటుకుమన్నా నువ్వు పిలిసినట్టే ఝల్లుమంది పొల్లగా నా కాలు నిలవకుంది పిల్లగా జల్దీగా నువ్వొచ్చి అల్లుకోరా నన్ను వల్ల కాదు పొల్లగా నీ మీద గాలి మల్లి మెల్లగా, ఆ ఆ ఆఆ
బచ్చన్ సాబ్ పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: మదీన్ ఎస్.కె. సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ గానం: మంగ్లీ షోలే సినిమా విడుదలైన మొదటి ఆటకి సోలో గానే వెళ్ళిపోయా, ఎక్స్-రోడ్డుకి ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చే సీను ఆరడుగుల డాన్ చేతిలో మౌత్ ఆర్గాన్ నన్నే చూస్తూ ప్లే చేస్తుంటే, ఫ్లాటయ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను ఆయే హే బచ్చను బచ్చను ఆయే హే అమితాబ్ బచ్చను జహ వో కడా హోతా వహా సే షురు హయ్ ఆయే హే బచ్చను బచ్చను ఆయే హే అమితాబ్ బచ్చను జహ వో కడా హోతా వహా సే షురు హయ్ దీవార్ చూస్తూనే అయిపోయా దీవాని తూఫాన్ వచ్చాకే మొదలైంది కహాని మనసుతో ఆడిందే షత్రంజీ కి ఖిలాడీ మాస్ డైలాగ్ తో తలకెక్కే షరాబీ 24 హౌర్స్, అరె 24 ఫ్రేమ్స్ అమితాబ్ తో పెళ్లి డ్రీమ్సు ముంబై లో తాను హైదరాబాద్ లో నేను టీనేజిలోనే మ్యారేజ్ కి ట్రై చేశాను నా ఏడడుగుల రేఖ అమితాబ్ తో లేక లైఫ్ అంత అభిమానిగా సెటిల్ అయిపోయి అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అలా నేను అయ్యాను అరె బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను ఫ్యాను ఫ్యాను ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను
కదలదు పాదం పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: మదీన్ ఎస్.కె. సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ గానం: సిద్ శ్రీరాం కదలదు పాదం ఎదురుగ నువు కనబడకుంటే నిలువదు ప్రాణం నిమిషము నిను చూడకపోతే పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం వినబడుతోందా ప్రియురాలా విరహపు రాగం ఆ ఆఆ, నేరమెరుగనే నేస్తమా శిక్ష వేయుట న్యాయమా కన్ను మూస్తే ఇంతకన్నా నరకం ఉంటుందా, ఆ ఆ ఊపిరున్న నిన్ను చూడక అనుభవిస్తున్న ఆ ఆ, కదలదు పాదం ఎదురుగ నువు కనబడకుంటే నిలువదు ప్రాణం నిమిషము నిను చూడకపోతే ఆనందం నీవై దూరంగా వెళుతుంటే దిగులై నాలో నేనై మిగిలిందే సంతోషం నీవై రానంటూ సెలవంటే ఆవేదన నాలో నదిలా పొంగిందే నిన్ను చూపే స్వప్నం నా నిద్దురనే చిదిమేస్తుంటే నన్ను దాచిన నీ హృదయం ఎందుకో వెలివేస్తుంటే నిన్నటి మన ప్రతీ జ్ఞాపకం నేడు నన్ను నిలదీస్తుంటే కదలదు పాదం ఎదురుగ నువు కనబడకుంటే నిలువదు ప్రాణం నిమిషము నిను చూడకపోతే పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం వినబడుతోందా ప్రియురాలా విరహపు రాగం టెన్ టు ఫైవ్ నేరమెరుగనే నేస్తమా శిక్ష వేయుట న్యాయమా కన్ను మూస్తే ఇంతకన్నా నరకం ఉంటుందా, ఆ ఆ ప్రాణమున్నా నిన్ను చూడక అనుభవిస్తున్న
చోరికియారే పాట సాహిత్యం
చిత్రం: చోర్ బజార్ (2022) సంగీతం: సురేష్ బొబ్బిలి సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: స్ఫూర్తి జితేందర్ నాచోరే నాచోరే… నాచోరే ఇయ్యాల ఫుల్లుగా దల్లిన ధూమ్ ధమాకే నాచోరే నాచోరే… నాచోరే రంగుల్ని జల్లుతు అల్లరి జామ్ డమాకే హే, మల్లేపల్లి కళ్ళు పడితే తేలిపోద్ది ఒళ్ళు దాని మీద భంగు పడితే గజ్జెగల్లు గల్లు హే లొల్లి లొల్లి లొల్లిపెడితే ఊగిపోద్ది దిల్లు పొల్లగాళ్ళందరికీ రోడ్డే కదా ఇల్లు చోర్ చోర్ చోర్ చోరికియారే అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే మెరుస్తా ఉన్నా గాని రెడ్డు లైటు చౌరస్తా చుట్టూ నువ్వే చెక్కర్ కొట్టు గెలుస్తామనేదాకా ఓపిక పట్టు అడ్డొస్తే ఎవడన్నా టక్కరు పెట్టు ఏ, ఖాళీ పీలి బేజారైతే ఏముంటది మామో అందర్ బాహర్ అయ్యేదేరా లైఫే పెద్ద గేము మింగాలనే సూత్తుంటాది పచ్ఛా నోటు పాము అరె పుంగీ బజాయించి మరీ నిచ్చనెక్కేద్దాము చోర్ చోర్ చోర్ చోరికియారే అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే ఏడిస్తే ఎదిగినోని ఆస్తి రాదు నవ్వేస్తే దాసుకున్న సొమ్మేంపోదు అరిస్తే ఆస్తిమాన్ ఊడిపడదు జడిస్తే ఈ జమీన్ అయ్యో అనదు హే, ప్రేమించాలి మచ్చా మనం చేసే ప్రతి జాబు పొట్టనిండా పనేదైనా మనకు అమ్మ బాబు చోటా బడా ప్రతీ వాడు దోచేటోడే జేబు పొట్ట కొట్టకుండా ఉంటే చాలు అదే రాక్ బాబు చోర్ చోర్ చోర్ చోరికియారే అరె ప్యార్ ప్యార్ ప్యార్ ప్యారీయయ్యారే అరె చోర్ చోర్ చోర్ చోరికియారే మేరా దిల్ దిల్ దిల్కు చోరికియారే చో చో చోర్ చోర్ చోర్ చోరికియారే మేరా దిల్ దిల్ దిల్కు చోరికియారే
Chor Bazaar (2022)
Palli Balakrishna
Saturday, July 9, 2022
పాట: శివరాత్రి పాట (2020) సంగీతం: SK మదీన్ రచన: కాసర్ల శ్యామ్ గానం: మంగ్లి దర్శకత్వం: దాము రెడ్డి విడుదల తేది: 2020
శివరాత్రి పాట (2020) సాహిత్యం
పాట: శివరాత్రి పాట (2020) సంగీతం: SK మదీన్ రచన: కాసర్ల శ్యామ్ గానం: మంగ్లి
Shivaratri Song (2020)
Palli Balakrishna
Saturday, May 29, 2021
పాట: సంక్రాంతి పాట (2020) సంగీతం: మదీన్ ఎస్ కె సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: మంగ్లీ
సంక్రాంతి పాట (2020) సాహిత్యం
సంక్రాంతి పాట (2020)
Sankranthi Song (2020)
Palli Balakrishna
Friday, May 28, 2021
పాట: శివరాత్రి పాట (2021) సంగీతం: మదీన్ ఎస్ కె సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: మంగ్లీ జయశ్రీ దర్శకత్వం: దాము రెడ్డి నిర్మాణం: నూతనపాటి రామకృష్ణ విడుదల తేది: 07.03.2021
శివరాత్రి పాట సాహిత్యం
పాట: శివరాత్రి పాట (2021) సంగీతం: మదీన్ ఎస్ కె సాహిత్యం: గోరేటి వెంకన్న గానం: మంగ్లీ జయశ్రీ హరహర మహాదేవ శంకరా హరహర మహాదేవ శంకరా ఓ ఓ... సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతినావ తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళం నీ కీర్తనమే ఒహో... పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా ఓ ఓ...గిరీ సుర సుతా గౌరీ సఖీయై నీ తోడుండా శంఖ జోలె శంఖు పుర్రె నీకు పూదండ రంగు లేని నాగమణిమెడలోన వెలుగుచుండ ఏమీ లేని భైరాగోలే యాచించుచుండ వెన్నెలనే తలపై కొలువై చిందులాడ ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్నా మురువవు సిత్రమురా కలిమి లేమి కష్టము సుఖము ఓ ఓ... నీతూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళపు సంద్రము నీవే ఒహో...ఉండీ లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ తాళాలకు కర్తవు నీవే సాధు జంగమా ఆది దేవుడా హరహర మహాదేవ శంకరా ఓ ఓ...బిలువమాల సుగంధాల పూసిన పూల పల్లకి నేల తలపించేను కమనీయంగా శివుడా నీ లీల సద్గురు వేదం శంభుని నాదం... అందాల ఈ సుందర ధామం నింగీ నేలకు నిచ్చెనలు వేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవ నాదముగా ఢమరుకమే ధిమిధిమి మోగెనురా భువి నుంచి గంగ దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమః శివాయ సిద్ధనమాయ ఓ ఓ...సిద్దనమాయ అభిశుద్ధ నమాయ పంచాక్షరీ జపమంత్రమే పరమశివాయ కైవల్యం కైలాసం నమః శివాయ ఒహో అద్వైతం శివతత్వం సదాశివాయ పూర్ణం పరిపూర్ణం గురుపూర్ణనమాయ సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతినావ తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఓ...ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతలసుతల పాతాళం నీ కీర్తనమే ఒహో...పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారధి నీవే సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా హరహర మహాదేవ శంకరా
Shivaratri Song (2021)
Palli Balakrishna
Thursday, May 27, 2021
పాట: ఆడ నెమలి సంగీతం: ఎస్.కె.మదీన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: కనకవ్వ, మంగ్లీ సేకరణ:కనకవ్వ
ఆడ నెమలి ( నర్సపేల్లే గండిలోన గంగధారి ) పాట సాహిత్యం
పాట: ఆడనెమలి సంగీతం: ఎస్.కె.మదీన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: కనకవ్వ, మంగ్లీ సేకరణ:కనకవ్వ నర్సపేల్లే గండిలోన గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి (2) ఆడి నెమలీ ఆటలకు గంగధారి మొగ నెమలి మోస పాయే గంగధారి (2) ఇద్దరాము గూడు దాము గంగధారి ఒద్దిమాను కొరుగుదాము గంగధారి (2) నిన్ను నన్ను చూసినంక మంది క౦ట్లే మంటలాయే ముద్ధు ముచ్చట ఓర్వలేక ముక్కు మూతి తిప్పుడాయే పట్టుకోర నువ్వు పిట్టలోల ఎగిరి బుంగ చేయ్యి నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే.. నర్సపేల్లే గండిలోన గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి (2) ఆడి నెమలీ ఆటలకు గంగధారి మొగ నెమలి మోస పాయే గంగధారి (2) ఇద్దరిది కంటి నీరు గంగధారి ఒద్దిమాను కుంటే నిండే గంగధారి (2) ఒద్దిమాను కుంట ఏనుక గంగధారి ఇద్ధుమిరుస సన్న వడ్లు గంగధారి (2) ఇద్ధుమిరుస సన్న వడ్లు గంగధారి ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి (2) కస్సు బుస్సు మనకు రయ్య పాల పొంగు లెక్క నువ్వు నీళ్ళు సళ్లీ నట్టు జల్లి సల్లబడినవంటే సాలు ఏలు పట్టుకోని తిరుగు ఎంటి లెక్క చూసుకుంటా నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే.. నర్సపేల్లే గండిలోన గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి (2) ఆడి నెమలీ ఆటలకు గంగధారి మొగ నెమలి మోస పాయే గంగధారి (2) నువ్వు నేను కూడినప్పుడు గంగధారి కొత్త కుండల తేనె వోలె గంగధారి (2) కొత్త కుండల తేనె వోలె గంగధారి పాత కుండల పాశమోలే గంగధారి (2) పాత కుండల పాశమోలే గంగధారి పాలనేతుల బాసలాయే గంగధారి (2) పాలనేతుల బాసలాయే గంగధారి పాసిపోయే దీనమచ్చే గంగధారి (2) పాసిపోతే పాయే ఆశ సావకున్నదాయే గోస లాన్ని తీరిపోయే మాస మచ్చే చూడరయ్యో రాసముప్పడైనను తీగలెక్క అల్లుకుంట నర్సపేల్లే.. నర్స .. నర్సపేల్లే.. నర్సపేల్లే గండిలోన గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి (2) ఆడి నెమలీ ఆటలకు గంగధారి మొగ నెమలి మోస పాయే గంగధారి
Aada Nemali
Palli Balakrishna
Subscribe to:
Posts
(
Atom
)















