-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "N. Shankar"



చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
నటీనటులు: శ్రీకాంత్, ఛార్మి, కృష్ణ ఘట్టమనేని
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: యన్. సుధాకర్
విడుదల తేది: 04.01.2013



Songs List:



అబ్బాయి ఆంధ్రా మిర్చి పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: రంజిత్, శ్రావ్య

అబ్బాయి ఆంధ్రా మిర్చి 



ఆ దేవుడు పుట్టించాడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: తైదల బాపు
గానం: హరీష్ రాఘవేంద్ర, చిన్మయి శ్రీపాద

ఆ దేవుడు పుట్టించాడు 



గుడ్డు గుడ్డు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: అభినయ శ్రీనివాస్
గానం: యస్.పి.బాలు 

గుడ్డు గుడ్డు




మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: గురుచరణ్
గానం: కార్తీక్, అనురాధ శ్రీరామ్

మగధీరుల్లోనా మహాజాతకుడమ్మో



అడుగడుగో సేవకుడు పాట సాహిత్యం

 
చిత్రం: సేవకుడు (2013)
సంగీతం: శ్రీకాంత్ దేవా
సాహిత్యం: ఈశ్వర్ తేజ, విష్ణుశర్మ
గానం: మనో

అడుగడుగో సేవకుడు 

Palli Balakrishna Wednesday, March 13, 2019

చిత్రం: 2 కంట్రీస్  (2017)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం:
గానం: హరిచరన్ , కావ్య మాధవన్
నటీనటులు: సునీల్
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: యన్.శంకర్
విడుదల తేది: 22.12.2017

పల్లవి:
ఉల్లాసంలో... ఉల్లాసంలో... గెలిచానులే...
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు
మురిసేను మేను మెచ్చాలే నిన్ను

ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన

చరణం: 1
అలలా  అలలా ఇలలో కలలా సరదాలే సాగేనా
అధరం మధురం హృదయం ఉప్పొంగేనా
అలలా  అలలా ఇలలో కలలా ఆనందం ఆడేనా
నయనం కధనం నయనం పదిలం
కమలం కవనం పరువం మోగే
ఏహె సొగసు కావ్యమై
మది వంగి వంగి భోగి ఊగి తూగి తేలేనా
సొగసు కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ

ఉల్లాసంలో  ఉల్లాసంలో

చరణం: 2
అదిరే అదిరే మధువే అదిరే సరసాలే చిందేనా
అధరం మధురం హృదయం ఉప్పొంగేనా
అలలా అలలా లయలా లయలా ఆకాశం అందేనా
సరసం సమరం మిధునం మధనం
శ్రవణం సరళం సయనం ఊగే
ఎహె మధుర కావ్యమై
భూకం పాకం దాహం మొహం తాపం కాశం తీరేనా
మధుర కావ్యమై ఓ మై బేబీ లవ్యూ లవ్యూ లవ్యూ లవ్యూ

ఉల్లాసంలో  ఉల్లాసంలో
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
ఏలో ఏలో రే ఏదో ఏదో హాయి
నాటీ నాటీ బ్యూటీ బ్యూటీ ప్రణయాన
మెరిసేటి కళ్ళు మురిపాల నవ్వు
మురిసేను మేను మెచ్చాలే నిన్ను

Palli Balakrishna Friday, December 8, 2017



చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
నటీనటులు: నితిన్, జనీలియ, హర్షిత భట్, కృష్ణంరాజు
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 30.03.2006



Songs List:



షాక్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చిన్ని చరణ్ 
గానం: షాన్, అన్చల్, సుచిత్ర, ప్రేమ్ జీ 

షాక్



నువ్వేనా ఎదలొ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిచరన్, శ్వేతా మోహన్

నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగ నువ్వేనా 
అడుగడుగున నన్నే నడిపే రహదారిని నువ్వేనా 
అణువనువున నన్నే తడిపే రస గోదారివి నువ్వేనా 

నువ్వేన నువ్వేనా….. 

నువ్వేనా ఎదలొ నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా 

నీలినింగి నువ్వేనా నేలరాజు నవ్వు నువ్వేనా 
గాలి ఈల నువ్వేనా ఆ నువ్వు నేను కానా.. 
పూల మాల నువ్వేనా ఆ మేఘమాల నువ్వేనా 
రాగామాల నువ్వేనా నీలోనా నేను లెనా 
ప్రపంచము సమస్తమూ సామాప్తమవుతున్న 
చారో సాఘం మరో జగం అనేది మనమేనా 

నువ్వేనా నువ్వేనా...
నువ్వేనా ఎడాలో నువ్వేనా నువు నువ్వేనా ఎదురుగా నువ్వేనా 

చెంప నురుపు నువ్వేనా నా పెదవి బెరుపు నువ్వేనా 
ముద్దు ముడుపు నువ్వేనా అనలేను ఎందుకన్నా.. 
సొగసు నదులు నువ్వేనా చరసాల నిధులు నువ్వేనా 
మధన తిధులు నువ్వేనా ఇకపాయినా ఆపుతున్న… 
వసంతమో ఏ మంత్రమో షరత్తు ఏదయినా 
యుగాంతము సుఖాంతమయి చరిత్ర మనదే….. 

నువ్వేనా ఎడాలో నువ్వేనా నువ్వేనా ఎదురుగా నువ్వేనా…




మేడే ఇన్ హైదరాబాద్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శంకర్ మహదేవన్

మేడే ఇన్ హైదరాబాద్ 




పిల్ల భలే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర 
గానం: టిప్పు, సైంధవి 

పిల్ల భలే 



ఖుర్బానీ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యువన్ శంకర్ రాజా, సాధనా సర్గమ్ 

ఖుర్బానీ 

Palli Balakrishna Thursday, September 14, 2017




చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య
దర్శకత్వం: యన్.శంకర్
నిర్మాత: పరిటాల సునీత
విడుదల తేది: 28.09.1999



Songs List:



భూమికి పచ్చాని పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కలేకురి
గానం: కె.జె.యేసుదాస్, చిత్ర, వందేమాతరం శ్రీనివాస్

భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
అలీ పుస్తిలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వల వల వల ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా
చెరవిడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికోస్తే పండుగచేద్దామురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతారో అమ్మలాలా
చేలుదున్ని సాళ్ళు దీర్సే బీద బిక్కి జాతారో అమ్మలాలా
ఎద్దు కొమ్ముల నడుమా ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలధర గుడిసలోళ్ల జాతర

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

చెమట జల్లుచిలకరిస్తే నేల పులకరించురో అమ్మలాలా
వానోస్తే భూతల్లి సీమంతామాడురో అమ్మలాలా
తంగేళ్ళు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా
పసుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగేనో
గజ్జల మెతల్లో పల్లె పరవసించెనో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

దిగువా పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో
నా సీమ తమ్ముల్లో వెలుగులు నిండేనురో

భూమికి పచ్చాని  భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా




రాజ్యహింస పెరుగుతున్నాదో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: వందేమాతరం శ్రీనివాస్

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

బీటవారిన బీడు భూమిలో ధుమ్ము రేపిన ఇసుక దుబ్బలు
ధారలై పారిన సెమటతో ధాన్య రాసుల శుద్ధిజేసిన
రైతు కూలి నాపై కక్ష కట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో
ఈ దొరల రాజ్యం కత్తి నురి కంఠాన పెట్టిండో

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

లెక్కలేని పోలీసు మూకల మరతుపాకుల నిచ్చి పంపి
పచ్చని పల్లెల్లో పేదల బ్రతుకులో చితిమంట రేపుతు
చిత్రహింసలు పెట్టుతున్నారో
ఏమెరుగనోళ్ల ఎదలపై గన్నులు మోపిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో
కాలేటికడుపుల మీద పలుగు రాలు కొట్టిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భర్తలను గుంజలకు కట్టి భార్యలను సెరబట్టి చెరిసిరి
పచ్చి బాలింతలును కూడా పట్టితెచ్చి చెరలో బెట్టి
తల్లిఒడి కడబాపినారమ్మో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో
నోరెండి బిడ్డలు పాలకేడ్చి సొమ్మసిల్లిన్రో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

భన్జరూసి భాయిజామా బలిసినోళ్ల మిగులు భూములు
పంచమని పేదోళ్లు ఒకటై చండబాపి చాండుగడితే
అరె బ్రతుకు చూపని దొరల రాజ్యంలో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో
తూటాలు బేల్చి రైతుబిడ్డల చావు సూచిందో

అరె రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ల నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో

ఇన్ని హింసలు పెట్టి రాజ్యం ఎలెటోడని తింగ చూస్తాం
ఎలెటోడని తింగ చూస్తాం
చెమట తీయని ఊరి దొరలను సేలకడుగు పెట్టనీయం
సేలకడుగు పెట్టనీయం
పెద్దరీకం చేసే కంతిరి గద్దలానిక తరిమి కొడతాం
గద్దలానిక తరిమి కొడతాం
ఆక్రమించిన దొరల భూమిలో
అరక కట్టి సాల్ దోళుతాం
అరక కట్టి సాల్ దోళుతాం
డొక్కలల్లో గుండ్లు దిగినా దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం
దుక్కులల్లో విత్తులేస్తాం




నను గన్న నా తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: గోరటి వెంకన్న
గానం: యస్. పి. బాలు, చిత్ర

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

వానగాలికి సీమ తానమాడినపుడు
వజ్రాలు ఈ నేల వంటిపై తేలాడు
పొరలు నిమిరితే పుష్య రాగాలు దొర్లు రాగాలు దొర్లు
బంగారు ఘనులున్న కుంగదీ తల్లీ పొంగిపోదమ్మా

కలియుగంబున నరులు ఓర్వలేరని తెలిసి
నల్ల రాయై వెలసి ఎల్లలోకములేలు
వెంకటాచలము భువైకుంఠ స్థలమో వైకుంఠ స్థలము
దర్శించినా జన్మా ధాన్యమౌతాదో పుణ్యమౌతాదో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

హరిహరభుక్తరాయ అడివి వేటాకెళితే
కుందేళ్లు కుక్కల ఎంటబడ్డాయంట
పౌరుషాల పురిటి జీవగడ్డమ్మో  జీవగడ్డమ్మో
ప్రతినబట్టిన శత్రువిక పతనమేరా ఇక పతనమేరా
పాపాలు కడిగేటి పాతాళ గంగమ్మ
ఆధి గురువుల తపము నాచరించెను బిలము
హటకేశ్వర శిఖరమవని కైలాసం అవని కైలాసం
తనుకుతా వెలసిన శివలింగమమ్మో శ్రీశైలమమ్మో

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

సత్రాలు సాధువులు భైరాగి తత్వాలు
సీమ ఊరూరున మారు మ్రోగుతాయి
శిథిలమైన గుళ్ళు శివనందులమ్మో శివనందులమ్మో
వీరబ్రహ్మం ముఠము సీమకే మఖుటం సీమకే మఖుటం
పాలబుగ్గల నోట వేణువు మీటితే
ఆలమందలు కంచె బీళ్లు పరవశించు
నింగిలో చంద్రుడు తొంగిచుసితే  తొంగిచుసితే
సీమలో కోలాటమే సిందుతొక్కు చిరుగజ్జలాడు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ

ఎత్తు బండరాళ్లు ఎర్రని దుప్పులు
పనుగు రాళ్ళ గట్లు పరికి కంపపొదలు
నెర్రెడ్డు వారిన నల్లరేగళ్ళు నల్లరేగళ్ళు
ఆరు తడుపుకు పెరిగే వేరు సేనగమ్మో వేరు సేనగమ్మో
నల్లమల్లడవుల్లోతెల్లబారే పొద్దు
అంబకేలకి సీమ మీదగ్గి కురిపించు
సందేపూట నుండి కొండ నీడల్లో కొండ నీడల్లో
సల్లగాలికి ఒళ్ళు మరచి నిదురించు అలసి నిదురించు

నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
నను గన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ
తనువెళ్ల తరగని ఘనులున్న సీమ గిరులున్న సీమ
ఓహో... ఓ ఓ ఓ... ఆహా హా హా  ఓ హే హా ఓ






ఘడియ ఘడియల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కె.జె.యేసుదాస్, చిత్ర

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై
ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ
నేనెందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్యా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

పట్టేడంత అన్నమైన తినిపించలేకుంటిని
నిమిషమైన నిదురకుడా లేదాయె ని కంటికి

ని భర్త కోసమే ఆరాటపడరాదు
రాగిసంకటిలేని జనము ఉన్నది చూడు
గుండె గొంతుకలోన కొట్లాడుతుంది
తిరుగుబాటే బ్రతుకు బాట అవుతుంది
నేనుందు బోధునయ్య నువ్వులేక నేనెట్లా ఉందునయ్య

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

ఎవరికొరకు ఎందుకొరకు సాగించుపోరాటము
ఇల్లు విడిచి పల్లె విడిచి ఎన్నాళ్ళు ఈ నరకము

గుండెలో బాధలను దాచుకోవాలి
న పోరు బాటలో నీతోడు కావాలి
పల్లెనే ఇల్లుగా నువ్వు చూసుకోవాలి
పంచాది నిర్మలకు చెల్లేవనిపించాలి
ని మాట కాదందునా నీతోడు నేనుండానా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై

నా ప్రాణమా ఎడబాటు మనకున్నదా
బ్రతుకన్నదే పోరాటమని తెలియదా
నేస్తమా ఒఒఒఒఒఒఒ ఓఓఓ
కన్నీరు నింపకమ్మ కష్టాలు కలకాలం ఉండవమ్మా

ఘడియ ఘడియల్లోన ఓగండమై
గడప దాటని బ్రతుకు సుడిగుండమై




కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కాలెకూరి ప్రసాద్
గానం: కె.జె.యేసుదాస్

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా

పారానింకా ఆరనేలేదు
తోరణాల కల వాడనే లేదు
తోరణాల కల వాడనే లేదు
పెళ్లి పందిరి తీయనే లేదు
అప్పగింతలు అవ్వనే లేదు
ఆఆఆఆ

గల గల పారే ఓ సెలయేరా
గల గల పారే ఓ సెలయేరా
పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి
స్మశానానికి కాపురమెళ్ళావా
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా

రాక్షస విలువలు రాజ్యమేలెడి
నరక ప్రాయపు సంఘం లోన
నరక ప్రాయపు సంఘం లోన
మానవ ధర్మం మంటగలిసెనా
మారణ హోమం జరుగుతున్నదా
ఆఆఆఆ

కల కళలాడిన ఓ నవ వధువా
కల కళలాడిన ఓ నవ వధువా
కోకిల మేధం సాగుచున్నదా
జీవన రాగం ఆర్తనాదమాయే
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాందులకే భలి అయి పోయావా

పాలపిట్టలె పాడవయేన
పల్లె గుండెలే తల్లడిల్లేనా
పల్లె గుండెలే తల్లడిల్లేనా
కదిలే కాలం ఆగిపోయిన
పొడిచే పొద్దుకు గుండె పగిలేనా
ఆఆఆఆ

పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
కారు మేఘములు కమ్మేసాయ
కాల సర్పమే కోరలు సాచిందా
ఆఆఆఆ

కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా
విరిసి విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారాగా
కామాంధులకే భలి అయి పోయావా




జోహారులు జోహారులు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
మా గుండెల చిరుదివ్వెలు
మా కన్నుల చిరు కాంతులు 

లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

సమాజంలో మనుషులు అందరూ
సమానంగా ఉండాలని చెప్పి
భూమి కోసం భుక్తి కోసం
మాతృదేశం విముక్తి కోసం
సాయుధ పోరాటం పంథాయే
సరైన మార్గం అని నమ్మి
ఊఱ్ఱి కొయ్యల పై ఉఉయ్యాల ఊగినట్టి

వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదన పరిపరి దండాలు
వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
పాద పాదన పరిపరి దండాలు

అన్నలారా తమ్ములార
అక్కలారా చెల్లెలరా
అహ్హ్
శూరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

తెలంగాణ మాగాణంలో
ఎర్రమందారాలై పూసి
ఓహోఓ
నక్సషల్ బారి ఆకాశంలో వసంత
మేఘాలై గర్జించి
శ్రీకాకుళం కొండల్లో
విప్లవ శంకలై ప్రతిదధ్వనించి
నెత్తుటి వరదలో
ఎర్రజెండాలై ఎగ్గిరినట్టి

వీరుల మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు
వీరుల మీఎకు ఎర్రరేరా దండాలు
పాద పాదాన పరిపరి దండాలు

అమ్మలారా అయ్యలారా
బిడ్డలారా కొడుకులారా
అహ్హ్
శూరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం

రాయలసీమ కొండల్లో లవ ల రగిలి
ఊహూ
భూస్వాముల ఫ్యాక్షనిసిస్ట్ ల గుండెల్లో
బర్నాల్ అయి పెళ్లి
ఆహా
తూటా మీద తూటా దూసుకువస్తుంటే
సవును సవాలు చేసి గుండెను ఎదురొట్టి నిలిచినెట్టి

పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు
నే పాద పాదాన పరిపరి దండాలు
పోరాటాల రాములు ఎర్రరేరా దండాలు
పాద పాదాన పరిపరి దండాలు

అమరులారా అన్నలారా దేరులారా యోధులారా
అహ్హ్
వీరులారా మీకు ఎర్రరేరా దండాలు
మీ పాద పాదాన పరిపరి దండాలు

జోహారులు జోహారులు
జోహారులు జోహారులు
అహ్హ్
లాల సలాం లాల సలాం
లాల సలాం లాల సలాం
అహ్హ్





విప్ప పూలు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: శివ సాగర్
గానం: వందేమాతరం శ్రీనివాస్

విప్ప పూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములన్ని
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా 
లహార్ జ్వాలా దారిలోన దాచిన పళ్లెములన్ని
నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా
గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
అరె రూపాయి కొండలోన కోసిన సిపాయి పీక
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా

ఒడ్డపాడు అరె ఒడ్డపాడు అరె ఒడ్డపాడు
పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
ఆవిరి కొండల కోణాల పారిన వీరుల రక్తం
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
ఉదయాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి
నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా
అరె జగిత్యాల జైత్ర యాత్ర ఇంద్రావెల్లి అమరత్వం
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా

రాయలసీమ అరె రాయలసీమ అరె రాయలసీమ
రాళ్లలోని రతనాల మాలలల్లి
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా
అరె రక్త వసంతలాడే దండా కారణ్యమంతా
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
పాణిగ్రాహి కత్తి పాట మల్లి పసి పాప నవ్వు
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
అరె కైలాసం కళ్ళ వెలుగు వెంపటాకు చురుకు చూపు
నీకిస్తా తమ్ముడా బల్ నీకిస్తా తమ్ముడా
నీకిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా




పోరాటాల రాములు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరాములయ్య (1999)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సంఘ
గానం: వందేమాతరం శ్రీనివాస్

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
పోరాటాల రాములు...
అ అ అ అ అ ఆ ఆ ఆ ఆ

ఆకలికి అన్నం దొరికే దారి చూపిన వాడా!
నీ హత్యకు ఉడుకుతుంది ఊరూరు వాడ వాడా
అందుకనే పేద రైతూ ఊ ఊ ఊ...
అందుకనే పేద రైతులేత్తినారు కత్తులు
రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు
రాలిపడక తప్పదు భూస్వామి తలల గుత్తులు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం

బీద బిక్కి బడుగోలను కూడ గట్టి నిలిపినావు
సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు
సివాయి జమ భూముల్లో ఓ ఓ ఓ ఓ...
సివాయి జమ భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండ
ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ
ఎగరేస్తాం ఎర్ర కోట బురుజులపై తప్పకుండ

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం
పోరాటాల రాములు...



Palli Balakrishna Thursday, July 27, 2017
Aayudham (2003) Telugu Songs Lyrics Album Cover

Aayudham (2003) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aayudham (2003)
Director : N. Shankar
Producer : Srinivasa Rao
Actors : Rajasekhar
Supporting Cast : Brahmanandam
Release Date : 22 May 2003

Oye Raju Song Lyrics in Telugu – Aayudham (2003)

'Oye Raju' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Udit Narayan and Usha.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
Lyricist : Bheems Ceciroleo
Singers : Udit Narayan, Usha
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో గానం: ఉదిత్ నారాయన్, ఉష ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేశావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే చల్లనీ వేల చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో ఓయ్ రాజు వయ్యారి వగలు ఓయ్ రాజు పుట్టించే సెగలు నల్లనీ మేఘ మెల్లగా నాట్యమే రాణి చెయ్యవే ఏయ్ రాణి కవ్వించే కళలు ఏయ్ రాణి నీలోని హొయలు కన్ను కన్ను కలిసిన వేల కలిగెను కోరికలు గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మేలుకో నువ్వు కోరుకో నేటి రాతిరే నను ఏలుకో ఓయ్ రాజు కలదోయి రేయి ఓయ్ రాజు మనదేలే హాయి దూకొచ్చే నీలో యవ్వనం ఒంపు సొంపుల్లో పూచే మందారం ఏయ్ రాణి సందేల వీణ ఏయ్ రాణి సంగీత మేళ మావో మావో మల్లెల్లో నీ రూపే నే దాచుకున్నానులే పిల్లో పిల్లో నీ ఒళ్ళో నే వాలి దోచేసుకుంటానులే రారాజు రారా ఓయ్ రాజు నీపై నా మోజు తీరు ఈరోజు ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు... హొయ్ ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేశావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో లాలాల లాలాల లాలా (2)

Meghale Evela Song Lyrics in Telugu – Aayudham (2003)

'Meghale Evela' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Shankar Mahadevan and Swarnalatha.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: వరంగల్ శ్రీనివాస్ గానం: స్వర్ణలత, శంకర్ మహదేవన్ భుహికి మైనానీ కోనయమోని కోనయమోని భూషధపోలాలే కోనయమోని షాహిత కైనీలే కోనయమోని కోనయమోని ఆహిస్త కైనీలే కోనయమోని ఏ హే హే హే... ఓ ఓ ఓ అ...అ... అ... ఆ మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా నామేను తడవాలా పులకింత నవ్వాలా భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా శ్రీదేవి కావాలా నింగికి నాదేవి అందాలు తేవాలా అంబరాల పందిరి వెయ్యలా హో... కొండంచు పీటలు కావాలా హో... ధాలో పైట వాలియే సీలి మనిజారి ధాలో పైట వాలియే సీలి మనిజారి సిల్మా మైనా ఈరో ఛాల తోని కాలివాలోయే సోని ఏరేఛాలి ఊహాలకే ఓ యవ్వనాల ఊపిరి పొయ్యాలా... రిమ రిమ రిమ రిమ రిమ రిమ రెక్కలతొ దిక్కులన్నింటిని చుట్టీ రావాలా కూహూ కూహూ కోకిలమ్మ కొత్త పాట పాడాలా కూనలమ్మ గంతులేసి ఆడాలా వేకువమ్మా మూతి ముడుచుకోవాలా ముక్కున వేలేసి మెచ్చుకోవలా ఓ లాలో ఓలా ఓలా ఓలా ఓలా ఓ లాలో మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని చిమ్మచెక్కా చిమ్మచెక్కారే మరో జీవ బరూచేని వరంగల్లు జాను వారుతరాల మరో జీవ బరూచేని నల్లగొండ జాను వారుతరాల మరో జీవ బరూచేని వన్నెలలో వెన్నదొంగ నువ్వే కావాలా... రిమ రిమ రిమ రిమ రిమ రిమ మండుతున్న సూరీడికి మతే పోవాలా ఓహో ఓహో చెప్పరాని మాట విప్పి చెప్పాలా వెచ్చని కౌగిట్లో హత్తుకోవాలా రెప్పచాటు పాపా దాగిపోవలా రెయ్యంత ఇట్టాగే ఉండిపోవాలా ఓ లాలే ఓలా ఓలా ఓలా ఓ లాలే మేఘాలె ఈ వేళా చినుకల్లే రావాలా చినుకల్లే రావాలా భూదేవి నాఇంటి శ్రీదేవి కావాలా

Bangarubomma Rave Song Lyrics in Telugu – Aayudham (2003)

'Bangarubomma Rave' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Vandemataram Srinivas and Usha.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఉష, వందేమాతరం శ్రీనివాస్ బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు కక్షలు ఇంకా లేనేలేవమ్మా అక్షింతలును కలపండోయమ్మా కళ్ళల్లోన కన్నీరేంటమ్మా చెల్లెలుకిచ్చే కట్నం లేదమ్మా బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే పెన్నా సాక్షి మన పెళ్లిపీట వేసింది చిన్నిప్రేమా ఈ సూర్యచంద్రులను బావమరుదులుగా చూసి మురిసె సీమా బాంబులు నేడు తాంబూలాలై సంకల్పాలే సుముహూర్తాలై మెల్లంగా కొంటె వరుడు ఉంగరాలు మార్చు వేళ గిల్లగా ఈ పిల్లకు అణువణువున ఆనందం గుడు గుడు గుంచం గుండెల్లో రాగం... డుం డుం బాజా సన్నాయి మేళం... హా హా... గుడు గుడు గుంచం గుండెల్లో రాగం... హే... డుం డుం బాజా సన్నాయి మేళం... బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఎదురు పడితే తొడ చరిసి పగతో ఉరిమురిమి చూసెవాళ్ళు ఈ రోజు పెళ్లి మండపము ముందు బంధువులు అయ్యినారు పసుపు రాసిన మూరెడు తాడు ఒక్కటి చేసే పల్లెలు నేడూ మీ గుండెల్లోన ఉంది రాల్లనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా... రాయలసీమ పుట్టిల్లేనమ్మా... అ ఆ... ప్రేమా ప్రేమా మీదే ఊరమ్మా... రాయలసీమ పుట్టిల్లేనమ్మా... బంగారు బొమ్మరావే పందిట్లో పెళ్లి నేడే ఇక లేవులే రణాలు ఎటుచూడు తోరణాలు లలలా లలలా లలలా లలలా లల లాలే లాలలా లల లాలే లాలలా

Abba Yem Song Lyrics in Telugu – Aayudham (2003)

'Abba Yem' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Shankar Mahadevan and Anuradha Sriram.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: సీనారే (సి. నారాయణ రెడ్డి) గానం: శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరామ్ అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఈ పిల్లది కుయ్యో మొర్రో మిగిలున్నది నుయ్యో గొయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో నేనే నీ వెంట చూసినాక ఇట్టే లొట్టలేసినారో పిలగా నీకు మొక్కినారో నక్క తొక్కినానో దూర దూర మున్నావ్ ఎవరో దోచుకోర నన్నే జర దారి చూపుతారో రారా దుమ్ములేపుకోరా హే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ మరదలాయే మద్దెల్ అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హే... మనోహర నీ మారుమల్లే రా బండిడు సిగ్గుల్రో బావా నీకేరో బుగ్గల్ని పిండేస్తూ హో... నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా కడవలాగ చంకను ఎక్కి చెక్కిలిగిలి నడుముకి పెట్టి ఒట్టేడో పక్కనపెట్టి ఉట్టి కట్ట వచ్చి హే నీ దూకుడు ఆపవే బుల్లో నీ జిత్తులు పారవే పిల్లో ఓసోసి టక్కరి కన్నె నువ్వు తోక ముడిసెయ్ హే కిటకిట కిటకిట లకుముకి పిట్ట పిట్టగోడ దూకేయ్ అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హో నా సుందర ఇక లేటేందిరా మెట్టలు పెట్టాల్రోయ్ గుట్టల్ పట్టాల్రోయ్ బాజా బజంత్రీలు మొగిద్దామా హ తకదిం ఓ... నీలాంబరి నా కాదంబరి పెళ్ళిగిళ్లంటూ పిల్లజల్లంటు ఎందుకింత పై పై కొస్తూ చంపేస్తావే తలుపులుకు గొళ్ళెం పెట్టే మంచానికి గజ్జలు కట్టి మల్లెలకు వాసన చూసి చడుగుడాడుకుందాం హే... వెన్నెలనీ ఒంటికి చుట్టి చికటినీ కురులకి కట్టి బిగ్గరగా కౌగిట బట్టి తప్పెటాడుకుందాం హే నయాన భయాన స్వయాన నువ్వే లొంగిపోయే గిలికే అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో

Ranga Reddy Zilla Song Lyrics in Telugu – Aayudham (2003)

'Ranga Reddy Zilla' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Udit Narayan and Kalpana Raghavendar.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
Lyricist : Padma Srinivas
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: పద్మ శ్రీనివాస్ గానం: ఉదిత్ నారాయన్, కల్పన రాఘవేందర్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్ బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం ఆ శిల్పారామం శిల్పంలా నడిసొచ్చాడీ బ్రహ్మం నీ గుమ్మం దాటి వచ్చావంటే కదిలొస్తుందే ఖమ్మం నాన్నిట్టా చంపుకు తినకయ్యో నా బుగ్గలు గిచ్చి టు మచ్ అవుతుంది నీ పిచ్చి అట్టట్టా షాకులు చెప్పొద్దే నా తింగర బుచ్చి మొదలెడదాం కోతి కొమ్మచ్చి పొట్టేలు మాంసం కిలోడు తెచ్చి పలావు చేసాన్రో ఈ పటందు సారు రాత్రికి వస్తే సులాము చేస్తారో దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా అబ్బా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా అమాసకోసం పినాకినెక్కి తెనాలి వచ్చానే ఈ ఆషాఢమాసం పక్కకు నెట్టి పల్లకి తెచ్చానే నీ బొంగా గుంట నువ్వంటే తెగ పడిచస్తది మామా ఈ గుంటడు గుంటది లవ్వంటే మరి ఏమనుకున్నావ్ భామా ఈ రబ్బరు బొమ్మను చూస్తుంటే చిరు చమటలు పట్టి నా లివరుకు చలి జ్వరమొచ్చిందే ఈ అబ్బడి తిప్పలు చూస్తుంటే నా చాపల చెట్టి తుక తుక తుక తొందరపెట్టిందే హే రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్ బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం భంచికి భం భం కంచికి మొక్కి కండలు పెంచానే చించికి ముద్దులు పెట్టావంటే విశాఖ ఉక్కేనే దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా దినక్కు దిన్నా దిన్నారే దినక్కు దిన్నా హే భం భం బోలే బాదం పప్పు బండెడు తెచ్చారో మా బాపట్లోస్తే ఎవ్రీ మార్నింగ్ వాటరు ఇస్తారో నీ స్టెప్పులు చూసి ఈస్ట్ వెస్ట్ స్లిప్పయ్యి బెదిరే భామా నీ స్టెప్పును చుసి ఆంధ్రా సీడెడ్ నైజాం అదిరే మామా హే జెడ్చర్ల జంక్షన్ కొచ్చింది నా మిర్చి బజ్జి రోడ్డంతా టెన్షన్ పెట్టిందే మాచర్ల ఫంక్షన్ కొచ్చింది నా అయిసర్ బజ్జి సూపులుతో సోకులు గిచ్చింది అయ్ హాయ్ హయ్ రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అధరం సంజీవిరెడ్డి పార్క్ లోన అడుకుందాం చిక్బమ్ బి యన్ రెడ్డి వాస్తులు కట్టి కట్టుకుందాం భవనం

Idemitamma Song Lyrics in Telugu – Aayudham (2003)

'Idemitamma' song from Aayudham (2003) movie is composed by Vandemataram Srinivas and sung by Kumar Sanu and Rashmi.

SONG INFORMATION
Movie : Aayudham (2003)
Lyricist : Chinni Charan
Singers : Kumar Sanu, Rashmi
చిత్రం: ఆయుధం (2003) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఉదిత్ నారాయన్, ఉష ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓవింత కవ్వింత నీకంత చొరవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా శ్రీరంగా నిను కోరంగా ఈ గిలిగింతలు చలిలో చమటలు గారంగా నువు తేరంగా మదిలో మెరుపులు ఎధలో పరుగులు దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా పాపలయ్యి పాడుకుందామా చేపలల్లే ఈదుకుందామా గుండె బావి తోడుకుందామా ఈడు దాహం తీర్చుకుందామా నీళ్లలోనే మనముంటున్నా తీరని దాహాలేంటమ్మా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిను చూస్తుంటే చలివేస్తున్నది చెలి ఏంటే ఇది వేకువలో నువులేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది దాయి దాయి దాయి దామ్మా దరి దాయి దాయి దాయి దామ్మా తాజమహల్ చేరుకుందామా లవ్ గజల్ పాడుకుందామా తారలన్నీ తెంచుకుందామా తోరణాలే కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్ర లోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ఓవింత కవ్వింత నీకంత చొరవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలిప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా లాల లాల లాలా లాలా లాల లాలాలా లాల లాల లాలా లాలా లాల లాలాలా

Palli Balakrishna



చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: వెంకటేష్, సౌందర్య, భానుప్రియ
దర్శకత్వం: ఎన్. శంకర్
నిర్మాత: డి. సురేష్ బాబు
విడుదల తేది: 07.10.2000



Songs List:



డోంట్ మిస్ సోదరా... పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

డోంట్ మిస్ సోదరా...
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్
డోంట్ మిస్ సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏ నాడు డోంట్ మిస్

డోంట్ మిస్ సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్

చిన్న నాడు ఎల్కేజీ చదివే నాడు
మాస్టారి తిట్లు ప్లీజ్ డోంట్ మిస్
పెద్ద నాడు నను పీజీ గెలిచే నాడు
లేడీ చివాట్లు ప్లీజ్ డోంట్ మిస్
పోపు డబ్బాలోనా అమ్మ దాచుకున్న
చిల్లరంతా డోంట్ మిస్
అర్ధ రాత్రి లోన స్టార్ మూవీ లోన అందమంతా డోంట్ మిస్

ఆకతాయిలాగా ఆడిపాడుతున్నా
ఆ పైన విజయాలు సాధించు మార్గాన్ని
ప్లీజ్ డోంట్ మిస్

డోంట్ మిస్సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉన్నాగాని
మన పప్పు నెయ్యి ప్లీజ్ డోంట్ మిస్
ఫాస్ట్ బీటు వింటూనే ఉన్నాగాని
మన జోల పాట ప్లీజ్ డోంట్ మిస్

హే జీన్సు ఉన్నాగాని సూటు ఉన్నాగాని
పంచెకట్టు డోంట్ మిస్
ఏసీ ఉన్నాగాని పల్లె సీమల్లోని
పైరగాలి డోంట్ మిస్
డాట్ కం చదువు డాలర్లు చేయు పొదుపు
ఏమైనా ఏదైనా నువ్ మాత్రం దేశాన్ని
ప్లీజ్ డోంట్ మిస్

డోంట్ మిస్సోదరా
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్

ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏనాడు డోంట్ మిస్





మెరిసేటి జాబిలి నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, స్వర్ణలత

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను లవ్ లో దించేశావ్

మనసైన వాడివి నువ్వే 
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను మైమరపించేశావ్
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది ? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్

అల్లుకో బంధమా 
ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా 
తుంటరి ఈడుని ఈ వేళ 
ఓదార్చనా ప్రియురాలా

నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని
నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది?
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది

మనసైన వాడివి నువ్వే 
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్, నను మైమరపించేశావ్

కలిసిరా అందమా 
చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా 
చక్కగ దొరికెను అవకాశం 
సరదాగా తిరిగొద్దాం

నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ
నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని
వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది

మెరిసేటి జాబిలి నువ్వే
కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్  నను లవ్ లో దించేశావ్
ఓ మై ఓ మై లవ్  టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది? 
ఏమేమి అడిగింది?
ప్రేమ ఇమ్మంది  ప్రేమందుకోమంది




హ్యాపీగా జోలీగా పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: సోను నిగమ్, గోపికా పూర్ణిమ

హ్యాపీగా జోలీగా




హిందూస్తాన్ లో పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, జస్పిందర్ నరుల

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా
ముద్దు పేటెటందుకు మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

ఒంపుల అవి పదనుగ ఎదిగిన
మనసుని కోసిన మెత్తని రంపాలు
చూపుల అవి హృదయపు లోతున
కవితలు రాసిన కాముని బలపాలు
వల వేస్తున్న - వలదన్నాన
గుండె వీడియో లోన నీ నిండు బొమ్మ నిలిపేయినా
నీ అంద జేరింది పండు భామిని

కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
మడత పడని ఒక బెడ్ షీట్ అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

మాటల అవి సూటిగా సాగిన
పైటను తాకినా తియ్యని తూటాలు
నవ్వుల అవి చల్లని యవ్వన
చెల్లలు చిలికిన అల్లరి కవ్వాలు
పెను వేస్తున్న - వెను తీస్తాను
సోకు నోటుబుక్ లోన
ఐ లైక్ యూ అంటూ రాస్తున్న
నా పొందు కోరింది మందాగామిని
కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే
నలిగిపోని మరు మల్లెలు అడగాలే

హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా
రాజస్థాన్ లో ఒంటెలకంటే హైటే నువ్వేలే
హొ లలలల హొ లలలల
హొ లలలలలలలా

నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా
ముద్దు పీటటందుకు మూడు రాత్రులు చాలునా
కాలం కలిసొస్తే దేవుడు దిగివస్తే
కిర్రుమనని ఒక మంచం అడగాలే




పెళ్లికి బాజా మోగింది పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, కవితా కృష్ణమూర్తి

పెళ్లికి బాజా మోగింది 
కుమారి శ్రీమతి కానుంది (2)
పట్టుపంచెకి పైట కొంగుకి
ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చే 
మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై
ఇల్లాలి పదవీ ఇచ్చయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది

తాబుంలం తేగా తాపలే తూగా 
రావయ్య రావయ్య రావయ్య బావయ్య
వడ్డానం లాగ వాటేస్తా బాగా 
దావమ్మ దావమ్మ దావమ్మ దానిమ్మ
కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా
ఈడు గుమ్మలో ఏడడుగులు నడిపిస్తా
వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెంటే వస్తా
మేనాలో కాలు పెట్టెసై హామ్ హాయ్ 
నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా
మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ 
నా వయసు మోత మోసేయ్

ఓయ్ పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది

అబ్బబ్బో హాయి అచ్చోచ్చే రేయి
ఆయి ఆరెయి ఆరెయి అందాలే
అందిస్తా చేయి ఆడిస్తానోయి
తోడేయి తోడేయి తోడేయి నా ఈడే
పంటి ఘాటుల్లో నీ పంటే పండిస్తా
గోటి గుర్తుల్లో నా ఓటె నీకెస్తా
హేయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా
నా కాలికి మెట్టెలు పెట్టేసేయ్ 
వచ్చే నా ఇంటిపేరు మార్చేయ్
నా వంటికి జోలలు కొట్టేసేయ్ 
విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది (2)
పట్టుపంచెకి పైట కొంగుకి 
ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చే 
మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై 
ఇల్లాలి పదవీ ఇచ్చయ్

పెళ్లికి బాజా మోగింది
కుమారి శ్రీమతి కానుంది




ఓ చూపుకే పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి. బాలు, అనురాధ శ్రీరామ్

ఓ చూపుకే




చిన్ని చిన్ని ఆశలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: జయం మనదేరా (2000)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: కలేకూరి ప్రసాద్
గానం: వందేమాతరం శ్రీనివాస్

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే
తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే
ఆనందము ఆకాశము
సందడై సంద్రమై ఉప్పొంగెనే

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే

నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు
నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు
చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ
పండగై ఉంటాడు ఆడంగ పాడంగ
కలగలిసి ఉండాలి దండుగా
కడదాక ఉంటాను అండగా
సాగరా చాటరా జయం మనదేరా

చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
పంటలతో నేల తల్లి పొంగెనే
సంపదతో పల్లెలన్నీ నిండెనే
సాగరా చాటరా జయం మనదేరా


Palli Balakrishna Wednesday, July 26, 2017



చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాత: మేడికొండ మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001



Songs List:



ఇదే నా పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: వందేమాతరం శ్రీనివాస్, ఉష

ఇదే నా పల్లెటూరు ఇదే నా తల్లిగారు
మావూరి పాడిపంట రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు కడిగే సీతమ్మ పాదాలు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 1
రామునికి బాణమొకటే 
భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు 
ఇంటింటా ఉంటే ఒకడు

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఒక దేవుడే తనకు ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే ఐతే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్... 

చరణం: 2
తొలకరిలో వానచుక్క 
రుచిచూస్తే తేనెచుక్క
భూమిపై మోముపైన 
చిన్ని గరిక నవ్వుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా జోయ్ జోయ్ జోయ్...

ఆలమంద పాలధార 
మీటుతున్నదో సితార
కడుపునిండ పాలు తాగి లేగదూడలాడుతుంటే

ఊరంతా హాయ్ హాయ్ హాయ్...
మనసంతా హాయ్ హాయ్ హాయ్....




ఓ ఓ చెలియా పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కుమార్ సాను, స్వర్ణలత

ఓ ఓ చెలియా



కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, స్వర్ణలత

కుడ కుడడ రోడ్డులో పిల్ల ఉంది
అది రానంటుంది నన్నే రమ్మంది





చేనేత చీరకట్టి పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: చంద్రబోస్
గానం: కవితా కృష్ణమూర్తి, జస్విందర్ సింగ్ నిరోల

చేనేత చీరకట్టి



ఒకటే జననం ఒకటే మరణం పాట సాహిత్యం

 
చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ 
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా 
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా 
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె 
గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో 
ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ 
దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ 
అలుపు లేదు మనకు
బతుకు అంటె గెలుపూ 
గెలుపు కొరకె బ్రతుకు

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default