చిత్రం: రామచిలక (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.జానకి
గూడు చీకటి గువ్వ ఎన్నెలా
గుండెలు గువ్వలగూళ్లు
ఈ గుండెలుగువ్వల గూర్లు
గోదారొడ్డున కలిసిన చేతులు
కట్టిన పిచ్చుక గూళ్లు
అవి కట్టని దేవుడిగుళ్లు
మద్దులు ముప్పైనాళ్లు
ఆశలు అరవై ఏళ్లు
కలలుగనే కన్నులతోనా ఎన్నెల కొన్నాళ్లు
ఆ కలలే కరిగి ఎన్నెలచెరిగి వచ్చే కన్నీళ్లు
ఏళ్లూ కోళ్లూ ఏడ్చే కళ్ళకు నవ్వే ఆనవాళ్లు
ఎత్తే జన్మలు ఏడు
వేసే ముళ్ళే మూడు
పుష్వలకైనా నవ్వులు నేర్పేవాడే నాతోడు
ఈ చల్లని చెలిమి తియ్యని కలిమి నాదే ఏనాడు
చీకటి గూడు వలపులమోడు నవ్వే ఈనాడు ...
సరస్వతి పద్యం-1
చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సముద్రాల(జూ)
గానం: సుమిత్ర
సర్వకళలకు వేదముల్ శాస్త్రములకు
అఖిల నాదాల కాధారమైన నేను
సరసి జాసను కూరిమి సఖియనేని
భస్మమైపోవుగాక ఈ పాపచయము
అష్టసిరుల నేలు యజమానురాలను పాట సాహిత్యం
లక్ష్మి పద్యం -2
రచన: సముద్రాల (జూ)
పాడినవారు: విజయలక్ష్మి
అష్టసిరుల నేలు యజమానురాలను
హరియురంబు నందు వరలు చెలిని
నేను పరమ సాధ్వి నైనచో ఈ గంగ
విగత సకల దోషయగునుగాక!
నారద పాట - 6
రచన: డా. సి. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ముల్లోకములకు కన్నతల్లులు
మునులకు సురలకు కల్పవల్లులు
తగని అసూయకు తలపడినారే
ఎంతెంతవారైన ఇంతే అయారే
ఆహా ఏమందు అదైవలీల
ఊహాతీతము కాదా ॥
ప్రభూ దయానిధే పాట సాహిత్యం
అనసూయ పాట - 7
పాడినవారు: పి. సుశీల
రచన : కొసరాజు
ప్రభూ దయానిధే
దివ్యతేజా! ఓ నాగరాజా! జయశుభ చరితా
ఫణికుల జాతా! మమ్ముబ్రోవవా!
విశ్వహితా భయరహితా వినవే మా మొరా!
ఓ నాగరాజా!
చరణం: 1
నాగులచవితికి మరువక నీకూ
పాలు పోయుదుము కాదా -
పాలు పోయుదుము కాదా
మధుర మధురమగు పాయసముల
వేద్యము నిత్తుము కాదా!
నీ పూజ సేయుదుము కాదా!
పాలను పోసే పడతిని కానా
జాలిని చూపవు న్యాయమేనా నీ కిది ధర్మమేనా
విషంగ్రక్క చూచేవా-నాపతి ప్రాణం తీసేవా
పసుపు కుంకుమ నిల్పి కాపాడవా
ఓ నాగదేవతా!
చరణం: 2
మహావిష్ణుపానుపు వే-శివుని మెడలోనిహారము వే
భువిచేమోడ్పులం దెద వే-ఇటు సేయంగ నీకగునే
యుగము లెమారినా
జగములెమారిన
దైవముగా నిను ధ్యానింతుమూ
నిను పూజింతుమూ
దయలేదా! మామీదా! గుణభరితా
ఓ నాగదేవతా!
ఆలయమేలా అర్చనలేలా పాట సాహిత్యం
నర్మద పాట 8
చిత్రం: సతీ అనసూయ (1971)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఆ దైవము నిజముగ ఉంటే
అడుగడుగున తానై ఉంటే
గుడులేల, యాత్రలేలా?
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా
పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
మదిలోన వెలిగే అందం గమనించునా
పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం
మదిలోన వెలిగే అందం గమనించునా
ఈ లోకులతో పనియేమి
పలుగాకులు ఏమంటేమీ
నా స్వామి తోడురాగా
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా అదే పరమార్థము కాదా
ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా ఆరాధనలేలా
నర్మద - పాటు 12
రచన :డా. నారాయణ రెడ్డి
పాడినవారు: పి.సుశీల
దినకరా జయకరా
పావనరూపా జీవనదాతా ॥
చరణం: 1
ప్రధమకిరణం సోకిననాడే
ప్రాణవల్లభుని పొందితిగాదా
మంగళ కరములు నీ కిరణమ్ములు
మాంగల్యమునే హరియించునా దినకరా
చరణం: 2
లోకములన్నీ వెలుగించుదేవా
నా కనువెలుగే తొలగించేవా
కరుణా సింధూ కమలబంధూ
ఉదయించకుమా ఓ సూర్యదేవా !
చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో
హరణా
సకలచరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్ధరణా
ద్వాదశాదిత్య రూపా రోదసీ కుహర దీపా,
ఉదయించకుమా ఉదయించకుమా ॥
నారదుని పాట - 13 పాట సాహిత్యం
నారదుని పాట - 13
రచన : డా. నారాయణ రెడ్డి
పాడినవారు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ముద్దుల భార్యల ముచ్చటతీర
మువ్వురుమూర్తులు ఒకటైనారా
భార్యావశులో భక్తాధీనులో
విదితము సేయగ వెళుతున్నారా
ఆహా ఏమందు ఆ దేవలీల
ఊహాతీతము కాదా
త్రిమూర్తుల గానం - 14 పాట సాహిత్యం
త్రిమూర్తుల గానం - 14
రచన : డా. నారాయణరెడ్డి
పాడినవారు:పి. బి. శ్రీనివాస్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జయదేవ్
మంచి మనసును మించిన దైవం
మహిలో కలదా నరుడా ఇది
మరువకురా పామరుడా||
ముక్కు మూసుకొని నీటమునిగినా
మోక్ష సంపద దొరకదురా
చిత్తశుద్ధి లోపించిన పూజలు
చేసిన ఫలితం చిక్కద రా
దేవుని నామము లెన్నైనా దీ
వించే దైవం ఒక టేరా ॥
మంచి మనసును
తోటి మనిషినే అంటరాదని
గీటు గీసుకొని ఉన్నావా
కులమతాలనే కోటలు కట్టే
కుమ్ములాడుకుంటున్నావా
అందరు దేవుని సంతతియేనని
అసలు సత్యమే మరిచేవా
అనసూయ : పదం 5 పాట సాహిత్యం
అనసూయ : పదం 6
రచన :సముద్రాల (జూ)
పాడినవారు: పి. సుశీల
పతియే దైవంబుగా నెంచు పడతినేని
స్వామి పదసేవ మరువని సాధ్వినేని
నన్ను అవమాన మొనరింపనున్న మునులు.
ఈక్షణమునందె పాపలయ్యెదరు గాక !
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు... సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు… క్రుంగదీయకు
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్... పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్... నిల్వబెట్టవోయ్
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా
ఓ చందమామ ఇటు చూడరా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: కె.రాణి
ఓ చందమామ ఇటు చూడరా మాటాడరా
ఓ చిన్న దానా నిను వలచినదానరా
పున్నమరేయి వెన్నెల హాయి
కన్నె కలువ కనుసన్న చేసెరా
అందరాని ఆకాశమందునా
ఎందుకురా దోబూచులాడెదవు
చుక్కలమీద మక్కువ నీకు
చక్కలిగింతలు మా కెందుకులే
చందమామ రానేల నీవిటు
చాలు చాలు పోవోయి తొందరగ
అటు చూడరా మాటాడజాల నటుచూడరా
కారుమబ్బు నిను కబళించుటకై
తెరలు తెరలుగా చనుదెంచెనురా
పొంచి రాహు పగబూనివటగా
తలంచె నెరింగి తొంగిపో
ఓదేవా మొరవినవా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సదాశివబ్రహ్మం
గానం: పి.లీల
ఓదేవా మొరవినవా
మీద దయగనవా
అలలు పొంగే సాగరాన తీరమేలేదా
కారుచీకటి జీవితాన దీపమేలేదా
నేర మెరుగని దీన జనులకు దారియేలేదా
జానకి సతి జంట బాసీ వనమునందు
తిరుగులాడిన నాటిగాధ మరచిపోయితివా
చలము మానీ చరణ మొసగి పలుక వాదేవా
ఆశలే అలలాగా ఊగెనే సరదాగా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం: ఘంటసాల
ఆశలే అలలాగా ఊగెనే సరదాగా
ఓడలాగా జీవితమంతా ఆడేముగా
యవ్వనంబను గాలిలో యెదురు వలపుల తేరులో
ఆలుమగలూ జతగా మురిపెముగా సుఖింతురుగా
మాటే మరచీ పోయేరుగా
జీవితమూ కడతీరెలే దేశముతో పనిలేదులే
సొగసు వయను మరలా రావిటులా ముసలితనమే మేలా
లం పోకడ చూడగ యెంలో వితౌనిలా
తుపానులోని పడవవలె ఊపివేయును కష్టములే
తనువు ధనమూ స్థిరమా ఇది నిజమా
సుఖము శాశ్వతమా
బ్రహ్మ వాసిన వ్రాతా తెలియా సామాన్యమా
వన్నెలు కురిసే చిన్నదిరా పాట సాహిత్యం
చిత్రం: శభాష్ రాముడు (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం: జమునారాణి
వన్నెలు కురిసే చిన్నదిరా యిది నిన్నే వలచెను రా
యిక చేయీచేయీ కలిపావంటే హాయేను రా
నీరొట్టె నేతిలో పడుతుందిరా
నిలువునా కధ రక్తి కడుతుందిరా అందుక నే
కోరిక ఉంటే వారేవా
కోరిక ఉంటే - వారేవా - ఖుషీ దీర్చుకోరా
వడిలో ఉన్నా ముద్దులగుమ్మను వదిలి పెట్టుకోబోకురా
జరిగిపోయిన రోజు తిరిగి రాదోయీ
రేపు సంగతి నీవు మరచిపోవోయీ - అందుక నే
కంటికి నచ్చిన నవ్వుల రాణీ ఒంటిగ చిక్కెనురా
కళ్లు మూసుకొని కానకపోతే చెప్పకుండ దౌడేయురా