Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Usha Mulpuri"
Krishna Vrinda Vihari (2022)



చిత్రం:  కృష్ణ వ్రింద విహారి (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: నాగ శౌర్య , షెర్లీ సేతియ
దర్శకత్వం: అనీస్ ఆర్. కృష్ణ 
నిర్మాత: ఉష మల్పూరి
విడుదల తేది: 06.05.2022



Songs List:



వర్షంలో వెన్నెల్లా పాట సాహిత్యం

 
చిత్రం:  కృష్ణ వ్రింద విహారి (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: శ్రీమణి 
గానం: ఆదిత్య ఆర్.కె, సంజన కల్మన్జీ

రా వెన్నెల్లో వర్షంలా
రా వర్షంలో వెన్నెల్లా
అందాలిలా అందాయిగా
తాగిపోరా ఓ మనోహరా

నీ ఏకాంతం నాదేరా
నా ఏదైనా నీదేరా
వందేళ్ళిలా ఉండాలిరా
మొత్తం నువ్వే నా సొంతం కారా

నీ కురులతో సూర్యున్నే కప్పేసి
రేయల్లే మార్చావుగా
నా మనసుకే రెక్కల్నే కట్టేసి
ఆశల్లో విసిరావుగా, ఆ ఆ

హే, ఫాలింగ్ నీ ఒళ్ళో
హే, ఫ్రీజింగ్ కౌగిట్లో
హే, బ్రీతింగ్ నీ ఊపిరిలో
హే, ఇన్నాళ్ళు సోలో
హే, ఈరోజే ఫ్లో లో
హే, అవుతున్నా నిను ఫాలో

నీ కౌగిళ్ళు దాటి
కాలం ఉన్నదా
నీ నీడల్ని దాటి
లోకం ఉన్నదా

నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చై
నువ్వంటే నాకే పిచ్చై
ఏ మచ్చ లేనట్టి
చందమామవు నీవో

కలలాగినా అలలాగినా
ఈ దారిన
మన అడుగాగునా, ఆ ఆ

హే, ఫాలింగ్ నీ ఒళ్ళో
హే, ఫ్రీజింగ్ కౌగిట్లో
హే, బ్రీతింగ్ నీ ఊపిరిలో
హే, ఇన్నాళ్ళు సోలో
హే, ఈరోజే ఫ్లో లో
హే, అవుతున్నా నిను ఫాలో



ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు పాట సాహిత్యం

 
చిత్రం:  కృష్ణ వ్రింద విహారి (2022)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం:  హర్ష 
గానం: హరిచరణ్

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు
మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల
అమ్మో ఇంత గొప్ప మాయలా

ఏముందిరా పూవల్లే
తారా చేత చిక్కిందిరా
కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా
తనందాన్ని కళ్ళకద్దరా

చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే
ఆమె రూపు రేఖలా
కురులలో చిక్కుకున్నాయి చూపులే
పైటలే దారి చెప్పవే హలా

అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్న
నిను పూజించి పిలిచారంటే
యుద్ధమైన ప్రకటించేయనా

ఏ కవులు పాడని
ఏ కథలు రాయని
అందాన్నే చూస్తున్నా
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా

జిలుగులే చల్లే ఆ పాలపుంతని
పెదవిపై పోసి నవ్వకే అలా
కాలాలలో మోయలేనంత హాయిని
కనులలో దాచి వెళ్లకే అలా, హలా

Palli Balakrishna Friday, May 6, 2022
Aswathama (2020)



చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్
నటీనటులు: నాగ శౌర్య, మెహరీన్, జిష్షు శంగుప్త
దర్శకత్వం: రమణ తేజ
నిర్మాత: ఉమా మల్పురి, శంకర్ ప్రసాద్ మల్పురి
విడుదల తేది: 31.01.2020



Songs List:



అశ్వద్ధామ పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దివ్యా కుమార్ 







నిన్నే నిన్నే ఎదలో నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రమేష్ వాక చర్ల
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమావాస్యే పున్నమిగా తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

నా గుండెలో ప్రియ రాగాలే 
మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే 
నలిగే నీ నడువొంపుల్లో

కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా

అమావాస్యే పున్నమిగా
తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక
నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే




మహి పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: పూజాన్ కోహ్లి 

మాహి మాహి
చూస్తుంటే నువ్వులా
అందాల బొమ్మలా

చూస్తుంటే నువ్వలా అందాల బొమ్మలా
వేలు పట్టి నడిచినావే మీ అన్నతో ఇలా
కళ్ళలో కాంతితో, గుండెల్లో ఆశతో
సిగ్గుపడుతూ బుట్టబొమ్మై ఎదిగావు ఇంతలో
మా అందరి ఊపిరై పెరిగావే
నీలా అల్లరి ఇక నేనే చెయ్యనా

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక

మాహి
మాహి

రెండు మనసులే ఒకటయ్యే వేళలో
కలపనా ఈ జంటనే
నాకే తెలియని కల నిజమౌతున్నది.
తెలపనా ఈ క్షణమునే
విడి విడిగా మనమున్నా
వీడని నీడను నేనులే
ముసి ముసి నీ నవ్వులకే తోడుగా నేస్తం తానులే
మా ప్రాణమే దూరమై వెళుతున్నా
నువ్వే ప్రాణమై బ్రతికే జత దొరికెనే

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక 






అండగా అన్నగా పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: వి.యన్.వి.రమేష్ కుమార్ 
గానం: వేదాల హేమచంద్ర 

అండగా అన్నగా 

Palli Balakrishna Wednesday, February 17, 2021
Nartanasala (2018)


చిత్రం: నర్తనశాల (2018)
సంగీతం: మహతి స్వర సాగర్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మహతి స్వరసాగర్, సమీర భరధ్వాజ్
నటీనటులు: నాగసౌర్య, కాశ్మీర, యామిని భాస్కర్
దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి
నిర్మాత: ఉష మూల్పూరి
విడుదల తేది: 30.08.2018

హా ఎగిరెనే మనసు సీతాకోకలాగా
ఎగిరెనే ఎపుడు లేదిలాగా
నువ్విచ్చిన రెక్కల వల్లేగా
చుక్కల్లో విహరిస్తున్నాగా..

మెరిసెనే నా ప్రాణం వానవిల్లులాగా
మెరిసెనే మైమరచిపోయేలాగా   
నువ్వద్దిన రంగుల వల్లేగా
సరికొత్తగ కనిపిస్తున్నాగా

తొలిసారి పెదవి గమ్మంలో
చిరునవ్వే అడుగుపెట్టింది
కడదాకా ఉండిపోతే బాగుండనిపిస్తోంది

తొలిసారి గుండెసడి లోకి
అలలాంటి అల్లరొచ్చింది
ప్రతిసారి కావాలంటూ అడగాలనిపిస్తుంది

 ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే
  ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే
 
చల్లగా చిరుగాలై చుట్టేశావుగా హో..
మెల మెల్లగా సెగలోకీ నెట్టేశావుగా హో..
నాలో నే నవ్వేస్తున్నా నాకై నే వెతికేస్తున్నా
నీలాగే కనిపిస్తున్నా హయ్యాయ్యో నీవల్లే
నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందే లేదు
తొలిసారి కావాలందీ నిన్నేలే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రేమించే మనసుంటే
ఏ మనసూ చూస్తూ ఆగదే

ప్రేమంటే ఇంతే ప్రేమంటే ఇంతే
ప్రాణాలే ఇచ్చేద్దాం అనిపిస్తూ ఉంటుందే

Palli Balakrishna Friday, January 25, 2019
Chalo (2018)



చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
నటీనటులు: నాగశౌర్య , రష్మిక మందన
దర్శకత్వం: వెంకీ కుడుముల
నిర్మాత: ఉషా ముల్పూరి
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
బ్యానర్: ఐరా క్రియేషన్స్
విడుదల తేది: 02.02.2018

(చలో సినిమా సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్  మణిశర్మ గారి అబ్బాయి)



Songs List:



చల్ గొడవ పాట సాహిత్యం

 
చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యాజిన్ నిజార్

క్రౌడు చూస్తే కంట్రోలవ్వడు
వీడు కయ్యమంటే కాలుదువ్వుడు
నన్ను ఏడిపించి నవ్వుకుంటాడు
ఎంత కక్ష కట్టినాడు దేవుడు

జర దేఖో గురువా
గోడలకేం కరువా
తగువులు ఎటు ఉంటె
అటే అడుగు పడదా

ఎదుటోడెవడైన
ఎనకొచ్చేదెవడైన
చెయ్యి దురదే పెడితే
చేసిపోతా గొడవ

చల్ గొడవ , చల్ గొడవ
చల్ గొడవ , చల్ గొడవ
గొడవ
ఏ ఏ ఏ చల్ గొడవ

చల్ గొడవ , చల్ గొడవ

నీలకి వీధిచివర గొడవ
నేలకి హద్దులెట్టి గొడవ
హక్కులు దక్కకుంటే గొడవ
చొక్కాలు చించుకుంటూ గొడవ

తిండి దొరకకుంటే గొడవ
తిన్నది అరగకుంటే గొడవ
ఎక్కడ జరుగుతున్నా గొడవ
అట్టాక్ట్ అవుత గురువా

జర దేఖో గురువా
గోడలకేం కరువా
తగువులు ఎటు ఉంటే
అటే అడుగు పడదా

ఎదుటోడెవడైన
ఎనకొచ్చేదెవడైన
చెయ్యి దురదే పెడితే
చేసిపోతా గొడవ

చల్ గొడవ , చల్ గొడవ
చల్ గొడవ , చల్ గొడవ 
చల్ గొడవ , చల్ గొడవ  
చల్ గొడవ



చూసి చూడంగానే నచ్చేశావే పాట సాహిత్యం

 
చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనురాగ్ కులకర్ణి , మహతి స్వర సాగర్ 

చూసి చూడంగానే నచ్చేశావే
అడిగి అడగాకుండా వచ్చేశావే
నా మనసులోకీ హో అందంగా దూకి
దూరం దూరంగుంటూ ఏం చేశావే 
దారం కట్టి గుండె ఎగరేశావే 
ఓ చూపుతోటి హో ఓ నవ్వు తోటి
తొలిసారిగా నాలోపల 
ఏమైయ్యిందో తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు 
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో 
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో

ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువు నా కంట పడకుండా నా వెంట పడకుండా 
ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే
నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే 
నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామీ ఇస్తున్నానులే
ఒకటో ఎక్కమ్ కూడా మరచి పోయేలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన
నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు 
నీలోను చూశానులే
నీ వంక చూస్తుంటే అద్దంలో 
నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో...




చెప్పవే బాలామణి పాట సాహిత్యం

 
చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: స్వీకర్ అగస్తి

నువ్వు నా లోకం అనుకున్నా గనకే
వెళ్లిపోలేకే తిరిగానే వెనకే
నువ్వు నా ప్రాణం అని నమ్మా గనకే
నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే

నిన్నే గెలిపించి వోడా నేనే
మరి మరి గురుతోచి పాడా నేనే
నువ్వేం చేస్తావ్ ఇది నా రాతే!
ముందే తెలుసుంటే నిన్నే నేనే ప్రేమిస్తానా

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లోవర్ చేసావా ..?

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననపుడు
చూపి నన్నే దూరం చేస్తావా ...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..

గొడవే కలిపే గొడవే మలుపే
చివరికి ఆ గొడవే నాతో నాకే
వెలుగై నిలిచా వెనకే నడిచా
చీకటిలో నీడగా మిగిలానే నేనే

నువ్వే నేనంటూ నిన్నటిదాకా
ఒకరికి ఒకరంటూ అనుకున్నాక
నువ్వు నేను అంటూ మధ్యన రేఖ
నువ్వే గీసాక నిన్నే నేను వదిలేస్తానా

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లోవర్ చేసావా..?

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే..

వద్దురా బాబా ఈ లవ్వొద్దు
వద్దురా ఒరేయ్ వద్దురా
కలిసి నిన్నే మరిచా నన్నే
మనసున ఇష్టాలే విడిచేసానే
తెలిసి కథనే వదిలి జతనే
మనను ఇష్టానికి విసిరేసావే .. హీ ..
మీరే ఊపిరని నమ్మేస్తామే
వదిలిన వస్తారనే ఆశతో మేమె
నిన్నే తలుచుకుని బతికేస్తామే
ఒంటరి కళలు కనే అబ్బాయిలంతా
పిచ్చోళ్లేనా

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మకు నాన్నకపుడు
చూపి నన్నే లోఫర్ చేసావా ..?

చెప్పవే బాలామణి
ఏందీ నువ్ చేసే పని
అమ్మను నాన్ననిపుడు
చూపి నన్నే దూరం చేస్తావా...
చెప్పవే.. చెప్పవే..
చెప్పవే.. చెప్పవే..




డ్రంక్ అండ్ డ్రైవ్ పాట సాహిత్యం

 
చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహుల్ సిప్లిగంజ్

చూస్తుంటె పువ్వుల షేపు...కాని పోలందేవి టైపూ 
సెంటిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే 
ఓ చందమామ లాగ బైటకు బిల్డప్ ఇస్తావే 
చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే 
వర్జినల్ని అర్జెంటుగా చూడాలనుందే 
రెయిన్బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే 

టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా 
ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా 

తీసుకెల్లు స్లిప్పులే పాసు కావు సప్లీలే 
కంప్యూటర్ కనిపెట్టినట్టు కటింగులియ్యొద్దే 
యావరేజు బ్యూటివే ఆర్జివి ట్రీటువే 
తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే 
B.com లొ Physics ఉందనె బాపతి నువ్వే 
మన మద్యన కెమిస్ట్రీనే అర్దం చేస్కోవే 
బిల్గెట్సు బిటైనట్టు బిల్డప్పులు వద్దే 
నా దిల్లో గేటు తెరిచే ఉంచానే 

టెక్కులాపవే టెక్కులాపవె చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా 
ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా 

హాలిడే ట్రిప్పులా ఎవ్రిడే ట్రీటు లా 
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే 
రూల్స్ నీకు ఉండవే బౌండరీలసలు ఉండవే 
మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే 
రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే 
నీ వెంటె నేనుంటా వీడని షాడోలా 
ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే 
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా 

టెక్కులాపకె ట్రిక్కులాపకె ఒక్కసారి నువ్ నాతో చేరాకా 
ఓ రేసు కారులా దూసుకెల్లవె బ్రేకులెయ్యకే ఓకే చెప్పకా




అమ్మాయే చల్లో అంటూ పాట సాహిత్యం

 
చిత్రం: చలో  (2018)
సంగీతం: మహతి స్వర సాగర్ 
సాహిత్యం: కృష్ణ మదినేని
గానం:  యాజీన్ నిజార్

అమ్మాయే చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా
లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా
పిల్లేమో తిళ్ళు తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మల్లి పుట్టే పిచ్చునదే నీ పైనా

ఐ లవ్ యు లవ్ యు అంటూ నా గుండె
కొట్టుకుంది
నా హానీ హానీ అంటూ నీ పేరే పలికింది

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

చలో చలో అనీ నీతోనే వస్తూ ఉన్నా
ప్రేమై పైనా పదా
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా
ఇదే నిజం కదా
ఓ మేరీ లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో
మారేనా నన్నే మార్చెనే
ఏ పేయాలి నాజర్ నువ్వంటే నన్నే పిచే
ఇష్టం నాదిలే
దునియా నీదిలే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

తానే తానే కదా నీ వాడు అంటూ ఉంది
మాదే నన్నే తట్టి
ముడే పడే కథా ఈనాడు అంటూ ఉంది
గుడే గంటె కొట్టి
ఓ మేరీ
జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజేలేశానే
ప్రాణం లాగానే
ఓ తుముహి మేరా గుండెల్లో నిన్నే ఉంచాలనే
నేనే లేనులే నువ్వే నేనులే

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

Palli Balakrishna Wednesday, December 6, 2017

Most Recent

Default