Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "D. Kishore"
Pellam Chepithe Vinali (1992)
చిత్రం: పెళ్ళాం చెపితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కాస్ట్యూమ్ కృష్ణ , మురళి మోహన్, శ్రీకాంత్, శివాజీ రాజా, హరీష్ కుమార్, మీనా కోవై సరళ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
బ్యానర్: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: దుగ్గిరాల కిషోర్, మురళీ మోహన్
విడుదల తేది: 15.05.1992

చిత్రం: పెళ్ళాం చెబితే వినాలి (1992)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: గణేశ్ పాత్రో
గానం: చిత్ర, శైలజా మారియు బృందం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి
పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికిదీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మందరకన్నా ముందరకాదా
ఆడితప్పాడు దశరధుడు
ద్రౌపదినొడ్డి తమ్ములతోనే
జూదమాడాడు ధర్మజుడు

మొగుణ్ణి తన్నిన సత్యభామయే
నరకాసురుణ్ణి నరికింది
గరళం నెత్తికి తాకరాదని
గంగ శివుని తలతాకింది
మగువే ఎగువవుతుందిరా
మగాడే దిగిరావాలి ఈవేళరా

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

మగువేమగడి ఆధారం
గుండెలనిండామమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

పెళ్ళాంచెప్తే వినాలి
నీకళ్ళకు గంతలువిడాలి

అమ్మకన్నదీ అమ్మలగన్నది
ఆడపిల్లగా పుట్టింది
తాళి కట్టిన మగనిచేతిలో
తాడుకి బొంగరమయ్యింది

మట్టిలో పెట్టుకు మెట్టినింటికీ
మహాలక్ష్మీ కళతెచ్చింది
మూడుముళ్ళతో ఏడడుగులతో
నూరేళ్లూ నిను మలిచింది
మగడా జగడాలేలరా
సగమూ సగమౌదాము మాక్కూడరా

పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి
పెళ్ళాం చెప్తే వినాలి
నీకళ్ళకు గంతలు విడాలి

మగువే మగడి ఆధారం
గుండెల నిండా మమకారం
ఇంటికి దీపం కంటికి రూపం
కన్నీరొలికిందా శాపం

Palli Balakrishna Tuesday, March 2, 2021
Bharatamlo Bala Chandrudu (1988)



చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ, జయసుధ, పూర్ణిమ, మురళీమోహన్
కథ: వియత్నాం వీడు సుందరం
మాటలు ( డైలాగ్స్ ): గణేష్ పాత్రో
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
సమర్పణ: మురళీమోహన్ మాగంటి
నిర్మాత: దుగ్గిరాల కిషోర్
సినిమాటోగ్రఫీ: కె.యస్.హరి
ఎడిటర్: సురేష్ టాటా
బ్యానర్: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 14.10.1988



Songs List:



పౌరుషం నా పల్లవి పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పౌరుషం నా పల్లవి 



చిలకమ్మ చెట్టెక్కి కూకుంది పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో

చరణం: 1
చెయ్యేస్తే వణికే రెక్క దాని సోకంత పైసూరెక్క
ఎక్కింది తలకే తిక్క మల్లె మంచాన కోరింది పక్క
మారాకు చీరెట్టి పూరేకు రైకెట్టి మర్యాద చేస్తానులే
కొంగిట్లో ముద్దెట్టి  కౌగిట్లో కన్నెట్టి కవ్వించు కుంటానులే
నీ చెయ్యే కలిసిన చెలిమికి పండుగ ముందే ఉందిలే

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో

చరణం: 2
ఎన్నెన్ని నేర్చావబ్బా నిన్ను కన్నోడు ఎవడోయబ్బా
ఈడేరి పుట్టావమ్మా నిన్ను ఏ తల్లి కందోయమ్మా
లేతాకు నాజూకు నీరల్ల తీసేసి తాంబూలమిస్తానులే
నీ కుర్రబుగ్గల్లో నా ఎర్ర ముద్దిచ్చి రోజాలు కోస్తానులే
నా తల్లో చండును తాకే ముచ్చట ముందే ఉందిలే

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో
చిలకమ్మ గుట్టేమి అవుతుందో
గోరింక గొడవేమి చేస్తుందో
వెన్నెలంటి కన్నె సోకు వెచ్చబడ్డ సందెకాడ
కమ్ముకున్న హాయి చూసి కన్నుగీటెనమ్మో ఈడు

చిలకమ్మ చెట్టెక్కి కూకుంది అమ్మానాయనో
గోరింక గూట్లోకి దూరింది ఓరినాయనో




డింగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

డింగ్ డాంగ్





జింగిడి జింగిడి సిగ్గుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: జొన్నిత్తుల 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జింగిడి జింగిడి సిగ్గుల్లో 




టంగుమని మోగింది గంట పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

టంగుమని మోగింది గంట 



ఏ లాలి పాడాలి పాట సాహిత్యం

 
చిత్రం: భారతంలో బాలచంద్రుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

ఏ లాలి పాడాలి 

Palli Balakrishna Wednesday, January 24, 2018
Aavida Maa Aavide (1998)



చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
నటీనటులు: నాగార్జున, టబు , హీరా రాజగోపాల్
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 14.01.1998



Songs List:



చుమ్మాదే చుమ్మాదే పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ , పౌర్ణిమ

చుమ్మాదే చుమ్మాదే చుం చుమ్మని చక్కని చుమ్మాదే 
అమ్మా దేక్ అమ్మా  దేక్ జుం జుమ్మున యెగబడుతున్నాడే 
సొంపులు పెరిగిన సోనా 
చంపలు కొరకన కూనా 
నెమ్మది కష్టము లోన 
తిమ్మిరి తెగ ముదిరేనా 
కాదన్న అవ్నన్న వదలను యేమైనా 

చుమ్మాదే చుమ్మాదే చుం చుమ్మని చక్కని చుమ్మాదే 
అమ్మా దేక్ అమ్మా  దేక్ జుం జుమ్మున యెగబడుతున్నాడే 

నాకు తెలిసి నువ్ love లో పడటం first time అనుకుంతా హ హ 
face చూసి ఆ సంగతి యెట్టా పసి గడతావంటా 
practies ఉంటె ప్రేమికుడెవడూ permission అడగడు kiss కోసం 
warning ఇచ్చి fairing చేద్దం అనుకోవదమా నా దోషం 
వాదనలో time అంతా waste ఐపోతుంది 

చుమ్మాదే చుమ్మాదే చుం చుమ్మని చక్కని చుమ్మాదే 
అమ్మా దేక్ అమ్మా  దేక్ జుం జుమ్మున యెగబడుతున్నాడే 

ఒక్కసారి kiss తగిలిందంటె once more అంటావే 
మల్లి మల్లి ఇమ్మన్నానంటె వమ్మో అంటావే 
ఇచ్చిన కొద్ది ముచ్చట ముద్దే లక్షనముందే ముద్దుల్లో 
లక్షల కొద్ది అచ్చులు గుద్దే ప్రెస్స్ ఉందా నీ లిప్పుల్లో 
యేముందో చూదనిదే వద్దనుకోవద్దే 

చుమ్మాదే చుమ్మాదే చుం చుమ్మని చక్కని చుమ్మాదే 
అమ్మా దేక్ అమ్మా  దేక్ జుం జుమ్మున యెగబడుతున్నాడే 
సొంపులు పెరిగిన సోనా 
చంపలు కొరకన కూనా 
నెమ్మది కష్టము లోన 
తిమ్మిరి తెగ ముదిరేనా 
కాదన్న అవ్నన్న వదలను యేమైనా 





హే వస్తావా చూస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీ, అనురాధ శ్రీరామ్

హే వస్తావా చూస్తావా




ఇంటికెళదాం పదవమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు , చిత్ర ,స్వర్ణలత

ఇంటికెళదాం పదవమ్మో .. 
అంత అర్జెన్టేన్తమ్మో 

ఓహ్...ఓహ్...ఓహ్...ఓహ్... 
ఓహ్...ఓహ్...ఓహ్...ఓహ్... 
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో... 
నను కదిలిస్తుంటే కాదలేనమో...... 
ఓహ్...ఓహ్...ఓహ్...ఓహ్... 
ఓహ్...ఓహ్...ఓహ్...ఓహ్... 
ఇంటికెళదాం.పదవమ్మో .. 
అంత అర్జెన్టేన్తమ్మో ... 

సైడ్ యాంగిల్ లో నువ్వు శ్రీదేవి అవుతావు . 
టాప్ యాంగిల్ లో టబు లాగ తికమక పెడుతున్నావు ... 
నన్నే చూస్తూ తమరు దేన్నో ఊహిస్తారు .. 
నేనూ ఇంకో హీరో పేరు చెబితే ఏమవుతారు 
పోన్లే పోలేరమ్మ పోలిక చాలించమ్మా 
పోలిక లేనే అందం నాదని పొగడాలండి తమరు.... 
పొగరు ఫిగరు నీతో సరి ఎవ్వరు 
ఓహ్..హా....హా....ఓహ్..హా......ఓహ్..హా 
ఓహ్..హా....హా....ఓహ్..హా......ఓహ్..హా 
ఇంటికెళదాం పదవమ్మో .. 
అంత అర్జెన్టేన్తమ్మో... 

బాహాటంగా అయినా బాగానే ఉంటుంది .... 
భార్య భర్తల భాగోతానికి 
లైసెన్సు ఉంటుంది ....yess .. 
బాగోదని కాదండి....పాపం అటు చుడండి.. 
మననే చూస్తూ ఒంటరి వాళ్ళకి మనసేమవుతుందీ ..... 
కళ్ళని మూస్తే చాలు కనిపించరు ఇంకెవరు .... 
కిందటి జన్మలో మీరు తప్పక పిల్లై పుట్టుంటారు .. 
అందరి ముందర ....అల్లరి సరదాలే... 
ఓహ్..హా....హా....ఓహ్..హా..హా.హా..హా 
ఓహ్..హా....హా....ఓహ్..హా......ఓహ్..హా 
ఇంటికెళదాం పదవమ్మో .. 
అంత అర్జెన్టేన్తమ్మో... 
హా....హా...హా.....లా..లా...లా.... లా 
హా....హా...హా.....లా..లా....లా... లా 
నిను చూస్తూ ఉంటే మూడొస్తుందమ్మో... 
నను కదిలిస్తుంటే కాదలేనమ్మో...... 
యా....యా..యా....యా.. .యా..యా 
యా ..యా.....యా .ఒకే.....యా..యా 
లా లా...లా లా...లా లా...లా లా... 
లా లా...లా లా...లా లా...లా లా...




ఓం నమామీ అందమా పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, చిత్ర

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా 
ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా 
కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ 
నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ 
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ 

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా 

ఓ.. సోనా సొగసు వీన నిలువునా నిను మీటనా 
నే రాన నర నరాన కలవరం కలిగించనా 
కల్లార నిన్నె చూస్తు ఎన్నొ కలలే కంటున్నా 
ఇల్లాగె నిత్యం ఆ కలోనే ఉండాలంటున్నా 
ఈ క్షణం శాస్వతం చెయ్యుమా 

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా 

నీ యెదలో ఊయలూగే ఊపిరి నాదే మరీ 
నా.. ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలీ 
యెన్నెన్నొ జన్మాలెత్తి నేనె నేనై పుట్టాలి 
అన్నిట్లొ మల్లి నేనె నీతో నేస్తం కట్టాలి 
కాలమే ఏలుమా స్నేహమా ఓ ఓ 

ఓం నమామీ అందమా ఆనందమే అందించుమా 
ఓం నమామీ బంధమా నా నోములే పండించుమా 
కౌగిల్ల కారగారం చేరడానికి ఏ నేరం చెయ్యాలో మరీ 
నూరెల్లు నీ గుండెల్లొ ఉండడానికి ఏమేమి ఇయ్యలో మరీ 
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ 




తహ తహ పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత

తహ తహ తహ తహ తహ తహ
అన్నది నువ్వేలే



టూ ఇన్ వన్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆవిడ మా ఆవిడే (1998)
సంగీతం: శ్రీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, సుజాత, అనురాధ శ్రీరామ్

టూ ఇన్ వన్


Palli Balakrishna Sunday, December 3, 2017
Varasudu (1993)


చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , కృష్ణ , నగ్మా
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: డి.కిషోర్
విడుదల తేది: 05.05.1993

పల్లవి:
ఒ..ఒ..ఒ.. ఓరియా
ఒ..ఒ..ఒ.. ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

చరణం: 1
పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా
బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా
మాయమాటలింక చాలు పోకిరి ఇటు రా మరి
కాక మీద ఉంది పిల్ల డింగరి చూసై గురి
కరగదీయనా... అరగదీయనా...
చిక్కావులే ఎడాపెడా చిన్నారి

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా  ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా కులుకుతుంటే
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని కుదురుగుంటే
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

చరణం: 2
ఉంగా ఉంగా ఓరి నాయనో..
ఓపలేనురోయ్ వన్నెకాడా
వయ్యారంగా అస్కుబుస్కులు
మొదలు పెట్టనా మంచెకాడా
తీపి తిక్క రేగుతోంది పిల్లడా నీ జిమ్మడ
సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే పద గుమ్మడి
దొరికినానని కొరకమాకురో
సందిట్లో చెడమడా బావయ్యో

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా..
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య..
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా

సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్..
సిలుకు చీరా రైకా కొనిపెడతాలే
గొడవమాని..ఓయ్..
కుదురుగుంటే..ఓయ్..
మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే

ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా
ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా
ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య
ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా


*******   ********   ********


చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్

మెత్త మెత్తగా తలకెక్కుతుంతది
మత్తు మత్తుగా అహ ముంచుతుంతది
నులి వెచ్చని ఎత్తుల జిత్తుల గాలమేసి గోలుమాలు చేస్తుంది ..
డేంజర్...  యమ డేంజర్

వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్
విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్

చరణం: 1
ఒక్క లుక్కే చాలు
ఒక్క లుక్కే చాలు..
చమక్ చం చం... చుక్కలన్నీ నక్కే చోటికి
నే దూసుకుపోతా
ఒక్కటిస్తే చాలు
ఒక్కటిస్తే చాలు...
జమక్ జం జం... సిగ్గుపడ్డ సొగసంతా
నీకే సొంతం చేస్తా
వయ్యారమహో వల వేసే
ఇది కనికట్టు...  అది కనిపెట్టు
కవ్వింపులతో కలబోసి
ఇది తొలిమెట్టు...  ఇక తలపెట్టు

కన్ను గీటితే...  వెన్ను మీటనా
చిరునవ్వులు రువ్వుకు పొమ్మని
కన్నె సోకు కరగదీసి పోతుంది

డేంజర్...  యమ డేంజర్
వరదల్లే వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ
డేంజర్...  యమ డేంజర్

చరణం: 2
బుగ్గ కాటే బాయ్యో...
బుగ్గ కాటే బాయ్యో...
ధనక్ దన దన... కొత్త కోక నలిగే
కౌగిలిలో బానిసనవుతా

సిగ్గు దాటేయ్ పిల్లో...
సిగ్గు దాటేయ్ పిల్లో....
సమక్ సం సం... కుర్ర వేడి ముదిరే
నీ ఒడిలో జాతర చేస్తా

తయ్యారు రా హో తెర తీశా
ఇది మలిమెట్టు ఇక జతకట్టు

అయ్యారే సుఖం శృతి చేశా
ఇది ఎవెరెస్ట్ ... ఇక నో రెస్ట్
చోటు దొరికితే... చాటు చేరనా
ఎరుపెక్కిన ఒంపులు సొంపులు
లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే

డేంజర్...  యమ డేంజర్
యమ యమ యమ యమ డేంజర్


*******   ********   ********


చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...

ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున

ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...

చరణం: 1
చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలేగుంది భేటీనీతోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ... చేసెయ్యి కళ్లతోటి
ఇచ్చేయి ముద్దు చీటీ... కౌగిళ్లు దాటి
ఒకటే సరదా...  వయసే వరద
కలలే కనక కథలే వినక మర్యాద
చురుక్కు చలెక్కి అడక్క అడిగిన

ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...

చరణం: 2
ఇదేం ప్రేమ బాబూ ఇలా చంపుతుంది
అదే ధ్యాస నాలో మొదలైంది
పదారేళ్ల ప్రేమ కథంతేను లేమ్మా
అదో కొత్త క్రేజీ హంగామా
పొద్దుపోదు...  ముద్దైనా ముట్టనీదు
నిద్రైనా పట్టనీదు...  నా వల్ల కాదు
ఒకటే గొడవ...  ఒడిలో పడవా
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవ
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన

ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...

ఈనాడే తెలిసింది నీ తోడే కలిసింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలేసి కలేసి నిలేసి మనసున

ధీం తనక్ ధీం... ధీం తనక్ ధీం
కొత్తగుంది ప్రేమ.. ఓ...
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తుగుంది భామా... ఓ...


*******   ********   ********


చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా
ముద్దెలేని చెంపకు పొద్దె పోదు చంపకూ
పెదవి పెదవి కలిసినప్పుడు
చిలిపి చదువు చదివినప్పుడు
ఎదుట నిలిచె యెదను తొలిచె
వలపు ఒడిని వొదిగినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

తనువులకు తపనలు రేగె అడిగినది అచ్చటా
చొరవలకు దరువులు ఊగీ ముదిరినది ముచ్చటా
చలేసి గుండె గంట కొట్టెనంటా
బలేగ తేనె మంట పుట్టెనంటా
అనాస పండు లాంటి అందమంటా
తినేసి చూపుతోటి జుర్రుకుంటా
తియ్యనైన రేయిలో విహారమూ
మోయలేని హాయిలో ప్రయానము
మోగుతుంది మోజులో అలారమూ
ఆగలేక రేగె నీ వయ్యరమూ
సొగసు దిగులు పెరిగినప్పుడు
వయసు సెగలు చెరిగినప్పుడు
మనసు తెలిసి పనులు కలిసి
కలలు విరిసి మురిసినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా

కులుకులకు కుదిరిన జొడి కొసరినది సందిటా
అలకల్కు అదిరిన డెడీ దొరికినది దోసిటా
చలాకి ఈడు నేడు చెమ్మ గిల్లె
గులాబి బుగా కంది సొమ్మ సిల్లె
పలానిదేదొ కోరె జాజి మల్లె
ఫలాలు పంచమంటు మోజు గిల్లె
ఆకతాయి చూపులో యేదో గిలి
ఆకలేసి మబ్బులో బలే చలీ
కమ్మనైన విందులో కదాకలీ
కమ్ముకున్న హాయిలొ బలాబలీ
ఒదిగి ఒదిగి కధలు పెరిగి
జరిగి జరిగి రుచులు మరిగి
ఎదురు తిరిగి ఎదలు కరిగి
పడిచు గొడవ ముదిరినప్పుడు

చం చం చం ప్రియా మరింక నీ దయా
నీదేలేవయా సుఖాలలో లయా


*******   ********   ********


చిత్రం: వారసుడు (1993)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ
ఓ మై లేడి నీపై దాడీ
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ

బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటూ

నీ పిక్కల పిట పిట చూస్తె
చీప...చిక్కెనమో
traffic jam - traffic jam
కైపెక్కిన మక్కెలు చూస్టె
నొర్ముయ్....కిక్కెనమ్మో
చా... పపరం పపరం
అ కసికసి ఎత్తులలో... ఏయ్
కదలింతలు చూస్తుంటే
నీ పసి పసి బుగ్గలలో
గిలిగింతలు పూస్తుంటే
sexy figure ఆవొ ఇదర్
kiss me kiss me kiss me
kiss me kiss me కుక్కూ

పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు

నీ ప్రేమె దక్కని నాడు పస్తేనమ్మో...
very good.... జాగారం జాగారం
నే జోడి కట్టని నాడు చస్తానమ్మో
better.... శంతి ఓం శాంతి ఓం
ఈ జగమిక మాయేలే
నా బ్రతుకిక రాయేలే
నీ ఒడి ఎడమైపోతే
నే సుడిలొ దూకాలే ....దూకెయ్
రావె చెలి అనార్కలీ
love me love me love me
love me love me కుక్కూ

బుజ్జి పాప హెల్లొ హెల్లొ
చిట్టి పాప ఇస్తావ డేటు
బామ బోలొ బోలొ
తొలి ప్రేమ వేసానె బీటు
ఉడుకు వయసుల జోడీ
కిటుకు తెలిసె కిలాడీ.
ఓ మై లేడి నీపై దాడి
పట్టుకొ పట్టుకొ పట్టుకొ
పట్టుకొ పట్టుకొ కుక్కూ

Palli Balakrishna Friday, September 1, 2017
Nirnayam (1991)


చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: ప్రియదర్శన్
నిర్మాత: డి. కిషోర్
విడుదల తేది: 21.02.1991

ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ దియ్యాలతో
పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో
అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం

తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా
బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం
నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం
కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం
నా ఉదయమై వెలిగే ప్రియ వరం

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం
వెయ్యేళ్ళ దియ్యాలతో
అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో
వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా
సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా
పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం
వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం
రా వెతుకుదాం రగిలే రసజగం

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం
సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో

అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం
అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో




*******  ********  ********



చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:  గణేష్ పాత్రో
గానం: యస్.పి.బాలు

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య గల్గినోడ్ని చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా ఆహా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని యా యా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే నిను లేవదిస్కుపోతా ఆర్ యు రెడీ

హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని హా హా హా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్  జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం



*******  ********  ********


చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో, యస్. జానకి

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా

వెచ్చనైన గుండె గిన్నెలో
వెన్నలింత దాచి ఉంచకు
పొన్న చెట్టు లేని తోటలో
కన్నె వేణువాలపించకు
ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ
పెదవి తాకితే ఓ పాటలే అదీ
ఆమని ప్రేమని పాడే కోయిలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

మౌనమైన మాధవీ లత
మావి కొమ్మనల్లుకున్నది
ఎల్లువైన రాగమిప్పుడే
ఏకతాళమందుకున్నది
తోచదాయనే ఓ తోడు లేనిదే
కౌగిలింతలే ఓ కావ్యమాయలే
ఎన్నడు లేనిది ఎందుకో ఇలా

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా



Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default