-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Alapati Ranga Rao"








చిత్రం: రాజకుమార్ (1983)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ ఆరుద్ర
గానం: ఎస్.పి బాలు, ఎస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు, జయ సుధ, అంభిక
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: ఆలపాటి రంగరావు
విడుదల తేది: 1983

జానకి కలగనలేదు
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది
ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం
మన జీవన పారాయణం

రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు

చెలి మనసే శివధనుసైనది
తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనప్పుడు
గెలువనిది ఏది?
ఒక బాణము ఒక భార్యన్నది
శ్రీరాముని స్థిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే
తుది దాకా నీవే.. మరుజన్మకు నీవే

జానకి కలగనలేదు 
రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు 
జానకి పతి కాగలనని ఆనాడు

సహవాసం మనకు నివాసం
సరిహద్దు నీలాకాశం
ప్రతి పొద్దు ప్రణయావేశం
పెదవులపై హాసం

సుమసారం మన సంసారం
మణిహారం మన మమకారం
ప్రతీ రోజు ఒక శ్రీకారం
పరవశ శృంగారం

గతమంటే నీవే కథ కానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే

రాముడు అనుకోలేదు
జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు
రాముని సతి కాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది
ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం
మన జీవన పారాయణం

లాలల లాలలాల
లాలల లాలలాల లాలాలా
లాలల లాలలాల
లాలల లాలలాల లాలాలా


Palli Balakrishna Friday, February 5, 2021





చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి, యస్.పి.శైలజ, జి. ఆనంద్
నటీనటులు: శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, శారద, విజయశాంతి, శ్రీగంగ (తెరపరిచయం)
మాటలు ( డైలాగ్స్ ): మోహన్ దాస్
మూలకథ: కొచ్చిన్ అనిఫా
స్క్రిప్ట్: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: ఆలపాటి రంగారావు
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే
ఎడిటర్: వి.అంకిరెడ్డి
బ్యానర్: శ్రీనాథ్ మూవీస్
విడుదల తేది: 1992

(శోభన్ బాబు ద్విపాత్రాభినయనం)



Songs List:



నింగి నీలాల సాక్షి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా 
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి 
నేనంటే నీవని మరచి 

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 

చరణం: 1
వయసు వచ్చి వేసింది 
సొగసు పందిరి నీకోసం 
వయసు వచ్చి వేసింది 
సొగసు పందిరి నీకోసం 
 మనసు నీకే కట్టింది 
మమత అన్న మాంగళ్యం
కాళ్ళు కడిగే సెలయేళ్ళు
విందు చేసే మావిళ్ళు
చాటు ముద్దుల సాక్షిగా
అవి పాత గురుతుల సాక్షిగా

చరణం: 2
ఇంద్రధనస్సే పంపింది 
పెళ్లినాటికి మధుపర్కం 
ఇంద్రధనస్సే పంపింది 
పెళ్లినాటికి మధుపర్కం 
 రామచిలకే పలికింది 
ప్రేమ పలుకుల శుభమంత్రం
ఎన్నికలలకు కావిళ్ళు
ఎన్ని తపనల కౌగిళ్ళు
రేపు మాపుల సాక్షిగా 
అవి రేపు ఆశల సాక్షిగా

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 
కోటి తారల సాక్షిగా..ముక్కోటి దేవుళ్ళ సాక్షిగా 
తడబడి..పొరబడి..విడివడిపోకు
కౌగిళ్ళు గాలికి విడిచి 
నేనంటే నీవని మరచి 

నింగి నీలాల సాక్షి .... నెల చేలాల సాక్షి 





తూనీగా నీ నడుమ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

తూనీగా నీ నడుము 



ఆకాశంలో చుక్కల్లారా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

ఆకాశంలో చుక్కల్లారా 




కసాయి కాల నాగు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

కసాయి కాల నాగు 



అంబూ చిందరవందర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రతీకారం (1992)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి, దాసం గోపాలకృష్ణ
గానం:

అంబూ చిందరవందర  గందరగోళంలో 
అంబూ చిచ్చరపిడుగుల తప్పుడు తాళంలో
నీ జాతకం నే రాయన నా నాటకం నేనాడన

Palli Balakrishna Monday, January 29, 2018

Most Recent

Default