Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Radhan"
Miss Shetty Mr Polishetty (2023)



చిత్రం: మిస్  షెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023)
సంగీతం: రధన్
నటీనటులు: అనుష్క, నవీన్ పోలిశెట్టి 
దర్శకత్వం: పి.మహేష్ బాబు 
నిర్మాతలు: వంశీ, ప్రమోద్ 
విడుదల తేది: 2023



Songs List:



నో నో నో నో పాట సాహిత్యం

 
చిత్రం: మిస్  షెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: యం.యం.మానసి 

పుత్తడిబొమ్మ పువ్వులకొమ్మ
పెద్ద అడుగే వేసిందే
పద్ధతులన్నీ సంకెలలంటూ
తెంచి ముందుకు నడిచిందే

సన్నాయే వద్దంటా మంత్రాలొద్దంటా
పేరంటాలే పడవంటా
వద్దంటా పైరు నారు
వద్దంటా ఏ పాలేరు
పండాలంటా తన పంట

సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే

నీ స్నేహం నో నో నో నో
నీ మోహం నో నో నో నో
నీ బంధం నో నో నో నో
అనుబంధం నోనో నోనో
వద్ధురరెయ్

నీ స్నేహం నో నో నో నో
నీ మోహం నో నో నో నో
నీ బంధం నో నో నో నో
అనుబంధం నోనో నోనో

ప్రేమించే సమయం లేదే
ప్రేమన్న ప్రశ్నే రాదే
జన్మంతా జామైపోయి
జంజాటంలో గుంజీలొద్దే

స్మార్ట్ ఫోనులా కాలంలో
హైఫై వైఫై లోకంలో
వైఫై మళ్ళీ మళ్ళీ కమిటయ్యే
కష్టాలొద్దే వద్దురా బాబు

కళ్ళాపి చల్లేటి
ఇల్లాలై దొల్లాలా
కల్లోలం తెచ్చేటి
సుల్లోకే వెళ్ళాలా

సలహాలు వద్దే కథలొద్దే
కలలను పంచే కనులొద్దే
ఎటకారాలొద్దే అసలొద్దే
కలకాలం కాల్చే వలపొద్దే

మ్యాచ్ అయ్యేటి మాచో మ్యానే
లేడు ఇక్కడ లేడు ఇక్కడ
మార్కు పెట్టి పోదామంటే
వాడు ఎక్కడ వాడు ఎక్కడ

నీ స్నేహం నో నో నో నో
నీ మోహం నో నో నో నో
నీ బంధం నో నో నో నో
అనుబంధం నోనో నోనో

నీ స్నేహం నో నో నో నో
నీ మోహం నో నో నో నో
నీ బంధం నో నో నో నో
అనుబంధం నోనో నోనో

నీ స్నేహం నో నో నో నో
నీ మోహం నో నో నో నో
నీ బంధం నో నో నో నో
అనుబంధం నోనో నోనో

Palli Balakrishna Tuesday, April 4, 2023
Adbhutham (2021)



చిత్రం: అద్భుతం (2021)
సంగీతం: రధన్ 
నటీనటులు: తేజ సజ్జా, శివాని రాజశేఖర్
దర్శకత్వం: మాలిక్ రామ్
నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ళ 
విడుదల తేది: 2021



Songs List:



అరెరే ఏంటి దూరమే పాట సాహిత్యం

 
చిత్రం: అద్భుతం (2021)
సంగీతం: రధన్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సత్య యామిని స్వీకర్ ఆగస్తి

అరెరే ఏంటి దూరమే
నను పిలిచే కొత్త తీరమే
వేరు వేరు దారులే
రెండూ కలిసే

ఎదురే చూసే కనులకే
ఎదురున్నా కనబడలేదులే
కాలం చెరిపే మాయిది
నేడే చూడే

ఎన్ని చెప్పు నాకైతే
అచ్చు నిను చూసినట్టు ఉందే
నిన్ను విడిచి నాతోని రానని
కదలనంది కాలే

ఎదురుపడి గ్రహములు కలిసినవే
అదిరిపడి హృదయము ఎగిసెనులే
సమయములు మరిచిక శకునములే
విరహముకు సెలవిక పలికెనులే

విడువిడిగా ఘడి పెట్టి డే టుగెదర్
కలివిడిగ తిరిగిన అనుభవమే
సగసగము పంచిన బిల్డప్పే
ఎవరి బిల్లు వారికి సపరెట్సే

అవునులే ఇది చాలులే నువ్వు
ఠక్కునే చెక్కిళ్ళనే
నా పెదవికి వెళిపోయే

మౌనమే నా మౌనమే
ఎన్నెన్నో ప్రశ్నలేసే
పక్కనే నా పక్కనే
తిరిగేస్తు కానరావే





# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, November 26, 2021
Paagal (2021)



చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: లియోన్ జేమ్స్
నటీనటులు: విశ్వక్ సేన్, నివేత పేతురాజ్, భూమికా చావ్లా
దర్శకత్వం: నరేష్ కుప్పిలి
నిర్మాత: బెక్కం వేణుగోపాల్
విడుదల తేది: 14.08.2021



Songs List:



పాగళ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: చంద్ర బోస్
గానం: రామ్ మిరియాల, మామా సింగ్

కాలేజీ సందులు తిరిగాడు
కోవెల్లు కేఫులు తిరిగాడు
సినిమా హాళ్లకు వెళ్ళాడు
ప్రతి ఒక సీటును వెతికాడు
అమ్మాయి గాని కనబడగానే
లవ్ యూ అంటాడు
ఆ పిల్ల నుండి రిప్లే రాక మొదటికి వస్తాడు
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్
గూగులు గూగులు గూగులు
గర్ల్ ఫ్రెండును వెతికే గూగులు
వీడు పాగళ్ పాగళ్ పాగళ్
ప్రేమ కోసం బతికే పాగళ్

పిల్ల నువ్వు సై అంటే చాలు
రై అని వచ్చేస్తాను
నై అని చెప్పోదే పిల్ల
కై అని ఏడుస్తాను
మేర జేసే ప్రేమికుడు
మళ్ళి నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల
పండగే నీకు అమ్మతోడు
ప్రేమించే పాగళ్ పంచిస్తా కాదల్
తోడు లేని సింగిల్ జన్మకెన్నీ బాదల్
నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్
ఒప్పుకుంటే జిందగీ మొత్తం నీకు జిల్ జిల్
నిను పువ్వులోన పెట్టి చూసుకుంటా రావే ఇల్లా
నీ కోసం కడతా కత్తి లాంటి పాలరాతి ఖిల్లా
నువ్వు ఎట్టా ఉన్న ఏంచేస్తున్నా
పరవలేదే మళ్ళా
నువ్వు ఒప్పుకుంటే మోత మోగి పోతది
మొత్తం జిల్లా…. జిల్లా…

అమ్మాయి కనబడగానే సగం ప్రేమిస్తాడు
అమ్మాయి ఒప్పుకుంటే మన పాగళ్ సారూ
మొత్తం ప్రేమిస్తాడు
ప్రపంచం పెద్దది అంటాడు
ప్రయత్నం చేస్తూ ఉంటాడు
ఈ ఊళ్ళో వర్కౌట్ అవ్వకుంటే
పక్కూరికి పోతానంటాడు
టెలిస్కోపు కన్నులతోటి గాలిస్తుంటాడు
హారోస్కోపు కలవకపోయిన ఆరాధిస్తాడు
అమ్మయిలో అమ్మను చూస్తాడు
ఆ ప్రేమను అన్వేషిస్తాడు
తెగించి ముందుకు పోతాడు
ముగింపు ఈ కథకి ఏనాడూ





సరదాగా కాసేపైనా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కార్తీక్, పూర్ణిమ

ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావే
ఇవ్వాళా ఎవ్వరు పంపారే
ఇన్నేళ్ల చీకటి గుండెల్లో…
వర్ణాలా వెన్నెల నింపారే
దారిలో పువ్వులై వేచెనే ఆశలు
దండగా చేర్చెనే నేడు నీ చేతులు
గాలిలో దూదులై ఊగెనే ఊహలు
దిండుగా మార్చెనే ఈడనీ మాటలు
కొత్తగా కొత్తగా పుట్టిన ఇంకోలా
కాలమే అమ్మగా కన్నాదే నన్నిలా
సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి

చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా
కలలోనే సంతోషం కలిగించే ఊపిరి
ఉదయాన్నే నీకోసం ఉరికిందే ఈ పరి
తల నిమిరే వేళా కోసం వెర్రోడినై
వానలకై నేలలాగా వేచా మరి
వందేళ్ల జీవితానికి అందాల కానుక
అందించినావు హాయిగా వారాలలోనే
చుక్కానిలా నువీక్షణం ముందుండి లాగగా
సంద్రాన్ని దాటిననుగా తీరాలలోనే
చెంతనే చెంతనే నిన్నిలా చూస్తూనే
ఆకాసం అంచునే తాకనే నించునే

సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్న
సరిపోదా నాకీ జన్మకి
చిరునవ్వై ఓసారైనా చిగురించా లోకంలోనా
ఇది చాల్లే ఇప్పుడీ కొమ్మకి
చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన
సంచిలో పోగు చేసి నీకియ్యనా
చిందులేసి సంబరాన్ని ఈ రోజునా
కొంచెము దాచుకోక పంచేయనా



ఈ సింగల్ చిన్నోడే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: బెన్నీ దయాళ్

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఈ సింపుల్ చిన్నోడే
తన లవ్వులో డీపుగా మునిగాడే
ఎక్కడ ఉన్న చంటోడై చిందులు వేసాడే
బేబీ గర్ల్ బేబీ గర్ల్
నిద్దరంది లేదులే కంటికి రెప్పకి మధ్య నువ్వొచ్చి
ఆకలి దప్పిక అస్సలంటూ ఉండదే
పంపవే మత్తు చూపుల మందిచ్చి
హార్టులో మోగేలే నీదే రింగ్టోన్
ఒక కిస్ ఇచ్చి పోరాదే జాను
స్మైలూతో అవ్వదా లైఫ్ కామ్ డౌన్
పక్కనుంటూనే చూస్తావా నన్ను
చేరావ్ ఇలా నా గుండెకి ఇలా
నా ఫేటే ఇలా మారి తిరిగేనా
చూడే పిల్లా నా కల్లే ఇలా
పైపైన మబ్బులో ఎగిరిన

ఈ సింగల్ చిన్నోడే
న్యూ లవ్ లో ఫ్రెష్ గా పడ్డాడే
సిగ్నల్ గ్రీనే చూసాడే
పరుగులు పెట్టాడే
అరెరే ఎటిఎం అయ్యాడే
ఎయి లవ్వులో డీపుగా మునిగాడే
క్యాషు కార్డు నిల్ అయినా పడి పడి నవ్వాడే

కొండల్లా కష్టాలంటే నమ్మనే లేదు చెప్పాలంటే
ఓర్చుకో కాసింత వెయిటే నీ డ్రీములో హాఫె పట్టే బ్యూటే బేబీ
కన్నులు చాలని అలుగుతూ చూపెను కోపమే
గుడ్డిదేరో డౌట్ ఇక తీరేరో
ఈ కాదల్ నీ
క్యూట్ క్యూట్ చిన్నది ట్రై చేయమన్నది
స్పీడ్ ఒద్దు అన్నది ఏం పాపం
ఫాలో మీ అన్నది పోజ్ ఒద్దు అన్నది
స్పేస్ ఇవ్వమన్నది ఎం శాపం
నచ్చేసాడు ఓ స్కెచ్ ఎసాడు
నే వే లోకి బాగానే వచ్చేసాడు
నీ అందం తోనే ఫ్లాట్ అయిపోయాడు
నీ గుండెల్లో జండానే పాతేసాడు




ఆగవే నువ్వాగవే పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరాం, 

ఆగవే నువ్వాగవే




అమ్మ అమ్మా నీ వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరాం, వేద వాగ్దేవి

కనుపాప నువ్వై వెలిగిస్తు
నా కలకు రంగుల మెరిపిస్తు
అడుగుడుగు నీడై నడిపిస్తు
ప్రతి మలుపులో నను గెలిపిస్తు
అండగా ఉండవే ఎప్పుడు నువ్విలా
పండుగై నిండవే లోపల వెలుపల
నువ్వు నాతోడై లేనిదే నేనిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తలను మురిచె చెయ్యి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన సాకనా అన్నీ నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవనై నడపదా
నిండు నూరేళ్లు
నా మోదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

లోకాన అమ్మలంతా
అంధించు ప్రేమనంత
ఒక నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు
మమతవు నీవు
నన్నిల పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరు జన్మలు
నాకేదురు పడిన గాని
నీ ఓడి పాపగా నన్నుండనీ అమ్మ
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ… ఆ… అమ్మా…




ఎన్నో ఎన్నో విన్నాం గాని పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అంటోని దాసం 

ఎన్నో ఎన్నో విన్నాం గాని 




యు ఆర్ మై లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: సిమ్రాన్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్

యు ఆర్ మై లవ్ 




కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: ఆనంద్ అరవిందాక్షన్

వెళ్లిపోతోంది ప్రాణమే
కనబడుతొంది శూన్యమే
వదిలేలుతోంది గాయమే
కన్నీటి జ్ఞాపకమే
వెలివేసింది కాలమే
ఉరి తీసింది ప్రేమనే
ముసిరేసింది మౌనమే
ఒంటరినై మిగిలానే

కనపడవా కనపడవా
కన్నీరై మిగిలేలతావా
చిరునవ్వై ఎదురొచ్చి
చితిలోకే నెడతావా
కనపడవా కనపడవా
శిథిలం చేసి పోతావా
గుండెను కోసే కథ నువ్వై 
కడ దాకా వస్తావా




కనపడవా కనపడవా పాట సాహిత్యం

 
చిత్రం: పాగల్ (2021)
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం: ప్రసన్న కుమార్ బెజవాడ
గానం: సమీరా భరద్వాజ్

Palli Balakrishna Tuesday, August 31, 2021
Jathi Ratnalu (2021)

 



చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
నటీనటులు: రాహూల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి, ప్రియ దర్శి
దర్శకత్వం: అనుదీప్. కె. వి
నిర్మాత: నాగ్ అశ్విన్
విడుదల తేది: 11.03 2021







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామ్ మిరియాల


చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసేయ్
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికల్ తిరిగే ఆ ఊసే

నువ్వు నాకు సెట్టయ్యావని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే
వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగీ లోన
ఫ్లడ్ లైటేసావే

హతేరి నచ్చేసావే
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాన్ని
లోకంలోన రంగులు పుసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే

యుద్ధమేమీ జరగలే
సుమోలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో
పచ్చజెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్తు నీ రేంజైనా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా

మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే
తీసుమారు చిన్నోడిని
డిజె స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బాడ్ ఉన్నోన్ని
నవాబు చేసేస్తివే

అతిలోక సుందరివి నువ్వు
ఆస్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాపై
నీ గుండెకి చేర్పివే 

అరెరే ఇచ్చేసావే 
దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో
నువ్వు ఆనియన్ ఏసావే

అరెరే గుచ్చేసావే 
లవ్వు టాట్టూ గుచ్చ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో
నింబూ చెక్కై హల్చల్ చేసావే

చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే

చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రాహూల్ సిప్లిగంజ్

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డర ఖానులు
వాల్యూలేని వజ్రాలు
మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
శాటిలైటుకైనా చిక్కరు వీళ్లీ గల్లీ రాకెట్లు
డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు
సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ
రాజులు
పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

జాన్ జిగర్

వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తే కోతులు
వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తాయి కొంగలు
ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు
వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు
పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే
బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే

జింగిలి రంగా బొంగరం సింగిల్ తాడు బొంగరం
వీళ్ళని గెలికినోడ్ని బతుకు చూస్తే భయంకరం

వీళ్ళని బాగుచేద్దాం అన్నోడి డిమక్ కరాబ్

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు

వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం
వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం
గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము
పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము
ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు
బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు


భోళా హరిలో రంగ ఆ మొఖం
పంగనామాలు వాలకం
మూడే పాత్రలతో రోజు వీధి నాటకం
శంభో లింగ ఈ త్రికం గప్పాలు అరాచకం
బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం

సూ సూడు హీరోలు
ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు
మన జాతి రత్నాలు
ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు
వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు







చిత్రం: జాతిరత్నాలు (2021)
సంగీతం: రధన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: యోగి శేఖర్

చంచల్ గూడ జైలులో చిలకలయ్యి చిక్కారు
పలకమీదికెక్కిందయ్యో నెంబరు
సుక్కలందుకోని రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే బొక్కలో పడ్డారు

ఏ నిమిషానికి ఏమి జరుగునో
పాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో మన్ను బుక్కిస్తిరే
ఏమి గానున్నదో ఏందో రాత

రంగు రంగుల పాల పొంగులా
మస్తు మస్తు కలలు కంటే
సిట్టి గుండెకే చెప్పకుండనే ఆశ పుట్టెనే

నీళ్ళలో సల్లగా బతికేటి చేపనే
ఒడ్డుకే ఏపీరే యమ తోమ బడితిరే
ఇంటినున్న పుల్ల తీసి అటు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే

అరె మారాజు తీరే ఉన్నోన్ని ఏ రందీ లేనోన్ని
బతుకాగం చెసిండ్రే ఓ బొందల తోసిండ్రే

అరె బేటా..! మీరు ఏది పట్టినా
అది సర్వనాశనం, ఇది దైవశాసనం

ఇంట్ల ఉన్నన్ని నాళ్ళు విలువ తెలువలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారెరో
ఖైదీ బట్టలు, రౌడీ గ్యాంగులు నాలుగు గోడలే నీ దోస్తులాయెరో
అవ్వ పాయెరో, బువ్వ పాయెరో పోరి తోటి లవ్వే పాయే
ముద్దుగున్న మీ లైఫు అందమే పలిగి పాయెరో



Palli Balakrishna Tuesday, February 16, 2021
Husharu (2018)




చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
నటీనటులు: అభినవ్ చుంచు, తేజ్ కూరపాటి, తేజుస్ కంచర్ల, దినేష్ తేజ్,  ప్రియ వడ్లమని, రమ్య పసుపులేటి, దక్ష నగర్కర్, హెంల ఇంగ్లే
దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, ఏ. రియాజ్
విడుదల తేది: 14.12.2018



Songs List:



న న న పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: బోబో శశి 

న న న 




ఉండిపోరాదే పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: సిద్ శ్రీరామ్

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూశాకా
మనసే మురిసే ఎగసే అలలాగా
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిముషం చాలులే

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే




ఫ్రెండ్షిప్ పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: తుషార్ జోషి 

ఫ్రెండ్షిప్





పిచాక్ పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: వరికుప్పల యాదగిరి 
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: వరికుప్పల యాదగిరి

పిచాక్




నాటు నాటు పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్, ప్రియ హిమేష్ 

నాటు నాటు 




నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: అర్జిత్ సింగ్ 

నువ్వే నువ్వే 



ఓ పిల్లా కాబూమ పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: వరికుప్పల యాదగిరి 
సాహిత్యం: కళానిధి మాస్టర్ జి 
గానం: రాహుల్ రామకృష్ణ 

ఓ పిల్లా కాబూమ



ఉండిపోరాదే (Sad Song) పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: సిద్ శ్రీరామ్

ఉండిపోరాదే గుండె నీదేలే (Sad Song)




కాబూమ్ పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: రోల్ రైడ
గానం: రోల్ రైడ

కాబూమ్ 




ఉండిపోతారా (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: రధన్
సాహిత్యం: కిట్టూ విస్సాప్రగడ
గానం: స్పూర్తి యాదగిరి

ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా

కలతై కనులే వెతికేరా నీకే
ఒదిగే తనువే జతలేక తోడై
చుట్టూ నావెంటే ఎంతో మంది ఉన్నా
నా నువ్వే లేవని యాతన
కరిగే కన్నీరే పడుతూనే ఉందే
అర్థం కాలేని వేదన

చూస్తూ చూస్తూనే మాయగా
నువ్వే మారవు శ్వాసగా
మది నిను మరువనని మాటే ఇచ్చెనులే
మరువక కడదాకా ఉండరా

మౌనం చేసే గాయం
మార్చలేదా సాగే కాలం
నన్నేమన్నా ఏమనుకున్నా
నుఫ్లేకుంటే చీకటే

ఉండిపోతారా, గుండె నీదేరా
హత్తుకుంటారా, నిన్ను మనసారా



బ్యాడ్ బాయ్స్ పాట సాహిత్యం

 
చిత్రం: హుషారు (2018)
సంగీతం: సున్నీ MR
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: సున్నీ MR, రోల్ రైడ

బ్యాడ్ బాయ్స్ 

Palli Balakrishna Saturday, January 16, 2021
Yevade Subramanyam (2015)



చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం: రధన్ ,  ఇళయరాజా
నటీనటులు: నాని , విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ
మాటలు ( డైలాగ్స్ ):
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాతలు: ప్రియాంక దత్ , స్వప్న దత్
బ్యానర్: స్వప్న సినిమా
విడుదల తేది: 21.03.2015



Songs List:



బ్యూటిఫుల్ జిందగీ పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: వశిష్ట 
గానం: నిఖిత శర్మ

జంతర్ మంతర్ జాదులన్ని చేసెయ్ నా నీ పైనా 
సారో గీరో జీరో గారంటే మార్చేనా 
సండే మండే రోజేదైనా తమాషా కరోనా 
లైఫ్ ఈస్ ఫుల్ల్ ఆఫ్ వండర్స్ అన్ని ఎంజోయ్ చేయ్ అంటున్నా 
చిన్ని లైఫు లోన గోలు మాలు గోల లన్ని ఎందుకో ఎందుకో 
చిన్ని చిన్ని ఆశలన్ని చిందులేసి నువ్వు అందుకో అందుకో 
పుట్టె ముందు లేవు టెన్షన్సే 
లైట్ తీసుకుంటె అన్ని బిందాసే 
పల్ పల్కుషీని నువ్ పంచుకుంటె 
ఎవ్రిడే కాద కల్లముందు కలర్ఫుల్ డే 

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా 
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా 

నచ్చినట్టుంటె నువ్వే చుట్టు ఉండే ఈ లోకం 
ఒక్కటె నిన్నే మెచ్చుకుంటుందే వెంట వస్తుందే 
చెయ్యి అందిస్తే నువ్వే చేరదీస్తుందే స్నేహం 
నీకు తోడవుతూ నీడగా ఉంటూ వీడిపోదంతే 
ఏక్ దోన్ తీన్ చాల్ 
పుల్ బుస్ హె యార్ 
life is too short so think with your heart 
పంచేస్తు ప్యార్ సాగోయ్ దిల్ దార్ 
ఓ చెరిగి పోని ఘాపకానివోయ్ మిగలాలిగా 

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఒక్కటె ఉందిగా ఈ క్షణం నీది రా 
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జిందగీ ఆగెనె జోరుగా ఎంజోయ్ చెయ్ రా




ఇదేరా ఇదేరా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహిత్ చౌహన్

ఓ మనిషీ ఓ మహర్షీ 
కనిపించిందా ఉదయం 
ఓ మనిషీ ఓ అన్వేషి 
వెలుగైయ్యిందా హౄదయం 
ఆనందం కన్నీరై జారిన క్షణమిది 
నలుపంతా మటుమాయమైనదీ 
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది 
తానెవరో కనుగొన్నదీ 
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా 

వదలనిదే నీ స్వార్దం కనబడునా పరమార్దం 
మనుషులనీ గెలిచేది ప్రేమే కదా 
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం 
జీవించేటి దారే ఇదీ 

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా 

యద సడిలో నిజముందీ కను తడిలో నిజముందీ 
అడుగడుగూ గుడి ఉందీ 
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం 
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం 

ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా 
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా 

ఓ మనిషీ ఓ మహర్షీ 
కనిపించిందా ఉదయం 
ఓ మనిషీ ఓ అన్వేషి 
వెలుగైయ్యిందా హౄదయం




నువ్వు నువ్వు కాద పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్ , రామి

అద్దంలో నిను చూసుకో 
నిన్నే నువ్ ప్రశ్నించుకో 
నువ్వెవరో తెలుసుకో 
Who are you 
Sun of శివ కైలాసం 
My name is సుబ్రహ్మణ్యం 
బిసినెస్ హా మేరా కాం 
All around నాదే దూం దాం 
వేగం నా వేదాంతం 
గెలవడమే నా సిద్దాంతం 
Now You Know Who I Am 

No No No No No No No నువ్వు నువ్వు కాదు 
వెనక్నే ఏ జవాబు రాదు 
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ 
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు 
కంపడు ఒడ్డు పొడవు కాదు 
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ 

మల్టి క్రోర్ కంపెనీకి ఒక్క ఓనర్ నీ 
నాకీ అర్దం లేని క్వస్చిన్స్ యెందుకనీ 
ఆల్వేస్ నేనె నంబర్ వన్ అవ్వాలనీ 
డే అండ్ నైట్ పరుగే పరుగు నా పనీ 
అయ్యో రామ బ్రేకె లేని నీ జర్నీ 
రయ్యంటుందీ హార్టే లేదనీ 
ఏదో చోట కట్టెయ్యండె గుర్రాన్ని 
నీకే నువ్వు తెలిసేదెప్పుడనీ 
నా రూట్ ఏంటొ వేటేంటొ చేరేటి హైటేంటొ 
అన్ని తెలిసిన సూపర్ సుబ్బునీ 

ఎవ్రీ టైం నన్నే నేరు ఓడిస్తూ ఉంటా 
పై పై ఎత్తుల్లోకి ఎదిగిపోతుంటా 
రైటొ రాంగొ నాకు అర్దం అక్కర్లేదంటా 
కోరుకుంది పొందటం నా బర్తు రైటంటా 
ఆకాశంలో జంద పాతె తొందర్లో 
పేరు మూలం మిస్స్ అయితే ఎట్టా 
నక్షత్రాల్ని బేరం చేసె సందట్లో 
గాల్లో మేడలు కట్ట ఓ తంటా 
నేణేచోట ఉన్నన్నో ఆ చోటె నాకిష్టం 
ఎక్కడినుచి వస్తే ఏంటంటా 

నొ నొ నొ నొ నొ నొ నొ నువ్వు నువ్వు కాదు 
వెనక్నే ఏ జవాబు రాదు 
మనసున లెన్సు పెట్టి జర ఆరా తీసి గుర్తించు నువ్వెవరూ 
నొ నొ నొ నొ ఊరు పేరు కాదు 
కంపడు ఒడ్డు పొడవు కాదు 
మసకల పొరలు తీసి నీ లోనికి తీసి రాబట్టుకో ఆన్సరూ





ఎవడే సుబ్రహ్మణ్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామి

ఎవడే సుబ్రహ్మణ్యం




ఓ కలా చూడకే అలా పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  రధన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హరిణి

ఓ కలా ఓ కలా చూడకే అలా 
హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా 
మరో ప్రపంచమే అలా వరించగా 
పరుగులు తీసే నా ఎదకీ నిలకద నేర్పేదెలా 
కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా 

కనులె వెతికే వెలుతురు నీదనీ 
ఇపుడే ఇపుడే తెలిసినదీ 
తననే పిలిచే పిలుపులు నీవనీ 
వయసిపుడే తేల్చుకున్నదీ 
నిదురకి చేరితే జోల నువే 
మెలుకువ వచ్చినా ఎదుట నువే 
ఇక నిను వీడటం ఏలా అదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా 

ఎడమ కుడిలో ఎవరూ లేరనీ 
ఒనికే పెదవే పలికినదీ 
నిజమే పలికే చొరవని ఇచ్చేయ్మనీ 
నసిగినదీ నాంచకన్నదీ 
మనసుకి చేరువా ప్రతి ఒకరూ 
మనకిన దూరమే అని బెదురూ 
మరి నిను చేరడం ఎలా అదెలా 

ఓ కలా ఓ కలా చూడకే అలా




చల్లగాలి తాకుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: ఎవడే సుబ్రహ్మణ్యం (2015)
సంగీతం:  ఇళయరాజా
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సెంథిల్ , రిహిత

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 
ఎందుకంట ఇంత దగా నిన్న మొన్న లేదుకాదా లేదుకదా 
ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటొ లాగుతుందా 
పదనీ తప్పించుకోలేనని తోచెట్టు చేస్తుందా 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ 
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ 
ఎవరో అన్నారనీ మారవే నాలో ఆశలూ 
ఎవరేమన్నారని పొంగెలే నాలో ఊహలూ 
తీరం తెలిశాకా ఇంకో దారిని మార్చాలా 
దారులు సరి అయినా వేరె తీరం చేరేనా 
నడకలు నావేనా నడిచేది నేనేనా 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

ఇంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో 
ఇంతగా పొంగేటంతా అవసరం ఏమో ఎందుకో 
అయినా ఏమైనా ఎద నా చెయి జారేనే 
ఇపుడు ఏ నాడు ప్రేమె నేరం కానందీ 
చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటుంటె 

చల్లగాలి తాకుతున్న మేఘమైనదీ మనసిలా 
నేలకేసి జారుతున్న జల్లు అయినదీ వయసిలా 

Palli Balakrishna Tuesday, January 30, 2018
Manasuku Nachindi (2017)


చిత్రం: మనసుకు నచ్చింది (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: సమీరా భరద్వాజ్
నటీనటులు: సందీప్ కిషన్, అమైరా డస్తర్, త్రిధా చౌదరి
దర్శకత్వం: మంజుల ఘట్టమనేని
నిర్మాతలు: పి.కిరణ్, సంజయ్ స్వరూప్
విడుదల తేది: 26.01.2018

పల్లవి:
పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా
అలవాటే కద నువు కంటి పాపకి
తడబాటెందుకు నిను చూడటానికి
పదవే తల్లి పదమంటు నన్ను తరిమినది

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

కోరస్:
హే నంగ నంగ నారె నంగ నారె
నంగ నంగ నారె నంగ నారె
సయ్యా ఓరే సయ్యా ఓరే సయ్యా (2)

చరణం: 1
జంటకథ లెన్నో విన్నా ఎంతబాగుందో అన్నా
ఇంత ఉంటుందని మాత్రం అనుకున్నానా
మొన్న మరి నీతో ఉన్నా నిన్న నీతోనే ఉన్నా
కొత్తగా కనుగున్నానా ఈ రోజున
ఈ అమ్మాయిలంతా ఇంతే అన్న నేనే
నా అందాలకింక మెరుగులు దిద్దినా
ఓ వయ్యారి నయ్యా ఓ సింగారి నయ్యా
ముస్తాబయ్యి నీకోసమడుగేసినా
నను చూస్తూ నువు పొగడాలనున్నది
నా వెనకాలే తిరగాలనున్నది
అరెరె ఎందుకు అసలింత నాకు ఇంత అవసరమా

పరిచయము లేదా నిను కలువలేదా
నువసలు తెలీదా ఏంటో ఈ వింతా

Palli Balakrishna Tuesday, December 26, 2017
Arjun Reddy (2017)



చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని పాండే
దర్శకత్వం: సందీప్ వేగ్న
నిర్మాత: ప్రణయ్ వేగ్న
విడుదల తేది: 25.08.2017



Songs List:



దూరం దగ్గర చేస్తున్నది పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నిఖితా గాంధి

దూరం దగ్గర చేస్తున్నది 
ఇంకా ఇస్టం పెంచిందదీ 
మల్లి మల్లి కలిసే తొందరా 
కాలాన్నైనా తరిమేస్తుందది 

ఆ దిక్కు ఈ దిక్కు 
మౌనంగా ఒక్కటైయ్యయే... 

నా ఊరు నీ ఊరు 
మనల్ని వేరు చెయ్లేవే... 

రా రా రా... కౌగిలై.... 
రా రా రా...  ఊపిరై.... 

రా రా రా... కౌగిలై.... 
రా రా రా... ఊపిరై.... 

ప్రానం రెక్కలు చాస్తున్నదీ 
నీకై రివ్వున వస్తున్నది 
నీపై వాలి నిదురించాలని 
ఆకాషాన్నె ఓడిస్తున్నది 

నాదాక నువ్ వొస్తె 
నీదాక నేను వొస్తుంటె 
ఈ దేషం ఈ లోకం 
ఇంకింకా చిన్నవైనాయే... 

రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా.... 
రా రా రా రారరా....





తెలిసెనే నా నువ్వె పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: ఎల్. వి.రేవంత్

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని 
తెలిసెనే నీ నేనె నీ నేను కానని 
నాలొ సగం ఇక లేదూ అని 
నా నిన్నలే నన్ను చూసి నవ్వెలే... 

మరు నాడు అన్నదె ఇక ఉండబోదని 
అన్నదీక్షనం..... 

నా ప్రానం నువ్వే 
నా గుండె నువ్వె గుండెల్లొ మండే 
నిప్పై చేరావే... 

ఊహలకె తెలియనిదె 
జరిగెనులె ఇపుడెలా... 
నువ్వు నేను అను మాటె 
ఇకపై ఉండదులె ఏంతిలా 

తప్పు ఏదొ జరిగెను 
రెప్ప పాటులో... 
చెప్పలేని వేదనగా 
ఉప్పెనగ తరుముతోందె 
నువ్వు లేనిదే 
మరి నేను లేనని... 
అన్న ఈ క్షనం.... 

నా అంతం నువ్వే.... 
నా పంతం నువ్వే... 
నా పంతం ఎంతా... 
ఈ విష్వం అంతా.... 

నా అంతం నువ్వే.... 
నా పంతం నువ్వే... 
నా పంతం ఎంతా... 
ఈ విష్వం అంతా.... 

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని 
తెలిసెనే నీ నేనె నీ నేను కానని



ఏమిటేమిటో పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: అల్ఫన్స్ జోసెఫ్

ఏమిటేమిటో




మదురమె ఈ క్షనమే ఓ చెలి పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠ
గానం: సమీరా భరద్వాజ్

మదురమె ఈ క్షనమే ఓ చెలి 
మదురమె ఈ క్షనమే 

మదురమె వీక్షనమే ఓ చెలి 
మదురమె వీక్షనమే 

మదురమే లాలసనే 
మదురమే లాలనయే 

మదురమె లాహిరిలే 
మదురం లాలితమే... 

మదు పవనం వీచి 
మదు పవనం వీచి 
పరువమె మైమరచె 

కాలం పరుగులు ఆపి 
వీక్షించె అందాలే 

మోహం తన్మైయమొంది స్వాసించె గధాలె 
ఓరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే... 

ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె 
మౌనంగా మధువుల జడిలోన పులకించె ప్రానాలె 

మదురమె ఈ క్షనమే ఓ చెలి 
మదురమె ఈ క్షనమే 

వీచె గాలులు దాగి 
చెప్పెనె గుస గుసలే 
చూసె ముసి ముసి నవ్వులు 
చేసే బాసలనె 
వసమై ఆనందపు లోగిట 
అరుదించి ఆకసం… 
సగమై ఈ సగరమందె 
అగుపించె ఆసాంతం 
తీరం ముడివేసిన దారం 
తీర్చె ఎద బారాలె…




మరీ మరీ కొత్తగ నీ జత పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: మండేల పెదస్వామి
గానం: గౌతమి

మరీ మరీ కొత్తగ నీ జత 
మరో మరో చిత్రమై ఈ కధ 
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా 

మరీ మరీ కొత్తగ నీ జత 
మరో మరో చిత్రమై ఈ కధ  

నీ అడుగులలోన నా నడకలివేనా 
తెలియక నా గుండెకి 
తికమకలేనా తరగక ఆరాధన 
ప్రతీసారి అదే తీరున 

ఇలా వస్తున్నా ఉండక 
కలా వలా పడుతున్నా ఆగక 
పరుగేలా నీ దారికి పరిహాసంగా 
నిజమేగా నీ చెలిమి చిరంజీవిగా 
ఇలా ఇలా వస్తున్నా ఉండక 
కలా వలా పడుతున్నా ఆగక



ఊపిరి ఆగిపోతుందే పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: రాంబాబు గోసాల
గానం: ఎల్. వి.రేవంత్

ఊపిరి ఆగిపోతుందే





గుండెలోన నిండుకున్న పాట సాహిత్యం

 
చిత్రం: అర్జున్ రెడ్డి (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రేష్ఠా
గానం: సౌజన్య

గుండెలోన నిండుకున్న 
నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ 
కళ్ళలోన నింపుకున్న 
నీ రూపమేగ ఊరటయ్యే ఇన్నాళ్లూ 
చెప్పనీ చెప్పనీ మనసు తాలలేదని నీ దూరమే 
తప్పనే తప్పని తాపమే తీరనీ ఈనాడే 
గుండెలోన నిండుకున్న 

నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్లూ 
నీ అడుగులోన అడుగు కలిపి ప్రాణమే మురవని 
నా అణువు అణువు నిన్ను చేరి తనివి తీరనీ 
ఏ దారి మలపు లోను ఇంక వీడనే వీడనీ 
నీ లోని నీడ నేనులాగ నన్ను మారనీ 
తిమిరం తెర తొలిగిపోయి వెలిగే నవ ఉదయాలే 
ప్రాణం చెయ్ జారి మళ్ళి చేరగ తన తీరాన్నే 
కమ్మనైన ఓ హాయివాన కురావగా ఇలా చిరునవ్వులోన 

గుండెలోన నిండుకున్న 
ఊసులన్ని చెప్పుకోగా ఈనాడు 
కళ్ళలోన దాచుకున్న 
ప్రేమనంత చూపుకోగా ఈనాడు 
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ 
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ 

గుండెలోన నిండుకున్న 
ప్రేమనంత చూపుకోగా ఈనాడు 

పరవశం పరవశం అవ్వనీ మన వశం 
చిలకరించు నవ్వులు మునికి ఈ జగం 
చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం 
పలకరించు ఆశలే హృదయనందనం 
అలలే జోలలను పాడి అలుపే మరిచేనే 
కలలే నీ ఒడిన వాలి నిజమై మెరిసేనే 
అల్లుతున్న హరివిల్లులోన 
అందుకోగా స్వర్గసీమ 

గుండెలోన నిండుకున్న 
ప్రేమనంత చూపుకోగా ఈనాడు 
ఆగనీ ఆగనీ ఆదమరుపులే కదా ఇక అన్నీ 
దూరమే ఆనని కౌగిలింతలే కదా ఇక అన్నీ 
గుండెలోన నిండుకున్న 
ప్రేమనంత చూపుకోగా ఈనాడు


Palli Balakrishna Friday, September 1, 2017
Andala Rakshasi (2012)



చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
నటీనటులు: నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 10.08.2012



Songs List:



ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: హరిచరన్

శపించని నన్ను నా గతం 
ఆలస్యమైందని తనకు నీ పరిచయం 
నువ్వేనట ఇక పై నా జీవితం 
శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం 

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు 
వింతగ ఆకాశమంచు తాకుతున్న 
గుండెనే కొరుక్కుతిన్న
కళ్ళు చూసినంతనే 
మనసు నవ్వే మొదటిసారి 
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి 
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా 
నీ వల్లనే భరించలేని తీపి బాధలే 

ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన 
ఓ కాలమా నువ్వే ఆగుమా 
తనే నా చెంతనుండగా 
తరమకే ఓ దూరమా 
నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా 
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల 
పొందుతున్న హాయి ముందు ఓడిపోనా 
జారిందిలే ఝల్లుంటు వాన చినుకు తాకి 
తడిసిందిలే నాలో ప్రాణమే 
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా 

గుండెలో చేరావుగ ఉచ్వాసలాగా 
మారకే నిశ్శ్వాసలా 
నీకే న్యాయమా నన్నే మార్చి 
ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా 
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా 
కలలతోనే కాలయాపన 
నిజాల జాడ నీవె అంటు
మెలకువే కలే చూసే 
ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే 
ఏం చేయను నువ్వే చెప్పవా 
ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా 

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు 
వింతగా ఆకాశమంచు తాకుతున్న 
గుండెనే కొరుక్కుతిన్నా 
కళ్ళు చూసినంతనే 
మనసు నవ్వే మొదటిసారి 
ఏమ్మార్పిది ఎడారి ఎండమావి 
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా 
నీ వల్లనే భరించలేని తీపి బాధలే 




మనసు పలికే భాష ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: రాకేందు మౌళి
గానం: రాకేందు మౌళి

మనసు పలికే భాష ప్రేమ 
మౌనమడిగే బదులు ప్రేమ 
మరణమైనా తోడు ప్రేమ 
మనకి జరిగే మాయ ప్రేమ 
మనకి జరిగే మాయ ప్రేమ 

గుండెలో వ్యధలనే కాల్చుమంటే ప్రేమ 
రగిలిన సెగలనే ఆర్పునది ఈ ప్రేమ 
ఆదియు అంతము లేని పయనం ప్రేమ 
వేకువై చేరులే చీకటింట్లో ప్రేమ 
విశ్వమంతా ఉన్న ప్రేమ 
ఇరుకు ఎదలో దాచగలమా 

కాటిలో కాలదు తుది లేని ఈ ప్రేమ 
జన్మనే కోరదు అమ్మెరుగదు ఈ ప్రేమ 
దొరకదా వెతికితే కడలైన కన్నీట 
తరమక దాహమే నీరల్లే ఓ ప్రేమ 
నీడనిచ్చే వెలుగు తోడు 
చీకటైతే ఏమి కాను




నే నిన్ను చేరా పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రంజిత్, వీణా ఘంటసాల 

నే నిన్ను చేరా 





ఏ మంత్రమో అల్లేసిందిలా పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: వశిష్ఠ శర్మ
గానం: బోబో శశి

ఏ మంత్రమో అల్లేసిందిలా 
యదకే వేసే సంకెలా 
భూమెందుకో వణికిందే ఇలా 
బహుశా తనలో తపనకా 
ఆకాశం రూపం మారిందా 
నా కోసం వానై జారిందా 
గుండెల్లో ప్రేమై చేరిందా 
ఆ ప్రేమే నిన్నే కోరిందా 

మబ్బుల్లో ఎండమావే 
ఎండంతా వెన్నెలాయె 
మనసంతా మాయ మాయే 
ఐనా హాయే 

క్షణము ఒక ఋతువుగ మారే 
ఉరుము ప్రతి నరమును తరిమే 
పరుగులిక వరదలై పోయే కొత్తగ 
ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే 
పగలు వల విసిరె ఉహలె 
మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా 

కళ్ళల్లో కదిలింత కలగా కల కరిగిపోకలా 
ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరి పోకలా 
ఓ మాయలా ఇంకో మాయలా 
నన్నంత మార్చేంతలా 
ఓ మాయలా ఇంకో మాయలా 
నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా...




మనసా మర్చిపో పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: లక్ష్మి భూపాల్
గానం: సత్య ప్రకాష్, భార్గవి శ్రీధర్

వేదన శోధన ఊపిరాగే భావన 
ద్వేషమా ప్రాణమా చేరువైతే నేరమా 

ముళ్ళే ఉండని పూవులుండవా 
కన్నీరుండని కళ్ళు లేవా 
అలలుండని సంద్రముండదా 
ఏ కలలుండని జన్మ లేదా 

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో 
గతమా కాలిపో మరుజన్మకి ఆశతో 

గమ్యమే లేదని తెలిసిన పయనమా 
చీకటే లోకమా చుక్కల్లో సూరీడా ప్రేమా 
భూమి పాతాళం లోతునా 
పిచ్చివాడై స్వర్గాన్ని వెతకనా 
ఉన్నా ఆకాశం అంచున 
నువ్వు లేని నా కోసం బ్రతకనా 

ప్రాణాలే పోతున్నా నిందించ లేకున్నా 
నాలోనే నాతోనే నేనుండ లేకున్నా 

గతమే తీయగా బాధించే హాయి లో లో 
పరదా తీయగా కనిపించే నిజమిలా 
ఎటు చూడను ఇరు వైపుల 
ప్రణయాలే ప్రళయమై 
వెంటాడితే ఎం చేయను నేనే లేనుగా 
ఏ తీరం చేరాలి చుక్కానే లేకుండా 
నాదంటు నాకంటు ఉందొకటే నరకం 

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో 
గతమా కాలిపో...




వెన్నంటే పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాక్షసి (2012)
సంగీతం: రధన్
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: రంజిత్

వెన్నంటే 

Palli Balakrishna Sunday, August 20, 2017
Radha (2017)



చిత్రం: రాధ (2017)
సంగీతం: రధన్
నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: చంద్రమోహన్
నిర్మాత: భోగవల్లి బాపినీడు
విడుదల తేది: 12.05.2017



Songs List:



రాబిట్ పిల్ల  పాట సాహిత్యం

 
చిత్రం: రాధ (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: శ్రీమణి
గానం: రమీ

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
నీతొ వస్తానె 
రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
నీతొ పరిగెడతానె 

అంత కోపమేంటె 
నన్ను వీడిపొవధ్ 
ఓ ముద్దు ముద్దు పిల్ల 
యెల్లిపోతె నెనేమైపొతానె 
ఓ అల్లరి చెలియా 

నువ్వె నను తిడుతుంటె 
నాకు తియ్యనైన పాట విన్నట్టుందె 
నీలొ అర టి స్పూన్ కోపం 
టన్ ల ప్రేముందె 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
oh baby come on let me 
tell you all the way 
రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
నీతొ పరిగెడతానె 

i started feeling my baby 
you know i’m in a crazy 
like a beautiful smile 
that moment i got the love 
you know my raabiT so cute 
i wanna take it to the next level 
my baby you never told me 
what i want is only love 

క్యు లొ కోటిగ 
అరె బ్యుటి లె ఎందరొ 
నాకై పోటి పడుతు 
ఉన్న చూడ్లేదె నీకొసం 

ఎంతొ సూటిగ నిన్నె 
ప్రేమిస్తు ఉన్నననె 
చెప్పె అబ్బైలంటె 
మీకె చులకనలె 

నీ బుగ్గలోన బూరెలు ఊరెల 
న పైన ఇన్ని కారం మిరియాల 
లోలోన అన్ని నవ్వులు దాచెల 
నతోటి నువ్వు తగువుకు దిగనెల 

మంచుల ఉండె మంచి పిల్ల 
నువ్ ఇంచి మించి మంటలగ మారొదె 
అగ్గి మీద గుగ్గిలంల 
నను బగ్గున కాల్చొద్దె 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
oh baby come on let me 
tell you all the way 
రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
నీతొ పరిగెడతానె 

యేడు రంగులె రైంబౌ నిండుగ 
నువ్వె కావలంటె 
యెనిమిది చేస్తాలె ఈవెల 
యేడె వింతలె అరె 
ఈ భూగొలం అంతట 
అన్ని ఒక్కటి చేసి నీకై తెస్తాలె 

ఎన్ని వెల ఆటలు ఆడైన 
ఎన్ని కొత్త పాటలు పాడైన 
ప్రానమంత ప్రేమను చేసైన 
ఒ చిన్ని నవ్వు నీలొ తెచైన 

ఇవ్వన నీకు తెచి ఇవ్వన్న 
నువ్వు కోరుకున్న 
కొండ మీద కొతినైన 
అవ్వన నెను నీకె అవ్వన 
నీ సగమై బ్రతికైన 

రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
oh baby come on let me 
tell you all the way 
రాబిట్ రాబిట్ రాబిట్ పిల్ల 
నీతొ పరిగెడతానె





చూపుల్తో గుచ్చి గుచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: రాధ (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: కె. కె
గానం: రంజిత్

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకె
నీ వల్లే గుండె జారీ పోయిందే
ఓ సారి ఓ పోరి
నన్నెదో మాయ చేసి లాగావే
మనసే నిన్నే వరించిందిలే
నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే
మేఘం జల్లై తలొంచిందిలే
ఆ అందం నీదే నా రాధే రాధే

గుండెల్లో మాట ఉంది చెప్పవే ఏమిటది
నవ్వుతో గాలమేసి పడేసావే
ఎక్కడో చిన్ని ఆశ వద్ధోద్దంటూ వస్తావనే
తెలిసి వేచి చూసా నాలో నేనే 
కనులే గోడవనువ్వోస్తేలేక నిదర్లే
పాడనే పడవ నా మాయాల్లోనా ఎందుకే

ఓ చిటపట చినుక రా తడబడి చిలక
ని కొంగుచాటు కృష్ణుడిగా అసలిది తెలుసా

మనసే నిన్నే వరించిందిలే
నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే
మేఘం జల్లై తలొంచిందిలే
ఆ ఆనందం నీదే నా రాధే రాధే

యమున వద్దకొస్తే చిలిపి ముద్దులిస్తా
అవదా అడుగుకొక్క బృందావనం 
నెమలి కన్నులాగ నెత్తి పైనే పెట్టుకుంటా
విడిచి ఉండనిక ఒక్క క్షణం
విననే వినవా నే పాడే వేణు గానాన్నే
అసలేం అనవా నే ముద్దో వద్దో చెప్పవే
ఓ చిటపట చినుకా రా తళుకుల బెళుకా
నా రధం లోన సైడు సీటు నీదిక గనుక

మనసే నిన్నే వరించిందిలే
నా ప్రేమే నీదై నీ వెంటే ఉందే
మేఘం జల్లై తలొంచిందిలే
ఆ ఆనందం నీదే నా రాధే రాధే




ఖాకి చొక్కా పాట సాహిత్యం

 
చిత్రం: రాధ (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: యమ్.ఎల్. ఆర్. కార్తికేయన్, రమీ

ఒంటిమీదకొచ్చింది ఖాకి చొక్కా
కంటి రెప్పనైపోతా అందరికింకా
అడ్డమొస్తే ఎవ్వడైన అరటి తొక్క
సీను లోకి నేనొచ్చి విజిలే కొడితే

రాజులకే రారాజు ఏం ఖతర్నాక్ పోజు
వీడితోటి పెట్టుకుంటే అరే పగిలిపోద్ది గాజు
హే వీడ్ని గాని ముట్టుకుంటే పేలిపోద్ది ఫ్యూజు
పోలీస్ డ్రెస్ అంటే వీడికెంత మోజు మోజు...

అల్ ఎవ్రీ బడీ సే కృష్ణ

లాఠీని పట్టి అచ్చం ఫ్లూట్ లా
ఏం ఊదుతున్నాడో చూడు
చేతుల్లో పిస్తోల్  నే చక్రంలా
ఏం తిప్పుతున్నాడో వీడు

కృష్ణా నీకు పెద్ద సెల్యూట్ ఖాకీ  నిచ్చావే
నా దారికే రెడ్ కార్పెటేసి బ్లెస్సింగ్ ఇచ్చావే
పోలీస్ లంటే సెక్యూరిటీ గార్డ్
పొలికలోన ఈక్వల్ టు గాడ్
వాడే తోడుండగా ఈ లోకమే గోకులమైపోదా

రాజులకే రారాజు ఏం ఖతర్నాక్ పోజు
వీడితోటి పెట్టుకుంటే అరే పగిలిపోద్ది గాజు
వదిలించేయ్ దునియాకే 
తెగ అంటుకున్న గ్రీజ్
ఎవడైనా పాకెట్ లో పెట్టుకోడా నీ ఇమేజ్

శ్రీ కృష్ణ దుష్ట శిక్షణకై కార్యోన్ముఖుడవు

అల్ ఎవ్రీ బడీ సే కృష్ణ

కేడిలతోటి  ఆడేస్తాను అచ్చంగా టెంపుల్ రన్
ఆడెంత పెద్ద డానే ఐనా తినిపిస్తా శారిడాన్
భగవద్గీతే చేతికిచ్చిఅందరితో చదివిస్తా
కథని గీతే దాటిస్తుంది రాతని మార్చేస్తా
అల్లరి తోటి మేజిక్ చేయాలి
అందరి గుండె మ్యూజిక్ చెయ్యాలి
అబ్ సే ప్రపంచమే సరికొత్తగ సన్ రైజ్ చూడాలి

అయ్ బాబోయ్ మా వాడ్ని అరె గెలకవద్దు ప్లీజ్
అర సెకండే ఆగడుగా ఏ చాప్టర్ అయినా క్లోజ్ 
మంచితనం వడపోస్తే వీడికేగా ఫస్ట్ ప్రైజ్
మొండితనం చిటికేస్తే జ్నికరంగా కింగ్ సైజు




ఓయ్ మేరా క్రిషు  పాట సాహిత్యం

 
చిత్రం: రాధ (2017)
సంగీతం: రధన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ప్రియా హమేష్ , సమీరా భరద్వాజ్ , జతిన్

ఓయ్ మేరా క్రిషు 
నువ్వంటె నాకు క్రషు 
నా ప్రేమ నగర్ బ్లాక్బాస్టెర్ హీరొ నువ్వె 
ఓయ్ మేరా క్రిషు 
నీ మీద మనసు ఫిక్సు 
నా ద్రీం నగర్ వాల్పొస్టెర్ ఫొటొ నువ్వె 
రుకుమిని రాధామని 
ఏందే మీ మధ్యన సోధి 
సాండ్విచ్ ఐపొయిందె 
లైఫెయె ఇల రెండువైపుల 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ చు చు చు చుపించు నీ ఇష్క్ మాయ 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిచ్ దాండియా 
ముదుగ చూపన ముద్దులొ అన్ని రకాలు 
ముగ్గులొ దించితె ఇవ్వన చక్కర పాలు 
అటు పక్కన దిమ్మెక్కించె మల్లె పూల జల్లు 
ఇటు పక్కన చూస్తె సన్న జాజి చూస్తె గుండె జిల్లు 
పా పట్టుకొ పట్టెస్కొ పట్టు జారిపొనికుండ 
చు చుట్టుకొ చుట్టెస్కొ నేనె నీ రాని 
కా కట్టుకొకట్టెస్కొ ఒడి వేసెయ్ నీ కౌగిట్లొ 
ఆ అల్లుకొ అల్లెస్కొ నేనె నీ దాన్ని 
రుకుమిని రాధామని 
ఏందే మీ మధ్యన సోధి 
సాండ్విచ్ ఐపొయిందె 
లైఫెయె ఇల రెండువైపుల 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ చు చు చు చూపించు నీ ఇష్క్ మాయ 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిచ్ దాండియా 
ఆ తింగరబుచి షంగర మారి 
ఆ రంగెలకరి మందిర కాలి 
హాటు గ ఘాటు గ 
పుట్టె ర నీ పై మోజు 
తిట్టిన కొరికిన 
కరగడె నీ పై క్రేజె 
ఆషదం సేలె కు మల్లె 1+1 బాబీస్ 
అందం తొ రౌంద్ అప్ చేసి చెయొద్దె న్యుసన్స్ 
జాంపందు రొ నా బుగ్గ 
కొరికి చూడరొ తీయంగ 
జాం జమ్మని నాతోనె జల్సా చెయంగ 
ద దోచుకొ దాహంగ 
దాచుకున్నది ఇచేస్త 
ర లొంగిపొ సారంగ 
నేనంటె ఇస్తంగ 
రుకుమిని రాధామని 
ఏందే మీ మధ్యన సోధి 
సాండ్విచ్ ఐపొయిందె 
లైఫెయె ఇల రెండువైపుల 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ చు చు చు చూపించు నీ ఇష్క్ మాయ 
ఒ రా రా రా రా రా రా రా క్రిష్నయ్య 
నువ్ దు దు దు దు దుమ్మాడించు రొమాంటిచ్ దాండియా

Palli Balakrishna Wednesday, August 16, 2017

Most Recent

Default