Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Surender Reddy"
AGENT (2023)



చిత్రం: AGENT (2023)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
నటీనటులు: అఖిల్, సాక్షి వైద్య
దర్శకత్వం: సురేందర్ రెడ్డి 
నిర్మాత: సుంకర రామబ్రహ్మం 
విడుదల తేది: 28.04.2023



Songs List:



మళ్ళీ మళ్ళీ నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: AGENT (2023)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: ఆదిత్య అయ్యంగార్
గానం: హిప్ హాప్ తమిజ్

మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఏ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే

పిల్లా నీ వల్లే దిల్ లా
ధగ్ ధగ్ ఏంటో పెరిగెనిలా
నీలో ఇక చూడాలా
జరుగునో లేదో ఈ మాయ

ఇది లవ్వో నీ నవ్వో
అయ్యా రోమియో ఓ అమ్మాయో
అయ్యయ్యో ఏం మాయో హే
ఏంటో నీ క్రేజీ క్యామియో

లోకమంతా హ్యాక్ చేసి పరిసేలోపు
మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు
ముందిక ఏమేమి చేస్తావు
చేయ్ ఇక నీ ఇష్టము

మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఏ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే

కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే
లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే
కొంచం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే

ఆ ఆ ఆఆ ఆ ఆఆ
నాట్ నాట్ సెవెన్
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
షాట్ షాట్ గన్ వే

ఆ ఆ ఆఆ ఆ ఆఆ
నాట్ నాట్ సెవెన్
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
షాట్ షాట్ గన్ వే

అరె ఎంతో ఫోకస్ తో ఉన్న టైంలో
డ్రీమ్ పర్స్యూ చేసే నాలో
ఏదో కల్లోలం మొదలయ్యిందే
నాతో నీ జర్నీ సాగాలందే
ఈ యూనివర్స్ నమ్మాలే
నేను ఆల్రెడీ నమ్మేశానే

లోకంలోనా ఆక్సిడెంట్సే లేవే
జరిగేవన్నీ ఇన్సిడెంట్స్ మాత్రమే
వద్దని దూరం వెళ్ళాలనుకోమాకే
జీవితాంతం నిను బంధించేస్తానే

మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే
థట్స్ ఏ సైన్ అని మనసంటుందే
నా లేటెస్ట్ మిషనువి నువ్వే
సాధించాలనిపిస్తుందే

కొత్త కొత్త హార్మోన్స్ జల జల పారే
లోన లోన పెరిగే వైల్డ్ గా జోరే
కొంచం కంట్రోల్ తప్పిందే
పర్లే అయినా బాగుందే

ఆ ఆ ఆఆ ఆ ఆఆ
నాట్ నాట్ సెవెన్ 
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
షాట్ షాట్ గన్ వే

ఆ ఆ ఆఆ ఆ ఆఆ
నాట్ నాట్ సెవెన్
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
షాట్ షాట్ గన్ వే

Palli Balakrishna Monday, March 20, 2023
Sye Raa Narasimha Reddy (2019)



చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
నటీనటులు: చిరంజీవి, అమితాబ్, నయన తార, తమన్నా
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రాంచరణ్
విడుదల తేది: 02.10.2019



Songs List:



హో సైరా... (పవిత్ర ధాత్రి భారతాంబ) పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: సునిధి చౌహాన్, శ్రేయ ఘోషల్

పల్లవి:
పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నారసింహుడా
చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీరా
రేనాటిసీమ కన్న సూర్యుడా

మృత్యువే స్వరాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా
నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా

హో  సైరా.., హో సైరా.., హో సైరా.
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో  సైరా.., హో సైరా.., హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 1
అహంకరించు ఆంగ్ల దొరలపైన
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బతుకు సాటివారిలోన
సాహసాన్ని నింపు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని
నినాదం నీవేరా...
ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమళ్లే మార్చినావురా
ప్రపంచమొనికిపోవు పెనుతుఫానులాగ వీచి
దొరల్ని ధిక్కరించినావురా
మొట్టమొదటి సారి స్వతంత్ర సమరభేరి
పెటెల్లు మన్నది ప్రజాలి పోరిది
కాలరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది
హో సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా
హో సైరా.. హో సైరా.. హో సైరా
యసస్సు నీకు రూపమాయెరా

చరణం: 2
దాస్యాన జీవించడం కన్న చావెంతో మేలంది
నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం
ఒప్పుకోకంది నీ ఉద్యమం
ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్ని
ఒదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటేవేయని
ప్రతి పదం
కదనరంగమంతా కొదమసింగమల్లె
ఆక్రమించి విక్రమించి తరుముతోందిరా
అరివీర సంహారా...
హో  సైరా.. హో సైరా.. హో సైరా
హో  సైరా.. హో సైరా.. హో సైరా
ఉసస్సు నీకు ఊపిరాయెరా





జాగో నరసింహా జాగోరే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, హరి చరణ్, అనురాగ్ కులకర్ణి

జాగో నరసింహా జాగోరే
జనమంతా చూసేరే రారే
చేయ్యెత్తి జై కొట్టె హోరే
తకథై అంటు సింధులు తొక్కాలే

వజ్రాల వడగాళ్లే నవరత్నాలే సిరిజల్లై
మా నవ్వుల్లో సుక్కలు కురవాలే

ఓ  సై రా

జామాజం  జంజారావంలో
ధమాదం దుమ్ము దుమారంలో
అమాంతం అందరి ఊపిరిలో
ఘుమాగుమ్ చిందిన అత్తర్లో

పది దిక్కులకీ అందింధీ సందేశమ్
సరిహద్దులు అన్ని చెరిపిన ఈ సంతోషం
ఉవ్వెత్తునిల ఉప్పొంగిన ఈ ఉల్లాసం
ప్రతి ఒక్కరికి పంచేందుకని అవకాశమిదే

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

ఎం జవాబు చెబుతాంరా
పలానా పక్కోడెవడంటే
ఈ మన్నేర ఇద్దరిని కన్నదని
అనరా నిజమంటే

నువ్వు బాగుంటే చాలంతే
ఆ మాటింటే మరి
నే కూడా సల్లంగ ఉన్నట్టే

ఈ జాతర సాక్షిగ కలిసిన మన సావాసం
మన కష్టసుఖాలను పంచుకునేందుకు సిద్ధం
నువు నా కోసమ్ నేన్ నీ కోసం అనుకుందాం
మన అందరిని ముడి వేసెనిల మనిషన్న పదం

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
హే ఊళ్ళన్నిటిని ఊగించేలా

హైస్ హైస్ హైస్ హైలెస్స (3)

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా

కన్నావటయ్య మా దొర
మా సంబరాన్ని కన్నార
ఉయ్యాలనాటి ఈడుల
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా
ఊళ్ళన్నిటిని ఊగించేలా




అందం అంకితం పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్ , షాషా తిరుపతి

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

నువు పద్మానివై ఉంటె
రవితేజం నేనౌతా
కలువై నువు వెచుంటె
నెలరాజై నెయ్ వస్త
వరించుతా తరించుతా

అందం అంకితం
ప్రాణం అర్పితం

ఓ చక్కోరయానం చేసి
చేరా నిన్నెలా
నాదే నాదే వెన్నెలా - హో 
ఒక్కోరహస్యం విరించి
విరిసా పువ్వులా
నీలో నిలిచె నవ్వులా

సరస్సౌతాను నీకోసం
ఇటురావే రాయంచ
ఇహ నాదైన సంతోషం
అది నీకే రాసుంచా
ప్రియాయచా లయాయచా

అందం అంకితం
ప్రాణం అర్పితం
బంధం శాశ్వతం
మీరే జీవితం

తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
పధములు కలిసెను మధువని లోన
తగనిస పదమున దీజాన
తకరిన తకథిన తకరిన దిన్న
తదియన తదియన థిల్లాన
హృదయము అదిరెను ముధురక్షణాన
మధురము కురిసెను తందాన




శ్వాసలోన దేశమే పాట సాహిత్యం

 
చిత్రం: సైరా నరసింహారెడ్డి (2019)
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరి చరణ్

శ్వాసలోన దేశమే
కోరస్: శ్వాసలోన దేశమే
గుండే గోషలోన దేశమే
కోరస్: గోషలోన దేశమే
ప్రాన నాడిలోన దేశమే
ప్రణమంత తల్లి కోసమే

మాటలోనే దేశమే
కోరస్: మాటలోనే దేశమే
కత్తి వేటులోన దేశమే
కోరస్: వేటులోన దేశమే
కాలి అడుగులొన దేశమే
కాలి బూడిదైన తల్లి కోసమే

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా

చిన్నారి ప్రాయమందునా
కన్నోళ్ళనొదిలినావురా
కోరస్: కన్నోళ్ళనొదిలినావురా 

కన్నీటి పదును తేలేరా
ఖడ్గమే... ప్రయాణమైన పోరులో
కోరస్: ప్రయాణమైనా పోరులో 
ప్రేమింకా ఇంకిపోయారా
కోరస్: ప్రెమింక ఇంకిపోయారా 
దోసిట్లో దాచినావురా
సంద్రమే...ప్రజల స్వేచ్ఛకై
ప్రాణాలనొదులుతూ
పతాకమల్లే ఎగిరినావురా

దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: దేశమే నువ్వురా
దేశమే నువ్వురా సందేశమయ్యెరా
కోరస్: సందేశమయ్యెరా (3)

Palli Balakrishna Tuesday, October 8, 2019
Kick 2 (2015)



చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
నటీనటులు: రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.08.2015



Songs List:



మమ్మీ మమ్మీ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: బాంబే బోలే
గానం: బాంబే బోలే

మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
మా మా మా మా మా
మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
మా మా మా మా మా మా
మా మా మా మా మా మా

మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని
లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్
నేను ఏడు నెల్లకే
బయటకు తన్నుకు వచ్చాను
థిస్ ఇస్ మై ఆటిట్యూడ్
మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
మా మా మా మా మా

మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని
లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్
నను ఏడు నెల్లకే
బయటకు తన్నుకు వచ్చాను
థిస్ ఇస్ మై ఆటిట్యూడ్
నను ఢిల్లీకి రాజుని చేసి కిరీటం పెట్టిన
నా దిల్లోని కంఫోర్టుకే దాసోహం నేనే డ్యూడ్
అరేయ్ కంఫర్ట్ ఏర నా కిక్కు
అది ఉన్నోడేరా యమా లక్కు
ఎవరికీ వారే కంఫర్ట్ ఉంటె
ఉండదు ఏ చిక్కు

అరేయ్ అల్లో నేరడల్లో
నా కంఫర్ట్ కె జై బోలో
మేరె అందనమే డాన్స్ ఎయ్యిరా నాతో డ్యూడ్
మై నేమ్ ఇస్ రొబ్బిన్ హుడ్
నను గెలికితే ఉండదు ఫ్యూడ్ ఉ
కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్

మమ్మీ కడుపులో నాకు
మై మమ్మీ కడుపులో నాకు
మా మా మా మా మా మా మా మా మా మా మా మా
మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని
లిస్తెన్ టూ మై వర్డ్ డ్యూడ్
నేను ఏడు నెల్లకే
బయటకు తన్నుకు వచ్చాను
థిస్ ఇస్ మై ఆటిట్యూడ్

ఓహ్ మై గాడ్ నా ఓహ్ మై గాడ్ నా
అలగలగువారు కంఫర్ట్
మమ్మీ డాడీ వెంట్ టూ ది పార్టీ
అలగలగువారు కంఫర్ట్
వీ నీడ్ ది కంఫర్ట్ బ్రో
డే అండ్ నైట్ లెట్ థెం బ్లో
ఒహ్హ్ మియ్య మియ్య మియ్యె కంఫర్ట్ కంఫర్ట్ గో
జెల్ జెల్ జిగా జిగా గో గో జెల్ జిగా జిగా గో
కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్

ఓ పక్కోడి మీద నీకు థింకింగ్
ఏ స్టార్ట్ అయ్యిందంటే
నీ సెల్ఫ్ కంఫర్ట్ లోన కిక్ దొబ్బినట్టే
ఓ నీది నువ్వు చూసుకుంటే
లోకం పర్ఫెక్ట్ గున్నట్టే
కంఫర్ట్ ఏ కాదని వెళ్తే
కొంప మునిగినట్టే
ఓ సీతమ్మ గీత దాటితే
రామాయణం ఏమైంది
కంఫర్ట్ కె కంచె దాటితే
కర్మాయణం స్టార్ట్ అయ్యిది
నీ కంఫర్ట్ లో నువ్వుంటే
పక్కోడికి ప్రాబ్లెమ్ లేదు డ్యూడ్

అరేయ్ అల్లో నేరడల్లో
నా కంఫర్ట్ కె జై బోలో
మేరె అందనమే డాన్స్ ఎయ్యిరా నాతో డ్యూడ్
మై నేమ్ ఇస్ రొబ్బిన్ హుడ్
నను గెలికితే ఉండదు ఫ్యూడ్డు
కంఫర్ట్ నిండిన బ్లడ్ నాలోని ఆటిట్యూడ్

మమ్మీ కడుపులో నాకు
మై మమ్మీ కడుపులో నాకు
మా మా మా మా మా మా
మా మా మా మా మా మా
మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని
లిస్తెన్ టూ మీ వర్డ్ డ్యూడ్
నను ఏడు నెల్లకే
బయటకు తన్నుకు వచ్చాను
థాట్ ఇస్ మై ఆటిట్యూడ్
మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
మమ్మీ మమ్మీ మమ్మీ మమ్మీ
కడుపులో నా కడుపులో
నా కడుపులో నా కడుపులో నా





నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: జొనితా గాంధి, యస్. యస్.థమన్

ఈ తేనే కల్లది
ప్రేమల్లో పడ్డది
ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి  మళ్ళి
గెలవటానికంటు నీకు
నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడని
నేనాగి పోనని
ఆ కళ్ళలోన చూపులోన
ఆశలోన శ్వాసలోన దేహమంత
ప్రేమరంగు పూసుకున్నది

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం
నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం
నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం
నువ్వే నడిపే కాలం

నువ్వే నువ్వే సైన్యం నాకోసం
నువ్వే నువ్వే సమరం నాలోన
నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం
నువ్వే దొరికే విజయం

ఈ తేనే కల్లది
ప్రేమల్లో పడ్డది
ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి  మళ్ళి
గెలవటానికంటు నీకు
నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడని
నేనాగి పోనని
ఆ కళ్ళలోన చూపులోన
ఆశలోన శ్వాసలోన దేహమంత
ప్రేమరంగు పూసుకున్నది

నువ్వుగా ఓడాలని
నేనుగా గెలవాలని
కోరికే నన్నిలా తరిమిందని
ప్రేమంటే ఇంతేమరి
దైవంలా తుదిలేనిది
ఆ దైవం ఉంటే నాలోనూ
నావైపే నిన్నే నదిపించదా

నువ్వే నువ్వే ప్రాణం ప్రపంచం
నువ్వే నువ్వే ధ్యానం ప్రయాణం
నువ్వే నువ్వే మౌనం ఓ నేస్తం
నువ్వే నడిపే కాలం

నువ్వే నువ్వే సైన్యం నాకోసం
నువ్వే నువ్వే సమరం నాలోన
నువ్వే నువ్వే ఆయుధం ఓ నేస్తం
నువ్వే దొరికే విజయం

ఈ తేనే కల్లది
ప్రేమల్లో పడ్డది
ఈ ప్రేమలోన ఓడి నిన్ను మళ్ళి  మళ్ళి
గెలవటానికంటు నీకు
నీడలాగ సాగుతున్నదే

ప్రాణాలు వీడని
నేనాగి పోనని
ఆ కళ్ళలోన చూపులోన
ఆశలోన శ్వాసలోన దేహమంత
ప్రేమరంగు పూసుకున్నది




జండా పై కపిరాజు పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి 
గానం: దివ్య కుమార్ ,రాహుల్ నంబియార్ , జొనితా గాంధి, దీపక్ నివాస్ 

జండా పై కపిరాజు ముందు
సిత్వాధి శ్రేణిని గూర్చి
నే దండంబునుకొని తోలు స్యందనము నీదం
నారి ఘండివంబు ధరించి ఫల్గుణుడు
మా కంచెండు చూర్లభుడు
ఒక్కడి నీ మోర ఆలకింపడు
గురుత్బానాద సంధింపడం

పద్మవ్యూహం మొదలయింది
అర్జున రథమే కదిలింది
స్వార్థం సారథి అయ్యింది
హాయ్ లేస్సో లెస్స

ఈ పద్మవ్యూహంలో
పడతారో పడకొడతాడో
రంగుల రంధ్రం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హాయ్ లేస్సో లెస్స

గీతలో కృష్ణుడికే తెలియనిది
రాతలో బ్రహ్మ ఏ రాయానిధి
అటది ఏ శకుని ఆడనిది
నాటకం ఏ కన్ను చుడనిది

జండాపై కపి రాజు
దండెత్తగా వచ్చాడు
ఇలా నర సైన్యం చేసే
పనులకు ఏ భూకంప తెస్తాడో
ఏ బాణం వేస్తాడో
ఏ ప్రాణం తీస్తాడో

పద్మవ్యూహం మొదలయింది
అర్జున రథమే కదిలింది
స్వార్థం సారథి అయ్యింది
హాయ్ లేస్సో లెస్స

కడ దాకా వస్తాడో
కల తీరినా అతిథవుతాడో
రంగుల రంధ్రం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హాయ్ లేస్సో లెస్స

ఈ స్వార్ధపు సంద్రాన్ని
మధిస్తే మిగిలేది హాలాహలమె
నీ అడుగు పడితే ప్రతి ఎకరం
శిఖరం అవుతుందయ్యా
మా పిరికి తనం నీ కోసం
సమరం చేస్తుందయ్యా
ఏ చరిత పుటలు మార్చిన
మా చిన్ని ప్రపంచం మాయ హోం
బ్రతుకు ఎడారిలా వెతికి
పోగేసి పువ్వా నీకై దాచిందయ్యా
వేగి విసిగి గుండె ఆగి పొయెటి ప్రేమ
నీపై కూరిసిందయ్యా

జండాపై కపి రాజు దండెత్తగా వచ్చాడు
ఏ కాళ్ళ కపటం లేని
కవచం చూసే కన్నీరవుతాడో
ఏ కంచికి చేరేనో
ఈ మంచాన మంచెనో

పద్మవ్యూహం మొదలయింది
అర్జున రథమే కదిలింది
స్వార్థం సారథి అయ్యింది
హాయ్ లేస్సో లెస్స
ఈ పద్మవ్యూహం లో
పడతారో పడకొడతాడో
రంగుల రంధ్రం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హాయ్ లేస్సో లెస్స
అర్జున రథమే
రంగుల రంధ్రం
గెలుపు ఎవరిదో





మస్తానీ మస్తానీ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం:  దీపక్ , నివాస్ , మానసి,  రాహుల్ నంబియార్ 

మస్తానీ మస్తానీ మస్తుందే ని బాడీ
అద్దాన్ని అందాన్ని కలిపిస్తే నువ్వే జానీ
నాలోని కోణాన్ని చూపించే ఫీచర్ ని
నీ బ్యూటీ కళ్ళల్లో చూసానే దిల్కిరాణి
నా స్మైలేయ్ స్మైలేయ్ రోజాలన్నీ అందుకుని
అయిపోతే పోనీ దూరంగాని వేడుకని
నీ చుట్టూరా నే షాని నిర్మించ ఆదేశాన్ని
నువ్వొచ్చాకే నేనైపోయా నీ లైఫ్ దేశం రాజధాని

దంచిక దంచిక డండం
దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది
దంచిక దంచిక డండం
దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది
దంచిక దంచిక డండం
దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది
దంచిక దంచిక డండం
దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది

తుర్బాని గురుబని చేసానే ఖుర్బానీ
మేకల్ని ఎద్దుల్ని నాలోన ఉన్న అన్ని
అద్దాన్ని అందాన్ని నీ ఎయె లోనో దీపాన్ని
మొహాన్ని మైకాన్ని నువ్వు మెచ్చే ఉద్యోగాన్ని

నీ గాలి నన్ను గిల్లకే నా దారి మారి పోయిందే
నీ చోరీ చోరీ చూపుల్లో చేరి
నా దిల్ కూడా నీతో వచ్చేంసిదే
పోనీ పోనీ పొథెయ్ పోనీ అనుకున్న కానీ
కనుగున్నానోయ్ ఎప్పుడు లేని ఒంటరి రోగాన్ని

హే నన్ను నిన్ను కట్టేసింది ఇష్క్ అని
హే ఒద్దు అన్న మేలు అన్న కాను అని
మన సాటి సంగీత్ బాణీ వినిపించు వచ్చే వీని
పట్టేసేయ్ వద్దు ఆపులేక వాయిస్తూనే ఉంటున్నాని

దంచిక దుంచిక డండం
దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది
దంచిక దంచిక డండం
దందా నక్క బ్యూటిఫుల్ టార్చర్ మొదలయింది
దంచిక దంచిక డండం
దందా నక్క ధూమ్ ధూమ్ లవ్ బ్యాండ్ మోగింది
దంచిక దంచిక డండం
దందా నక్క బ్యూటిఫుల్ మై జర్నీ స్టార్ట్ అయ్యింది



వరమల్లే కనబడుతుందా పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: శ్రీమణి 
గానం:  దీపక్, నివాస్ ,  రాహుల్ నంబియార్ , సంజన, మనీషా 

వరమల్లే కనబడుతుందా
తలవంచి తలపించైనా
తుది శ్వాస నాపదార్చన
ప్రాణం నీకోసం

కుంభవృష్టేయ్ కురిసినదా
అంబరం కరివిరిగేనా
ఊపిరాగే పండగకాదిది
కుంభోత్సవమేరా

రాలిపోయిన పువ్వులకి
చిగురులు చిరు నవ్వుల జోల
నీతి అలలకు సంద్రము ఊగెనే
రంగుల ఉయ్యాలా

బ్రహ్మాండమే తొణికేలా
బ్రహ్మోత్సవం ఈ వేళా
వెయ్యేళ్ళు గుండె లోతులో
ఈ నిమిషం నిలిచేలా
ఆఆ




కిక్ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్-2 (2015)
సంగీతం: యస్. యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం:  సింహ, స్ఫూర్తి 

కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్

తీస్మార్ ఖాన్ బరిలో షేర్ ఖాన్
తీన్ మారిస్తే ఎక్కింది కిక్కు
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్

మాస్ మార్ ఖాన్ దిల్ క చోర్ ఖాన్
మీసం మందికే దక్కింది కిక్కు
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్

మై హు మెహర్బాన్ నీ కిక్కే మెచ్చినాన్
నా సరుకే తెచ్చినాన్ నీ సరసు వచినన్
కళ్ళల్లో ఐస్ ఉంది మెడ వంపు గ్లాస్ ఉంది
చోళీ లో మాల్ ఉంది స్ట్రక్చర్ లో స్టఫ్ ఉంది
నువ్వు చీర్స్ ఏ కొట్టేస్తే నను జొర్సే చుట్టేస్తే
ఎక్కువైదా నీ డబల్ కిక్ కిక్ కిక్ కిక్

కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురు
కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కిక్

మాస్ మార్ ఖాన్ దిల్ క చోర్ ఖాన్
మీసం మందికే దక్కింది కిక్కు
కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురుకూరు కుక్కురు
కే ఐ సి కే దుమ్మురేపే కిక్కురోయ్

అరెరే నా వల్లే బుల్లెట్ల బుట్టారో
పిల్ల నీ కౌగిటిల్లే కుకురుకూరు కుకురు
కూతే నీ పెడితే బందూకుల మోతారో
పిట్టా నిను ఒగ్గేస్తే చక్కరొచ్చే కిక్కురో

వాటం దేకొరేయ్ ఆటం బాంబు హాయ్ రేయ్
ఐటెం కాస్టలీ రేయ్ మేరి చేస్కోరేయ్
మై హు సింగలు కరిగిస్తా హంగులు
నా అడ్డా చంబలు నే సెక్సీ సింబలు
కిక్కిరుల్ని నాకన్నా తయారు ఏమైందో
పగలంతా ఊపేస్తా రాత్రంతా రేగిస్తా
కమ్మేసి కుమ్మేసి అదిమేసి కుదిపేసి
ముదిస్తా నే డబల్ కిక్ కిక్ కిక్

కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్

తీస్మార్ ఖాన్ బరిలో షేర్ ఖాన్
తీన్ మారిస్తే ఎక్కింది కిక్కి
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుక్కురు
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కిక్
మాస్ మార్ ఖాన్ దిల్ తో చోర్ ఖాన్
మీసం మందికే దక్కింది కిక్కు

కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్

కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కే ఐ సి కే తీన్ మార్ కుకురు
కే ఐ సి కే దుమురేపే కికూరోయ్
కుక్కురుకు కుకురుకు కుక్కురుకూరు కుకురు
కుక్కురుకు కుకురుకు కుక్కురు కిక్


Palli Balakrishna Monday, January 22, 2018
Athanokkade (2005)


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: బండారు దానయ్య
గానం: రంజిత్ , సునీత
నటీనటులు: కళ్యాణ్ రామ్, సింధు తులాని
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: నందమూరి జానకి రామ్
విడుదల తేది: 07.05.2005

పల్లవి:
మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం
మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం
ఆనందం మర్మముమైతే అనురాగం మమ్మరమైతే
స్వర్గానికి నిచ్చెన వేస్తా ఈ జగతికి ప్రాణం పోస్తాం

చరణం: 1
అచ్చతెలుగు అంటానన్ని అచ్చం నా కోసం
వెండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం
నవ్వు పువ్వులే ఈ జన్మంతా రువ్వులు మా కోసం
గుండె లోతుల తేనెల మడుగే మా కోసం
మన్ను మిన్ను వన్నె చిన్నె అన్ని మా కోసం
ఉదయ సంధ్యా సాయం సంధ్యల వెలుగు మా కోసం
అమృతానికి తీపిని అద్దిన సొగసు మా కోసం
స్వర్గ సారను మించగా పుట్టినా భూమి మా కోసం

చరణం: 2
చందమామకు వంతెన వేసే వెన్నెల మా కోసం
నీలి కన్నుల తెల్లని కలలే మాకోసం
చంద్రవంక వాగు వంక నిత్యం మా కోసం
కొండకోన చెట్టు చేమ మా కోసం
ఏడు రంగుల ఇంద్రుని ధనస్సు పొంగు మా కోసం
ఈడు రేగిన ఇంతటి మనస్సు పొంగు మా కోసం
అదుర లేనిది ఏది లేదను వయస్సు మా కోసం
ఇన్ని ఇచ్చిన ఆ పై దేవుడు అసలు మా కోసం


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: వేణు , గంగ

పల్లవి:
నాటి గాళ్‌ - - -
నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
నాటి గాళ్‌ నాటి గాళ్‌ నన్నే పిలిచింది
నాతోటే ఎవ్రిడే ఉంటానంటోంది
ఫ్రామిస్‌ ఓ చెలియా ఐ లవ్‌ యు
ఫ్రామిస్‌ సఖియా ఐ లవ్‌ ఫర్‌ యు
ఫ్రామిస్‌ లైఫంతా లాఫింగ్సే లవ్‌లో పడితే ఐ లవ్‌ యు
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సోగ్రేట్‌
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌

చరణం: 1
బ్యూటి కంట్రి లాఫి ఎంట్రి అవ్వాంలంటే బిల్లే
పాస్పోటంటా ఫాట్లోడ్‌ లేవంటా
స్వీటి చిరుదూరాలే దాటి నిన్నే చేరి కల్లో నిన్ను అల్లుకునే ఫిట్‌సీట్‌ నేనంటా
ఫోనంటు మరి నోనంటు నాలోన ఉండదుగా
ఒకటైతే మామూలైనా మనవైపే వాలునుగా
ట్రైనైనా ఎయిర్‌ పైనైనా స్టాపంటు ఉండునుగా
లవ్‌ బర్డ్స్‌ విహరిస్తుంటే ఏ సిగ్నలు మనలను ఆపదుగా
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోనే లవ్వేలే సో గ్రేట్‌

చరణం: 2
చోటి హృదయంలోన చోటే దొరికిందంటే
టాటా బిల్‌ గేట్స్‌ కన్నా నే నే గ్రేటంటా
డౌటే ఇక లేదంటే నువ్వే మరి నా జంట
లవ్‌లి లాకప్‌ లోన లాకై పొమ్మంటా
సన్‌ లైటే లేదంటే ఈలోకం కదలదుగా
సఖియా నీ సరి లేకుంటే నాప్రాణం నిలవదుగా
నువ్వంటూ మరి నేనంటూ డిఫరెన్సే లేదుకదా
మనలోన లవ్‌ స్టార్ట్‌ అయిలే ఈ దునియా అంతా మనదేగా
మైడియర్‌ మైడియర్‌ స్వీట్‌ హార్ట్‌ మనలోని లవ్వేలే సో గ్రేట్


********  ********  **********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: మల్లికార్జున్ , చిత్ర

పల్లవి:
అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి
తెలిసేనమ్మా ఓహొ ఓహొ ఓహొ ఓహొ
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమ ఓహొ ఓహొ ఓహొ
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినది కన్నె మనస్సు నిండినది తేటేందుకు ఉన్నదిచాలు
మౌనం లోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగెను భాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది

చరణం: 1
కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే ఉలికించు అవునను సైగలను అయినా వివరించి తెలపాలా
ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా
పెదవుల్లో ఆ మధవే పొంగే వేళ ప్రేమంటు పేరే ఎలా
నువ్వు నేనంటు వేరవ్వాలా

చరణం: 2
తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
ప్రేమే విరిశాకా ఒంటికి పరిమళము తానై వస్తుంది ఎలాగా
ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండులే
ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటు
పాటలు ఎలా ప్రేమ కలగంటు మాటలు ఎలా


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: కార్తిక్ , గంగ

పల్లవి:
అమ్మదేవుడో అనిపించావే అయ్యో బ్రహ్మయ్యా
ఏమో నీదయ నాపై లేదయా
ఓరి దేవుడో యెదలో రేగే ఇదేంగోలయ్యో ఈ కధ ఏందయ్యా తెలిసేదెట్టయా
మదిలో ఏదో గొట్టే గొట్టే
గుండెల్లో సునామి పుట్టే
ఏడుకొండల వెంకటేశ్వరా నువ్వు నాకు దిక్కు
ఏదునాళ్ళుగా కోడి సాక్షిగా ఎంగిలడితే ఒట్టు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నుల నిద్దరోతే ఒట్టు

చరణం: 1
ప్రపంచ వింతలు ఏడున్నా మరొక్కటి ఇక్కడ చూస్తున్నా
ప్రతొక్క చెలిమాటే వినిపించేలే
జగాన ఎందరు గనులున్నా జనాలు మెచ్చే
పొగరున్నా మగాడు మాత్రం నా ప్రియుడే అనిపించేనే
ఒక నవ్వే అది చాలు తన చిరునవ్వే అది పదివేలు
తగువే అనిపించే ఇక తనతోటే సరదాలు
ఏడుకొండలు వెంకటేశ్వరా పొద్దు పోకవుందిక
ఎంతమందిలో కలిసి ఉండినా నాకు తోచకుంది
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్ట పట్టు
నిండు సాక్షిగా రెండుకన్నులా నిద్దరోతె ఒట్టు

చరణం: 2
వయ్యారమంతా నాలోన వసంతమాడే తరుణాన
వరించి నే నే పెళ్ళాడే వరుడతడేలే
గతాల జన్మలు ఏవైనా మరింక జన్మలు ఎన్నున్నా
యుగాలు నాకు తోడుండే సఖి తానేలే
నా జంటై తానుంటే చలి మంటేగా చనువరులు
ముద్దై మురిపిస్తే బదులిస్తాగా మగసిరులు
వెండి కొండల పార్వతీశ్వరా దండమెట్టు పట్టు
నిండు సాక్షిగా రెండు కన్నులా నిద్దరోతె ఒట్టు
జమ్మి కొండల జంబుకేశ్వరా యెదను హత్తుకుంది
అందువల్ల తన చెంతకే మనస్సు పరుగులెడుతు ఉంది


********  ********  ********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సునీత

పల్లవి:
చిటా పటా... చిటా పటా... చిటా పటా
చిటా పటా... చిటా పటా... చిటా పటా
చిటా పటా చిటా పటా చిందే వానా
ఇక చెటా పటా చెటా పటా వేసే వానా
చెట్టే లేని పువ్వుల్లాగ రాలే వానా చెంత వాలే వానా
వానా వానా  వెండి వానా బంగారంలా నిను దాచెయ్యనా
వానా వానా  రౌడి వానా చేసే అల్లర్లు గుండె నిండ నింపుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా...

చరణం: 1
వానకొట్టి వణుకుపుట్టి చలిగా ఉన్నాకాని చల్లనైన ఐసు నేను తింటూ ఉంటా
ఏకధాటి వానలోన ఎగిరి తడిసి అలిసి తెచ్చుకున్న జలుబులోన తుమ్ముకూడ కమ్మనంట
నల్లమబ్బులే నా ఆశకేమో అద్దమంట
నల్లగొడుగులే నా ఆటకేమో అడ్డమంట
ఆటలాడి చేస్తుంటే కొంటె చేష్టలే మబ్బు అమ్మలాగ వేస్తుంది నీటిమొట్టికాయలే
చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే నేల నాకుమల్లె ఒళ్ళంతా పులకరించిపోయెలే
వానా వానా నచ్చే వానా  నన్నే నీలోన చూస్తూ ఉన్నా
వానా వానా నవ్వే వానా  ఆకాశాన్నంటె నిచ్చెనల్లే చేసుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా... ఏదేమైనా...

చరణం: 2
వానవిల్లు రంగులంటే ఏడే ఉంటాయేమో వేల వేల రంగులన్ని నాకేచెల్లు
వానజల్లు కురిసెనంటె ఉరుమే ఉరిమేనేమో ఉరుము లేక చినుకునంట కుర్ర కళ్ళు ప్రేమజల్లు
చినుకు తాకితే జిగొచ్చునంట కోనసీమ
నేను తాకితే ఫలించునంట కొంటెసీమ
మేఘాన ఉన్నాయ్ నీటి పిడుగులే నా దేహాన ఉందోయ్ పట్టువిడని పిడికిలే
తారల్లో ఉన్నాయ్ మెరుపు తీగలే నా దేహాన పూచాయ్ వెలుగుపూల తీగలే
వానా వానా బుజ్జి వానా నన్నే నీతోటి పోలుస్తున్నా
వానా వానా బుల్లి వానా  నాలో భావాలు మనసు విప్పి పంచుకోన
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
నీతో రానా...
ధీంతనకిట ధీంతనకిట ధీంతనకిట ధీంతాననా
ఏదేమైనా...


********  ********  *********


చిత్రం: అతనొక్కడే (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: రంజిత్

పల్లవి:
అతనొక్కడేలే అందర్లోను
ఈ జీవితమంటే ఓ కోరికరేపే అతనొక్కడేలే
అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే
ఓ దారిని చూపే అతనొక్కడేలే
అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను బాధే అయిననూ
అతనొక్కడేలే అందర్లోను తానొలడై కూడా ఉన్ననూ.....

చరణం: 1
ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది
మనతోడై ఉంది నీడనంది
మదికోరుకుంది ఇస్తానంది నవ్విస్తానంది
కవ్విస్తానంది నేస్తమంది
మనమొంటరైతే వెంటే ఉంది
మనజంటే అంది ప్రాణం లాంటిది
మన బాధ అంతా నాదేనంటూ నేనున్నానంటు అన్నది

చరణం: 2
ఓ చిన్ని ఆశతో సాగావంటే
కేకేసావంటే ఆకాశంకూడా అదిరిపోదా
నీ చిన్ని గుండెలో దాచావంటె
భూగోళంకూడా భూపాలంతోటి నిదురపోదా
ఏం చెయ్యాలన్నా నీలో ఉంది
అడుగేసావంటే అడ్డేఉన్నదా
నీఅంత నువ్వే వద్దన్నావో నీవద్దే అంతా చెరదా

Palli Balakrishna Thursday, November 16, 2017
Athidhi (2007)




చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మహేష్ బాబు, 
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: రొన్నే స్క్రూవల
విడుదల తేది: 19.10.2007



Songs List:



ఖబడ్దారని కబురు పెట్టరా.. పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: నవీన్ రాహుల్ నంబియర్

ఖబడ్దారని కబురు పెట్టరా....గుబులు పుట్టదా చెడు గుండెలో 
నిదర దారిని తగలబెట్టరా....పగలు పుట్టదా నడి రాత్రిలో 
పిరికిగ పరుగు తీస్తావా....పొగరుగ పోరు చేస్తావా 
కలుగున నక్కి ఉంటావా....ఎవరికీ చిక్కనంటావా 
చెడునే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా 
ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం 

ఖబడ్దారని కబురు పెట్టరా....గుబులు పుట్టదా చెడు గుండెలో 
Dont ever mess with me..i'm gonna break u down 
That way... Thats the way! 

నీ పేరే సమరశంఖమై వినిపించనీ విద్రోహికి 
ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించనీ అపరాధికి 
పిడికిలి ఎత్తి శాసించు 
పిడుగుని పట్టి బంధించు 
యుద్ధం తప్పదంతే బ్రతుకు పద్మవ్యూహమైతే 
ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం 
ఖబడ్దారని కబురు పెట్టరా....గుబులు పుట్టదా చెడు గుండెలో 



గోన గోన గోన పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: నవీన్ రీటా

గోన గోన గోన గో న న నన ......గోన గోన గోన గో న న నన 
గోన గోన గోన గో న న నన ........హొ హొ హొ హొ 
గోన గోన గోన గో న న నన........గోన గోన గోన గో న న నన 
గోన గోన గోన గో న న నన....... హొ హొ హొ హొ 

ఓరి నాయనో పిచ్చ పిచ్చగా నచ్చావో చానా 
ఓరి దేవుడో అందువల్లనే చచ్చా నీపైన 
నొక్కి నొక్కి చెప్పకే ఒక్కమాట every time time time time 
చేత చిక్కి చిక్కి చెప్పకే చిన్న మాటone more time time time time 
లెక్కపెట్టి చెప్పితే గంట గంట waste your time 
చేత చిక్కినాక చెప్పితే ఉన్నదంతా సరదా time time time time 

గోన గోన గోన గో న న నన ......గోన గోన గోన గో న న నన 
గోన గోన గోన గో న న నన ........హొ హొ హొ హొ 
గోన గోన గోన గో న న నన........గోన గోన గోన గో న న నన 
గోన గోన గోన గో న న నన....... హొ హొ హొ హొ 



సత్యం ఏమిటో పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దీపు, ఉష

పల్లవి : 
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా 
రెప్పలదుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా 
నిను నీవే సరిగా కనలేవే మనసా 
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా 
ఏవో జ్ఞాపకాల సుడిదాటి బైటపడలేవా 
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా 

చరణం : 1 
చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని 
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసీ 
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచీ 
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా 
ప్రాణం ఉనికి పైన అనుమానపడరు ఎపుడైనా 
నిను నీవే సరిగా కనలేవే మనసా 
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా 

చరణం : 2 
పోయింది వెతికే వేదనా ఉంటుంది ఏదో పోల్చునా 
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలిచేదెపుడో 
సందేహం కలిగే మదికి కలతను తీర్చేదెవరో 
శాపంలాగ వెంట పడుతున్న గతం ఏదైనా 
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా 




కిలాడి కూన పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనుస్కా మంచంద, రంజిత్

పల్లవి : 
కిలాడి కూన పల్ పల్ పేచిలేలా నాతోనా 
కన్నులతో తేలీపారా చూస్తావేలో బోలోనా 
సిల్లీగ పైపైనాపై అలిగినా నమ్మేది లేదో ఏమైనా 
నువ్విలా పారిపరి కసిరినా కన్నీరె రాదె ప్రేమేనా 
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడిగడి ఓఓఓ 
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యరా రోజూ కలబడి ఓఓఓ 
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడిగడి కలబడి ఓఓఓ 
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తావడివడి ఓఓఓఓ 

చరణం : 1 
చుట్టూర చూస్తే నీకు ప్రేమే కనబడు లోకాన 
ఉన్నాది ప్రేమగాని పదుగురుకే నేపంచేనా 
ఆమాత్రం మాటే ఇస్తా జానే జాబా నీకంటునేనే లేనా 
ఇల్లారా దారికాచే కుర్రదానా ఎల్లాగె నీతో ఈపైనా 
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లో పడిపడి ఓఓఓఓ 
డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా లవ్‌మి మరిమరి ఓఓఓఓ 
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓఓఓఓ 
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓఓఓఓ 

చరణం : 2 
గమ్యములే వేరు చూడు ఆశవీడు నాపైనా ఎల్లాగ తూర్పు 
పడమర ఒకటయ్యే బోలోనా 
గుండ్రంగా ఉందోయ్ భూమి తెలుసునా వస్తావు తిరిగి ఏమైనా 
అందాక వస్తే నీతో ఏనాడైనా చూద్దామె ఆపైనా 
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా చోరబడి ఓఓఓ 
డిస్టర్బ్ చెయ్యరా డిస్టర్బ్ చెయ్యరా వల్లో పడిమరి ఓఓఓ 
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతై ఇకమరి ఓఓఓ 
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓఓఓ 




రాత్రైన నాకు పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనుస్కా మంచంద, రంజిత్

రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
తక తయ్య తక తయ్య ఇక తయ్యారే
ఎపుడైనా ఎక్కడైనా ఓరబ్బీ వీలు కాదు అన్నానా
చల్ హాట్ సాలి పగళి టచ్ ఇస్తే నువ్వే చడతా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి దిక్కోస్తే తిడతా కొడతా 
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే

చరణం: 1
ఓడించే మగాడు రోయ్ సాలా సాలా సాలా
ఢీ కొడితే ఒక్కోక్కడు ఎగిరే వాలీ వాలా
గుండెల్లో గూభేలురోయ్ చూపే తౌజండ్ వాలా
అడ్డొస్తే ధడేలురోయ్ వీడే హే మధు వాలా
పట్టి నార తీస్తానే తుక్కురేగదీస్తానే ఉప్పు పాతరేస్తానే  టైరో టైరో బేబే
ఆఙా మేరీ జిగిరి నీ మీదే చేతులు వేస్తా
ఆఙా మేరీ జిగిరి  ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి ఎనకొస్తే వాయే తీస్తా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే

చరణం: 2
వస్తావ నా రాజ ఈ రోజు కానీ గుడ్ నైట్ ఐ వాంట్ టు మీ విత్ యూ
టు గెదర్ విల్ బెటర్ ఫ్రీ ఫర్ యు
ఆజా మేరీ బాహోగయా జా
వస్తావ వస్తావ వస్తావ వ వ వ వ వ వ వస్తావ వస్తావ వస్తావ వస్తావ
నా వయసే కడుక్కు జాయ్ ఊది ఊది తాగేయ్
నా నడుమే చటాక్ రో ఉల్టా ఫల్టా చేసేయ్
నీ అడుగే తుఫానురో తాడో పేడో తేల్చేయ్
నీ పొగరే తుపాకిరో నన్నే నన్నే పేల్చేయ్
అమ్మా తిమ్మిరెక్కిందా బోడీ తొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబే
ఆఙా మేరీ జిగిరి నీ మీదే నేనే పడతా
ఆఙా మేరీ జిగిరి  ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి మెలికేసి మడతే పెడతా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే




వల్లా వల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అతిధి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, ధర్మ

వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల 
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా 
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా 
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా 
something said no way నాతో రాలేవే 
show me edho way నాది నీ తోవే 
బాపురే జానేమాన్ కావలి యారో యారో 
క్యా కరే మనకేం లే గోలి మారో మారో 

ఏదో చూస్తా వీలు చూసుకొని 
నీతో వస్తా కళ్ళు మూసుకొని 

వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల 
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా 
o yeah 
వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా 
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా 
o yeah 

పంతం ఒళ్ళో బడాయి ఒళ్ళో నచ్చావే నువ్వు మహా 
మీసం రోషం వారేవా నాతో సరసం కోరవా 
ఆరంభంలో మరెందువల్లో రెచ్చిందా తహ తహ 
పాపం తాపం తాళవా మైకంలో పడి తేలవా 
మిలమిల మెరిసిందే జింక దేఖో దేఖో 
నలుగురు వేటాడేలోగా దాక్కో దాక్కో 
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా 
కాబట్టే కంగారైంది ఎద 

వల్లా వల్లా నా వయసిల్లా విరిసే నీవల్లా 
ఎల్లా ఎల్లా ఇహ నా వల్లా తెలిసే అడగాలా 

కోరి కోరి కోరి కోరి కోరి కోరి 
కోరి కోరి కోరి కోరి కోరి కోరి 
వంపుల పిల్ల వయారం ఇల్లా విహారిస్తే విల విల 
అంతా చూసే వింతలా హాల్ చల్ హాల్ చల్ చిందులా 
తుంటరి జిల్లా తుఫాను ఈల దూసుకురా జరా జరా 
అందం చందం ఉందిరా అందిస్తాగా విందులా 
వరదలా ఉంచాయి నీలో లయలు హొయలు 
దరిమిలా మనమేం చేయ్యాలో బోలో బోలో 
ముందేముంది చూడనీవు కదా 
సందేహిస్తే సాగుతుందా కథ 
వల్ల వల్ల ... వల్ల వల్ల 

వల్లా వల్లా ఏడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల 
ఖుల్లం కుల్లా కులుకుల ఖిల్లా మెరిసిందే ఇల్లా 
o yeah 

Palli Balakrishna Saturday, August 19, 2017
Kick (2009)



చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
నటీనటులు: రవితేజ, ఇలియానా
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: ఆర్.ఆర్.వెంకట్
విడుదల తేది: 08.05.2009



Songs List:



దిల్ ఖలాసే పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనుష్క మంచంద

దిల్ ఖలాసే




ఐ డోంట్ వాంట్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్

కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని
చి కొట్టి పొమ్మనే అమ్మాయిని చేపట్ట గలిగే దమ్ముందని
నా పట్టుదలని చూపెట్టి నిన్ను ఆకట్టు కుంట రావే

అందుకే అందుకే అంత సులువుగా భామ
ఆటావో వేటవో అంతు తెలియని ప్రేమ

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ

కన్నెత్తి చూడకే కన్యామని పన్నెత్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని

కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్
కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్

తౌబా తౌబా తౌబా డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ ఓ నో నో నో డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ పాపా వాడు పాపా ముందుంది నీ పై పాప
ఓ ప్యారి మధు బాలాతు హాయ్ ఉస్కీ లైలా

రోజా పువ్వు ఓటందించి ఐ లవ్ యూ అంటే
నజ్జుగ్గ నువ్ స్పందించి ఐ డూ అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే
పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తామంటే

వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదే
ప్రాణమైన పందెమేసి కోరకుంటే నచ్చదే

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ

గెట్ హిం సం మోర్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ కిక్
వన్ మోర్ మోర్ కిక్

త న న త తరర ర త త న న త తరర ర తార
తరర త తరర తరర తరర త తరర తరరరరర తరర

జుట్టంతా పీక్కునేంత పిచ్చెకించిందే
యిట్టే చెయ్ జిక్కావంటే ఎం బావుంటుందే
రిస్క్ అంటూ ఎం లేకుంటే ఇష్క్ ఐన చేదే
లక్ కెళ్ళి లాక్కొచ్చేస్తే కిక్ ఏముంటుందే

నా దారికాదే న తీరుకాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ
నా తిక్క నాదే న లెక్క నాదే సాధిస్తా ఏదో ప్లాన్ ఎసి

ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
కిక్ ఆ




అటు చూడొద్దన్నానా పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా 
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా 
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా 
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా 
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా 
పడవలసిందేగా నువిలా నానా హింస 

ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా 
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా 

మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా 
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా 
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా 
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా 
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా 
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా 

ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే 
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే 
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే 
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే 
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే 
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే 




గోరే గోరే పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్ , జోస్న

గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా 
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా 
పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా 
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా 
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా 
ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా 
ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 

తెగ ఉరుముతు కలకాలం 
తెరమరుగున తన భారం 
మోసుకుంటు తిరగదు మేఘం 
నీలా దాచుకోదుగా అనురాగం 
ముల్లుగా నాటితే నీ వ్యవహారం 
తుళ్ళిపడదా నా సుకుమారం 
మెల్లగ మీటితే నాలో మారం 
పలికుండేదే మమకారం 
ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 

వెంటపడుతుంటే వెర్రి కోపం 
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం 
మండిపడుతుందే హృదయం 
మరిచే మద్యమైనా చెప్పదే సమయం 
నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా 
ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే 
తప్పు లేదే ఉన్న ప్రేమా 
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా 

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే 



మనసే తడిసేలా పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వర్ధని థమన్

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా

కంటి కనపడు ప్రాణమ గుండెకు వినబడు మౌనమా

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్ల
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్ల

ఆగని జీవన గానమా ఆ దేవుని వరదానమా

పదములు తరిమాయె తెలిసే అర్ధం నువ్వేనా
పరుగులు అలిసాయే కలిసే తీరం నువ్వేనా

ఓఓఓ ఊఊ ఊఊ ఓ




బాసు మనకి మెమోరి లాస్ పాట సాహిత్యం

 
చిత్రం: కిక్ (2009)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవితేజ, అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్ 

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
హే వాట్స్ అల్ దిస్ అ ఆ ఇ ఈ ఉ
మేటర్ కొంచెం కాట్రవల్లి,  డోంట్ డిస్టర్బ్ బి కూల్ 
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
ఛి ఎత్తు పైకెత్తి పాడు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
నీ అయ్య ఎంతసేపు రా అ ఆ ఇ ఈ
మేటర్  లోకి రా

బాసు  మనకి  మెమోరి లాస్ 
అద్ది కోరస్
(బాసు  మనకి  మెమోరి లాస్  
బాసు  మనకి  మెమోరి లాస్)

మ్... గతం గతః
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్)
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
మధ్యలో ఈ లకలకలేంటిరా
చంద్రముఖిని చూసిన రజినిలాగ
మనకి జనమే యాద్ లేదు గురు, మెమరీ లాస్ షురు
రజినిలా కాదు ఘజినిలా
మైండ్  అంతా ఖాళి ప్లేస్ 
టోటల్ గా మెదడు మటాష్
 జోలి  గా ఉన్నా బాసు జాలిగ పెట్టకు నీ ఫేస్
వెళ్ళిపోయిన  యెస్టర్ డేస్
వదిలేసిన గుర్తుల  ట్రాష్ 
దులిపేసిన మెంటల్ పీస్ కి చెపుతున్నా థాంక్స్ 
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని
జ్ఞాపకాల జాడలేదు ఫ్లాష్ బ్యాక్  వీడలేదు
లైలాతో ఫెయిల్  అయితే లవ్ ఫేస్
లైఫ్ అంతా ఫీల్అ వడం  నాన్సెన్స్ 
పారు అనడం పాపం దేవదాసు
వేరెవ్వరికో మిస్సెస్సు రా నీ  మిస్సు 
హెల్త్ వెల్త్ వేస్ట్  కద బ్రదర్ 
మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ 

హే హే హే హే
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం లక్కీచాన్స్)

భలే బాగుంటుందే ఖామోషు
ఖాళి దిల్ సే గడిపేయ్ ఆల్వేజ్
ఫ్రెష్ గా  ఉంటె వెయ్యి లేదా వేస్ 
తాజాగా మొదలవదా ప్రతి రోజు
హెల్త్ వెల్త్ వేస్ట్  కద బ్రదర్ 
మత్తు కన్నా మార్పు మస్తు బెటర్ 
బెటర్  బెటర్  బెటర్  బెటర్ మెమోరి లాస్
బాస్ మెమోరి లాస్ బాస్ మెమోరి లాస్
వీడు దేవదాస్ వీడు దేవదాస్
కాదు కాళిదాస్ కాదు కాళిదాస్
ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్
ప ని ప మ గ మ, మనకి మెమోరి లాస్
గ గ స ని స మ, మనకి మెమోరి లాస్ లాస్
మనకి మెమోరి లాస్ లాస్ లాస్ 

మెమోరి లాస్...
ఏ పేస్ ఏ ప్లేస్  పోల్చదుగా నా మనసు
లక లక లక లక హే ఏం  లక్కీచాన్స్
(ఏ పేస్ ఏ ప్లేస్  పోల్చదుగా నా మనసు)
లక లక లక లక హే ఏం లక్కీచాన్స్
బాస్  మనకి మెమోరి లాస్...
ఈ లాస్  ఎంతో లాభం కద బాసూ...
ఈ ఈ లాస్ ఎంతో లాభం కద బాసు
గాలి కానీ పూలు కానీ
పాత హిస్టరీ లు లేని వంద ఏళ్ళ జిందగీలో ప్రతి పూట కొత్తదంట
కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజయోగం

Palli Balakrishna Tuesday, August 15, 2017
Race Gurram (2014)



చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: అల్లు అర్జున్, శృతిహాసన్
దర్శకత్వం: సురేందర్  రెడ్డి
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, డాక్టర్ వెంకటేశ్వరరావు
విడుదల తేది: 11.04.2014



Songs List:



భూ...భూచాడే పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియర్, శ్రేయగోషల్

భూ...భూచాడే 
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
భూ...
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే
రేసుగుర్రంలాంటోడే రివర్సు గేరే లేనోడే
ఫొకస్ పెట్టేస్తాడే ఫిక్సవుతాడే డోలే కొడతాడే

భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసం ఉంటాడే...

భూ...భూచాడే 
డిఫెక్టుగాడే భలె డిఫెక్టుగాడే
కనెక్ట్టుగాని అయిపొతే డిస్కనెక్టుకాడే

భూ...భూచాడే...
హొ సాలా సాలా సాలా
నీ చూపే మసాలా 
హొ సాలా సాలా సాలా
నీ ఊపే మిస్సైలా 
ఓ నిక్కిన చుక్కల నక్కిన కిక్కుల
లెక్కలు ఒక్కలు తేల్చేరా 
చిక్కిన చుక్కని చెక్కర ముక్కను 
వక్కల చెక్కలు చేసేరా
తూ ఆజారే తూ ఆజారే తూ లేజారే సాలా

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
భలేతోడే ఘిలోటోడే బ్లూటూతై ఉంటాడే
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
బిగిస్తాడే తెగిస్తాడే నీకోసంఉంటాడే...

భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
గెలాంటోడే గిలాంటోడే బీకేర్ఫుల్ అంటాడే
హొ..హో భూచోడే 
భూచాడే భూచాడే భూమ్ భూమ్ చేస్తాడే
సునామీకే మిలానోడే నోటె తెస్తాడే...
భూచాడే...భూచాడే...భూచాడే...భూచాడే




మై స్వీటీ పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సిద్దార్ధ్ మహదేవన్, రాబిట్ మాక్

ఐమె సౌత్ ఇండియన్ 
ఐమ్ గొన టెల్లింగ్ గర్ల హు ఈస్ ప్రెట్టి 
హొ...హొ...రిచ్చి ద నేమ్ ఈస్ స్పందనా
షి గాట్ బ్యూటిఫుల్ ఐస్ అండ్ షి ఈస్ విత్ ఇట్ 
ఒహ్ గరాబొ షి ఈస్ గొన్న మై స్వీటీ...
మై స్వీటీ...ఒహ్ మై స్వీటీ... స్వీటీ...

హెయ్ జిందగీని జాలిగా నీకు నచ్చినట్టూగా 
నీటి లాగ సాగిపోనీ
హెయ్ ఊహలోన తేలనీ ఉప్పెనల్లె పొంగనీ 
గాలిలాగ ఊరేగనీ
హెయ్ ఫేసుకున్న మాస్కునీ సీసికొట్టు నేలనీ 
చూడు నీలొ ఒరిజినల్నీ 
క్లాసులోన మాసునీ మాసులోన క్లాసునీ
మిక్సు చేస్తే బ్యూటీ హనీ 
ఒహ్ మై స్వీటీ  - కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే 
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

చాలు చాల్లే చలాకి వైటు నాటు తుపాకి 
పారిపోతారె లోకమంతా నిన్ను చూసీ 
కొంచెం వీలేసి చూడు
పెద్దకేకేసి చూడు నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇక నీలో హార్టు ఎంతొ లైటు స్మూతు సౌండు 
స్వీటీ  -  కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ - కొంచెం దారి తప్పవే
మై స్వీటీ - కొంచెం కోపగించవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...

స్వీటీ -  కొంచెం మాట వినవే 
ఒహ్ మై స్వీటీ -  కొంచెం దారి తప్పవే
మై స్వీటీ  - కొంచెం కోపగించవే 
లైఫ్ స్టైలు మార్చవే నీ బాచ్చుమార్చవే 

లైఫే చాల చాల షార్టువే 
ఎవ్రీ సెకండే  - ఎంజాయ్ చెయ్యవే 
నీతో నువ్వు ఫైటుచెయ్యవే 
నిన్ను నువ్వు గెలవవే కొంచెం ఫ్రీడంపొందవే...
మై స్వీటీ.....




సినిమా చూపిత్త మామా పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: సింహా, దివ్య , గంగ

మామా నువు గిట్ల గబర గిబర 
తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు 
దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

డప్పు కొట్టి పిలవబట్టే ఈని తీరే
నిప్పులెక్క కాల్చ వట్టే ఈని పోరే
కొప్పు గూడ గొట్ట వట్టే ఈని జోరే

హే మామ దీని సూడకుంటే మన్నుతిన్న పాములెక్క మనసు పండబట్టే
అయ్యో ఈడు చూడగానే పొయ్యిమీద పాల లెక్క దిల్లు పొంగబట్టే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో 
ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో

మామ ని బిడ్డవచ్చి తగిలినంకనే 
లవ్వు దర్వాజా నాకు తెరుసుకున్నదే
ఓ రయ్య ఈ పోరగాడు నచ్చినంకనే 
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు వట్టేసెనే కుట్టేసెనే పాగళ్ గాన్ని చేసెనే
సుట్టూత బొంగరంలా తిప్ప బట్టెనే 
సిటారు కొమ్మ మీద కుకో బెట్టేనే
మిఠాయి తిన్నంత తీపిబుట్టెనే 
సందులల్ల దొంగలెక్క తిప్పవట్టెనే
దీని బుంగమూతి సూత్తే నాకు 
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే

సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా 
సిను సిను కి  నీతో సీటీ కొట్టిత్త మామా

మామ ... మామ

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా... పుంగి బజానా... 

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన




గల గల గల గల గల్లంటు మనసే పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రెహ్మాన్
గానం: దినేష్ కనగరత్నం, మేఘ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో 
ఓ అమ్మాయో
యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో 
ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత
మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో 
ఓ అమ్మాయో
ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్లా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ

గల గల గల గల గల్లంటూ మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
I want to say my love
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె మాయో 
ఓ అమ్మాయో

రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే - హేయ్
నేను రెప్పలైన వేయలేను అందుకే - హేయ్ 
హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే
నువ్వు చెతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే - హేయ్
నా శ్వాసలోన నువు చేరినందుకే

I wish i wish i could be with you 
for longer longer life along
Don’t break my heart 
don’t just leave me all alone alone alone

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్లా
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా
నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ

గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
ఐ వన్న సే మై లవ్
నువ్వంటే పిచ్చ ప్రేమలే
గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో 
ఓ అమ్మాయో

నువ్వంటే పిచ్చి ప్రేమలే  నువ్వంటే పిచ్చి ప్రేమలే



Down Down పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: విశ్వా 
గానం: ఎస్. ఎస్. థమన్, శ్రుతి హసన్ 

Down Down



రేసు గుర్రం పాట సాహిత్యం

 
చిత్రం: రేసు గుర్రం (2014)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి 
గానం: ఉషా ఉతఫ్, యం.యం.మానసి, యం.యం.మోనీషా

రేసు గుర్రం 

Palli Balakrishna Saturday, August 5, 2017
Oosaravelli (2011)
 
చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: విజయ్ ప్రకాష్, నేహా భాసిన్
నటీనటులు: జూ. యన్. టి. ఆర్, తమన్నా, పాయిల్ ఘోష్
కథ: వక్కంతం వంశీ
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: బి.వి. యస్.యన్. ప్రసాద్
విడుదల తేది: 06.10.2011

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక నువ్వయ్యానిక
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటానంతే
నాకై ఇన్ని చేయాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

చరణం: 1
రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వు దూరమైతే
రెండుచేతులు ఊరుకోవుగా
నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నా చెంతకొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక

చరణం: 2
నువ్వు ఎంతగా తప్పు చేసినా
ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా
ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసినా
తీయ తీయగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపినా
హాయిగానే ఉంది
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్టు
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకెన్నో
గుర్తుకొచ్చేనే వింత గా

ఓ నిహారిక నిహారిక నువ్వే నా దారిక నా దారిక
నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక నువ్వయ్యానిక



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
సర సర సర మంటు విషమల్లే
నర నరం పాకింది తొలి ముద్దు
గబ గబ గబ మంటు గునపాలే
మెదడును తొలిచింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే వదలనులే చెలి చెలీ
నిన్నే మరణం ఎదురు వచ్చినా
మరవనులే చెలి చెలీ
నిన్నే మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంతా తిమిచీరే ఫిరంగిలాగ అది మారే
కణాలలో మధురణాలలే కదిపి కుదుపుతోంది చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే
ఒక జనణం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే సతగ్నులెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే నీ స్పర్సే ఓ ఓ చెలియా ఆ ఆ

బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే

ఒక క్రోదం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే
ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే
ఒక యోధం ఒక యజ్ఞం నిర్విగ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా ఆ ఆ ఆ
బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే
చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే
పెల పెల పెల మంటు పిడుగల్లే
పెదవిని తాకింది తొలిముద్దు
ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే
ఎదురుగ నిలిచింది తొలి ముద్దు



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: వివేక
గానం: ఫ్రాన్సిస్ కేస్టిల్లినో

Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing
ఏంటో నీ Feeling చెప్పేయ్ Darling
ఎటు అంటే అటు తిప్పుతాలే నా Steering
Love అంటే దొంగల్లే Secretగా కలవాలే
Friend అంటే దొరలా Meet అయ్యే Chance లే
Love అంటే Red RosE కోపంగా ఉంటాదే
Friendship White RosE Cool గా ఉంటాదే
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing

ఓసారి Love Better అంటాడు
ఓసరి Friend Great అంటాడు
ఏ రోజెలా వీడుంటాడో వీడికే Dought
ఓ సారి Dear అని అంటాడు
ఓ సారి Fear అని అంటాడు
ఏ Mood లో ఎప్పుడు ఉంటాడో No Updatu

నీ కంట నీరొస్తే నా kerchief అందిస్తా
మళ్ళీ అది శుభ్రంగా ఉతికిచ్చే Wait చేస్తా
నీ కాళ్ళు నొప్పంటే నిను నేనే మోసుకెల్తా
దింపాక నీతోనే నా కాళ్ళు నొక్కిస్తా
Sim Card తెమ్మంటే Cell Phone తెచ్చిస్తా
నువ్వు Swith Off లో ఉన్నా Ringtone మోగిస్తా
Address చెప్పంటే Drop చేసి వచ్చేస్తా
Petrol కై నీ Credit CardE గీకేస్తా
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing


Love అంటు చెప్పాలంటే I Love You చాలే
దోస్తీ వివరించాలంటే భాషే సరిపోదే
ఏ తప్పంతా నీదైనా నే Sorry చెపుతాలే
Hey Friendship లో Ego లేదని నే చూపిస్తాలే
నిన్నైనా నేడైనా నేడైనా రేపైనా
రేపైనా ఏనాడైనా తోడుంటా
ఎండైన వానైన కన్నిరుండే దారైనా
ఏమైన గాని తోడుండే వాడే Friend అంట
Love అంటే Caring
Friend అంటే Sharing
ఎట్టుందే పిల్లా బోలో నా Framing



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అద్నాన్ సామి

నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హో ఏచోటనైనా ఉన్నా నీకోసం
నా ప్రేమ పేరు నీలాకాశం
చెక్కిల్లు ఎరుపయ్యే సూరీడు చూపైనా
నాచెయ్యి దాటందే నిను తాకదే చెలి
వెక్కిల్లు రప్పించే ఏ చిన్ని కలతైనా
నాకన్ను తప్పించి నిను చేరదే చెలీ చెలీ చెలీ
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం
పీల్చే శ్వాసై నిన్ను చేరేలా
నేల నేను రోజు సర్దుకుపోతుంటాం
రాణి పాదాలు తలమోసేలా హో హో
పూలన్నీ నీసొంతం ఓ ఊల్లన్నీ నాకోసం
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా
ఏ రంగు నీ నేస్తం ఆదేగ నా నేస్తం
నీ నవ్వుకై నేనే రంగే మార్చెనా హో
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం

చేదు బాధ లేని లోకం నేనవుతా
నీతో పాటే అందులో ఉంటా
ఆట పాటా ఆడే బొమ్మై నేనుంటా
నీ సంతోషం పూచి నాదంటా
చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే
నీవంక చూపిస్తా అదుగో అనీ
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే
టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని
నేనంటేనే నాకు చాలానే ఇష్టం
నువ్వంటే ఇంకా ఇష్టం
హుం హుం హుం హే హే హే
హొ హొ హొ హుం హుం హుం



*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఉజ్జయిని

ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి
వీడు మాయగాడు ఊహకందనోడు
వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు అంతుచిక్కనోడు
కోటి తలల తెలివికైన Question మార్కుడు

ఊ ఊసరవెల్లి ఊ ఊ యా యా యా యా ఊసరవెల్లి

Atom Bomb వీడు చెప్పి పేలతాడు
అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మాసుగాడు వేల రంగులోడు
Wrong నైనా రంగు మార్చి Right చేస్తడు

ఊ ఊసరవెల్లి ఊ అ ఊ అ ఊ అ ఊసరవెల్లి

You Can't Catch Him
You Can't Meet Him
You Can't Punch Him
You Can't You Can't You Can't You Can't Stop Him
You Can't Track Him
You Can't Chase Him
You Catch Catch Catch Catch Catch
ఊ ఊసరవెల్లి ఊ ఊసరవెల్లి ఊసరవెల్లి


*********  *********  ********


చిత్రం: ఊసరవెల్లి (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: MLR. కార్తికేయన్

నీకు వంద మంది కనపడుతున్నారేమో
నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధమంటూ మొదలు పెట్టాకా
కంటికి కనపడాల్సింది Target మాత్రమే
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
శ్రీ ఆంజనేయం భజే వాయు పుత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఓ భజరంగ బలి దుడుకున్నదిరా నీ అడుగులలో
నీ సరిలేరంటూ తన ఆశయ సాధనలో
ఓ పవమానసుతా పెను సాహస ముంగిట పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
ఉరక తెచ్చుకుని శ్రీయ పతాకము
ధరని ధైన్యమును దించగరా
నివురులొదిలి శివ కాలనేత్రమై
సంకటహరమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
దండించాలిరా దండదాలివై దుండగాల దౌత్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం
పూరించాలిరా నీ శ్వాసతో ఓంకాల శంఖం

ఓం బ్రహ్మాస్త్రము సైతము వమ్మవదా నీ సన్నిధిలో
ఆ యమపాసమె పూదండవదా నీ మెడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో
అదే రధసారిగ మార్చద కడలిని పయణములో
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం
సదా రక్షగా కాపాడనీ నీ నామధేయం
భజే వాయుపుత్రం భజే బాల గాత్రం
సదా అభయమై అందించరా నీ చేతి సాయం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Palli Balakrishna Tuesday, July 18, 2017
Ashok (2006)



చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: జూ.యన్. టి.ఆర్, సమీరా రెడ్డి
దర్శకత్వం: సురేంధర్ రెడ్డి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
విడుదల తేది: 14.07.2006



Songs List:



గోల గోల రంగోల పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రవి వర్మ , సుజాతా మోహన్ 

గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
ఓ పువ్వుల బాల

గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా
వేలా వేవేల విరహాల తెర దించాల
నీలా నవనీలా మువలీల జరిపించాలా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా 

తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన
భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన

ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా
కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా

అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన
నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన
వింటున్న ప్రియమైన  నీ ఆలాపనా వింటానే ఇకపైన కసిప్రేలాపనా
సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా

దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా
దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా
దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా
దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా

గోల గోల గోల గోల
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల 
గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా  ఏదో వచ్చేవేళా





నువ్వసలు నచ్చలే పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్ , చిత్ర 

నువేసుకున్న డ్రెస్సు నచ్చలే




ఏకాంతంగా ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: కారుణ్య

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా 
నీకై నేను అలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా 
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడిచస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా కమ్మని సంగతులెన్నో నా ఎద గుండెల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన ఆకర్షణలో మునకేస్తున్నా 
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయస్సంతా వలపై ఉన్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా…

స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడిగుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవననదిలో పొంగే నీరవుతున్నా 
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా…

ఏకాంతంగా ఉన్నా ఎందరి మద్యన ఉన్నా...




ఒక చిన్ని నవ్వే నవ్వి పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: KK

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)
చిరునవ్వుల దీపం వెలిగించూ… నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ… శత్రువులే ఉండరు గమనించూ

మనిషన్నోడే మనసారా… తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని… కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును… చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ…

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా… పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా… అదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి… నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి… ఎక్కర పై మెట్టూ

నీ కోపం నువ్వే కరిగించు… నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు… పది మందికి నువ్వే చాటించూ

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ… కసితీరా నవ్విస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే నవ్వులు నటియించి…కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్నే ఎదిరించేటి… మార్గం కనిపెట్టు
కదిలే కాలాన్నే ఎదురీదేటి… ధైర్యం చూపెట్టూ

ఈ జీవిత సత్యం గుర్తించూ… ఆనందం నీవై జీవించూ
నీ చలనం నువ్వే గమనించూ… సంచలనం నువ్వే సృష్టించు

ఒక చిన్ని నవ్వే నవ్వి… యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి… బంధాలెన్నో కలపొచ్చూ (2)




జాబిలికి వెన్నెలనిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, శ్రీ వర్ధిని

జాబిలికి వెన్నెలనిస్తా



ముంతాజ్ మహల్ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక్ (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవన్ ఏకాంబరం, తన్విషా

ముంతాజ్ మహల్  కట్టించాడే షాజహాను 

Palli Balakrishna Wednesday, July 12, 2017
Dhruva (2016)




చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
నటీనటులు: చరణ్ తేజ్, అరవింద్ స్వామి, రకూల్ ప్రీత్ సింగ్
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: అల్లు అరవింద్, యన్. వి.ప్రసాద్
విడుదల తేది: 09.12.2016



Songs List:



ధ్రువ ధ్రువ పాట సాహిత్యం

 
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అమిత్ మిశ్రా

అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం

ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే
ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే
ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ

ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరి చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో...

ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో...



చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే పాట సాహిత్యం

 
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: పద్మలత, స్నిగ్గి

చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

నా మాటలన్నీ నీ పేరు తోనే నిండాలీ తీయగా
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలీ హాయిగా
ఊపిరల్లీ నీకూ తోడుగా...
ఉండాలీ అన్నా చిన్నా కోరికా...

చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే

మాక్ మాక్ మాటాలాడే ఒక్కటీ చీ చీ చిందులేసే ఒక్కటీ
మాటలాడే ఒక్కటీ మౌనంమరొక్కటీ
చిందులేసే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
గొంతులోనే ఒక్కటీ స్థిరంగా ఒక్కటీ
ప్రేమల్లే ఒక్కటీ ప్రశ్నల్లే ఒక్కటీ

చూశ చూశ చూశ ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశ కలిశ కలిశ ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేశ వేశా హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే




పరేశానురా పాట సాహిత్యం

 
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: పద్మలత, విష్ణుప్రియ

పరేశానురా పరేశానురా ప్రేమన్నదే పరేశానురా
పడితే మరీ పడుకోదురా పని పాటనీ పడనీదురా
ఇక రేయిని పగటీనీ ఒకటి చేసీ
నిదురనూ తరుమునురా...
పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకును రా...
ప్యారులో పడిపోతే పరేశానురా
ప్యారులో న్యూసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటుందిరా

ఒక తికమక మతలబులో మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ నిను విడువను విడువను విడువనంటూ
గొడవలు చేయునురా...
గొడవలూ మోసే గుండె నిండా
అరుపులురా కేకలూరా ఆ ఆ

ప్యారులో పడిపొతే పరేశానురా
ప్యారులో న్యుసెన్సు శురువాయరా
ప్యారులో ప్రతి మలుపు దీపాలురా
ప్యారులో దోదిల్కి ఫైటుందిరా




నీతోనే డాన్సూ టునైట్ పాట సాహిత్యం

 
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హిప్ హప్ తమిజ్, నిఖితా గాంధి

సునో సునో సునో సున్లో యారో లవ్ సోర్జాయ్
సునో సునో సునొ సున్ మేరీ స్పైసీ కవర్
అనువనువునా పొగించావోయ్ ప్రేమ రివర్
గణ గణ గణ మోగించావోయ్ ప్యారు బజర్

నీతోనే డాన్సూ టునైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ - వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టునైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్
నీతోనే డాన్సూ టునైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ - వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టునైట్ నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ - ఎవరీ బాడీ

తు ఏక్ మే ఏక్ చేరిన వేలా
దో దిల్ దో దిల్ చేసెను గోలా
తీన్ బార్ తీన్ బార్ తుంటరీ గోలా
జాక్ పాట్ చేయ్యేలా
పాడీ ఇదీ ప్రేమలా పాడీ - వన్ మోర్ టైం
జోడీ నువ్వు నేనొక జోడీ ఆడీ పాడేద్దామే లేడీ
పాడీ ఇదీ ప్రేమలా పాడీ
జోడీ నువ్వు నేనొక జోడీ ఆడీ పాడేద్దామే లేడీ

నీతోనే డాన్సూ టునైట్  నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ - వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టునైట్  నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్
నీతోనే డాన్సూ టునైట్  నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్ - వన్ మోర్ టైం
నీతోనే డాన్సూ టునైట్  నీతోనే డాన్స్ ఫలైస్
నీతోనే ఫారిన్ టూ లెదర్




మనిషి ముసుగులో మృగం నేనేరా పాట సాహిత్యం

 
చిత్రం: దృవ (2016)
సంగీతం: హిప్ హప్ తమిజ్
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: హిప్ హప్ తమిజ్, వరికుప్పల యాదగిరి , కౌశిక్ క్రిష్, అరవింద్ స్వామి 

మనిషి ముసుగులో మృగం నేనేరా 

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default