Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Raashi Khanna"
Thank You (2022)



చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్ 
నటీనటులు: నాగ చైతన్య, రాశిఖన్నా, మాళవిక శర్మ , అవికా గోర్
దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ 
నిర్మాత: దిల్ రాజు, శిరిష్
విడుదల తేది: 08.07.2022



Songs List:



మారో మారో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: విశ్వా, కిట్టు ప్రాగడ
గానం: దీపు , పృద్వీ చంద్ర 

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

పోరాటం క్రీడా… మీ మతమైతేరా
క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా

ఈ అసుర గనముకే
ఆ అధిపతి ఎవడనే
ఈ తలపడు క్షణమునే
దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో

మారో మారో యుద్ధం మొదలు
తాడో పేడో తేల్చెయ్ ఇపుడు
మారో మారో సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

నా శపథం తెలిసున్న
చెయ్యమాకు తాకిడి
నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ

నేనే నాకు సైన్యం
దూసుకుపోయే నైజం
చెల్లించాలి మూల్యం
ఢీ కొడితే తథ్యం

ఈ తరగని తెగువనే
హే విడువని క్షణమునే
ఈ తగిలిన పిడికిలే
ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా

మారో మారో… యుద్ధం మొదలు
తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు
మారో మారో… సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్  ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ




ఏంటో ఏంటేంటో పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: జొనితా గాంధీ 

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

ఒకసారి చూశాక మళ్ళీ మళ్ళీ
నిను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి
ప్రతిసారి నీమీద వాలే గాలి
నను తాకి పోతుంటే ఏం చెప్పాలి

ఏదైనా నీకు ఇవ్వాలనుంటే
ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో
నీకోసం వేచి చూడాలనుంటే
నాకన్నా నువ్వే ముందుంటావేంటో

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తన
 
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో

సరదా సరదాగా సాగే ఈ స్నేహంలో
సరిగా గమనిస్తే చాలా ఉందే
చిలిపి బరువేదో మోపింది ప్రాణంలో
అది నీ జతలోనే మోయాలందే

బాబు నీ పేరే బళ్ళో పాఠంలా
బట్టీ కొట్టేది దేనికంటా
అయ్యో నీ మాటే గుళ్లో మంత్రంలా
రోజు పాడాలటా ఆ ఆఆ

మా మేడలోన చూల్లేని అందం
మీ గూడు చూపింది నాకివ్వాలా
మా నాన్న కోపం మరిచేంత మైకం
నా చుట్టూ కమ్మిందే సంతోషంలా

ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీంతన నననన నననన
ధీం తనన తనన

వెన్నెల జడి ప్రతి మలుపున
వెచ్చని సడి ప్రతి తలపున
విచ్చలవిడి మతి మరుపున
పడిన పడిన పడిన

ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ధీంతన నననన నననన తన
ననన తనన

ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో
నాతో నువ్వెంటో నీతోటి నేనేంటో
చూసే చూపేంటో మారే తీరేంటో
వెళ్ళే దారేంటో జరిగే ఈ మాయేంటో



ఫేర్వెల్ పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అర్మాన్ మాలిక్ 

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు
హైస్కూల్ మేట్స్ తో ఇంకో అయిదేళ్ళు
ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ అయిదేళ్ళు

చేశామంటా ఎన్నో సందళ్ళు
చూశామంటా ఎన్నో సరదాలు
ఎదలో నిలిచేనంటా
మన ఈనాటి అల్లర్లు
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా, ఆ ఆ ఆ హా

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో

అమ్మా నాన్నతో ఓ అయిదేళ్ళు
గల్లీ గ్యాంగుతో ఓ అయిదేళ్ళు

కోపాలు అభిమానాలు చిరునవ్వులెన్నో
స్నేహాలు శత్రుత్వాలు తొలిప్రేమలెన్నో
పోటీలు బహుమానాలు గాయాలు ఎన్నో
కాలేజీ స్వప్నాలెన్నో, కన్నీళ్లు ఎన్నో

ఈ జ్ఞాపకాలు అన్నీ ఈ అనుభవాలు అన్నీ
పునాదయ్యి కట్టాలి మన కోటనే
ఈ సంతకాలలోని… చిరు అక్షరాలు మనమై
కలిసుండాలి కలకాలమే

సెండాఫ్ చెప్పేద్దాం
సెండాఫ్ చెప్పేద్దాం
ఈనాడే మన ఈ లైఫ్ కే
వెల్కమ్ పలికేద్దాం
వెల్కమ్ పలికేద్దాం
ఈరోజే మన న్యూ లైఫ్ కే

ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో
ఓహో ఓ హో హో
ఓహో ఓ హో హో
ఓ హో ఓ ఓ ఓహో హో




ఈ నిమిషం ఈ నిమిషం పాట సాహిత్యం

 
చిత్రం: Thank You (2022)
సంగీతం: ఎస్.ఎస్. థమాన్
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: శ్రీకృష్ణ , మనీషా ఈరబత్తిని 

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

ఈ క్షణమే ఈ క్షణమే
నీలో నన్ను విడిచానే
నా సమయం నా సమయం
నీదై పోతు ఉందే

నువు నాతో అడుగేస్తే
వెలుగేలే ఏవైపైనా
కలలాగే గడిచిందే
నిను చూసే కాసేపైనా

నిదురించే నిమిషాన్న
పెదవుల్లో నీ పేరేనా
ఇకపైనా నను నీకే
వదిలేసా ఏదేమైనా

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ టెన్ టు ఫైవ్

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
నమ్మేలా లేదే మనసిపుడు

ఈ నిమిషం ఈ నిమిషం
నన్నే నేను మరిచానే
నా హృదయం నా హృదయం
నీడై నీతో నడిచిందే

చిన్ని చిన్ని మాటలే చెప్పుకుంటే నేరమా
వచ్చిపోవా ఒక్కసారైనా
చిట్టి చిట్టి ఊహలే పంచుకుంటే పాపమా
ఉంటావేంటో అంత దూరానా

ఉదయము లేస్తూ లేస్తూనే
కలలను వెంటాడేస్తున్నా
పదమని నేనే నాతోనే
పరుగులు తీస్తున్నా

నాదైనా గగనంలో
సూరీడు చంద్రుడు నేనై
వేచేసే సమరంలో
నా సైన్యం నేనై నేనై

నీ మాటతో మాట కలిపి
నీ చేయితో చేయి కలిపి
నీకింతగా చేరువౌతాననుకోలేదే
నేను ఎపుడూ

నీ కళ్ళలో కళ్ళు కలిపి
నీ చూపులో చూపు కలిపి
నీ ఊపిరై చేరుకున్న
అయినాగానీ

Palli Balakrishna Tuesday, June 28, 2022
Srinivasa Kalyanam (2018)



చిత్రం: శ్రీనివాస కళ్యాణం (2018)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: నితిన్, రాశిఖన్నా
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 2018

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం (2)

రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ
వరమాలకై వేచు సమయాన
శివధనువు విరిచాకే వధువుమధి గెలిచాకే
మోగింది కళ్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీరామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి అందాల రమణి
వినగానే కృష్ణయ్య గీతామృతం
గుడిదాటి కదిలింది తనవెంట నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ
విరి వలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే
కళ్యాణ కలలొలికినాడమ్మ
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
ఋణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేద మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపాన
వరుడంటు వధువంటు ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార సాగరపు మధనాన్ని సాగించమంటున్నది
జన్మంటు పొంది జన్మివ్వలేని
మనుజునకు సార్ధక్యముండదు కదా
మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం


Palli Balakrishna Wednesday, July 11, 2018
Bengal Tiger (2015)



చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజ , తమన్నా, రాశిఖన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె.రాధా మోహన్
విడుదల తేది: 10.12.2015



Songs List:



బెంగాల్ టైగర్ పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ , భార్గవి పిళ్ళై 

బెంగాల్ టైగర్ 




ఆసియా ఖండంలో పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సంపత్ నంది 
గానం: నకాష్ అజీజ్ , పి.నూతన , భార్గవి పిళ్ళై 

ఆసియా ఖండంలో 



చూపులతో దీపాల పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
నవ్వులతో చెరసాల నడుముతో మధుశాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఓ కలముకు అందానికి అక్షరమా
కవితకు తెలపని లక్షణమా
బాపుకే దొరకని బొమ్మవే
బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే

నీ చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్నా
ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా  జన్మ ధన్యమే
నీ చక్కని దేహానికి హత్తుకున్న చీర రైక నేసిన
ఆ చేతులది గొప్ప పుణ్యమే
నిధురకు మెళుకువ తెచ్చే  అందం నీవే లేవే
నిన్ను మరవడం అంటే మరణములే

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఏ ఋతువో ఏ రుణమో వేల వేల ఏళ్ల వేచి
ఈ తెలుగు నేలనిలా ఎంచుకుందిలే
ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపసు చేసి
నీ పాదాలకు నడకనిల పంచుకున్నావే
ఏమిటి చంద్రుడు గొప్ప 
అది నీ వెలుగే తప్ప
ఇలకే జాబిలివై జారావే





బాంచన్ పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల, దేవ్ పవర్ (RAP)
గానం: అద్నాన్ సామి , భీమ్స్ సిసిరోలియో (RAP)

బాంచన్



రాయే రాయే పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా శర్మ, ఉమా నేహా, స్మిత 

రాయే రాయే 

Palli Balakrishna Sunday, November 26, 2017
Jai Lava Kusha (2017)



చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జూ. యన్.టి.ఆర్,  రాశిఖన్నా, నివేద థామస్, తమన్నా
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబీ )
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.09.2017



Songs List:



రావాణా..జై జై జై పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య కుమార్

అసుర    రావణాసురా
అసుర అసుర   రావణాసురా

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక
వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక

శక్తి శక్తి సూచిక  యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా

ఓ..ఓ…ఏక వీర..సూరా.. క్రూరా..కుమారా…
నిరంకుశంగ దూకుతున్న  దానవేశ్వరా

ఓ...ఓ..రక్త ధారా.. చోర..ఘోరా..అఘోరా
కర్కశంగ రేగుతున్న  కాలకింకరా

రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై…
రావాణా..జై జై జై… సింహాసనా..జై జై జై…

అసుర..అసుర....అసురా..అసుర..రావణాసురా
అసుర..అసుర.అసురా..అసుర..రావణాసురా

చిత్ర చిత్ర హింసక  మృత్యు మృత్యు ఘంటిక
ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా 

ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షకా
రామనగర పట్టణాల సకల జన ఘర్షక

ఓఓఓఓ…అంధకరా.. తార..ధీర..సుధీరా..
అందమైన రూపమున్న అతి బయంకరా

ఓ..ఓ..దుర్వితారా.. భైరా..స్వైరా..విహార
పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకరా

రావాణా..జై జై  జై… శత్రు శాసన..జై జై జై
రావాణా..జై జై  జై … సింహాసనా..జై జై  జై

నవరసాల పోషక నామరూప నాశకా
వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక

చరమగీత నాయకా నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా

ఓఓఓ…అహంకారా.. హారా..బారా..కిషోరా..
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా…

ఓ..ఓ..తిరస్కార… తీరా..ఎరా..కుబేరా…
కణము కణము రణములైనా కపాలేశ్వర…

రావాణా..జై జై  జై … శత్రు శాసన..జై జై  జై …
రావాణా..జై జై  జై … సింహాసనా..జై  జై  జై …





ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్ప్రీత్ జస్జ్ , రనైనా రెడ్డి

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ
నరాల్లో మోగుతోంది క్లారినైట్
ఫిరంగి గుచ్చినట్టు
రొమాన్స్ గుప్పు మంది పార్టు పార్టు
ఫిరంగి జ్
హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పరెయ్యకే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ ఓ..

ఇష్క్ శాండిలైట్ లా చుట్టుముట్టి తిరగనా
ఇష్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి
గాగ్ర చోళీ కట్టులా అందనంత ఎగరనా
ఆవురావురన్న నిన్ను మాయచేసి
జపాన్ ఎర్త్క్వెక్ మొదలైయిందే 
జవాని పొంగులోన 
పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే
ఒకింత పంచుకోన
థెర్మోమీటరే దాటుతోంది మేటరే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

కవర్ పేజ్ చిరిగిన బ్యూటీ మ్యాగజీన్ లా
డళ్లయ్యేదే భూమి నువ్వు పుట్టకుంటే
హే గ్లాసు లోకి ఒరిగిన ముచ్చి ఐస్ క్యూబ్ లా
చుమ్మాయిందె ఫోజు నువ్వు ముట్టుకుంటే
రెబాన శాకాహారి హద్దు మీరి
గుద్దావే పూల లారీ
లిరిక్స్ లేని ధన్ దనా నా ఫెడారీ
కమాన్ బ్రహ్మచారి
బ్రేక్ లేని దూకుడే ఆపుతుంది ఊపుడే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 




కళ్ళలోన కాటుక పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర

పల్లవి: 
కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా 
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా 
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా 
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా 
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా 

చరణం: 1
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా 
నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా 
నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా 
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా 
అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా 

అసుర అసుర అసుర అసుర రావణాసురా 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 

చరణం: 2
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 

నీ పెదవిలోని ఎరుపు నా పెదవికి గాయం చేస్తే 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 
మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 
దారులంత ఒక్కటై ఒత్తుతంగ ఒక్కరై 
అందమైన ఔషదాన్ని తాగనా 

హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా




దోచేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజీజ్ 

దిన దినా దా
దిన దినా దా
దిన దినా దా
దిన దినా దా

కృష్ణ ముకుంద మురారి
జై జయ కృష్ణ ముకుంద మురారి

మీ కష్టాలన్నీ దోచేస్తా
కన్నిలన్నీ దోచేస్తా
చీకు చింత దోచేస్తా
చీకటినంత దోచేస్తా
బయాలన్నీ దోచేస్తా
బారాలన్నీ దోచేస్తా
అప్పు సొప్పు దోచేస్తా
ఆపదనంత దోచేస్తా

ఏయ్య్ మూర్తి బాబాయ్
ఏయ్ జ్యోతి అక్కాయి
నీ చేతులోన దాగిన వంకర గీతాలు
నుదిటి రాసిన వంకర రాతను
వెంట వెంటపడి ఎత్తుకెళ్లిపోతా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

కళ్ళ కపటం లేని పిల్లాడినయి
వస్తా నే వస్తా
మీరు వెళ్లే ధారులలోన ముళ్లంటిని
ఏరేస్తా పారేస్తా

సంద్రం లోని ఉప్పుని మొత్తం
చదువులో తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం
మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చలు మొత్తం
కూరలలోన పుచ్చులు మొత్తం
దేశంలోని చిచ్చులు మొత్తం
దూరం చేసేస్తా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

రాముని గుణమే కలిగిన క్రిష్ణయ్యా ల
వస్తా నే వస్తా
అరె చీరలు బదులు నీలో చేదు లక్షణాలే
లాగేస్తా దాచేస్తా

నవ్వుల మాటుల ఏడుపులన్న్ని
ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ
స్వాహా చేసేస్తా
రంగుల మాటున రంగాలని
మాటల మాటున మరణాలని
సాయం మాటున స్వార్ధాలని
సఫా చేసేస్తా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

అరెయ్ వెన్న కృష్ణ
దోచేయ్ దోచేయ్
చిన్ని కృష్ణా
దోచేయ్ దోచేయ్
ముద్దు కృష్ణా
దోచేయ్ దోచేయ్
బొద్దు కృష్ణ
దోచేయ్ దోచేయ్
క్యూట్ కృష్ణ
దోచేయ్ దోచేయ్
ఫ్లూట్-యూ కృష్ణ
దోచేయ్ దోచేయ్
నాటి కృష్ణ
దోచేయ్ దోచేయ్
బ్యూటీ కృష్ణ
దోచేయ్ దోచేయ్
గోకుల కృష్ణ
దోచేయ్ దోచేయ్
గోపాల కృష్ణ
దోచేయ్ దోచేయ్



స్వింగ్ జర పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: నేహా బాసిన్, దేవి శ్రీ ప్రసాద్

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)

నేనో గ్లామర్ బండి
వచ్చేసా స్వర్గం నుండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జార స్విన్గు జార
స్వింగ్ జర స్వింగ్

అందం తిన్నానండి
అందుకే ఇట్టా ఉన్నానండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర
స్వింగ్ జర స్వింగ్
నా మత్తుకళ్ల నుంచి
ఓ కొత్త కళ్ళు తీసి
ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండి
నా భెల్లీ డాన్స్ చూసి
నోరారా గుటకాలేసి
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)

హుక్కా బార్ ఏ నేను
పక్కాగా కిక్ ఇస్తాను
మబ్బులోకెక్కిస్తాను
చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
కంట్రీ బీర్ ఏ నేను
లోకాలు చూపిస్తాను
లెక్కలు మరిపిస్తాను
భూమ్మీద బాలన్స్ ఏ తప్పిస్తాను
ఏ మస్తు మజా పెంచే
ఓ మత్తు మందు నేను
నీ ఎనర్జీ కి 4G స్పీడ్ ఇస్తాను
అందుకేగా నేను మీకోసమోచ్ఛను
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి

స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్

స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్

బ్యూటీ బాటిల్ నేను
నిండా నషా నింపాను
ఇష్టాంగా వచ్చేసాను
నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను

నే కోరే నషా వేరు
దూసుకెళ్ళాలి నాలో జోరు
మోత మోగేట్టుగా నా పే ..రూ
అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను

హే సిగ్గు సింగారాల
ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
హే పుట్టుకతో నేను
ఓ నిప్పుతో పుట్టాను
అడిగాడో సూర్యుడికి ఆహ్ ..అప్పిస్తాను
అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను
ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)



అందమైన లోకం పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విశ్వప్రసాద్ ఎం.గంగి 

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఎగురుతుతున్న పక్షులే మూడు

చిన్న వాటి కంట
నీరు రానీకుండా
తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దొడు
కావలుండే గుండె వాడు
సేవ చేసే చేయి వాడు

అన్న అంటేనే వాడు
తననే మరిచాం ఆనాడు

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఎగురుతుతున్న పక్షులే మూడు
ఒక్క చోటనే ఉన్న
పక్క పక్కనే ఉన్న
మన మధ్య ఎంతో దూరం ఆనాడు
దూరమంతా
పారిపోగా
ప్రేమ పంచె
రోజు రాగ

జాలే లేని సంతోషం
నిన్నే చేసే సుదూరం
ఎంతో దూరం
చాల దూరం


Palli Balakrishna Tuesday, September 5, 2017
Oohalu Gusagusalade (2014)

చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: కళ్యాణి కోడూరి, సునీత
నటీనటులు: నగచౌర్యా, శ్రీనివాస్ అవసరాల, రాశీ ఖన్నా
దర్శకత్వం: శ్రీనివాస్ అవసరాల
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 20.06.2014

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందడ్లు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే  ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని గాలి లాగ మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా...

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే  ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే  ఈ తొందర్లు ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు
మది నిను చేరుతుందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతుంది హృదయము రాసుకున్న లేఖా...

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటూంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమౌతున్నా గానీ ఏమైనా ఐపోనీ ఏం ఫరవాలేదన్నావా

అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైన గుండె గనుక
అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా....
మ్... మ్... మ్... మ్... మ్... మ్...


*********   *********  **********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

ఊ... ఊ... ఊ...

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతో చూస్తే సరి నిన్ను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని
ఊరంత వచ్చి నిన్నే నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా

ఊ... ఊ... ఊ...

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది

ఊ... ఊ... ఊ...
ఊ... ఊ... ఊ...



**********   **********    *********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కారుణ్య

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది
వందకంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది

యాహు హూ... యాహు హూ... (2)

కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని
ఒప్పేసుకుంట అంతేగాని
తన వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చి బాగుందని మరింత పెంచుకొని
ఇలాగే వుండిపోతానంటే తప్పైన ఒప్పైన గాని

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్లతోటి చూస్తే సరి తనను మించి మరొకరు లేరని
అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని ఊరంత వచ్చి తనని
నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా
నువు నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకెనాడు అనలేకపోతున్నా కదా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

యాహు హూ... యాహు హూ... (3)


*********   *********  **********


చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)
సంగీతం: కళ్యాణి కోడురి
సాహిత్యం: అనంత్ శ్రీరాం
గానం: దీపు, శ్రావణి

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఓ సమస్యని అనేంత సీనున్నదా దీనికి
ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి
అలా అలా నువ్వెంత తాకిన పరాకులో మరేమీ చేసినా
సరేనని సరాసరి సరెండరవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఈ హుషారులో రివర్స్ గేరేసినా ముందుకే
ఈ మాజాలలో అదర్స్ చీ కొట్టినా లైట్ లే
ఇదే ఇదే రొమాన్స్ పద్దతి ఇవాలిలా గ్రహించ మన్నది
వయస్సులో లభించిన వరాన్ని వేస్టవ్వనీకండి కవ్వించే ఇబ్బంది

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా

ఏమిటీ హడావిడి యెదల్లోనా
ఎందుకీ హరీబరి నరాల్లోనా
లోపలి తుఫానిలా షురూ ఐనా
చప్పుడే ఉండదే పైపైనా


Palli Balakrishna Monday, August 7, 2017
Hyper (2016)



చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
నటీనటులు: రామ్ పోతినేని, రాశీ ఖన్నా
దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
నిర్మాతలు: రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనిల్ సుంకర
విడుదల తేది: 30.09.2016



Songs List:



కం బాక్ పాట సాహిత్యం

 
చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనుదీప్, యాజిన్ నజీర్

టిప్పు టాపూ ఫిగరే హార్ట్ బీట్ అదిరే 
సెకనుకీ నూటేనబై రేటూ 
టప్పు టప్పు మంటూ బంతి లాగా ఎగిరే 
గంతులేస్తూ పల్సు రేటు 
ఫస్ట్ క్రష్ అంటూ ఫిక్స్ అయ్యినానే 
బాక్ లుక్ నుంచే నువ్వు సో గ్రేటూ 
ఫ్రెంట్ లుక్కు చూసే లక్కూ ఎపుడంటూ 
అడుగుంతుందీ ఐ సైటూ 
ఓ వాట్సప్ నుంచి ఫేస్ బూక్కు దాకా 
ఎకడెక్కడని నిను వెతకాలో 
నా బుజ్జి కొండా నా స్వీట్ ఫండా 
బెట్టు చేయకుండా కంబాక్ 

ఈ టైము లో నువ్వు కాలేజీలో క్లాసులే వింటున్నావా 

లేక ఫ్రెండ్స్ తో బంకే కొట్టీ ఐనాక్స్ కె వెల్తున్నావా 
లేకపోతే నువ్వు ట్రెండ్ పక్కనెట్టీ ట్రెడిషన్ పాటించే టైపా 
కొంపదీసీ నువ్వు సిగ్గూ సైడ్ కెట్టీ పబ్బులకే తిరిగే టైపా 

మనమిలా వన్ బై టూ కాఫీ ఎప్పుడే మరీ తాగేదీ 
మనకిలా ఓ లవ్లీ సెల్ఫీ ఎప్పుడే మరీ దొరికేదీ 
ఎపుడెపుడే మన ఇద్దరీ పేర్లూ వెడ్డింగ్ కార్డ్ లో మెరిసేదీ 
ఎపుడెపుడే మన జంటనూ చూసీ డాడి హ్యపీ అయ్యేదీ 
టిప్పు టాపూ ఫిగరే హార్ట్ అదిరే సెకనుకీ నూటేనబై రేటూ 
టప్పు టప్పు మంటూ బంతీ లాగా ఎగిరే 
గంతులేస్తూ పల్స్ రేటూ ఓ వాట్సప్ నుంచీ ఫేస్ బుక్కు దాక 
ఎకడెక్కడనీ నిను వెతకాలే నా బుజ్జి కొండా నా స్వీట్ ఫండా 
బెట్టు చేయకుండా కం బాక్ 






ఒంపులు ధనియ పాట సాహిత్యం

 
చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ, స్మిత, లిప్సిక

ఒంపులు ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ 
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ 

ఒంపులు ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ
అందుకే కదా ఫిదా ఐపోయా ఐపోయా
ఒక్కసారిలా ఇలా  నీ లవ్లో పడిపోయా 
నీ నిగనిగలాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య 

పంప రంపం పంప రంపం పంప రం చికిబం (4)

ఒంపులు ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ

హే నువ్వే జాన్ జిగిరి దోస్త్ నువ్వే నా బందో బస్తూ 
ముస్తాబై వచ్చేసా మోమాటం మినహాఇస్తూ 
హే అదేదొ అంజనమేస్తూ అందంతో హచల్ చేస్తూ 
నువ్వొస్తే అవొస్తే ఇన్నిన్ని మెలికలు చూస్తూ 
కునుకే పడకుండా చేతికి కుదురే ఉంటుందా 
ఎదొటీ చెయ్యకుండా ఊరుకుంటే నా వయసు నను తిట్టైదా 

పంప రంపం పంప రంపం పంప రం చికిబం (4)

హే నేనేమో బుగ్గలూ ఇస్తూ నువ్వేమో ముద్దులూ వేస్తూ 
ఇలాగే తరిద్దాం సిగ్గుల్నీ అటకాఇస్తూ 
ఏ కుమారి మస్త్ రా మస్త్ కులాస అబిగ్నమస్తూ 
తమాషా పదుల్లో జవాని జబ్బరదస్తూ 
మనసే ఇష్కింద ఆపై  కౌగిలి కిష్కింద
సరదాలో  నువ్వు ముందా నేను ముందా 
తేల్చూదాం పందెం ఉందా 

ఒంపులు ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ
పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ 

అందుకే కదా ఫిదా ఐపోయా ఐపోయా
ఒక్కసారిలా ఇలా  నీ లవ్లో పడిపోయా 
నీ నిగనిగలాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య 

పంప రంపం పంప రంపం పంప రం చికిబం (2)




బేబీ డాల్ పాట సాహిత్యం

 
చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి , సాహితి చాగంటి

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 
యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 
జస్టిన్ బీబర్ సాంగ్ లాంటీ ట్రెండ్ లుక్సూ తో 
మిలియన్ డాలర్ మిస్టరీలా రోస్ లిప్స్ తో 
జస్ట్ మినిట్ కూడ నన్ను చూపు తిప్పనీయ వేంటీ 
బేబీ డాల్ బేబీ డాల్ స్కిన్ను టైటు జీన్స్ లోనీ 
వైటు హర్సులా మూన్ లైటు ఫన్ నైటు 
సింగిల్ మాల్టులా 
టాప్ టూ బాటం ఎక్కేశావే బేబీ డాల్ బేబీ డాల్ 
నాంచాక్ నడుముతో నిన్నటాక్ చేయనా 
సూటిగా హనీ హనీ రెడ్దు హట్ సొగసులా 
ప్రైవేట్ జట్టులా నీ గుండే పై నిండుగా లాండవ్వనా

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 

బ్యుటి బుక్కుఏ కవర్ పేజ్ లా 
ఓహ్ మై గాడ్ నీ అందం ఆసం 
క్ర్లియో పాట్ర్ కే కలర్ ప్రింటులా 
నిండిపోతువే నా లోకం మొత్తం 
హాట్ హాట్ చాకొలెట్టు 
ఫ్రూట్ నట్ ఇస్ క్రీమూ 
కోంబో పాక్ జోడి నువ్వు నేనేలే 
సుపర్ క్యుట్ జూలియట్టు 
ఫేవరెట్టు సోలు మెట్టు 
మనమే నంటు లవ్ నగారా మోగెలే 
యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ

జిల్ జిగేలనే కల్ట్ ఫిగరువే 
ఓ చెలి నువ్వే అన్ కట్ డైమండ్ 
యమ్మియమ్మిగా కమ్మగుంటవే 
చేతికందవే రోస్టేడ్ ఆల్మండ్ 
ఆర్కిటిక్ అంచులోనీ అచ్చమైన 
మంచు లాగ ఫ్రీజ్ అయ్యనూ 
నీ ఇంటీ మేటు టచ్ లో 
పసిఫిక్ కడలి పైనా 
పార గ్లాడింగ్ చేసినట్టు 
ఎత్తు లో తేలాను నీ రొమాన్స్ లో 
యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ

జస్టీన్ బీబర్ లాంటి సగ్ లాంటి ట్రేండి లుక్స్ తో 
మిలియన్ డాలర్ మిస్టరీలా రోస్ లిప్స్ తో 
జస్ట్ మినిట్ కూడ నన్ను 
చూపు తిప్పనీయవేంటి 
బేబీ డాల్ బేబి డాల్ 
నాంచాక్ నడుముతో 
నిన్నటాక్ చేయనా సూటిగా హాని హాని 
రెడ్ హాట్ సొగసులా ప్రైవేట్ జట్టులా 
నీ గుండే పై నిండుగా లాండవ్వనా 
యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ 





నాలో నేనేనా పాట సాహిత్యం

 
చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: శ్రీమణి
గానం: సమీరా భరద్వాజ్

హు హు హు హు హు హు హు హు నాలో నేనేనా 
హు హు హు హు హు హు హు హు నాతో నేనున్నానా 
హు హు హు హు హు హు హు హు ఔనా నిజమేనా 
హు హు హు హు హు హు హు హు నన్నే మరిచానా 
రోజురోజునే చూస్తూ ఉన్నా లోకమిదీ ఇదికాదే ఇదికాదే 
ఇదివరకే గాలీ లోనా ఇంత కొత్త సంగీతం వినలేదే హే హే 
ఇన్నినాల్లు కన్ను చూడలేని అందమంతా చూస్తుటే బావుందే 
తొలిసారిగా మనసను పెదవితో నా మౌనం పలికిందే 
హే హే 

హు హు హు హు హు హు హు హు నువ్వే ఎవరంటే 
హు హు హు హు హు హు హు హు చెప్పే పదముందా 

హు హు హు హు హు హు హు హు నువ్వే లేకుంటే 
హు హు హు హు హు హు హు హు నాకే కథ ఉందా 
బందువల్లే కొత్త అందమైనా బందమల్లి కలిషావే కలిషావే 
గాజుబొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు ప్రాణమేదో కోషావే హే హే 
తెల్లకాగితంలా ఉన్న నన్ను రంగులేసి గాలిపటమే చేశావే 
పాతపాతగున్న గీతలన్ని మెరుగుద్దిద్ది కొత్తరాతే రాశావే హే హే




హైపరే  హైపరే  పాట సాహిత్యం

 
చిత్రం: హైపర్ (2016)
సంగీతం: జీబ్రాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: ధనుంజయ, గీతామధురి, లిప్సిక

తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే 
గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే 
ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే 
గెలికితే నరనరమునా హైపరే హైపరే 
బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే 
లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే 

బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే
లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే
రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి 
అరె నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడీ 
హే రాయే రాయే రాశి నేనొస్తా వడ్డీ ఏసి 
అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ 
రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను క్రాకరే 
అంటుకుంటే తస్సదియ్యా మహా డేంజరే 
వాలుగరూ సిన్నదాన హర్ట్ కుందీ మ్యాటరే 
సామిరంగా ఆగదింక స్పీడు మీటరే 

మిల్క్ షేక్ లాంటి ఒంటి రంగు బాగుందే 
నమకు చమకు నడుము లోనా బెడ్డు లాగిందే
చురుకూ చురుకూ డేగ లాంటి కన్ను పడిందే 

నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెండిదే 
నచ్చవే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా 
నిను చూసినాక ఆగదు ఉక్కా 
సెగలూ హైపరో పొగలూ హైపరో 
ఇద్దరి మధ్యలో దిగులూ హైపరో 
ఎగుడూ హైపరో దిగుడూ హైపరో 
ఎగిరే పైటలో ఫిగరే హైపరో
బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే 
లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే 
రారా రారా రౌడి రేపేశావ్ నాలో వేడీ 
అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి 
హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డి ఏసి 
అందికాడికి తోచీ ఫుల్ పెడతా పేచీ 

హే అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నవే 
ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే 
నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే 
పండగ కొచ్చినా అల్లుడులాగ ఎగురుతున్నవే 
నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ 
జాగారమేగ ఇస్తే జాగ 
నువ్వే చాకురో నువ్వే తోపురో 
నువ్వే లాకురో నీకే ఆఫరో 
పడుచూ పాపరో పులస చేపరో 
మొదటి ఆటకే హిట్టు టాకురో

తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే

గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే
ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే
గెలికితే నరనరమునా హైపరే హైపరే 

Palli Balakrishna Saturday, July 29, 2017

Most Recent

Default