Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Thika Maka Thanda (2023)



చిత్రం: తికమక తాండ (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి  
నటీనటులు: రామకృష్ణ, హరి కృష్ణ , అన్నే జిబి, రేఖ నిరోష 
దర్శకత్వం: VKV
నిర్మాత: T. శ్రీనివాస రావు 
విడుదల తేది: 2023



Songs List:



ఎవరు తాను పాట సాహిత్యం

 
చిత్రం: తికమక తాండ (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి  
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: జునైద్ కుమార్ 

మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

అలికిడి వింటే
అలజడి నాలో ఇలా
కలిగెను ఏంటో తన వల్లేనా
పొరపడినానో అటుగా తను వెళ్లెనా

అనుకోగానే ఎదురే రాగా
తన అడుగుపడిన చోట
పుడమి పూసేనే
అది చూడగానే
మనసు ఉరకలేసేనే

అలవాటుగానే కనులు
తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి
ఆపేసే నన్నే

మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

ఏ, గజిబిజిగ తిరుగుతూ
నా చెలి వెంటే పడుతు
తికమకలో తేలే తొందరా
తన జాడే వెతుకుతు
నాకే నే దొరుకుతు
మరి మరి ఆచోటే ఆగనా

ప్రశ్నై కదిలా లేదే బదులు
నాతో నేనే ఎపుడూ
తనలా లేరే ఎవరు అసలు
ఒకరే ఒకరు అరుదు

తన అడుగుపడిన చోట
పుడమి పూసేనే
అది చూడగానే
మనసు ఉరకలేసేనే
అలవాటుగానే కనులు
తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి
ఆపేసే నన్నే

మ్ ఎవరు తాను
చిటికెలో నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే

ఓ కనులకు తానందదే
కలలకు తానందమే
ఎదురుగ వచ్చేది ఎన్నడో
పసిరికలో పసితనం
పసిడిదిలే తన గుణం
ఎపుడు ఉంటుంది నవ్వుతూ

మరుపే రావే మెరుపే నీవే
వినవా మదిలో మాటే
సమయం కుదిరే మలుపే తిరిగే
పయనం మొదలే ఇపుడే

తన అడుగు పడిన చోట పుడమి పూసెనే
అది చూడగానే మనసు ఉరకలేసెనే
అలవాటుగానే కనులు తనని వెతికెనే
మొహమాటమేదో ముందు కొచ్చి ఆపేసే నన్నే

మ్ ఎవరు తాను చిటికెలో
నన్ను లాగెనే
మ్ ఎవరు తాను
అద్దమై నన్ను చూపెనే



ఓహో పుత్తడి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: తికమక తాండ (2023)
సంగీతం: సురేష్ బొబ్బిలి  
సాహిత్యం: పూర్ణ చారి 
గానం: సిద్ శ్రీరామ్ 

ఓహో పుత్తడి బొమ్మ 

Palli Balakrishna Friday, May 26, 2023
Atharva (2023)



చిత్రం: అధర్వ (2023)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల  
నటీనటులు: కార్తిక్ రాజు, సిమ్రాన్ చౌదరి 
దర్శకత్వం: మహేష్ రెడ్డి 
నిర్మాత: సుభాష్ నూతలపాటి 
విడుదల తేది: 2023



Songs List:



రింగా రింగా రోజే పాట సాహిత్యం

 
చిత్రం: అధర్వ (2023)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల 
సాహిత్యం: కిట్టు విస్సప్రగడ
గానం: జావేద్ ఆలి 

దేసి సిండ్రెల్లా లుక్కిస్తే మల్లా
మైండంతా గోల చంపేసావే
A క్లాసు పిల్లా ఓరుగల్లు ఖిల్లా
గుండెల్లో ఇల్లా దంచేసావే

నా చుట్టు ఏమున్నా
నిన్నే చూస్తున్నా
విధ్వంసంలో పూలవాన
నువ్వే కదా

రింగా రింగా రోజే... పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే… రింగా రింగా రోజే
రింగా రింగా రోజే… పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే… రింగా రింగా రోజే

నాలో గొడవేదో మొదలయ్యే నీ వల్లే
పని లేని పనిలోన పడినా
రక్తం మరిగేలా ఏ హత్యో జరిగేలా
నీ అందం నను చంపే తెలుసా

నిదురే రాదే పొరపాటుగా
కలలే పోయే అలవాటుగా
మాటే రాదే నీ ముందరా

నా చుట్టు ఏమున్నా
నిన్నే చూస్తున్నా
విధ్వంసంలో పూలవాన
నువ్వే కదా

రింగా రింగా రోజే... పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే... రింగా రింగా రోజే
రింగా రింగా రోజే... పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే... రింగా రింగా రోజే

దేసి సిండ్రెల్లా నా గుండె జిల్లా
నీ సొంత ఇల్లా సెటిలయ్యావే
కళ్లల్లో ఇల్లా ఫ్లాషేసి మల్లా
ఫోటో తీసేలా నవ్వేసావే

రింగా రింగా రోజే... పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే... రింగా రింగా రోజే
రింగా రింగా రోజే... పిల్ల నిన్నే చూసే
చిట్టి గుండె కూసే... రింగా రింగా రోజే

Palli Balakrishna
Ponniyin Selvan: II (2023)



చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నటీనటులు: విక్రమ, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా లక్ష్మి , శోభిత ధూళిపాల 
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ 
విడుదల తేది: 28.04.2023



Songs List:



ఆగనందే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: శక్తిశ్రీ గోపాలన్ 

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

నది నడకలే పదగతి సరిచేసే
గిరి పెదవులు పెదవుల తడి పీల్చే
గొడుగులవలె తరువులు నిలిచే
కుసుమపు కొన చినుకులు విడిచే

నను కని పెంచే సొగసుల తలమా
నను నడిపించే అంతఃపురమా
కొలనుల నగవే పలుకనుకొనుమా
నవనవలాడే నువు నా గరిమా

నిను తలవగనే ఎద ఎగిరినదే
నిను తడమగనే మది మురిసినదే
నిన్నానుకునే పవలించెదనే మైమరచెదనే

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే



వీరా రాజా వీర పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, బెన్నీ దయాల్, నబీలమాన్ 

కళ్ళార చూద్దాం
చోళ ఖడ్గ సంచారం సంహారం
ఓ సొగసరి పూవా
పూమాలే శుభమని వేయవే

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా శిఖరం స్పృశించైర

మార రాకుమారా చోరా చిత్త చోర
రా రా ఏలుకోర
కరవాల మీవేళ కనులెర్రజెయ్యంగ
భుజబలము ఈవేళ భూతలము మోయంగ
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర శూర ధీర శూరా

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

సుడిగాడ్పులా అడుగేయరా
సర సర సర సర
శరమే తనువే తాకగా
చర చర చర చర
చెలరేగాలి వేగంగా

మగసిరి కండచూసి
కడలికి చెమట పోయు
పదునగు కత్తి చూసి
నింగికి నిదుర రాదు

రగతము పొంగి పారీ
నదులకు రంగు మారు
తెగిపడు తలలు అన్ని
అలలకు అన్నమౌను

పులివలె దూకుతుంటే
జగములు జింకలౌను
నిన్నిక పొగడమంటే
భాషకు స్వాస ఆగు

విధిగా తెగించైర
విధినే వదించైర
విలయం దరించైర
విజయం వరించైర

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార… ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా… శిఖరం స్పృశించైర

మార రాకుమారా… చోరా చిత్త చోర
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర వీర రాజా వీర
శూర ధీర శూరా వీరా




శివోహం పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఆది శంకర 
గానం: సత్య ప్రకాష్, Dr.నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, శన్బాగరాజ్, TS అయ్యప్పన్

శివోహం




మిన్నంచుల వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరణ్

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే

ఏ దరి వెతికెదనే నెచ్చెలీ
నిన్నెట కాంచెదనే
నిత్య నిశీధి ఇది
చీకటి సూన్యమే మిగిలినదే

చిత్ర నయనమది
చక్కని చక్కెర పలుకులేవీ
సుందరహాసమేది
కావేరి నురగల పరుగులేవీ

మంచుమబ్బులవలే ప్రేమగా
తడిమిన చేతులెవీ
గోరు వెచ్చ కాంతుల వేకువై
వెలిగిన చూపులేవీ

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

ఆరని జ్వలనమయే
హృదయం తీరని నరకమయే
ప్రాణం శిధిలమయే సమయం
చలనము లేనిదయే

నిప్పుల ఉప్పెనలో
నన్నిలా ముంచితివెందులకే
నేరము చెయ్యక
ఏ శిక్షలో వగచితి నీ కొరకే

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే




ప్రార్థనలు వినుమా పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవతుల 

ప్రార్థనలు వినుమా
మా ఊపిరి వేణువు గీతికలో
మనోరథాన్ని కనుమా

నీలిమేఘం నీ దేహం అయితే
మెరుపుల జ్యోతులు
మనసు ముంగిళ్లలో
ప్రసిరించాలి ప్రసిరించాలి

నీ కరుణే అనవరతం
మధురామృత దారై
మాపై కురవాలి

పాడు తలపులు
తలపడు క్షణమున
పిడుగులా రావాలి
కడతేర్చి పోవాలి



అలుపే లేదే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవాతుల, హరిప్రియ, దీప్తి, సురేష్ 

అలుపే లేదే 

Palli Balakrishna
Meter (2023)



చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి 
దర్శకత్వం: రమేష్ కాడురి 
నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు 
విడుదల తేది: 07.04.2023



Songs List:



ఓ చమకు చమకు పోరి పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: అరుణ్ కౌండిన్య, ML గాయత్రీ 

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

హే చందమామ వచ్చే వేళ
టెర్రస్ ఎక్కేస్తా చూడు
చెయ్యే ఊపి సిగ్నల్ ఇస్తా
చూడకపోతే నీ బ్యాడు

మేడపై చూసాకే గోడనే దూకానే
చుక్కలే పోగేసి దిష్టే తీసానే

నీకు నా పిచ్చుంది నాకదే నచ్చింది
దోచిపెట్టుకో ఇంకా దాచేదేముంది

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

ప్రతి సెంటర్లో ఉండే లవ్ జంటల్లో
మనమే టాపిక్ కావాలే
ట్రెండీ గాసిప్ అవ్వాలే

లవ్ జుంక్షన్లో చేసే, ప్రతి ఫంక్షన్లో
మనం ముచ్చటుండాలె
అది ముద్దుగుండాలె

ప్రతి కన్ను కుట్టినట్టు
మన జంట సూపర్ హిట్టు
అయ్యేటట్టు పద పడదాం పట్టు

మన లవ్ దాటుకుంటూ
వేద్దాము పెళ్లి టెంటు
నీదే లేటు, ఫిక్స్ చేసేయ్ డేటు

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి




ఓ బేబీ జారిపోమాకే పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: ధనుంజయ్ 

హే అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

హే హే, పట్టు పట్టి పోతున్న
జట్టు కట్టనంటున్న
నిన్ను పట్టి ఇస్తాలే నాలో ప్రేమకే

మగవారంటే పగబడతావే
తెగ తిడుతూ అలా కారాలు నూరి
దూరాలు పోతే కుదిరేదెట్టా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనీకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే

అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

నువ్వే చుక్కవి అయితే
ఆ జాబిలి పక్కకు పోదా
నిన్నే వెన్నెల చూస్తే
తన కన్నులు చిన్నవి కావా

అందం ఎంతున్నా
బంధమంటూ ఒకటుంటే
గడిచే ప్రతి నిమిషం
తోడు రాదా నీ వెంటే

ఒకటే లైఫంట
నకరాలొద్దంటా చెప్పిందినమంటా
నీకంట నీరు తుడిచేటి వేలై
నే పడి ఉంటా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనాకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే




Meter Title Song పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి కార్తీక్ 

అడ్డే లేదు అడ్డా లేదు
పడి లేచాడో ఉప్పెనల ఒడ్డే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

హద్దే లేదు, పద్దే లేదు
అనుకున్నాడో ఏదైనా రద్దే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

అలా తరిమి తరిమి
పరుగు పెడితే తప్పదు లెక్క
అదో ఉరుము ఉరిమి
మెరుపులాగా ఉంటది పక్కా
చెడే చూసాడో ఇరగేసి రాస్తాడు
తిరగేసి పనిలో దిగితే గురిచూసి

దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే
దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే

అదరగొట్టు బెదరగొట్టు చెదరగొట్టు
కొట్టేయ్ కొట్టేయ్ కొట్టు కొట్టు
గురినిపెట్టు గురుతుపట్టు
మడతపెట్టి కొట్టు కొట్టు

బాకీ పడ్డ ఖాకి డ్రెస్సు
ఓకే అంటూ ఎక్కేసాడు
దానెనక ఉన్న పవరు తెలిసి
దారిలోకి వచ్చేసాడు

కథే మలుపు తిరిగి
మనసు చెదిరి పోయినచోటే
ఎదే తలుపు తెరిచి
గెలుపు వెతికి ఆడెను వేటే

అరె ఎదురొస్తే ఎవడైనా
ఎదురించే దమ్మున్న
తెగువ పొగరు ఉన్నోడు

దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడేస్తాడు చెడుగుడే
దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడెస్తాడు చెడుగుడే

Palli Balakrishna
Anni Manchi Sakunamule (2023)



చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ 
దర్శకత్వం: నందిని రెడ్డి 
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 18.05.2023



Songs List:



అన్నీ మంచి శకునములే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రహ్మన్
గానం: కార్తిక్ 

నిజమేది ఋజువేది
విధి ఆటే గెలిచేది
మనకేది మనదేది తేల్చేదెవరో

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
అవునని నమ్మితే
ఎదలోని దిగులే ఆశల వెలుగై రాదా
అన్నీ మంచి శకునములే
శుభమని సాగితే

పడి పడి నడిచే
బుడి బుడి అడుగై
నిత్యం సాగే ప్రయాణం
ఎవరికి ఎవరో
ఒకరికి ఒకరై
అల్లేసుకుంటున్న బంధం

కలవడము సహజం
విడవడము సహజం
నడుమన నాటకమే
జరుగుట తథ్యం

గెలవడము సహజం
అపజయము సహజం
కదులుతు పోవడమే కదా
మన ధర్మం

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా

కొమ్మను విడిచి కదిలిన పూలే
చెంతే చేరే విచిత్రం
తరగని మమతే తలపై నిమిరి
అమ్మై తరించే అదృష్టం

పొందడము సహజం
పోవడము సహజం
మనదైతే మాత్రం
వదలదు సత్యం

మొదలవడం సహజం
ముగియడమూ సహజం
నిలవని ఈ సమయం
తెలిపిన సూత్రం

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా



సీతా కళ్యాణ వైభోగమే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: చైత్ర అంబలపూడి, శ్రీకృష్ణ 

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
పచ్చనైన చూపులన్ని
పందిరేసే వేళా
స్వచ్ఛమైనా స్వచ్ఛమైనా నవ్వులన్ని
పీటలేసె వేళా

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ

పరిణయమగు వేళా పదుగురిలో
సందడులే శుభమంత్రమల్లె మ్రోగగా

మా సౌక్యమంత
మా భాగ్యమంత
మా సంపదంత
మా మురిపెమంత
మా వేడుకంత
మా వెలుతురంత
మా ప్రేమలంత
మా ప్రాణమంత

మా గడపను వదలగ
మీ గుడి చేరగ
తలలు వంచి తరలి వెళ్ళు తరుణంలో
తడి ముసిరెను కన్నుల్లో
తడి ముసిరెను కన్నుల్లో
తడి ముసిరెను కన్నుల్లో



మెరిసే మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రహ్మాన్
గానం: నకుల్ అభాయంకర్, రమ్యా భట్ అభాయంకర్ 

గల గల ఏరులా ప్రవహించాలిలా
అడుగడుగో అలలా తుల్లి పడేలా

ఈ తిరుగుడు ఏలా ఈ తికమకలేలా
నువ్వెటు వెళ్ళాలో నీకే తెలియాల

ఇదిగో దాటేస్తే వెన్నక్కి పోలేం
ఓ హో హో, ఓ హో హో

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓ ఓ ఓ… పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం, లేలే లే లే

తెలియదు కదా
మున్ముందు కనులే చెదిరే
చిత్రాలెన్నున్నాయో
ఏం చూపిస్తాయో

మనసుతో చూసెయ్
కలా నిజం ఒకే జగం కధ
పెదవుల పై మెరుపే
వెలుగై నడిపే

కబురులు నో నో
ఈ కవితలు నో నో
మైమరుపులు నో నో… నో నో నో

పరుగులు నో నో
ఈ మెలికలు నో నో
ఈ తగువులు నో నో ఓ ఓ
అసలెందుకీ గొడవంతా

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓ ఓ ఓ పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం, లేలే లే లే





చెయ్యి చెయ్యి కలిపేద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శ్రీకృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబలపూడి

చెయ్యి చెయ్యి కలిపేద్దాం
చేతనైంది చేసేద్దాం
నువ్వు నేను ఒకటవుదాం
నవ్వుకుంటు పని చేద్దాం

ఊరగాయ ఊరేద్ధాం
కూరగాయ తరిగేద్ధాం
విస్తరిని పరిచేద్ధాం
విస్తరించి కలిసుందాం

మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం

గుమ్మడి పులుసుతో
ఓఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
గుమ్మడి పులుసుతో గుండెలు మురవని
కమ్మని పెరుగుతో ప్రేమలు పెరగని
గారెల వడలతో దారులు కలవని
గరిజల తీపితో వరసైపోనీ

ఓరుగల్లు నుండి బియ్యం తెచ్చి
పాలకొల్లు నుండి కూర తెచ్చి
అరె, కడప నుండి నాటుకారం తెచ్చి
శాకహారం సిద్దం

బెల్లంపల్లి నుండి బొగ్గు తెచ్చి, ఓహో
తాడేపల్లి నుండి పాలు తెచ్చి, ఓహో
అరె, అనకాపల్లి నుండి పంచదార తెచ్చి
అందరికి పంచాలి పాయసం

ఏలో ఏలో ఏలో ఈవేళా
మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

హో, చుట్టుకున్న చుట్టరికం
ఘాటు తీపి సమ్మిలితం
సర్ధుకుంటె ప్రతి క్షణం
సంతోషాల విందు భోజనం

ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం




ఏమిటో నేనేటో పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చైత్ర అంబలపూడి 

ఏమిటో నేనేటో
ఎందుకో ఇలా
నీతో సాగాలా
నాతో ఆగాలా

ఎదో స్వరం వింటూ మది
ఇదే నిజం అంటున్నది
మళ్ళీ తనే అదేం కాదన్నదీ

వెలుగు పోల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది
మౌన వేధనా

ఒదగలేను నీలోన
కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా
నరకయాతనా

ఏకమై చేరనీ రేఖలే మనం
సరైనదా నా నిర్ణయం
ఏమో మరీ ఏదో భయం
నాలో నాకే ఇదేమయోమయం

వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది
మౌన వేధనా

ఒదగలేను నీలోన
కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా
నరకయాతనా



హిల్లోరి పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్
గానం: రితేష్ జి.రావు 

హిల్లోరి 

Palli Balakrishna
Song: Jaale



పాట: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
సాహిత్యం: Late శ్రీ రామస్వామి కె.
గానం: మంగ్లీ 
కొరియోగ్రాఫర్: జితు మాస్టర్
డైరెక్టర్: దాము రెడ్డి 
నిర్మాత: బాలు నాయక్ 
విడుదల తేది: 09.09.2022



వద్దన్న గుండెల్లో సేరి పాట సాహిత్యం

 
పాట: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో 
సాహిత్యం: Late శ్రీ రామస్వామి కె.
గానం: మంగ్లీ 

జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా (2)

కోరస్: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

జాలవోయ్ జల్దారు వొయ్యి
జాజికాయల పోతవొయ్యి

కోరస్: జాలవోయ్ జల్దారు వొయ్యి
జాజికాయల పోతవొయ్యి

జాలవోయ్ జల్దారు వొయ్యి
జాజికాయల పోతవొయ్యి
సిగురు జబ్బల సందున
సిలకమూతి జాలవొయ్యి
గునుగు గుబ్బాల సందున
గురిగింజల జాలవొయ్యి

రైకమూడి కట్టుకోన రత్నాల జాలవొయ్యి
ఈపునాయి జెమ్మరెయ్యి పక్కనా మాణిక్యమెయ్యి
తాపనా త్రిశూలమెయ్యి నిన్నువొయ్యి నన్నువొయ్యి
నిలువుటద్దాలువొయ్యి అద్దాముల జూసుకుంటే
ఇద్దరల్లే కలిసేట్టు జాలే జంగమయ్య

జాలే - జంగమయ్య
 జాలే - జంగమయ్య

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

కోరస్: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

ఆహ, జాల కూలి జాలకిత్తు
కుట్టు కూలి కుట్టుకిద్దు
కోరస్: జాల కూలి జాలకిత్తు
కుట్టు కూలి కుట్టుకిద్దు

అబ్బ, జాల కూలి జాలకిత్తు
కుట్టు కూలి కుట్టుకిద్దు

కోరస్: జాల కూలి జాలకిత్తు
కుట్టు కూలి కుట్టుకిద్దు

జాల కూలి జాలకిత్తు
కుట్టు కూలి కుట్టుకిద్దు
అమ్మ నాన్నలు కానకుండా
ఇష్టమొచ్చిన సోటుకొద్దు
బుద్ధిపుట్టినంతసేపు
ముద్దులిస్తా జంగమయ్య
జాలే జాలే జాలే జాలే

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

కోరస్: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

ఆహ, రైక మీద మనసు పెట్టి
రంగురంగుల జాలేవోయ్ రా

కోరస్: రైక మీద మనసు పెట్టి
రంగురంగుల జాలేవోయ్ రా
ఆ, రైక మీద మనసు పెట్టి
రంగురంగుల జాలేవోయ్ రా

రైక మీద మనసు పెట్టి
రంగురంగుల  జాలేవోయ్ రా
నన్ను తల్సుకోని నవ్వుకుంట జాలవోయ్ రా
ముద్దుల జంగమయ్య ముద్దబంతి పూలుపోయ్ రా

జాలే, జాలే - జంగమయ్య
జా - జంగమయ్య
జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

కోరస్: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా, ఏమయ్యో

కోరస్: జాలె పోసినవేమయ్య ఓ జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యా

అయ్యా అంచుకు అద్దాలు పొయ్యి
లంచమిస్తా మంచిగెయ్యి

కోరస్: అంచుకు అద్దాలు పొయ్యి
లంచమిస్తా మంచిగెయ్యి

అరె అంచుకు అద్దాలు పొయ్యి
లంచమిస్తా మంచిగెయ్యి
కోరస్: అంచుకు అద్దాలు పొయ్యి
లంచమిస్తా మంచిగెయ్యి

అంచుకు అద్దాలు పొయ్యి
లంచమిస్తా మంచిగెయ్యి
ఇవ్వకుంటే పట్టు చెయ్యి
ఇంట్లకు గుంజుకుపొయ్యి
మంచిగా నువు మందలియ్యి
ముద్దు ముచ్చట తీర్చెయ్యి

జాలే జంగమయ్య
జాలే.., అబ్బా జాలే
జాలె పోసినవేమయ్యో జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యో
జాలె పోసినవేమయ్యో జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యో

అయ్యా పచ్చ చీర పైటకొంగు
పట్టుకొని గుంజుకోరా
పచ్చ చీర పైటకొంగు
పట్టుకొని గుంజుకోరా
ఆ, పచ్చ చీర పైటకొంగు
పట్టుకొని గుంజుకోరా

పచ్చ చీర పైటకొంగు
పట్టుకొని గుంజుకోరా
సుక్కవోలే జూసుకోరా
అక్కువదీర్సుకొని
అందమైన జాలేవోయ్ రా

జాలే జంగమయ్య
జాలే, జంగమయ్య
జాలె పోసినవేమయ్యో జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యో
కోరస్: జాలె పోసినవేమయ్యో జంగమయ్య
రయికే కుట్టినవేమయ్యో

ఓ, అమ్మతోడు జంగమయ్య
అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య
అడిగినందుకు కోపమయ్యా

అర్రె, అమ్మతోడు జంగమయ్య
అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య
అడిగినందుకు కోపమయ్యా

అమ్మతోడు జంగమయ్య
అడిగినందుకు కోపమయ్యా
సోకైన సిన్నదాని సోపతే మంచిది నాది
పసుపుతాడు కట్టుకోని ఎల్లకాలం ఏలుకోరా
జాలే జాలే జాలే జాలే జాలే జాలే

జాలె పోసినవేమయ్య… ఓ జంగమయ్య
రైకే కుట్టినవేమయ్యా
జాలె పోసినవేమయ్య జంగమయ్య
రైకే కుట్టినవేమయ్యో

Palli Balakrishna Thursday, May 25, 2023
Song: Gangulu



పాట: గంగులు
నటీనటులు: విష్ణు ప్రియ మరియు మానస్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: తరుణ్ సైదుల్
గానం: స్వరాగ్ కీర్తన్ 
కొరియోగ్రఫి : స్రష్టివర్మ
నిర్మాత: జ్యోతి కున్నూరు
విడుదల తేది: 2023



గంగులు పాట సాహిత్యం

 
పాట: గంగులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: తరుణ్ సైదుల్
గానం: స్వరాగ్ కీర్తన్

ఓయ్ గంగులొహ్ .. ఏ గంగులు...
ఏ నల్లంచ్చు సిరేదాన
నకిలీసు పెట్టెదన
నవ్వు కుంటూ పోయెదాన
సూడే నా దిక్కు ఓ పిల్లా...హేయ్

ఏ కంటికి కటుక పెట్టి
ఒంటికి అత్తరు కొట్టి
లైట్ కొట్టే ముక్కు పుల్లను పెట్టి
రయ్యినా పోతున్నావ్ ఎందుల్లా

గంగు మీద పానం తోటి ఫీలైతాందిరో మనసు

మిట్ట మిట్ట సూడంగనే సాలైతాందిరా ..
ఫుల్ తాగే బాడీ పెగ్గు లో డిచ్ అవతాందిరో మామా
గంగులు సూపుల మాయల సూపై తాందిరా

హా .. ఆడ గట్టు కాడా అందరున్నా కాడ
అట్ట పోతా ఉంటె చూసింది కన్ను
సిగ్గు మొగ్గలెయ్య చెక్కిల్ల సూపు
అందరి ముందర రేపింది బొంగు

నీళ్ళు నింపుతున్న బోరింగు కాడ
యెడమ చేత పట్టి శెక్కింది కొంగు
తీగల తిప్పుడు పోకడ చూసి
కన్లు బైర్లుకమ్మే నేనేమి చేద్దు

సీరె కట్టు బొడ్డులు చూత్తే సిగైతందిరో గంగులు
ముత్యమోలే మాటలు ఇంటే ముద్దై తాందిరా హేయ్
గంటకొక్క తీరుగ గుండెలో మోతాందిరో గంగులు
ఎన్నడు సూడని అందం నాకైతాందిరా

ఆ.. పక్కల జాకెట్ జబ్బకంద నట్టు
గాజుల సప్పుడ్ల ఘల్ ఘల్ గంగు
లవ్వుల వను క్కుంటా జరమచ్ఛినట్టాయే
నిన్ను చూసే గుండె జల్ జల్ గంగు

కొయ్య బొమ్మ తీరు కొంటె సూపు జోరు
నాగు పాము జడ గంటల తీరు
వాలు వాలు కురులు తాకంగనే ఈడ
కాలు నిలవ కుండా తిన్నరు సూడు

జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు
జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో
ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు
దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో..

జోరు జోరు జోకరు చేస్టల తీరై తున్నదే గంగులు

జాలి సూపరాదే పిల్లో ఎందుకే టింగులు...హో
ముంచినావే పిల్లో నీ మాయల కొంగులో గంగులు

దేవదాసు చేయకే పిల్లో డేంజరు రెంజు లో...

Palli Balakrishna
Maavidaakulu (1998)



చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
నటీనటులు : జగపతి బాబు, రచన
దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, జె.భగవాన్ 
విడుదల తేది: 20.03.1998



Songs List:



ఈరేయి ఈ హాయి పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: మధుపాల
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

ఈరేయి ఈ హాయి 



అబ్బా ఎంత ఎరుపో పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సునీత

అబ్బా ఎంత ఎరుపో



నువు కిల కిల పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సాలూరి మునిష్, సాలూరి మాధవి 

నువు కిల కిల 



అమ్మంటే తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
ఇలలో వెలసిన ఆ బ్రహ్మ పేరు అమ్మ (2)

ఓ..ఓ... ఓ.. అనుబంధానికి
ఓ... ఓ.. ఓ... అనురాగానికి
తొలి తొలి రూపం అమ్మంటే

నాన్నంటే తోడురా
నీ వెంటే నీడరా

అమ్మైన స్త్రీ జన్మ అరుదైన పుణ్యం
రొమ్ముల్లో నింపింది ప్రేమామృతం
పేగు చీలి ముడతపడిన పొత్తికడుపు చర్మం
స్త్రీ జాతి త్యాగాలు రాసున్న గ్రంథం
మమతెరిగిన మాతృత్వం తరగని అందం
అది తెలియని సౌందర్యం దొరకని స్వప్నం
అతి మధురం తల్లీ తండ్రీ అయ్యే క్షణం

అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో

పుట్టించగలిగేది మగజన్మ అయినా
ప్రతివారు కాలేరు నిజమైన నాన్న
కన్నతండ్రి అన్న పదవి జంతువులకు ఏది
ఆ జ్ఞానముంటేనే అసలైన తండ్రి
ఇదిగిదిగో ఈ బిడ్డను కన్నది వీరే
అని నలుగురు తననెంతో పొగుడుతుఉంటే
తండ్రి అవడం అంటే అర్థం అదే కదా

నాన్నంటే తోడురా
నీవెంటే నీడరా
నిను పాలించే మహరాజు పేరు నాన్న
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో



ఆగదే ఆకలి పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉన్నికృష్ణన్, స్వర్ణలత , మాల్గాడి శుభ

ఆగదే ఆకలి 



ప్రేమించు ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: మావిడాకులు (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: రాజేష్, సునీత 

ప్రేమించు ప్రియా 

Palli Balakrishna Tuesday, May 23, 2023
Ooru Peru Bhairavakona (2024)



చిత్రం: ఊరుపేరు భైరవకోన (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
నటీనటులు: సందీప్ కృష్ణ, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్
దర్శకత్వం: వీఐ ఆనంద్‌
నిర్మాత: రాజేశ్‌ దండా
విడుదల తేది: 16.02.2024



Songs List:



నిజమే నే చెబుతున్న పాట సాహిత్యం

 
చిత్రం: ఊరుపేరు భైరవకోన (2024)
సంగీతం: శేఖర్ చంద్ర 
సాహిత్యం: శ్రీమణి 
గానం: సిద్ శ్రీరామ్ 

తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారరే

నిజమే నే చెబుతున్న జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా 
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా 

వెళ్లకే వదిలెళ్ళకే
నా గుండెని దొచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టూ రంగుల్నిలా

తానారే రారారె రారారెనా
తారారె నానారెరే
తానారే నానారె తానారెనా
తారారే రారారరే

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండె మాటలు తెలుసే

కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే

నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా...

పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్న
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్ని గుర్తించని పయణంకానా

నీడల్లే వస్తానే నీ జతై
తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై

నిజమే నే చెబుతున్న జానే జాన
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్న ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్న ఆ హా హా

Palli Balakrishna
Ramabanam (2023)



చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
నటీనటులు: గోపీచంద్, 
దర్శకత్వం: శ్రీవాస్ 
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల
విడుదల తేది: 05.05.2023



Songs List:



ఐఫోన్ సేతిలో పట్టి పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిర్యాల, మోహన భోగరాజు

ఐఫోన్ సేతిలో పట్టి
హై క్లాసు సెంటె కొట్టి
హై హీల్స్ చెప్పులు తొడిగి
తిక్క తిక్క బోతే ఉంటె
తిప్పుకుంటా పోత ఉంటె
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల

రోలెక్స్ ఘడి పెట్టి
రేబాన్ జోడు బెట్టి
రేమాండ్స్ సూట్ తొడిగి
రేంజ్ రోవర్లా వస్తా ఉంటె
రయ్యు రయ్యునా వస్తా ఉంటె
నా పానం ఆగదు పిలగో
తెర్సుకుంది గుండెలో గొడుగో
నా పానం ఆగదు పిలగో
తట్టుకైనది ఎలాగో పిలగో

నీ పిప్పరమెట్టె వొల్లే
సప్పరించి పోయే తిల్లే
బుర బుగ్గల్లే మెరుపల్లె
పెంచినాయే కరెంటు బిల్లే
నా బుజ్జి బంగారు కొండా
నీ పోలిక సల్లగుండా
పోరి సోకె నువ్వుల ఉండా
ఆడుకోరా గిల్లి దండా
నడుములో భూకంపాలు
సూపించదే రిక్టర్ స్కేలు
నాభి లోతు సుడి గుండాలు
నా పాణం నా పాణం
అరెరే నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో

నువ్వు కస్సున సుత్తే సాలు
ఆడుతలే సెయ్యి కాలు
నీ ఒంపులో ఫెవికాలు
అత్తుకున్నాయి రెండు కళ్ళు
ఇది రింగు రింగు పిట్టా
నీ పైనే వాలిందిట్ఠా
అందాల ఆనకట్ట
తెంచుకోరా ఒంపు మిట్టా
ఏమున్నవే కోరమీను
నీ నవ్వే ఓ విటమిన్
నీ జల్లో నా జాస్మిన్
నేనయ్యి ఉంటా రావే నా జాను
నా పాణం ఆగది పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగది పిల్లగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పాణం ఆగది పిల్లగో
తట్టుకునేది ఎలాగో
నా పానం ఆగది పిల్లా
బెంగాలీ రసగుల్లా
నా పాణం ఆగడు పిల్లా
దివాలి కాకరపుల్ల



దరువెయ్ రా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కృష్ణ తేజస్వి, చైత్ర అంబలపూడి

ఎప్పుడైతే ఆటంకమొస్తాదో ధర్మానికి
అప్పుడే నువ్వొస్తావయ్య సామీ ఈ భూమికి

కొత్త రూపం ఎత్తాలయ్య
సెడుని మట్టు పెట్టాలయ్యా
నమ్మినోళ్ళ కాపాడ రావయ్యా
నరసింహయ్య

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

నింగి హోరెత్తగా… కలవా కలవా
నేల శివమెత్తగా… గలబ గలబలేక
చిందు కోలాటాలు… చెక్క భజనల్లోనా
నీ ఒంట్లో నా ఒంట్లో… నరసన్న పూనాలిరా

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న

సింగమంటి సిన్నవాడ
నీలో కంట బిరుసు ఉన్నదిరా
ఉన్న ఊరు నిన్ను చూసి
గుండె రొమ్ము చరుసుకున్నదిరా

దిష్టి తీసి హారతిచ్చి
ముద్దు మిటికలిరుసుకున్నదిరా ఆ ఆ
నీలాంటోడు ఉన్న చోటా
ఏ చీకు చింత ఉండదంటా

మనిషంటా ఒక్క సగం
మృగమంటా ఇంకో సగం
నరసన్నే చూపాడురా
మనలో ఉన్న గుణం

మంచి ఉంటే మంచిగుంటాం
రెచ్చగొడితే హెచ్చరిస్తాం
పడగెత్తే పాపపు మూకల
తోకలు కత్తిరిస్తాం

ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
తకదిన్నా దిన్నా దిన్నా
పంబరేగేలా ఇయ్యాల చెయ్యాలి
పండగ, ఆ ఆ

ధనా ధనా ధరువెయ్ రా ధనా ధనా
చిందెయ్ రా చిన్న చిన్న
దిక్కులదిరెట్టు తిరనాల్ల
జరగాలి జోరుగా

గంగం గణగణ… గంగం గణగణ
గుండె జే గంట మోగింది గణగణ
జంజం జనజనా… జంజం జనజనా
ఆడె అడుగున అగ్గి పుట్టాలి అద్ధిరబన్న



నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: శ్రీమణి
గానం: రితేష్ జి.రావు

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ

ఓ పికాసో డావెన్సీ కలగలసీ
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి
పిచ్చెక్కే మైకంలో నన్నే
నే మరచి మైమరిచి
నీ లోకంలో అడుగేస్తున్న
ఇక అన్నిటిని విడిచీ

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

మొదటిసారిగా మనసు పడి
వదలకుండ నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో
లవ్ మెలోడీ
పికాసో డావెన్సీ కలగలసి
నీ శిల్పం కొలిచారా స్కెచ్చేసి

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హే

ఓ ఫుల్ మూన్ రోజు నాకే
ఫోన్ కాల్ చేస్తోందే
తన వెన్నెల ఎక్కడ ఉందో
చెప్పమని అడిగిందే

కళ్ళముందె నువ్వున్నా
తనకి నే చెప్పనులే
కాలమంతా నీతోనే
కలలు కంటున్నాలే

నా మనసే మనసే మరి
నా మాట వినను అందే
తెలియని వరసే వరసే కలిసే
నన్నే కాదలివ్వమందే

షురువాయే దిల్ సే దిల్ సే, దిల్ సే
న్యూ రొమాన్స్ డాన్సే
ఇంతక ముందరెప్పుడు
ఇంత కొత్తగా లేదులే

నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తిలా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే, ఏ

నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటాలెన్నో పేల్చేసావే, హేవే 




మోనాలిసా మోనాలిసా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం (2023)
సంగీతం: మిక్కీ జే మేయర్ 
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీ కృష్ణ, గీతామాధురి

కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి
కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
మొగ్గకాదు మోదుగ నీడ
నీడ కాదు నిమ్మల బావి

మోనాలిసా మోనాలిసా
నడుమే నల్లపూస
చెవిలో చెప్పుకుందాం
నువ్వు నేను గుసగుస
హే మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస
కాదు కాదు అంటానా
కాదు కాదు అంటానా
రాను రాను అంటానా
ఈలా కొట్టి రమ్మంటే
గోడ దూకి వచ్చయినా
బొట్టు పెట్టి రమ్మంటే
పెట్టె సద్దుకొచ్చేయినా
నేనెట్టగుంటా తెరేబీనా
సరికొత్తగా మహా మత్తులో
పడిపోతిని కల్కత్తాలో కనులు చెదరగా
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
మోనాలిసా మోనాలిసా
వయసే మిస మిస
ఇద్దరం పాడుకుందాం సరిగామపదనిస

సిగ్గు ముంచుకొస్తాందిరా
మీద మీదకొస్తుంటే
అగ్గి పుట్టుకొస్తదిరా ఆవురావురంటుంటే
సిగ్గు ఎగ్గూ ఎందుకు లేదు
పక్కన పెట్టేదాం
ఈ అగ్గి మాన్తా సంగతి ఏంటో
ఇపుడు తేల్చేద్దాం
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నిన్ను ఇంకా ఆపేదెట్టా
నన్ను నేను లాగేదెట్టా
గిల్లి గిల్లి గలాటకి ఎక్కాఏకి రా మరి
రా మరి రా మరి రా…
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి
నాగమల్లి నాగమల్లి
నడిచే జుంకామల్లి
పట్టి పట్టి సుద్దామని
వచ్చేశానే మళ్ళి మళ్ళి

Palli Balakrishna
Bichagadu 2 (2023)



చిత్రం: బిచ్చగాడు 2 (2023)
సంగీతం: విజయ్ ఆంటోనీ 
నటీనటులు: విజయ్ ఆంటోనీ 
దర్శకత్వం: విజయ్ ఆంటోనీ 
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ 
విడుదల తేది: 19.05.2023



Songs List:



చెల్లి వినవె నా తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు 2 (2023)
సంగీతం: విజయ్ ఆంటోనీ 
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: అనురాగ్ కులకర్ణి 

చెల్లి వినవె నా తల్లి వినవె
నీ అన్నాను కాను అమ్మే నేను
చిట్టి వినవె నా బుజ్జి కానవే

నీ పుట్టు మచ్చయి ఉంటా తోడు
ఉసురు పోతు ఉన్నా పంచేస్తాలే నా ప్రేమే
లోకం చిన్నదై పోయె నీ చిరు వొడిలో బంగారు

చెల్లి వినవె నా తల్లి వినవె
నీ అన్నాను కాను అమ్మే నేను
బతుకులే వీధి పాలైనా

నిను రథములో తిప్పుకొన్నా
దైవమే విడిచి పొమ్మన్నా
నిను విడువని చిట్టి కన్నా

ఊపిరాగిపోయినను ఆత్మనై నే రానా
సృష్టిలోని ప్రేమంతా నీకు పంచానా
జన్మే మరల ఉంటే నీకు అమ్మై పుట్టానా

ఆకలై నువ్వు ఏడుస్తున్నా మనసే తల్లి పాలై మరిగే
నా వేలు పట్టుకొని నీవొస్తే
స్వర్గమై నేల వెలిసే

భూమి బద్దలైపోయి రెండు ముక్కలే అయినా
ఊయలల్లే నే మారి నిన్ను మోయనా
జన్మే మరల ఉంటే నీకు అమ్మై పుట్టానా

చెల్లి వినవె నా తల్లి వినవె
నీ అన్నాను కాను అమ్మే నేను




మందార మువ్వా పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు 2 (2023)
సంగీతం: విజయ్ ఆంటోనీ 
సాహిత్యం: భాష్య శ్రీ 
గానం: శరత్ సంతోష్ , మధుశ్రీ 

ఏ ఎహె, ఏ ఎహె ఏ ఎహె
ఏ ఎహె, ఏ హె హె
ఏ ఎహె, ఏ ఎహె ఏ ఎహె
ఏ ఎహె, ఏ హె హె

మందార మువ్వా... మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవ్వు

చింగారి రబ్బా… చింగారి రబ్బా
కౌగిళ్ళలోనే నను కాల్చకు నువ్వు

వయ్యారి రాశి నీ సోకే వరమా
మ్, చేరాక నీలో ఇక జన్మే సుఖమా

మందార మువ్వా... మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవూ

గుండె గూటి పునాదివే
నాకై పూసే గులాబివే
అనురాగంలో మా అమ్మవే
ఆ ఎండలో నా నీడవే

నేను వేరే నువ్వు
మీరై నేను నేనే నువ్వు
నాలో సగమే ప్రియా నువ్వు
నా గుండెకే చిక్కావు నువ్

నన్నేదో చేశావే
నా లోకం అయ్యావే
ఈ ప్రేమే పండాలి
నీలో నేనే ఉండాలి

మందార మువ్వా... మందార మువ్వా
అందాలలోనే చిరుచోటునే ఇవూ




బికిలి పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు 2 (2023)
సంగీతం: విజయ్ ఆంటోనీ 
సాహిత్యం: భాష్య శ్రీ 
గానం: విజయ్ ఆంటోనీ 

వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో
బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో
వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో
బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో

వీళ్ళే వీళ్ళే విల్లా విల్లా
విల్లే గుచ్చాలి బిలిబిలి బిలిబిలి బిలిబిలి
పేదోళ్లనే వేధిస్తున్న వారికి
నే పెట్టిన పేరు బికిలి
బికిలి బికిలి బికిలి

వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో
బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అమో
వీళ్ళే బికిలి బికిలి బికిలి బిలి బిలి, అయో
బికిలి బికిలి బిలిబిలి బిలిబిలి, అయయయో

లేనివాన్ని తొక్కి పెట్టి
నమ్మి వస్తే ముంచి వేసి
చెవిలోన పెట్టెరా పువ్వులు (బికిలి)
పక్కనుండి గొయ్యి తీసి
నిద్రపుచ్చి గొంతు కోసి
ఏడిపిచ్చి నవ్వేరా నవ్వులు (బికిలి)

పేరుగొప్ప ఊరుదిబ్బ ఏందిరబ్బ (బికిలి)
కాసుకోసం పాకులాడే గుంటనక్క (బికిలి)
చూడొద్దు ఆగొద్దు వీనొద్దు
బికిలి బికిలి బికిలి
(టపక్ టపక్ టపక్ టపక్…)

వీజే ఆంటోనీ యాంటీ బికిలి
వీజే ఆంటోనీ యాంటీ బికిలి
విజయ్ ఆంటోనీ ఈజ్ యాంటీ బికిలి
ఇక మేము అందరం… ఒక యాంటీ బికిలి

గాలి వీస్తే చెట్టులూగు
మబ్బులొస్తే వాన పడు
అనుభవిస్తేనే తెల్సే లైఫే (బికిలి)
మంట పెడ్తే ఇల్లు కాలే
గండి కొడ్తే ఊరు పోయే
నొప్పి పుడితేనే భాద తెలిసే (బికిలి)

మనసు చూడు, ఫుల్లు కీడు
కంపు నోరు, హు (బికిలి)
మనిషి చూడు స్టయిలు జోరు
బెంజు కారు (బికిలి)
చూడొద్దు ఆగొద్దు వీనొద్దు
బికిలి బికిలి బికిలి
(టపక్ టపక్ టపక్ టపక్…)

Palli Balakrishna
Rudrangi (2023)



చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
నటీనటులు: జగపతి బాబు, అశిస్ గాందీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం
దర్శకత్వం: అజయ్ సామ్రాట్
నిర్మాత: 
విడుదల తేది: 2023



Songs List:



జాజిమొగులాలి పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
సాహిత్యం: అభినయ శ్రీనివాస్ 
గానం: మోహన భోగరాజ్ 

ఏ వచ్చిందే వచ్చిందే
తయ్యారై వెన్నెల వయ్యారే
ఓ పోరి…
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
మంత్రమేసే మామ కొడుకా జాజిమొగులాలి
మందు దంచుకొని రారా జాజిమొగులాలి
పుట్ట మీద పాల పిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి

పేరు పెట్టి ప్రేమతోని పిలవనంటడే
వాడు ఇగురంగా ఇస్తారా చేస్తానంటడే
ఏలు పెట్టి నలుగుట్ల నడువనంటడే
వాడు ఏమి ఎరుగనట్టు
ఎన్ని వగలుపడతడే
ఒక్కదాన్ని దొరికితే వదులనంటడే
నన్ను బక్కపలుసాగున్నవంటు లెక్కలేస్తాడే
తిక్క తిక్క పనులెన్నో చెయ్యమంటడే
వాడు పక్కనుంటే చాలు నాకు ఉడకపోతలే
ఇస్సునంతా రమ్మంటే
నా ఇంటి దానివంటడే
ఆకురాయి సుపులోడే జాజిమొగులాలి
అందమంతా మెరుగు బెట్టే జాజిమొగులాలి
వాడు చూసే చూపులకు జాజిమొగులాలి
కన్నెతనమే కరిగిపాయె జాజిమొగులాలి

ఏ అర్ధరాత్రి యాదికొస్తే నిద్దరుండేదే
వాడు ముద్దు మీద ముద్దు పెడితే
పొద్దు పొడువదే
అమ్మ తోడు పాడు మనసు ఆగనంటదే
నాకు వాని మీద పానమంతా గుంజుతుంటదే
రాక రాక వచ్చినాడు మొన్న రాతిరే
నా రామసక్కనైన బావ సాటి ఎవ్వరే
కోరి కోరి పెట్టినాడు కొత్త కిరికిరే
వాడు అదుముకుంటే ఆడనంది ఉన్న ఊపిరే
నా తోడే వాడుంటే ఇగ మస్తు మస్తుగుంటదే
గుడెపోలే పిలగాడే జాజిమొగులాలి
గుండె కొల్లగొట్టినాడే జాజిమొగులాలి
కన్ను కన్ను కలిపినంటే జాజిమొగులాలి
ఎన్నులోన వణుకు బుట్టె జాజిమొగులాలి
దొరసాని నువ్వులు చూడే జాజిమొగులాలి
పున్నమోలే పోసినాయే జాజిమొగులాలి
తీగ నడుము చూడ బోతే జాజిమొగులాలి
నాగుపాము లెక్క ఊగే జాజిమొగులాలి




ుద్రంగి టైటిల్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: రుద్రంగి (2023)
సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
సాహిత్యం: మానుకోట ప్రసాద్ 
గానం: కైలాష్ ఖేర్

రుద్రంగి టైటిల్ సాంగ్

Palli Balakrishna Wednesday, April 5, 2023
Ravanasura (2023)



చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హరివర్ధాన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజా, శుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా 
దర్శకత్వం: సుదీర్ వర్మ 
నిర్మాతలు: అభిషేక్ నామ, రవితేజా 
విడుదల తేది: 07.04.2023



Songs List:



Ravanasura Anthem సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: ట్రెడిషినల్ 
గానం: స్వాతి పీపుల్, నోవ్లిక్, హారికా నారాయణ్, హర్షవర్ధన్ రామేశ్వర్

Ravanasura Anthem



ప్యార్ లోన పాగల్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రవితేజా

ప్యార్ లోన పాగల్ 



వెయ్యిన్నొక్క పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి 

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడల్
అయ్యావొ ఏమో వయ్యారీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

కర్మకాలి రావణుండు
నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ

భీష్ముడున్న కాలమందు
నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ

ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
అరెరెరె ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే

పొరపాటు బ్రహ్మది గాని
సరిలేనిదీ అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

Hey Girl Come to Me Follow
Im Gonna Take You to the Top
Come on Feel Naa
I Like to Chit Chat
You are My Cutie Cat
Hey Baby Come Come
Hey Baby Come Come Love

అల్లసాని వారిదంత
అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
అయ్యయ్యయ్యె
వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ

ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి
వెంటపడతారే
అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే

ముసలాడి ముడతలకైనా
కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే





డిక్క డిషుమ్ పాట సాహిత్యం

 
చిత్రం: రావణాసుర (2023)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల  శ్యామ్ 
గానం: స్వాతి రెడ్డి, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిడ్ల

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి

హే టిప్పరు లారీ ఒళ్ళు
టక్కరు పెట్టే దిల్లు
ఏ టిప్పరు లైట్లే కళ్ళు
లిక్కరు కంటే త్రిల్లు

హే గజ్జెలు కడితే ఏక్ బార్
గజ్జున మోగాలే తీన్ మార్
మార్ మార్ మార్ మార్

చిల్ లాకే మార్ మార్ మార్
ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే పుట్టగానే దిష్టి సుక్క
పెరుగుతుంటే మిల్కు సుక్క
పెద్దగైతే విస్కీ సుక్క
రింకులు ఓ రింకులు

హే బుగ్గ మీద పెండ్లి సుక్క
ఫస్ట్ నైట్ పక్కన సుక్క
సిందుతుంటే సెమట సుక్క
టింకులు ఓ టింకులు

హే రింగుల మీద రింగులు
పెట్టేటోడు సింగిలు
రంగుల మీద రంగులు
మార్చేస్తుంటారు కింగులు

ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్

Palli Balakrishna

Most Recent

Default