Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Meter (2023)
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి 
దర్శకత్వం: రమేష్ కాడురి 
నిర్మాత: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు 
విడుదల తేది: 07.04.2023Songs List:ఓ చమకు చమకు పోరి పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: అరుణ్ కౌండిన్య, ML గాయత్రీ 

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

హే చందమామ వచ్చే వేళ
టెర్రస్ ఎక్కేస్తా చూడు
చెయ్యే ఊపి సిగ్నల్ ఇస్తా
చూడకపోతే నీ బ్యాడు

మేడపై చూసాకే గోడనే దూకానే
చుక్కలే పోగేసి దిష్టే తీసానే

నీకు నా పిచ్చుంది నాకదే నచ్చింది
దోచిపెట్టుకో ఇంకా దాచేదేముంది

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

ఏ, అందగత్తె ఎవ్వరంటే
చూపించారే మీ రోడ్డు
అందాకొచ్చి చూద్దామంటే
బయటున్నడే మీ డాడు

ప్రతి సెంటర్లో ఉండే లవ్ జంటల్లో
మనమే టాపిక్ కావాలే
ట్రెండీ గాసిప్ అవ్వాలే

లవ్ జుంక్షన్లో చేసే, ప్రతి ఫంక్షన్లో
మనం ముచ్చటుండాలె
అది ముద్దుగుండాలె

ప్రతి కన్ను కుట్టినట్టు
మన జంట సూపర్ హిట్టు
అయ్యేటట్టు పద పడదాం పట్టు

మన లవ్ దాటుకుంటూ
వేద్దాము పెళ్లి టెంటు
నీదే లేటు, ఫిక్స్ చేసేయ్ డేటు

ఓ చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి

చమకు చమకు పోరి
నా ధడకు ధడకు నారి
నీ నడుము ఓ ఎడారి
అట్టా తిప్పుకుపోకే వయ్యారి
ఓ బేబీ జారిపోమాకే పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: ధనుంజయ్ 

హే అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

హే హే, పట్టు పట్టి పోతున్న
జట్టు కట్టనంటున్న
నిన్ను పట్టి ఇస్తాలే నాలో ప్రేమకే

మగవారంటే పగబడతావే
తెగ తిడుతూ అలా కారాలు నూరి
దూరాలు పోతే కుదిరేదెట్టా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనీకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే

అందమెట్టి కొట్టావే
అందనంటు పోతావే
గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే

నువ్వే చుక్కవి అయితే
ఆ జాబిలి పక్కకు పోదా
నిన్నే వెన్నెల చూస్తే
తన కన్నులు చిన్నవి కావా

అందం ఎంతున్నా
బంధమంటూ ఒకటుంటే
గడిచే ప్రతి నిమిషం
తోడు రాదా నీ వెంటే

ఒకటే లైఫంట
నకరాలొద్దంటా చెప్పిందినమంటా
నీకంట నీరు తుడిచేటి వేలై
నే పడి ఉంటా

ఓ బేబీ జారిపోమాకే
నన్ను వదిలెళ్ళి పోమాకే
అట్టా మడికట్టుకుంటూనే
దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే

వయసుని వాడిపోనాకే
చెప్పవే నాకిక ఓకే
ఇట్టా నీ ఫేటు మార్చేసి
నా రూటులో నిన్ను
చూపిస్త నీ కళ్ళకే
Meter Title Song పాట సాహిత్యం

 
చిత్రం: మీటర్ (2023)
సంగీతం: సాయి కార్తీక్ 
సాహిత్యం: బాలాజీ 
గానం: సాయి కార్తీక్ 

అడ్డే లేదు అడ్డా లేదు
పడి లేచాడో ఉప్పెనల ఒడ్డే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

హద్దే లేదు, పద్దే లేదు
అనుకున్నాడో ఏదైనా రద్దే లేదు
ఏస్కో మీటర్, రాస్కో మ్యాటర్

అలా తరిమి తరిమి
పరుగు పెడితే తప్పదు లెక్క
అదో ఉరుము ఉరిమి
మెరుపులాగా ఉంటది పక్కా
చెడే చూసాడో ఇరగేసి రాస్తాడు
తిరగేసి పనిలో దిగితే గురిచూసి

దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే
దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే

అదరగొట్టు బెదరగొట్టు చెదరగొట్టు
కొట్టేయ్ కొట్టేయ్ కొట్టు కొట్టు
గురినిపెట్టు గురుతుపట్టు
మడతపెట్టి కొట్టు కొట్టు

బాకీ పడ్డ ఖాకి డ్రెస్సు
ఓకే అంటూ ఎక్కేసాడు
దానెనక ఉన్న పవరు తెలిసి
దారిలోకి వచ్చేసాడు

కథే మలుపు తిరిగి
మనసు చెదిరి పోయినచోటే
ఎదే తలుపు తెరిచి
గెలుపు వెతికి ఆడెను వేటే

అరె ఎదురొస్తే ఎవడైనా
ఎదురించే దమ్మున్న
తెగువ పొగరు ఉన్నోడు

దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడేస్తాడు చెడుగుడే
దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడెస్తాడు చెడుగుడే

No comments

Most Recent

Default