Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anni Manchi Sakunamule (2023)




చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ 
దర్శకత్వం: నందిని రెడ్డి 
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 18.05.2023



Songs List:



అన్నీ మంచి శకునములే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రహ్మన్
గానం: కార్తిక్ 

నిజమేది ఋజువేది
విధి ఆటే గెలిచేది
మనకేది మనదేది తేల్చేదెవరో

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
అవునని నమ్మితే
ఎదలోని దిగులే ఆశల వెలుగై రాదా
అన్నీ మంచి శకునములే
శుభమని సాగితే

పడి పడి నడిచే
బుడి బుడి అడుగై
నిత్యం సాగే ప్రయాణం
ఎవరికి ఎవరో
ఒకరికి ఒకరై
అల్లేసుకుంటున్న బంధం

కలవడము సహజం
విడవడము సహజం
నడుమన నాటకమే
జరుగుట తథ్యం

గెలవడము సహజం
అపజయము సహజం
కదులుతు పోవడమే కదా
మన ధర్మం

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా

కొమ్మను విడిచి కదిలిన పూలే
చెంతే చేరే విచిత్రం
తరగని మమతే తలపై నిమిరి
అమ్మై తరించే అదృష్టం

పొందడము సహజం
పోవడము సహజం
మనదైతే మాత్రం
వదలదు సత్యం

మొదలవడం సహజం
ముగియడమూ సహజం
నిలవని ఈ సమయం
తెలిపిన సూత్రం

అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా



సీతా కళ్యాణ వైభోగమే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: చైత్ర అంబలపూడి, శ్రీకృష్ణ 

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
పచ్చనైన చూపులన్ని
పందిరేసే వేళా
స్వచ్ఛమైనా స్వచ్ఛమైనా నవ్వులన్ని
పీటలేసె వేళా

సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ

పరిణయమగు వేళా పదుగురిలో
సందడులే శుభమంత్రమల్లె మ్రోగగా

మా సౌక్యమంత
మా భాగ్యమంత
మా సంపదంత
మా మురిపెమంత
మా వేడుకంత
మా వెలుతురంత
మా ప్రేమలంత
మా ప్రాణమంత

మా గడపను వదలగ
మీ గుడి చేరగ
తలలు వంచి తరలి వెళ్ళు తరుణంలో
తడి ముసిరెను కన్నుల్లో
తడి ముసిరెను కన్నుల్లో
తడి ముసిరెను కన్నుల్లో



మెరిసే మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రహ్మాన్
గానం: నకుల్ అభాయంకర్, రమ్యా భట్ అభాయంకర్ 

గల గల ఏరులా ప్రవహించాలిలా
అడుగడుగో అలలా తుల్లి పడేలా

ఈ తిరుగుడు ఏలా ఈ తికమకలేలా
నువ్వెటు వెళ్ళాలో నీకే తెలియాల

ఇదిగో దాటేస్తే వెన్నక్కి పోలేం
ఓ హో హో, ఓ హో హో

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓ ఓ ఓ… పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం, లేలే లే లే

తెలియదు కదా
మున్ముందు కనులే చెదిరే
చిత్రాలెన్నున్నాయో
ఏం చూపిస్తాయో

మనసుతో చూసెయ్
కలా నిజం ఒకే జగం కధ
పెదవుల పై మెరుపే
వెలుగై నడిపే

కబురులు నో నో
ఈ కవితలు నో నో
మైమరుపులు నో నో… నో నో నో

పరుగులు నో నో
ఈ మెలికలు నో నో
ఈ తగువులు నో నో ఓ ఓ
అసలెందుకీ గొడవంతా

మెరిసే మెరిసే
మెరిసే మబ్బుల్లో
ఏదో చిత్రం గీసే
హో విరిసే విరిసే
విరిసే నవ్వుల్లో
చైత్రాలే పువ్వించెయ్

ఈ దారే నీ నేస్తం
ఏ గమ్యం కాదే శాశ్వతం
హో ఓ ఓ ఓ పద మలుపు ఏదైనా
అలా పలకరించేద్దాం, లేలే లే లే





చెయ్యి చెయ్యి కలిపేద్దాం పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: శ్రీకృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబలపూడి

చెయ్యి చెయ్యి కలిపేద్దాం
చేతనైంది చేసేద్దాం
నువ్వు నేను ఒకటవుదాం
నవ్వుకుంటు పని చేద్దాం

ఊరగాయ ఊరేద్ధాం
కూరగాయ తరిగేద్ధాం
విస్తరిని పరిచేద్ధాం
విస్తరించి కలిసుందాం

మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం

గుమ్మడి పులుసుతో
ఓఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
గుమ్మడి పులుసుతో గుండెలు మురవని
కమ్మని పెరుగుతో ప్రేమలు పెరగని
గారెల వడలతో దారులు కలవని
గరిజల తీపితో వరసైపోనీ

ఓరుగల్లు నుండి బియ్యం తెచ్చి
పాలకొల్లు నుండి కూర తెచ్చి
అరె, కడప నుండి నాటుకారం తెచ్చి
శాకహారం సిద్దం

బెల్లంపల్లి నుండి బొగ్గు తెచ్చి, ఓహో
తాడేపల్లి నుండి పాలు తెచ్చి, ఓహో
అరె, అనకాపల్లి నుండి పంచదార తెచ్చి
అందరికి పంచాలి పాయసం

ఏలో ఏలో ఏలో ఈవేళా
మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

హో, చుట్టుకున్న చుట్టరికం
ఘాటు తీపి సమ్మిలితం
సర్ధుకుంటె ప్రతి క్షణం
సంతోషాల విందు భోజనం

ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం




ఏమిటో నేనేటో పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చైత్ర అంబలపూడి 

ఏమిటో నేనేటో
ఎందుకో ఇలా
నీతో సాగాలా
నాతో ఆగాలా

ఎదో స్వరం వింటూ మది
ఇదే నిజం అంటున్నది
మళ్ళీ తనే అదేం కాదన్నదీ

వెలుగు పోల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది
మౌన వేధనా

ఒదగలేను నీలోన
కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా
నరకయాతనా

ఏకమై చేరనీ రేఖలే మనం
సరైనదా నా నిర్ణయం
ఏమో మరీ ఏదో భయం
నాలో నాకే ఇదేమయోమయం

వెలుగు పొల్చుకున్నానా
అడుగు మార్చుకున్నానా
మసకలోనే సాగింది
మౌన వేధనా

ఒదగలేను నీలోన
కదలలేను నీతోనా
జరుగుతుంది ఇదేదైనా
నరకయాతనా



హిల్లోరి పాట సాహిత్యం

 
చిత్రం: అన్నీ ఆమంచి శకునములే (2023)
సంగీతం: మిక్కి జే మేయర్ 
సాహిత్యం: రెహ్మాన్
గానం: రితేష్ జి.రావు 

హిల్లోరి 

No comments

Most Recent

Default