-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vikram Chiyaan"



చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
నటీనటులు: విక్రమ, ఐశ్వర్యా రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా లక్ష్మి , శోభిత ధూళిపాల 
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్ 
విడుదల తేది: 28.04.2023



Songs List:



ఆగనందే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: శక్తిశ్రీ గోపాలన్ 

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

నది నడకలే పదగతి సరిచేసే
గిరి పెదవులు పెదవుల తడి పీల్చే
గొడుగులవలె తరువులు నిలిచే
కుసుమపు కొన చినుకులు విడిచే

నను కని పెంచే సొగసుల తలమా
నను నడిపించే అంతఃపురమా
కొలనుల నగవే పలుకనుకొనుమా
నవనవలాడే నువు నా గరిమా

నిను తలవగనే ఎద ఎగిరినదే
నిను తడమగనే మది మురిసినదే
నిన్నానుకునే పవలించెదనే మైమరచెదనే

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే… మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే… మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలయిందే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే



వీరా రాజా వీర పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్, బెన్నీ దయాల్, నబీలమాన్ 

కళ్ళార చూద్దాం
చోళ ఖడ్గ సంచారం సంహారం
ఓ సొగసరి పూవా
పూమాలే శుభమని వేయవే

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా శిఖరం స్పృశించైర

మార రాకుమారా చోరా చిత్త చోర
రా రా ఏలుకోర
కరవాల మీవేళ కనులెర్రజెయ్యంగ
భుజబలము ఈవేళ భూతలము మోయంగ
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర శూర ధీర శూరా

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

పడతులు పాట పాడా
ముదితలు నాట్యమాడ
తేరులు స్వాగతించ
భేరులు ప్రతిధ్వనించ

సంధ్రాల సుడిలోన బడబాణలములాగ
భుగ భుగ కదిలినావ
ధగ ధగ ఎదిగినావ
కలనే గెలిచినావ, నిజమై నిలిచినావ
విక్రమ వజ్రనావ నావికుడైన వీర
వీరా రాజా వీర శూర ధీర శూర

సుడిగాడ్పులా అడుగేయరా
సర సర సర సర
శరమే తనువే తాకగా
చర చర చర చర
చెలరేగాలి వేగంగా

మగసిరి కండచూసి
కడలికి చెమట పోయు
పదునగు కత్తి చూసి
నింగికి నిదుర రాదు

రగతము పొంగి పారీ
నదులకు రంగు మారు
తెగిపడు తలలు అన్ని
అలలకు అన్నమౌను

పులివలె దూకుతుంటే
జగములు జింకలౌను
నిన్నిక పొగడమంటే
భాషకు స్వాస ఆగు

విధిగా తెగించైర
విధినే వదించైర
విలయం దరించైర
విజయం వరించైర

వీరా రాజా వీర శూర ధీర శూర
నువ్వే శుభ్రతారా
నీలో శౌర్య ధార… ఏరై పొంగిపారా
సమరం శ్రుతించైరా… శిఖరం స్పృశించైర

మార రాకుమారా… చోరా చిత్త చోర
ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప
రాజా శ్రేష్ట రాజ… తేజ సూర్య తేజ
వీర రాజా వీర వీర రాజా వీర
శూర ధీర శూరా వీరా




శివోహం పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఆది శంకర 
గానం: సత్య ప్రకాష్, Dr.నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, శన్బాగరాజ్, TS అయ్యప్పన్

శివోహం




మిన్నంచుల వెన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హరిచరణ్

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే

ఏ దరి వెతికెదనే నెచ్చెలీ
నిన్నెట కాంచెదనే
నిత్య నిశీధి ఇది
చీకటి సూన్యమే మిగిలినదే

చిత్ర నయనమది
చక్కని చక్కెర పలుకులేవీ
సుందరహాసమేది
కావేరి నురగల పరుగులేవీ

మంచుమబ్బులవలే ప్రేమగా
తడిమిన చేతులెవీ
గోరు వెచ్చ కాంతుల వేకువై
వెలిగిన చూపులేవీ

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

ఆరని జ్వలనమయే
హృదయం తీరని నరకమయే
ప్రాణం శిధిలమయే సమయం
చలనము లేనిదయే

నిప్పుల ఉప్పెనలో
నన్నిలా ముంచితివెందులకే
నేరము చెయ్యక
ఏ శిక్షలో వగచితి నీ కొరకే

మిన్నంచుల వెన్నెల
కన్నంచుల జల్లుగ జారితివే
ఎద కోసే ప్రళయవిలాపమిదే
ఊపిరినాపినదే

స్వప్నం చెరిగినదే
రక్తము సత్తువ చెదిరినదే
ఒక రాజ్యము కూలినదే
యుద్ధమే చేయక ఒరిగానే




ప్రార్థనలు వినుమా పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవతుల 

ప్రార్థనలు వినుమా
మా ఊపిరి వేణువు గీతికలో
మనోరథాన్ని కనుమా

నీలిమేఘం నీ దేహం అయితే
మెరుపుల జ్యోతులు
మనసు ముంగిళ్లలో
ప్రసిరించాలి ప్రసిరించాలి

నీ కరుణే అనవరతం
మధురామృత దారై
మాపై కురవాలి

పాడు తలపులు
తలపడు క్షణమున
పిడుగులా రావాలి
కడతేర్చి పోవాలి



అలుపే లేదే పాట సాహిత్యం

 
చిత్రం: PS -II (2023)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శిరీష భాగవాతుల, హరిప్రియ, దీప్తి, సురేష్ 

అలుపే లేదే 

Palli Balakrishna Friday, May 26, 2023
Aparichithudu (2005) Telugu Songs Lyrics Album Cover

Aparichithudu (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Aparichithudu (2005)
Banner : Oscar Films
Music : Harris Jayaraj
Director : Shankar
Producer : V. Ravichandran
Actors : Vikram
Actresses : Sadha
Release Date : 17 June 2005

Naaku Neeku Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Naaku Neeku' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Kunal Ganjawala and Vasundhara Das. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: కునాల్ గంజ్వాలా, వసుందర దాస్ పల్లవి: నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా కాప్పచ్చినో కాఫీ యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా ఓహో... Thermocol శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బంధులే నేనులే కన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా చరణం: 1 ప్రేమలు రోజున పుట్టా కళలను తింటూ పెరిగా నడిచే మనసును కలిసా ఈనాడే... ప్రేమకి vote వి నువ్వే Hollywood movie వి నువ్వే అమెరిక map వి నువ్వే నిను నచ్చాలే ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఇక ప్రేమలో టాప్ టెన్ వరసులలో ఈ భూమిలో ప్రథమం మనమేలే ఆహ ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా చరణం: 2 Cyanide cyanide లుక్ తో..గుడ్ డే గుడ్ డే గురితో... సిగ్గు బిడియం చంపే హంతకుడా.. Apple Laptop కన్నే ఒడిలో పెట్టుకు నిన్నే.. వేళ్లరిగేలా నేనే బతిమాలే నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ నువ్వు Octopus చేతులతో చుట్టి పడేసావ్ ఒక Atom Bomb ప్రాణంలోకి నెట్టి పడేసావ్ Cool honey cool honey cool honey తాగనా తేనెని cool honey... ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో చేయ్యరా నేరమో ఘోరమో... నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా నాకు నీకు Nokia ఇక రేపో మాపో మాఫియా Cappuccino coffee యా సోఫియా Thermocol శిల్పం లా నువ్వే ఉంటే నిన్నంటే చిన్ని తెల్ల బందులే నేనులే కన్నీటి శిల్పం లా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా ఐవా ఐవా ఐవా ఏకం కావా నాకో నీకో Nokia ఇక రేపో మాపో మాఫియా... Cappuccino coffee యా సోఫియా... Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా Nokia సోఫియా

Jiyangaari Inti Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Jiyangaari Inti' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by K. J. Yesudas and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.జె.యేసుదాస్, హరిణి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా మకరందం పొడి సిద్ధం చేసి దానిలో స్వర్ణగందం కొంచం కొంచం కలిపి హరివిల్లు లోని వర్ణాలద్ది బ్రహ్మే మలిచాడో శతకోటి పువ్వులుతెచ్చి జంటపూలుగ మలిచాడో నీ పెదవుల్లోంచి పల్లవించు వేదం మన పెదవుల్లోంచి ప్రభవించు జీవం కౌగిట్లో నే ఇవ్వు ముద్దుకి అనుమతి ఒకపరి జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి సొగసా... హా... నింగిని నేలపైకి దించి చిరు నక్షత్రాల తోరణాలే అమర్చి సిరి మల్లెపూల పందిరి కింద మాలని వేస్తావా నీ ముద్దులతోనే నింగీ నేలను ఏకం చేస్తావా మింటి వానలోస్తే పైరు పెరిగేను జంట వానలొస్తే శృష్టి జరిగేను కాలమేనోయ్ ప్రియా సొగసులో తప్పులు జరగని జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా నీ వంటి తరుణి పుడమిలో లేదే ఇకపై పుడితే అది మన పాపే నీ వంటి ఘనుడు జగతిలో లేడే ఘనుడితో వలపు సులభం కాదే అజ్ఞానంలో ఉండే ఆ ఆనందమిదే వలపుల బడిలో బాలకుడే పండితుడే జియ్యంగారి ఇంటి పురుషా జియ్యంగారి ఇంటి సొగసా జియ్యంగారి ఇంటి పురుషా పురుషా...

Love Elephanta Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Love Elephanta' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Nakul, G. V. Prakash Kumar and Tippu. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకుల్, జి.వి.ప్రకాష్ కుమార్, టిప్పు Oleley oley oley oley oley ఆ oleley oley oley oley oley Bingo say యో... మ్యాచో say యో... He's gonna Rockin న న న న న న న నా... చిన్నదైనా పెద్దదైనా.. Watch man more... పల్లవి: Love ఎలిఫంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో అప్పడం గుండెలు భద్రం రెమో Ramp walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో రంభల hearts లో Ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో Rio de janeiro రోమియో ("Love ఎలిఫంట్ల") చరణం:1 Ring Master సింహం లా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదొయ్ నాకు Fans ఉన్నారో మనకు విష్ణుచక్రం వేగమల్లే ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో Baby corn నువ్వు నాకు Teddy bear నేను నీకు ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే. హే దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Rap: ఓ..oley oley oley oley oley ఆ..oley oley oley oley oley Come on and take me ఓ.. Won't you take me ఓ.యే.. ఓ.... యే.... ఏ.... You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap చరణం: 2 హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు హరప్పవి నీవేనా మోహన్జాదారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే.. హే ..దిల్ మాంగే మోర్ రెమో రెమో ("Love ఎలిఫంట్ల") Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ..R.E.M.O రెమో రెమో Rio de janeiro రోమియో Rap: You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap...

O Sukumari Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'O Sukumari' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Shankar Mahadevan and Harini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Chandrabose
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్, హరిణి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో ఓ సుకుమారి, ఓ శృంగారీ నా అలంగారిని ఓ సుకుమారీ... హే లంబా తానే ఓ సుకుమారి ఓ శృంగారీ యే కుమారీ యే కుమారి యే కుమారీ యే కుమారీ యే కుమారీ.... కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో తొలిప్రేమ అంటే పెను భారమా... ఇది కానుపు రాని నిండు గర్భామ... ఓఓఓ ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేక ఊపిరి ఆగదా ఊర్వశి ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోద ప్రేయసి ప్రేమలేఖతో ఆయిన మధిలో ఉన్నది పూర్తిగ సెప్పలేము కదే నువు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గము లేదే కుమారీ...కుమారీ... ఈ ఈఈ... ఆ ఆ ఆ ఆ ప్రేమ బాసే రాని మూగ వాడినే... వాడి పోవుచున్నా గిట్టా చూడవా దోసిలి నిండా పువ్వులు నిండి గువ్వల కోసం ఎతికినా పువ్వలా నొసగి పూజను చేసి కోరిక అడుగుట మరిసినా ఆ దేవునికన్నా బలమగు వాడు వేరొక ఉన్నాడులే కల్లను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడు అతడే అతడే కుమారీ నా ప్రేమె వెక్కి ముక్కి బక్క సిక్కెనే కుమారీ నా గుండె గుప్పి రొప్పి క్రుంగుసున్నదే కుమారీ నా మాటల కడలి మండీ ఎండేనే ఏఏఏ ఆఆ ఆ… ఓ ఓఓ ఏఏ కుమారా నీ ప్రేమ విక్కి ముక్కి బక్కసిక్కిన కుమారా నీ గుండే గుప్పి రొప్పి క్రుంగుచున్నద కుమారా నీ మాటల కడలి మండీ ఎండేనా నే ఓడిపోయాననుకుంటనే నా ప్రేమను కాస్త వాయిదా వెస్తినే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి షంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబి లంబానో

Konda Kaki Song Lyrics in Telugu – Aparichithudu (2005)

'Konda Kaki' song from Aparichithudu (2005) movie is composed by Harris Jayaraj and sung by Jassie Gift, K. K. and Sujatha Mohan. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Aparichithudu (2005)
Lyricist : Bhuvana Chandra
చిత్రం: అపరిచితుడు (2005) సంగీతం: హేరిస్ జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: జస్సి గిఫ్ట్, కె.కె. సుజాత మోహన్ రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక రండక ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నేనే దానా హే చి రా అంటూ వాతలు వేస్తావో హా హుం హే అంటూ కులికించేస్తావో మిర్చిమసాల నడుముని చూసి ముడుచుకు పోయానే తడిపెదవుల్లో సెగ పుట్టించి ఇస్త్రీ చేసెయ్ వే జగ్గు జగ జంతరు గాడ పప్పు రుబ్బు భీముని చూడ నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నువు చిత్తూరి చోక్లెట్ వి అనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా కొండకాకి కొండే దానా హే గుండిగ లాంటి గుండె దానా హే హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ వై జా గు వెలగ పండువే నీవు వన్ టూ త్రీ పాడి కొరికేయ్ నా నిన్ను పండుతిన్న పిలగా పళ్ళు కుచ్చుకొనక కరుసుకు పోతావా జంట అరటి పళ్ళుమల్లే వెంటే ఉంటావా చెట్టోరి కొట్టు పీచు మిఠాయి పక్కూరు టకి చెకోడి నువ్వోయి జున్ను పాలంటి దేహం నీదే చిలకా జున్ను పాలంటి దేహం నీదే చిలకా కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కాస్తా రుచి చూడనీవే పొమ్మని అనక కొండకాకి కొండే దానా గుండిగ లాంటి గుండె దానా హయ్యారేటు పల్ల దానా మట్టగిడస కళ్ళ దానా పొవ్వుల్తోనే బాణం వేసే పూలందేవి నువ్వే జాణ మాయల మొనగాడే రాతిరి బూచోడే మంచు గడ్డను ఒక్క లుక్ తో ఆవిరి చేశాడే చెయ్ చండి జగమొండి జర కొంగును దులపండి ముద్దులతోనే స్వేదాన్నంత సుబ్రం చేయండి ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఏలా ఏలా ఏలా ఏలా ఏలా ఏలమ్మా ఓల ఓల ఓల ఓల ఓలమ్మ ఓల ఓల ఓల ఓల ఓల ఓలమ్మ

Palli Balakrishna Wednesday, June 23, 2021

చిత్రం: స్కెచ్ (2018)
సంగీతం: ఎస్.ఎస్.థమన్ 
సాహిత్యం: విజయ్ చందర్
గానం: యాజిన్ నజార్
నటీనటులు: విక్రమ్, తమన్నా
దర్శకత్వం: విజయ్ చందర్
నిర్మాణం: మూవింగ్ ఫ్రేమ్స్
విడుదల తేది: 12.01.2018

ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే

నీకేలే నీకేలే నా ప్రేమంతా నీకే
నీవేలే నీవేలే నా కోరికవే నీవే
నీదేలే నీదేలే నా జీవితమే నీదే
నీతోనే ఉంటానే నేనడిచే తుదివరకే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే
నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

ఎవరే ఎవరే ఎవరే ఎవరే ఎవరే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే

నిన్న దాక లేదులే ఉంది కొత్త వేళలా ఎలా ఇలా
నిన్ను చూసినప్పుడే మారిపోయె కాలమే ఎలా

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నిన్నే నిన్నే నిన్నే చేరుకుందీ
ఇవ్వాళ నా ప్రయాణమేలే
నా చెలీ సఖీ ప్రియా అన్నీ నువ్వే
అంటుంది నా మనస్సు నేడే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

నీ కోసం హార్ట్ బీటింగ్ నీ రాకకే వెయిటింగ్
కాంట్ వెయిట్ టు సీ యూ అంటున్నదే
నచ్చింది నాలో ఫీలింగ్ వచ్చింది కొత్త మీనింగ్
ఐ వాంట్ ఫరెవర్ నీతో అంటున్నదే

ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
తొలిసారి హృదయమే నీ పేరు పలికెనే
ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమే
ఇచ్చింది కానుకే నీ కనుల పండగే



Palli Balakrishna Friday, February 1, 2019


చిత్రం: శివపుత్రుడు (2004)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వనమాలి
గానం: ఆర్పీ.పట్నాయక్, సునీత
నటీనటులు: విక్రమ్ , సూర్యా, సంగీత, లైలా, సిమ్రాన్
దర్శకత్వం: బాలా
నిర్మాత:
విడుదల తేది: 02.04.2004

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసెనే..
తనవారి పిలుపుతో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ.. బంధమంతా వెల్లువైనదీ.. లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటూ లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో
కలిసిన బంధం. కరిగిపోదులే.
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా...

చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..

ఓ... మనసున వింత ఆకాశం మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకుబెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట కోవెల వడి చేరేనా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ. తోడు లేకనే .
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే...

కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసినే..
తనవారి పిలుపులో.. ఆశలు వెల్లువాయనే
ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే...

Palli Balakrishna Monday, December 11, 2017

చిత్రం: బంగారు కుటుంబం (1994)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగేశ్వరరావు , జయసుధ, దాసరి నారాయణరావు, విక్రమ్, హరీష్ , రంభ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: కైకాల నాగేశ్వరరావు
విడుదల తేది: 01.01.1994


అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

తోడునీడ తోటలో తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్నా యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారి పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు విద్దు
పాల మీద మల్లెపూలు
పంచుకున్నా జీవితాలు ప్రేమలో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

బాటసారి యాత్రలో బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోల పాటలో
పుల్లమావిల్లు తీపి తేనె కన్నా
మల్లెపూలేమో ముళ్ళు పక్కలోన
కల్పవృక్షాన్ని నిన్ను కట్టుకున్నా
వంశవృక్షాన్ని నేను పెంచుకున్నా
జంటలైన పావురాలు
కలలుగన్న కాపురాల జోరులో...
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ - ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం

అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం

Palli Balakrishna Tuesday, October 24, 2017

చిత్రం: భీమా (2008)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: ఎ. యమ్.రత్నం, శివగణేష్
గానం: క్రిష్ , నరేష్ అయ్యర్
నటీనటులు: విక్రమ్, త్రిష
దర్శకత్వం: యన్.లింగుస్వామి
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 14.01.2008

ఒక ముఖమొ బహు ముఖమొ
ప్రతి ముఖమొ కలవరమొ
భయమెరుగనిధి తన దెశమూ
తన చుపె చురుకైనదొ
కన్ను సైగ కరుకైనదొ
అలుపెరుగనిది తన దెహమొ
ఒక ముఖమొ బహు ముఖమొ
ప్రతి ముఖమొ కలవరమొ
భయమెరుగనిధి తన దెశమూ
తన చుపె చురుకైనదొ
కన్ను సైగ కరుకైనదొ
అలుపెరుగనిది తన దెహమొ
ద్రుతిలొ తెల్చివెస్తాడు
పిడుగుల జతనె ఉంటాడు
పక్కలొ బల్లెం అవుతడు
ఉప్పెన అతడు…
అదురు బెదురు లెనూడు
అదిరె పనులె చెస్తాడు
తలలె తరిగి వెస్తాడు
నిప్పె అతడు….
అందరు ఉదయానె మెటికలు
విరిచె, కాని ఇతడెమొ తూట పెల్చె
ఒక వైపు ఇతనిది న్యాయం
మరు వైపు ఇథనిది జాలం
జగ జగజం జజంజ జగజం జజంజ
జగిడ జగిడ జగిడ జగిడ జగిడ రగడగ

విప్లవ గీతం నచ్చునులె
నవ్వె మనసె నచ్చునులె
రగిలె జ్వాల నచ్చునులె
రతిరి రెను…
అనుకున్నటె చెస్తాడు
చెసెదెదొ చెపుతాడు
గెలుపె మలుపని అంటాడు
మఘధీరుడు ఇతడు
ఘులబిలు మించె ఇతని అందం
లొలొపలొ చుస్తె ఉరిమె సుగుణం
అరె పొతె పొని అంటు తన
పగనె తింటాడంట
జగ జగజం జజంజ జగజం జజంజ
జగిడ జగిడ జగిడ జగిడ జగ్ జగ


Palli Balakrishna Tuesday, September 26, 2017


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్ , ఇస్రత్ క్వాధ్రి
నటీనటులు: విక్రమ్ , అమీ జాక్షన్
దర్శకత్వం: ఎస్.శంకర్
నిర్మాతలు: వి. రవిచంద్రన్, డి. రమేష్ బాబు
విడుదల తేది: 14.01.2015

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా ...
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
అడ్డొస్తే ఆ ప్రేమైనా చేతుల్తో నరికేయిస్తా
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
పూల తీగల్లో పూచే బంతి భూమినై
నిత్యం నీ చుట్టూ నే తిరిగేస్తూ వుంటా
నీ కలలే కంబళై కునుకే తీస్తా
నీ తనువే నదిగా ఊపిరై పడుంటా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా



********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , నటలే డి లూసియో

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వేన్నీలా..
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా
నా చేతిలో పువ్వల్లే నిలిచే
నును లేతగా నా ముళ్లు విరిచే
నా ప్రియనేస్తం నువ్వే
నీ ముద్దుతో తెలవారుతుందే
నీ శబ్దమే నను మార్చుతుందే
నా గిలి గీతం నువ్వే
కురుల మూలమే తరచి చూడవా
పదును చూపుతో మదిని లాగవా
అధర కేశమే అపహరించవా మనసారా
నా రోమనై.....రా...
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ

కొద్ధి కొద్ది కొద్దిగా నన్నదిమి
ఐలా ఐలా ఐలా చేస్తావా
కొంటె చూపుతో కొల్లగొట్టి
మిణుగురుకు వెల్ల వేస్తావా...
మృదువుగా రుద్దతావా
ముత్యమంతా ఓయా
పువ్వేలేక ఐలా తావి ఔతా
నువ్వొక చిరునవ్వే విసిరావే
పలు నెలవంకలు గల గల దూకెనె
నేల వెలిగేనే యిలా
యిక విద్యుత్ కోతలే రావడమే కల
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నెల

మెల్ల మెల్లగా నిలువెల్లా
ఐల ఐలా పూస్తావా
ఆ కాంతి సోకి
పలు కాకులిక కళ్లు తేలవేస్తాయా
నీలి నింగిలో ఓయా లే మెరుపే ఓయా
రోజా పువులో ఐలా పసి ఎరుపే ఓయా
కలిసిన నవ వర్ణం నీ దేహం నీ అణువణువున
విరిసిన వెలుగులు పువ్వుల మేడలు కదా
యిక తోటల్లోన విసిరినవి వాటికి నీడలు కదా
ఐలా ఐలా ఐ ఐలా ఐలా ఐ
ఐలా ఐలా ఐ మేడి ఇన్ వెన్నిలా
మేఘాలనే మగ్గాలు చేసి
నీలాలనే దారాలు తీసి
నే ఓ వస్త్రం చేశా
ఆ వస్త్రమే నీపైన వేసి
అణ్వస్త్రమే అనిపింపజేసి
నీ వున్మాదం చూశా
చిలిపి రాట్నమై వలపు వడకనా
వుడుకు నూలునై దరికి జరగనా
మరొక చర్మమై మెలిక తిరగనా
పోమాకే నా జీన్ జింకా...రా


********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రేయా గోషల్ ,హరిచరణ్

పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..

అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
కనబడునా మనిషై..
అది జరగదని ఇలా అడుగు వేసిన..
నిన్ను వలచిన మనసై..
ప్రతి క్షణము క్షణము..
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
ఇన్ని కలల ఫలితమున..
కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
నా చేతిని వీడని గీత నువై ..
నా గొంతుని వీడని పేరు నువై ..
తడి పెదవులు తళుకవనా..
నవ్వునవ్వనా.. ఎంత మధురము..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..

నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
నా రాతి గుండెని తాకుతూ..
శిల్పం లాగా మార్చేసిందా..
యుగములకైనా మగనిగా వీణ్ణే..
పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
ప్రతి ఉదయాన తన వదనాన్నే..
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
పూలనే కునుకేయమంటా..
తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..

హే..ఐ అంటే మరి నేనను అర్థము..
తెలిసోయ్ నిన్న మొన్న..
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
ఎద చెబుతుంటే విన్నా..
అయ్యో నాకెదురై ఐరావతమే..
నేలకి పంపిన తెలి కలువై..
తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
పూలనే కునుకెయ్యమంటా..
తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..


********   ********  *********


చిత్రం: ఐ ( మనోహరుడు ) (2015)
సంగీతం: ఏ. ఆర్.రెహమాన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సిద్ శ్రీరామ్ , ఇస్రత్ క్వాధ్రి

వీచే చిరుగాలిని వెలివేస్తా..
హో పారే నదినావిరి చేస్తా..
నేనున్న నేలంతా మాయం చేస్తా...
లేనే లేదే అవసరమే..
నువ్వే నాకు ప్రియవరమే..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..ఊపిరిగా..ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా..నా జతగా..
నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా..నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..

నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ..
ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ..
నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా..
నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా..
నువ్వుంటే నా జతగా...
ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా..
అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా..
సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా..
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా..
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా..
పువ్వుల్లోని తేనె పురుగులకందునా..
మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా..
బూచినే చూసిన పాపనై బెదిరా..

నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ...
నేనుంటా ఊపిరిగా..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
నువ్ లేని లోకంలో నే బ్రతక లేనే ..
నువ్వుంటే నా జతగా...

Palli Balakrishna Saturday, July 29, 2017


చిత్రం: మల్లన్న (2009)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: విక్రమ్, సుచిత్ర కార్తీక్‌కుమార్
నటీనటులు: విక్రమ్ చియాన్, శ్రేయా శరన్,
దర్శకత్వం: సుశీ గణేషన్
నిర్మాత: కలై పులి యస్. ధను
విడుదల తేది: 21.08.2009

ఎక్స్‌క్యూజ్ మ
ఎక్స్‌క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ కాఫీ తాగుదాం ఆవోనా
హాటా కోల్డా నువ్వే తాకి చూడు... పోవే పోవే

ఎక్స్‌క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న
ఓ లాంగ్ డ్రైవ్ పోదాం ఆవోనా
స్లోవా స్పీడా నువ్వే తోలి చూడు... పోవే
ఒట్టి సిమ్ కార్డు ఎంప్టీ ఐ ప్యాడ్
నిన్ను స్విచ్ ఆన్ చెయ్యడమే వేస్టు
హచ్ బుల్ డాగ్ పిచ్చి పీకాక్కు
నాకు టచ్చివ్వకుంటేనే సేఫు
ఎల్ బోర్డు రేయ్ ఎల్ బోర్డు
ఎప్పుడెక్కుతావ్ మెయిన్‌రోడ్డు

పోవే పోరా పోవే పోరా (2)
పోవే పోరా పోవే పోరా పోవే పోరా పోపోపో

ఎక్స్‌క్యూజ్ మీ మిస్ సుబ్బలచ్చిమి
యువర్ యాక్టివిటీస్ ఆర్ తప్పు లచ్చిమి
నీ మాటా తీరూ కుప్పే గొప్ప లచ్చిమి... పోవే

చరణం: 1
ఏయ్ మల్లన్న నీ స్టయిలే చూసి థ్రిల్ అయ్‌నా
నా అందం చూసి
నీ మనసులో బెంగైనా ఛీ బెట్టేనా
నీ అందం వల్ల కాదు నీ హింస వల్ల చిత్తయినా
నీ చేతికి మాత్రం చిక్కుతానా
జగమేమాయన్నాడా వేమన్న
ప్రేమే లేదన్నాడీ మల్లన్న
అబ్బ అబ్బ అబ్బ పెద్దలు అన్నారబ్బా
కామిగాకా మోక్షగామి మనిషే కాలేడబ్బా
డబ్బా డబ్బా డబ్బా పోవే పోపుల డబ్బా
రోజూ నీతో బౌ బౌ అంటే లైఫే నాకు దెబ్బ
హిట్లర్ కూతురా హిట్లర్ కూతురా
ప్రేమ ఊదరెట్టి నన్ను చంపొద్దే
లింకన్ తమ్ముడా లింకన్ తమ్ముడా
వేదాంతం చెప్పమాకు ఈ పొద్దే
కాశ్మీరా కృష్ణానీరా ఇది తేలని తగరారా

చరణం: 2
ఏయ్ ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావ్
ఏం చెయ్యనివ్వట్లేదే
నువ్వు చదువుకున్నదానివే కదా
నిన్ను చదవడం రావట్లేదే
హెయ్ తప్పుకో నువ్వు ఒప్పుకో
ఇదిగో చూడు మంచి మూడ్ అయ్యో...
చేదా చేదా చేదా నా మాంటటేనే చేదా
నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ
హెయ్ పోదా పోదా పోదా నాపైన ఆశే పోదా
గరల్స్ వెంట గైసే పడితే
చాప్టర్ క్లోజే అయ్‌పోదా
ఉప్పు మూటలా ఉప్పు మూటలా
లైఫ్ లాంగ్ నిన్ను నేను మోస్తాలే
ఓ లొట్టిపిట్టలే లొట్టిపిట్టలే
వందరెట్లు నీకన్నా అందగత్తెలే
రమ్మంది ఈ రాకుమారి ప్లీజ్ రారా ట్రాక్ మారి

నీ లిప్పు హిప్పు చాలా చప్ప లచ్చిమి




********  *******   ********



చిత్రం: మల్లన్న
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: మాలతి, కృష్ణ అయ్యర్

పచ్చగడ్డి కోసేటి...  పడుచు పిల్లనీ
నా పైటకొంగు జారేటి గడుసు పిల్లనీ
పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్
పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్ పచ్
పచ్చగడ్డి కోసేటి ... పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా

హే నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి
నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి
పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి
హే పట్టు పట్టు పట్టు పట్టు పట్టు సుందరీ
నువ్వు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు నీ కొబ్బరి
నాపే నాపే నాపే నాపే నాపే
నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా

ఓ ఓ ఓ జిగి బిగి పళ్ళల్లోనా నీ స్ట్రాబెరి
ఇంగ్లీష్ మాసాల్లోన చలి జనవరి
పచ్చగడ్డి కోసేటి పచ్ పచ్ పచ్
గల గల నదులల్లోన గోదావరి
మాంసాహారాల్లోన కుందేల్ కర్రీ
పచ్చగడ్డి పచ్చగడ్డి పచ్చ పచ్చ పచ్చ
హే... చీరే కట్టి చిచ్చే రేపే కన్యా లాహిరి
నా అందం తోటి అందం చూపే ఆంధ్రా ఆవిరి
నాపే నాపే నాపే నాపే నాపే
నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
ఓకే బాస్ నౌ లెట్స్ లిజన్ టు ధ రిథమ్ అఫ్ ఆంధ్రా

హాఁ ముద్దుల క్రికెట్ లో నీ సెంచిరి రాతిరి రసవిందులో రతి జాంగిరి
పచ్చగడ్డి కోసేటి  పచ్చ పచ్చ పచ్చ
మొహా శాస్త్రాలలో కసి లైబ్రరీ కామసూత్రాలలో తొలి దస్తూరి
పచ్చగడ్డి పచ్చగడ్డి పచ్చ పచ్చ పచ్చ
నే తేనెలు నెయ్యితో రుద్దిన బెంగాల్ కేసరి
నా కళ్ళల్లోనే కత్తులు దాచిన పిల్లా పోకిరి
నాపే నాపే నాపే నాపే నాపే
నాపేరు మీనాకుమారి నాఊరు కన్యాకుమారి
పోదామా జట్కా సవారీ చేద్దామా జల్సా కచేరి
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ ఓ పిల్లా
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓ పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ ఓ పిల్లా
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా ఓ పిల్లా




********  *******   ********




చిత్రం: మల్లన్న
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: రీటా

పల్లవి :
Yo Come on everybody its time to roll lets welcome the Indian girl
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం: 1
ఇండియా పిల్లే ఇంగో ఇటాలీ కళ్లే స్వింగో
నేను ఓ మెరుపుల మాంగో పరువంలో ఫ్లెమింగో
హే మేనులో మాగ్నెట్ పొంగో మాటలో చాక్‌లెట్ భంగో
నేనొక కరెంటు రింగో తాకితే తల తిరిగింగో
రెడ్ వైన్ బాటిల్ నే కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజెల్ నేనే
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం: 2
ఆడదాం టాంగో టాంగో అదరనీ కాంగో భంగో
జీవితం షార్టో లాంగో తిప్పేద్దాం స్టీరింగో
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
పాడదాం సాంగో సాంగో తోడుగా సింగో సింగో
అడుగులే రైటో రాంగో నడిచేస్తే థ్రిల్లింగో
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
స్పేసే దాటేసే స్పైసీ డాన్సేస్తే స్కైసే స్టెప్సేయవా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం: 3
ఆశలే ఒకటో రెండో హద్దులే ఉండవు లెండో
ఈ కళ్ళు రెండూ విండో మూసేదెందుకు ఫ్రెండో
మెరుపులో బెండుందండో నెలవంక వంకరదండో
అన్నోడు పిచ్చోడండో అందాన్నే చూడండో
నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default