Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gopala Krishnudu (1982)



చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: నాగేశ్వరరావు, జయసుధ, రాధ
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి 
నిర్మాత: భీమవరపు బుచ్చిరెడ్డి 
విడుదల తేది: 29.06.1982



Songs List:



అమ్మచాటు పిల్లాడ్ని పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

అమ్మచాటు పిల్లాడ్ని 




బంతుల సీమంతం పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

బంతుల సీమంతం 



అందాల రాధిక పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 


పల్లవి:
అందాల రాధికా.. నా కంటి దీపికా
నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా
చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
చందామామ పోలికా.. అందమివ్వు కానుకా 

గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా
వ్రేపల్లే వీధిలో వెంటాడే కిష్టుడా
వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా
వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా

చరణం: 1 
వయసు వేయదు వాయిదాలను.. 
వలపు కలపక తప్పదులే
అసలు తీరదు ఇతర పనులకు.. 
ముసురుకున్నది మనసేలే
కనులకు మాటొచ్చి కౌగిలి ఇమ్మంటే..
కౌగిలిలో గాలి.. వడగాలౌతోంటే
కలవమన్నవి.. కలవరింతలు
విచ్చలవిడిగా వెచ్చని ఒడిలో.. 
ఈ ప్రేమ గుడిలో.. పరువాల సడిలో...

అందాల రాధికా..అహహ..హా
నా కంటి దీపికా..అహహ..హా

వ్రేపల్లే వీధిలో వెంటాడే కిషుడా
వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా 

చందామామ పోలికా.. అందమివ్వు కానుకా

చరణం: 2 
ఎండ వెన్నెల దండలల్లెను... 
గుబురేగిన గుండెలలో..
అక్కడక్కడ చుక్క పొడిచెను... 
మసక కమ్మిన మనసులలో
సనసన జాజులలో.. సణిగిన మోజులలో
కలబడు చూపులలో... వినబడు ఊసులలో
పలుకుతున్నవి చిలక పాపలు
చిక్కని చలిలో చక్కిలిగిలిగా.. 
ఈ తీపి సొదలే.. ఈనాటి కథగా

గోపాలకృష్ణుడా.. గోపెమ్మకిష్టుడా
వ్రేపల్లే వీధిలో.. వెంటాడే కిష్టుడా
వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా
వెన్నెలమ్మ చాటుగా.. వేణూవైన బాలుడా

అందాల రాధికా.. నా కంటి దీపికా
నాకున్న కోరికా.. నువ్వేనే బాలికా
చందామామ పోలికా.. అందమివ్వు కానుకా
చందామామ పోలికా.. అందమివ్వు కానుకా





జ్ఞాపకం ఉన్నదా పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
జ్ఞాపకం ఉన్నదా... ఆ తీయని తొలి రేయి
జ్ఞాపకం ఉన్నదా...
జ్ఞాపకం ఉన్నదా...
ఆ తీయని తొలి రేయి... 
తొలి జాముకు తరువాయి
మల్లెని పిల్లని మాయనే చేసినా సంగతి... 

జ్ఞాపకం ఉందిలే...
జ్ఞాపకం ఉందిలే...
ఆ తీయని తొలి రేయి... 
తొలి జాముకు తరువాయి
తప్పని అన్ననీ ... తప్పని చెప్పనీ శ్రీమతి

చరణం: 1 
కిటికీలో చందమామా...  
చిటికడంత నవ్వుతు ఉంటే
గదిలో వయ్యారి భామ...  
పులకరింత రువ్వుతు ఉంటే

పంచుకునే పాల మీద... 
వణికే మురిపాల మీద
మిసిమి మీగడలు కొసరి అడిగితే... 
కసరు చూపుతో కానుకలిచ్చిన నా చెలి
నీ చలి నా గిలి తీరినా తీరనీ కౌగిలీ....

జ్ఞాపకం ఉన్నదా...
జ్ఞాపకం ఉందిలే...
ఆ తీయని తొలి రేయి... 
తొలి జాముకు తరువాయి

చరణం: 2 
లేత నడుము చేతికి తగిలి... 
ఉన్న కథను చల్లగ చెబితే
ఉలికి పడ్డ ఉలిపిరి కోక 
ఉండి కూడా లేనంటుంటే

పంచుకునే పానుపు మీద...  
పరిచే పరువాల మీద
అగరు పొగలలో..  పొగరు వగలతో...  
సగము సగముగా జతకు చేరినా రాతిరీ...
ఇద్దరి సందడి...  వినబడి నవ్వినా జాబిలీ...

జ్ఞాపకం ఉన్నదా...
జ్ఞాపకం ఉన్నదా...
ఆ తీయని తొలి రేయి... 
తొలి జాముకు తరువాయి
మల్లెని పిల్లని మాయనే చేసినా సంగతి

జ్ఞాపకం ఉందిలే...
జ్ఞాపకం ఉందిలే...
ఆ తీయని తొలి రేయి... 
తొలి జాముకు తరువాయి
తప్పని అన్ననీ ... తప్పని చెప్పనీ శ్రీమతి





గోదారి గట్టంట పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
అరే...గోదారి గట్టంట.. వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ..ఏం సొగసో.. ఏం వయసో..  

గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు

అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అహా.. ఎంత గడుసో..ఏం మడిసో.. 

చరణం: 1
బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. 
బెంగపడిపోయానే ఓలమ్మీ
బేరమాడ వచ్చానే ఓలమ్మీ.. 
బెంగపడిపోయానే ఓలమ్మీ
ముద్దు నాకు ముదిరెనే... 
నిద్దరంత కరిగెనే...

రాత కొద్ది దొరికినాడే.. 
రాతి గుండె కదిపినాడే
పూటపూటకు పూతకొచ్చిన 
పులకరింత గిల్లినాడే 

అబ్బ... ఏం మడిసో... ఏం వరసో..
అహా.. ఏం వరసో...ఏం మడిసో.. 

అహ..గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహ.. ఎంత గడుసో..ఏం మడిసో.. 

చరణం: 2
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..
పుట్టుమచ్చలాంటివోడే నా సామీ
పచ్చబొట్టులాంటి వోడె నా సామీ..

పట్టుకుంటే వదలడే... 
చెరుపుకుంటే చెదరడే..
వయసులాగా వచ్చినోన్నే.. 
వన్నెలెన్నో తెచ్చినోన్నే
ఈల వేసిన గోల పాపల 
కోలకళ్ళకు మొక్కినాన్నే...

అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా...ఏం సొగసో..ఏం వయసో..

గోదారి గట్టంట నా దారినెళుతుంటే
పూల బేరమాడేనమ్మ పూలరంగడు
రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే
దొండపండు దోచెనమ్మ దొంగరాముడు

అబ్బ... ఏం మడిసో.. ఎంత గడుసో..
అబ్బ.. ఎంత గడుసో..ఏం మడిసో..

గోదారి గట్టంట వయ్యారి పిట్టంట
రివ్వుమంటే జివ్వుమంది నాకు మక్కువ
ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో
చీరకొక్క మూర తప్ప ఏమి తక్కువ
అబ్బ.. ఏం వయసో... ఏం సొగసో..
అహా..ఏం సొగసో.. ఏం వయసో..




గుడిలోపల దైవమా పాట సాహిత్యం

 
చిత్రం: గోపాలకృష్ణుడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

గుడిలోపల దైవమా 

Palli Balakrishna Thursday, April 14, 2022
Prathibimbalu (1980)



చిత్రం: ప్రతిబింబాలు (1980)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వరరావు, జయసుధ
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి
విడుదల తేది: 1980



Palli Balakrishna
Manchi Rojulu Vachayi (1972)



చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కృష్ణం రాజు, కాంచన, అంజలీదేవి , గీతాంజలి 
అసోసియేట్ డైరెక్టర్: ఎ.కోదండ రామిరెడ్డి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: యస్.యస్.బాలన్
విడుదల తేది: 1972



Songs List:



పదరా ! పదరా! పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
పదరా ! పదరా!
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్థపరుల
అడుగడున తరిమికొట్టి పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 1
కలిగినోళ్ళ జులుములింక సాగవురా ! 
వాళ్ళ దోపిడీలు, దురంతాలు చెల్లవురా
కార్మికులు - కర్షకులు, పీడితులు, తాడితులు
సంకెళ్ళను తెంచుకు సాగాలిరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 2
ఒళ్ళువంచి పని చేయని వాళ్లు ! 
పరుల నోళ్ళు కొట్టి బతికే గొప్పోళ్ళు
పెట్టెలో దాచుకున్న పుట్టెడు ధన రాసులను
పదుగురికి పంచుదాము పదరా
సమభావం పెంచుదాము పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా





సిరిపల్లె చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి: 
సిరిపల్లె చిన్నది
చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే
చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో - భయమేస్తున్నది

చరణం: 1
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో
పుటిన బుజ్జాయి
నిన్నటిదాకా పరికిణి కట్టి
తిరిగిన పాపాయి
బస్తీ మకాము పెట్టి -- బడాయి నేర్చుక వచ్చి
బుట్టబొమ్మలా గౌను వేసుకొని
పోజులుకొడుతూ ఉన్నది

చరణం: 2
ఇప్పుడిప్పుడే లండను నుండి
దిగింది దొరసాని
వచ్చీరానీ ఇంగిలీసులో
దంచుతోంది రాని
రేగిందంటే ఒళ్ళు పంబ రేగేనంట
అబ్బ తా చుపాములా పడగ విప్పుకొని
తై తై మన్నది

చరణం: 3
సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు
నల్లని అద్దాలెందుకు
తేనెలు చిలికే తెలుగు ఉండగా
ఇంగిలీసు మోజెందుకు
నోరు ముచిదైనప్పుడు  ఊరు మంచిదే ఎప్పుడు 
తెలుసుకోలేని బుల్లెమ్మలకు - తప్పవులే తిప్పలు



ఎగిరే గువ్వ ఏమంది ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పలవి:
ఎగిరే గువ్వ ఏమంది ?
విసిరే గాలి ఏమంది ?
ప్రకృతిలోన స్వేచ్ఛకన్న
మిన్న లేనే లేదంది

చరణం: 1
పూల కెందుకు కలిగెనే ఈ ఘుమ ఘుమలు
ఈ మధురిమలు
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు
ఈ అమరికలు
స్వేచ్ఛకోరే మనసువుంటే
పొందలేనిది యేముంది

చరణం: 2
కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు
సరాగములు
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు
ఈ స్వరజతులు
స్వేచ్ఛకోరే మనసువుంటే
నేర్వలేనిది యేముంది

చరణం: 3
శిరసు వంచక నిలువనా గుడి గోపురమై
గిరి శిఖరమునై
అవధులన్నీ దాటనా ప్రభంజనమై
జలపాతమునై
స్వేచ్ఛకోరే మనసునాది
ఇంక నా కెదురేముంది





ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల అండ్ కోరస్

సాకి !
ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ
బీదసాదల కెల్ల ప్రియమైన పండగ

పల్లవి: 
ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ!

ఎవ్వరేమి అనుకున్నా
ఎంత మంది కాదన్నా
ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే
సోషలిజం వచ్చే రోజు - దగ్గరుందిలే

చరణం: 1
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే 
ఈ మేడలు కొద్ది మందికే స్థిరము కావులే
ఓడలు బండ్లై  బండ్లు ఓడలై
తారుమారు ఎపుడైనా తప్పదులే తప్పదులే

చరణం: 2
ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు
పిల్లులాగా తోక ముడుచుకొని మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక - కుక్కిన పేనై
చాటుగా నక్కుతారు - చల్లగా జారుకుంటారు



నేలతో నీడ అన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది

చరణం: 1
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా ?
తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే

చరణం: 2
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు, మనిషి లేడు, మనుగడయే లేదులే

చరణం: 3
అంటరాని తనము- ఒంటరి తనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం, సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం - తెలియకుండా మీ ఖర్మం 



మంచిరోజు లొచ్చాయి పదరా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, సుశీల అండ్ కోరస్

పల్లవి: 
పదరా - పదరా
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్ధపరుల
అడుగడుగున తరిమి కొట్టి - పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 
చెమటోడ్చి పనిచేయని సోమరులకు చోటు లేదురా
పదుగురితో కలిసి రాని బాబులకిక బతుకు లేదురా
గునపమెత్తి - సుత్తిపట్టి
కొండలనే పిండికొట్టి
నదులను మళ్ళించుదాము పదరా  రతనాలను పండించుదాము పదగా
మంచిరోజు కొచ్చాయి పదరా





ఎందుకే పిరికితనం పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :
ఎందుకే పిరికితనం
చాలునే కలికితనం
రా - తెంచుకొని రా - తెలుసుకొని రా !
బంధనా లెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం: 1
పెళ్ళంటే ఒక ఒప్పందం - అది
కోరేదే అనుబంధం
ఆ అనుబంధం లేనినాడు
మనువూ, మనసూ కలవని నాడు
మంగళ సూత్రమె ఉరితాడు - ఉరితాడు - ఉరితాడు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా!
పంజరా లెందుకు- ఎందుకు - ఎందుకు!

చరణం: 2
మాంగల్యమే సతీమణి ప్రాణమందురే
పసుపు, కుంకుమ పడతి సౌభాగ్యమందురే
సౌశీల్యమే మగువ సహజ గుణమందురే
సహనమే స్త్రీ జాతి మూలధనమందురే

చరణం : 3
నువు చెప్పేది పాతపురాణం
నువు మెచ్చేది కొత్త సమాజం
స్వార్థపరులూ సౌఖ్యం కోసం
చల్లని సూక్తులు వల్లించి 
జాతికి వేసిరి సంకెళ్ళు - సంకెళ్ళు - సుకెళ్ళు
తెంచుకొని రా - తెలుసుకొని రా
ఉక్కు తెరలెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం : 4
ఈ తాళి ఏ రీతి విడనాడనే ?
ఎటుల ఈ సంఘాని కెదురీదనే ?
పది మంది నను చూచి పకపకా నవ్వరా !
నా పేరు, నా పరువు గంగలో కలపరా?

చరణం: 5
నీ నరాల నిండా పీరికి మందు
అరె కలేజ వుంటే ఉరుకుముందు
రాజ్యాలైనా రాకెట్లయినా
రమణులు నడిపే ఈ రోజులో
ఇంకా యెందుకు - వాదనలు - వేదనలు - రోదనలు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా
భంధనాలెందుకు ఎందుకు ఎందుకు




యెక్కడికమ్మా ఈ పయనం ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి: 
యెక్కడికమ్మా ఈ పయనం ?
యేమిటి తల్లీ నీ గమ్యం?
చెదరిన హృదయముతో
చెమరిన కన్నులతో

చరణం: 1
కన్న ఇంటిలో చోటేలేదు
ఉన్న ఇంటిలో సుఖమే లేదు
చిరునవ్వులతో వెలిగే బ్రతుకే
చీకటి పాలై పోయెనులే

చరణం: 2
తెలియక చేసిన చిన్న నేరమే
కలకాలం నిను వెంటాడాలా ?
మమతలు చూపి మన్నించవలసిన
పతియే నీ పై పగబూనాలా ?

Palli Balakrishna Wednesday, April 13, 2022
Mugguru Mitrulu (1985)



చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, సుశీల, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్  సుహాసిని, సుమలత, తులసి
దర్శకత్వం: రాజాచంద్ర 
నిర్మాణ సంస్థ: జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్
నిర్మాతలు: డి.కిషోర్,  మురళీమోహన్
విడుదల తేది: 1985



Songs List:



ఒకటే ఆరాటం పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

ఒకటే ఆరాటం 




సంబరాల సంబరాల సంక్రాంతి పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్ 

సంబరాల సంబరాల సంక్రాంతి 



నీ పూల పైటలో పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

నీ పూల పైటలో 




60 ఏళ్ళకు వసంతమ పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

60 ఏళ్ళకు వసంతము



సంధ్యారాగం సరిగామలెన్నో పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

సంధ్యారాగం సరిగామలెన్నో 




చంపకు చేరెడు నీ కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

చంపకు చేరెడు నీ కళ్ళు 

Palli Balakrishna Tuesday, April 12, 2022
Korukunna Mogudu (1982)



చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి (All)
గానం: సుశీల, జానకి, యస్.పి. బాలు
నటీనటులు:  శోభన్ బాబు, జయసుధ, లక్ష్మి
మాటలు: కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: జాగర్లమూడి రాధకృష్ణ మూర్తి
విడుదల తేది: 12.06.1982



Songs List:



చిలకమ్మా గోరింక పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

చిలకమ్మా గోరింక 





డూ డూ డూ డూ బసవన్న పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: జానకి , యస్.పి.బాలు

డూ డూ డూ డూ బసవన్న 



చిలిపి చిన్నారి కృష్ణుడు పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: మాధవపెద్ది రమేష్ , పి. సుశీల 

చిలిపి చిన్నారి కృష్ణుడు





కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

కోరుకున్న మొగుడు నే కోరుకున్న మొగుడు




చిలకమ్మా గోరింక (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

చిలకమ్మా గోరింక  (Sad Version)




వినుడు వినుడు రామాయణ గాధ పాట సాహిత్యం

 
చిత్రం: కోరుకున్న మొగుడు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల , యస్.పి.బాలు

వినుడు వినుడు రామాయణ గాధ 


Palli Balakrishna
Mister Vijay (1984)



చిత్రం: మిస్టర్ విజయ్ (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, వేటూరి, జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల, శైలజా
నటీనటులు: శోభన్ బాబు, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె. చటర్జీ
విడుదల తేది: 01.01.1984



Songs List:



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna
Sisindri Chittibabu (1971)



చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
నటీనటులు: శోభన్ బాబు, శారద 
దర్శకత్వం: అక్కినేని సంజీవ రావు 
నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
విడుదల తేది: 1971



Songs List:



ఓ ఓహో జాంబియా వగలమారి జాంబియా పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, ఘంటసాల

ఓ ఓహో జాంబియా వగలమారి జాంబియా




అమ్మా అమ్మా అమ్మా ముళ్ళు గుచ్చుకున్నాది బావా పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

అమ్మా అమ్మా అమ్మా  ముళ్ళు గుచ్చుకున్నాది బావా 




ఓ అమ్మలారా అయ్యలారా పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు 
గానం: జిక్కీ 

ఓ అమ్మలారా అయ్యలారా 





చిట్టిబాబు చిన్నారి బాబు పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: సుశీల 

చిట్టిబాబు చిన్నారి బాబు 



చలో చలో చంగు చంగుమని పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: కొసరాజు 
గానం: జిక్కీ 

చలో చలో చంగు చంగుమని 



వస్తా వెళ్ళొస్తా పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: సుశీల , ఘంటసాల

వస్తా వెళ్ళొస్తా




ఏలే ఏలే హైలెస్సా పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: ఘంటసాల

ఏలే ఏలే హైలెస్సా




బాలలార రండి పాట సాహిత్యం

 
చిత్రం:  సిసింద్రి చిట్టిబాబు (1971)
సంగీతం: టి.చలపతి రావు 
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: జిక్కీ

బాలలార రండి 


Palli Balakrishna Friday, April 8, 2022
Bangaru Sankellu (1968)



చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
నటీనటులు: హరనాథ్, జమున, జి. వరలక్ష్మి
దర్శకత్వం: గుత్తా రామినీడు
నిర్మాత: వి. సత్యన్నారాయణ
విడుదల తేది: 01.11.1968



Songs List:



అందం ఉరికింది పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల 

అందం ఉరికిందీ 
వయసుతో పందెం వేసింది.
మనసులో బందీ అయింది
ఇదేమి బంధం అంటుంది 
అందాలొలుకు చంద్రుని అందుకోవాలనుకొని 
ఎగసే అలలు తెలిపే దేమని ?
రోహిణి : ఏమని?
రవి : జగమంతా ప్రేమ బంధం
సొగసంతా నీది నీదే రారమ్మని !
రోహిణి : విరిసే నిండు జాబిలి కడలి పూచిన పూవులే
ఎగసే అలలబాల అదే కడుపున సంటలే
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం .....
రవి : ఎదిగే మావి కొమ్మల కౌగలించాలనుకొని
ఒదిగే మాధవీలత వలపు పిలుపే యేమని?
రోహిణి : ఏమని?
రవి : తనలోనే కరిగి పొమ్మని
తనువంతా నీదినీదే రా రమ్మని !
రోహిణి : ఎదిగే గున్న మావిని పుడమితల్లే కన్నది
ఒదిగే మాధవీలత తోడబుట్టిన చిన్నది
అది అన్నా చెల్లి బంధం
హృదయాల జన్మ జన్మల అనుబంధం ..




ఆడితప్పని వాడని (పద్యాలు) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు, సుమిత్ర, అప్పారావు  

హరి:
ఆడితప్పని వాడని యశముగాంచ
అఖిల రాజ్యమ్ము విడనాడి - ఆలి నమ్మి
కడకు నన్నమ్ముకొన వీధి బడితి నేడు
భానువంశ హరిశ్చంద్ర ప్రభుడ నేను -
నన్ను కొనరండి ! రండి  కొనండి! రండి 

నక్షత్ర : 
కొండంత యేనుగు కుంభస్థలము మీద
తాడియంత మనిషి తాను నిలిచి
రత్నమొకటి నింగి రయ్యని విసిరిన
ఎంత దవ్వుపోవు, అంత ఎత్తు ధనము
కుప్పపోసి వీని కొనగవలయు .

వీర : 
తొలగండె హె బాబు .. తొలగండెహె!
సిన్నోల్లో పెద్దోల్లో - తొలగండె హె !
మందు మీదున్నాను  మత్తెక్కి వున్నాను మక్కిలిరగదన్నేను 
ఏపాటి  ఓళ్లైనా ఏనాటి ఓళ్లైనా
ఎప్పటికో అప్పటికి చేరేటి చోటికి
ఆ కాటికి - వల్ల కాటికి కాపరిని - యీరబాహువుని...




ఎవరికి పుట్టిన పాప పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల 

ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా యీ పాప
శాపానికి ప్రతిశాపమా. పుణ్యానికి మణి దీపమా
నెత్తుట తడిసిన యీ చేతులతో
నీకు పాలు పట్టేనా? పాపా ! నేను పాలు పట్టేనా ?
నిప్పులు చెరిగిన యీ గొంతుకతో
నీకు జోల పాడేనా, పాపా !   నేను జోల పాడేనా ?

లాలీ  జోగో లాలీ 

ఎన్ని గండములు ఎదురౌతున్నా
నిన్ను వదలు కోగలనా  పాపా !
నిన్ను మరువ గలనా
కరచిన పాము కోరలు తీయక
కన్ను మూయగలనా  పాపా !
కన్ను మూయగలనా |

లాలీ  జో లాలీ




చతురాశాంత పరీత (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: కొండల్రావు

చతురాశాంత పరీత భూరి వసుధన్ శాసించు చిహ్నంబుగా
క్షితి రాజిల్లేడు రాజదండము బదుల్ చేతనే రహించెన్ గదా,
చితిలో కాలేడు కాష్టమంచు నకటా ! చింతించకన్ సాహసో
ద్ధతి, సత్కీర్తి గణించి, మించి, ఘన సత్యశ్రీని కాపాడుమా 




చిన్నవాణ్ని చూడగనే పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల

చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే 
రాగాలు సాగెనే మొహాలు మూగెనే
అవేనే శృంగార శృంఖలాలు బంగారు సంకెలలు 

నూనూగు మీసమూ జానైన వేసమూ
వానిగని, వాని విని మనసు జారి పోయెనే 
దినుసె మారి పోయెనే  ఏమేమో ఆయెనే
దీపముగని మిణుగురులు  రూపముగని కన్నియలు 
ఒళ్లు మరచి పోయారే ఒళ్ళోవాలి సోలేరే 
అది ప్రేమే అంటావా ? కాదే, అది కామమే 
నాలో వగ మొదలాయె  అది గోదావరి వరదాయె
పరువముతో రొమ్ము చరచి చొరవగాను చేరగనే
ఆ కోడెగాని చూపులలో అది యేమో తోచెనే
ఒక్క నెమలి కన్నులో ఎన్ని వన్నె చిన్నెలో
యువకుని ఒక భంగిమలో అన్ని కళలు మెరయునే 
పెళ్లిగాక ఆ ప్రేమల సంగతికే పోరాదే పోరాదే



మనసైన నాసామి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

మనసైన నా స్వామి రాడేలనే !
నా మదిలోని నెలరాజు లేడేలనే !
జిలిబిలి నవ్వులు చిలికినవాడే
వలపే తానై  పిలిచిన వాడే
నంద శోరుడే నా వగ కాడే
వేణుగాన ఝరిలోన ముంచెనే
నితాంత లతాంత వసంత వేళల
మరులు గొలిపినాడే - మరచినాడే
దరికిరాడే - మగువరో

అల్లరి గాలి చల్లగ వీచె
సిగలో పూలె నగవులు దాచే
విరివిలుకాడె తరుణము వేచె
పొంచి పొంచి పులకించి మించి
బిరబిరాన వరాల శరాలు దూసె

కలల బరువు పెరిగె - నిదుర తరిగె
రేయి కరిగె చెలియరో ...






రండయ్యా రండయ్యా (బుర్రకథ) పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
నిర్వహణ: రాఘవకుమార్ అండ్ పార్టీ విజయనగరం.

క్రిష్ణ వేణి : 
రండయ్యా ! రండయ్యా !
పిన్నలు పెద్దలు రారండయ్యా: ఎన్నడు వినని ఎన్నడు కనని
మహా ద్రోహి కధ వినరండీ ! ప్రజలే రాజ్యం చేసే రోజులు
ప్రజలే తీర్పును చెప్పాలి,  ప్రజలే న్యాయం చెయ్యాలి..

వంతలు : 
రండయ్యా  రండయ్యా  పిన్నలు పెద్దలు రారండయ్యా !

క్రిష్ణ వేణి : ఊరుకు పట్టిన గ్రహచారం  ఘోరకలీ ! ఘోరకలీ !
వచనం : కధకాదు, కట్టుకథకాదు, ఉట్టుట్టి కథకాదు !
ఊరికి నడి బొడ్డున నడిచిన మహా పాపికధ !

వంతలు : రండయ్యా  రండయ్యా   పిన్నలు పెద్దలు రారండయ్యా

క్రిష్ణ వేణి : ఖూనీల్ చేసిన పాపం పోవగ - చందాల్తో గుడి కట్టిస్తాడు 
కుప్పలు కాల్చిన పాపం పోవగ అన్న దానములు చేయిస్తాడు
మగువల చెరచిన పాపం పోవగ పూజలు భజనలు చేయిస్తాడు
పొగిడే వారిని చేరదీస్తడు తెగడు వాని పై తుపాకి తీస్తడు

వంతలు : అమ్మలారా వినుడీ ! యీ అన్యాయము గనుడీ !

క్రిష్ణవేణి : రావణుని మించేటివాడు - కీచకుని తలదన్ను వారు
కామ క్రోదాలతో వాడు కన్నె పడచుల చరచువాడు,
ముందు నీతులు చెప్పి - వెనక గోతులు తీయ పెద్ద మనిషిని తెలుసుకొండయ్యా 
ఆ పెద్ద మనిషికి సోదరా - ఇద్దరు నమ్మిన బంట్లురా
బుద్ధిలేని ఒక కుంటి నక్కరా  - బుర్రలేని ఒక గడేకారిరా 
పైసా కోసం ఫలహారంగా - పచ్చగడ్డినే తింటారా !

వంతలు : భళానంటి భళి తమ్ముడా - మేల్ భళానోయ్ దాదానా !
క్రిష్ణ వేణి వచనం : ఈ బలగంతో ఆ పెద్ద మనిషి సాగించిన దురంతాలు ఎట్లాంటి వనగా
ఎడ్ల పందెం వేయదలచి - పేద రైతును కోరి పిలిచి
పందెమందున ఓడిపోయి - పౌరుషంబున పగలబడ్డాడా
పగబట్టి పామై బుసలు కొట్టాడా !
పరువు నిలవదని గడేకారినే - రయమున పిలిపించె
దొంగ చాటుగా రైతు కొంపకే - అగ్గిని పెట్టించే !
కణకణ మండే మంటల - రైతు కనుల జూచినాడా
ఇంట సావిడిని పందెపు బెడ్లు - యిరుకున బడ్డాయి
వాటి రక్షణకు తెగించి రైతు - మంటల దూకాడా!
పేరు మోసిన పందెపు టెడ్లు పేద రైతుకూడా
భగ భగ పొగ లెగ జిమ్మే మంటల బూడిద అయినారా !
ఆ గ్రామానికి ఏమి వచ్చినా - పెద్ద మనిషియే గతి అన్నట్టు
పిల్లల నిద్దరి సాకే బాధ్యత - పెద్ద మనిషి కే కైవశమయ్యిందా !
 అనాధలకు ఆశ్రయమిచ్చిన పెద్దమనిషి 
ఆ కన్నెపై తాను - కన్నేసి వున్నాడా !
ఇంట నెవ్వరులేని - అదునుకై జూచాడా
చీకటే ముసిరింది - కోరికే రేగింది.
క్రూరంగా చెరబట్టి  ఘోరమే చేశాడా
అతి నేరమే చేశాడా

వచనం : పాపం ! ఆ దురదృష్టవంతురాలు 

కృష్ణవేణి : మానం పోయిన ప్రాణ మేలయని
వంతలు : రామరామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : ఆత్మహత్యకై సాహసించగా
వంతలు : రామ రామ శ్రీరామ రాఘవా !
కృష్ణవేణి : గడేకారి గని రక్షించెను - ఆ దీనురాలినండీ !
వచనం : విపరీతం, విడ్డూరం అన్నట్టు - యింకా ఏం జరిగింది .
కృష్ణవేణి : పెద్ద మనిషి చెరపట్టగా - కన్య గర్భవతి ఆయెరా !
నెలలు నిండి ఒక బిడ్డనుగని  - తా  కన్ను మూసెనయ్యో :
వంతలు : జాలిగుండెగల సోదరా! - యీ కరుణ గాధనే విన్నావా !
విషాద గాధనే విన్నావా !
వంతలు వచనం : మరి ఆగడేకారి పసి బిడ్డను ఏం చేశాడు ?
వంతలు వచనం : ఒక అభాగ్యవతి గడపలో పసిపాపను వదలి  పెట్టి
పెద్ద మనిషి పుణ్యాన గడేకారి - జైలు పాలయ్యాడు.

కృష్ణవేణి : తల్లి కాని తనలోటు తీరగా తల్లి తనము పై తీపివారగా
ముద్దు ముద్దుగా  పెంచినపాప కళకళలారుతు పెరిగి పెద్దదై
కళారంగమున గజ్జేనుకట్టి  - నర్తకిగానే ఆరితేరినది.
వంతలు : అమ్మలారా వినుడు  అయ్యలరా వినుడీ

కృష్ణవేణి  వచనం :   ఇంకా శోచనీయమైన విషయం ఏం జరిగింది ?
శాంతినికేతన్ చదువు పూర్తియై తిరిగి వచ్చిన నవీన యువకుడు
పెద్దమనిషి ఏకైక పుత్రుడు - నర్తకి నేగని ప్రేమించాడండి! -
ఎవరు చేసిన పాపం వారిని - చివరికి మానదని
తెలిసి వచ్చినది నర్తకి  జన్మ - తెలిసి వచ్చినది నర్తకి జన్మ
తెలిసి వచ్చినది కొడుకు పట్టుదల
తా కన్న కూతురే తన యింటి కోడలా దారుణంబని మధన పడ్డాడు
తన పాపమే పండి బ్రద్దలై యీ నాడు తన పరువు నట్టేట గలియునన్నాడు
కూడని ధర్మం సాగడమాయని - కొర కొర లాడాడ 
కఠిన చిత్తుడై నర్తకి నే - మటు మాయం చేశాడా ?
ప్రజలే రాజ్యం చేసేరోజులు - ప్రజలే తీర్పును చెప్పాలి
ప్రజలే న్యాయం చెయ్యాలి !





లోకమెల్ల నీది (అభినవ కుచేల పిల్లల నాటిక) పాట సాహిత్యం

 

చిత్రం: బంగారు సంకెళ్లు (1968)
సంగీతం: ఎం. పూర్ణచంద్రరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఉడుతా సరోజిని, సుమిత్ర 

లోకమెల్ల నీది లోకమే నీ పంచు
కల్లబొల్లి కబురులల్లి తొల్లి
మానవులను చాటు మాటు మాయచేశావు
దేవుడసలు నీవు కావు కావు...

తిండిని దాచే వ్యాపార్లు
లంచం మరిగిన అధికార్లు
మోసంచేసే మొనగాళ్లు
లోకం నిండా నిండారు,

తాండవించుచుండె దారిద్ర్య దేవత
కాలి యినుప గజ్జె ఝల్లుమనగ
ఆటలాడసాగె ఆకలి రాకాసి
జనుల గుండె ఝల్లు ఝల్లుమనగ 

శ్రీ కృష్ణ :
నీవు పలికెడి మాటలు నిక్కువములు
కాని తొందర పాటును మాని, దీని
అసలు నిగ్గును తేల్చుటే అవసరమ్ము
బుద్ధి బలమించుక చూపుము కుచేలా 
ప్రజలే ప్రభువులై రాజ్య పాలనమ్ము
జరుపు కొనెడు ప్రజాస్వామ్య జగతి నీది
నీ ప్రభుత్వము నీవె నిందింతువేని
నీవె నిన్ను నిందించు చున్నావు వినుము


Palli Balakrishna
Nindu Manasulu (1967)



చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, దేవిక, వాణిశ్రీ
దర్శకత్వం: ఎస్. డి. లాల్
నిర్మాత: ఎం. జనార్ధన రావు
విడుదల తేది: 10.08.1967



Songs List:



అపద మొక్కుల వాడా పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల

అపద మొక్కుల వాడా




లే లే లెమ్మన్నది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

లే లే లెమ్మన్నది




చిక్కని చెక్కిలి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

చిక్కని చెక్కిలి




నీవెవరో నేనెవరో పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

నీవెవరో నేనెవరో



అయ్యయ్యో అదిరిపోతున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, ఏ. ఎల్. రాఘవన్

అయ్యయ్యో అదిరిపోతున్నాను




చిట్టి చిట్టి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు మనసులు (1967)
సంగీతం: టి. వి రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం,  ఎల్. ఆర్. ఈశ్వరి

చిట్టి చిట్టి


Palli Balakrishna
Chandana (1974)



చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: రంగనాధ్, జయంతి
నిర్మాత, దర్శకత్వం: బండారుపల్లి గిరిబాబు
విడుదల తేది: 19.04.1974



Songs List:



సిరిమల్లె సెట్టుకింద పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం: జానకి

పల్లవి:
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా

చరణం: 1
బంగారు చెక్కిళ్ళ రంగైన చినవాడు
ఏ ఊరో.. ఏ పేరో..
ఏ ఊరో.. ఏ పేరో.. మా ఊరికొచ్చినాడూ 

వాడె వలచీనాడమ్మా.. వలచి పలుకలేదమ్మా
వాడు పలికినా చాలును ఓయమ్మా.. నా ప్రాణాలు వికసించునోయమ్మా   

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

చరణం: 2
వాని మునిపళ్ళు మెరిసేను ముత్యాలలాగా
వాని కళ్ళేమొ కదిలేను నీలాలలాగా
వాడు నవ్వీనాడమ్మా.. అమ్మో నవ్వీనాడమ్మా
ఆ ముసిముసి నవ్వులే ముత్యాల ముగ్గులై మురిపించెనమ్మా..
అవి ఎంతో ముద్దొచ్చెనోయమ్మా

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

చరణం: 3
ఆ నవ్వుతోనే నా మనసు ఎగిసిందీ
ఆ చూపులోనే నా తనువు ఇమిడిందీ
ఏమి మగవాడెయమ్మా..  నాకు తగినోడెయమ్మా
ఆ మగవాని కౌగిట మరణించినా చాలు...
వాని పాదాలపై రాలిపోయినా మేలు

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా 





పొన్నపూల ఉయ్యాలా.. పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం: జానకి

పల్లవి:
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
ఆ.. ఊపుతో ఆకాశమే..ఆ..  ఊపుతో ఆకాశమే
అరికాలికే అందాలా.. అందాలా..  అందాలా  

పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా

చరణం: 1
చిలకాలు చిలకాలు చిలకని అంటారే.. 
చిలకాలు చిలకాలు చిలకని అంటారే..
కానీ..  ఊ.. కానీ.. చిలకల కేమున్నాయి పలుకులే.. ఉత్తుత్తి పలుకులే

కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే.. 
కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే..
కానీ..  ఊ..  కానీ..  కోయిలలకు ఎమున్నాయి పాటలే..  గాలి పాటలే 

ఆ..... ఆ పలుకులనే మించిన కలికితనం..
ఆ పాటలనే మించిన కమ్మదనం
కలిగివున్న కన్నె.. ఈ వనానికే వన్నె                  
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా

చరణం: 2
హంసలూ హంసలూ హంసలనీ అంటారే.. 
హంసలూ హంసలూ హంసలనీ అంటారే..
కానీ.. ఊ..  కానీ.. హంసలకేమున్నాయి నడకలే..  బుడి బుడి నడకలే 
నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..

నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..
కానీ..  ఊ..  కానీ.. ఆ నెమళ్ళ కేమున్నాయి కులుకులే..  పై పైని తళుకులే
ఆ.. ఆ నడకలనే మించిన ఒయ్యారం..

ఆ..  ఆ కులుకులనే మించిన సింగారం
కలిగివున్న కన్నె..  ఈ వన్నెలకే వన్నె       
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా




ఓ రామ చక్కని పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం : రమేశ్ నాయుడు

పల్లవి:
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
నీ రాత రంపపుకోత ఆయెనా

చరణం: 1
నీవారూ నావారూ..  నెత్తిన నిప్పులు పోసారే.. నెత్తిన నిప్పులు పోసారే
కత్తులు గుండెల్లో గుచ్చారే.. నెత్తుటిలో ముంచెత్తారే... నెత్తుటిలో ముంచెత్తారే

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా 

ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా 

చరణం: 2
మాలచ్చిమి లేని ఊరూ..  దిక్కుమాలిన వల్లకాడు..  దిక్కుమాలిన వల్లకాడు
పాడుదేవుడు ఏడున్నాడో.. పాప మెందుకు మింగిపోడో..  పాప మెందుకు మింగిపోడో

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా 
ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా





నీరు పల్లమెరుగూ.. పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  జానకి

పల్లవి:
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది

ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ

చరణం: 1
మనిషిని నడిపేది సత్యం..  దేవుణ్ణీ నిలిపేది ధర్మం
మనిషిని నడిపేది సత్యం.. దేవుణ్ణీ నిలిపేది ధర్మం

అందుకే ఉన్నారు సూర్యచంద్రులు
అందుకే వానలు కురిసేదీ.. పంటలు పండేదీ..  ప్రాణాలు నిలిచేదీ             

నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ..  నిజం దేవుడెరుగూ

చరణం: 2
దుష్టశిక్షణా .. ధర్మరక్షణా
దుష్టశిక్షణా.. ధర్మరక్షణా
యుగయుగాలుగా జరిగే యాగం

అందుకే పెరుగుతుంది చేసుకున్న పుణ్యం
ఇక పాపం బద్దలుకాకమానదూ
పాపి చిరాయువు కానేరడూ
పాపి చిరాయువు కానేరడూ     

నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది

ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ 



ఈ రేయి శతకోటి పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  జానకి

పల్లవి:
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఆ.. వెలుగులో అన్ని పాపాలు కరగాలీ
శాపాలు తొలగాలీ.. తాపాలు తొలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ

చరణం: 1
కన్నీళ్ళు మనకొద్దూ.. కన్నీళ్ళు మనకొద్దూ..  కరిగి నీరవుతాను
నా కళ్ళలో.. నా కళ్ళలో  వత్తులిడి కాచుకుంటానూ
మనసు కలిసినవారి.. మనసులొకటేనూ
మన చెలిమియే మనకింకా శ్రీరామరక్ష..  శ్రీరామరక్ష 

ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ

చరణం: 2
రేయినాపమని.. చంద్రుణ్ణి కోరుతానూ
రేయినాపమని..  చంద్రుణ్ణి కోరుతానూ
పొద్దు పొడవద్దని.. పొద్దు పొడవద్దని
సూర్యుణ్ణి కొలుస్తానూ.. సూర్యుణ్ణి కొలుస్తానూ

ముక్కోటి దేవతలూ..  మురిసి వరమిస్తారూ
ముక్కోటి దేవతలూ.. మురిసి వరమిస్తారూ
వైకుంఠమే ఒరిగీ.. దీవించుతుందీ.. మనల దీవించుతుంది 




చిలక పచ్చని కోనలో.. పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం:  ఎస్.పి.బాలు

పల్లవి:
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుంది.. ఏ మువ్వలో పిలిచినట్టుంది  

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ..  ఏ మువ్వలో పిలిచినట్టుందీ 

చరణం: 1
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఈ కన్నెగాలి కదలికలు..  ఏ గాజుల గలగలలో.. ఏ గాజుల గలగలలో

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ  

చరణం: 2
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
ఏ రాణి శీలవేణిలో.. నా మనసే ఒదిగిపోవునో.. మనసే ఒదిగిపోవునో  

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ  


Palli Balakrishna Wednesday, April 6, 2022
Chilipi Krishnudu (1978)



చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: నాగేశ్వర రావు, వాణిశ్రీ
దర్శకత్వం: బోయిన సుబ్బారావు
నిర్మాత: డా. రామానాయుడు
విడుదల తేది: 11.01.1978



Songs List:



గోవిందా..... గోవిందా.... పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల

గోవిందా..... గోవిందా....
జారిందా.... జారిందా....
కాలు జారిందా....నేల జారిందా ....
హారి కన్నెపిల్ల పైట జారిందా....
పైట జారి వంపు సొంపు బైట పెట్టిందా....

కోకతడిసి పోయిందా - కొత్త బెరుకు తీరిందా....
గుర్రుగుర్రు మంటుండా - కొరుక్కు తిందామనివుందా
మగకోరస్ : హ్హ....హ్హ....హ్హ....హ్హ.....

కొంగునట్లా గుంజుకోకూ
కుర్రవాన్నీ సంజుకోకు.

గోవిందా.....గోవిందా......
జారిందా....జారిందా....
కాలు జారిందా.... నేల జారిందా....
హారి కన్నెపిల్ల పైటజారిందా....
పైటతోటి పడుచువాడి గుండె జారిందా....

అడకోరస్ : పైటతోటి పడచువాడి గుండె జారిందా....

కొంగుగాలీ తగిలిందా - కోర్కెకొస్తా తీరిందా
ఈత నీకూ వచ్చిందా....లోతుపాతు తెలిసిందా
అడకోరస్ : హ్హ....హ్హ....హ్హ....హ్హ.....

ఆశలింకా పెంచుకోకూ....
అలసిపోయీ సోలిపోకూ....
హాయ్....హాయ్ .... హాయ్.....

గోవిందా....గోవిందా.....
జారిందా....జారిందా....
కాలు జారిందా.... నేలజారిందా
హారి కన్నెపిల్ల పైటజారింగా....
పైటతోటి పడుచువాడి గుండె జారి.దా

మగకోరస్ : పైట జారి వంపు సొంపు బైట పెట్టిందా
ఆడ కోరస్ : పైటతోటీ పడుచువాడి గుండె జారిందా
గోవిందా... గోవిందా ....





చీర లెత్తు కెళ్ళాడా పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల

చీర లెత్తు కెళ్ళాడా చిన్నికృష్ణుడూ
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడూ
చూడబోతే వాడెంతో మంచివాడూ
వాడికన్న వీడే మరీ కొంటె కాడూ
మల్లె పూల పడవలో మంచు తెరల మాటులో
ఏటి నీటి పోటులా మాట వినని వయసులో
నీవే నా మురళివని పెదవి చేర్చనాడూ
ఆఁ పెదవిమీద తన పేరు వ్రాసి చూసుకున్నాడూ

మబ్బు చీరకట్టింది.... ఆకాశం.....
మెరుపు చూపు విసిరిందీ నీ కోసం
తళుకులే చినుకులుగా చిలుకుతు ది వర్షం....
తడిసి పోయి యవ్వనం, వెతుకుతుంది వెచ్చదనం

పొన్న చెట్టు నీడలో
ఓ....ఓ....ఓ....ఓ....
ఎన్ని ఎన్ని ఊసులో .
ఆ....ఆ....ఆ....ఆ....
వెన్నముద్ద బుగ్గలో ఎన్ని ఎన్ని ముద్దులో
నీవే నా రాధవు ఆనాటి రాసక్రీడలో
నీవే నా రాగము ఈనాటి ప్రణయ  గీతిలో 




ఇందుకేనా పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం

ఇందుకేనా
ఇది ముందుగ నీకూ తెలిసేనా...
ప్రేమించమన్నాపూ
ప్రేమను ప్రేమించమన్నావూ...

ఓటమి ఓర్వని నిన్నీ.... కాటికి పంపుటకా
ఒడిలో ఒదిగిన తలకీ... కొరివిని పెట్టుటకా
ఎదలో దాచిన నిన్నీ చితిలో చూచుటకా
ఈ చితి మంటలు నా బ్రతుకంతా మోయుటకా

నిన్న మెరిసిన కన్ను లేవీ - నిగ్గులొలికిన బుగ్గలే 
నీ కౌగిలించిన కరములా యివీ
కదలి ఆడిన పదములా యివీ
పుత్తడి బొమ్మగ తలచిన నిన్నూ
బొమికల కుప్పగ చూస్తున్నానూ.... 

నా గుడినే కూల్చావూ.... నీ గురుతులు వదిలావూ
నీ బరువులు నా పై మోపీ నను బ్రతికుంచ మన్నావు
ఈ మిగిలిన శిథిలాలూ..... నా రగిలే కన్నీళ్ళు
మోస్తుంటాను భువిలోనా
చూస్తుంటావా దివిలో నా





ఎల్లోస్తానోయ్ మావఁ పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  పి. సుశీల

ఎల్లోస్తానోయ్ మావఁ మల్లోస్తానోయ్
మల్లోస్తాను మరి ఎల్లోస్తాను.

ఎళ్ళిపోయానని ఏడుస్తా కూకోకు
అయ్యో పాపం...
మల్లోచ్చేసరికి నన్ను మరిసిపోకు
మావ.....మావ.....మావ 

నిద్దరొచ్చి తొంగుంటే కలనౌతానూ
నిదర మాని మేల్కుంటే నిజమౌతానూ
ఆ....ఆ....ఆ..... ఎనక ముందు జనమలెన్నో
ఎరిగినట్టె వుంటానూ
ఎవరు నువ్వెవరంటే.... ఇవరంగా సెప్పలేను....

గుడికాడ కలుసుకున్నాం గురుతుందా
ఈ కొత్త లంగా తెచ్చిచ్చావ్ బాగుందా....
మొద టెట్టిన ముద్దూ ..... హాయ్ మొద టెట్టిన
ముద్దింకా తియ్యగుందా
నీ మొరటుతనం ఇప్పుడైనా మారిందా..... మారిందా
మావాఁ...మావాఁ....మావా మావోయ్

ప్రేమకే ప్రేమరా నువ్వంటేనూ
అది పిచ్చిగా మారుతుంది నేనుంటేనూ
ఇంటిదాకా ఎంటపడి రావద్దూ అంటానూ
మావోయ్ ....
ఎందుకు.... ఏం ఎందుకు
ఎందుకంటే ఆడ నేను దయ్యమల్లె పుంటాను
మావాఁ..... మావాఁ..... మావా...... 




నేర్చుకో.... పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల

నేర్చుకో.... నేర్పుతాసూ నేర్చుకో.....
ఏమిటి.
చిన్న చిన్న కిటుకులు..... చెప్పరాని చిటుకులూ ....
చేసి చూపుతాను చూసి నేర్చుకో

ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే. కె. ఎల్,
ఎమ్, ఎస్, ఓ, పి, క్యు, ఆర్, ఎస్, టి, యు, వి,
డబ్ల్యు,ఎక్స్, వై, జెడ్,
ఎక్స్, వై, జడ్,
ఇదేమిటి మేళం - నేను సినిమా యాక్టరు కావాలను
కుంటేనూ
యాక్టరు కావాలనుకున్నావూ ...
డాక్టరు కాబోతున్నావూ
భాషా వేషం మారాలి
మాటా మంచీ తెలియాలి -
అమ్మబాబోయ్ ...
జీవితమంతా ఓ నటనా
సినిమా దానికి  చిత్తు నమూ

చీరకట్టుకుంటే జీరాడుతుండాలి
చెంగుకాస్తా....అలా-అలా-అలా-అలా-పూగాడు తుండాలీ,
ఆహ్హ హా హాహా......
చెప్పులేసుకుంటే చకా చకా నడవాలి.....
అప్పుడప్పుడోరచూపు విసురుతూ పోవాలీ 

చెయ్యిపట్టి చూడాలీ నాడి - దీంతోటి కొలవాలి వేడి
ఓహో
గుండెలోనీ గోలంతా యీ గొట్టంతో బే వినాలీ ఏమంటుందీ
దడా....దడా...దడా....దడా ..
కాదు....లబ్ డబ్ బ్ డబ్ ....లబ్ డబ్ లబ్ డబ్ 
రోగిని చూసీ మందిస్తే - దెబ్బకి రోగం కుదరాలీ
ఓహో




ఏ మొగుడు లేకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం:  ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల

ఏ మొగుడు లేకుంటే అక్క మొగుడే దిక్కు
ఏమయ్యో బావయ్యో
వచ్చిందీ చిక్కు....నీకొచ్చిందీ చిక్కు
ఏ దిక్కు లేకుంటే మరదలే దిక్కూ
ఓలమ్మీ చిన్నమ్మీ
వచ్చిందే చిక్కు నీకొచ్చిందే చిక్కు
అల్లుకు పోయేవాడే అల్లుడంట ఇంటల్లుడంటా
మన అల్లి కలో మల్లికలే పూయాలంట విరబూయాలంట
పెనవేసుకుపోతేనే పెనిమిటంటా పెనవేయమంటా

అది మాటకాడు కంకాట మనసంట కన్నె మనసంటా
ఈ డొంక తిరుగుడంతా మనకెందుకంట
నే తీగ లాగితే లేనిపోనితంటా
నీ డొంకంతా యిప్పుడే కదులునంటా...

నా చెలీ ఎండలో జాబిలీ.. దాచుకో గుండెలో నాచలీ
రోమియో
జూలియట్
తీరనీ తీయనీ ఆకలి.... పెంచుకో ఇచ్చి నీకౌగిలీ
జూలియట్
రోమియో
నీలో తొలివలపు నన్నే వుసిగొలుపు
నీలో మైమరపు నాతో చెయి గలుపు
తహతహలూ రెపరెపలై తడిపొడిగా
కలకాలం కలిసుందాం చెరిసగమై

నా చెలీ ఎండలో జాబిలీ.. దాచుకో గుండెలో నాచలీ
జూలియట్
రోమియో

ఓ....ఓఓఓ..... ముసి ముసి ముసి ముసి నవ్వెందుకో
నువ్వు.... గుస గుస గుస గుస మన్నందుకే
ఒహో..... ఓఓఓ.... కసి కసి కసి కసి చూపిందుకో
నువ్వు మిస మిస మిస మిస నున్నందుకే

నీ చెంప చేమంతీ
చేయి.. తాకితే గుల ది.
మొగ్గ తొడిగే నవ్వూ
ముద్దులా పూబంతీ
పూవులన్నీ నవ్వుకున్న పూత రేకు నువ్వు
మారాకు వేయనివ్వు





కాటుకెట్టి బొట్టుపెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: చిలిపి కృష్ణుడు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం:  ఎస్. పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల

కాటుకెట్టి బొట్టుపెట్టి 

Palli Balakrishna Tuesday, April 5, 2022
Inti Kodalu (1974)



చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: ఎస్. వి. రంగారావు, గుమ్మడి, కృష్ణం రాజు, చంద్రమోహన్, ప్రమీల, యస్. వరలక్ష్మి, పి. ఆర్. వరలక్ష్మి, రోజా రమణి,
మాటలు: ఆరుద్ర
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 12.09.1974



Songs List:



చలిగాలిలో నులివెచ్చని పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

చలిగాలిలో నులివెచ్చని
బిగికౌగిలి పెనవేసుకో
ఊరించి నవ్వింది సొగసు - అహా
ఉప్పొంగి పోయింది మనసు

తొలికారు మేఘాలు మూశాయి
చిటపట చిటపట చిటపట చినుకులు కురిశాయి
జల్లులో ఒళ్ళంత తడిసింది
గుండెలో ఒక జ్వాల రగిలింది 
తొలి ప్రేమలో పులకింతలై
మేను కరగినది హాయి పెరిగినది
అందాలు చిందేనెలే

తెరచాటు పరువాలు మెరిశాయి
ముసిముసి మిలమిల వలపులు గుసగుస లాడాయి
ఊహలే ఉయ్యాల ఊగేను
మోహమే చలిమంట కాగేను
అనురాగమే అనుబంధమై
పొందు కూర్చినది విందు చేసినది
ఉర్రూత లూపిందిలే





ఊరికే చల్లారునా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

స్నానాల గదిలోన సన సన్నని జలపాతం 
ఆ జలపాతం జల్లులులో  తడిసే ఓ పారిజాతం 
ఊరికే చల్లారునా
ఒంటిలోన లేచే ఆవిరి
జంటకోసం వేచే ఆ వేడి

మండే నేలను రాలే చినుకులు
మరింత సెగలను రేపుతాయి
రగిలే తనువున కురిసే జల్లులు
పొగలై నీలోనే మూగుతాయి
తడిసిన చీర మేని కంటుకొని
తగని మారాము చేస్తుంది 
నా దగ్గరకే నిను లాగేస్తుంది

పెదవుల దాహం తీరాలంటే 
పెదవుల తేనెలే కావాలి,
కాగే దేహం ఆరాలంటే
కౌగిలి కుంపటే కావాలి 
ఓపలేని ఒంటరి తనమే
నీపై కన్నెర్ర చేస్తుంది , అది
నిలువున నిను కాల్చేస్తుంది




రావా ! ననుచేరలేవా ? పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: బాలసుబ్రహ్మణ్యం

రావా ! ననుచేరలేవా ?
ఎటు చూసినా పడుచు జంటలే
ఎటు చూసినా వలపు పంటలే

ప్మురతి నిమిషం నినుచూసీ 
నీ కోసం చెయిసాచి
విధిలేక లోలోన విలపించుటేనా
ఉన్నాము ఒక యింటిలోన కాని
ఎన్నెన్ని కనరాని పరదాలో 
చేరు కున్నాము ఒక పాన్పు పైన కాని
ఎన్నెన్ని దరిలేని దూరాలో
నువ్వు ఎదటుండి ఎంతెంత విరహం
నేను బతికుండి ఇది వింతమరణం

నిను నిన్నుగా నేను వలచాను నా
మనసంతా నీ చేత నిలిపాను 
ఆ మూగమనసే విసిరేసినావు
అనురాగ బంధం తెగగోసినావు
ఇంకా కసితీర లేదా
ఎన్నాళ్ళు యి నరక బాధ





చిన్నారి పొన్నారి బుల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి - జానకి

చిన్నారి పొన్నారి బుల్లెమ్మా
వన్నె వాసీ కలిగి వర్థిల్ల వమ్మా
పరికిణీకట్టే బాలప్రాయము దాటి
పడుచు తనమూ వచ్చేనమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

చక్కిలిగింతల పులకించే దోరవయసూ
ఉక్కిరి బిక్కిరి చేసేనమ్మా
చక్కని బంగారు పెళ్ళికొడుకూ
సరసన సయ్యాట లాడాలమ్మా
చిలకా గోరింకల్లా మెలగాలమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

బిడ్డా పాపలేని సంసారం
అడవిని గాచిన వెన్నెల యౌనమ్మా
నిత్యము నీ యిల్లు కలకలలాడగ
సంతానవతి వౌచు మనవమ్మా
అలా అని బుజ్జిమ్మా ! గంపెడు పిల్లలకంటావా ఏమొ
వద్దమ్మా బుజ్జమ్మా
వద్దమ్మా - వద్దమ్మా
ఒకరిద్దరై తేనె సుఖమమ్మా

Palli Balakrishna
Inti Gowravam (1970)



చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి 
నటీనటులు: శోభన్ బాబు, చంద్రమోహన్, జానకి, జయకుమారి, విజయ భాను
దర్శకత్వం: బాపు
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 14.08.1970



Songs List:



నారుపోసి ఊరకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు
గానం: సుశీల - ఘంటసాల

బుద్ధి కలిగి వుండాలమ్మా
శ్రద్ధగా చదవాలమ్మా
పెద్దలు బాటను నడచీ
వృద్ధికి రావాలమ్మా
నారుపోసి ఊరకుంటే
తీరిపోదు. బాధ్యత
నీరుపోసి పెంచడమే
నిజమగు మమతా

తుమ్మెదా పూవూ
విందు చేసుకొను వేళా
పిందె ఒకటి పుడుతుందని
అనుకున్నా లేకున్నా
తొమ్మిది మాసాలు మోసి
కన్నామే చిన్నారి
అమ్మ రుణం నాన్న రుణం
తీర్చవేమిటంటారు
పెద్దల కెపుడు పిలలు రుణపడి లేరూ
కన్నందుకు ఏ కాస్తో  వారే రుణముంటారు 

తనకు మించి ఎవ్వర నే ధన
గర్వము పనికి రాదు
వినయమ్మును చూపకుండ విర్రవీగరాదు
మంచితనము లేకుంటే
కొంచమైన విలువ లేదు 
తప్పటడుగు వేయు చిన్న పాపాలకు
తప్పుటడుగు పడకుండా
నడవడి సరిదిదాలీ
అదుపున పెరిగిన బిడలు
అభివృద్ధికి వస్తారు
హద్దు దాటి పోనిస్తే 

అథోగతికి పోతారు
ఆ పాపం - ఆ లోపం
అంతా తలిదండ్రులదే





ఓ నో డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  శ్రీ దాశరధి
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి

ఓ నో డార్లింగ్ 
నో ప్లీజ్ డార్లింగ్ 
వద్దురా....
అందానికీ - చందానికి
పరదా వుంటేనే సరదారా

అందీ అందని పెదవులలో
చిందీ చిందని మధువుందీ
కలిసి కలియని మనసులలో
తెలిసీ తెలియని వలపుందీ
ఆ మధువులూ - ఈ వలపులూ
అందించు సమయాలు ఇవి కావులే

దాచీ దాచని వొంపులలో
తోచీ తోచని సొగసుందీ
తగిలీ తగలని తనువులలో
రగిలీ రగలని కై పుంది
రగిలించకు కోర్కె రగిలించకు
పది మందిలో నన్ను కవ్వించకు



హవ్వ హవ్వ సిరి సిరి మువ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల 

హవ్వ హవ్వ సిరి సిరి మువ్వ నువ్వా నువ్వా
గువ్వలాంటి పిల్ల మీద లవ్వా ల వ్వా

మోటు సరసము ముదిరిపోయిందా
నీ నీటు నీటు తలకాసా పండిపోయిందా
లేటు వయసులో ఘాటు వలపులా 
నీ వాటమైన నడుమయ్యో వాలిపోయిందా
నీ నాటకాల బూటకాల ఆట నీకే చేటు తెచ్చిందా 
ఆడపిల్లను అలుసు చేయకు – నువ్వు
ఆవలిస్తే పేగులెన్నో లెక్క పెడుతుందోయ్

చిలిపి చేష్టలు వలపు అల్లురి
మనసు మనసు కలిసినపుడు మధుర మౌతుందోయ్
ఈ వేషా లెందుకు మోసాలెందుకు వేళాకోళం
మనకూ తెలుసునోయ్
దోర మనసును  దోచబోయేనా
దొంగను పట్టె దోరగారు దొంగ వైనావా
కమ్మ కమ్మగా ఖైదు చేయనా
కంటి చూపు సంకెలేసి జంటకటనా
అందమైన డెందమందు బందీచేసి విందు చేయనా 




చింత పువ్వు ఎరుపు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటి గౌరవం (1970)
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
సాహిత్యం:  ఆరుద్ర
గానం: సుశీల , బాల సుబ్రహ్మణ్యం

చింత పువ్వు ఎరుపు
చిలక ముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు
లేత వలపు తెలుపు
మల్లె మొగ్గ తెలుపు
మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు
నిండువలపు నిలుపు
అబ్బ వూరించు పెదవులు ఎరుపు
అవి నాలోన ఆశలు రేపు
ఆగాలి పెళ్ళయిన వరకు
ఆ పెన తమదే గెలుపు
వలచే వేళ తొలగే వేల
ఈ ఎడమోము పెడమోము రుచి చూడు పులుపు 
అబ్బ నీ చేయి చిదిమిన చోట
అయ్యో నా బుగ్గ కందేను చూడు

నీ నవ్వు వెలిగిన పూట
నా మేను పొంగేను చూడు
నీలో నాలో ఒకటే ఆశ
అవి పండేను మురిపాలు నిండేను రేపు

Palli Balakrishna

Most Recent

Default