Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Inti Kodalu (1974)




చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: ఎస్. వి. రంగారావు, గుమ్మడి, కృష్ణం రాజు, చంద్రమోహన్, ప్రమీల, యస్. వరలక్ష్మి, పి. ఆర్. వరలక్ష్మి, రోజా రమణి,
మాటలు: ఆరుద్ర
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాత: పి. మల్లికార్జున రావు
విడుదల తేది: 12.09.1974



Songs List:



చలిగాలిలో నులివెచ్చని పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

చలిగాలిలో నులివెచ్చని
బిగికౌగిలి పెనవేసుకో
ఊరించి నవ్వింది సొగసు - అహా
ఉప్పొంగి పోయింది మనసు

తొలికారు మేఘాలు మూశాయి
చిటపట చిటపట చిటపట చినుకులు కురిశాయి
జల్లులో ఒళ్ళంత తడిసింది
గుండెలో ఒక జ్వాల రగిలింది 
తొలి ప్రేమలో పులకింతలై
మేను కరగినది హాయి పెరిగినది
అందాలు చిందేనెలే

తెరచాటు పరువాలు మెరిశాయి
ముసిముసి మిలమిల వలపులు గుసగుస లాడాయి
ఊహలే ఉయ్యాల ఊగేను
మోహమే చలిమంట కాగేను
అనురాగమే అనుబంధమై
పొందు కూర్చినది విందు చేసినది
ఉర్రూత లూపిందిలే





ఊరికే చల్లారునా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: సుశీల, బాలసుబ్రహ్మణ్యం

స్నానాల గదిలోన సన సన్నని జలపాతం 
ఆ జలపాతం జల్లులులో  తడిసే ఓ పారిజాతం 
ఊరికే చల్లారునా
ఒంటిలోన లేచే ఆవిరి
జంటకోసం వేచే ఆ వేడి

మండే నేలను రాలే చినుకులు
మరింత సెగలను రేపుతాయి
రగిలే తనువున కురిసే జల్లులు
పొగలై నీలోనే మూగుతాయి
తడిసిన చీర మేని కంటుకొని
తగని మారాము చేస్తుంది 
నా దగ్గరకే నిను లాగేస్తుంది

పెదవుల దాహం తీరాలంటే 
పెదవుల తేనెలే కావాలి,
కాగే దేహం ఆరాలంటే
కౌగిలి కుంపటే కావాలి 
ఓపలేని ఒంటరి తనమే
నీపై కన్నెర్ర చేస్తుంది , అది
నిలువున నిను కాల్చేస్తుంది




రావా ! ననుచేరలేవా ? పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: బాలసుబ్రహ్మణ్యం

రావా ! ననుచేరలేవా ?
ఎటు చూసినా పడుచు జంటలే
ఎటు చూసినా వలపు పంటలే

ప్మురతి నిమిషం నినుచూసీ 
నీ కోసం చెయిసాచి
విధిలేక లోలోన విలపించుటేనా
ఉన్నాము ఒక యింటిలోన కాని
ఎన్నెన్ని కనరాని పరదాలో 
చేరు కున్నాము ఒక పాన్పు పైన కాని
ఎన్నెన్ని దరిలేని దూరాలో
నువ్వు ఎదటుండి ఎంతెంత విరహం
నేను బతికుండి ఇది వింతమరణం

నిను నిన్నుగా నేను వలచాను నా
మనసంతా నీ చేత నిలిపాను 
ఆ మూగమనసే విసిరేసినావు
అనురాగ బంధం తెగగోసినావు
ఇంకా కసితీర లేదా
ఎన్నాళ్ళు యి నరక బాధ





చిన్నారి పొన్నారి బుల్లెమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికోడలు (1974)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: జిక్కి - జానకి

చిన్నారి పొన్నారి బుల్లెమ్మా
వన్నె వాసీ కలిగి వర్థిల్ల వమ్మా
పరికిణీకట్టే బాలప్రాయము దాటి
పడుచు తనమూ వచ్చేనమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

చక్కిలిగింతల పులకించే దోరవయసూ
ఉక్కిరి బిక్కిరి చేసేనమ్మా
చక్కని బంగారు పెళ్ళికొడుకూ
సరసన సయ్యాట లాడాలమ్మా
చిలకా గోరింకల్లా మెలగాలమ్మా
బుజ్జమ్మా ఓ బుజ్జమ్మా

బిడ్డా పాపలేని సంసారం
అడవిని గాచిన వెన్నెల యౌనమ్మా
నిత్యము నీ యిల్లు కలకలలాడగ
సంతానవతి వౌచు మనవమ్మా
అలా అని బుజ్జిమ్మా ! గంపెడు పిల్లలకంటావా ఏమొ
వద్దమ్మా బుజ్జమ్మా
వద్దమ్మా - వద్దమ్మా
ఒకరిద్దరై తేనె సుఖమమ్మా

No comments

Most Recent

Default