Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chandana (1974)




చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: రంగనాధ్, జయంతి
నిర్మాత, దర్శకత్వం: బండారుపల్లి గిరిబాబు
విడుదల తేది: 19.04.1974



Songs List:



సిరిమల్లె సెట్టుకింద పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం: జానకి

పల్లవి:
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా

చరణం: 1
బంగారు చెక్కిళ్ళ రంగైన చినవాడు
ఏ ఊరో.. ఏ పేరో..
ఏ ఊరో.. ఏ పేరో.. మా ఊరికొచ్చినాడూ 

వాడె వలచీనాడమ్మా.. వలచి పలుకలేదమ్మా
వాడు పలికినా చాలును ఓయమ్మా.. నా ప్రాణాలు వికసించునోయమ్మా   

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

చరణం: 2
వాని మునిపళ్ళు మెరిసేను ముత్యాలలాగా
వాని కళ్ళేమొ కదిలేను నీలాలలాగా
వాడు నవ్వీనాడమ్మా.. అమ్మో నవ్వీనాడమ్మా
ఆ ముసిముసి నవ్వులే ముత్యాల ముగ్గులై మురిపించెనమ్మా..
అవి ఎంతో ముద్దొచ్చెనోయమ్మా

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా

చరణం: 3
ఆ నవ్వుతోనే నా మనసు ఎగిసిందీ
ఆ చూపులోనే నా తనువు ఇమిడిందీ
ఏమి మగవాడెయమ్మా..  నాకు తగినోడెయమ్మా
ఆ మగవాని కౌగిట మరణించినా చాలు...
వాని పాదాలపై రాలిపోయినా మేలు

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో ..  రామూలమ్మా 

సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..  రామూలమ్మా
సిన్నబోయి కూసున్నావ్ రామూలమ్మో..  రామూలమ్మా 





పొన్నపూల ఉయ్యాలా.. పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం: జానకి

పల్లవి:
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
ఆ.. ఊపుతో ఆకాశమే..ఆ..  ఊపుతో ఆకాశమే
అరికాలికే అందాలా.. అందాలా..  అందాలా  

పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా

చరణం: 1
చిలకాలు చిలకాలు చిలకని అంటారే.. 
చిలకాలు చిలకాలు చిలకని అంటారే..
కానీ..  ఊ.. కానీ.. చిలకల కేమున్నాయి పలుకులే.. ఉత్తుత్తి పలుకులే

కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే.. 
కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే..
కానీ..  ఊ..  కానీ..  కోయిలలకు ఎమున్నాయి పాటలే..  గాలి పాటలే 

ఆ..... ఆ పలుకులనే మించిన కలికితనం..
ఆ పాటలనే మించిన కమ్మదనం
కలిగివున్న కన్నె.. ఈ వనానికే వన్నె                  
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా

చరణం: 2
హంసలూ హంసలూ హంసలనీ అంటారే.. 
హంసలూ హంసలూ హంసలనీ అంటారే..
కానీ.. ఊ..  కానీ.. హంసలకేమున్నాయి నడకలే..  బుడి బుడి నడకలే 
నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..

నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..
కానీ..  ఊ..  కానీ.. ఆ నెమళ్ళ కేమున్నాయి కులుకులే..  పై పైని తళుకులే
ఆ.. ఆ నడకలనే మించిన ఒయ్యారం..

ఆ..  ఆ కులుకులనే మించిన సింగారం
కలిగివున్న కన్నె..  ఈ వన్నెలకే వన్నె       
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా




ఓ రామ చక్కని పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం : రమేశ్ నాయుడు

పల్లవి:
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
నీ రాత రంపపుకోత ఆయెనా

చరణం: 1
నీవారూ నావారూ..  నెత్తిన నిప్పులు పోసారే.. నెత్తిన నిప్పులు పోసారే
కత్తులు గుండెల్లో గుచ్చారే.. నెత్తుటిలో ముంచెత్తారే... నెత్తుటిలో ముంచెత్తారే

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా 

ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా 

చరణం: 2
మాలచ్చిమి లేని ఊరూ..  దిక్కుమాలిన వల్లకాడు..  దిక్కుమాలిన వల్లకాడు
పాడుదేవుడు ఏడున్నాడో.. పాప మెందుకు మింగిపోడో..  పాప మెందుకు మింగిపోడో

ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా..  ఓ ముద్దు గుమ్మా 
ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా





నీరు పల్లమెరుగూ.. పాట సాహిత్యం

 
చిత్రం:  చందన (1974)
సంగీతం:  రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  జానకి

పల్లవి:
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది

ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ

చరణం: 1
మనిషిని నడిపేది సత్యం..  దేవుణ్ణీ నిలిపేది ధర్మం
మనిషిని నడిపేది సత్యం.. దేవుణ్ణీ నిలిపేది ధర్మం

అందుకే ఉన్నారు సూర్యచంద్రులు
అందుకే వానలు కురిసేదీ.. పంటలు పండేదీ..  ప్రాణాలు నిలిచేదీ             

నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ..  నిజం దేవుడెరుగూ

చరణం: 2
దుష్టశిక్షణా .. ధర్మరక్షణా
దుష్టశిక్షణా.. ధర్మరక్షణా
యుగయుగాలుగా జరిగే యాగం

అందుకే పెరుగుతుంది చేసుకున్న పుణ్యం
ఇక పాపం బద్దలుకాకమానదూ
పాపి చిరాయువు కానేరడూ
పాపి చిరాయువు కానేరడూ     

నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది

ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ 



ఈ రేయి శతకోటి పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం:  సినారె
గానం:  జానకి

పల్లవి:
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఆ.. వెలుగులో అన్ని పాపాలు కరగాలీ
శాపాలు తొలగాలీ.. తాపాలు తొలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ

చరణం: 1
కన్నీళ్ళు మనకొద్దూ.. కన్నీళ్ళు మనకొద్దూ..  కరిగి నీరవుతాను
నా కళ్ళలో.. నా కళ్ళలో  వత్తులిడి కాచుకుంటానూ
మనసు కలిసినవారి.. మనసులొకటేనూ
మన చెలిమియే మనకింకా శ్రీరామరక్ష..  శ్రీరామరక్ష 

ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ

చరణం: 2
రేయినాపమని.. చంద్రుణ్ణి కోరుతానూ
రేయినాపమని..  చంద్రుణ్ణి కోరుతానూ
పొద్దు పొడవద్దని.. పొద్దు పొడవద్దని
సూర్యుణ్ణి కొలుస్తానూ.. సూర్యుణ్ణి కొలుస్తానూ

ముక్కోటి దేవతలూ..  మురిసి వరమిస్తారూ
ముక్కోటి దేవతలూ.. మురిసి వరమిస్తారూ
వైకుంఠమే ఒరిగీ.. దీవించుతుందీ.. మనల దీవించుతుంది 




చిలక పచ్చని కోనలో.. పాట సాహిత్యం

 
చిత్రం: చందన (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: సినారె
గానం:  ఎస్.పి.బాలు

పల్లవి:
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుంది.. ఏ మువ్వలో పిలిచినట్టుంది  

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ..  ఏ మువ్వలో పిలిచినట్టుందీ 

చరణం: 1
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఈ కన్నెగాలి కదలికలు..  ఏ గాజుల గలగలలో.. ఏ గాజుల గలగలలో

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ  

చరణం: 2
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
ఏ రాణి శీలవేణిలో.. నా మనసే ఒదిగిపోవునో.. మనసే ఒదిగిపోవునో  

చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ  


No comments

Most Recent

Default