-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rakshitha"

చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హరిహరన్ , కల్పన
నటీనటులు: శ్రీకాంత్ , వేణు తొట్టెంపూడి, సంగీత, రక్షిత
దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 15.01.2003

దొండ పండు లాంటి పెదవే నీది
అబద్దం..అంతా అబద్దం..
దూదిపింజ లాంటి వదమే నీది
అబద్దం.. అంతా అబద్దం.
పాల మీగడంటి నుదురే నీది
అబద్దం.. అంతా అబద్దం
పూల తీగ లాంటి నడుమే నీది - అబద్దం
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ

మత్తును చల్లేటి నవ్వేమొ నీది - అబద్దం
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది - ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది - అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది - ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు - అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను - ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి - అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం - గొప్ప వాస్తవం

పాల నురగ లాంటి పైటేమో నీది - ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది ఆ - ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది - అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది - అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి - అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను - ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుభంధం కలకాలం


********   ********   ********


చిత్రం: పెళ్ళాం ఊరెళితే (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.పి.బాలు, గోపికా పూర్ణిమ

పల్లవి:
మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామా నును లేత పసిడి కొమ్మా
గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా
కళ్ళే చూసెనంటె కోడాక్
పళ్ళే చూసెనంటె క్లోజప్
థ్రిల్లై గంతులేస్తురావా నీకోసం
కురులే చూసెనంటె సన్ సిల్క్
నవ్వే చూసెనంటె నెస్కెప్
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం

చరణం: 1
మెరుపులన్ని మెలివేసి తారలన్ని కలబోసి
పున్నమంత మరిగించి  పుణ్యమంత కరిగించి
నవ నవలాడేలా నవ బ్రమ్హలు చేరి
తన్మయమై నిన్ను చేశారే కోరి
పలుకే వినినా తేనే తెలబోవు
రూపే కనినా తూర్పుకు మతిపోవు
కలరే చూసెనంటె ఏషియన్
రిస్టే చూసెనంటె  టైటాన్
నీకై లక్షలుంచిపోవా వాకిట్లో

చరణం: 2
కాలి అందె కదిపిందా  కాకి కోకిలై పోదా
పైట గాలి వీచిందా పాలవాన పడిపోదా
రుస రుస చూసిందా ఋతువులు మారేను
గుస గుసలాడిందా ఋషులే మారేను
నడుమే చూస్తే విరిసే హరివిల్లు
బిడియం పడుతు నీకే ప్రణమిల్లు
నడకే చూసెనంటె బాటా
పరుగే చూసెనంటె స్కూటీ
సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా


Palli Balakrishna Friday, September 15, 2017




చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: మహేష్ బాబు, రక్షిత, గోపిచంద్, రాశి
దర్శకత్వం: తేజా
నిర్మాత: తేజా
విడుదల తేది: 23.05.2003



Songs List:



చందమామ రావే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

చందమామ రావే 



రత్తాలు రత్తాలు పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

రత్తాలు రత్తాలు




నీలో ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

నీలో ఉన్నది 



ఛి ఛి అంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

ఛి ఛి అంటే



దండకం పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: గోపీచంద్ , గంగాధర్ శాస్త్రి

దండకం



ఇలాగె ఇలాగే పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష

ఇలాగె ఇలాగే



కాకులు దూరని పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, రవివర్మ

కాకులు దూరని



అభిమన్యుడు కాడు వీడు పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: బృందం గాయని గాయకులు

అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు 
ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు 
అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 
అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 
ఎవ్వరండ లేదు ఒంటరైతే కాడు 
వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు 

అమ్మ జీవితం తోడు అసలు ఓడిపొడు 
ఎంత శత్రువైనా అంతు తేల్చుతాడు 
శక్తి ఉంది యుక్తి ఉంది 
గుండె నిండా ధమ్ము ఉంది 
అస్త్రం ఉంది లక్ష్యం ఉంది 
మొక్కవోని దీక్ష ఉంది 
అగ్గి పిడుగు వీడు 
సామన్యుడు కాడు 
దెబ్బ తిన్న పులిలా ఇక దూకుతాడు 

అభిమన్యుడు కాడు వీడు 
అర్జునుడు కాడు 
ప్రజలందరి లోన ఒకడు 
సామన్యుడు వీడు 
అభిమన్యుడు లాగ వీడు అర్ధ జ్ఞాని కాడు 
అర్జునుడికి ఆనాడు శ్రీక్రిష్ణుడు తోడు 
ఎవ్వరండ లేడు 
ఒంటరైతే కాడు 
వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు




చర చర పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఉష, మూర్తి

చర చర 



రంగు రంగుల పాట సాహిత్యం

 
చిత్రం: నిజం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

రంగు రంగుల

Palli Balakrishna Monday, July 31, 2017
Idiot (2002) Telugu Songs Lyrics Album Cover

Idiot (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Idiot (2002)
Music : Chakri
Director : Puri Jagannadh
Producer : Puri Jagannadh
Actors : Ravi Teja
Actresses : Rakshita
Release Date : 22 August 2002

Sye Sara Sye Song Lyrics in Telugu – Idiot (2002)

'Sye Sara Sye' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Chakri.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Chakri
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: చక్రి సై సర సర సై వెయ్ చిరు చిందెయ్ సై సై సై సై సై సై సై సర సర సై సై సై సై సై సై సై వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నింగిలోని తార నీ చేతిలోకి రాదా తల దిండు తీసి లేరా దునియాను దున్నుకోరా నవ్వే నువ్వై నిప్పు రవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ చేసేదేదైనా చెప్పేదేదైనా చేసెయ్ జంకుబొంకు లేకుండా పిందే పండైనా ఎక్కెయ్ ఎవరెస్టైనా సాహసంతో సావాసం చేసెయ్ రా చివరి వీధి నిండా ఎగరెయ్యి ప్రేమ జెండా చిరాకు నీకు లేస్తే అమ్మెయ్ రా గోల్కొండ నిన్న తప్పు తలుచుకొని ఫీల్ కాకురా తప్పువల్ల కొత్త నిజం తెలుసుకోరా చాన్సు ఉంటే మళ్ళీ తప్పు చేసి చూడరా చేసిన ఆ తప్పే మళ్ళీ చేయమాకు, చేయమాకు బిల్ గేట్సే గొప్ప కాదురా, ఓరయ్య రయ్యా నీకు నువ్వే కింగు సోదరా నవ్వే నువ్వై నిప్పురవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ పుట్టాకెవడైనా బ్రతకాలేమైనా వేసెయ్ ముందడుగు ఇకనైనా వద్దు కొండైనా, చాలు రవ్వైనా తోసెయ్ నచ్చకుంటే దేన్నైనా కాలరెగరవేస్తూ కదిలెల్లు సామిరంగా ఎదురొస్తే ఎవ్వడైనా తన్నెయ్ సుబ్బరంగా చెయ్యగలను కానీ అనే మాటలొద్దురా గుండెలోన దమ్ములుంటే చేసి చూపరా నడిచి నడిచి పాతబడ్డ బాటలొద్దురా సత్తువుంటే కొత్త బాట వేసి చూపు, వేసి చూపు రేపు ఏంటో ఎవడికెరుకరా, ఓరయ్య రయ్యా ఉన్న నేటిననుభవించరా నవ్వే నువ్వై నిప్పురవ్వై కదంతొక్కెయ్ రా సర సర సై చిరు చిందెయ్ (వెయ్ వెయ్ వెయ్ వెయ్) సై సై సై సై సై సై సై సర సర సై సై సై సై సై సై సై వెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ చిరు చిందెయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నింగిలోని తార నీ చేతిలోకి రాదా తల దిండు తీసి లేరా దునియాను దున్నుకోరా నవ్వే నువ్వై నిప్పు రవ్వై కదంతొక్కెయ్ రా, సై

Choopultho Guchi Song Lyrics in Telugu – Idiot (2002)

'Choopultho Guchi' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: శంకర్ మహదేవన్ చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ ఒలల్ల గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే (2) నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్ నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్ ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ ఒలల్ల నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్

Cheliya Cheliya Song Lyrics in Telugu – Idiot (2002)

'Cheliya Cheliya' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Ravi Varma.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Peddada Murthy
Singers : Ravi Varma
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం: రవివర్మ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగతే చలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కళలే కలలై సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై మదిలో దిగులే రగిలే కనులా నీరే నదులై ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నవి నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనబడుతున్నవి కన్నులకి నిన మొన్నల మెరిసిన ప్రియ లయలు ఇరువురి ఎద సడి ముగిసినదా కలవరమున చెర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... రెప్పల మాటున ఉప్పెన రేపిన మేఘం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై గతమే చెరిపేదెవరు దిగులే ఆపేదెవరు కబురే తెలిపేదెవరు వలపే నిలిపేదెవరు జననం ఒకటే తెలుసు మరి తన మరణం అన్నది ఎరుగదది కాదని కత్తులు దూస్తున్నా మమకారం మాత్రం మరువదది చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చెలియా చెలిమే విడువకుమా గెలిచేదోకటే ప్రేమ సుమా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... గుండెల గుడిలో ఆరక వెలిగే దీపం ఈ ప్రేమ చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే ప్రియురాలా కనవా నా ఆవేదన ప్రియమారా వినవా ఈ ఆలాపన వలపే విషమా మగతే చలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కళలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే చెలియా...

Ee Roje Song Lyrics in Telugu – Idiot (2002)

'Ee Roje' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Kousalya.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Lyricist : Kandikonda
Singers : Kousalya
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: కందికొండ గానం: కౌశల్య ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన కన్నులులోన వెన్నెలలోన నీ రూపు తోచే ఊహాలలోన ఊసులులోన నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తోంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడు తడిమేస్తుంది తడిపేస్తుంది మధువుల వాన ఆనందమై నాలో అనుభందమై నీ ప్రేమ నను చేరి ఉడికించేరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఏయ్... ఎంటలా చూస్తున్నావ్ ? సిగ్గేస్తుంది, దగ్గరికి రావద్దు ప్లీజ్... చంటి నిన్నే అరే ఉదయించే అరుణం నేనై నిను చేరుకోన వికసించే కుసుమము నేనై నిను తాకన నీలో సడి చేయనా పని చేస్తూ పక్కన చేరి సందడి చేస్తూ గుసగుసలే పడుకుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ ఫలమేందో పండించరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీచించేటి ఓ చంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరచా ఓ కన్నా ఐ లవ్ యు రా కను రాల్చే కన్నీరువ నను చేరే పన్నీరువా నీ ఎద చాటు వలపెంతో తెలిసిందిరా చంటి... ప్లీజ్... ఛి

Le Letha Song Lyrics in Telugu – Idiot (2002)

'Le Letha' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Udit Narayan and Kousalya.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: కౌశల్య, ఉదిత్ నారాయణ్ లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా  కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా  రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  చరణం: 1  ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా  ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా  ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో...  నిను చూసినాక నా మనసు ఆపతరమా... నీ కాలి మువ్వనైపోనా నువు ఊగేటి ఊయలైరానా  నీ పూల పక్కనైపోనా తమలపాకుల్లో వక్కనై రానా  గోదారి తీరమా మంజీరనాదమా కవ్వింతలెందుకే హాయ్ రామా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  చరణం: 2  లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా  అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా  చిరు చీకటింట చేరాలి కొంటెతనమా... దరి చేరినాక పులకించు పూలవనమా... నీ గోటి గాటునైపోనా మరి నీగుండె గూటికే రానా  ఆ గోరువంకనైపోనా చెలి ఈ వాగువంకనై రానా  నాలోని భాగమా ఆ నీలిమేఘమా ఇచ్చాక ఎందుకో హైరనా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా  ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా  కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా  రంగేళి రూపమా బంగాళఖాతమా ఊరించి చేయకే హైరానా  లేలేత నవ్వులా పింగాని బొమ్మలా అందాలు అందితే అల్లుకోనా  బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా 

Jai Veeranjaneya Song Lyrics in Telugu – Idiot (2002)

'Jai Veeranjaneya' song from Idiot (2002) movie is composed by Chakri and sung by Raghu Kunche.

SONG INFORMATION
Movie : Idiot (2002)
Music : Chakri
Singers : Raghu Kunche
చిత్రం: ఇడియట్ (2002) సంగీతం: చక్రి సాహిత్యం: భాస్కరభట్ల గానం: రఘు కుంచె జై వీరాంజనేయ... ఓ... ఏయ్ దీని తస్సదియ్య... ఓ... దుమ్ము రేపే దమ్ము ఉంది చూపులోనే చురుకు ఉన్నదిరో... పంబ రేపేయ్ కుర్రోడా బెండు తీసేయ్ చిన్నోడా చెడుగుడు ఆడేయ్ బుల్లోడా నిప్పులు చెరిగేయ్ సూరీడా ప్రేమలో పడితే కష్టాలుంటాయ్ కష్టాలున్నపుడే ఈ కన్నీళ్ళోస్తాయ్ ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకులే అనుకోని ప్రేమించడం మానేస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుందిరో గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ఈ ప్రేమా ఎనకడుగేస్తే దక్కేనా వన్నెచిన్నెలా ఈ భామా తల్లిని ప్రేమిస్తాడోకడు పిల్లిని ప్రేమిస్తాడోకడు అక్కను ప్రేమిస్తాడోకడు కుక్కను ప్రేమిస్తాడోకడు అలాంటపుడు నువీ పిల్లను ప్రేమిస్తే తప్పేమిటిరో ప్రాణంగాను ప్రేమిస్తే ముందు వెనకా చూడకురో అడ్డం వస్తే ఎవడైనా తాడో పేడో తేల్చేయ్ రో ఓరోరి కుర్రోడో ఆ పిల్ల నీదేరో సీమంటూ కుట్టాక సిర్రెత్తు కొస్తాది ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది ప్రేమేగానయ్యిందంటే చచ్చేదాక అసలే వదలదురోయి విడదీయలనుకుంటున్న అయ్యెరామ ఇంచే కదలదు రోయి పెద్దోళ్ళ ఏడుపు చూసి కరగొద్దు ముద్దుల కన్నా అయ్యయ్యో అన్నావంటే నీ ప్రేమే నిండు సున్నా ప్రేమించుకోవయ్యో తప్పేమికాదయ్యో నవాబు గరీబు తేడాలే లేవంటూ ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంటా లోకంలో అన్నిటికన్నా అద్దిరబన్నా ప్రేమే గొప్పదిరోయి కుర్రోడు ముసలోడైన ఎప్పటికైనా ప్రేమలో పడతాడోయి ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చేయాలి అదికూడా కాదంటావా ప్రాణాలే తీసేయాలి ఇటు చూడు బ్రహ్మయ్యో ఇతగాడి జోరయ్యో ప్రేమించే పిల్లాడు ఎదురించి నిలిచాడు ప్రేమిస్తే ఇట్టాగే పోరాడాలన్నాడు సుడిగుండాలెన్నెదురైనా బిత్తర పోక ఒడ్డుకు చేరాలోయి బుసకొట్టే పాములు ఉన్నా తత్తరపడక బరిలో గెలవాలోయి అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా అన్నన్నా ఓరన్నా నిప్పయ్యి రేగాలన్నా ఎదురింకా లేదన్నా గెలిచేది నువ్వేనన్నా

Palli Balakrishna Monday, July 24, 2017



చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
నటీనటులు: నాగార్జున , అసీన్, రక్షిత
దర్శకత్వం: పూరీ జగన్నాధ్
నిర్మాతలు: పూరీ జగన్నాధ్
విడుదల తేది: 23.10.2003



Songs List:



ఏనాటికి మనమొకటే నని పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రఘుకుంచె, కౌశల్య

ఏనాటికి మనమొకటే నని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగ అనుకున్నా మని
తెలిసిందిలే కల గన్నా మని
కన్నీరు జోరైయింది
ఆ నీరు యేరైంది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు
ఆ నాటి సాయంత్రాలు నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నవని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా 

నీ కోసమే మిగిలున్నానిల
నువు రాక నేనింక ఎనాళ్ళిల
నా గుండెలో నీ ఆలోచన
నా కంటి పాపలో ఆవేదన
ఇది మౌన రాగల సంకీర్తన
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమునానని
నీ కోసం మిగీలునానని
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా

మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోతే ఎలా
జడివానల వచ్చి తడిపేయవ్వ
ప్రియ అంటూ ప్రేమర పిలిచెయవ్వ
నీ వైపే యెద లాగిందని
నీ చూపె అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగటమ




గోల్డ్ రంగు పెదవులు పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రవివర్మ , రేవతి 

గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి...
ఓఓ ఓ... ఓఓ ఓ...
నన్ను నీ వైపు రా.. . రమ్మన్నవి
ఓఓ ఓ... ఓఓ ఓ...
వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి
నా చిన్ని గుండెను కోస్తున్నవి
కోలో..లో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి
రారో..
ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో
మారో..
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొస్తాలే...
వస్తాలే... వస్తాలే... వస్తాలే...
ఏయ్..
గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి...
ఓఓ ఓ... ఓ ఓ ఓ...
రాశిలో కన్యలా.. వాసిలో రంభలా..
ఎందుకో నువ్విలా నచ్చుతున్నావే...
ఓఓ ఓ... ఓఓఓ...

చూపుతో కింగులా.. స్పీడుతో సుందరా..
గుండెలో సూటిగా.. గుచ్చుతున్నావే...
ఓఓ ఓ... ఓఓ ఓ...
అబ్బా సొంపుల పాపా.. అలా జారకె సోపా..
ఒక ముద్దు ముద్దరేసుకుంటె రంగుల చేపా..
జల్లుమని గిల్లుమని కోరుకుంది రా.. మరి
కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ... చలి
జల్లుమని గిల్లమని కోరుకుంది రా మరి
కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ చలి
పున్నమిలో వెన్నెలలా.. చెయ్యిపట్టి చెంతకొస్తావా...
వస్తావా... వస్తావా... వస్తావా...
ఏయ్..
గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి...
ఓఓ ఓ... ఓ ఓ ఓ...
కాశిలో నీటిలా.. గంగలో వరదలా..
లవ్వుతో నన్నిలా.. ముంచుతున్నావే..
ఓఓ ఓ... ఓఓ ఓ...

పువ్వులోతేనెలా.. ఏటిలో చేపలా..
చిలకపచ్చకోకలా.. మస్తుగున్నావే..
ఓఓ ఓ... ఓ ఓ ఓ...
ఇలా ఎప్పడు ఇట్టా.. గిచ్చి చంపుతె ఎట్టా..
ప్రతి దానికంటుంది. ఒకవేళాపాళా...
అవును అని కాదు అని ఆడుకోకే.. సుందరి
వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
ఆ..ఆ.. అవును అని కాదు అని ఆడుకోకే.. సుందరి
వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా...
వచ్చేసా... వచ్చేసా... వచ్చేసా...
గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి...
ఓయ్... ఓయ్...
ఓఓ ఓ... ఓఓ ఓ...
నన్ను నీ వైపు రా..
. రమ్మన్నవి
ఓఓ ఓ... ఓ ఓ ఓ...
ఓయ్... ఓయ్...


వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి
నా చిన్ని గుండెను కోస్తున్నవి
కోలో..
కోలో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి
రారో..
ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో
మారో...
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా...
వచ్చేసా... వచ్చేసా... వచ్చేసా...



ఏలో ఏలో ఎన్నియల్లో పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: విశ్వా
గానం: స్మిత

ఏలో ఏలో ఎన్నియల్లో.. 
తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో... 
యవ్వనాల్లో....యవ్వనాల్లో...
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో... 
జావళీల్లో... జావళీల్లో...

ఏలో ఏలో ఎన్నియల్లో.. 
కూసే గువ్వ కొమ్మలల్లో..
వచ్చే మాఘం ఎన్నినాళ్ళి... ఎన్నినాళ్ళో...
కోలో కోలో కన్నెవళ్ళో వచ్చి వాలే వానవిల్లో
రేగే నాలో కోరికేదో... కోరికేదో...
నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో..
ఊరుకోనంటు ఊసులేవో
ఉరకలేశాయి తలపుల్లో..

ఏలో ఏలో ఎన్నియల్లో
తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో... 
యవ్వనాల్లో...యవ్వనాల్లో...
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో.. జావళీల్లో...
జావళీల్లో...
నింగిలోని తారలన్నీ.. నిచ్చెనేసి అందుకో..
మెరుపుతీగె కోసుకొచ్చి... కురులలోన
తురుముకో...
వెన్నెలమ్మ వాకిట.. ముగ్గులేసి ముంగిట..
వింత వింత వేడుకే.. చేయి..
కొత్తదారి కోరితే.. హాయి..
ఆకతాయి అల్లరేనోయీ...

ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో... యవ్వనాల్లో...
యవ్వనాల్లో...
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో.. జావళీల్లో...
జావళీల్లో....
కలతలన్నీ.. పక్కనెట్టి మమతలన్నీ.. అల్లిపో..
పగలు రేయి పదిలమైన ప్రేమ లేదు పంచుకో...
రేగితున్న గాలిలా.. ఉరకలేసే ఏరులా...
సాహసంతో సాగిపోవాలి...
కొత్తపాట పాడుకోవాలి..
అంబరాలే అందుకోవాలి...

ఏలో ఏలో ఎన్నియల్లో
తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో... 
యవ్వనాల్లో...యవ్వనాల్లో...
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో...
కన్నెజాజి జావళీల్లో...
జావళీల్లో...జావళీల్లో...
నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో..
ఊరుకోనంటు ఊసులేవో.. ఉరకలేశాయి
తలపుల్లో..




రామ రామ రామా పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: కౌశల్య

రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావ రఘుకుల సోమా
బధ్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే
ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే

నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల
రెప్పలు మూయక కొలిచం కన్నుల యెదుటకు రావేల
రామ రామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రఘుకుల సోమా బధ్రాచల శ్రీరామ



మోన మోన మోన పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: చక్రి
గానం: హరిహరన్ , కౌశల్య

మోన మోన మోన మీన కనుల సోన
నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే
మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి
నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి

హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి
వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల

జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి
గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి
జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి
కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
చింతేల ప్రియభామ
నీ చెంత నేలేన
కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేన




సున్ సున్ సున్ సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: శంకర్ మహాదేవన్  , కౌశల్య

సున్ సున్ సున్ సుందరి ఊరించే క్యాడ్బర్రీ..
చేస్తానే రామరి సోకుల్ని రాబరీ..
నవ్వేనా నిండు గోదారి, ఓ బాలామణి
వెల్లువలా రావే మరి, నా సోకు గని
రానంటె ఎట్టామరి..... పరువాల పంచాక్షరి...రీ
రానంటె ఎట్టా మరి...... 8 పరువాల పంచాక్షరి.........

కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ..
గుండెల్లో తొందరా హ... హ...

చంద్రకళపైడి వల నీకు నాకు దూరమిలా..
ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల
గుండెల్లో చేరి....చేరి... గొడవే చేస్తాలే..
పున్నమిలో వెన్నెలలా.. తుంటరి నీ కన్నులిలా...
పిలిచి చంపుతుంటే.. ఏం చెయ్యాలి

చూపులతో.. చూపు కలపవోయ్ పిల్లడు
వలపేదో.. పంచి పెట్టవోయ్.... ఓయ్..
సన్నజాజి తీగలాగ, అల్లుకుంటే ఆపైనా...
పొమన్నా పోనే మరి....... నిందలొద్దె నీలాంబరీ...


కౌగిలంటే ఓకె కాని... నీ కవ్వింతే ఒట్టేయ్ మరీ...
సున్ సున్ సున్ సుందరి ఊరించే క్యాడ్బర్రీ.. రీ...

రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి
మనసే చిన్నపాటి చెరువయ్యిందే...
ఆ.. చెరువులోకి.. లోకి.. లోకి.. చేపయి వస్తాలే...
కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని
వయసే నీ వైపు పరుగులు తీసే..
ఇన్ స్పైరై పోమాకురోయ్.. పిల్లడు
ఎస్ పైరై పోతావురోయ్.... రోయ్....
ఇంత దూరమొచ్చినాక, ఇంటి తలుపులేసుకుంటు
బెట్టుచేస్తే ఎట్టామరి...హెహే... 
కమలమారి కాదాంబరి.....
ఆగకుంటె కట్టోయ్ తాళి... హెహే.. ఇచ్చేస్తా బిగి కౌగిలీ...

కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ..
గుండెల్లో తొందరా హ... హ...

సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ..
నువ్వేనా నిండు గోదారి... ఓ బాలామణి
వెల్లువలా రావే మరి, నా సోకుగని
రానంటే ఎట్టామరి.... పరువాల పంచాక్షరి......రీరీ
రానంటే ఎట్టామరి.... పరువాల పంచాక్షరి.....రీరీ......

Palli Balakrishna



చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, రక్షిత
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాత: గిరి
విడుదల: 02.01.2004



Songs List:



నిప్పు తుణకై నిప్పు తుణకై పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి

నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా

నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా

నీ గుండెలో ఉంది ఉరిమే గుణం
నీ చేతిలో ఉంది పంచే గుణం
నీ వెంట సైన్యంలా కదిలే జనం
నీకోసమిస్తుంది నీరాజనం
నెత్తురు మా సత్తువు కడదాక నువ్వు కాదా
ఎన్నడూ తల వంచక అలుసంది చెయ్యరా
ధ్యేయమే నీకుందిరా గుండెలో యమ దండిగా
మొండిగా జగమొండిగా దండెత్త నువ్వు రారా
హే...మాగుండెలో నువ్వు కొలువుండగా
ప్రతిరోజు మాకింక ఒక పండుగ

నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా

నేరాలు గోరాలు వెంటాడగా
మేమంత చేరాము నీ చెంతగా
కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా
చేయూత నిచ్చావు నీ వంతుగా
చీకటే చెలరేగితే నువు సూర్యుడయ్యి రారా
ఏటికే ఎదురీదగా మగధీరుడవ్వరా
శోకమే తొలగించగా దేశమే పులకించగా
కోపమే గర్వించగా యువరాజులాగ రారా
హే... తెలుగోడు తేజాన్ని చూపించగా
ఎవడైన వెనకడుగు వేయాలిగా

నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా
ఇంత వింతై ఇంత వింతై
ఇంత వింతై ఘణ ఘణ మోగే
ధర్మ యుద్ధం నువ్వు సిద్దం ఎవ్వడడ్డంరా
మాకోసం పుట్టిన వాడ నువ్వే మా తోడు నీడ
తొడగొడితే గడ గడ లాడాల
నువు లేస్తే యముడైనా తల దించాలిరా
అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా
హే...నీ చూపు నడిచేటి చురకత్తిరా
నీ మాటకెదురింక లేదందిరా

నిప్పు తుణకై నిప్పు తుణకై
నిప్పు తుణకై భగ భగ లాడే
వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా




గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌశల్య

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి 
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి
గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి
చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది
గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి
హే చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది
హే అందముంది అందుకే అందుకోరా
గాలమేసి లాగుతుంది విందుకేగా
హే అదిరింది అందాల మేళా

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి 
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి
గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి
చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది
హేయ్ హేయ్

చరణం: 1
కావేటి రంగా గుడివాడ దొంగ 
దోచేసి పోతే ఎట్టా చెప్పరా నాది లేత గుండెరా
రేపల్లె లచ్చిమి నీ చెయ్యి టచ్ మీ
అల్లేస్తా నిన్ను కానుకగా ప్రణాళికగా
వయసుల భరతం పడదాం పదరా
సుఖాల తీరం తీసుకు పోరా
తొందర పడకే సుందర వదన
చేద్దాం పదమరి ప్రేమల భజన
కన్నె తార రోయ్ - హయ్
కోరుకుందిరో - హయ్
ఇయ్యమందిరో కంచి పట్టుచీరరోయ్
తేనెటీగ రోయ్ - హయ్
కుట్టుతుంది రోయ్ - హయ్
కిస్సు పెట్టినా కస్సు మీద ఉందిరోయ్
వేసేటి అందాలయేన

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి 
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి
హే గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి
చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది
హేయ్ హేయ్

చరణం: 2
చెప్పేది సూటిగా చెప్పేయ్ నీటుగా
ఇచ్చేస్తా కద కాదనకా నా కన్నె చిలక
నీ నీడ చిలకా కంగారు పడక 
కానివ్వు కథ తెరవెనుక పెను భగ్గు విలక

చేసేస్తాలే అబ్రకదబ్ర
రుచి చూపిస్తా మగసిరి దెబ్బ
నీలో వాటం ఎంతుందబ్బా
ఆటాడుకుందాం రా హయిరబ్బా

సబ్బు బిళ్ళరో - హయ్
అగ్గిపుల్లరో - హయ్
తాకుతుందిరో వళ్ళు బగ్గుమందిరో
ఆడపిల్ల రోయ్ - హయ్
హద్దు దాటే రోయ్  - హయ్
అంతుచూడరోయ్ అబ్బ ఆగలేను రోయ్
అడేస్తా రంగేళి హోలీ

గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి 
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి
గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరి
చూపుతోటి వైరస్ ఏదో పంపుతున్నది
హే అందముంది అందుకే అందుకోరా
గాలమేసి లాగుతుంది విందుకేగా
హే అదిరింది అందాల మేళా




మల్లె తీగరోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌశల్య

మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడి పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది

అల్లుకోకురోయ్ అలలా గిల్లి పోకురోయ్
అగ్గిపుల్లవై నాలో భగ్గు మనకురోయ్

నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్
తాకి చూడరోయ్ నాజూకు వెన్నరోయ్
అమ్మతోడు ఆగలేనురోయ్
హే స్పీడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్
చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్
హత్తుకుంటే పట్టులే హోయ్
హోయ్ గుమ్మా గుమ్మా గుమ్మసోకు
నే ఆడేసుకుందునా ఆడసోకు
రెమ్మ రెమ్మా  తుంచమాకు హే ఆటాడుకుందాం హోయ్
హే పాతికేళ్ల పోరి వద్దకొస్తావా
అద్దుపెట్టకుండా ముద్దులిస్తావా
చీకటైనాక ఇంటికొస్తావా
నిన్ను కౌగిట్లో కుమ్మేసుకుంటా

మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్

తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్
చమకు చమకుల గులాబి నేనురోయ్
లిప్పు లిప్పు లింకు చెయ్యరోయ్
పాల బుగ్గలను పట్టేసుకుంటా
ముద్దు కుంపటి పెట్టేసుకుంటా
బుగ్గమస్తు రెడ్డుగుందిలే
మావా మావా లాగమాకు
నన్ను మొత్తంగ ముగ్గులోకి దించమాకు
భామ భామ పాల గ్లాసు
ఇక పంచేసుకుందాం హోయ్
ఓర చూపు తోటి గిల్లమకురా
పంటిగాటు లేసి చంపమాకురా
నంగ నాచి పిల్ల నాడి పట్టన
నీ సోకంత కాజేసుకోన

మల్లె తీగరోయ్ మనసే లాగుతోంది రోయ్
పిట్ట నడుమురోయ్ పిల్ల చంపుతోంది రోయ్
హే నవ్వమాకురోయ్ కలలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడి పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
లిప్స్టిక్ పెదవే లాగేస్తోంది





కొక్కో కోల మీసా పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి, కౌశల్య

పల్లవి:
కొక్కో కోల మీసా 
నీ దిల్లో కివ్వవే వీసా
కొక్కో కోల మీసా 
నా దిల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా 
నా ఫేవరెట్ ఆనియన్ దోశ

చెయ్యర చెయ్యర వీర 
మాయలు చెయ్యర శూర
కసి కసి చూపులు విసిరి 
జివ్వున లాగర ధీర
హే వద్దంటే ఆగను మళ్ళా 
అసలుకు ఎసరే పెడతా

కొక్కో కోల మీసా 
నా దిల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా 
నా ఫేవరెట్ ఆనియన్ దోశ


చరణం: 1
కన్నే కొడతా చిన్నగ లవ్ లో పడతా
కిస్సే పెడతా కిరి కిరి చేస్తా
వెన్నెల జింకా టెన్షన్ పెంచకె ఇంకా
టెంప్టైపోతే కమిటైపోతా
చూపర పచ్చని జెండా 
మొదలెట్టే సుందరకాండ
కథ కానీ వేగంగా
అంతగ ఓపిక ఉందా 
వచ్చేస్తా ఎందుకు బెంగ
మరి ఉండవవె సిద్ధంగా

నింగి నేలా కలవాల
కొత్తగ ఏదో జరగాల
హే వద్దంటే ఆగను మళ్ళా 
అసలుకు ఎసరే పెడతా

కొక్కో కోల మీసా 
నీ దిల్లో కివ్వవే వీసా
కొక్కో కోల మీసా 
నా దిల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా 
నా ఫేవరెట్ ఆనియన్ దోశ

చరణం: 2
చెయ్యే పడతా చెంపను గిల్లే పెడతా
ఓవర్ చేస్తే నేనే తాళిని కడతా
వద్దే వనజా చెంతకు రాకే గిరిజా
పై పైకొస్తే పిల్లా నీ పని పడతా
ముందర వున్నది రోజా
దున్నేసే వన్నెల రాజా
తినిపించేసే కాజా

చికిబుకు చికిబుకు రైలా
అరె నీలో ఇంతటి ఫైరా
ఫైరింజన్ తేవాలా
కోపాలెందుకు గోపాల 
కొంటెగ పిలెచెర మధుబాల
హే వద్దంటే విడవను మళ్ళా
ఈడుని ఇరుకున పెడతా


కొక్కో కోల మీసా 
నా దిల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా 
నా ఫేవరెట్ ఆనియన్ దోశ

చెయ్యర చెయ్యర వీర 
మాయలు చెయ్యర శూర
కసి కసి చూపులు విసిరి 
జివ్వున లాగర ధీర
హే వద్దంటే ఆగను మళ్ళా 
అసలుకు ఎసరే పెడతా

కొక్కొ కొక్కో కోల మీసా 
నా దిల్లో కివ్వన వీసా
ఊరించకే సమోసా 
నా ఫేవరెట్ ఆనియన్ దోశ




ఉంగా ఉంగా ఉంగా ఉంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌశల్య

పల్లవి:
లడికి................ లై

ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఊరించి పోకే వయ్యారంగా
రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా
కథాకళి ఎలా మరి వైభోగంగా
సలామని సరేనని సంతోషంగా

పొద్దున వస్తె దుద్దులు ఇస్తా 
ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
పొద్దున వస్తె దుద్దులు ఇస్తా 
రాతిరికొస్తే ముద్దులు ఇస్తా

ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా హరిలో రంగా

రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా

చరణం: 1
చూపులో కొంటె తనం
మాటలో  గడుచుదనం
దోరగా  పడుచుదనం నా కోసమా
ఉందిలే పెంకితనం గుండెలో మొండితనం
వారెవ్వా మూలదనం నీ సొంతమా
రారా రాణిలా నువ్వే మాగాణిలా
నేనేం చేసినా వద్దనకింకా
రావోయ్ రాజులా ఉన్నా విరజాజిలా
మోతే మోగని ముద్దుల ఢంకా

చెంపక మాల చెయ్యందిస్తే
బంపరుగానే అల్లాడిస్తా
చెంపక మాల చెయ్యందిస్తే
బంపరుగానే అల్లాడిస్తా
ఎడా పెడా హడా విడి 
పడేసుకుందాం

చరణం: 2
ఆకులో పచ్చదనం తోటలో వెచ్చదనం
తియ్యన బుంగతనం తిలోత్తమ
హే చూసుకో జానతనం పాడుకో జానపదం 
చేరుకో పూలరధం పురుషోత్తమా
తాజా బాలిక తదిగినతోం కూడిక
చేస్తా చూడిక తస్సా చెక్కా
ఆజా ధీటుగా లేజారే చాటుగా
వేసే ఘాటుగా పెదవిన చెక్క
ముందర కొస్తే ముక్కెర ఇస్తా
తొందరగొస్తే తక్కినవిస్తా
ముందర కొస్తే ముక్కెర ఇస్తా
తొందరగొస్తే తక్కినవిస్తా

అబ్బో అబ్బో అడాలింకా ఉల్లాసంగా

ఉంగా ఉంగా ఉంగా ఉంగా
ఊరించి పోకే వయ్యారంగా
రంగా రంగా రంగా రంగా
చూడొద్దు బాబోయ్ శృంగారంగా
కథాకళి ఎలా మరి వైభోగంగా
సలామని సరేనని సంతోషంగా

పొద్దున వస్తె దుద్దులు ఇస్తా 
ఈ రాతిరికొస్తే ముద్దులు ఇస్తా
పొద్దున వస్తె దుద్దులు ఇస్తా 
రాతిరికొస్తే ముద్దులు ఇస్తా

ఇంకా ఇంకా ఎన్నో ఇస్తా హరిలో రంగా




నైరే నైరే నై నై రే బాబా పాట సాహిత్యం

 
చిత్రం: ఆంధ్రావాలా (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి

నైరే...
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల
నాలో చూడు దమ్ముంది జాణ
నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే
చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే
అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే
కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే
రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే

నైరే నైరే...
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా


మీరే నవాల్లయ్య బాధలో తోడై ఉంటానురా
చెయ్యందిస్తానయ్య నేరుగా సాయం చేస్తాను రా
కాని పనే లేదు అనే మొండి ఘటం నేనురా
శత్రువుల గుండెలలో ప్రాణభయం నేను రా
తిడితే తిట్టాలి కొడితే కొట్టాలి
బరిలో దిగాక గెలుపు తలుపు తట్టాలి
మనసే పెట్టాలి చెలిమే కట్టాలి
మనిషై పుట్టాక కలిసి మెలసి ఉండాలి

నైరే నైరే...
నైరే నైరే నై నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల

మంచి చెడ్డేనురా సృష్టిలో రెండే కులాలురా
రారో నందామయా మంచితో జోడి కడదామురా
కష్టమని నష్టమని నువ్వు అలా ఆగక
గుప్పుమనే నిప్పు సెగై ఉవ్వెనలా మారవ
ఉరుమై పోవాలి మెరుపై రావాలి
పిడుగే పడేలా అడుగు ముందుకెయ్యాలి
చిరుతై దూకాలి భరతం పట్టాలి
ఎదురే లేదని గెలుపు దారి పోవాలి

నైరే నైరే...
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నిండి పోయి ఉంది గుండెల్లో పటాసే
చాచి పెట్టి కొడితే ఎవడైన మటాషే
అబ్బో అబ్బో లబ్బో గిబ్బో దుమ్ము దుమారే
కొట్టు కొట్టు గళ్లా పట్టు గుమ్ము గుమారే
రెచ్చిపోయి రంకెలేస్తే యమ్మ యమారే

నైరే నైరే...
నైరే నైరే నై నై రే బాబా
నైరే నైరే నై రే బాబా
నేనే నేనే దిల్దారు వాల
నాలో చూడు దమ్ముంది జాణ


Palli Balakrishna Tuesday, July 18, 2017

Most Recent

Default