చిత్రం: చాణక్య (2019)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిణి ఇవటూరి
నటీనటులు: గోపిచంద్, మెహ్రీన్ కౌర్ పిర్జాద, జీనా ఖాన్
దర్శకత్వం: తిరు
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
విడుదల తేది: 05.10.2019
డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా
ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా
నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకూ
కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకూ
అంత సీన్ లేదు రా
ఆటలాడు కోకురా
ఆడపిల్ల అడుగుతోందని
నాటకాలు మానరా
దాచిపెట్టలేవురా
మనసులోన ఉన్న ప్రేమని
నిద్దరలొ నడిచి వచ్చి
నా కలల్లో తిరుగుతూ
ఏం తెలియనట్టు ఏంటలా
పొద్దుపోని ఊసులాడి
నాతోపాటే గడుపుతూ
గుర్తుండనట్టు ఆటలా
నా మనసిది నీ ప్రేమ దాడికి
అల్లాడుతున్నది
ఈ సొగసిది నిన్ను చేరడానికి
వేచివున్నది
జగమును గెలిచిన
మగసిరి మధనుడ
ఆడ మనసు చదివి చూడరా సరిగా
డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా
ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా
నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకు
కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకు
అంత సీన్ లేదు రా
ఆటలాడు కోకురా
ఆడపిల్ల అడుగుతోందని
నాటకాలు మానరా
దాచిపెట్టలేవురా
మనసులోన ఉన్న ప్రేమని
2019
,
Chanakya
,
Gopichand
,
Mehreen Kaur Pirzada
,
Sricharan Pakala
,
Sunkara Ramabrahmam
,
Thiru
,
Vishal Chandrasekhar
,
Zareen Khan
Chanakya (2019)
Palli Balakrishna
Saturday, January 23, 2021