Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shenaz Treasurywala"




చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, షెహనాజ్
దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 30.03.2001



Songs List:



ఏనాడైనా అనుకున్నానా పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, చిత్ర

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా

నిసపా గమరి నిసపా

శిలలైనా చిగురించే చినుకంటి శ్రీమతీ
తొలిసారి తెలిసిందే చెలిమి సంగతీ
గగనాలే శిరసొంచే సుగుణాల పెన్నిధీ
వరమల్లే దొరికావే మంచి పెనిమిటీ
ఓ ప్రతి అణువు తెగబరువై నిన్ను వేడుకున్నది
జతపడుతూ సగమైతే ఎంత వేడుకన్నది
ఇన్నాళ్ళు ఇంతటి భారం అనిపించలేదుగా
నన్నేలు బంగరు ద్వారం కనిపించలేదుగా

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా

హృదయాంతరంగ శృంగారగంగ
ప్రవహించె ప్రణయ పరవశంగా
మృధుశృంగ ధార మధురామృతాలే
జతిమధన మధుర మిధునమంతా

వెలుగంటే పడదంటూ కసిరే కసిరేయిలో
తొలిపొద్దై వెలిగావే ప్రేమబంధమా
వలపంటే విషమంటూ ఉలికిపడే గుండెలో
అమృతమై కురిశావే ప్రణయమధురిమా
ఓ...మెలకువనే కల అంటూ మూసుకున్న కళ్ళకీ
ఒంటరిగా పయనిస్తూ దారి తప్పు కాళ్ళకీ
సూర్యోదయం చూపావే నూరేళ్ళ కుంకుమా
నా తీరమై నిలిచావే నా ఇంటి దీపమా

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
ఇది ఈనాడైనా నిజమేనా కలగంటున్నానా
మనసుని మరి మరి అడగనా
నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా
నీ నీడలో నా ప్రాణం మారాకు వేయగా



నడుమును చూస్తే పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: E.S. మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, అనురాధ శ్రీరాం

నడుమును చూస్తే 




మనసన్నది అన్నది పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: పోతులూరి రవి కిరణ్ 
గానం: హరిహరన్, చిత్ర 

మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ
వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ
వయ్యరాల వంపులో సరగాల కెంపులూ
నిన్నే చేరు వేలలో అదరాల ఆశలూ

మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ
వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ

వలపొల్లో సింగరం వొలికిస్తే స్రుంగారం
పాల పుంతలో ఎన్ని వింతలో
పిలుపుల్లో మధురిమలు పలికిస్తే సరిగమలు
తేనె ఓట్టులో ఎన్ని గుట్టులో
పరవసమే చెరిసగమై పరిమలించు హ్రుదయాలూ
కలవరమే కనుమరుగై పులకరించు పరువాలూ
పెనవేసి చూడనీ ప్రియురాలి నీడలో

మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ
వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ

ముద్దొచ్చే మీసాలు నవ్వుల్లో వేదాలూ
సూర్య కిరణమో సుప్రభాతమో
మెరుపుల్లో మేఘాలు కదిలొస్తే అందాలు
వాలు చూపులో ఎన్ని ఆశలో
చుక్కలకీ చంద్రునికీ చూపు చూపు కలిసిందీ
చెక్కిలిపై పెదవులతో చిలిపి కవిత వేసిందీ
ప్రనయాలు పూయనీ సరసాల తోటలో

మనసన్నది అన్నది కమ్మని కౌగిలి కొత్తగ ఉందనీ
వయసన్నది అన్నది వెచ్చని ముద్దే మత్తుగ వుందనీ
వయ్యరాల వంపులో సరగాల కెంపులూ
నిన్నే చేరు వేలలో అదరాల ఆశలూ




డమ ధమ డమ డమ పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, కృష్ణ రాజ్, శంకర్ మహదేవన్, పి. రజిని, అనురాధ శ్రీరాం 


డమ ధమ  డమ  డమ 




ఏమైందమ్మ ఈనాడు పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంటరివాడే

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు

గుడినీదే ఒడిని విడదీసె ఈ విపరీతం
ప్రాణాననికి దేహానికి కలహం పెట్టే పంతం
రామయ్య లక్ష్మయ్యా
విడిపోయె ఈ మాయా
కల్పించిన కలి వాల్మీకెవరో

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కలకలలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు

పదిమందిని నడిపించే
పెద్దరికం పోయిందా
నడి వీదికి తలవంచే
శాపం వెంటాడింద
కరిమబ్బుల తెరవేస్తె
ఒక గ్రహనం ఎదురొస్తే
రవితేజం వెల వెల బోతుందా

ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు
కనకనలాడే ఆ కల్లు కురుపించాయ కన్నీల్లు
కనిపించని ఆ మనసూ
వెన్నని ఎవరికి తెలుసూ
అంత తనవారే
అయిన తను ఒంటరివాడే



అరె ఈల కొట్టి గోలపెట్టే పాట సాహిత్యం

 
చిత్రం: ఎదురు లేని మనిషి (2001)
సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత

పల్లవి:
అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా (2)
నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు
నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు
హయ్యె రామ గడుసోడివే 
అబ్బో దసరా బుల్లోడివే

అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా 

చరణం: 1
ఎగిరే పైటల్లో గుండుసూది ఉంది 
అది నా గుండెల్లో గుచ్చుతోంది
తడిమే చేతుల్లో ఉడుము దాగివుంది
అది నా నడుముల్లో ఆడుతోంది
రగిలే సోకుల్లో భలే కుంపటున్నది
బిగిసే కౌగిట్లో నన్నే కాల్చుతున్నది
మెరిసే నా ఒంట్లో పెట్టె మంచమున్నది
ముసిరే చీకట్లో నిసే వాల్చామన్నది
అందమైన పసిదానివే హోయ్
అంతు చూసే కసిదానివే
పొద్దుటేలా దొరబాబువే మాపటేల దొంగోడివే

అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా...

కోరస్: 
హయ్యయ్యో సుబ్బు సుబ్బు
హయ్యయ్యో హయ్యయ్యో సుబ్బు సుబ్బు

చరణం: 2
మిరప తోటల్లో ఘాటు రేగుతుంది
నువు వాటేస్తే అలా మండుతున్నది
చెరుకు చేలల్లో తీపి తగులుతుంది
అది నవ్ ముద్దిస్తే దొరుకుతుంది
మావి పిందుల్లో అదో వగరు ఉంటది
నువు నా వెంటొస్తే అచ్చు అలా ఉన్నది
మల్లె పందిట్లో మరో లోకముంటది
అల్లే సందిట్లో అదే మైకమున్నది
హ పిచ్చి నీకు ముదిరిందిలే 
వరస బాగా కుదిరిందిలే
పిల్ల చాలా నిరాజానలే అయిన జోడి అదిరిందిలే

అరె ఈల కొట్టి గోలపెట్టే పిల్లా పిల్లా
నీ జోలికొచ్చి జోడికట్టి కొడతా జెల్లా
నీ ఈడు ఈత చెట్టు నీ కులుకు పూల కొట్టు
నీ సోకు మినప అట్టు అది నాకు పంచి పెట్టు
అరెరె హయ్యె రామ గడుసోడివే 
అబ్బో దసరా బుల్లోడివే
సిగ్గు చూస్తే చిన దానివే
గుండెదోచే చిత్రాంగివే..

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default