Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Upendra"
Toss (2007)


చిత్రం: టాస్ (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం:
నటీనటులు: ఉపేంద్ర, రాజా అబెల్, ప్రియమణి, కమిలిని ముఖర్జీ
దర్శకత్వం: ప్రియదర్శని రామ్
నిర్మాతలు: కె.కె.రాధామోహన్
విడుదల తేది: 14.07.2007

Palli Balakrishna Tuesday, March 26, 2019
Salute (2008)

చిత్రం: సెల్యూట్ (2008)
సంగీతం: హరీష్ జయరాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్నీ దయాల్, సాధనా సర్గమ్
నటీనటులు: విశాల్, ఉపేంద్ర, నయనతార
దర్శకత్వం: ఏ. ఆర్. రాజశేఖర్
నిర్మాత: విక్రమ్ కుమార్
విడుదల తేది: 15.08.2008

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా
రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా
కొత్తగా లవ్ లో పడుతుంటె కొద్దిగా ఇదిలా ఉంటుందే
ముందుగా మనసుకి తెలిసుందే ముందుకే నెడుతూ ఉంటుందే
తప్పు కాబోలనుకుంటూనె తప్పుకోలేననుకుంటుందే
నొప్పిలో తీపి కలుస్తుందే రెప్పలో రేపు మురుస్తుందే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా
రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా

తడవక నడిపే గొడుగనుకోనా అడుగుల సడిలో పిడుగైనా
మగతను పెంచే మగతనమున్నా మునివనిపించే బిగువేనా
ముళ్లలా నీ కళ్లలా నను గిల్లిపోతున్నా
పువ్వులా నా సున్నితాన్నే కాపు కాస్తున్నా
నాకేమవుతావో చెప్పవ ఇపుడైన
చెప్పమని అడిగేం లాభంలే
ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొశ్చన్లే
ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టె నేరాలై
కుదురుగ ఉంచని తొందరలే
దరిమిల అంతా నీ వల్లె
అంటు నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా

బిత్తరపోయే బెదురుని దించు కొత్తగ తెగువే కలిగించు
కత్తెర పదునై బిడియము తెంచు అత్తరు సుడివై నను ముంచు
చెంప కుట్టె తేనె పట్టై ముద్దులే తరమనీ
చమట పుట్టే పరుగు పెట్టి హద్దులే కరగనీ
అని అడగాలన్నా అడిగేయలేకున్న
చెప్పమని అడిగేం లాభంలే
ఎప్పుడో పొందిన ఆన్సర్లే
ఉత్తినే వేసే కొశ్చన్లే
ఊరికే తీసే ఆరాలే
నిదర చెడగొట్టె నేరాలై
కుదురుగ ఉంచని తొందరలే
దరిమిల అంతా నీ వల్లె
అంటు నిలదీసే నిందల్లే

నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా
నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా
కోపంలో నిప్పుల కొండలా
రూపంలో చుక్కల దండలా
నవ్వుల్లో చిలకమ్మలా
చిన్నారుల చేతికి బొమ్మలా
ఇంతకీ నువ్వ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా
ఇంతకీ నువ్వ్ ఒకడివా వందవా
ఎంతకీ నువ్వెవరికీ అందవా

Palli Balakrishna Saturday, September 30, 2017
Omkaram (1997)


చిత్రం: ఓంకారం (1997)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం:
గానం:
నటీనటులు: రాజశేఖర్, ప్రేమ, భాగ్యశ్రీ
దర్శకత్వం: ఉపేంద్ర
నిర్మాత: కె.కె.యన్.కుమారి
విడుదల తేది: 1997

Palli Balakrishna Monday, August 14, 2017
A (1998)

చిత్రం: A (1998)
సంగీతం: గురుకిరణ్
సాహిత్యం: భువనచంద్ర, జె. కె.భారవి,  సాహితి
గానం: యస్.పి.బాలు, మనో, మురళి, పార్థసారథి, స్వర్ణలత, లలితా సాగరి
నటీనటులు: ఉపేంద్ర, చాందిని
దర్శకత్వం: ఉపేంద్ర
నిర్మాత: పి.భాస్కర బాబు
విడుదల తేది: 1998

నా గుండె పగిలింది పది ముక్కలయ్యింది
ప్రతి ముక్క లో నువ్వే ప్రియా.....
నువు నా బ్రతుకు కోడి గట్టిన దీపం లా కొండెక్కి పోతుంది మల్లా... (3)

ఏ దిష్టి తగిలిందె మనసేమీ పొయిందె నా ఏధ లో పిడి బకులు ఏంటే
ఏదో ఏదో ఉహించి నా గుండె పగలేసి నట్టేట నను ముంచి పోకే..
నువు లేక నే బ్రతక లేనే...

నువ్వు అంటే నేనంతా నేనంటే నువ్వు అంట గువ్వాల్లా ఒకటైన జెంటా
ఆ దేవుడే సాక్షి నిన్నే నే మనువాడి నిను పువ్వులో పెట్టు కుంటా...
ప్రాణం లా కాపాడు కుంటా

ఈ లోకాన్నే ఎదిరిస్తే ఏమీనా చేసేస్తా నీ తోడు ఉంటూ చలంటా..
నే తప్పే చేసి ఉంటే ఏ శిక్ష్యేనా వెయ్యి ఆనందం గా ఒప్పుకుంటా...
నీ కల్లా కాడె పడుంటా...

అన్ని వదిలేశనే నా చెయ్యి వాడాలొద్డే నువ్వు అంటే నాకెంతో పిచ్చే ....
కను తెరవనాంతవా కను మూసుకుంటానే కాదనకే నన్ను వదిలి పోకే ...
కాదనకే నన్ను వదిలి పోకే....

Palli Balakrishna
Kanyadanam (1998)


చిత్రం: కన్యాదానం (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , ఉపేంద్ర , రచన బెనర్జీ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: అంబికా కృష్ణ , ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 1998

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే
స్టిలు బాడీ చూపుల దాడికి
సరిగమపదమని సందడి మొదలైతే                                
అడ్డెందుకు ఈ పరదా
ఉంటేనే ఆ సరదా
అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు
బంధాలే లేకుంటేనే బంధినైపోనా
 
అరె సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సింగ్నల్ ఇస్తుంటే

చరణం: 1
చాకంటి గ్రీకుసుందరి పరిచాలే ప్రేమవాకిలి
పడకింటికి చూపునాకు దారి
సెంటర్లో కొంటె కృష్ణయ్య పదుగురిలో పోజులేలయా
నీ మీదే లవ్వుకేసువేశా
లవ్వాటే మిస్టేకయితే  శిక్షేంటో  చెబుతారా          
రెస్టంటు లేకుండానే ముద్దులలో ముంచాలి
ఏకాంతపు సాయంత్రం
ఈ కాంతే నీ సొంతం
పరుగెత్తే పరువంతోనే పందెం వేద్దామ

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే

చరణం: 2
సుకుమారి స్వప్న సుందరి
మెరుపంటి మదన మంజరి
ముచ్చటగా ముద్దు తీర్చలేవా
వద్దండి అంత తొందర ముందున్నది అసలు పండగ
పద్ధతిగా కోర్సు ఉంది బాసు
లవ్ లొనే కోచింగిస్తే స్టూడెంటై సెటిలవుతా
ఆ సీనే మొదలైపోతే స్టాపంటు లేదంటా
సరదాలే తీర్చమ్మా
సరాసానికి రా ఇంకా
చిలకమ్మా.... చిక్కావంటే
చిత్రం చూపెడతా

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే
స్టిలు బాడీ చూపుల దాడికి
సరిగమపదమని సందడి మొదలైతే
అడ్డెందుకు ఈ పరదా
ఉంటేనే ఆ సరదా
అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు
బంధాలే లేకుంటేనే బంధినైపోనా





చిత్రం: కన్యాదానం (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో
వద్దయ్యో వద్దయ్యో అది మాత్రం వద్దయ్యో
వదిలేసి పొమ్మంటే వింటాన పాపాయో
చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే
అబ్బాయో ఓరబ్బాయో అది తగదంట వినవయ్యో
అవకాశం అహా కుదిరక  ఎగబడిపోనా అమ్మాయో

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో

చరణం: 1
లైలాకి వచ్చింది  లైసెస్సు ఇక చేయాలి మజ్నుతో
మగవాడికుండాలి లవ్ సెన్సు
అది ఉందంటే ఇస్తాను
ఆపలేనే ఓపలేనే చలికులుకుల చిలకమ్మో
జోడుకోసం గోడదూకే కసి వయసిది వినవయ్యో
కన్నె కోసం వెన్నెల నేనై వేచి ఉన్న
అందగత్తె ముందరికొస్తే తొందరేలా
ఒడి చేరాక మోమాటమా

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో

చరణం: 2
ఊపందుకున్నాది వయ్యారి ఇక ఊరింపు చాలంట
సిద్ధంగా ఉన్నాడే అబ్బాయి తబ శృంగార పాటలు
బుజ్జగించొ  బుగ్గగిచ్చో  చెలి సొగసుని గమనించు
ముత్యమంత ముద్దుబెట్టి సరిగమలను పలికింపు
లాయీ లాయీ జిలాయీ లాయీ చేయి వేస్తే
దాయి దాయి పందాలు కాయి జాతరేలే
కసి మేళాలు మోగాలయో

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అమ్మాయో
అసలైన అయ్యయ్యో ముందుందోయ్ అబ్బాయో
వద్దమ్మో వద్దమ్మో  అది మాత్రం వద్దమ్మో
వదిలేసి పొమ్మంటే పోతానా బుజ్జాయో
చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే
అమ్మాయో అరె అమ్మాయో అది తగదంట అమ్మాయో
అవకాశం అహా కుదిరింది ఇక ఎగబడిపోవోయ్ అబ్బాయో

Palli Balakrishna Thursday, August 3, 2017
Upendra (2000)


చిత్రం: ఉపేంద్ర (2000)
సంగీతం: గురుకిరణ్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ (All Song)
గానం: చిత్ర
నటీనటులు: ఉపేంద్ర , రవీనాటండన్ , ప్రేమ
దర్శకత్వం: ఉపేంద్ర
నిర్మాత: శిల్పా శ్రీనివాస్
విడుదల తేది: 22.10.1999

ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
మనిషికి మనసుకి ఏముంది ఏముందీ  ఏముంది ఏమేముంది

చరణం: 1
జరిగిన రోజులు మాసిపోగా నీ తలపే ఓదార్పుగా కంటికీ రెప్పకీ చీకటి వెలుగుకి ఏముంది
ప్రశ్నకీ బదులునీ అడిగినచో  ఇక ఏముంది వెతికినచో ఏమేముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

చరణం: 2
మనసంతా నువ్వు నిండివున్నా మదినిండా మరి శున్యమే
అచ్చటా ముచ్చటా ఏమిటీపని ప్రేమికా
నీదేగా కావుగా పెనిమిటి పగదే నీదేగా పెనిమిటి మాత్రం కావుగా
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది
ఎండకి నీడకి ఏముంది వాగుకి వానకి ఏముంది
ఏముంది ఏముంది నీకు నాకు నడుమా ఏముంది ఏమేముంది

Palli Balakrishna Tuesday, August 1, 2017

Most Recent

Default