Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Krishna Vamsi"
Rangamarthanda (2023)



చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: రాహుల్ సిప్లిగంజ్, శివత్మిక రాజశేఖర్, ప్రకాష్ రాజ్, రమ్యా కృష్ణ 
దర్శకత్వం: కృష్ణవంశి
నిర్మాతలు: అభిషేక్ జవల్కర్,మధు కలిపు
విడుదల తేది: 22.03.2023



Songs List:



నేనొక నటుడ్ని పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: లక్ష్మి భూపాల్ 
గానం: చిరంజీవి 

నేనొక నటుడ్ని
చంకీల బట్టలేసుకొని అట్టకిరీటం పెట్టుకొని
చెక్క కత్తి పట్టుకుని కాగితాల పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను

నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని

నేనొక నటుడ్ని
నవ్విస్తాను ఏడిపిస్తాను
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి
నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల
గందరగోళంలో బ్రతుకుతుంటాను

నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను

నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని

నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను

నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యం ఆడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రఛండంగా ప్రకాశించు రంగమార్తాండున్ని నేను

నేనొక నటుడ్ని
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ తొమ్మిది తలలు ఉన్న నటరాణుడ్ని
నింగీనేల రెండడుగులైతే
మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహున్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని

నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని

చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అణుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను

మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు
శతకోటి నమస్సులు మీకు




నన్ను నన్నుగా పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: రంజని గాయత్రీ 

ఆఆ ఆ ఆ ఆ నా ఆ
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

లోలో ఏదో వెచ్చనైన వేడుక
సిచ్చో అన్నా చల్లబడదే
నిన్ను అంతే ముచ్చటైన కోరిక
ముంచేస్తుంటే మంచిదన్నదే
దారే దరే లేని ఆశ

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా ఆ ఆఆ

మనసు నను ఎన్నడో విడిచిపోయిందనీ
ఎగసి నీ గుండెలో వలస వాలిందనీ
తెలిసి తెలిసి సయ్యన్నానో
తెలియదేమో అనుకున్నానో

తగని చొరవ కద అన్నానో
తగిన తరుణమనుకున్నానో
తలపు నిన్నొదిలి మరలిరాదే
దరిమిలా మనకిలా కలహమేలా

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా

కంటి ఎరుపేమిటో
కొంటె కబురన్నదీ
ఒంటి మెరుపేమిటో
కంది పోతున్నదీ

చిగురు పెదవులను నీ పేరు
చిదిమి చిలిపి పాటేస్తుంటే
బిడియపడకు అని నీ వేలు
అదును తెలిసి మీటుతు ఉంటే

ఉలికిపడి లేచి కలికి ఊహ
తడబడే పరుగులు త్వరపడాల

సా దనిసగ సని దనిసా నీ మదనిస నిగ మదని
దా గమదని దమగమ దా సగమ గమదని దనిసగ సగా
గ నీని సా సా దా దా నీ ని మా మ సాగమాద
నీని సా స దనిస మదని గమద నీని మదని గమద
సగమ గని మద గమ సగనిస గని సగమ దనిస
నా మగరిస రిగరిస నిదనిస నిద నిదనిస నిగమగదసని
తని దసని నిగమగమదని

నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా
నన్ను నన్నుగా ఉండనీవుగా
ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా



పూవై విరిసే ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

పూవై విరిసే ప్రాణం
పండై మురిసే ప్రాయం
రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే
తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే
నడకైనా రాని పసి పాదాలే అయినా
బతుకంతా నడిచి అలసిన అడుగులే అయినా
చెబుతాయా చేరే మజిలీ ఏదో

ఒక పాత్ర ముగిసింది నేడు
ఇంకెన్ని మిగిలాయో చూడు
నడిపేది పైనున్న వాడు
నటుడేగా నరుడన్న వాడు
తానే తన ప్రేక్షకుడు అవుతాడు
ఎవడో ఆ సూత్రధారి
తెలుసా ఓ వేషధారి 
మళ్ళీ మళ్ళీ వందేళ్లు ఎప్పుడు సరికొత్తే
ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటే 




రంగస్థలాన మర్తండుడువే అయినా పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

రంగస్థలాన  మర్తండుడువే అయినా





పెంచే బంధాలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

పెంచే బంధాలన్నీ 



నాటక రంగం వేరు పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

నాటక రంగం వేరు




నీకు తెలిసే సత్యం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

నీకు తెలిసే సత్యం  
అయినా మరుపే నిత్యం 




మగిసిందా నీ అజ్ఞాతవాసం పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ఇళయరాజా

ఏం తెలుసయ్యా సమరం 




పొదల పొదల గట్లమీద పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: రాహుల్ సిప్లిగంజ్ 

పొదల పొదల గట్లమీద 




దమిడి సే.... మంతి పాట సాహిత్యం

 
చిత్రం: రంగమార్తండ (2023)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: బల్లా విజయ్ కుమార్ 
గానం: రాహుల్ నంబియార్

దమిడి  సే.... మంతి 

Palli Balakrishna Tuesday, March 21, 2023
Danger (2005)



చిత్రం: పార్టీ (2005)
సంగీతం: జాషువా శ్రీధర్
నటీనటులు: అల్లరి నరేష్ , సాయిరామ్ శంకర్, అభిషేక్, స్వాతి రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.10.2005


Palli Balakrishna Friday, February 15, 2019
Sindhooram (1997)



చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి
నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల తేది: 06.07.1997



Songs List:



ఏడు మల్లెలెత్తు సుకుమారికి పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: ప్రదీప్, సత్యం 

ఏడు మల్లెలెత్తు సుకుమారికి 




హాయ్ రే హాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: చంద్రబోస్
గానం:  శ్రీనివాస చక్రవర్తి  (శ్రీ  కొమ్మినేని) 

హాయ్ రే హాయ్




ఓ చెలి అనార్కలి పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సురేష్ పీటర్

ఓ చెలి అనార్కలి 




ఓ లెలే ఓ లెలే పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: వాసుదేవన్, శ్రీనివాస చక్రవర్తి  (శ్రీ  కొమ్మినేని) 

ఓ లెలే ఓ లెలే



ఊరికే ఉండదే పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: కె.యస్.చిత్ర 

ఊరికే ఉండదే



అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని పాట సాహిత్యం

 
చిత్రం: సింధూరం (1997)
సంగీతం: శ్రీ  కొమ్మినేని
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి
తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన
ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల
స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

కులాల కోసం… గుంపులు కడుతూ
మతాల కోసం… మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి… తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని… స్వార్థపు ఇరుకుతనంలో
ముడుచుకు పోతూ… మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరే… తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున
ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో
సాగించే సమరం… ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన
జనాల భారతమా… ఓ అనాథ భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూరమృగంలా
దాక్కుని ఉండాలా… వెలుగుని తప్పుకు తిరగాలా

శతృవుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్త్యవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో
కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా

తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ
సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురుమిన
నెత్తుటి మందారం… ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా, చీకటిలోకా… ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా… స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా

తన తలరాతను తానే
రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని… తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని
ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని
నడిపిస్తుందట, ఆహాహా ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుండట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం చితిమంటల సిందూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా… ఓ విషాద భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి
తెచ్చిన బహుమానం… ఈ రక్తపు సిందూరం
నీ పాపిటలొ భక్తిగ దిద్దిన
ప్రజలను చూడమ్మా… ఓ పవిత్ర భారతమా!

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల
స్వేచ్ఛను చూద్దామా… దాన్నే స్వరాజ్యమందామా

Palli Balakrishna Wednesday, February 13, 2019
Ninne Pelladata (1996)



చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) 
సంగీతం: సందీప్ చౌతా 
నటినటులు: నాగార్జున, టబు
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 04.10.1996



Songs List:



ఎటో వెళ్లిపోయింది మనసు... పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) 
సంగీతం: సందీప్ చౌతా 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: రాజేష్ 

పల్లవి: 
ఎటో వెళ్లిపోయింది మనసు... 
ఎటో వెళ్లిపోయింది మనసు... 
ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో 
ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు 
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో. 

చరణం: 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ 
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ.. 
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.. 

చరణం: 2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ 
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ.. 
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..




గ్రీకువీరుడూ.. పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య

పల్లవి:
గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ 
ఫిల్మ్ స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ 
డ్రీమ్ బాయ్...
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు 
డ్రీమ్ బాయ్...
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ..ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ...
ఎంత గొప్పవాడే నావాడూ..రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ..
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా..
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా... 
స్టైల్ లో వాడంత వాడు లేడూ..
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే వాట్ టు డు
నేను కోరినా ఏకైక పురుషుడూ..ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ..
ఎందుకో...ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...

చరణం: 2
లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ

కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ..ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో...ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ...వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు...గ్రీకువీరుడు...




నా మొగుడు రాంప్యారి పాట సాహిత్యం

 
Song Details




కన్నుల్లో నీ రూపమే పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) 
సంగీతం: సందీప్ చౌతా 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: సంజీవ్, సుజాత 

పల్లవి: 
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే 
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే 
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 

చరణం: 1
మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా 
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా 
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం 

చరణం: 2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని 
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ 
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం



ఇంకా ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య

పల్లవి:
హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ

వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే

చరణం: 1
ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ...

ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి

చరణం: 2
ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ

ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో....




నిన్నే పెళ్లాడేస్తానంటూ పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996) 
సంగీతం: సందీప్ చౌతా 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామ

పల్లవి: 
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై 

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా 
సరేరా కుమారా అలాగే కానీరా 
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా 
సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం 
అహా... 
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం 
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా 
సరేరా కుమారా అలాగే కానీరా ! 

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం 

చరణం: 1
ప్రేమదాకా ఓ..కే... పెళ్లి మాత్రం షాకే.. 
చాలురా నారదా నీ హరికథ...పెళ్లయే యోగమే నీకున్నదా ? 
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా 
పార్కులో సీను .. తప్పురా శ్రీను 
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు ! 

ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా 
సరేరా కుమారా అలాగే కానీరా 
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...మ్మ్.. 

చరణం: 2
సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు.. 
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం 
విందులు మెక్కుతూ వంకలు పెడతాం...చీటికి మాటికి చెలరేగుతాం 

అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం 
పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి.. 
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా 
లలల్లా లలల్లా లలల్లా లలల్లా 

నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా 
సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం.. 
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం 
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా 
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై... 
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా...




నాతో రా తమాషాల పాట సాహిత్యం

 
Song Details

Palli Balakrishna Friday, January 18, 2019
Mogudu (2011)


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర , చిన్మయి
నటీనటులు: గోపిచంద్ , తాప్సి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
విడుదల తేది: 04.11.2011

చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని
ఇన్నాళ్ళు నాకే తెలియని
నన్ను నేనే నీలో
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా

పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టి
బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి
దేవేరిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవనిధులు వదువై వస్తుంటే
సాక్షత్తు శ్రీమనారయణుడే నేనైనట్టు

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభోముడిని అయిపోతాను
నువ్వే తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యముతో ఇంద్రపదవిని ఎదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో స్వర్గమంటే ఎమిటి అంటాను
ఎళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే
నేనే నీ వళ్ళో పాపగా చిగురిస్తుంటే



*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: గీతామాధురి

నాదేరు రానన నా హా హా రే రే హే
నా దే రు నా రే మావయ్యో మా యోయో రే రే
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు మ మ మ మొగుడు
త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత ఆ ఆ ఆ ఆ హ హ హ

మాటల్తోనే మత్తెకించే మాయ మొగుడో
చూపుల్తోనే కొంగేపచ్చి మోటు మొగుడో
అరె కొంగు వాసనొస్తే జాలుకుంటే మొగుడో
నేను తానమడుతుంటే చూసే దొంగ మొగుడో ఆహా ఆహా
బందర్ లడ్డు చింపనంటు నవిలే మొగుడో
ఆహ ఓహో అంటూ లొంగ దీసే మొగుడో ఓహో హోయ్ ఓహో
పొద్దునుండి రాత్రిదాక పొంగే మొగుడో
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడో
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
లగ లగ లగ లగ్గామే పసుపు రాసుకున్నా పగ్గామే
పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళామే మొగుడు చేతిలోన పగ్గామే హాయ్ అ అ అ అ అ అ అ అ అ హాయ్

కాలిలోన వేళ్ళల్లోన నిమిరే కొరకె
మెట్టే లాగా ఉండే సగం వెండి మొగుడు
గుండెల నడుమ గిలి గిలి చేయడానికే
తాళిబొట్టు లాగ ఉండే బంగరు మొగుడు ఆహా ఆహా
పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే తన బిడ్డతోని కడుపులో తన్నించే మొగుడో ఓహో హై ఓహో
స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది
ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది
బాసలేవొ రేపుతుంది

ఒక్క క్షణం పరిమళం పంచుతున్నది
మరుక్షణం కలవరం పెంచుతున్నది
ప్రతి క్షణం అనుభవం వింతగున్నది
ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిది
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా

మాయవో మహిమవో

ఒక్క దినం నడవడం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్నెలాగో నువ్వే వినాలంది
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఎదో తెలుపుకుందా


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మధుమిత, బాబు శంకర్

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

పప పపా మమ మగరి మగరి గమ మమమమగరిస
స సరి సారిస స సరి సారిగ
పప పపా మమ మగరి మగరి గమ మమమమ రిగరిస
స సరి స నిస స స
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
ఇంట్లో ఉంటే కొంగు వదలవని తిట్టే విరసం గావాలి
గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువు కలవరించినా అది నాపేరే కావాలి
ఔనో కాదో అనుమానంతో నే మేలుకునే ఉండాలి
నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి
అందుకనే వంద యేళ్ళు నీ ప్రాణం నాకు ఇవ్వాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

చీకటినైనా చూడనివ్వనని
చీకటినైనా చూడనివ్వనని చీరై నను చుట్టేయాలి
చెప్పకూడని ఊసులు చెప్పే రెప్పల సడి వినగనగాలి
నాలో దిగువును పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి
నేను రెచ్చిపోతుంటే ఎంతో అణుకువగా ఒదిగుండాలి
నువ్వంటూ ఏం లేనట్టూ నాలో కరిగిపోవాలి
చెప్పని తనమే చెడ్డి బొమ్మవై కొత్త కొత్త కథ రావాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్ని దయాల్, బాబు శంకర్

మన దారి హై వేరా సర సర దూసుకుపోరా
మన తీరే ఆవారా బేవార్సగా తిరిగేయరా
ఈ సాహసం ఈ సంబరం పెళ్ళయేవరకేలేరా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

ఏ బేబికైనా బీటేయి ట్రై చేస్తే క్రైం కాదోయి
ఓ బివీ వచ్చిందంటే ఏ మాత్రం వీలుండదుగా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

షాది అవుతుంది షెహజాది వస్తుంది
she will take your hand
she will take your heart
she will take everything that you have got
యేయి మామ జర జాగ్రత్త
so better be better be a bachelor boy

ఫుల్ బాటిలా ఉన్నావే ja ja johnny walker
వైఫ్ వస్తే హాఫ్ అవుతావే
సొచో ఫ్యూచర్
మ్యారేజుతో నీ గ్లామర్
మాజి యూత్ ఏగా మిస్టర్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

Palli Balakrishna Saturday, September 16, 2017
Bhale Bhale Magadivoy (2015)




చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
నటీనటులు: నాని , లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: మారుతి 
నిర్మాతలు: వి.వంశికృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, బన్నీ వాస్
విడుదల తేది: 04.09.2015



Songs List:



మొట్ట మొదటి సారి పాట సాహిత్యం

 
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: సచిన్ వారియర్

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..
హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... 
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా..
నా స్వాశనాపే బంగారు బాణాలా... 

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
మధు మంత్రం చవి చూస్తున్నా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
మర యంత్రం ఐపోతున్నా..
అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా..

ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా...
నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా..
అర చేతులందు మొలిచెను పూవనం..
నీ వల్లనే చెలీ..నా గుండే లోతుల్లో..
ఓ పాలపుంత పేలిన సంబరం...

స స ప మ ప స స..
స స ప మ ప స స..
ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
కనురెప్పల దోచెలి చాచా..
ఓ.. ఓ.. ఓ.. ఓ...
కలలోకి నిన్నే పిలిచా..
తొలి చూపున ప్రేమించా..
మలి చూపున మనసిచ్చా..
నిదురకి ఇక సెలవిచ్చా..
నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై..
నను పదమందే నీ నీడగా..
నా జత సగమై రేపటి వరమై..
నువ్వూంటావా నా తోడుగా..

హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా... 
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా..
నా స్వాశనాపే బంగారు బాణాలా... 
స స ప మ ప స స..
స స ప మ ప స స..

ప ప ని ని ప మ గ మ ప మ..
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ..
ఎదురయ్యింది చందమామా..



హెల్లొ హెల్లొ పాట సాహిత్యం

 
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: కార్తిక్ , చిన్మయి

హెల్లొ హెల్లొ ఏ మాట చెప్పాక ఓ పిల్లో 
హెల్లొ హెల్లొ వొదిలేయకే నన్నే ఊహల్లో
నెలేనే నీలో ఓ
చల్ చలో నా హల్చాల్ కర్లో న
నీ రాకతో నా లైఫ్ఎః కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ అ లోన
నా పెదలలో ఉన్నదే
నీ పదాలలో ఉన్నదే
నీకల చెప్పాలన్నదే ఇదే
హెల్లొ హెల్లొ నే వేటింగ్ నీ ఊహల్లో
హెల్లొ హెల్లొ నే తడిసానే లవ్ వెన్నల్లో 
నను చూశా నీలో హో

చల్ చలో న హల్చాల్ కార్లో న
నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లైయింగ్-అః లోన

బటర్‌ఫ్లై నేను ఫ్లవర్ అ నువ్వా
నో నో నే బెటర్ హాఫ్ ఏ నేను
హనీ నువ్వే నే హనీ బీ నేను
నో నో నీ హనీ క్వీన్ ఎః నేను

నా కలల నువ్వా నాకు నిదూరనివ్వ
నీ వొళ్లో వెన్నల్లో ఎద చదారనివ్వ
హెల్లొ హెల్లొ నేయ్ తడిసానే లవ్ వెన్నల్‌లో
హెల్లొ హెల్లొ లవ్ అట్ల్యాంటికే గుండెల్లో
మునిగా లవ్ సీ లో ఓహూ
చల్ చలో న హల్చాల్ కార్లో న
నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లైయింగ్-అః లోన

పూల కుండి అయ్యే దాచింది గుండె
ఆ పూలకు ప్రాణం నేనవ్తలే
కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే
ఆ కలలే రెప్పలు దాటిస్తలే
నాకు తెలియదు లే నిను విడువటమే
మాయల్లే మరిచలె నిను మరువడమే
హెల్లొ హెల్లొ నేయ్ తడిసనే లవ్ వెన్నల్‌లో
హెల్లొ హెల్లొ లవ్ అట్ల్యాంటిక్-ఎః గుండెల్లో
మునిగా లవ్ సీ లో ఓహూ




భలె భలె మగాడివోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: కార్తిక్ , మోహన్ భోగరాజు 


భలె భలె భలె భలె
భలె భలె భలె భలె
పేరుకేమొ వీడు నాని రెచిపోతె దోని
ఎవడెంతటొడు గాని గెకవలేడె వీడ్ని
పులొచ్చి కూర్చుంటె వీడు పులిహొర తింటాడు
సునామి వస్తుంటె వీడు స్విమ్మింగు చేస్తాడు

భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్

ఎలిజబెత్తు టైలర్ని తెచ్చి మోడ్రన్ను డ్రెస్సు కుట్టించనా
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
రేయిన్.బో లో రంగుల్ని తెచ్చి నైల్ పాలిష్ వేసెయ్యనా
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్

అందమైన హోలుపైరింగ్సు యెత్తుకొచ్చి
చిన్న దాని చెవలకేమొ రింగులెట్టనా
రౌండు గున్న చందమామ కత్తిరించి
ఓ పిల్ల పెట్టేస్త బొట్టు బిల్లా
భలె భలె భలె భలె మగాడివోయ్

భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్

నువ్వు గాని షాపింగు చేస్తె
బిల్గేట్సుతో బిల్లు కట్టించనా
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
ఫేసు బుక్కులో నువ్వేసి పెట్టినా
ఓ లక్ష లైకులు కొట్టించనా
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
కారిడారులోన పెద్ద తారు రోడ్డు వేసి
బైకు మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పనా
జేంస్ కేమరానుకేమొ కేమెరాను ఇచ్చి
మన పెల్లి ఫోటోలు తీయించనా
భలె భలె భలె భలె మగాడివోయ్

భలె భలె భలె భలె
భలె భలె భలె భలె
పేరుకేమొ వీడు నాని రెచిపోతె దోని
ఎవడెంతటొడు గాని గెకవలేడె వీడ్ని
పులొచ్చి కూర్చుంటె వీడు పులిహొర తింటాడు
సునామి వస్తుంటె వీడు స్విమ్మింగు చేస్తాడు

భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్
భలె భలె భలె భలె మగాడివోయ్




ఎందరో మహానుభావులు పాట సాహిత్యం

 
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: రేణుకా అరుణ్

ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
అందరిలో తాను ఒకడూ..
ఎందరో మహానుభావులు
అందరిలో తాను ఒకడూ..
అందుకే నా ప్రేమ పాత్రుడూ..

సొంతమూ స్వార్థామే..ఏఏ...
స్వంతమూ.. స్వార్థామే.. ఏఏ..
స్వంతమూ.. స్వార్ధామే లేక
తనవల్ల అందరూ సుఖించగానూ
చూచి భ్రహ్మానందమనుభవించు
వాడందుకే నా ప్రేమ పాత్రుడూ..ఊఊ..

సా... ససనినిసనినిసని పా.. పమపనిసరీ..
రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరీ నిసని
అందుకే నా ప్రేమ పాత్రుడు
పా... రిమప రీమ రిమప మపా నిగరిరీ 
గరి సని పనిస పనిస పాపరీ గరిస పాపమరి 
మపని రీమపని సరిమపనీ పనిసనిస 
నిసరీరి రిగరి రీగరి రిగరి రిగరి సనిస నిసని పనిసరి 

గరి నిస సని నిపమ రిమపని 
సా... నిపా.. మరి.. గరిస నిసరిసాని.. 
అందుకే నా ప్రేమ పాత్రుడు

నా ఊహలోని మన్మధుండతడు
నా హృదంతరమందగల జ్ఞాన సుందరుడు
వెన్నెలల పసిడి జల్లువలె తన ఎడ 
చల్లని వాత్సల్యము జనియించగను 
ఎయ్యది ప్రియమో నాదుభావమేమో
సత్వరమెరింగి సంతతంబునను 
గుణభజనానంద కీర్తనము సేయు
వాడందుకే నా ప్రేమ పాత్రుడు..
వాడందుకే నా ప్రేమ పాత్రుడు..
వాడందుకే నా ప్రేమ పాత్రుడు..ఊఊ..



హవ్ హవ్ పాట సాహిత్యం

 
చిత్రం: భలే భలే మగాడివోయ్ (2015)
సంగీతం: గోపిసుందర్
సాహిత్యం: భాస్కరభట్ల 
గానం: కార్తిక్ 

ఏంజెల్ అంటి పాప్నేమొ లవర్ ని చేసావ్ దేవుడా
డేంజర్ అంటి మామనేమొ విలన్ గ పెట్టవ్
అందమైన పువ్వునేమొ కనెక్ట్ చేసావ్ దేవుడా
కత్తి నేమొ కాపలాగ అడ్డంగ పెట్టావ్

హవ్ అ హవ్ హవ్ హవ్ అ హవ్
హవ్ అ హవ్ హవ్ హవ్ అ హవ్
వాట్ ఈస్ దిస్సు వంకాయ పులుసు
నా లైఫు తుస్సు
నా తిప్ప లేంటొ నికేమి తెలుసు నిమ్మకాయ పులుసూ

o my god Temple నీకు బోరింగా
that's why నాతో temple run game plying ఆ
లవ్వు చేయడానికేగ మనసిచ్చవ్
మనసు ఇవ్వడానికేగ ఫిగరిచ్చవ్
ఇచ్చినట్టె ఇచ్చి అన్ని లాగేసావ్ నన్ను లగేసావ్
మందుకు పక్కన మజ్జిగ పెట్టవ్
పాయసం పక్కన పోయిసన్ పెట్టవ్
సాడిస్టు నువ్వు తట్టుకొని బతుకుట హవ్
హవ్ హవ్ that's good

హవ్ అ హవ్ హవ్ హవ్ అ హవ్
వాట్ ఈస్ దిస్సు వంకాయ పులుసు
నా లైఫు తుస్సు
నా తిప్ప లేంటొ నికేమి తెలుసు నిమ్మకాయ పులుసూ

నాల నువ్వు డిఫెక్ట్ తోనె పుట్టుంటె
ఆపై లవ్ కి అడిక్ట్ గాని అయ్యుంటె
సామిరంగ చిరిగి చేట అయ్యేది
చేతిలోకి ఫుల్లు బాటిలొచ్చేది
నీ బ్రతుకు బస్ స్టాండు అయ్యేది
బ్లడ్డు పడేదీ...
కూలర్ పక్కన కుంపటి పెట్టవ్
పర్ఫ్యుం పక్కన కంపును పెట్టవ్

సాడిస్టు నువ్వు తట్టుకొని బతుకుట హవ్
హవ్ హవ్ that's good

హవ్ అ హవ్ హవ్ హవ్ అ హవ్
వాట్ ఈస్ దిస్సు వంకాయ పులుసు
నా లైఫు తుస్సు
నా తిప్ప లేంటొ నికేమి తెలుసు నిమ్మకాయ పులుసూ
వాట్ ఈస్ దిస్సు వంకాయ పులుసు
నా లైఫు తుస్సు
నా తిప్ప లేంటొ నికేమి తెలుసు నిమ్మకాయ పులుసూ

Palli Balakrishna Saturday, August 19, 2017
Paisa (2014)



చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నాని, కేథరిన్ త్రేస
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: రమేష్ పుప్పాల
విడుదల తేది: 07.02.2014



Songs List:



ఎప్పుడైతే పుట్టిందో పాట సాహిత్యం

 
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కృష్ణవంశీ, విఠల్ , వేణు, ధనరాజ్, తాగుబోతు రమేష్ చంద్ర

ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోని మాయదారి ఆశ
దాని చిటికనేలు పట్టుకొని వెంటపడి వచ్చిందో పైసా
ఎప్పుడైతే నేల మీద కాలు మోపినదో గాని పైసా పైసా
పచ్చిగాలి మానేసి దాన్నే పీల్చుకుంతోంది శ్వాస పైసా
కణ కణ మంటుంటే పస దిల్లంతా ఎంటో దిల్షా
కళ్ళ పడకుంటే పైసా పైసా
గల్లంతై పోదా కులాసా ఫైసా
ఏతా వాతా ఏంటంటే అందరిది ఒకటే ధ్యాస
పైసా పైసా పైసా పైసా పైసా పైసా

చరణం: 1
చితికెడు నవ్వుల కిటికీ పైసా
కడివెడు కన్నీళ్ళ గుటకే పైసా
చారెడు చెమటల ఖరీదు పైసా
బారెడు నిట్టూర్పు రసీదు పైసా
ఆకలి వేటకి ఎర ఈ పైసా
ఊహల పాటకి ధరువు ఈ పైసా
పండని పంటల ఎరువు ఈ పైసా
అందని ద్రాక్షల పులుపు ఈ పైసా
బలమున్నోళ్ళకి బానిస పైసా
బాంచన్ గాళ్ళకి బాసి పైసా
దొరక్కపొతే సమస్య పైసా
అరగక పొతే చికిస్త పైసా
ఉగ్గు కి పైసా
పెగ్ కి పైసాశక్తి కి పైసా
ముక్తి కి పైసా
నేల కి పైసాగాలి కి పైసా
నీటి కి పైసానిప్పు కి పైసా
ఎన్నన్నా ఎన్ననుకున్న
ఉన్నది ఒకటే తెలుసా పైసా
పైసా

చరణం: 2
అక్కరకొచ్చే ఆప్తుడు
చిక్కులు తెచ్చే ధూర్తుడుల్ కైసా ఫాటల్ అట్రాక్షన్ ర
టోటల్ డిస్ట్రక్టన్ రా పైసా
ఆత్మ బంధువుల హారం పైసా
అనుభందాల దారం పైసా
తేడా వస్తే అర్ధాలన్ని తలకిందులయ్యే తమాషా పైసా

అహా సంతోషం పైసా
అహా ఆక్రోశం పైసా
ఓహో సౌందర్యం పైసా
ఔరౌరా ఆశ్చర్యం పైసా
ప్రాణం తీసే పాపం పైసా
దానం చేసే పున్యం పైసా
ఇహము పైసా పరము పైసా
రుణము పైసా ధన్ము పైసా
ఒప్పు పైసా తప్పు పైసా
భయము పైసా అభయం పైసా
మానవులంతా మాట్లాడుకునే ఏకైక ప్రపంచ బాష పైసా
పైసా పైసా





గోవింద గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: టిప్పు, బేబీ టిల్లు

గోవింద గోవిందా



మయ్యా మయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: విజయ్ ప్రకాష్

మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా..
అరేబియా ఒయాసిస్ లా ఎదురయ్యిందయ్యా
అమ్మాయో అదేం మాయో మనసే లాక్కుందయ్య
రూపాయే పాపాయై నాకే దిల్ దేదియా

మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా
మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా

అరెరె
ఒహొహొ
ఏ మయ్యా మయ్యా మయ్యా మయ్యా..
అరేబియా ఒయాసిస్ లా ఎదురయ్యిందయ్యా

హెయ్ బల హెయ్ బల దొ
హెయ్ బల హెయ్ బల దొ
హెయ్ బల హెయ్ బల దొ
లబదూ...

హెయ్ బల హెయ్ బల దొ
హెయ్ బల హెయ్ బల దొ
హెయ్ బల హెయ్ బల దొ
లబదూ...
అలెలె

చరణం: 1
రెయింబో రంగేళి
రంభల్లే దిగి వస్తే
నా రాంబో నువ్వంటు రంగంలో దింపిస్తే
గోలర్ గోల్డ్ ఎదురై క్యాత్వాకింగ్ చూపెడితే
దాలర్ డార్లింగే ఒళ్ళో వాలితే
నిగ నిగ లాడే ఆ లేడీ..నన్నల్లేసిందయ్య..
ధగ ధగ లాడే సొగసంతా నా సొమ్మేసిందయ్య

మమ్మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా
మమ్మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా

చరణం: 2
భూటాన్ బంపర్ లాంటి బుగ్గే కొరికేస్తే
లక్ష్మి బాంబ్ గుండెల్లో పబ్బని పెలిదంటే
కాబొయే రాణి నా కౌగిట్లో పడితే
కాని కుర్రగాని నన్నే లవ్వాడితే
బేజా అంతే బెజారై నేన్ బేహోష్ అయిపోయా
ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా
మమ్మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా

మమ్మయ్యా మయ్యా మయ్యా మా
మయ్యా మయ్యా
మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా..
అరేబియా ఒయాసిస్ లా ఎదురయ్యిందయ్యా





నీతో ఏదో పాట సాహిత్యం

 
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్వేతమోహన్ , సాయి కార్తీక్

ఈ రోజే వయ్యా సయ్యారే హరే మొరేసా
ఈ రోజే వయ్యా సయ్యారే......
నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడు నీతో ఉండాలనిపిస్తుంది

నా పుట్టుక నీతో మొదలైంది
నీతోనే పూర్తైపోతోంది
ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి
నీకెలా చూపను నా మనసు
ఇంతకు మించి

నీతో ఏదో
అందామనిపిస్తుంది..
ఎపుడు నీతో ఉండాలనిపిస్తుంది
ఈ రోజే వయ్యా సయ్యారే హరే మొరేసా
ఈ రోజే వయ్యా సయ్యారే......

సరిగమపదనిస....
నిస నిస సగరిస నిన్నే నిస

చరణం: 1
కంటికి నువ్వు కంపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికి పో అంటే స్సయంత్రం అనుకుంట
నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీ వైపుకి కదిలే అడుగుల్నే నడక అంట
ఏమవుతావ్ నువు అంటే ఎమో తెలియదు కాని
ఏమి కావు అంటే లోలోల ఏదో నొప్పిగ ఉంటుందే

ఈ రోజే వయ్యా సయ్యారే హరే మొరేసా
ఈ రోజే వయ్యా సయ్యారే......
తెలియని దిగులవుతుంటే నేను
తలిచే గుండెల్లో

చరణం: 2
తెలియని దిగులవుతుంటే నేను
తలిచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తుందే ఆ అదుపులో
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తున్నట్టు ఒళ్ళంతా ఘుమఘుమలు
వణకడమంటే ఏంటంటే సరిగా తెలియదు కాని నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ అనుకోనీ
ఈ రోజే వయ్యా సయ్యారే హరే మొరేసా
ఈ రోజే వయ్యా సయ్యారే......

నీతో ఏదో అందామనిపిస్తుంది..
ఎపుడు నీతో ఉండాలనిపిస్తుంది




పైసా పైసా పాట సాహిత్యం

 
చిత్రం: పైసా (2014)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రంజిత్, రాహుల్ నంబియర్, కార్తిక్

పైసాలో ఉంది సౌందర్యం
పైసాయే శివం శంకరం

పైసాకంటదుర యే దోషం
పైసాయే శాశ్వతం శుభం
తళ తళ తళుకు
ధళ ధళ ధళుకు
పైసా ప ప పైసా
కల కల కలుకు
జల జల జలకు
పైసా ప ప పైసా
తిరిగే నగాష నీ దశ
పెరిగే గుస గుస
మనకే ప్రపంచం బానిస
తెలుసా....

చరణం: 1
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
ఆ.. ఆ.. ఆ..
ఓ.. ఓ.. ఓ..
ప ప పైసా
ఓ.. ఓ.. ఓ..

అల్లదిగో కలల కోట చేరుకో
బింగో అధరహో ధునియాని దున్నుకో
జల్సా కరో నైస్ గా క్లాస్ గా బిందాస్ గా నీకు నువు బాస్ గ
రిలాక్స్ గా డేస్ గడిచిపోనియ్ రా
చాన్స్ నీకివ్వాళ దొరికెరా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా

ఆ.. ఆ.. ఆ..
ధగ్ ధగ్ హో
ధగ్ ధగ్ హో
ధగ్ ధగ్ దసేరిఓ
ధగ్ ధగ్ దసేరిఓ
ధగ్ ధగ్ దసేరిఓ
పైసా పైసా

చరణం: 2
ఈ పైకమే లోకమంతా ఏలడా
ఈ డైలమే తలరాత రాయడా
పడదోసిరో పాపాం నువ్ క్యాష్ తో
కొనొచ్చురో స్వర్గమును సొమ్ముతో
ఈ జగాన కిలో సొత్తు కన్నా బలమైయన శక్తేది ఉందిరా

పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
పైసా పైసా ప ప పైసా
ధగ్ ధగ్ హో
ధగ్ ధగ్ హో
పైసా పైసా

Palli Balakrishna
Sri Anjaneyam (2004)



చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: అర్జున్, నితిన్, ఛార్మి, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ 
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: కృష్ణవంశీ
విడుదల తేది: 24.07.2004



Songs List:



ఊరేగి రావయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహాదేవన్

బోలో రామభక్త హనుమాన్ కీ....జై
ఓం మన్  మన్  మన్  ....మారుతవేగా
ఓం: తత్సత్ సత్ సత్... తాపసయోగా
ఓం  ఓం వానరనేతా ఓం నమో నమ భావి విధాతా
రామలక్ష్మణా జానకీ జయము జయము హనుమాన్ కీ
భయము భయము రాదెంతకీ జయమనరా హనుమాన్ కీ
చింత తీర్చెరా సీతకీ జయజయజయ హనుమాన్ కీ

పల్లవి:
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా
ఊరేలి చూపించు మహిమ
మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా
మా గోడు గోరంత వినుమా
వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా
వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా
రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా

చరణం: 1
బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే
బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే
చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే
జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే
ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట
బ్రహ్మచారి _ మా బ్రహ్మవంట
సరిపాటి ఎవరంట
సాహొ ...! మాసామీ నువ్వే హామీ యిస్తూంటే
రామబాణాలు కాపాడేనంట
ఓహొ మా జండాపై అండై నువ్వుంటే
రామరాజ్యాలు మావే లెమ్మంట
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా

చరణం: 2
మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు
లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు
తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి
రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు
శివతేజం నీ రూపమంట
పవమానసుతుడంట
అంజనమ్మ ఆనందమంతా
హనిమా నీ చరితంట
పాహీ...! శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట
నీకు బోయీలు మేమే లెమ్మంటా
యాహీ ....! ఆకాశాలైనా చాలని ఎత్తంట
కోటి చుక్కల్లు తల్లో పూలంటా
మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ
చూపించ రారా దయ
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ
నీనీడ చాలునయా
వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా
రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా




రామ రామ రఘురామ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: టిప్పు, శ్రేయ గోషల్

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా ఆ...ఆ...ఓ...ఓ..

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే
ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా ఇది తీరే ఋణమా...

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం అదే నామధేయం
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా...

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా ఆ...ఆ...ఓ...ఓ..




అవ్వాయి తువ్వాయీ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: టిప్పు , శ్రేయా ఘోషాల్

అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ
దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి
ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామా అసలిదేం లడాయీ
అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ

పాలోసి పెంచా ప్రతి భంగిమా పోగేసి ఉంచా పురుషోత్తమా
అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా
కంగారు పెట్టే సింగారమా బంగారమంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదాపడతావా
ఎన్నాళ్లీ గాలిలో తిరుగుడు ఇలా నా ఒళ్లో స్థిరపడే దారిచూడు
బాలమణీ సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతి బకాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ

తెగ రెచ్చిపోకే పసి పిచ్చుకా నన్నాపలేదే నీ ఓపిక
పిడుగై పడనా వ్రతమే చెడినాక
చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుకుమారమిస్తా సుఖపెట్టగా
ఒడిలో పడనా వరమే అడిగాక
కవ్వింతలెందుకే బాలికా మరీ పువ్వంటి సున్నితం కందిపోగా
చిచ్చౌతావో నువ్వే చిత్తౌతావో ఎటూ తేలందే ఇదేం బడాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ
దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి
ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో
అయ్యో రామా అసలిదేం లడాయీ





పూల ఘుమ ఘుమ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: శ్రేయ గోషల్

పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటే పామని బెదరాలా
ధీమాగ తిరగర మగరాయడా
భామంటె చూడని వ్రతమేలా
పంతాలె చాలురా ప్రవరాఖ్యుడా
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

చరణం: 1
చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా

చరణం: 2
ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై
జత లీలలో అలసి మెత్తెక్కి పోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయినీ
తాపమే తుమ్మెదై తీయనీ తేనెనీ
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలా
తేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా




శ్లోకం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: చిత్ర, కల్పన

శ్లోకం:
శ్రీ ఆంజనేయం 
ప్రసన్నాంజనేయం
శ్రీ ఆంజనేయం 
ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం 
ప్రకీర్తిప్రదాయం
ప్రభాదివ్యకాయం 
ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం 
భజే వాలగాత్రం 
భజే వాయుపుత్రం 
భజే వాలగాత్రం 
భజేహం పవిత్రం 
భజే సూర్యమిత్రం
భజేహం పవిత్రం 
భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం 
భజే బ్రహ్మతేజం
భజే రుద్రరూపం 
భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం
భజే బ్రహ్మతేజం
భజేహం భజేహం భజేహం భజేహం భజేహం భజేహం
భజేహం భజేహం భజేహం భజేహం భజేహం భజేహం
భజేహం భజేహం భజేహం భజేహం భజేహం భజేహం
భజేహం భజేహం భజేహం




తికమక మకతిక పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నడవరా నలుగురితో కలిసి
శ్రీరామ చందురుణ్ణి కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువుచేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తైదిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిది
తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసీ

చరణం: 1
వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోన అన్వేషణ
కన్నీటిపై వంతెన
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటూలేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ
తై దిదితై దిదితై దిదితై
దిది తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నడవరా నలుగురితో కలిసీ

చరణం: 2
అడివే ఐనా కడలే ఐనా
ధర్మాన్ని నడిపించు పాదాలకీ శిరసొంచి దారీయదా
అటువంటిపాదాలు పాదుకాకీ పట్టాభిషేకమే కదా
ఆ రామగాధ నువు రాసుకున్నదె కాదా
అది నేడు నీకు తగు దారి చూపనందా
ఆ అడుగులజాడలు చెరపొద్దురా మనిషీ
తై దిది తరికిటతోం
తత్తోం తికమక .... మకతిక
తికా మకా తిక తికమక మకతిక
పరుగులు ఎటుకేసి
నరవరా నడవరా నలుగురితో కలసీ.....




ఏ యోగమునుకోను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ ఆంజనేయం
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరి వెన్నెల
గానం: యస్.పి.బాలు

శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజేవాయుపుత్రం భజేవాలగాత్రం
భజేసూర్యమిత్రం భజేహం పవిత్రం
భజేరుద్రరూపం భజేబ్రహ్మ తేజం
భజేవజ్రదేహం భజేహం_భజేహం_ భజేహం

చరణం: 1
ఏ యోగమునుకోను నీతో వియోగం
ఏపుణ్యమనుకోను ఈ చేదు  జ్ణానం
తపస్సనుకోలేదు నీతోటి స్నేహం
మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం
నేలపై నిలపక నెయ్యమై నడపక
చేరువై ఇంతగా చేయి విడిచేందుకా
అరచేత కడదాక నిలుపుకోలేవంటూ
నిజము తెలిపేందుకా గాలికొడుకా
ఇలా చూపేవు వేడుకా 

చరణం: 2
రామనామము తప్ప వేరేమి వినపడని
నీ చెవికెలా తాకె నా వెర్రికేక
నీ భక్తి యోగముద్రను భంగపరిచేనా
మట్టి ఒడిలీని ఈ గడ్డిపరక
అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి
అమృతపు నదిలాంటి కరుణలో ముంచి
ఈత తెలియని నాతో ఆడుతున్నావా
కోతి చే ష్టలు చేసి నవ్వుతున్నావా

చరణం: 3
కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా
గొంతు విడిచిన కేకనిన్ను చేరేదెలా
గుండెవిడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా
నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా
బతుకోపలేనంత బరువైన వరమాల
ఉరితాడుగా మెడనుయ్ వాలి
అణువంత నా ఉనికి అణిగేంతగా
తలను నిమిరే హనుమంత నీజాలి
నా చిన్ని బొమ్మవను భ్రమను చెరిపే తెలివి
బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా
నిలువునా నన్నిలా దహించే నీ దయ
నా కెందుకయ్యా ఓ ఆంజనేయా!
ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా
ఓ ఆంజనేయా  ఓ ఆంజనేయా

Palli Balakrishna Wednesday, August 16, 2017
Gulabi (1996)



చిత్రం: గులాబీ (1996)
సంగీతం: శశి ప్రీతమ్
నటీనటులు: జె.డి.చక్రవర్తి, బ్రహ్మజీ, మహేశ్వరి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది: 03.11.1995



Songs List:



మేఘాలలో తేలిపొమ్మన్నది (Beat In My heart) పాట సాహిత్యం

 
చిత్రం: గులాబీ (1996)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, గాయత్రి

మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
heat in my thought వెంటపడి చుట్టుకుంది
oh my God ఏమిటింత కొత్తగున్నది

హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తూ వుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగా నెమలి తీరుగా మనసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఆకాశాన్నే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరి
మారదా వరద హోరుగా
వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
ఓం నమః వచ్చి పడు ఊహలకు
ఓం నమః కళ్ళు వీడు ఆశలకు
ఓం నమః ఇష్టమైన అలజడికీ

మెచ్చినట్టే వుంది రెచ్చిపోయి పిచ్చి స్పీడు
వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెం వేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగా బెదురు ఎందుకు
మనకు ఎదురింకేముంది
నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే safety వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది



ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో  పాట సాహిత్యం

 
చిత్రం: గులాబీ (1996)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 
నా గుండె ఏనాడో చేజారిపోయింది 
నీ నీడగా మారి నా వైపు రానంది 
దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో 
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను 

నడిరేయిలో నీవు..  నిదురైన రానీవు.. 
గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా కాలమూ .. 
పగలైన కాసేపు ... పని చేసుకోనీవు... 
నీ మీదనే ధ్యానము .. నీ మీదనే ధ్యానము ..
ఏ వైపు చూస్తున్నా ... నీ రూపే తోచింది... 
నువు కాక వేరేదీ .. కనిపించనంటోంది... 
ఈ ఇంద్రజాలాన్ని .. నీవేనా చేసింది... 

నీ పేరులో ఏదో ... ప్రియమైన కైపుంది.. 
నీ మాట వింటూనే  .. ఏం తోచనీకుంది.. 
నీ మీద ఆశేదో ... నను నిలవనీకుంది.. 
మతి పోయి నేనుంటే... నువు నవ్వుకుంటావు.. 

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో 
అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను



క్లాసు రూములో తపస్సు చేయుట పాట సాహిత్యం

 
చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్

క్లాసు రూములో తపస్సు చేయుట వేష్టు రా గురూ... ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ... ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ... ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురూ... ఆహా

సా నిసా నీ దపా సా నిసా నీ దపా

షీషోరులోన నిన్నొక మిస్ తెగ వేసేసిందిర ఫ్రీ షోష్స్
షాక్ అయిపోయా ప్రామిస్ అసలా షోకేందిర జస్ట్ టూ పీస్
She is like a venus so chance ఇస్తేను how nice
Wish me success...Yup... Yup...

మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్
Oh shameless simply useless mister drop all this rubbish
నీ manliness కో Litmus test రా silly full of bullshit
Life is so precious stop your foolishness
క్రేజి... క్రేజి... క్రేజి

పనిసస మగసస పనిస గరిరిస
పనిసస మగసస పనిస గరిరిస

సా నిసా నీ దపా సా నిసా నీ దపా
సినిమాలలో రీసర్చ్ చెయ్
Atleast character అవుతావురోయ్
సర్కస్ ప్రాక్టిస్ చెయరోయ్ హీరోగా పనికొస్తావోయ్
హీరో... హీరో... హీరో
సా నిసా నీ దపా సా నిసా నీ దపా
ముప్పూటలా గావ్ కేకలెయ్
ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురోయ్
రాత్రంతా టీ తాగి తెగచదివేసేమవుతావురోయ్ జీరో... జీరో... జీరో

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురూ... ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ... ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ... ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురు... ఆహా

కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలౌదురూ
క్లాసు రూములో తపస్సు చెయ్యుట వేస్ట్ రా గురూ
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ





Dream Girl పాట సాహిత్యం

 
చిత్రం: గులాబీ (1996)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చక్రి, ఊర్మిళ

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె అందమైన అమ్మయిరోయ్ 
రమ్య కృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయి రోయ్ 
ఎవ్వరు రా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది.. 
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది 

dream girl యదలో ఈల వేసే nightingale 
dream girl మెడలో మాల వేసే darling doll 

లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా.. 
hello honey welcome అని అంటూ నీ వెంట ఉన్నానని 
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని 
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని 
నమ్మలి నా మాటని తగ్గించు అల్లర్లని 

dream girl గుండెల్లో మోగే Temple bell 
dream girl దిగి రా నీలి నింగి twinkle star 


ఆటడినా మాటాడినా ఆలోచనంత తానేనని 
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారిని 
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని 
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ 

dream girl 
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు honeybee ఎక్కడుందొ ఆ baby 
కొంటె ఊసులడింది heartbeat పెంచింది ఎమిటంట దాని hobby 

What is this 
వంకయ్ పుల్స్ 
no address 
miss universe 
mental case 
అంతెలేర బాసు 
may God Bless u 

dream girl యదలో ఈల వేసే nightingale 
dream girl దిగి రా నీలి నింగి twinkle star 

dream girl నిన్నే తలచుకొంటే నిద్దర nill 
dream girl మనసే తడిసిపొయే waterfall 
dream girl త్వరగా చేరుకోవే my darling 
dream girl ఇంకా ఎంతకాలం ఈ waiting 
hey my dream girl




ఏ రోజైతే చూసానో నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: గులాబీ (1996)
సంగీతం: శశి ప్రీతమ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శశి ప్రీతమ్

ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను 
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా 
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను 
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో 
నీ రూపే నా వేచే గుండెల్లో 
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే 
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా 
నీ కష్టంలో నేను ఉన్నాను 
కరిగే నీ కన్నీరవుతా నేను 
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి 
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను 

కాలం ఏదో గాయం చేసింది 
నిన్నే మాయం చేసానంటోంది 
లోకం నమ్మి అయ్యో అంటోంది 
శోకం కమ్మి జోకొడతానంది 
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా 
ఈ జీవం నీవని సాక్షం ఇస్తున్నా 
నీతో గడిపిన ఆ నిమిషాలన్ని 
నాలో మోగే గుండెల సవ్వడులే 
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా 
నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా 

నీ కష్టంలో నేనూ ఉన్నాను 
కరిగే నీ కన్నీరవుతా నేను 
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి 
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను 
ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను 
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా 
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

Palli Balakrishna
Chandamama (2007)



చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్  
నటీనటులు: నవదీప్, శివబాలాజీ, కాజల్,  సింధు మీనన్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: సి.కళ్యాణ్, యస్.విజయానంద్
విడుదల తేది: 06.09.2007



Songs List:



రేగుముళ్ళోలె పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: కార్తీక్, యమ్.యమ్. శ్రీలేఖ, నోయెల్

రేగుముళ్ళోలె నాటు సిన్నాది బొడ్డు మల్లెను సూడు అన్నది
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

కోనేటి నీళ్ళల్లో వంగిందిరో
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గొడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యరి
చిరు నగవు చిలికి ఒకసారి కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దడతావా నువ్వు

ఆ జొన్న చేలళ్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసొహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే  తెగ కులుకులొలికె ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసే భామ ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచిళ్ళు జారకుండా ఒరే బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరే బావో ముద్దాడుతావా అంది




బుగ్గే బంగారమా పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం:  పెద్దాడ మూర్తి
గానం: రాజేష్ కృష్ణన్

సాకీ:
పచ్చిపాల యవ్వనాల గువ్వలాట 
పంచుకుంటే రాతిరంత జాతరంట

పల్లవి: 
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 

చరణం: 1
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం 
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం 
వెలిగే అందం చెలికే సొంతం వసంతం 
వరమై దొరికే అసలు సిసలు అపురూపం 
కలిసే వరకు కలలో జరిగే విహారం 
పుష్యమాసాన మంచునీవో భోగిమంటల్లొ వేడి నీవో 
పూల గంధాల గాలినీవో పాల నురగల్లొ తీపి నీవో 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 

నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో
యో నారుమల్లి తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నగమల్లి పూల తోడ నంజుకున్న ముద్దులాట
సందెకాడ కొత్తగానే ఆరుబయట ఎన్నేలెంత 
సర్దుకున్న కన్నె జంట సర్దులాయెరో

చరణం: 2
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం 
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం 
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో 
జతగా పిలిచే అగరు పొగల సహవాసం 
జడతో జగడం జరిగే సరసం ఎపుడో 
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే 
అన్ని రంగుల్లో ఆమె రూపే 
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే 
నన్ను మొత్తంగా మాయచేసే 

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మ 
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మ 
పట్టుచీరల్లొ చందమామ ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ 
కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లొ ముద్దుగుమ్మ



ఘల్లు ఘల్లు ఘల్లుమన్న పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వనమాలి
గానం: గాయత్రి, కారుణ్య

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా
ఏయ్ ఎర్ర మిరప కన్ను ఆ ఎండ పొద్దుకు
చుర్రు చుర్రంటూ గుచ్చే ఈ పల్లె బుగ్గకు
కోలో కోయిల పాట ఈ కొమ్మ గొంతుకు
ఏలో ఎన్నెల్లో ఊట ఆ కొండ కోనకు

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

చెంగు చెంగు చెంగుమంటూ తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా

నూనూగు మీసాల ఊరి పెద్దలం
ఎవడెంతటోడైన మాది పెత్తనం 
పక్కవాడు ఏడిస్తే ప్రాణమిస్తాం
బక్కవాడు కనిపిస్తే ఏడిపిస్తాం
ఎన్నుపూస లేనోణ్ణి ఎండగడతాం
ఎన్నపుస మనసుంటే ఎంట పడతాం
కాడి పట్టి దున్నుతున్న బాలచంద్రులం
ఆకలేసి అరిసినోళ్ళకన్నదాతలం హే
చిట్టిగువ్వ రెక్క రంగు చీర కట్టుకున్నది
ఉట్టిమీది ఎన్న లాగ ఊరిస్తా ఉన్నది
కొబ్బరాకు పచ్చలాంటి కొంగు తిప్పుతున్నది
జబ్బ చూసి నాటి నుంచే బెంగ పెట్టుకున్నది
నా లేత తమలాపాక నా రాజా నిమ్మలపండా
నా గున్న మామిడి మొగ్గా నాకున్న మాపటి దిక్కా

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో 
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

మేలుకోవే ఓ మనసా
మేళుకోవే ఓ మనసా
బొమ్మనే చేశాడు ప్రాణమే పోశాడు
సిరులిచ్చి దీవించి చింతలే తీర్చాడు
ఉన్ననాడే మేలుకొని ఉట్టికెక్కమన్నాడు
ఊపిరాగిపోయిందా మట్టిపాలే వీడు
మేలుకోవే  ఓ మనసా
మేలుకోవే ఒ మనసా

ప్రాయమంతా పండగే చేశావు
తల పండినాక తత్వమే చెబుతావు
అనుభవించనివ్వు ఈ వైభోగం
వయసు ఉడిగి పోయాకే వైరాగ్యం హే 

ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో
ఏలో ఏలమ్మ ఏలో ఏలో చమ్మ కేళిల ఏలో

ఛెంగు ఛెంగు ఛెంగుమంటు తుళ్ళుతున్న తుంగభద్ర
చెంగులాంటి పల్లెటూరు చెన్నకేశవా
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న ఎడ్ల బండి జోరు చూసి 
ఏరువాక సాగుతుంటే చెంత చేరవా





నాలో ఊహలకు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 
గానం: ఆషా భోంస్లే, కె.యమ్. రాధాకృష్ణన్

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ... ఆ...ఆ... ఆ...ఆ...

సనిసస నినిసస నిస సనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి (3)
ఆ... రారెరెరా...

కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
ఆ... ఆ...
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ... రారెరెరా...
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా... పరుగులుగా అవే ఇలా ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: అనంత శ్రీరామ్ 



హే సక్కుబాయినే పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: లక్ష్మి భోపాల్
గానం: జాస్సి గిఫ్ట్, మమతా మొహన్ దాస్

హే సక్కుబాయినే సక్కంగ ఉంటనే పక్కమీదనే నేనొక్కదానినే 
టక్కులాడినే తైతక్క లేడినే ఒక్కసారికే నే పొక్కిపోతనే
మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క గల్లుమంది తిక్క వేడెక్కవేంది టెక్కా

హే సక్కుబాయినే  నేనొక్కదానినే హే సక్కుబాయినే

పచ్చి కొబ్బరాకు అబ్బ గిచ్చి చంపమాకు
ఇచ్చి లేచి వస్తే నువు గజ్జకట్టమాకు

డిల్లా డిల్లా డిల్లా డిల్లా  డిల్లా డీల్లారే (2)

సక్కుబాయివే నా సక్కుబాయివే
సక్కుబాయినే నే సక్కుబాయినే

నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నలుగు పెడితే కందే ఒళ్ళు
నాదస్వరమే జడ కుచ్చిళ్ళు
నడుము సన్నా నాధ దానినే

ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడతపడ్డా నడుమే చూసే మెలిక పడ్డా నడకే చూసే
ముడత ముంజం పడతావెందుకే 
హే ఆకు వక్క సున్న కట్టి చిలకలిస్తవా
చీకు చింత సిగ్గు ఎగ్గూ వదిలిపెడతవా
హే కోక రైక కట్టు బొట్టు చెదరనీకురో
గిల్లీ గిచ్చి ఆడేయ్ మంటూ గీతలేందుకే
కాలు కింద పెట్టకుండ మల్లెలేస్తవా
బొండు మల్లె చెండు నీకు మల్లెలెందుకే
అబ్బో బీటక్కరోడివే మా సక్కనోడివే
పక్కమీదనే నేనొక్కదానినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ

అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
అత్తిపత్తి పువ్వే నువ్వు అత్తరిచ్చే సొత్తువి నువ్వు
గుత్తమొత్తం కౌలే నాదిలే 
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
సడలనీకు కసి కౌగిల్లు బెదిరిపోతాయ్ పసి మావిళ్ళ
పోంకమంతా జంకేట్టుందిరో 
హే గోలపెట్టి కాదు అంటే విడిచిపెట్టలే
హే మాటమంతి కట్టిపెట్టి బరిలొ దిగుతవా
ఎండా వానా ఉన్నా కూడా బెండు తీస్తానే
హే ఒంపు సోంపు వయ్యారాల గండికోడతవా
ఎంత సేపు సంత గోల చెంత చేరవే 
ఎగిరి అందుకుంటె నే పండుతీయన
టక్కులాడివే తైతక్క లేడివే
అబ్బా టెక్కు చూపినా నీ పక్కకోస్తినే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ
పిల్లా పిల్లా పిల్లా పిల్లా కళ్ళే తిరిగెనే... అయ్యో
చిల్లా చిల్లా మళ్ళా మళ్ళా వెలికి చూస్తినే
అల్లం మల్లం ఎగా దిగా చూసే వస్తినే
కళ్ళు ఒళ్ళు తెల్లా మల్లె దారే చూపెనే
మంచ మీదనే నీ అంతు చూస్తనే కంచె దాటినా కోర కంచరిస్తనే
పిల్ల కసిముల్లా నిలువెల్లా నేను గిల్లా 
పిల్లా సబ్బిల్లా నీ ఒల్లే రసగుళ్ళ




ముక్కుపై ముద్దు పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: హరిచరన్, సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు
కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...
ముక్కుపై ముద్దు పెట్టు 

వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు
ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు
అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు
ముక్కుపై ముద్దు పెట్టు


Palli Balakrishna Tuesday, August 1, 2017
Murari (2001)




చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
నటినటులు: మహేష్ బాబు, సోనాలి బింద్రే
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: యన్.దేవిప్రసాద్, రామలింగేశ్వర రావు
విడుదల తేది: 17.02.2001



Songs List:



అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జిక్కి, సునీత, సంధ్యా

ఆ... ఆ...
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ...ఆ...

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ...ఆ...

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు 
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ...ఆ...
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన 
కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ...
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా 
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా




భామా భామా బంగారూ పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, అనురాధ శ్రీరామ్

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ

హోయ్ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ హత్తు కోవాలీ
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ
నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ
చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ
వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ
ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి
దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ

హోయ్ హోయ్ హోయ్ 
అరె భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ

ముద్దు కావాలీ  - హోయ్ హోయ్
హత్తు కోవాలీ  - హాయ్ హాయ్
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ

భామా భామా డడ్డడా డండడార డాడా అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ

అరె భామా భామా డడ్డడా డండ  డడ డండ డడ  డండ డండడా



చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది 
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది 
ఓ మొమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది 
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది 
ఓ మొమాటం

వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా
కంటికెదురు పడతావేంటి ఎటుచూసినా
చంప గిల్లి పోతావేంటి గాలివేలితోనా
అంత గోడవపెడతావేంటి నిద్దరోతువున్న
అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా
ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా
ఇదేం అల్లరి భరిచేదెలా అంటూ నిన్నెలా కసరను
నువ్వేంచేసిన బాగుంటుందని నిజం  నీకెలా చెప్పనూ

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది 
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది 
ఓ మొమాటం

నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా
ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా
ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా
కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా
నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఒడిపోతూ ఉన్నా
లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా
ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్న
అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్న అయ్యో రామా

చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది 
ఓ ఆరాటం
తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది 
ఓ మొమాటం
నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది
ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని
చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా 
ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ య




ఎక్కడ ఎక్కడ ఉందో తారకా పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బి. చరణ్, హరిణి

ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
ఏ వూరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా

కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ
పలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ
పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ
పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీ
నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీ
మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ
సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ
ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా 
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా
ఏ వూరే అందమా ఆచూకీ అందుమా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక



అందానికే అద్దానివే పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ
పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ

అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే
అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది
హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే

నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ
నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నది

మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా
నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా
గల గల గల గల మువ్వని నేనై వస్తా
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది 
అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది



బంగారు కళ్ల బుచ్చెమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: ఉదిత్ నారాయణ్

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమన్నాదే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

చరణం: 1
నీలో చింతచిగురు పులుపున్నదే
బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
తళుకుల గుట్ట మెరుపుల తట్ట
నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటెమాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

చరణం: 2
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరిసిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల మువ్వా ముసిముసి నవ్వా
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా
మురళి కాని వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ

బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో



డుం డుం డుం నటరాజు ఆడాలి పాట సాహిత్యం

 
చిత్రం: మురారి (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా
నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరీడుగా
బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట
ఆడితప్పనేమాట  అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

హే అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా
బ్రహ్మన్న పుత్రా హే బాలచంద్ర చెయ్యెత్తి జే కొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా
వేసంగి లోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా
అరె వెలిగించరా లోని దీపం అహ తొలగించరా బుద్ధిలోపం
ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మా

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా
చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా
నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మన గీత
చిగురంతా వలపో చిలకమ్మా పిలుపో 
బులపాఠం ఉండాలిరా
పెడవుల్లో చలి ఇలా పెనవేస్తే చలి గోల చెలగాటం ఆడాలిరా
అహ మారిందిరా పాత కాలం నిండు మనసొక్కటే నీకు మార్గం

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట
ఆడితప్పనేమాట  అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default