Ninne Pelladata (1996) Telugu Songs Lyrics
Movie : Ninne Pelladata (1996)
Release Date : 4 October 1996
Yeto Vellipoyindi Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Yeto Vellipoyindi' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Rajesh Krishnan.
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
పల్లవి:
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఎటో వెళ్లిపోయింది మనసు...
ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.
చరణం: 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
చరణం: 2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
Greeku Veerudu Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Greeku Veerudu' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sowmya Raoh.
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య రావు
పల్లవి:
గ్రీకువీరుడూ గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ
ఫిల్మ్ స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ
డ్రీమ్ బాయ్...
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు
డ్రీమ్ బాయ్...
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ
ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ
ఎంత గొప్పవాడే నావాడూ
రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
చరణం: 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టైల్ లో వాడంత వాడు లేడూ
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే వాట్ టు డు
నేను కోరినా ఏకైక పురుషుడూ
ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎందుకో ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
చరణం: 2
లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ
కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
గ్రీకువీరుడు గ్రీకువీరుడు
Naa Mogudu Rampyari Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Naa Mogudu Rampyari' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Malgudi Subha, Sunitha and Rajesh Krishnan.
VIDEO
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: మాల్గుడి శుభ, సునీత, రాజేష్ కృష్ణన్
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
ఓయ్ నా మొగుడు రామ్ ప్యారే
పాన్ లిచ్చి ఫ్యాన్ వెయ్ అంటాడే ఏ తల్లి
మా ఒళ్ళు నిదరేమో పోకముందే తలుపేయ్ మంటాడే ఏ చెల్లి
అరెరే ఆగంటే సతాయిస్తుంటాడులే
సరే ఇక చాలంటే ఈరగదీస్తుంటాడులే
అదేమో నొసలని కోసరని చిందని పెదవిని ఎం చెప్పనే
కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు
పౌడర్ లు అత్తర్లు పూసుకొని రాసుకెళ్తాడే ఒకడు
సిటీ బస్సు లో పోతే భుజాలు తాకుతుంటారే చ
సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారే
అయ్యయ్యో పరువం ఎగసిన పడుచుల మగువకు ఎం తిప్పలే
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
తరవాతేంటి బుల్లెమ్మా
అయ్యో రామ నా అక్క మొగుడు
ఎం చేసాడు
ఒంటరిగుంటే వేరెక్కుతాడు
ఎదవా
ఎదురింట్లోనే బాబాయ్ గడు ఎదో వంకతో తాకుతాడు
వయసుల వరసలు తెలియని సరసాల సన్నాసులు
వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో - వామ్మో
టైపింగు సెంటర్ లో వేలుపెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ
టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే
గాజుల వ్యాపారి తేరగా నిమురుతూంటాడే
అదేంటో ఒకకోన చూపుకి పురుషులు తడపడి డాంమంటారే అః
సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు - చెప్పు చెప్పు
టీజింగ్ అంటే సరదానే మాకు - హాఆఆ
కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ
ఝిళ్ళంటుంది ప్రతి కన్నె ఈడు
యువకుల చురుకుల మగువల మనసుకు టానిక్ లే
గుండెల్లో నిప్పులను దాచినట్టు ఉంటున్నదమ్మో నాకు - అచ్చా
కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లగే అయిపోతుందమ్మో మనసు
వయసులో మీకైనా ఇలాగే ఉండి ఉంటదా
పరేషాన్ అవుతున్న ఉపాయం చెప్పకూడద
మరెంటో మది మరి అడిగిన తపనల తహ తహ ఎం చేయనే
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
చుప్ చుప్ తార తార
చుప్ చుప్ తార
కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు
అయ్యో వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే తరవాతేంట్ర
ఆఅ సిటీ బస్సులో పోతే భుజాలు తాకుతుంటారే
టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే
టైలోరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే
అదేంటో అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఎం చెప్పనే
Kannulo Nee Roopame Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Kannulo Nee Roopame' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Hariharan and K. S. Chithra.
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, కె.యస్.చిత్ర
పల్లవి:
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
చరణం: 1
మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం
చరణం: 2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం
Inka Edho Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Inka Edho' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Hariharan and Sowmya Raoh.
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య
పల్లవి:
హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే
చరణం: 1
ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ...
ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
చరణం: 2
ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో....
Ninne Pelladesthanantu Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Ninne Pelladesthanantu' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sowmya Raoh, Ramakrishna, Saandip, Rajesh and Balaram.
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య రావు, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరాం
పల్లవి:
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం
అహా...
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
సరేరా కుమారా అలాగే కానీరా !
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం
చరణం: 1
ప్రేమదాకా ఓ..కే... పెళ్లి మాత్రం షాకే..
చాలురా నారదా నీ హరికథ...పెళ్లయే యోగమే నీకున్నదా ?
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీను .. తప్పురా శ్రీను
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు !
ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...మ్మ్..
చరణం: 2
సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు..
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం...చీటికి మాటికి చెలరేగుతాం
అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి..
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా
లలల్లా లలల్లా లలల్లా లలల్లా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం..
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై...
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా...
Nathora Thamashalalo Song Lyrics in Telugu – Ninne Pelladata (1996)
'Nathora Thamashalalo' song from Ninne Pelladata (1996) movie is composed by Sandeep Chowta and sung by Sanjeev Wadhwani and Sujatha Mohan.
VIDEO
Movie : Ninne Pelladata (1996)
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవ్ వాధ్వని, సుజాత మోహన్
నువ్ నాతో రా తమాషాలలో తేలుస్తా, హే ఆవారా సుఖాలేమిటో చూపిస్తా
రికామీగా షికారేద్దాం ఆకాశంలో మకామేద్దాం
No comments
Post a Comment