-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sunkara Madhu Murali"





చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
నటీనటులు: జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి
దర్శకత్వం: కోదండరామిరెడ్డి
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 21.19.1997



Songs List:



చిన్న చిరుచిరు నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: చిత్ర

చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా 
నా ప్రేమ పోతపోసి కన్నానురా 
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా 
నీలో ఉన్నా నీతో ఉన్నా 

అటు చూడు అందాల రామచిలకని 
చూస్తోంది నిన్నేదో అడుగుదామని 
నీ పలుకు తనకి నేర్పవ  అని 
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లని 
పడుతోంది లేస్తోంది ఎందుకోమరి 
నీలాగ పరుగు చూపుదామని 
కరిగిపోని నా తీపి కలలని 
తిరిగిరాని నా చిన్నతనముని 
నీ రూపంలో చూస్తూ  ఉన్నా

తూనిగా నీలాగ ఎగరలేదుర 
అ తువ్వాయి నీలాగ గెంతలేదుర 
ఈ పరుగు ఇంకా ఎంతసేపుర 
ఈ అట ఈ పూట ఇంక చాలుర 
నా గారాల మారాజ కాస్త అగర 
నీ వెంట నేను సాగలేనురా 
ఎంతవెతికిన దొరకనంతగా 
ఎంత పిలిచినా పలకనంతగా 
వేల్లిపోకమ్మా... రారా  కన్నా 



చినుకుతడి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: హరిహరన్, చిత్ర

చినుకుతడి



కూనలమ్మ కూనలమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాలు, చిత్ర

కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా
తేనెబొమ్మ తేనెబొమ్మా తీపి పెదవి అందనీమ్మా
ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే

చెక్కిలి అద్దమా తడి ముద్దుకు సిద్ధమా
ఏమ్మా.. ఏమో.. రామ్మా.. వామ్మో
తుంటరి నేస్తమా అంత అల్లరి ఆత్రమా
ఆశా.. ఏమో.. చూశా .. వామ్మో
నడుమెక్కి ఆడేటి జడనిక్కు చూస్తుంటే
నిలువెల్ల చలిపుట్టే చిలకమ్మా
ఈడు చెలరేగిపొతుంది చూడమ్మా
వద్దొద్దు అంటున్న ఉత్తుత్తి సిగ్గుల్ని వాటంగా దాటేసి రారాదా
వచ్చి దర్జాగ దోచేసి పోరాదా
అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే

వద్దకు చేరనా వేడి ముద్దులు కోరనా
రానా.. పోనా...
వద్దని ఆపినా వదలొద్దని ఆగినా
తగువే.. ఓహొ.. తగునా..ఆహా
మనసైన నీతోనే మనువైన నీతోనే
నా మాట నమ్మవే ఓ మైనా
నిన్ను విడిచుండలేనింక ఏమైనా
పులకింత పూవాన చిలికించు నీతోని
ముడివేసుకుంటాను నీ పైనా
నీకు ఇస్తాను అడిగింది ఏదైనా
అంటూ ఎద కుంపటిలో వెన్నెల రాజేసీ కోరికతో వయసు ఉడికిపోతుంటే
కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా





ప్రియ వసంత గీతమా పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యం. యం. కీరవాణి, చిత్ర

ప్రియ వసంత గీతమా



రాయబారం పంపిందెవరే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం.యం.కీరవాణి
సాహిత్యం: యం.యం కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో   
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో   
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో   
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  
రురురుర్  రూరూరురు ....

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ  జంటను  కలిపిందెవరే  పూలతోటల్లో  
కోకిలమ్మను కుయమంటూ మల్లె వీణను మీట మంటూ  
కల్యాణి రాగల వర్ణాలలో  

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  
కోకిలమ్మను కుయమంటూ మల్లె వీణను మీట మంటూ  
కల్యాణి రాగల వర్ణాలలో  

చరణం:  1
కోయిలలో కోయిలలో కోకో కోయిల కోయోల కోయిలాలో  
నీ పాట.. తేట తేట తెనుగు పాట  
చల్లలమ్మ చద్దిముట అన్నమయ్య కీర్తనల  
ఆఆనన్ద  కేలిలా ..... 

నీ పాట.. గడుసు పిల్ల జారు పైట  
గండుమల్లె పులా తోట పల్లెటూరి బృందావనాల  
సారంగా  లీలలా 
చిరు మబ్బుల దుప్పటిలో ముసుగెట్టిన జాబిలిలా  
నులివెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా  
కోడికుసే వేల దాక వుంది పోతే మేలు అంటూ  
గారాల బేరాలు కానిమ్మంటూ  

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  

చరణం:  2
కోయిలలో కోయిలలో కోకో కోయిల కోయోల కోయిలాలో  
ఉయ్యాల... ఊపిచుదు సందెవేళ పిల్లగాలి శోభానాల  
కొండనుంచి కోన వాడికి జారేటి వాగులా  
జంపాల... జమురాతిరైన వేల జాజిపూల జవ్వనాల  
జంటకోరి జానపాడే జావళి  పాటల  
గోప్పెమ్మలు కళలు కనే గోవిందుని అందముల  
రేపల్లెకు ఉపిరిగా రవలించిన వేణువు చందముల  
హాయి రాగం తియ్యమంటూ మాయ చేసి వెళ్ళమంటూ  
రాగాల తానాలు కానిమ్మంటూ .... 
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో   

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో  
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో  




చిన్న చిరుచిరు నవ్వుల పాట సాహిత్యం

 
చిత్రం: ప్రియరాగాలు (1997)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాల

చిన్నా  చిరుచిరు  నవ్వుల  చిన్నా
కన్నా  చిట్టి  పొట్టి  చిందులు  కన్నా 


Palli Balakrishna Friday, July 23, 2021



చిత్రం: పార్టీ (2005)
సంగీతం: జాషువా శ్రీధర్
నటీనటులు: అల్లరి నరేష్ , సాయిరామ్ శంకర్, అభిషేక్, స్వాతి రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.10.2005


Palli Balakrishna Friday, February 15, 2019



చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
నటీనటులు: శోబన్ బాబు , రాజశేఖర్, జగపతిబాబు , రమ్యక్రిష్ణ
దర్శకత్వం: రవి రాజ పినిశెట్టి 
నిర్మాత: సుంకర మధు మురళి 
విడుదల తేది: 07.11.1992



Songs List:



ఇదేం మొగుడో పాట సాహిత్యం

 
చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర 

ఇదేం మొగుడో 




నీ వయస్సులో పాట సాహిత్యం

 
చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర 

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి 
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే

నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి 
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే
లాలిజో స్వరాలలో వినీలమేఘమాల నీడలో 
తాల వేణు ఊదుకున్న 
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి 
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే

వయసుకు చలివో ప్రియ చెలివో తెలియదుగానీ 
చిలకల తోలిపే మనసిపుడు తెలుపవే 
వలపుల వలవో ఒక కలవో ఎరుగనుకానీ
కనులలో వెలిగే కాంతులిపుడు తెలిసెలే
నీ లయా........ఎదకే లయా 
నీ దయా......... చెలిమీ దయా 
కోకిలమ్మ పెళ్లి విందు కొమ్మలన్నీ కోరుకున్నా   
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి 
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే

ఒకరికి ఒకరై శ్రుతి ఒకటై బ్రతుకోకపాటై 
పలికిన జతకి తొలిపలుకు వలపులే 
మనసున మనసై ఒక మనిషై మరువనితోడై 
నడిచిన కథలో అడుగడుగు మమతలే 
మల్లిలా....... విరజల్లులా 
వెల్లువా...... హరివిల్లువా
మోజులమ్మ రోజుక్కొక్క మేజువాని చేసుకున్న 
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి 
నీ మనస్సులో తపస్సుకే శిరస్సువంచెనే




అమ్మమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు , చిత్ర 

అమ్మమ్మో 




పగ పగ పాట సాహిత్యం

 
చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 

పగ పగ 



మస్తుగుంది పాట సాహిత్యం

 
చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్ కోటి 
సాహిత్యం: నందిగామ గని 
గానం: మాల్గాడి సుభ 

మస్తుగుంది 

Palli Balakrishna Wednesday, October 4, 2017



చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.11.2002



Songs List:



మేమే… ఇండియన్స్ పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శక్తి
గానం: హనీ

తికమక పెట్టే అమాయకత్వం 
చకచకలాడే వేగం
అలాగ ఉంటాం, ఇలాగ ఉంటాం,
ఆకతాయిలం మేము....

ఏయ్ చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా..!
అరె భాయ్..! ఇస్ర్టెటుగానే చేప్తా ఇనుకో

హే…సత్యం పలికే హరిశ్చంద్రులం
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం

సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం
అరె..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం
అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా 
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే ఇండియన్స్

కోరస్: మేమే… ఇండియన్స్ (4)

వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిదంటే పకీరు తత్వం
కళ్ళులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం

ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం
ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం

ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తాం
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం

రూలూ ఉంది… హ హ
రాంగూ ఉంది… హె హె
రూలూ ఉంది రాంగూ ఉంది
తప్పుకు తిరిగే లౌక్యం ఉంది

కోరస్: మేమే… ఇండియన్స్ (3)

అరె..! మేమే… ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం

వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం (4)

కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో 
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది
ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసు
దేవునికెందుకు జెండా కావాలా పార్టీ అండా

మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్ ఒట్టు
కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు

దమ్మే ఉంది… హ హ
ధైర్యం ఉంది… ఆ ఆ
దమ్మే ఉంది ధైర్యం ఉంది
తలవంచని తెగ పొగరే ఉంది

మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే ఇండియన్స్

సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం
ఓ..! సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం
రోజు తన్నుకు చస్తాం

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం
నమ్మడమేరా కష్టం
ఓ..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం
అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా 
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే ఇండియన్స్

మేమే… ఇండియన్స్ (,4)





నువ్వు నువ్వు నువ్వే నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

చరణం: 1
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ... నువ్వూ...

నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

చరణం: 2
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ నువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ... నువ్వూ...

నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ...

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ




అహ అల్లరి అల్లరి చూపులతో పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: చిత్ర, రాక్విబ్

అహ అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గింతాయే  ఈ తిక్క గాలి వలనా
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాతిరి దయ వలనా

తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న

ఊఉ..! బుగ్గే నిమురుకుంటే నాకు 
అరె మొటిమై తగులుతుంటది
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచి ఉన్నది
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడే

తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ...ఆఆఆ ఆఆఆ
దరెనా… ఆఆఆ… దరెనా… ఆఆఆ… నా

పనినిససస నిసగరినిస 
పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస
పనినిససస నిసగరినిప

మమప నీప నీప నిసనిప
మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప
మమప గగ పగగప

పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతది
తన చూపే తాకుతుంటే నన్ను
అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వానొస్తే
అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే
ఇక నా ఊపిరాగిపోతదే

తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న




ఖడ్గం ఖడ్గం పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఓం... ఓం...
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం

ఓంకారనాదంతో అంకురించిన 
వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం 
హ్రీంకారనాదంలో సంచరించే 
ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం 
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం 
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం 

తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా 
క్షణమైన తన గాథ గతములో విడిచి 
ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం 
ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం 
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం

కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం 
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం 

మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి 
కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం

ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం

హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం 
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం 
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం 
ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం 
హూంకరించి అహంకరించి 
అధిక్రమించిన ఆకతాయిల 
అంతు చూసిన క్షాత్రసత్వం 
అస్తమించని అర్థఖడ్గం 

శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన 
అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం 
జగతి మరువని ధర్మఖడ్గం

నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
గెంజాయల జిలుగీ ఖడ్గం 
తెలతెల్లని వెలుగీ ఖడ్గం 
సిరిపచ్చని చిగురీ ఖడ్గం

ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం
ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం  ఖడ్గం




గోవిందా గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: శ్రీ , దేవి శ్రీ ప్రసాద్

పల్లవి:
గోవిందా గోవిందా 
గోవిందా గోవిందా

నుదుటిరాతను మార్చేవాడా
ఉచితసేవలు చేసేవాడా
లంచమడగని ఓ మంచివాడా
లోకమంతా ఏలేవాడా

స్వార్థమంటూ లేనివాడా 
బాధలన్నీ తీర్చేవాడా
కోర్కెలే నెరవేర్చేవాడా 
నాకు నువ్వే తోడూనీడా

గోవిందా గోవిందా 
గోవిందా గోవిందా
అరె బాగుచెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా

జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు
లేనిచో హైటెక్‌సిటీ ఇవ్వు
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు
వెంటతిరిగే శాటిలైటివ్వు
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చీ...

గోవిందా గోవిందా 
గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
పైకి తే నను గోవిందా 
గోవిందా గోవిందా
అరె గోవిందా గోవిందా

చరణం: 1
పెట్రోలడగని కారు ఇవ్వు
బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత ఫుడ్డు పెట్టి
డబ్బులడగని హోటలు ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో
రాజ్యసభలో ఎంపీ సీటో
పట్టుపడని మ్యాచ్‌ఫిక్సింగ్
స్కాముల సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు 
లాసురాని షేరులివ్వు
సింగిల్ నంబర్ లాట్రీలివ్వు
ట్యాక్స్ అడగని ఆస్తులివ్వు
పనికిరాని చవటలకిచ్చి
పరమ బేవార్స్‌గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి
కోట్లకధిపతి చెయ్‌రా మెచ్చీ...

గో గో గో గో గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా

చరణం: 2
వందనోట్ల తోటలివ్వు 
గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల
కోహినూర్ డైమాండ్స్ ఇవ్వు
మాస్ హీరో ఛాన్సులివ్వు
హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న
హీరోయిన్నే వైఫుగా ఇవ్వు
హాలీవుడ్‌లో స్టూడియోనివ్వు
స్విస్సుబ్యాంక్‌లో బిలియన్లివ్వు
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు
హీరోలయ్యే మనవలనివ్వు
నన్ను కూడా సీఎం చెయ్యి
లేకపోతే పీఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని
తరిగిపోని లైఫునియ్యి॥

గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
అరె పైకి తే నను గోవిందా
గోవిందా గోవిందా
లక్కుమార్చి నన్ను కరుణిస్తే
తిరుపతొస్తా త్వరగా చూస్తే
ఏడుకొండలు ఏసి చేస్తా
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా

గోవిందా గోవిందా 
ఏడుకొండలు ఏసి చేస్తా
బాగుచెయ్ నను గోవిందా
ఎయిత్ వండర్ నీ గుడి చేస్తా

అయ్యబాబోయ్ దేవుడు
మాయమైపోయాడేంటీ..?



ముసుగు వెయ్యద్దు మనసు మీద పాట సాహిత్యం

 
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కల్పన

పల్లవి:
ఊఁ ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
హే ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో

ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా

హా ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో

చరణం: 1
సూర్యుడైనా చూపగలడ రేయిచాటున్న రేపుని
అఁ చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
హా దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ల ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా...?
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు

ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఊఁ ముసుగు వెయ్యద్దు, వలలు వెయ్యద్దు
ఎగరనివ్వాలి, తుఫాను వేగాలతో...

చరణం: 2
కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్న లేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసినడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం

ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా

ముసుగు వెయ్యద్దు మనసు మీద 
వలలు వెయ్యద్దు వయసు మీద


Palli Balakrishna Sunday, July 16, 2017



చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ , విద్యాసాగర్
నటీనటులు: తరుణ్, జనీలియా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 01.01.2009

(గమనిక: మణిశర్మ గారు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాలో రెండు పాటలను విద్యాసాగర్ గారు కంపోజ్ చేశారు అని గుర్తించగలరు )




Songs List:



ఇలా ఎంతసేపు నిన్ను చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ నంబియర్

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన 
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా 
కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన బ్రాంతివో
కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ 
మతిమరపించిన మాయవో మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన 
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా 

చరణం: 1 
శుభలేఖల నీకల స్వాగతిస్తుందో
శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ 
తీగల అల్లగ చేరుకొనుందూవో
జింకల అందక జారిపొనుందొ 
మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక 
అదుముతు ఉంచకె అంతగ ఒహ్...
అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ 
తికమకపెట్టగ ఇంతగా ఒహ్...

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన 

చరణం: 2 
మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్...
దీపమై వెలగని తరుని తిలకాన
పాపనై ఒదగని పడతి ఒడిలోనా 
నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా.
నడిపించిన పూదారిగా ఒహ్...
ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ 
బతకగనేనే నేర్పానుగా ఒహ్...




గుండెల్లో గోలిసోడా పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: జై 

గుండెల్లో గోలిసోడా



ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా... పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

ఓ చెలీ...  ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2)

చరణం: 1 
నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా 
ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టు పూలే కరిచేసినట్టు 
ఏదేదొ అవుతుందే
ఎర్రా ఎర్రాని చెంపల్లో సింధూరాలెన్నో చేరాయీ
ఉఱ్ఱూతలూగే ఊహల్లో గందాలే నింపుతున్నాయి...

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

Baby you are driving me crazy.. 
where can you where can you be 
why don't you show up and make life easy.. 

Baby you are driving me crazy.. 
where can you where can you be 
why don't you show up and make life easy.. 

ఓ చెలీ...  ఓ చెలీ... ఓ చెలీ... నా చెలీ (2)

చరణం: 2 
ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో 
నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే నే తాళలేనమ్మో 
నీ నోట రాని నా పేరే  నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కానీ ఈ జన్మే నీరంటూ లేని గోదారే...

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా ...
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా... (2)





ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం 
కలత పడుతోందే లోలోన కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగులు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం 

పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా
పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
తప్పటడుగో తప్పుఅనుకో తప్పదే తప్పుకుపోదాం
తక్షణం ఎంతో పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం




బెజవాడ పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: నవీన్, రీటా

బెజవాడ 




ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ఉబికి వస్తుంటె సంతోషం అదిమి పెడుతోందే ఉక్రోషం 
తన వెనుక నేను నా వెనక తాను 
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం 

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం


ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా 
వానల మనసును తడిపిందా
వీణల తనువును తడిమిందా 

ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా 
వానల మనసును తడిపిందా
వీణల తనవును తడిమిందా

చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
ఆద మరుపో, ఆటవిడుపో
కొద్దిగా నిలబడి చూద్దాం
ఆ క్షణంకంటె కుదరంటొంది నా ప్రాణం 
కాదంటె ఎదురు తిరిగింది నా హృదయం





నిన్నే నిన్నే అల్లుకొని పాట సాహిత్యం

 
చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ 
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని 
నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవని 
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వె నెలవు తీరేలా 
నూరెళ్ళు నన్ను నీ నివేదనవని 

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని 

చరణం: 1 
వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమని చెరను దాటించె రామ చంద్రుడా
రాధ మదిని వేదించె శ్యామ సుందరా 
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా 

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని 

చరణం: 2 
ఆశ పెంచుకున్న మమతకు ఆదారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాప గలిగిన కైలశమా
కొంగు ముళ్ళులోన ఒదిగిన వైకుంటమా 
ప్రాయమంత కరిగించి దారపోయన 
ఆయువంత వెలిగించి హారతియ్యనా...

నిన్నే నిన్నే  నిన్నే ...
ఓ నిన్నే నిన్నే  నిన్నే ...


Palli Balakrishna Thursday, July 6, 2017


చిత్రం: అల్లుడుగారు వచ్చారు (1999)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, పి. జయచంద్రన్
నటీనటులు: జగపతి బాబు, హీరా, కౌశల్య
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: సుంకర మధు మురళి, ముళ్ళపూడి బ్రహ్మానందం
విడుదల తేది: 18.06.1999

చాలి చాలని కునుకులలోన
చాలాకాలమె సతమతమైనా
నను మొత్తము తలగడ ఉన్నా
నును వెచ్చని తలుపుల పైన
వడగాలైనా జడిసేంత వేడిలో ఉన్నా

లాలి లాలిన లాలన లోన
లవ్లీ లీలల కలలను తేనా
చెలరేగిన కులకుల కూన
చలి కాగిన కౌగిలి కానా
పడిపోతున్నా లలనా లలామ లవ్ లోన

హయ్య హయ్య హయ్య హయ్య హయ్యా (3)

నాలోన తమకేం కావాలన్నా
లేలోన అననా జహాపన
దేఖోనా సరదాలో ఏ మైనా
ఓకేనా శృతి మించిపోయిన
పదునెక్కిన కత్తెర లైనా
పెదవిచ్చి లెలించ లేన
నడుమోపని ఊపున రానా
ఒడి జేర్చి ఓదార్చి పోనా
ఒకసారైనా...

చాలి చాలని కునుకులలోన
చాలాకాలమె సతమతమైనా


మే లోనే ఒనికేవు ఓ మైనా
లోలోన చలి జ్వాలలాపన
ఏదైనా రగిలించే రాగాన
ఏదైనా పలికించు నాయనా
తియ తియ్యని తిమ్మిరి తీరే
గమకాలు కోరింది జాన
మెల మెల్లగ గిల్లెను తీరై
తమకాలు మీటే స్వరాన

ఒకసారైనా...

చాలి చాలని కునుకులలోన
చాలాకాలమె సతమతమైనా
చెలరేగిన కులకుల కూన
చలి కాగిన కౌగిలి కానా
వడగాలైనా జడిసేంత వేడిలో ఉన్నా
లాలి లాలిన లాలన లోన
లవ్లీ లీలల కలలను తేనా

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default