Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sonali Bendre"



చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలకృష్ణ , సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణ
విడుదల తేది: 05.06.2003



Songs List:



గుండమ్మో గుండమ్మో పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి.బాలు, కల్పన

గుండమ్మో గుండమ్మో 




బృందావనంలో గోపెమ్మల్లే పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కల్పన , మల్లికార్జున

పల్లవి:
బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే

భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక

చరణం: 1
వెన్నాముద్దలతో కన్నె ముద్దులని కలేసి కొట్టేసేయ్
గండు తుమ్మెదలా దొండాపండంటి నా పెదాలు పట్టేసేయ్
గురువా తేనల్లే జుర్రేసెయ్
కొంగు జాడింపులో కొంటె ఊరింపులు కులాష ఎంతున్నా
బేబీ వేధింపులో తాపం  తాలింపులో తమాషా లేదమ్మా
నా భూలోక రంభమ్మ
బలిరా నరసింహ బరిలో దిద్దుకో 
తనువిస్తా నినుగాని సిరులే పంచుకో

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక

చరణం: 2
పచ్చా పచ్చని వంపు వెచ్చా వెచ్చంగ కన్ను కొట్టేసి రమ్మంటే
ఎర్రా బుగ్గలదాన ఈడు మత్తెక్కిపోయి పిచ్చోడి నవుతున్నా
నీ ఒళ్ళో పిల్లాడి నవుతున్నా
ఏదో తలచుకొని ఎన్నో కలలు కని వెర్రెక్కి పోతున్నా
నీలో మత్తెక్కె సెగ సలాము చేస్తున్నా 
నీ గులాము నౌతున్నా
సాహా జవరాల సరదా తీర్చుకో
ప్రతి పగలు ప్రతి రాత్రి నన్నే దాచుకో

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
అందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరిక
ఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటే
విరహంతో నా వయసు నిన్నే వెతికిందే

భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక
సీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుక
నా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యా
నా సొగసే నైవేద్యం పెడతా రావయ్యా

బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలిక
భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయక




బందరులో పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: శంకర్ మహదేవన్ చిత్ర 

బందరులో 




ఓసోసి పూలతీగా పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, సుజాత 

ఓసోసి పూలతీగా 
 



పలకా బలపం పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, షాలిని సింగ్ 

పలకా బలపం 
 



సరసాల సుందరయ్య పాట సాహిత్యం

 
చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కార్తీక్ , రాధిక, పూర్ణిమ 

సరసాల సుందరయ్య 

Palli Balakrishna Thursday, November 2, 2017



చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
నటీనటులు: అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 10.03.1995



Songs List:



అది అరబీ కదలందం పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: రెమో ఫెర్నాండేజ్, స్వర్ణలత 

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్లడిగానే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

చీరె వచ్చి ముందు జారే మోజులకు ఆహా ఎంత సుఖమో
పైలా పచ్చి పసి వేలే తగిలినప్పుడు ఆహా ఎంత ఇహమో
చిత్రాంగి చిలక రాత్రి పగలనక ముక్తాయించే నడుమో
అందం దాని మతమంటే లేని విధమయ్యో దివియ పదమో
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కన్నా కన్నె తీరా
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

విప్పారే తామరవే రూపాంత కన్నాలే
నీ పట్టు రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హే హే హమ్మా

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీదో చిలకో
తాపం మంచమెక్కి దీపం కొండా ఎక్కి కంట్లో వెలిగే మనస్సు
ఫనా పులుత మీద భూమి విడత పొంగి తల్లో సెగలు పెరిగే
కామం కరిగిపోయే కళ్ళే నిదరబోయే కానీ మనసు బెనికే
హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా

అది అరబీ కదలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వణుకు కౌగిళ్లడిగానే

హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా హే హే హమ్మా హమ్మా హమ్మో
హే హే హమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
హే హే హమ్మా హమ్మా
హమ్మా




కన్నానులే కలయికలు పాట సాహిత్యం

 


చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, ఏ.ఆర్.రెహమాన్ & కోరస్ 

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

ఊరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం
ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం...
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదీపం...
రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా
మూగి రేగే దావాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్
గంసుము గంసుము గుప్పుచుప్ప్
గంసుము గుప్పుచుప్

జలజలా జలజల జక్కములాడె 
జోడి వేటాడి
విల విల విల విల వెన్నెలలాడి 
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

మామ కొడుకు రాతిరి కొస్తే 
వదలకు రేచుక్కో
మంచం చెప్పిన సంగతులన్నీ 
మరువకు ఎంచక్కో

శృతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాట లాడింది నాలో

ఎంత మైమరపో 
ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే
ఎడబాటనుకో 
ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదో తెలి తామరై
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపేనులే
ఒడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే...





ఉరికే చిలకా వేచి ఉంటాను పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ

కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే

ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను

మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ





కుచ్చి కుచ్చి కూనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్ , స్వర్ణలత , GV ప్రకాష్ కుమార్ , శారద 

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ
హయ్య హయ్య హయ్య
హయ్య హయ్య హైయాయ

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు
కుందనాల కూనమ్మా పిల్లనివ్వు
ఊరువాడా నిద్దరోయె
కోడి కూడా సద్దుచేసే
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట

ఆట నెమలికి మెరుపు సుఖం
గాన కోకిలకు పిలుపు సుఖం
చెట్టు వేరుకు పాదు సుఖం
హే అమ్మడను పిలుపు సుఖం
రాకుమారుడి గెలుపు సుఖం
చంటి కడుపుకి పాలు సుఖం
మొగుడు శ్రీమతి అలకలలో
ముద్దుకన్ను ముడుపు సుఖం

రేయి పగలు పన్నిటిలో ఉన్న
రాదు మీనుకి చలి కాలం
అల్లిబిల్లిగా లాలిస్తుంటే
గారాల పూబాల కోరేది సరసం

బుజ్జి బుజ్జి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు హ హ హ హ
బుజ్జికి బుజ్జికి పాపానివ్వు
పోకిరాట వేశమొద్దు
వేడెక్కే అందాలు పెట్టు
వేధిస్తే నా మీదే ఒట్టు

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా

హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హైహయ్య
హయ్య హయ్య హాయ్
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య
హయ్య హయ్య హయ్య హయ్య
హయ్య హయ్యయ్యయ్యయ్య

చిరుత రెక్కలే పక్షివిలే
చిటికె వెలుగులే దివ్వివిలే
తోడు నీడ ఇక నీవేలే
తరగని పుణ్యమిదే
కనువు తోటివే తపనలులే
ఉరుము తోటివే మెరుపులులే
ఉన్న తోడు ఇక నీవేలే
విలువలు తెలియవులే

భూమి తిరగడం నిలబడితే
భువిని తాళమే మారదులే
మగని ఆదరణ కరువైతే
ఇల్లాలి ప్రేమంతా వేసంగి పాలే

పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
పొత్తు కోరుకున్న ఆశ
అంటుకుంది అగ్గిలాగా
బుద్దిగుంటే మంచిదంట
దూరాలు కోరింది జంట

కుచ్చి కుచ్చి కూనమ్మా
కుందనాల కూనమ్మా
కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె

కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట
నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట
ఊరువాడా సద్దులాయె
కోడి కూడా నిద్దరోయె
కుచ్చి కుచ్చి కూనమ్మా




పూలకుంది కొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: పల్లవి, శుభ , అనుపమ, నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, సుజాతా మోహన్ 

పూలకుంది కొమ్మ పాటకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నెల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తెర మస్తాన
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగ పూలకెలా దిగులు
మిన్నేటి పక్షికేది కంటి జల్లు
జాబిలెన్నడు రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దు పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
మేఘాలు గాయపడితే మేరుపల్లె నవ్వుకుంటాయి
ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతి మాత బేధాలు లేవన్నాయ్

మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
ఎగరేయ్ రెక్కలు గట్టి ఎదనింకా తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రఖ్తం
అనురాగం నీలో ఉండే ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల

కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్లు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనం లోని గానం
ప్రాణం లోని బంధం
విజయం కోరే వీరం రఖ్తం కోసాంచదా

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తాన
నీలో నేనే ఉన్న రూప్ తెర మస్తాన




మతమేల గతమేల పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: సుజాతా మోహన్ , 

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం…

కన్నీట కడగాలి… కులమన్న పాపం…
మత రక్త సిందూరం… వర్ణాలు అరుణం…
గాయాల నీ తల్లికీ…
కన్నా…! జో లాలి పాడాలిరా…

సరిహద్దులే దాటు ఆ గాలిలా… ప్రసవించనీ ప్రేమనే హాయిగా
నదులన్నీ కలిసేటి కడలింటిలో… తారల్లు విరిసేది గగనాలలో
కలలోకి జారేను ఈ రాత్రులే… వెలిగించి నవ్యోదయం

మతమేల గతమేల మనసున్న నాడు…
హితమేదో తెలియాలి మనిషైన వాడు
నీ దేశమే పూవనం… పూవై వికసించనీ జీవితం

తల ఎత్తి నిలవాలి నీ దేశము… ఇల మీదనే స్వర్గమై
భయమన్నదే లేని భవితవ్యము… సాధించరా సంఘమై…

ఒక మాట… ఒక బాట… ఒక ప్రాణమై..
సాగాలిరా ఏకమై…





ఇదు మాతృభూమి పాట సాహిత్యం

 
చిత్రం: బొంబాయి (1995)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం:  చిత్ర, శంకర్ మహదేవన్ ,   సుజాతా మోహన్ , నోయెల్ జేమ్స్, శ్రీనివాస్, శివనేషణ్ , గంగా శ్రీనివాసన్, రేణుకా, అనురాధ శ్రీరాం 

ఇదు మాతృభూమి

Palli Balakrishna Wednesday, October 4, 2017
Premikula Roju (1999) Telugu Songs Lyrics Album Cover

Premikula Roju (1999) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Starring : Kunal, Sonali Bendre Director : Kathir Producer : A. M. Rathnam Release Date : 9 July 1999

Dhaandiya Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Dhaandiya’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by M. G. Sreekumar, Unni Menon, Kavita Krishnamurthy.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : M. G. Sreekumar, Unni Menon, Kavita Krishnamurthy
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ.ఎం.రత్నం, శివగణేష్ గానం: ఉన్ని మీనన్, శ్రీకుమార్, కవితా కృష్ణమూర్తి దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ  గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు  తన ప్రేమ చెప్పేనా ఈనాడు  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు  తన ప్రేమ చెప్పేనా ఈనాడు  తన జాడేమిటో తెలియలేక నాకు  గుండెల్లో గుబులు పుట్టేనా  తన జాడేమిటో తెలియలేక నాకు  గుండెల్లో గుబులు పుట్టేనా  దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ  గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  నిన్ను చూసి నన్ను నేను మరిచి  చెప్పలేదు మూగబోయి నిలిచి  మనసులోన దాగివున్న ఆ మాట తెలిసిందా  నిన్ను చూసి నాలో నేను మురిసి  అసలు మాట చెప్పకుండా దాచి  కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా  ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా  కాటుకల్లే నేను కనుల చేరుకుంటా  పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా  ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట  కురులలోన పువ్వులన్నీ వాడెపోవునంట  నీ ప్రేమ హృదయమే పొందేనా  తాళిబొట్టు నీకు నే కట్టేనా  ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం  నా ప్రేమ - నీవేలే, నా ప్రేమ - నీవేలే... దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ  చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా ప్రేమ చూపులో ఉంది మహత్వం ప్రేమ భాషలో ఉంది కవిత్వం  ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం  ప్రేమ సృష్టికే మూలపురుషుడు  ప్రేమ జీవులకు పూజనీయుడు  ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం  ఓ.. ఓ.. ఓ..నా మనససు నీలో దాచి ఉంచినాను  ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను  ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను  నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు  హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు  ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ - నీవేలే, నా ప్రేమ - నీవేలే  యువతీ యువకుల కలయిక కోసం  వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి  యువతీ యువకుల కలయిక కోసం  వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి  మీకు తోడు మేముంటాము నేస్తమా  జంకులేక ప్రేమించండి నేస్తమా  మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..  మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..

Vaalu Kannuladaana Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Vaalu Kannuladaana’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Unni Menon.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : Unni Menon
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్.రత్నం, శివగణేష్ గానం: ఉన్నిమీనన్ వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే

Prema Ane Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Prema Ane’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Swarnalatha, S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : Swarnalatha, S. P. Balasubrahmanyam
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , స్వర్ణలత ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్మూ నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ఆ... ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

Manasu Padi Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Manasu Padi’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Srinivas, M. G. Sreekumar.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : Srinivas, M. G. Sreekumar
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివగణేష్ గానం: శ్రీనివాస్, ఎం. జి. శ్రీకుమార్ మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి  మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి  నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే  నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే  మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి  నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే  నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే  నా గుండెలే ఆటస్థలముగా ఎగిరెగిరి ఆటలు ఆడిన చిన్నారివి నీవే తల్లి  కళ్యాణవేళ ముస్తాబయ్యి పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి  ఆనందమే జీవితమంటూ సాగు  గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి  ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ  గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి  ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ  నీ వరుడు రేపు వేంచేస్తాడు  తన ప్రేమ నీకు పంచిస్తాడు  నీ పెళ్ళి వేదికను నే వెయ్య  ఆ వరుడు చేయి నీ కందియ్య  నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా  ఆ... మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు  చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు  మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు  చెప్పబోవునంతలోనా పెదవి మెదలలేదు  ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను  ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను  నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం  నా కనులనిండుగా నీరూపం నిను తలుచుకొనడమే నా ధ్యేయం  నీ ఆనందమే నా సంతోషం నా ప్రేమే ధన్యం  కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం.... మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి  కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి  కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి  కారుమబ్బు కురులలోన మొగలిపూలు పేర్చి  విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి  హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం  మేలతాళం మ్రోగగా వధువునకు  తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు  మేలతాళం మ్రోగగా వధువునకు  తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు  ఈ పేద హృదయమే దీవించ పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం....  మనసుపడి మనసుపడి మన్మథుడు మనసుపడి నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే నీ కోసం పుట్టాడే వరుడుగా వచ్చాడే మనసుపడి మనసుపడి మరుమల్లె మనసుపడి నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే నీ కోసం పుట్టెనులే వధువుగా నిలిచెనులే గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ గోరింటతో ముగ్గులు పెట్టీ మణికట్టుకు గాజులు తొడిగి ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ

Oh Mariya Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Oh Mariya’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by Devan Ekambaram, Yugendran, Febi Mani.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : Devan Ekambaram, Yugendran, Febi Mani
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివగణేష్ గానం: దేవన్ ఏకాంబరం, యుగేంద్రన్, ఫెబి ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  లా లల లా లల లా లల లా లల లా  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఫ్రూట్ చెలియా నా దునియా  ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల  లా లల లా లల లా లల లా లల లా  మౌనమనే ఒక తాళం చెవితో మనసును మూయొద్దు  ప్రేమను జీవిత ఖైదిని చేసీ జైలులో ఉంచొద్దు  హృదయాన్నే చలించీ పరిగెట్టిరా మనకుంది నెట్ కేఫ్ వేగంగానురా  కంప్యూటర్ తో ప్రేమించే కాలం ఇది  ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమామయం చెయ్యాలి భూమి  ఓ మరియా ఓ మరియా............ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల అందాలన్నీ పట్టిక వేసి చూపును ఇంటర్నెట్  మనసును మీటి మౌసును తడితే దొరుకును జూలియెట్  ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం  ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం  ఏ రెక్కలు లేకుండా ఎగిరెళ్ళుదాం  ఈ లోకాన్ని మైమరచి అట్లాడుదాం ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఫ్రూట్ చెలియా నా దునియా ఈ మెయిల్ లవ్ లెటర్ నీ దయా  సాగరానికీ... ఫిషింగ్ నెట్ ప్రేమించడానికీ... ఇంటర్నెట్ దేశం నుంచి దేశం వీచే ప్రేమా వల  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా  మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా మరియా

Roja Roja Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Roja Roja’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by P. Unnikrishnan.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : P. Unnikrishnan
చిత్రం: ప్రేమికుల రోజు (1999) సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: ఉన్ని కృష్ణన్ రోజా... రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా... రోజా... రోజా... రోజా... కన్నులలో... కొలువున్నావులే... రాతిరిలో... కనులకు కునుకే లేదులే... వలువగ నన్నూ చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా నీ పేరు నానోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే వానలో నువు తడవగా నా కొచ్చునే జ్వరం ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నవ యువతీ... నడుమొక గ్రంధము చదివేనా పలుచని రాత్రలు మంచులో దూరాలేలా జవరాలా బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే కనులలో జారెడు అందాల జలపాతమా నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా... రోజా రోజా...

Roja Roja Sad Version Song Lyrics in Telugu – Premikula Roju (1999)

‘Roja Roja Sad Version’ song from Premikula Roju (1999) movie is composed by A. R. Rahman and sung by P. Unnikrishnan.

SONG INFORMATION
Movie : Premikula Roju (1999) Music : A. R. Rahman Lyricist : A. M. Ratnam, Siva Ganesh. Singers : P. Unnikrishnan
Roja Roja Sad Version Lyrics Paste Here

Palli Balakrishna Wednesday, August 16, 2017
Manmadhudu (2002) Telugu Songs Lyrics Album Cover

Manmadhudu (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Starring : Nagarjuna Akkineni, Sonali Bendre, Anshu Director : K. Vijaya Bhaskar Producers : Nagarjuna Akkineni Release Date : 20 December 2002

Don't Marry Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Don't Marry’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Sirivennela Sitarama Sastry Singers : S. P. Balasubrahmanyam
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బాలు హా... శభాష్... స గ మ పా నీ ప ... మ ప గా ... రీ స నీ పా... మ ప నీ సా... రేయ్ వద్దురా...సోదరా... అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా... ఆదరా... బాదరా... నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా రేయ్... వద్దురా... వద్దు, వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారీ పడిపోవద్దు కాలుజారీ తాళికట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా నీకొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా... బాదరా... నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా... శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్ళి చేసుకున్నాడు కాలేజీలో వాడు గ్రీకు వీరుడు మ్యారేజీ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంతమారిపోయాడో గుర్తుపట్టలేనట్టు బక్క చిక్కిపోయి మంచి లుక్కు పోయి ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావడం వల్ల అంటు గుక్కపెట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందుకొట్టి ఫ్లాష్ బాక్ చెప్పాడు పొద్దున్నలేస్తున్న లేస్తునే తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకైలవ్యూ చెప్పాలి ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం కత్తి సామైందిరా కాపురం పెళ్ళి క్షమించరాని నేరం Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా వద్దుర వద్దు అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడ్లేక ఇంటిపోరు చల్లారిపోయింది వాడినెత్తురు ఒక్కపుట కూడా ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్రతినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతునే ఉంటదట వీధివెంట కోడెనాగు లాంటి వాడ్ని వానపాము చేసింది ఆలికాదురా అది అనకొండ ఆ గయ్యాలి యమగోల కలిగించిందిభక్తి యోగం ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వేస్టని ఇక సన్యాసమే బెస్టని కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా Don't marry be happy (4) వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళిళ్లి గోతిలో పడొద్దురా Don't marry be happy (4)

Gundello Emundho Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Gundello Emundho’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Venu, Sumangali.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Venu, Sumangali
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: వేణు, సుమంగళి గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...! చరణం: 1 పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పయనించి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది చరణం: 2 ఎందుకో తెలియని... కంగారు పుడుతున్నది ఎక్కడా జరగని... వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించీ పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది! గుండెల్లో ఏముందో... కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం... నీపేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం...నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది! మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా... ఓ మనసా...!

Nenu Nenuga Lene Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Nenu Nenuga Lene’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. B. Charan.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Sirivennela Sitarama Sastry Singers : S. P. B. Charan
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బి.చరణ్ నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోనీ ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటు గా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చరణం: 1 పూల చెట్టు వూగినట్టు పాల బొట్టు చింధినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వూ తేనె పట్టు రేగి నట్టు వీణమెట్టు వనికినట్టు ఝల్లు మంది గుండెల్లో ఎవరె నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వానా నీకెవరికి కనిపించదు ఏమైన చరణం: 2 చుట్టూ పక్క లెందరూన్న గుర్తు పట్టలేక ఉన్న అంత మంది ఒక్కలాగే కనపడుతుంటే తప్పు నాది కాదు అన్న ఒప్పుకోరు ఒక్కరైన చెప్పలేదు నిజమేదో నాకు వింతే కళ్ళను వదీలెళ్లను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ హో ఓ హో ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Na Manasune Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Na Manasune’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by S. P. Balasubrahmanyam, Chitra.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Sirivennela Sitarama Sastry Singers : S. P. Balasubrahmanyam, Chitra
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా... చరణం: 1 నా కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి నీ వెంటపడే ఆశలకి చూపవా పులదారి చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా... నీ కనులలో వెలగనీ ప్రియతమా... నీ పెదవికే తెలుపనీ మధురిమా.... చరణం: 2 నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను.... నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను... అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా.... కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా... నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా.... నీ... కనులలో... వెలగనీ... ప్రియతమా... నీ... పెదవికీ... తెలుపనీ... మధురిమా... సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

Cheliya Cheliya Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Cheliya Cheliya’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Shaan.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Shaan
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరి వెన్నెల గానం: షాన్ చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా చరణం: 1 కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే చరణం: 2 నిలిచిపో సమయమా తరమకే చెలిమి ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే సఖియా సఖియా... వంటరిని చెయ్యకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎదమాటేబాటై రానానీదాకా పడి లేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నినుతాకేదాకా ఆగదు నాకేకా

Andhamaina Bhamalu Song Lyrics in Telugu – Manmadhudu (2002)

‘Andhamaina Bhamalu’ song from Manmadhudu (2002) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.

SONG INFORMATION
Movie : Manmadhudu (2002) Music : Devi Sri Prasad Lyricist : Bhuvanachandra Singers : Devi Sri Prasad
చిత్రం: మన్మధుడు (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: భువన చంద్ర గానం: దేవి శ్రీ ప్రసాద్ Oh baby just give me love Oh baby I want it now Oh baby just give me love Oh baby I want it now హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే Oh baby just give me love Oh baby just take it now Oh baby just give me love Oh baby just take it now చరణం: 1 హే నువ్వేనా నా కల్లో కొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా నా కమ్మని కౌగిట్లో నిను బంధిచేసేయ్ నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్ నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు Oh baby just give me love Oh baby just take it now Oh baby I want it now Oh baby take it right now చరణం: 2 హే కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకి వేసెయ్ నా గాలాన్ని నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారి అయ్యోరామ ఈ భామ తెగ ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యోరామ ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే అయ్యోరామా... ఈ భామ భలే ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే

Palli Balakrishna Saturday, August 12, 2017




చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
నటీనటులు: చిరంజీవి, సొనాలి బింద్రే
దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ
నిర్మాత: అక్కినేని రవిశంకర ప్రసాద్
విడుదల తేది: 15.10.2004



Songs List:



శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: మనో

శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. ఊ హా ఊ హా
హొయ్...

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్ట పిల్లమ్మో...
హే బేగంపేట బుల్లమ్మో...
పంజాగుట్టా పిల్లమ్మో
బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో
హే చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తనమ్మో
హే...హైదర్ గూడా గున్నమో
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
అరె దోమల్ గూడ గుండమ్మో....
కో: శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హైదర్ గూడ గున్నమ్మో
దోమల్ గూడ గుండమ్మో
వాతంగానీ పైత్యంగానీ చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్మో
నీ పేరేందబ్బాయా....
దా దా దా దా దా దా...

కో: శంకర్ దాదా... శంకర్ దాదా...
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
హే శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

హే బేగంపేట బుల్లమ్మో...
అరె పంజాగుట్టా పిల్లమ్మో...
ఎహె ఎహె ఎహె ఎహె

హే... నడవలేని వాళ్ళు ఉరికేలాగా
నే పెంచుకున్న కుక్క నొదులుతా  హె... హె...
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగా
నే రాసుకున్న కవిత చదువుతా... హె...హె...హె...
అరె మూర్ఛపోయి వచ్చినోళ్ళ కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము చూపుతా.... హెయ్...
అరె జంతర్ మంతర్ జాలీ
అరె చూ  మంతర కాళీ నీ బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే మందు ఓరన్నా ...హొయ్....స్

నిన్న హేసరనప్పా
నన్న హేసరా...అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా  ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదాఎం.బి.బిఎస్  
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్

చేతకానితనము టీబీ అయితే
నే చూపు చూస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తే తిరిగిరాదులే....హే...హె...
అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కాన్సరైతే
అంతు తేల్చు ఆన్సరుందిలే...
అరె మోసమున్న  బీ.పి. యమ స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకీ వైద్యముందిలే
మరి అన్నిటికీ ఒకే మందులే  హా
కో: ఏం మందు గురూ.....?
ఏం మందా ...?  అహహహ....

కో: శంకర్ దాదా శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
బోలో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్
అరె హో శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ కో జై బోలో

అరె శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్  ఊ హ ఊ హ (11)




నా పేరే కాంచనమాల పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్ , మాలతి లక్ష్మణ్ 

నా వయసే పాదరసం... నేనసలే చిన్న రసం
నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం
నా సోకు పూలవనం నా చూపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం... ఓయ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా
హేయ్ రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
నీదేరా రాకుమారా దోర దోర ఊడుకుల ఊయ్యాలా
ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ...నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుకో... ఓ...ఓ...ఓహ్
ఊ... నిన్ను తాకనా తాకనా
నిన్ను చుట్టుకోనా హే...
ముద్దు పెట్టనా పెట్టనా...హొయ్...

హాయ్యో  హాయ్యో  హాయ్యో  (4)

ఆ నీ రాకలో రాపిడుంది నా సోకుల దోపిడుంది
నీ దొంగ చుపుకే నా బెంగ తీరనా నీవుండిపో రాత్రికి
నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారదీ ఆటకి
మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ఓ మామా ఓ మామా
కావాలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే
ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ

ఊ...నన్ను అల్లుకో అల్లుకో 
ఆ నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో  చంపుకో...ఓ...ఓ...ఓహ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా

ఓలమ్మో...
నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
బస్తీ సవాల్ బాలీవుడ్ లో చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ముట్టించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా

ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ... నన్ను గిల్లుకోరా
హే...నన్ను చంపుకో చంపుపో...ఓ....ఓ..ఓహ్
హొయ్...నా పేరే - కాంచనమాల
నావయాసే - గరమ్  మసాలా
తందాన తాన అంటు మోగని తబలా
హే...రావే నా - రస రంగీలా
నీ బుగ్గే  - నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా లా లా
హే...ఊయ్....ఆ....ఆహ...



చైలా చైలా చైలా చైలా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్  
గానం: చిరంజీవి, కె.కె

కరెక్టే ప్రేమ గురించి నాకేం తెలుసు
లైలా మజ్నూలకు తెలుసు 
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరువాత తమకే తెలుసు

ఇదిగో తమ్ముడూ...
మనకీ ఓ లవ్ స్టోరీ ఉందమ్మా వింటావా ఆ

ఓ యస్   ఓ యస్

హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హేయ్...చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డపిల్లపేరు లైలా
హొయ్ లా హొయ్ లా హొయ్ లే హొయ్ లా
నడక చూస్తే చిక్కుబుక్కురైలా
గులాబిలాంటి లిప్పుచూసి నా పల్సురెటే పెరిగింది
జిలేబిలాంటి హిప్పుచూసి నా హర్టు బీటే అదిరింది
పాల మీగడంటి రంగుచూసి  నా రక్తమంతా మరిగింది
నా ఏరియాలో ఎప్పుడూలేని లవ్వేరియా నాకు అంటుకుంది

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా  చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తర్వాతేమయ్యిందన్నా...
ఏమయిందా...ఆ రోజువరకూ హాయిగా 
ఎలాపడితే అలా తిరుగుతూ గడిపేసేవాణ్ణి
కానీ ఆ రోజు నుంచి 
తిరుగుళ్ళు నో చాన్స్...దాదాగిరి...నోచాన్స్... 
ఓన్లీ రొమాన్స్...

ఊ...తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేసా
తెల్లావారుజామునే జాగింగే చేశా
డే...వన్...దమ్ము కొట్టడం వదిలేశా
డే... టూ...దమ్ముదులపటం ఆపేశా
డే...త్రీ... పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
హొ యా ఇంటి ముందరే టెంటువేశా
హొ యా ఒంటికందిన సెంటు పూశా
హొ యా మంచినీళ్ళ లారీ దగ్గర బిందెకూడా బ్లాకుచేశా
ఆ దెబ్బతో చిన్న చిర్నవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదెమిటో మరి ఆ నవ్వు తో నా మనసంతా రఫ్ఫాడేసింది

ఓ మాయా ఓ మాయా ఈప్రేమ అంతే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా చైలా చైలా చైలా...

జీవితంలో దేనీ మీదా ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కలలుకన్నాను ఆ అమ్మాయి 
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఏం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి  పెళ్ళయిపోయింది...

కళ్లలోన కలలు అన్నీ కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెలే

మరి తర్వాత ఏమయింది....
హు...తర్వాత...తర్వాత ఏమౌతుంది

ఆ మరుసటిరోజు ...
మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందీ

ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా
ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ అంటే మాయా
అరె గోలా ఇది గోలా ఇది తియ్యనైన గోలా

చైలా  చైలా  చైలా  చైలా .....
ఇదర్ ఆ...ఏంటిరా మీ కుర్రవాళ్ల గోల

చూడు తమ్ముడూ 
ప్రేమ అనేది లైఫ్లో ఓ చిన్న పార్టేకానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి అమ్మాయికోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా 
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం నేరం...
క్షమించరాని నేరం అండర్ స్టాండ్

ఓడిపోవటం తప్పుకాదురా 
చచ్చిపోవడం తప్పు సోదరా
చావు ఒక్కటే దారంటే 
ఇక్కడుండే వాళ్లు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా 
దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా
దాన్ని మద్యలో కతమ్ చేసే 
హక్కు ఎవరికీ లేదురా
నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా
అరె బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయరా అడ్డు దాటేయరా 
ఏ ఓటమీ నిన్ను ఇక ఆపలేదురా

ఓ మాయా ఓమాయా ఈ లైఫ్ అంటే మాయా



ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అద్నన్ శామి, కల్పన

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా (2)
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఇరవై మూడు జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా
ఇరవై నాలుగు నీ నడుము కొలత ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఏడు ముద్దుల్ని పెట్టి 
తకిట  తకిట  తకిట తకిట తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

హెయ్ నువ్వట్టా జల్సా పూర్ సిగ్నల్నే దాటేస్తా
నేనట్టా సిగ్గాపూర్ సిగ్నల్ నే దాటేస్తా
నువ్వట్టా మనసాపూర్ సెంటర్ లో మాటేస్తే
నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా
కమ్మేస్తాను కొకాకుళంలోరాజేస్తాను రాణిమండ్రి
ఊరిస్తాను ఊపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను మద్దాపురంలో చేరుస్తాను సోకునాడ
సాగించాలి హింసాచలంలో  
తకిట తకిట  తకిట  తకిట  తా

ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా (2)

కో: ఏ జిల్లా .....ఏ జిల్లా...

ఓ నీలోని అందం చందం అదిరేబాదవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరేబాదయిపోదా
నువ్వట్టా కన్నేకొట్టి గిల్లూరు రమ్మంటే
నేనిట్టా మూటేకట్టి ఒళ్ళూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దు దాటి పెదవుల పాడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలే కానీ రాత్రైన గానీ నిదురానగరు వెళ్లనంటా
పక్కలపల్లి పొలిమేరలోనే  
తకిట  తకిట  తకిట తకిట  తా

ఏ ఏ జిల్లా ఏ జిల్లా  ఓ పిల్లా నీది ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోల ఓరుగల్లా
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది ఆజిల్లా
దాచెయ్ నా దుప్పట్లో మరుమల్లె పూలజల్లా




పట్టు పట్టు చెయ్యే పట్టు పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: మణిక్క వినయాగం , సుమంగళి 

పట్టు పట్టు చెయ్యే పట్టు 




సండే పొద్దుల్ల తాండె పాట సాహిత్యం

 
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
సంగీతం:  దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: సాహితి 
గానం: శంకర్ మహదేవన్ , కల్పన


సండే పొద్దుల్ల తాండె

Palli Balakrishna Friday, July 28, 2017
Murari (2001) Telugu Songs Lyrics Album Cover

Murari (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Murari (2001) Music : Mani Sharma Starring : Mahesh Babu, Sonali Bendre Director : Krishna Vamsi Producers : N Devi Prasad, Ramalingeswara Rao, Gopi Nandigam Release Date : 17 February 2001

Alanati Ramachandrudu Song Lyrics in Telugu – Murari (2001)

‘Alanati Ramachandrudu’ song from Murari (2001) movie is composed by Mani Sharma and sung by Jikki, Sunitha, Sandhya

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Sirivennela Seetharama Sastry Singers : Jikki, Sunitha, Sandhya

మురారి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ కి పెళ్లి వీడియోస్ లో వీడియో మిక్సింగ్ చేసే వాళ్ళు ఈ సాంగ్ ను ఎంతగా వాడుకున్నారు అంటే 15 సంవత్సరాల వరకు మ్యారేజ్ వీడియో మిక్సింగ్ లో ఈ సాంగ్ తప్పకుండా వాడేవారు అంటే అతిశయోక్తి లేదు. అంత పాపులర్ అయింది ఈ సాంగ్

చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: జిక్కి, సునీత, సంధ్యా ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ...ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ...ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ...ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

Bhama Bhama Song Lyrics in Telugu – Murari (2001)

'Bhama Bhama' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam, Anuradha Sriram

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Sirivennela Seetharama Sastry Singers : S. P. Balasubrahmanyam, Anuradha Sriram
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, అనురాధ శ్రీరామ్ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ హత్తు కోవాలీ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ హోయ్ హోయ్ హోయ్ అరె భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ ముద్దు కావాలీ - హోయ్ హోయ్ హత్తు కోవాలీ - హాయ్ హాయ్ సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ భామా భామా డడ్డడా డండడార డాడా అమ్మడూ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ అరె భామా భామా డడ్డడా డండ డడ డండ డడ డండ డండడా

Cheppamma Cheppamma Song Lyrics in Telugu – Murari (2001)

'Cheppamma Cheppamma' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by K. S. Chithra

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Sirivennela Seetharama Sastry Singers : K. S. Chithra
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నదీ ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం వెంట తరుముతున్నావేంటి ఎంత తప్పుకున్నా కంటికెదురు పడతావేంటి ఎటుచూసినా చంప గిల్లి పోతావేంటి గాలివేలితోనా అంత గోడవపెడతావేంటి నిద్దరోతువున్న అసలు నీకు ఆ చొరవే ఏంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనీవే ఏంటి ఒక్క నిమిషమైనా ఇదేం అల్లరి భరిచేదెలా అంటూ నిన్నెలా కసరను నువ్వేంచేసిన బాగుంటుందని నిజం నీకెలా చెప్పనూ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించబుద్దవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనేె ఒడిపోతూ ఉన్నా లేనిపోనీ ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదేం చూడక మహా పోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్న అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడిచస్తున్న అయ్యో రామా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ తప్పమ్మ ఆగమ్మ అంటోంది ఓ మొమాటం నువ్వంటే మరి అదేదో ఇది అనేద్దామనే ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఐ లవ్ యు చెప్పేసేయ్ అంటోంది ఓ ఆరాటం ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

Ekkada Ekkada Song Lyrics in Telugu – Murari (2001)

'Ekkada Ekkada' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by S. P. Charan, Harini

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Sirivennela Seetharama Sastry Singers : S. P. Charan, Harini
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బి. చరణ్, హరిణి ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ ఏ వూరే అందమా ఆచూకీ అందుమా కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ పలుకులూ ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ పదునులూ ఆ చూపులూ చురుకైన సురకత్తులూ పరుగులూ ఆ అడుగులూ గోదారిలో వరదలూ నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురీ నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయి మహాపోకిరీ మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ ఎక్కడ ఎక్కడ ఉందో తారకా ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా ఎక్కడ ఎక్కడ ఉందో తారకా నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబుచీ చాలమ్మా ఏ వూరే అందమా ఆచూకీ అందుమా అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక

Andaanikey Song Lyrics in Telugu – Murari (2001)

'Andaanikey' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by Shankar Mahadevan

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Chandrabose Singers : Shankar Mahadevan
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: శంకర్ మహదేవన్ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ పుత్తడి వెలుగులు హ్మ్ మ్మ్ ఓ లచ్చా గుమ్మాడీ అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది హే ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ నీ శ్వాసగా మారేందుకే ఆపూల గంధాల గాలున్నది మెల మెల మెల మెల ఉప్పెన నేనై వస్తా నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా గల గల గల గల మువ్వని నేనై వస్తా నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది

Bangaru Kalla Song Lyrics in Telugu – Murari (2001)

'Bangaru Kalla' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by Udit Narayan

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Suddala Ashok Teja Singers : Udit Narayan
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: ఉదిత్ నారాయణ్ బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో సందె పొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే వెండిమువ్వల్లె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమన్నాదే బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో చరణం: 1 నీలో చింతచిగురు పులుపున్నదే బుల్బుల్ పిట్ట మల్మల్ మట్ట కవ్వంలాగ చిలికే కులుకున్నదే తళుకుల గుట్ట మెరుపుల తట్ట నీలో చింతచిగురు పులుపున్నదే కవ్వంలాగ చిలికే కులుకున్నదే కొంటెమాట వెనుక చనువున్నదే తెలుసుకుంటే మనసు పిలుపున్నదే కళ్లుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో చరణం: 2 నిన్న నేడు రేపు ఒక నిచ్చెన సిరిసిరి మువ్వ గడసరి గువ్వ మనకు మనకు చెలిమే ఒక వంతెన సొగసుల మువ్వా ముసిముసి నవ్వా నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమే ఒక వంతెన ఎవరికే వారై ఉంటే ఏముందమ్మా మురళి కాని వెదురై పోదా జన్మ చేయి చేయి కలిపే కోసమే హృదయం ఇచ్చాడమ్మాయీ జారిపోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠీ బంగారు కళ్ల బుచ్చెమ్మో చెంగావి చెంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగమూతి సుబ్బమ్మో

Dum Dum Dum Song Lyrics in Telugu – Murari (2001)

'Dum Dum Dum' from the movie Murari (2001) is composed by Mani Sharma and sung by Shankar Mahadevan

SONG INFORMATION
Movie : Murari (2001) Music : Mani Sharma Lyricist : Veturi Singers : Shankar Mahadevan
చిత్రం: మురారి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: శంకర్ మహదేవన్ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరీడుగా బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట ఆడితప్పనేమాట అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హే అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా బ్రహ్మన్న పుత్రా హే బాలచంద్ర చెయ్యెత్తి జే కొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగి లోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించరా లోని దీపం అహ తొలగించరా బుద్ధిలోపం ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మా డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా చూపుంటే కంట్లో ఉపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మన గీత చిగురంతా వలపో చిలకమ్మా పిలుపో బులపాఠం ఉండాలిరా పెడవుల్లో చలి ఇలా పెనవేస్తే చలి గోల చెలగాటం ఆడాలిరా అహ మారిందిరా పాత కాలం నిండు మనసొక్కటే నీకు మార్గం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా బ మాట నుంచి భా మాటదాక నాదేనురా పైఆట ఆడితప్పనేమాట అయ్యా చూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిరా జండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

Palli Balakrishna Tuesday, July 25, 2017




చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి , ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: సి. అశ్వనీదత్
విడుదల తేది: 24.07.2002



Songs List:



భం భం భోలే శంఖం మొగెలే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, శంకర్ మహదేవన్

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలే నా
భం భం భోలే భం భం భోలే భం భం భోలే భొలే నా
భోలే నాచే చమక్ చమాచం
భోలే నాచే చమక్ చమాచం
డమరు బాజే డమరు బాజే డమరు బాజే డం ఢమా డం
భోలే నాచే చమక్ చమాచం
భోలే నాచే చమక్ చమాచం

వారణాసిని వర్ణించే నా గీతిక
నాటి శ్రీనాథుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణిక 
అల్లదే అందినాయి చిరుఘుంటిక
దమక దమకాలై ఎద లయలే తీర్ధన చేయగా
యమక ఘమకాలై పదగతులే నర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా

విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంతా శివలీల కాదా
ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే 
మన కష్టమే తొలగిపోదా

ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం
ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం
ధం ధమాధం ధం ధం ధమాధం ధం
ధం ధమాధం ధం ధమాధం ధం ధమాధం ధం ధం ధం

ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే 
చరితలకు అందనిది ఈ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి ఆ శివమహిమ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

భం భం భోలే శంఖం మొగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
తద్దనకదిన దరువై సందడి రేగనీ 
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ
విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి
విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...



అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: కల్పన ,  యస్. పి. బాలు

కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలో

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ
అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ
బావరో బావర్చీ తినిపించవా మిర్చీ
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి
కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ

అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా
కోలు కోలోయన్న కోలన్న కోలో
మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా
డోలు డోలోయన్న డోలన్న డోలో
పిల్ల గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా
మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా
ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే
ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి

బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే
కోలు కోలోయన్న కోలన్న కోలో
అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే
డోలు డోలోయన్న డోలన్న డోలో
బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే
అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే
ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే
ఈ పూట నీ పైట ఆ చోట వాడే వినను అన్నాదిలే

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి
వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి
ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి
మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి
కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ
కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ
కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ
డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ




రాధే గోవిందా ప్రేమే కుట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర, ఉదిత్ నారాయణ్

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా
మృదుమదనా పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా

నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా
నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా
తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా
చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంటా
అరె అకలి వేస్తే సోకులు ఇస్తా సోకులు తోటి షాకులు ఇస్తా
ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా

కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా కిస్స్ మై లిప్స్ అంటూ కవ్వించిందా
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా

అంగాంగము వ్వామోహమే నీ పోందుకై అరాటమే
వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే
రతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా
కసి గువ్వ రెక్కలే రెక్కిందంటా నీ కోసం పక్కలే పరిచిందంటా
అరె మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా
సిరినే మగసిరితో దోచేస్తా భామా

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా
కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా
ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా
మృదుమదనా పతినై పరిపాలించనా
చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే
అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ




ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, యస్. పి. బాలు

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా

రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రారమ్మని
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలిగింది ముప్పు అది నీలి మబ్బు మనసారా నవ్వనీ
చిరుజల్లు మునుపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
ఆ శాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 

భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా
ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగా
మారని యాతన తీర్చగా మాతల రాతలు మార్చగా
ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా
మహారాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలెగెరా
భోగాన్ని విడిచీ త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా అమృతములు ఆహ్వానించెనురా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా 

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా
హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా




దాయి దాయి దామ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె., మహలక్ష్మి అయ్యర్

దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఒహో... హో... ఒళ్ళో వాలుమా
ఒహో... హో... వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా

హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ

టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించలేవా కాదంటే ఇపుడు తప్పేదెలా
అరె కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా
అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా
ఒహో... హో... కోరిందే కదా
ఒహో... హో... మరీ ఇందిర
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా

హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే

పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా తగు జతకావ నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా
నీ హితబోధలాపి శృతిమించవా
ఒహో... హో... వాటం వారెవా
ఒహో... హో... ఒళ్లోవాలవా
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన

హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే




అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర (2002)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కార్తీక్, ఉష

( మణిశర్మ గారు అందుబాటులో లేకపోవటంతో ఈ ఒక్క పాటకి ఆర్. పి. పట్నాయక్ గారికి సంగీతం సమకూర్చమని బి.గోపాల్ గారు చెప్పారు ఎందుకంటే జూనియర్ ఎన్. టి. ఆర్ తో అల్లరి రాముడు సినిమా బి.గోపాల్ గారే దర్శకత్వం వహిస్తున్నారు దానికి ఆర్. పి. పట్నాయక్ గారు సంగీతం. ఈ రెండు సినిమాలు వారం రోజులు తేడాతో విడుదల అయ్యాయి అంటే జూలై 18 న అల్లరి రాముడు రిలీజ్ అయితే జూలై 24 న ఇంద్ర రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలకు  బి.గోపాల్ గారే దర్శకత్వం వహించారు, ఆర్తి అగర్వాల్ ఈ రెండూ సినిమాలలో హీరొయిన్)

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి
చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి
తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేంటి
దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి
పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో

అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి
నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది
వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి
చాటుగా వచ్చి చేతి వాటాన చేయ్యవోయ్ ఇంక వన్నెల బోణి
లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా
అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో
అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default