Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Taapsee Pannu"
Anando Brahma (2017)


 
చిత్రం: ఆనందో బ్రహ్మ (2013)
సంగీతం: K (కృష్ణ కుమార్)
నటీనటులు: తాప్సీపన్ను, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుధీర్ బాబు
దర్శకత్వం: మహి వి. రాఘవ్
నిర్మాతలు: విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేది: 18.08.2017

Palli Balakrishna Saturday, March 6, 2021
Vastadu Naa Raju (2011)


చిత్రం: వస్తాడు నా రాజు (2011)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: మంచు విష్ణు, తాప్సి పన్ను
దర్శకత్వం: హేమంత్ మధుకర్
నిర్మాత: మంచు విష్ణు
విడుదల తేది: 11.02.2011


Palli Balakrishna Tuesday, February 19, 2019
Daruvu (2012)


చిత్రం: దరువు (2012)
సంగీతం: విజయ్ అంటోనీ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేష్ అయ్యర్, సంగీతా  రాజేశ్వరన్
నటీనటులు: రవితేజ, తాప్సి పన్ను
దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాత: బూరుగుపల్లి శివరామ కృష్ణ
విడుదల తేది: 25.05.2012


Palli Balakrishna Wednesday, February 13, 2019
Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)
సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్
సాహిత్యం: శ్రీజో
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్
దర్శకత్వం: హరినాథ్
నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 24.08.2018

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా..

మాటే విననీ మనసెగిరిపోనీ
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న
నిజమే లోకం చూడగా
సందేహం వీడనీ
ఈ మాయే మదిలో నిండనీ
సంతోషం పొంగనీ
నీ హృదయం నీలో లేదనీ

ఓ మాటల్లోనే, మోమాటం కరిగించి
నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది
అలావాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే
ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ

ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణకాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా
అద్దం మన కథే!

వెన్నెలా…. ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా… నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ
ప్రాణం కదిలించిందే నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరం
ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ
వెన్నెలా.

Palli Balakrishna Friday, January 25, 2019
Sahasam (2013)


చిత్రం: సాహసం (2013)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , గీతామాధురి
నటీనటులు: గోపిచంద్ , తాప్సి
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
నిర్మాత: బి. వి.యస్. ఎన్.ప్రసాద్
విడుదల తేది: 12.07.2013

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా

రా అంటే రగడాల తీగ లాగుతా
పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతా
నిప్పు ఉంది లంక ఎక్కడుంది
చప్పుడుంది ఢంకా ఎక్కడుంది

ఆ.. కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్
ఓ.. కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓ య్
నీ పనైతే రాత్రికి రాత్రే రాజయోగమోయ్
కాకపోతే చికటిలోన నువ్వో బాగమోయ్
అర్ధమైతె ఆలస్యాన్ని ఆపి అడుగులెయ్ రారా రారా

లే పడితే వదిలేదిలేదు దేనిని
నే దిగితే అది ఎంత లోతని అడగనోన్ని
దమ్ము ఉంది దారి ఎక్కడుంది
సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది

ఆ.. పక్కకొచ్చి పందెమేస్తావా
నీ.. రొక్కమంత పిండుకుంటావా
వేచి ఉంది నీ కోసం అందాల పాచిక
జూదమాడి ఏం కావాలో తీసుకో ఇక
పోగొట్టేనా రాబట్టాల ఎత్తులేసు కోరా రారా

డోలా డోలా డమ్ డమ్ డోలా
సౌఖ్యం లోన అల్లాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
స్వర్గంలోన తారాడాల

నా గురికే తగలాలి పాలపుంతలు
నా దరికే రావాలి అమృత సాగరాలు

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా


******   ******   ******


చిత్రం: సాహసం  (2013)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తిక్ , షర్మిళ

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా

రా అంటే రగడాల తీగ లాగుతా
పో అంటే పొగలోంచి నిప్పుని బయట పెడతా
నిప్పు ఉంది లంక ఎక్కడుంది
చప్పుడుంది ఢంకా ఎక్కడుంది

ఆ.. కుంభకోణం నిన్ను రమ్మన్నానోయ్
ఓ.. కొత్తకోణం చూపమన్నాదోయ్ ఓ య్
నీ పనైతే రాత్రికి రాత్రే రాజయోగమోయ్
కాకపోతే చికటిలోన నువ్వో బాగమోయ్
అర్ధమైతె ఆలస్యాన్ని ఆపి అడుగులెయ్ రారా రారా

లే పడితే వదిలేదిలేదు దేనిని
నే దిగితే అది ఎంత లోతని అడగనోన్ని
దమ్ము ఉంది దారి ఎక్కడుంది
సత్తా ఉంది స్వారీ ఎక్కడుంది

ఆ.. పక్కకొచ్చి పందెమేస్తావా
నీ.. రొక్కమంత పిండుకుంటావా
వేచి ఉంది నీ కోసం అందాల పాచిక
జూదమాడి ఏం కావాలో తీసుకో ఇక
పోగొట్టేనా రాబట్టాల ఎత్తులేసు కోరా రారా

డోలా డోలా డమ్ డమ్ డోలా
సౌఖ్యం లోన అల్లాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
స్వర్గంలోన తారాడాల

నా గురికే తగలాలి పాలపుంతలు
నా దరికే రావాలి అమృత సాగరాలు

పెట్టి ఉంది తాళం ఎక్కడుంది
పెట్టినిండా చాలా సొత్తు ఉంది
డోలా డోలా డమ్ డమ్ డోలా
రారా నీతో మాటాడాల
డోలా డోలా డమ్ డమ్ డోలా
అదృష్టంతో ఆటాడాలా



Palli Balakrishna Monday, March 26, 2018
Shadow (2013)



చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్, తాప్సి, మధురిమ, నాగేంద్రబాబు
దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 26.04.2013



Songs List:



షాడో పాట సాహిత్యం

 
చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం:  చంద్రబోస్
గానం: బాబా సెహగల్, నవీన్

షాడో




గోల గోల పాట సాహిత్యం

 
చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం:  విశ్వా
గానం: హేమచంద్ర, రమ్యా ఎన్. ఎస్, యస్. యస్. థమన్, వర్ధన

గోల గోల




పిల్ల మంచి బందోబస్తు పాట సాహిత్యం

 
చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం:  భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, సుచిత్ర

పిల్ల మంచి బందోబస్తు




ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ పాట సాహిత్యం

 
చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం:  చంద్రబోస్
గానం: గీతామాధురి , సింహా

ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్

హే గబ్బర్ సింగ్ కి లైనేశా కొంచం తిక్కని వదిలేశా
గా బిసినెస్ మాన్ కి ట్రై చేశా మస్త్ బిజీ అని ఒగ్గేసా
ఓ కంత్రీ కేమో బీటేశా కంగారే పుట్టి తగ్గేశా
నా డార్లింగ్ వైపో లోక్కేశా ఆ డేరింగ్ చూసి చెక్కేశా
ఓ మై గాడ్ ఓ మై గాడ్ సోలో సోలో లైఫే వెరీ బాడ్ 
హే కన్నా బాడీగార్డ్

ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్

హే గబ్బర్ సింగ్ కి లైనేశా కొంచం తిక్కని వదిలేశా

హే బాలీవుడ్ స్టార్స్ తో డేటింగ్ చోడ్ దియా
నా ఫాలోయింగ్ మోతరో మామామియా
నీకంత సీను లేదులే తిప్పేసుకోవద్దే
బోల్డంత మంది ఫాన్స్ అని డప్పేసుకోవద్దే
నీ గొప్పల చిట్టా విప్పొద్దే
నాకేదో ఏదో కాలుద్దే
సుందర కాండ చంటోడా శత్రువులా చూడకురా

ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్

చూస్తే డుంకీ చుంకీ
తక్కినవన్ని మిల్కీ మిల్కీ
కమాన్ కమాన్ ఇస్తా డుండి

హే గెలిచే గుర్రాణ్ణిరా నా జాకీ నువ్వురా
హే ప్రేమించుకుందాం రా బొబ్బిలి రాజా
సంక్రాంతి గంగిరెద్దులా లగెత్తుకొచ్చావే
Sమొహాబత్ నింపి మత్తుగా శరబత్ ఇచ్చావే
నువ్వు నక్క తోకని తొక్కావా 
నా మరదలు పోస్టే కొట్టావే
హే లక్ష్మీ బావకి నచ్చేశా లైన్ లైట్లో వచ్చేశా

ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్
ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్




హే ఐతలక పాట సాహిత్యం

 
చిత్రం: షాడో (2013)
సంగీతం: యస్. యస్. థమన్
సాహిత్యం:  రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరన్, రంజిత్, రాహుల్ నంబియార్, మేఘ, రీటా, అనితా

హే ఐతలక

Palli Balakrishna Thursday, December 14, 2017
Veera (2011)


చిత్రం: వీర (2011)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , గీతామధురి
నటీనటులు: రవితేజ , కాజల్ అగర్వాల్ , తాప్సి పన్ను
దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: ఇందుకూరి గణేష్
విడుదల తేది: 20.05.2011

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే
నువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టి
మోతే మోగిస్తున్నావే

చలో మరి చెయ్యెసుకో నా మీద
మడతేశాక నాతో మరి ప్రమాదాన్నే పర్లేదా
అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
మూడే రప్పిస్తున్నావే

నన్ను ఎగబడమని ఎదురుగ పడి అందం గిల్లేస్తుందే
ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తుందే

నిన్ను వదలను అని వయుసుని సెగ రాట్నం తిప్పేస్తున్నాదే
నా అడుగడుగున చలిపిడుగుల తాపం చంపేస్తుందే

పొగిడేసి పడి పడి నీకే మొక్కుతా
నీ బుగ్గే నొక్కుతా నీ మొగ్గే తొక్కేస్తా

శివ శివ కాశీ చిటపటలేంటో చూసేస్తా
నీ వెంటే వచ్చేస్తా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

నీ సొగసుల పొడి చిటికెడు పడి
మైకం కమ్మేస్తుందే
నీ కులుకుల ఉలి గది గది గది గుండె చెక్కుతుందే

కొసమెరుపుల ఘని గునపంవలె
చూపే తవ్వేస్తుందే
కసి ముదిరెను కద పదమని
ఈడే దొర్లేస్తున్నాదే

అదిరిందే
పిట పిట మిర్చి మసాలా
నీ నవ్వే  వాంఛలా నా సిల్క్ రుమాల

రుచిమరిగిందే మరి మరి కావాలందే
నీ మీదే పడేలా నా మదే చెడేలా

అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
నీ బొటా బొటి నడుము బలేగుందే

నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
ఈ దూకుడుకు ఊపుడు బండి నీదే

Palli Balakrishna Sunday, November 26, 2017
Gundello Godari (2013)

చిత్రం: గుండెల్లో గోదావరి (2013)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆర్. రాము
గానం: గీతామధురి
నటీనటులు: ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సి పన్ను, మంచు లక్ష్మి
దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
నిర్మాత: మంచు లక్ష్మి
విడుదల తేది: 08.03.2013

పల్లవి:
వెచ్చాని... వెచ్చాని
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
హేయ్ వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా
పులసల్లే వయసు ఎదురీదుతుంది
వలవేసి పట్టేసుకో నను వరదల్లే ముంచేసిపో

వెన్నెట్లోనా పున్నాగల్లే వన్నె చిన్నె పూసాయిలే
నా వన్నె చిన్నె పూసాయిలే
తేనల్లే తాగేసిపో నీ మధువుల్ని కాజేసిపో
తొలిజాము దాకా నెలరాజు నువ్వే
వాటంగా అల్లేసుకో నా చూపంతా గిల్లేసుకో
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా

చరణం: 1
పచ్చి వెన్నాతో పెంచాను సోకు
మచ్చ పడకుండా దాచాను నీకు
పచ్చి వెన్నాతో పెంచాను సోకు
మచ్చ పడకుండా దాచాను నీకు
అత్తారు గంధం పన్నీరు పూసి
మొత్తంగా ఉన్నా నాజూకు ఒళ్ళు
నాజూకు ఒళ్ళు  నాజూకు ఒళ్ళు
కస్తూరి కలబోసిన నన్నే పస్తుంచి పోమాకురా
వేడెక్కి ఉన్నా తోడింక నువ్వే
నీ మంట చల్లార్చిపో నన్ను చలిమంట కాచేసుకో
వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరా

చరణం: 2
చెంగావి చీర చేస్తాను చెల్లు
రతనాల రైక రాసిస్తా విల్లు
హేయ్ చెంగావి చీర చేస్తాను చెల్లు
రతనాల రైక రాసిస్తా విల్లు
పదహారు పరువం నీ పరుపు చుట్టూ
పట్టేసుకోరా కౌగిళ్ళలోన
కౌగిళ్ళలోన కౌగిళ్ళలోన
కలబడిపో జల నాగులా
నాలో జొరబడిపో పిడిబాకులా
తనగోడు కొంచం వినమంది మంచం
మనసారా వాటేసుకో నన్ను కసితీరా కాటేసిపో
మనసారా వాటేసుకో నన్ను కసితీరా కాటేసిపో

Palli Balakrishna Wednesday, November 1, 2017
Mogudu (2011)


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర , చిన్మయి
నటీనటులు: గోపిచంద్ , తాప్సి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
విడుదల తేది: 04.11.2011

చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా
ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా
ఇన్నాళ్ళు నాకే తెలియని
ఇన్నాళ్ళు నాకే తెలియని
నన్ను నేనే నీలో
చూస్తున్నా చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా

పచ్చని మాగని చెలు పట్టు చీరగా కట్టి
బంగరు ఉదయాల సిరులు నొసట బాసికంగ చుట్టి
ముంగిట సంక్రాంతి ముగ్గులు చెక్కిట సిగ్గులుగా దిద్ది
పున్నమి పదహారు కళలు సిగలో పువ్వులుగా పెట్టి
దేవేరిగా పాదం పెడతానంటూ
నాకు శ్రీవారిగా పట్టం కడతానంటూ
నవనిధులు వదువై వస్తుంటే
సాక్షత్తు శ్రీమనారయణుడే నేనైనట్టు

నువ్వు సేవిస్తుంటే నేను సార్వభోముడిని అయిపోతాను
నువ్వే తోడై ఉంటే సాగరాలు దాటేస్తాను
నీ సౌందర్యముతో ఇంద్రపదవిని ఎదిరిస్తాను
నీ సాన్నిధ్యంలో స్వర్గమంటే ఎమిటి అంటాను
ఎళ్ళే వచ్చి వయసును మళ్ళిస్తుంటే
నేనే నీ వళ్ళో పాపగా చిగురిస్తుంటే



*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: గీతామాధురి

నాదేరు రానన నా హా హా రే రే హే
నా దే రు నా రే మావయ్యో మా యోయో రే రే
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు మ మ మ మొగుడు
త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత త ధిమిత తక ధిమిత ఆ ఆ ఆ ఆ హ హ హ

మాటల్తోనే మత్తెకించే మాయ మొగుడో
చూపుల్తోనే కొంగేపచ్చి మోటు మొగుడో
అరె కొంగు వాసనొస్తే జాలుకుంటే మొగుడో
నేను తానమడుతుంటే చూసే దొంగ మొగుడో ఆహా ఆహా
బందర్ లడ్డు చింపనంటు నవిలే మొగుడో
ఆహ ఓహో అంటూ లొంగ దీసే మొగుడో ఓహో హోయ్ ఓహో
పొద్దునుండి రాత్రిదాక పొంగే మొగుడో
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడో
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నారేరున్నా న న న నారేరు నారేరున్న
లగ లగ లగ లగ్గామే పసుపు రాసుకున్నా పగ్గామే
పెళ్ళ పెళ్ళ పెళ్ళ పెళ్ళామే మొగుడు చేతిలోన పగ్గామే హాయ్ అ అ అ అ అ అ అ అ అ హాయ్

కాలిలోన వేళ్ళల్లోన నిమిరే కొరకె
మెట్టే లాగా ఉండే సగం వెండి మొగుడు
గుండెల నడుమ గిలి గిలి చేయడానికే
తాళిబొట్టు లాగ ఉండే బంగరు మొగుడు ఆహా ఆహా
పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే తన బిడ్డతోని కడుపులో తన్నించే మొగుడో ఓహో హై ఓహో
స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చేమొగుడు
ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న
నారేరు నా రేరున్నా న న న నారేరు నారేరున్న


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తిక్

ఎప్పుడు నీ రూపంలో తాకిందో ఓ మెరుపు
నన్ను ఇప్పటికీ వదలదు ఆ మైమరపు
మాయవో మహిమవో
రేపుమాపు తెలియకుంది
ఊపిరేమో సలపకుంది
చూపులోనే రూపముంది
బాసలేవొ రేపుతుంది

ఒక్క క్షణం పరిమళం పంచుతున్నది
మరుక్షణం కలవరం పెంచుతున్నది
ప్రతి క్షణం అనుభవం వింతగున్నది
ఈ ఆరాటమేదో ఏనాడు తెలియనిది
ఎదురుగానే నువ్వు ఉన్నా కనులు మాత్రం మూసుకుంటా
తెరవగానే కరిగిపోయే స్వప్నమలే చూసుకుంటా

మాయవో మహిమవో

ఒక్క దినం నడవడం కష్టమన్నది
ఇక మనం కలవడం తప్పదన్నది
అది ఎలా అడగడం తెలియకున్నది
మౌనాన్నెలాగో నువ్వే వినాలంది
తలపు నిన్నే తరుముతోందా
తనను తానే వెతుకుతోందా
మనసు నిన్నే కలుసుకుందా
మనవి ఎదో తెలుపుకుందా


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మధుమిత, బాబు శంకర్

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

పప పపా మమ మగరి మగరి గమ మమమమగరిస
స సరి సారిస స సరి సారిగ
పప పపా మమ మగరి మగరి గమ మమమమ రిగరిస
స సరి స నిస స స
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
ఇంట్లో ఉంటే కొంగు వదలవని తిట్టే విరసం గావాలి
గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువు కలవరించినా అది నాపేరే కావాలి
ఔనో కాదో అనుమానంతో నే మేలుకునే ఉండాలి
నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి
అందుకనే వంద యేళ్ళు నీ ప్రాణం నాకు ఇవ్వాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

చీకటినైనా చూడనివ్వనని
చీకటినైనా చూడనివ్వనని చీరై నను చుట్టేయాలి
చెప్పకూడని ఊసులు చెప్పే రెప్పల సడి వినగనగాలి
నాలో దిగువును పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి
నేను రెచ్చిపోతుంటే ఎంతో అణుకువగా ఒదిగుండాలి
నువ్వంటూ ఏం లేనట్టూ నాలో కరిగిపోవాలి
చెప్పని తనమే చెడ్డి బొమ్మవై కొత్త కొత్త కథ రావాలి

కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి


*******  ********   ********


చిత్రం: మొగుడు (2011)
సంగీతం: బాబు శంకర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్ని దయాల్, బాబు శంకర్

మన దారి హై వేరా సర సర దూసుకుపోరా
మన తీరే ఆవారా బేవార్సగా తిరిగేయరా
ఈ సాహసం ఈ సంబరం పెళ్ళయేవరకేలేరా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

ఏ బేబికైనా బీటేయి ట్రై చేస్తే క్రైం కాదోయి
ఓ బివీ వచ్చిందంటే ఏ మాత్రం వీలుండదుగా
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

షాది అవుతుంది షెహజాది వస్తుంది
she will take your hand
she will take your heart
she will take everything that you have got
యేయి మామ జర జాగ్రత్త
so better be better be a bachelor boy

ఫుల్ బాటిలా ఉన్నావే ja ja johnny walker
వైఫ్ వస్తే హాఫ్ అవుతావే
సొచో ఫ్యూచర్
మ్యారేజుతో నీ గ్లామర్
మాజి యూత్ ఏగా మిస్టర్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్
బాయ్స్ బాయ్స్ బాచిలర్ బాయ్స్

Palli Balakrishna Saturday, September 16, 2017
Jhummandi Naadam (2010)



చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: మనోజ్ మంచు, మోహనబాబు మంచు, తాప్సి పన్ను
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 01.07.2010



Songs List:



సరిగమపదని పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస్ 
గానం: యస్.పి.బాలు

సరిగమపదని 




లాలి పాడుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: యస్.పి.బాలు, గీతమధురి, బాలాజీ, దీపు

లాలి పాడుతున్నది ఈ గాలి 
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి 
లాలి పాడుతున్నది ఈ గాలి 
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి 
ఏలో యాలా ఏలో యాలా హైలెస్సో 
హైల పట్టు హైలెస్సా బల్లాకట్టు హైలెస్సా 
అద్దిర బాబు హైలెస్సా అక్కడ పట్టు హైలెస్సా 
సన్నాజాజి చీరకట్టి సిన్నాదొచ్చి హైలెస్సా 
కన్నూగొట్టే హైలెస్సా... 
తన్నానన్న తన్నన తన్నానన్నా హైలెస్సా 

చరణం: 1 
గాలి కొసల లాలి ఆ పూల తీవెకు 
వేలి కొసల లాలి ఈ బోసి నవ్వుకు 
బుడి బుడి నడకలకు భూమాత లాలి 
ముద్దు ముద్దు పలుకులకు చిలకమ్మ లాలి 
ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి 
కుహుఁ... కుహుఁ... 
చెంగు చెంగు గంతులకు చందమామలు దాగివున్న కుందేలమ్మ లాలి 
నా లాలి నీకు పూలపల్లకి 
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి 
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి పూవొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ 
గుమ్మాడి సెటు మీద ఆట చిలకల్లారా 
పాట చిలకల్లారా కలికి చిలకల్లారా 
కందుమ్మ గడ్డలు కలవారి మేడలు 
ముత్యప్పు గొడుగులు మురిపాల మురుగులు 
రంగు రుద్రాక్షలు తీరు గోరెంటలు 
తీరు రుద్రాక్షలు పరుగుల కట్టలు 
ఏమేమి పూవొప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ 

చరణం: 2 
వెన్నముద్ద లాలి చిన్నారి మేనికి 
గోరుముద్ద లాలి బంగారు బొమ్మకి 
ఓనమాలు పలికితే పలకమ్మ లాలి 
బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి 
దినదినము ఎదుగుతుంటే దినకరుని లాలి 
పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికి కడుపు తీపి లాలి 
నా లాలి నీకు పూలపల్లకి 
అలసిన కళ్లకి సొలసిన కాళ్లకి 
లాలి పాడుతున్నది ఈ గాలి 
ఆ లాలి రాగాలలో నువు ఊయల ఊగాలి



గోవిందా గోవిందా పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేదవ్యాస్ 
గానం: యస్.పి.బాలు

గోవిందా గోవిందా




ఏం సక్కగున్నవ్ రో పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: అరుణ్ గర్వార, చైత్ర

ఏలోరే.. ఏలోరే... 
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో 
ఏం సక్కగున్నవ్ రో  నా సొట్ట సెంపలోడ 
ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ 
ఏం సిక్కగున్నవ్ రో నా సిట్టి జుంపాలోడ
పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే 
రెక్కలు నాకుంటే నేను సుక్కలో ఉన్నట్టే 
ఫక్కున నువు నవ్వితే 
ముత్యాల్ వజ్రాల్ వైడూర్యాలు ఏరుకుంటాలే 
మెళ్ళో ఏసుకుంటాలే ! 
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా 
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా 

చరణం: 1 
చీర కొంగులో నన్ను కట్టుకో  బొడ్డు లోపలా నన్ను దోపుకో 
పూల దస్తిలో నన్ను పెట్టుకో  రైక లోపల నన్ను దాచుకో 
ఓహో ఎర్రని రిబ్బెన పువ్వల్లే చేసి  
నల్లని కొప్పున నన్ను చుట్టుకో 
కొప్పున చుట్కుంటే లోకం చూస్తదీ  ఆహా 
రైకల పెట్కుంటే గిలిగిలైతదీ  ఆహా 
బొడ్డుల దోప్కుంటే  మోసమైతదీ అమ్మొ మోసమైతదీ 
ఏదో పోనీ అని వంటిగొదిలితే  
ఏస్కపోతరేమో నా ఈడు ఆడోళ్ళు ! 
సక్కగున్నవ్ రో  ఏం సక్కగున్నవ్ రో  నా సొట్ట సెంపలోడ 
ఏం సిక్కగున్నవ్ రో  నా సిట్టి జుంపాలోడ 

చరణం: 2 
పచ్చనాకులా పళ్ళెం పెట్టుతా వేడి వేడిగా బువ్వ వడ్డిస్తా 
ఆవకాయలో నెయ్యి కల్పుతా  ముద్దు పెడితె నే ముద్ద తింపిస్తా 
అబ్బొబ్బొ తినుకుంటా నా ఏలు కొరికితే  మబ్బుల్లో సెంద్రయ్య సిగ్గు సెందాడా 
గోరింటా ఆకులు ముద్ద నూరుతా  కాళ్ళకూ వేళ్ళకూ నేనే అద్దుతా 
పాదాల దగ్గరనే  సేద తీరుతా  ఆహా సేద తీరుతా 
తెల్లవారంగానే నేనే కడుగుతా  నీ కాలి మెరుపులో పొద్దుపొడుపునే చూస్తా 
సక్కగున్నవ్ రో నా సొట్ట సెంపలోడ 
ఏం సిక్కగున్నవ్ రో   నా సిట్టి జుంపాలోడ 
ఏం సక్కగున్నావే సంపంగి ముక్కు దానా 
ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా 
ఏలోరే... ఏలోరే...
ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరే ఏలో




సన్నాయి మ్రోగింది పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: యస్.పి.బాలు, సునీత, మాళవిక , చైత్ర అంబడిపూడి

సన్నాయి మ్రోగింది 



దేశమంటే మట్టి కాదోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
దేశమంటే మతం కాదోయ్.. గతం కాదోయ్
అడవి కాదోయ్ గొడవ కాదోయ్
అన్న చేతి గన్ను కాదోయ్
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే.. 

చరణం: 1 
గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్.. 
పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్.. 
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్

చరణం: 2 
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు 
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
హిసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు 
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
క్రోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నేడే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే...
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే...
దేశమంటే మనుషులోయ్





నిగ్రహం పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్ 

నిగ్రహం 





బాలామణి బాలామణి పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కార్తీక్, శివాణి

బాలామణి బాలామణి





ఎంత ఎంత ఎంత చూడనూ పాట సాహిత్యం

 
చిత్రం: జుమ్మంది నాదం (2010)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కృష్ణ చైతన్య, సునీత

ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను 
రెండూ రెండేగా ఉన్నాయంట నా కన్నులూ 
అరెరెరెరే.. ఎన్నని సిరులెన్నని నిధులెన్నని మరి చూడాలికా 
అరెరెరెరే... ఉన్నవి సరిపోవని నా కన్నులు అరువిస్తానుగా 
ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను 

చరణం: 1 
చేతికేసి చూస్తే చెంపగారు సిద్దం 
నిదురు చూస్తే పెదవిగారు పలికె స్వాగతం 
అడుగుకేసి చూస్తే జడలు చేసె జగడం
మెడను చూస్తె నడుముగారు నలిగె తక్షణం 
అరెరెరెరే... చూడకు తెగ చూడకు తొలి ఈడుకు దడ పెంచేయకూ 
అరెరెరెరే... ఆపకు నను ఆపకు కనుపాపల ముడి తెంచేయకూ 
ఎంత ఎంత ఎంత చూడనూ
ఎడమ కుడి ఎటేపు చూడను 

చరణం: 2 
పైన పైన కాదూ లోన తొంగి చూడూ 
మనసు మూల దొరుకుతుంది ప్రణయ పుస్తకం 
కళ్ళతోటి కాదు కౌగిళ్ళతోటి చూస్తే వయసు మనకు తెలుపుతుంది వలపు వాస్తవం 
అరెరెరెరే... చూపులు మునిమాపుగ మన రేపుగ ఇక మారాలిగా 
అరెరెరెరే... రేపటి మన కలయికలను ఇప్పటి కల చూపిందిగా

Palli Balakrishna Tuesday, July 25, 2017
Mr. Perfect (2011)




చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
నటీనటులు: ప్రభాస్, కాజల్, తాప్సి
దర్శకత్వం: కె.దశరథ్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 22.04.2011



Songs List:



రావు గారి అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: టిప్పు

రావు గారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో డాక్టర్నే చేశాడు
పైసలెన్నో వస్తున్నా పేషెన్ట్ లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు
సూది మందు గుచ్చుతున్నాడు
నీకు నచ్చింది చెయ్యకుంటే
లైఫ్ లో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్ముకుంటే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

నిజమేరా ఏదో  నిన్ను ఫాలో అవ్వడం వల్ల
ఇలా ఉన్నాను గాని
లేకపోతే ఆ లక్ష్మీ గారి అమ్మాయిలా
లైఫ్ లో లైఫె లేకుండా పోయేదిరా బాబు

ఆ లక్ష్మీ గారి అమ్మాయి - బాగుంటదా
ముందు మేటర్ వినరా సన్నాసి
ఆ లక్ష్మీ గారి అమ్మాయి
డాన్సరవ్వాలనుకుంది ఓహో
కానీ వాళ్ళ అమ్మేమో
పెళ్ళి చేసి పంపేసింది
వందకోట్ల ఆస్తున్నా వంటింట్లోనే ఉంటాది
గజ్జకట్టా లనుకున్నాది గరిట పట్టుకున్నాది
ఎవడో చెప్పింది చేస్తుంటే
లైఫ్ లో యాడుంది కిక్కు
ఎపుడు నువ్వే సర్దుకుపోతే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

మన జనరేషన్ కే కాదురా
మన ముందు జనరేషన్ కి కూడా ఇదే టార్చరు
అంతెందుకు మన శీను గాడి బాబాయి
శీను గాడి బాబాయి లీడరవ్వాలన్నాడు
కానీ వీడి తాతేమో ప్లీడర్ని చేశాడు
కేసు వాడివైపున్నా పేస్ మాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు జడ్జ్ ముందు తల వంచాడు

నువ్వనుకున్నది చెప్పుకుంటే
లైఫ్ లో  యాడుంది కిక్కి
నీలో నువ్వే గింజుకుంటే
నీకింక ఎవడు దిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

రేయ్ పెద్దవాళ్ళు చెబుతారు
పక్కనోళ్ళు చెబుతారు
తప్పులేదు బాసు వాళ్లకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో
నీకు ఏది సూటవుతుందో
అర్ధమయ్యేలా చెప్పకుంటే
వాళ్ళు మాత్రమేం చేస్తారో
మనమే క్లియర్ గా లేకపోతె
అక్కడే వస్తుంది చిక్కు
లేనిపోని భయాలు పెట్టుకుంటే
తర్వాత మీకు బిక్కు

Be whats u wanna be
Do whats u wanna do
say whats u wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం



హా చలిచలిగా అల్లింది పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌
గానం: శ్రేయ ఘోషల్

హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీవైపే మళ్లిందీ మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుందీ వయసూ
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి
నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

హా చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది
నీవైపే మళ్లిందీ మనసూ
చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుందీ వయసూ

చరణం: 1
గొడవలతో మొదలై తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీదీ నాదీ
తలపులు వేరైనా కలవని తీరైనా
బలపడిపోతుందే ఉండేకొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశంపైకి వెళుతున్నట్టు
తారలన్ని తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

చరణం: 2
నీపై కోపాన్ని ఎందరిముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు
నువ్వు నా వూపిరైనట్టు నాలోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు




నింగి జారి పడ్డ పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మల్లికార్జున్





డోల్ డోల్ డోల్ భాజే (ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే) పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: బాలాజీ 
గానం: MLR కార్తికేయన్,అనిత కార్తికేయన్

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

దినక్ దిన...

హో డోల్ డోల్ డోల్ భాజే
సంబరాలు సాధి రోజే
మంతనాలు పెత్తనాలు చేస్తు
పెద్ద వాళ్ళు వేసే పెళ్ళి రూట్ లే

డోల్ డోల్ డోల్ భాజే
డోలి మీద రాణి రాజే
చందనాలు కంకణాలు మారే
ఉంగరాలు చేరే పెళ్ళి పీటలే

మేడ్ ఫర్ ఈచ్ అధర్ వీళ్లు అని
నూరేళ్లు హాయిగ గడపమని
వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు
నింగి నేల ఏకం చేసి జనాలు జిగేలు మనాలిలే

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓ హో హో
నేలమీద ముగ్గులాయే ఆ హా హా
టింగు రంగడల్లే బావ కొంగుపట్టు వేళ ఉంది
వేలు కాస్త పైకి ఎత్తవే

రామ సక్కనోడు లెండి ఓ హో హో
భామ వంక చూడదండి ఆ హా హా
రాయభార మెందుకండి
రాసివుంచి నాడు లెండి
గుండెలోన చోటు సీతకే
చూపులే మాటలై
మరి కవితలు రాయవ
ప్రేమ దారి పెళ్ళి లోనే
ఆటవుతుంది పాటవుతుంది
మనసులు కలిపే చోటవుతుంది

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే

కళ్ళలోని ఆశలన్ని ఓ హో హో
నిన్ను చేరి తీరిపోయే ఆ హా హా
కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటనంటు
ఒట్టు పెట్టి చెప్పవే మరి అహ

గుండెలోనె కోట కట్టి ఓ హో హో
ఊపిరంత నీకు పోసి ఆ హా హా
అందమైన బొమ్మ చేసి
మూడు ముళ్ళు మంత్రమేసి
ఏలుకుంట నిన్ను రాణి లా
నీ జతే ఓ వరం
కోటి కళలకు కానుక
లోకమంత మాయచేసి
నువ్వు నేను మిగిలుండాలి
యుగాలు క్షణాలు అయేట్టుగా

ఘల్లు ఘల్లు మని గజ్జలు ఆడే
ఝల్లు ఝల్లు మని గుండెలు పాడే
భల్లు భల్లు మని ఢమరుక మోగే
జిల్లు జిల్లు మను వేడుకలే

వెండి మబ్బులతో పందిరి వేసి
వెన్న ముద్దలతో విందులు చేసి
ఊరు వాడ హోరుమంటు కదిలి
పండగల్లే పెళ్ళిచేయు సందడులే




మొర వినరా ఓ గోపికృష్ణా పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: జి. సత్యమూర్తి
గానం: ప్రియదర్శిని

మీకు నచ్చిన రంగు ?
తెలుపు
ఎదుటి మనిషిలొ మీకు నచ్చెది?
చిరునవ్వు
మీకు సంతోషమ్ వస్తే ఏమ్ చేస్తారు?
డాన్స్

మొర వినరా ఓ గోపికృష్ణా
ఈ కన్నెల వెన్నలు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా
అలిగి ఎరిగీ  వెదురు పొదలకు వెల్లమాకురా
చిగురూ పాదాలు కందీ పోవురా
మురిసే మురళి రవలి వినిపించకురా
అది విని కోయిలమ్మ మూగబోవురా
వినరా ఇ గారాల బేరాలు చాలించరా
మొర వినరా ఓ గోపికృష్ణా
ఈ కన్నెల వెన్నలు నీవేలేరా
నవ్వకురా ఓ మువ్వల కృష్ణ
ఆ నవ్వుకు గుండెలు లయతప్పునురా

ఓ కృష్ణా హో మై కృష్ణా
హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా
లెట్స్ డాన్స్ కృష్ణా
ఓ కృష్ణా హో మై కృష్ణా
హెయ్ కమ్ కృష్ణా కమ్ కృష్ణా
లెట్స్ డాన్స్ కృష్ణా




ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: మేఘ, సాగర్

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

రై రై రై రైడ్ చేసెయ్ రాకెట్లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్ సిగ్నల్స్తో ఏం పనీ
ఇక హైవేలైనా వన్వేలైనా కదలదే బండి తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

పార్టీలా ఉంది నీతోటి ప్రతిక్షణం
ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువు చెప్పే ప్రతి పదం
బాగుందబ్బా మాటల్లోన ముంచడం
హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
కార్టూన్ చానెల్లోనైనా ఈ ఫన్నుందా బోలోనా
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా
ఇక సాల్సాలైనా సాంబాలైనా
కదలదే ఒళ్లు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హే మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక

ఆన్లైన్లో నువ్వు హాయ్ అంటే నా మది
క్లౌడ్ నైన్లోకి నన్ను తోస్తది
ఆఫ్లైన్లో నువ్వు ఉన్నావంటే మది
కోల్ మైన్లోకి కూరేస్తది
ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ కార్డ్లా కనిపిస్తుంది జాణా
నాతో పాటు ఈ ఫీలింగు నీకు కొత్తేనా
ఏ రోజైనా వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైనా
నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా
ఇక డేటింగైనా ఫైటింగైనా గడవదే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెల్లోన
మోగుతుంది నిన్ను కలిశాక
హే మేఘాలే గుద్దుకున్న లైటు కళ్లల్లోన
చేరుకుంది నిన్ను కలిశాక




అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: గోపిక పూర్ణిమ

అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను - నేను
నన్ను చిన్న చూపు చూస్తె ఊరుకోను - కోనూ
ఎందులోను నీకు నేను తీసిపోనూ
నా సంగతేంటొ తెలుసుకోవా పోను పోనూ
అచ్చమైన పల్లె రాని పిల్ల నేనూ - నేనూ
పచ్చి పైరె గాలి పీల్చి పెరిగినానూ
ఏరికోరి గిల్లి కజ్జా పెట్టుకోనూ
నిన్ను చూస్తె గిల్లకుండా ఉండలేనూ
హొయ్ హొయ్ హొయ్
హెయ్ సూటు బూటు స్టైల్ సుందరా
లేని పోను డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నాగొప్పలూ ఒప్పుకో తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీకెక్కువేమిటో
హా చుక్కల్లోని  చూపు కొద్దిగా
నేల దించుకో హొయ్



బదులు తోచని ప్రశ్నల పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, మల్లికార్జున్

ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొన్నా నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా
ఈ రోజు ఏమైందని ఏదైనా అయ్యిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా రా

ఎప్పటికి తన గుప్పెట విప్పదు
ఎవ్వరికి తన గుట్టలు చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపుకథ

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
తప్పు అనేందుకు కారణముండదు
చిక్కులలో పడడం తనకేం సరదా

ఏదోలా చూస్తారే నిన్నొ వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే
నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిన్ను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకి నేటికి
నీ దారే మల్లుతుందా కొత్త తీరానికి
మార్పేదైన వస్తుంటే నువ్వది గుర్తించక ముందే
ఎవరెవరో చెబుతూ ఉంటే నమ్మేదెలా
వెళ్ళే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీలేలేదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
కలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా



లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో పాట సాహిత్యం

 
చిత్రం: Mr. Perfect (2011)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్‌
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బాబా సెహగల్, మురళి

బావా ఎప్పుడు వచ్చితి నీవు
వచ్చి ఏమి పీకితి నీవు
ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు
ఎవడబ్బ సొమ్మని నీ భావ ఇంత తగలేసి
ఈ సంగీతు పెట్టాడనుకున్నావు
వెళ్ళి వాణ్ణి లేపు వీడ్ని లేపు
పందిట్లో పుట్టించు ఊపు...

ఓరె  ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే

కంప్యూటర్లు మూసే సెల్ ఫోన్స్ తీసి దాచేయి
వెళ్ళింట్లోకివన్ని దేనికోయ్
మైండ్ బ్లాక్ చేసేయ్ ఆలోచనలు మనేయ్
మ్యారేజే ని ద్యాసేయ్
ఫస్ట్ గెస్ట్ లా నువ్వు నడుచుకో
ఏమంటాడురా ?

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

ఓరె  ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే

బడ్లోకెళ్ళి పాఠం వింటాం
గుడ్లోకెళ్లి పూజలు చేస్తాం
ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం
మరి పెళ్ళింట్లోనే ఎంజాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్లా పెళ్ళిలో
సావాసం సంతోషం పంచే అవకాశం
కళ్యాణం అనుకుంటే
నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

నీతో స్నేహం అరె నాకేం లాభం
అనేంత లాగా మారింది లోకం
నువ్వు మౌనం అరె నేను మౌనం
మనసు మనసు మరింత దూరం
అక్కా పిన్ని బాబాయ్
బుజ్జి బాబా చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది డైలీ సీరియల్ కాదోయ్
మళ్ళి మళ్ళి రాదోయ్
ఈ ఒక్క రోజు కొంచం
నీ బిజీ కామ్ బంధువులకు ఇచ్చుకో

లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో

Palli Balakrishna Monday, July 3, 2017

Most Recent

Default