Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Acharya (2022)చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 14.02.2022Songs List:లాహే లాహే పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిత నారాయణ్, సాహితి చాగంటి

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

కొండలరాజు బంగరు కొండ
కొండా జాతికి అండా దండా
మద్దే రాతిరి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే
ఆటిని మాలలు కడతా
మంచు కొండల సామిని తలసిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

మెళ్ళో మెలికల నాగుల దండ
వలపుల వేడికి ఎగిరిపడంగా
ఒంటి యిబూది జలజల రాలిపడంగా
సాంబడు కదిలిండే
అమ్మ పిలుపుకు సామి
అత్తరు సెగలై విలవిల నలిగిండే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

నాదర్దిన్న దినదిన నాననా
నాదర్దిన్న దినదిన నాననా

కొరకొర కొరువులు మండే కళ్ళు
జడలిరబోసిన సింపిరి కురులు
ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు వెన్నెల కాసిందే
పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటి కురికి 
అయ్యవతారం చూసిన కల్కి
ఎందా శంఖం సూళం భైరాగేసం ఏందని సణిగిందే
ఇంపుగ ఈ పూటైనా రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

లోకాలేలే ఎంతోడైన లోకువమడిసే సొంతింట్లోన
అమ్మోరు గడ్డంపట్టి బతిమాలినవి అడ్డాల నామాలు
ఆలుమగల నడుమన అడ్డంరావులే ఇట్టాంటి నియమాలు

ఒకటో జామున కలిగిన విరహం
రెండో జాముకి ముదిరిన విరసం
సర్దుకుపోయే సరసం కుదిరే వేళకు మూడో జామాయే
ఒద్దిక పెరిగే నాలుగో జాముకి
గుళో గంటలు మొదలాయే

లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే
లాహే లాహేలాహేలాహే లాహే లాహేలాహేలాహే
లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహేలే

ప్రతి ఒక రోజిది జరిగే ఘట్టం
ఎడమొకమయ్యి ఏకం అవటం
అనాది అలవాటీళ్ళకి అలకలలోనే కిలకిలమనుకోటం
స్వయాన చెబుతున్నారు అనుబంధాలు
కడతేరే పాఠంనీలాంబరీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: అనురాగ్ కులకర్ణి , రమ్య బెహ్రా

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
అయ్యోరింటి సుందరి
వయ్యారాల వల్లరి
నీలాంబరీ (నీలాంబరీ)

వందే చంద్ర సోదరి
వస్తున్నాను నీ దరి
నీలాంబరీ నీలాంబరీ

మంత్రాలేంటోయ్ ఓ పూజారి
కాలం పోదా చేజారి
తంత్రాలేవి రావే నారి
నేనేం చెయ్ నే నన్నారి
నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

విడిచా ఇపుడే ప్రహరీ… నిన్నే కోరి
గాలాలేయకోయ్… మాటలా జాలరి
ఒళ్ళో వాలదా నాలో సిరి టెన్ టు ఫైవ్
నీతో సాగితే మాటలే ఆవిరి
అయినా వేసినా పాటతో పందిరి
అడుగేస్తే చేస్తా నీకే నౌకరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరి

ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస
ధీం తోం తోం పా సరిగమప ని
ధీం తోం తోం రీ మగరిస

మెరిశా వలచే కలలో ఆరితేరి
ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి
నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి
విడనే వీడనే… నువ్వు నా ఊపిరి
సాక్ష్యం ఉన్నదీ జీవధార ఝరి
ప్రతిజన్మ నీకే రాశా ఛోకిరి

నీలాంబరీ నీలాంబరీ
వేరెవ్వరే నీలా మరి
నీలాంబరీ నీలాంబరీ
నీ అందమే నీ అల్లరిశాన కష్టం పాట సాహిత్యం

 

చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కర భట్ల 
గానం: రేవంత్, గీత మాధురి

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం

నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్దీ
ధగధగలా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా

శాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన జనం నలిగేపోనీ

నా కొలతే చూడాలని
ప్రతోడు టైలర్లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే

ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే ఆర్ఎంపిలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే... ఒంపు సొంపుల్తో

శాన కష్టం, పాపం... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించేయ్ నర దిష్టిని

ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో
ఓ యే ఓ యే ఎంగిలంది అమ్మాయో

హే, నా పైట పిన్నీసుని
అదేంటో విలన్లా చూస్తుంటారే
ఏ లెవెల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే

డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నలుగెడుతుంటే
నీ కహాని మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో ఎట్టా వేగాలో

శాన కష్టం, అరెరే... సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తునిభలే భలే బంజారా పాట సాహిత్యం

 
చిత్రం: ఆచార్య (2022)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్

హే సింబా రింబా సింబా రింబా 
చిరత పులుల చిందాట
హే సింబా రింబా సింబా రింబా 
సరదా బురద సయ్యాట

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

కాకులు దూరని కారడవిలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది
నేల వంతపాడింది

సీకటంతా సిల్లుపడి
యెన్నెలయ్యిందియాల
అందినంత దండుకుందాం
పద దలో చెయ్యారా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

చీమలు దూరని చిట్టడవికి
చిరు నవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

హే కొక్కొరోకో కోడె కూత
ఈ పక్క రావద్దే
అయితలెక్క ఆడేపాడే
మాలెక్క నాపొద్దే

తద్దిన దిన సుక్కల దాక లెగిసి ఆడాల
అద్దిర బన్నా ఆకాశ కప్పు అదిరి పడాల

అరిచేయి గీతకు చిక్కింది
భూగోళమ్మీయాల
పిల్లోల్ల మల్లే దాన్నట్టా
బొంగర మెయ్యాలా

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాంరా (2)

నేస్తమేగా చుట్టూ ఉన్న 
చెట్టైన పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుట్టహా మిట్టైన

అమ్మకుమల్లే నిన్నూ నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీ బిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖం
రెండిటికీ మనమే అయినోళ్లు

భలే భలే బంజారా మజా మనదేర
రేయి కచ్చేరీలో రెచ్చి పోదాం రా (2)

No comments

Most Recent

Default