Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "S. Thaman"
Game Changer (2025)



చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్
నటీనటులు: రామ్ చరణ్, కైరా అద్వాని, అంజలి
దర్శకత్వం: యస్.శంకర్ 
నిర్మాత: దిల్ రాజు 
విడుదల తేది: 10.01.2025



Songs List:



జరగండి జరగండి పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: ధలర్ మెహంది, సునిధి చౌహాన్

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే

గుమ్స్ గుంతాక్స్ చిక్స్

జరగండి జరగండి జరగండీ
జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ
జరగండి జరగండి జరగండీ
ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండీ
మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

ఎయ్ జరగండి జరగండి జరగండీ
స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ

ముప్పావ్‍లా పెళ్ళన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మర్నాడే

హస్కు బుస్కు లస్కండి
మరో ఎలన్ మస్కండి
జస్క మస్క రస్కండి రిస్కేనండి

సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ళ జల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సప్రైజ్ చేయ్యండి

గుమ్స్ గుంతాక్స్ చిక్స్
గుమ్స్ గుంతాక్స్ చిక్స్

పాలబుగ్గపై తెల్లవారులు
పబ్జీలాడే పిల్లడే
పూలపక్కపై మూడు పూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తడే

పిల్లో ఎక్కడో
ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పిల్లో ఎక్కడో ఉంటూనే
కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే

సూపర్ సోనికో హైపర్ సోనికో
సరిపడ వీడి స్పీడుకే

జరగండి జరగండి జరగండీ
గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ
ఓయ్ జరగండి జరగండి జరగండీ
పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ

సిక్సర్ ప్యాకులో యముడండీ
సిస్టం తప్పితే మొగుడండీ
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చుడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండీ
కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే

జరగండి జరగండి జరగండీ
దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ



రా మచ్చ మచ్చ రా పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నకాష్ అజీజ్

కళ్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే

టక్కు టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే

కన్న ఊళ్ళో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గలా
చక్కగ మోగుతుందిక మ్యూజిక్కులా

వీణ స్టెప్పు వేస్తేనీ
విజిల్ సౌండు దడ దడా
నక్కిన దండి గుండెలో ఏదో మూలా

పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గుర్తుకొస్తాయీ భూమ్మీద ఉన్నన్నాళ్లు

ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే
మీరైనా నాలాంటోళ్లే ఏ ఏ

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా

రా మచ్చ మచ్చ రా
రా మచ్చ మచ్చ రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ ర్యాంపే రా




నానా హైరానా పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తిక్, శ్రేయా ఘోషాల్ 


నాదిర్ దిన్నా...  నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా

నానా హైరానా... ప్రియమైన హైరానా
మొదలాయే నాలోనా... లలనా నీ వలనా

నానా హైరానా… అరుదైన హైరానా
నెమలీకల పులకింతై... నా చెంపలు నిమిరేనా

దానాదీనా ఈవేళ నీలోన నాలోన
కనివినని కలవరమే సుమశరమా

వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

కోరస్: నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా

ఎపుడు లేనే లేని వింతలు
ఇపుడే చూస్తున్నా…
గగనాలన్ని పూలగొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు

కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు

ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా

రోమాలన్ని నేడు
మన ప్రేమకు జెండాలాయే
ఏమ్మాయో మరి ఏమో
నరనరము నైలు నదాయే

తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలి కథగా

వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే...

వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే

కోరస్: 
నాదిర్ దిన్నా...  నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా... థిల్లానా దిన్నా




ధోప్ ధోప్ పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: థమన్, రోషిణి JKV, పృద్వీ, శ్రుతి రంజిని మోదుముడి

ధోప్ ధోప్... ధోప్ ధోప్

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్

లవుడ్ వన్స్ అప్సెట్ అయ్యే ఆర్గుమెంట్ ధోప్
ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగెర్ ధోప్
ఎంతలాంటి స్ట్రెస్సుకు
ఇన్స్టాంట్ సొల్యూషన్ ధోప్…

డోంట్ వర్రీ… డోంట్ వర్రీ
ఎనఫ్ ఆఫ్ ఇంజూరీ
నెగటివ్ వైబ్ కి చెప్పెయ్ ధోప్
బేకరీ బేకరీ… అయ్యయ్యో కెలొరీ
టెడ్డి బేర్ టమ్మీకి చెప్పెయ్ ధోప్

చాటరీ బ్రౌసరి టైం అంతా రాబరీ
చేసే సెల్ ఫోన్ కు చెప్పెయ్ ధోప్
డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ
ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్

If You’re Coming You’re Coming
Everybody Dhop
When You’re With Me You’re With Me
Everything Is Dhop
If You Look At Me Look At Me
Stress Anthaa Dhop
When You Smile At Me Myself-eh Dhop

మన మీటింగుకు మన మీటింగుకు… Interval Dhop
మన టచింగ్ కు మన టచింగ్ కు… Hesitation Dhop
మన లిప్పుకు లిప్పుకు… Distance-u Dhop
నా విలన్ నీ డ్రెస్సుకు Dhop

లా ల ల ధోప్...

వాక్క వక వక వక వాట్ సే ధోప్
లాక లక లక లక లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫుకు మైక్రో మంత్ర ధోప్




అలికి పూసిన అరుగు మీన పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, రోషిణి JKV

అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా..?
సిలక ముక్కు సిన్నీ నా దొరా

ఎతికి చూస్తే ఏడూళ్ళైనా
నీలాంటోడు ఇక దొరికేనా..?
ఎందుకింత ఉలుకూ ఓ దొరా
ఎండి బంగారాల నా దొరా

సైకోలెక్కి సందమామ
సిక్కోలంతా ఎన్నెల పంచి
సిన్నబోయి వచ్చావేంది..?
నీలో ఉన్న మచ్చను తలచి
కొండ నిండ వెలుగే నీదిరా

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా

అలికి పూసిన అరుగు మీన
కలికి సుందరినై కూసుంటే
పలకరించావేందీ ఓ దొరా
సిలక ముక్కు సిన్నీ నా దొరా

గుట్ట గుట్ట తిరిగే ఓ గువ్వ
నీకు దిష్టి పూసలాంటిది సిరిమువ్వ
ఓయ్ రాజా… నెల రాజా, ఆ ఆ
ఎంత కట్టమైన గాని నీ తోవ
నన్ను రెక్కలల్లో సుట్టుకోవా

సింతపూలా ఒంటి నిండా
సిటికెడంత పసుపు గుండా
సిన్నదాని సెంపల నిండా
ఎర్ర ఎర్ర కారంగుండా
వన్నెలన్నీ నీవే సూర్యుడా, ఆ ఆ

మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండె మీద వాలిపోరా
ఊపిరి పోస్తా దొరా…


మనసు మీద మన్నేయకురా
నిమ్మలముండు దొర
నా గుండెలోన తప్పెట గుళ్ల
సప్పుడు నువ్వే దొరా




కొండ దేవరా...పాట సాహిత్యం

 
చిత్రం: Game Changer (2025)
సంగీతం: S. థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: థమన్, శ్రావణ భార్గవి

నెత్తురంత ఉడుకుతున్న
ఊరువాడ జాతర...
వాడు మీద పడ్డడంటే
ఊచ ఊచకోతర...
కొండ దేవర… కొండ దేవర

ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు
ఉప్పు పాతర…
తన్ని తన్ని దుండగుల్ని
తరుముదాము పొలిమేర
కొండ దేవర... కొండ దేవర

కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది
కొండ దేవరా... నీరు నిప్పు మాది
కొండ దేవరా... కొండ కోన మాది

ఎర్ర ఎర్ర సూర్యున్నేమో
బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకునా
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఊయలూపినావు జోలనా...

హే, మా నిన్న మొన్న
మనమంటే, నువ్వే
వేయి కన్నులున్న... బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా... ఇయ్యాల, రేపు

మా వెన్నుదన్ను మార్గం చూపే
హే, పాడు కళ్ళు సూడు
తల్లి గుండె తప్ప ఈడకొచ్చినాయిరా
హే, ఎల్లగొట్టుదాము విల్లు ఎత్తినాము
బెల్లుమంటు దూకదా..?

కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... కొండ దేవరా
కొండ దేవరా... నేల గాలి మాది
కొండ దేవరా... మట్టి తల్లి మాది

కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా
కొండ దేవరా... అండ నీవురా
కొండ దేవరా, ఆ ఆ... గుండె నీదిరా



Palli Balakrishna Saturday, March 30, 2024
Guntur Kaaram (2024)



చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
నటీనటులు: మహేష్ బాబు, శ్రీ లీల, 
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
నిర్మాత: యస్.రాధాకృష్ణ 
విడుదల తేది: 12.01.2024



Songs List:



దమ్ మసాలా బిరియాని పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సంజిత్ హెగ్డే, జ్యోతి నూరాన్

సర్రుమండుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాది ఈడితోటి బేరం
కరర కరర బాబు గొడ్డు కారం
గిరర గిరర ఈడితోటి బేరం

ఏ పట్టాభిపురం ఎళ్లే రోడ్డు
ఎవడినైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తెలీనోడు ఎవడు లేడు
ఏ ఎవడు లేడు

ఏ మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మెదడు పనిచెయ్యక
మరిచిపోరా పిన్నుకోడు

కర్ రా అర్ర యెర్రి
హే సుర్రు హే సుర్రు
హే సుర్రు సుర్రు సుర్రు సురక ఈడు

ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
సుర్రు సురక ఈడు
హైలీ ఇన్ ఫ్లేమబుల్

ఎవ్రీబడీ మేక్ వే
లీడర్ ఆన్ ద వే
ఏంట్ గాట్ నో టైం టు ప్లే

ఎదురొచ్చే గాలి
ఎగరేస్తున్న చొక్కా పై గుండి
ఎగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కిన బండి

ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి
ఏ హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకు ఎందుకు నే మొయ్యాలి

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

నేనో నిశేబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వార్ధం పరమార్ధం
కలగలిసిన నేనో ప్రేమ పదార్థం

ఏ పట్టు పట్టు కోమలి
ఎత్తిపట్టి రోకలి
పోటు మీన పోటు ఏసి
దమ్ముకొద్ది దంచికొట్టు దంచికొట్టు

ఏ ఏటుకొక్క కాయనీ
రోటికియ్యవే బలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాల్లో నిండి ఘుమ్మనేటట్టు

ఏ పైట సెంగు దోపవే
ఆ సేతి పాటు మార్చావే
ఏ జోరు పెంచావే
గింజ నలగ దంచవే
కొత్త కారమింకా గుమ్మరించుకోవే

నా మనసే నా కిటికీ
నచ్చక పోతే మూసేస్తా
ఆ రేపటి గాయాన్ని
ఇపుడే ఆపేస్తా

నా తలరాతే రంగుల రంగోలి
దిగులైన చేస్తా దీవాళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకు ఎందుకు పడగొట్టాలి

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని

దమ్ మసాలా బిరియాని
ఎర్ర కారం అరకోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుద్ది పారేయ్ గుంటూర్ని



ఓ మై బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శిల్పారావు

నా కాఫీ కప్పుల్లో
షుగర్ క్యూబు నువ్వే నువ్వే
నా కంటి రెప్పల్లో
కాటుక ముగ్గు నువ్వే నువ్వే

నా చెంపలకంటిన
చామంతి సిగ్గు నువ్వే నువ్వే
నా ఊపిరి గాలిని
పెర్ఫ్యూమల్లె చుట్టేస్తావే

ఓ మై బేబీ ఓ ఓ
నీ బుగ్గలు పిండాలి
ఓ మై బేబీ ఓ ఓ
నీకు ముద్దులు పెట్టాలి
ఓ మై బేబీ ఓ ఓ
నా చున్నీ నీకు టై కట్టాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

నా వేకప్ కాల్ అయి
వెచ్చగ తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కని గోడలు దూకే
వెన్నెల చంద్రుడు నువ్వేలే

ఏ నూటికో కోటికో
నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే
గుట్టుగా నీకు పెళ్ళాం అయ్యాలే

ఓ మై బేబీ ఓ ఓ
నీ పక్కన వాలాలి
ఓ మై బేబీ ఓ ఓ
నీతో చుక్కలు చూడాలి
ఓ మై బేబీ బేబీ బేబీ ఓ ఓ
నీ కౌగిలి ఖాళీ పూరించాలి

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్ క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కన నావెల్ నువ్వు
ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

ఓ మై బేబీ ఓ ఓ
ఓ మై బేబీ బేబీ బేబీ బేబీ ఓ
ఓ మై బేబీ ఓ ఓ
తాన నన్నా నన్నానా
హ బేబీ బేబీ ఓ
తాన నన్నా నన్నా నన్నా




ఆ కుర్చీని మడత పెట్టి పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, శ్రీకృష్ణ 

రాజమండ్రి రాగమంజరి
మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరి
కళాకార్ల ఫ్యామిలీ మరి
మేము గజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి

సోకులాడి స్వప్న సుందరి
నీ మడతసూపు మాపటేల మల్లె పందిరి
రచ్చరాజుకుందె ఊపిరి
నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరిడిరీ

తూనీగ నడుములోన తూటాలెట్టి
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి
మగజాతి నట్ట మడతపెట్టి

ఆ కుర్చీని మడత పెట్టి
ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
కు కు కుకూ కూ కూ కూ కూ

దాని కేమో మరి దానికేమో
దానికేమో మేకలిస్తివి
మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి
మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటక్ కరిగిపాయే
కు కు కుకూ

ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి
మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి
దాని చెవిలో జూకాలేమొ దగా దగా మెరిసిపాయే
నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే

ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి
ఏం రసిక రాజువో మరి
నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
కు కు కుకూ కూ కూ కూ కూ

సో సో సో సోకులాడి స్వప్న సుందరి
మడత పెట్టి మడత పెట్టి
మాపటేల మల్లె పందిరి
మడత పెట్టి మడత పెట్టి

రచ్చరాజుకుందె ఊపిరి
మడత పెట్టి మడత పెట్టి
గుండెలోన డీరి డిరి డిరి

ఏందట్టా చూస్తన్నా
ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్‌ రైటర్‌
రాసుకోండి మడతెట్టి పాడేయండి

మడత పెట్టి మ మమ మ మమ
మడత పెట్టి మడత పెట్టి
మ మమ మ మమ మడత పెట్టి
మడత పెట్టి మ మమ మ మమ మడత పెట్టి
మడత పెట్టి మ మమ

ఆ కుర్చీని మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి
మడత పెట్టి మ మ మ మడత పెట్టి





మావా ఎంతైనా పర్లేదు బిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: గుంటూరు కారం (2024)
సంగీతం: థమన్.ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కృష్ణ , రామాచారి కొమండూరి

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

సత్యేంద్ర గ్రాంఫోన్
ఇక్కడకు తెచ్చారేంది

పనిసగరిస ని ప స
పనిసగరిస ని ప మ
పనిసగరిస ని ప స
పని పని పని పని పని పని

మావా ఎంతైనా పర్లేదు బిల్లు
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు
చెప్పుకోలేని బాధే డబల్లు

మారిపోయే లోకం
చెడ్డోల్లంతా ఏకం
నాజూకైన నాబోటోడికి
దినదినమొక నరకం

యాడో లేదు లోపం
నా మీదే నా కోపం
అందనన్న ఆకాశానికి
ఎంతకని ఎగబడతాం

ఎవ్వరికెవ్వరు అయినోళ్లంటూ ఉన్నగాని లేరే
ఏ వావి వరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే
యహె విసిగుపుట్టి ఇంకిపోయే కండ్లల్లో కన్నీరే
ఎటు తిరిగి చూడు మనకి మనమే
వన్ అండ్ ఓన్లీ లవరే

అన్నా
సర్రా సర్రా సురం
సుర్రంటాది కారం హేయ్
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా
హే రప్పా రప్పపా రబ్బా రబారిబాబ్బా

ఇనప సువ్వ కౌకు దెబ్బ
ఇరగదీసే రవన్న దెబ్బ ఉయ్

Palli Balakrishna Tuesday, January 16, 2024
Bhagavanth Kesari (2023)



చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
నటీనటులు: బాలక్రిష్ణ, కాజల్ అగర్వాల్ శ్రీలీల
దర్శకత్వం: అనీల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 19.10.2023



Songs List:



గణేష్ పాట పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కరిముల్లా, మనీషా పండ్రంకి

గణేష్ పాట



ఉయ్యాలో ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: యస్.పి.చరణ్

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

సిలకా సిలకా గప్పు సుప్
గమ్మున కూసోర్రి
నీకన్న తియ్యగ పలుకుతాంది
మా పొట్టి పొన్నారి

నువ్ ఉరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసి వోతే
గుండెపై వాలిపోవే జాబిల్లీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాల

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఉడత ఉడత ఉష్షా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్న మస్తుగ ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారీ

అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా ఆ ఆ
అవ్వనైత బువ్వ వెడతా
దువ్వేనైత జడలల్లుతా ఆ ఆ

పత్తి పువ్వైతా
నీకు రైకలియ్యనీకి
పట్టు పురుగైతా
నీకు పావడియ్యనీకి

ఏమన్నైతే నీకెమన్నైతే
నేనెమన్నైతా నిన్ను కాయనీకీ

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్ల
గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్ల అవ్ మల్ల
గీ సేతుల్లా నిన్ను మొయ్యాలా

ఒప్పుల గుప్పా ఉయ్యాలో
వయ్యారి భామా ఉయ్యాలో
సిగ్గుల మొగ్గ ఉయ్యాలో
సింగారి బొమ్మ ఉయ్యాలో

వోనీల నెమలమ్మ రాణిలెక్కస్తంటే
ఊరూరంతా ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
సంబరాలా గుమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో

సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో
సల్లంగ బతుకమ్మ ఉయ్యాలో



Roar of Kesari పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: బృంద గానం  (Chorus)

చండ్రనిప్పు కండ్లు చూస్తే
సాగరాలే చల్లబడవా
వేట కత్తే వేటు వేస్తే
అగ్గికైనా భగ్గుమనదా

కేసరీ, ననా నన నా
నిట్టనిలువు నీడ చూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

ధడ ధడ ఒకడే కేసరి
వీడికి వీడేలే సరి
తత్వమసి భగవంత్ కేసరి
వీడి కసి నిత్యం ఓ చరి

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా

నిట్టనిలువు నీడ జూస్తే
నగము సగమై ఝల్లుమనదా
కీకారణ్యం వాని స్తన్యం
కేసరొస్తే బాంచన్ అనదా
కేసరీ… లల లల లా



మాను మాకు పాట సాహిత్యం

 
చిత్రం: భగవంత్ కేసరి (2023)
సంగీతం: యస్.థమన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: కీర్తన శ్రీనివాస్ 

మాను మాకు మారేడు
ఆకు మాటాడుతాంది బిడ్డా
మల్ల ఇన్నాండ్లకు
కుకు కుకు కుకు కుకు
ఇప్ప ఈత తంగేడు పూతా
ఇప్పారుతాంది బిడ్డా
ఇట్టా ఇన్నేండ్లకు
కుకు కుకు కుకు కుకు

పల్లేరు ముల్లు సూడూ
పరిసింది మల్లెరస్తా
గన్నేరు కొమ్మ జూడూ
పన్నీరు సల్లుతాందా

ఎట్ల ఉంటివానని
ఏమి తింటివానని
పొద్దుగాలే యాదికొచ్చేదీ
యాడ ఉంటివానని
యాడ పంటివానని
సందెగాలే ఆగమయ్యేదీ

నా తానకొస్తున్నావనీ
ఈ ఖాన సెపుతున్నాదీ
రెండు కండ్లతో ఒక్కసారి
నిన్ను జూడాలే
గంతకన్న నాకు దునియాలా
ఏం గావాలే
కుకు కుకు కుకు

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
అవ్ మల్లా అవ్ మల్లా
నా సేతుల్తో నిన్ను మొయ్యాలా

Palli Balakrishna Thursday, October 5, 2023
Skanda (2023)



చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల 
దర్శకత్వం: బోయపాటి శ్రీను 
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి 
విడుదల తేది: 15.09.2023



Songs List:



నీ చుట్టూ చుట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: రఘురాం
గానం: సిద్ శ్రీరాం, సంజనా కల్మాన్జి

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా

ప్రాణమే పతంగి లాగ
ఎగురుతోందిగా
ఇంతలో తతంగామంత
మారుతోందిగా

క్షణాలలో ఇదేమిటో
గల్లంతు చేసే
ముంత కల్లు లాంటి
కళ్ళలోన తెల్లగా

మరింత ప్రేమ పుట్టుకొచ్చి
మత్తులోకి దించుతోందిగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
చిట్టి చిట్టి గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

మీసాలనే తిప్పమాకు బాబో
వేషాలతో కొట్టమాకు డాబు
నువ్వెంత పొగుడుతూనే
నేను పాడనే పడనుగా

చటుకునొచ్చే ప్రేమ
నమ్మలేను సడెనుగా

కంగారుగా కలాగేనయ్యో కైపు
నేనస్సలు కాదు నీ టైపు
ఇలాంటివెన్ని చూడలేదు
కాళ్ళ ముందర

నువ్వెంత గింజుకున్నా
నన్ను గుంజలేవురా

ఏమిటో అయోమయంగా ఉంది
నా గతి
ముంచినా భలేగా ఉంది
ఈ పరిస్థితి

ఇదో రకం అరాచకం
కరెంటు షాక్ లాంటి
వైబ్ నీది అంటే
డౌట్ లేదు గా

ఖల్లాస్ చేసి పోయినావు
ఒరా చూపు గుచ్చి నేరుగా

నీ చుట్టూ చుట్టూ
చుట్టూ తిరిగిన
నా చిట్టి చిట్టి
గుండెనడిగినా

నా దిమ్మ తిరిగే
బొమ్మ ఎవరిదంటే
నిన్ను చూపుతోందిగా

ఓహ్ దమ్ము లాగి గుమ్మతో
రిదమ్ము కలిపి ఆడమందిగా



కల్ట్ మామ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: హేమచంద్ర, రమ్యా బెహరా, మహా 

బిట్టు బిట్టు బాడీ మొత్తం
రెడ్డు చిల్లీ సాల్టు
ఏయ్, చుట్టు చుట్టూ కమ్మేసుంది
పొగరే డిఫాల్టు
ఏయ్, పెట్టుకుంటే ఓడిపోద్ది
ప్రతి నట్టు బోల్టు
ఏయ్, కొట్టి సూడు ఎట్టుంటాదో
కండల్లో రివోల్టు

ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు
హే, వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు
హే, ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు
అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్
స్టెప్పులిక ఫుల్టూ

ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామమామమామమామ
మామ మామ మామ మామ

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే

ఓయ్ మీసమిలా మీసమిలా
మెలిపెడితే కల్టు
నీ కాలరిలా కాలరిలా
ఎగరేస్తే కల్టు
అరె బాడీలిలా బాడీలిలా
తిరగేస్తే కల్టు
ఏయ్, వీధుల్లో వెంటపడి
ఇరగేస్తే కల్టు

మెడకి కర్చిఫ్, తలకి రిబ్బను
కట్టేసి నించున్న కటౌట్ కల్టు
సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని
రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు

దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు
వంద మందితోనే బెట్టింగు కల్టు
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో
పట్టే కుస్తీ కల్టు

స్కెచ్చు గీస్తే కల్టు
రచ్చ చేస్తే కల్టు
ఇస్మైల్ కల్టు, ఇస్మైల్ కల్టు
ఇస్టయిల్ కల్టు, ఇస్కూలు కల్టు
కల్టు కల్టు కల్టు కల్టు కల్టు

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే



డుమ్మారే డుమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: అర్మాన్ మాలిక్, అయ్యన్ ప్రణతి 

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో
గువ్వా గువ్వా
కొండ కోనమ్మ జళ్ళో
వాగమ్మ పాటే మువ్వా మువ్వా

ఏలమ్మ ఏలో
ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా
ఆహ ఏ రంగు లేని
సారంగమంటే నువ్వా నువ్వా

ఇంత అందం చందం గంధంలాగ
గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే
మచ్చుకైనా మచ్చేది లేదే

కొత్త పాత అంటు తేడా లేనే లేదు
ప్రేమ ప్రతిక్షణం
రారా అని పోదామని
కలగలిపే పిలుపు ఇది

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

చెక్కర లేని పాలల్లో
చెక్కిన మీగడ తీపల్లే
కారంగా ఉన్న
ఊరించే ఆవకాయల్లే

హే, చుక్కలు లేని గీతల్లో
చక్కగ గీసిన ముగ్గల్లే
కోరంగి దాటె
కోనసీమ నావల నీడల్లే

తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ
జల్లే చల్లే మేఘంలాగ
కోనంగి కళ్ళే పంపెనే
చూపుల కౌగిళ్లే

అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి
అల్లో మల్లో ఆకాశంలో
అల్లాడెనే తెల్లారులు
కలవరపడి కల వదిలే

డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే




గండర బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: స్కంద (2023)
సంగీతం: యస్.తమన్ 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హర్ష. డి

హేయ్, గండర గండర
హేయ్, గండరబాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్

గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండరబాయ్

ఏయ్, విన్నారోయ్ విన్నారోయ్
తయ్యారయ్యే ఉన్నారోయ్
విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
ఇష్టంగా ఇస్తానోయ్
నువ్వే నువ్వే విస్తారోయ్
నా గల్లా పెట్టె
గళ్ళుమంటున్నాదిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండరబాయ్ గండరబాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్తనే
గండర గండర బాయ్
గజ్జె కట్టి సెప్పుకో
గాజులెట్టి సెప్పుకో
గాలివాన తెస్తనే
గండర గండర బాయ్

గల్లా లుంగి ఏసుకో, గడ్డివాము సూసుకో
గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాటియ్యాల
గడ్డపార తీసుకో, గట్టునింక తవ్వుకో
సిగ్గునంత లోతుగా పాతి పెట్టలా

నీ తట్ట బుట్ట సర్దేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దుల్తోనే చల్లేస్తావే కళ్ళాపి
ఓ ముగ్గులెడుతూ కూకుంటే
నీకెట్టా పనౌద్దీ

హే, వత్తాసే వత్తాసే
నువ్వేమన్నా వత్తాసే
నీ కట్టా మిట్టా పట్టే
పట్టెయ్యాలిరోయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

గండర బాయ్ గండర బాయ్
గందరగోళంలో పెట్టకమ్మాయ్
గండర బాయ్ గండర బాయ్
గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్

ఓసి వంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి
ఓసి మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తులు చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే

Palli Balakrishna Thursday, August 3, 2023
Veera Simha Reddy (2022)



చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
నటీనటులు: బాలకృష్ణ , శృతి హసన్ 
దర్శకత్వం: గోపీచంద్ మలినేని 
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్, యలమంచిలి 
విడుదల తేది: 12.01.2023



Songs List:



జై బాలయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కరిముల్లా

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

(జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు

గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు  పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య…  జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా



సుగుణ సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: రామ్ మిరియాల, స్న్గిగ్డ శర్మ 

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే..
పిచ్చి ప్రేమ పుట్టిందే..
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

నువ్వు హాట్’యు హాట్’యు
ఘాటు నాటు సీమ పటాస్ యే
నా స్వీట్'యు స్వీట్'యు
లిపు యు నీకు జ్యూసు యూ గలసే

నీ సోకు టాప్ క్లాసే
నిన్నొద్దులుకుంటే లాసే
మన క్లాస్’యు మాసూ
కలయిక అబ్భో అదుర్స్ యే

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాధే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే

ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి ధూరీ ధూరీ
మంట పెడదమ్మా

ఊపు తగ్గని, ఉడుకు తగ్గని
ఊర మాస్’యూ చీమా
తీపి చెరుకు జంట చూసి
గంటా కొడతాదమ్మా

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ

సన్నజాజి తీగనడుం ఒంపుల్లో
సన్న ధరం ఉయ్యాలేసి ఊగలే
సీమకారం కోర మీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే

బాగా నచ్చవే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగ ఐతే ఈ అందాలను
నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునేయ్
చుట్టలైపోనీ..

సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)

సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాదే
అత్తింటికి రా మరి

సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్

ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే..



మా బావ మనోభావాలు పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, యామిని, రేను కుమార్ 

బావ బావ బావ
బావ బావ బావ
చుడీదారు ఇస్తామంటా ఆడికి
వొద్దొద్దు అన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లె పూలే చుట్టి
వెళ్లేలోపే ముఖం ముడుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చుస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరెసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ

బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటికొస్తేను
ఈడేందుకు వచ్చిండని
ఇంతెత్తుని ఎగిరి రేగాడిండే
ఓటర్ లిస్ట్ ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లలేసి
గోడలు బీరువాలు గుద్దేసిండే
యేటి సేద్ధమే తింగరి బుచ్చి
ఆదికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జగించి
చేసేసుకో లాలూచి
హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సిటీకి మాటికీ సిన్నబుచ్చుకుంటాడే

మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ





మాసు మొగుడొచ్చాడే పాట సాహిత్యం

 
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: మనో, రమ్యా బెహ్రా

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
ఏడ నుంచి తన్నుకొస్తదో
తాటదీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానేలేడు నీ దరిదాపు
పుటకతోనే మనలో ఉన్నాయ్
నాన్న గారి జీన్స్లో జీన్సు
సేమ్ టు సేమ్ ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు
నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
నీ లాగుడు ఊగుడు
నను అట్టుడుకిస్తాందే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
హే జింగి జింగి లాలలో
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
జింగి జింగి జింగి జింగిలాలో

ఏ రంగు రంగు రెక్కలా గుర్రంలా
చెంగు చంగునోస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కళ్ళేమిచ్చి నాకిలా
మంచి చెడ్డ చూసుకో మరదలా
హే సీమ కత్తి చూపుతో
సిగ్గులేని కొస్తివె సిలుకు లుంగీ చుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా
పుట్టుమచ్చతో భలే
పులకరింతలొచ్చెనే నీ దయ వల్ల
కులుకు చుస్తే కులుమనాలి
పట్టపగలే పొగలో సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
నీ మాటకి ధాటికి బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెత్తవ రాతిరి రాసి కథలే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే

Palli Balakrishna Friday, November 25, 2022
Sarkaru Vaari Paata (2022)



చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్
దర్శకత్వం: పరశురామ్
నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, GMB
విడుదల తేది: 12.05.2022



Songs List:



కళావతి పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: సిద్ శ్రీరామ్

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ 
తీగలు మోగినాయ పోయిందే సోయ

ఇట్టాంటివన్ని అలవాటే లేదే
అట్టాంటి నాకీ తడబాటసలేందే
గుండె ధడగుంది విడిగుంది జడిసిందే
నిను జతపడమని తెగ పిలిచినదే

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ

అన్యాయంగా మనసుని కెలికావే
అన్నం మానేసి నిన్నే చూసేలా
దుర్మార్గంగా సొగసుని విసిరావే
నిద్ర మానేసి నిన్నే తలచేలా

రంగ ఘోరంగా నా కలలను కదిపావే
దొంగ అందంగా నా పొగరుని దోచావే
చించి అతికించి ఇరికించి వదిలించి
నా బతుకుని చడగొడితివి కదవే

కళ్లా అవి కళావతి 
కల్లోలమైందే నా గతి
కురులా అవి కళావతి 
కుళ్లబొడిసింది చాలు తియె

కమాన్ కమాన్ కళావతి
నువ్వేగతే నువ్వే గతి
కమాన్ కమాన్ కళావతి
నువు లేకుంటే అధోగతి

మాంగల్యం తంతునానేనా 
మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే 
త్వం జీవ శరదాం శతం

వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు 
మీదికి దూకినాయ ఏందే నీ మాయ
ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ 
తీగలు మోగినాయ పోయిందే సోయ



పెన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నకాష్ అజీజ్

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ

చెక్ చెక్ దేదే చెక్ చెక్ దేదే
చెక్ చెక్ చెక్కు చెక్కుదే
చెక్కెయ్యాలని చూశావంటే
చుక్కల్ చూస్తావ్ బె

దక్ దక్ దేదే దక్ దక్ దేదే
దకు దకు దకుదే
డేటిచ్చాక దాటిందంటే
ధమ్కీ తప్పదురే

నీ బాబు బిల్ గేట్స్ అయినా
నీ బాబాయ్ బైడెన్ అయినా
నా బాకీ రాలేదంటే
బ్లాస్టే ఏ స్టేటయినా

కాకా నువ్వు లోకల్వైనా
నా మార్కెట్ గ్లోబల్ నయినా
గ్లోబంతా దేకించేస్తా యాడున్నా

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
నీదే అవనీ… నాదే అవనీ
రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్నీ తన్నీ, పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
పెన్నీ పెన్నీ పెన్నీ
పెన్నీ పెన్నీ పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ

చెప్పకురా తోలు తొక్క
తప్పదు నా వడ్డీ లెక్క
నువ్వెగవేతల్లో పహిల్వానైతే
నే న్నీ సైతాన్ బ్రో

అప్పుకి హానెస్టీ పక్కా
తిప్పకు చీరేస్తా డొక్క
నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా
నీకెదురైతాన్ రో

డల్లాస్ లో డాలర్ బిళ్ళా
యూరప్ లో యూరో బిళ్ళా
రక్తాన్ని చిందిస్తేనే గాని రాదోయ్ మళ్ళా
నీ లాకర్ ఫుల్ అవ్వాలా
నా ఫైనాన్స్ డల్ అవ్వాలా
నై చెల్తా మై హో కాబూలీవాలా

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
నీదే అవనీ… నాదే అవనీ
రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ

ఎవ్రీ పెన్నీ… ఎవ్రీ పెన్నీ
లెట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ, పెన్నీ
ఇచ్చిందల్లా ఇంట్రెస్ట్ తో
లాగేస్తా తన్నీ తన్నీ
పెన్నీ పెన్నీ

అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
అఅ అఅ అఅ అఅ
అఅ అఅ అఅ అఅ
లెట్ మీ సీ యువర్ కేవైసీ
పెన్నీ పెన్నీ



మమ మహేషా పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీకృష్ణ, జోనిత గాంధీ 

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే
ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే
ఏ, ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్
జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం - సోమవారం
ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం - మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం - బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం

కోరస్:
పోరా బరంపురం బజారుకే
తేరా గులాబి మూర
పోరా సిరిపురం శివారుకు
తేరా చెంగల్వ మూర

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)

పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా
పిక్నిక్ కు పోతానోయ్ లోలోపలా
మగాడా నను చుడతావేం చలిగాలిలా
మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా

గల్లా పెట్టె నీ ముద్దుల్తో నిండాల్నే
ప్రతిరోజు ముప్పూటలా
గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె
సిగ్గేటే ఏదో మూల

హే సిగ్గేతప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి
అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి
ఏ, సగ్గుబియ్యం సేమియాలో తగ్గ పాలు చెక్కెరేసి
పాల గ్లాసు పట్టరా మరీ

ఎ, మమ మమ మమ మమ మమ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా (2)




సర్కారు వారి పాట పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: హారిక నారాయణ్

సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
షురూ షురూ అన్నాడురా
అల్లూరి వారి బేటా
 
సరాసరా సరా సరా
సర్కారు వారి పాట
గిరా గిరా గీస్తాడురా
ఇవ్వాల్సినోడి కోటా

సాఫ్టుగున్నాడంతా సంబరాలు పోక
సాఫు చెయ్యాల్సి వస్తే ఆగిపోద్ది కేక
ఈల కొట్టేంతలా యాలమేస్తాడట
ఎవ్వడడ్డొచ్చినా మాడు పగిలి పగిలి పగిలి పడునట

సర్కారు వారి పాట… సర్కారు వారి పాట
సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా

సర్కారు వారి పాట… వెపన్స్ లేని వేటా
సర్కారు వారి పాట… రివర్స్ లేని బాటా



మురారి వా మురారివా పాట సాహిత్యం

 
చిత్రం: సర్కారువారి పాట (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శృతి రంజిని , ఎం.ఎల్.గాయత్రీ,  శ్రీకృష్ణ

మురారి వా మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో మెరుపుల వారెవ్వా
ముద్దు ముద్దు మాటల్తో పడేస్తివా

హేయ్, చాల్ చాల్లే… చాలు ఊరుకో
ఆ మైకంలోనుండి తేరుకో
ఓ, ఏవేవో మాటలెందుకో
ఏం కావాలో వచ్చి తీసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలేసుకో… మెలేసుకో, ఓ ఓ ఓ ఓ

మురారివా… మురారివా
మురళీ వాయిస్తూ ముడేస్తివా
ముసిముసి నవ్వుల్లో… మెరుపుల వారెవ్వా
ముద్దుముద్దు మాటల్తో పడేస్తివా

మధనుడి మాయలోకి… మాధవున్ని లాగినావే భామా
మొదటికి మోసం సుమా
మధువుల బాయిలోకి చేరినాక… మోసమేంది శ్యామా
మనకిక మోమాటమా

ముదిరావే నా బుజ్జి గోపికో
సరే చూద్దాం… నీకెంత ఓపికో
చూపిస్తే నాకేమి కానుకో
అందిస్తా నా గుండె కానుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో

కలేసుకో, కలబడిపో
నీ కాల్మొక్తా కళ్ళుమూసుకో
మెలేసుకో మెలిపడిపో
నా మేనిస్తానింక మోసుకో
కలేసుకో, కలేసుకో… మెలేసుకో, ఓఓ ఓ ఓ

Palli Balakrishna Saturday, May 7, 2022
Bheemla Nayak (2022)



చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
నటీనటులు: పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ 
స్క్రీన్ ప్లే & డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
విడుదల తేది: 25.02.2022



Songs List:



భీమ్లానాయక్ పాట సాహిత్యం

 
సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది

బెమ్మజెముడు చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఎగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల

పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లా గండు

నాయన పేరు సోమ్లా గండు
తాత పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా

భీమ్లానాయక్

ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండు
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పు కొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించిన
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే

భీమ్లానాయక్ భీమ్లానాయక్

ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లారీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్

గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారి విహారం - పెట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తాలు దోస్తే




అంత ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
గానం: చిత్ర

ఈసింత నన్నట్ట న న న న
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న
ముద్దిస్తే మారాము సెయ్యవు

పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
నాఇంటి పెనివిటివే
బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
దేవుళ్ళ సరిసాటివే

నా బంగారి మావ…నా బలశాలి మావ
నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే
నా సుడిగాలి మావ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడి వేగాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు

గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

ఏ తల్లి కన్నాదో నిన్నూ
కోటి కలలకు రారాజై వెలిసినావంట
ఏ పూట పుట్టినావో నువ్వు
అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట

వెలకట్టలేనన్ని వెలుగుల్ని
నా కంట పూయించినావంట నువ్వు
ఎత్తు కొండమీది కోహినూరే గాదు
గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ

అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు
నా మీన…అంత ఇష్టమేందయ్యా నీకూ




అంత ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్ 
గానం: అరుణ్ కౌండిన్య 

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

గడ గడ గడ  గుండెలదర 
దడ దడ దడ  దున్నే బెదిరే 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 

పది పడగల పాము పైన 
పాదమెట్టిన సామి తోడు
పిడిగులొచ్చి మీద పడితే 
కొండ గొడుగు నెత్తినోడు

లాలా భీమ్లా
ఎద్దులోచ్చి మీద పడితే 
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ని 
పైకి పైకి ఇసిరినోడు 
లాలా భీమ్లా

లాలా భీమ్లా
అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

అలగల గల గల గల లాలా
అలగల గల గల గల భీమ్లా (4)

అడవిపులి గొడవపడి 
ఒడిసిపట్టు దంచి కొట్టు 
కట్టిపట్టు ఆదరగొట్టు 

భీమ్లా నాయక్
భీమ్లా నాయక్
భీమ్లా నాయక్



అడవి తల్లి మాట పాట సాహిత్యం

 
చిత్రం: భీమ్లా నాయక్ (2022)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాహితి చాగంటి, కుమ్మరి దుర్గవ్వ

కిందున్న మడుసులకా
కోపాలు తెమలవు
పైనున్న సామెమో
కిమ్మని పలకడు

దూకేటి కత్తులా
కనికరమెరుగవు
అంటుకున్న అగ్గీలోన
ఆనవాళ్లు మిగలవు

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

పుట్టతేనే బువ్వ పెట్నా
సెలయేటి నీళ్లు జింక
పాలు పట్నా

ఊడల్ల ఉయ్యాల గట్టి
పెంచి నిన్ను ఉస్తాదల్లే
నించోబెట్నా

పచ్చన్ని బతికిత్తే నీకు
ఎల్లెల్లి కచ్చళ్ళ పడబోకు బిడ్డా

సెబుతున్న నీ మంచి సెడ్డా
ఆంతోటి పంథాలు పోబోకు బిడ్డ

సిగురాకు సిట్టడవి గడ్డ
చిచ్చులో అట్టుడికి పోరాదు బిడ్డా

Palli Balakrishna Saturday, December 4, 2021

Most Recent

Default