-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "1975"



చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: రాజశ్రీ 
నటీనటులు: రంగనాథ్, కైకాల సత్యనారాయణ, గుమ్మడి 
దర్శకత్వం: రాజశ్రీ 
నిర్మాత: కె. రాఘవ 
విడుదల తేది: 14.02.1975



Songs List:



ఆగండి ఆగండి మన సంస్కతికే పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: రాజశ్రీ 
గానం: యస్.పి.బాలు & కోరస్

పల్లవి: 
ఆగండీ - ఆగండి – మన సంస్కృతికే ఇది మచ్చండి,
దేశానికి వెన్నెముకలయిన మన విద్యార్థుల కిది.
తగదండీ |
అడపిల్లలను తోబుట్టువులా-అభిమానంతో చూడండీ!

చరణం: 1
ఎవరి చెల్లినో అలరిచేసి ఆనందించావా రోజు,
నీ చెల్లి నే అల్లరిచేసి - బాధపడేవూ ఈ రోజు,
చదువు - సంస్కారం - ప్రతి మనిషికి అవసరం,
రెండూ నిండుగా ఉంటేనే - పురోగమించును
సమాజం

చరణం: 2
స్వలాభానికై స్వార్ధనాయకులు చెప్పే మాటలు
వినకండి
ఉద్రేకంలో మన సంపదను - మనమే కాల్చుట
వలదండీ ।
చూశారా-చూశారా-ఈ దగాపడిన మనతమ్ముడు,
అమానుషంగా - అనామకంగా ప్రాణాలను
కోల్పోయాడు,
ఏదో ఏదో సాధిస్తాడని - ఎన్నో ఆశలు పెట్టుకుని
గలూ - రేయీ కష్టపడి, చదివించిందీ బిడ్డను
ఈ తలి గోడు వినువారెవరు ? బూరా ? మీరా!
ఆ నాయకులా ? ఎవరు ?

చరణం: 3
మనం ఎవరిమో తెలుసుకుని - మన బాధ్యత
గుర్తుంచుకొని,
కన్నవారి బంగారు కలలకూ రూపం దిద్దాలీ
మనను కన్న దేశాన్ని సౌభాగ్యంతో తీర్చిదిద్దాలీ
చదువూ సంస్కారం - ప్రతి మనిషికి అవసరం,
రెండు ఉంటేనే పురోగమించును సమాజం



దీపానికి కిరణం ఆభరణం..పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

పల్లవి:
ఉమ్.. ఊఁ.. ఆ.. ఆ..
దీపానికి కిరణం ఆభరణం.. 
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. 
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం

దీపానికి కిరణం ఆభరణం.. 
రూపానికి హృదయం ఆభరణం

చరణం: 1
నిండుగ పారే యేరు.. 
తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను.. 
తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం.. బ్రతికే మనిషి..
పరుల కోసం బ్రతికే మనిషి.. 
తన బాగు తానే కోరడు..
తన బాగు తానే కోరడు..
దీపానికి కిరణం ఆభరణం.. 
రూపానికి హృదయం ఆభరణం  

చరణం: 2 
తాజమహలులో కురిసే వెన్నెల.. 
పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ.. 
పేద ముంగిట విరియదా
మంచితనము పంచేవారికి..
మంచితనము పంచేవారికి.. 
అంతరాలతో పని ఉందా..
అంతరాలతో పని ఉందా..
దీపానికి కిరణం ఆభరణం.. 
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. 
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం

చరణం: 3
వెలుగున ఉన్నంత వరకే.. 
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే.. 
అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం తెలిసిన నాడే..
ఈ పరమార్థం తెలిసిన నాడే.. 
బ్రతుకు సార్థకమౌతుంది..
బ్రతుకు సార్థకమౌతుంది..

దీపానికి కిరణం ఆభరణం.. 
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి.. ఏనాటికీ.. 
తరగని సుగుణం.. ఆభరణం
తరగని సుగుణం.. ఆభరణం



నేను ఎవ్వరో అడగకు పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: రాజశ్రీ 
గానం: పి.సుశీల 

పల్లవి: 
నేను ఎవ్వరో అడగకు,
నువ్వు ఎవ్వరో అడగను
నీ కొరకే ఈ సందడి,
తెలవారేవర కే ఈ ముడి .... ఈ సందడి నేను

చరణం: 1
వయసు - ఇంద్రధనుసు,
.క్షణకాలం - దాని సొగసు,
తెలుసు - నాకు తెలుసు,
ఈ నిజం - నీకూ తెలుసు,
మధురమైన పెదవులుండగా,
మధువు ఎందుకూ దండగ దండ

చరణం: 2
కాలం కడలి కెరటం,
ఆగవులే ఎవరికోసం,
పరువం - కన్నెపరువం
పాడేనూ ... తోడుకోసం,
తలుపులేలేని కోటనూ,
తలపులున్న వారి బాటను వలపుబాటను నేను




లవ్ ఈజ్ బ్లైండ్ పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: రాజశ్రీ
గానం: పి.సుశీల 

పల్లవి: 
లవ్ ఈజ్ బ్లైండ్' - ప్రేమ గుడ్డిదీ,
యూత్ ఈజ్ మాడ్' వయసు పిచ్చిది,
పిచ్చి వయసులో - గుడ్డి ప్రేమలో,
హేపీ, బి హేపీ, బి హేపీ - హేపీ, హేపీ ... !

చరణం: 1
ఎటు చూసినా మండే ఎండలు,
నా చూపులూ - చల్లని జల్లులూ,
నువ్వూ నేనూ చేపల్లాగా ఈదులాడాలీ
నువ్వో - నేనో తేలేదాకా పోటీ చెయ్యాలి;
అందుకే నన్నందుకో, నా నా కళ్ళలో నిను చూసుకో

చరణం: 2
చిటపట కురిసెను చినుకులూ,
అవి చినుకులు కావు, అవి కులుకులూ,
నా కులుకులూ,
పాల పొంగులాగా పొంగుతుంది మోహం,
రేయి - పగలు నీతో, కోరుతుంది స్నేహం॥
అందుకే, నన్నందుకో నా కళ్ళలో నిను చూసుకొ
లవ్ ఈజ్ బ్లైండ్

చరణం: 3
చలి .... చలి చలి
చలిగాలిలో, నెచ్చెలి చెక్కిలి,
నెచ్చెలి ఇచ్చెనూ, వెచ్చని కౌగిలి,
కోడెనాగులా, కొండవాగులా కోరిక రేగింది
తోడూ - నీ డె, నాతో ఉంటే
తీరిపోతుందీ, మోజు తీరిపోతుంది
అందుకే, నన్నందుకో, నా కళ్ళలో నిను చూసుకో



వద్దు వద్దు పెళ్ళొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

వద్దూ - వద్దు పెళ్ళొద్దు - నీతో నా పెళ్ళొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు - పెళ్ళొద్దు.
వద్దూ - వద్దు అనొద్దు

వద్దు వద్దు వద్దు వద్దు అనొద్దు.
'ఆఁ' అంటే - ఊ అంటే ఆరా తీస్తావు,
ఏదో ఏదో ఏదో సాకు చెప్పి, సోదా చేస్తావు
ఆ మాట నువ్వు అనొద్దు
చట్టాలంటావు, దొంగను పట్టాలంటావు
పడుకున్నా - ఆ గొడవే పలవరిస్తూ వుంటావు

సూటిగా గుండెలో దూరి సోదాచేస్తాను,
వాడి వాడి చూపులతో బేడీలు వేస్తాను,
కౌగిలి చెరసాలలో నిన్ను, నిన్నే ఖైదీ చేస్తాను
కనీ - వినీ యెరుగని కఠిన శిక్ష వేస్తాను
వద్దా.....వద్దు

ప్రేమంటే విలువైన జాతిరత్నం 
పెళ్ళంటే దాన్ని పొదిగే పసిడి ఉంగరం,
ఉంగరాన ఉంటేనే రతనానికి అందం, ఇద్దరూ
ఒకటైతే, ఇద్దరూ ఒకటైతేనే హద్దులేని ఆనందం
వద్దా.... వద్దు.

ఇద్దరమన్నది మనలో ఎపుడో రద్దయిపోయిందీ,
అల్లరి మనసుల అల్లికలోనే పెళ్ళయిపోయిందీ
అందుకే - వద్దన్నానందుకే వద్దన్నా గాని
అసలొద్దన్నానా, ఈ నిమిషంలో పెళ్ళన్నా
నే కాదంటానా.
వద్దు మనం అనొద్దు, పెళ్ళొద్దనీ అనొద్దు,
వద్దు వద్దు వద్దు వద్దు అనొద్దు.



సొగసైన చిన్నది పొగ రేగుతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: చదువు సంస్కారం (1975)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు 

సొగసైన చిన్నది పొగ రేగుతున్నది 

Palli Balakrishna Sunday, November 19, 2023



చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: చంద్రమోహన్, మురళీమోహన్, జయసుధ
దర్శకత్వం: ఎన్.గోపాల కృష్ణ
నిర్మాతలు: పి.యం.షణ్ముగం, ఏ.వి.కృష్ణారావు
విడుదల తేది: 12.09.1975

(జయసుధ గారికి హీరోయిన్ గా ఇది మొదటి తెలుగు సినిమా)




Songs List:



ఒకమాట ఒ కేమాట పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు 

పల్లవి:
ఒకమాట ఒ కేమాట
వలచే రెండు హృదయాలు
ఒదిగే తీయని కౌగిలిలో 
ఒకటై  ఉన్నచోట

చరణం: 1
ప్రతి నిమిషం జతగా నే ఉండాలనీ 
బ్రతుకంతా మధురిమలే నిండాలనీ 
చిలిపిగ వీచే చిరుగాలి 
నా చెవిలో అన్న వేళ

చరణం: 2
అరవిరిచే తొలివయసే నీ దేనని
అది చిలికే అనుభవమే నాదేనని
కలువల రేకుల తలదన్నే 
నీ కనులే అన్న వేళ

చరణం: 3
ఊహలలో ఊపిరిలో ఉన్నావని 
నా వలపూ నావరమూ నీవేననీ
లా పైన బాస చేసి నా
మనసే అన్న వేళ




నాడు లక్ష్మణ రేఖ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సముద్రాల 
గానం: యస్.జానకి

నాడు లక్ష్మణ రేఖ దాటిన ఫలితమే
నేడు నేనూ అను భవించే నరకమూ

కన్న తండ్రిని కాదనీ నే కదలివచ్చిన ఫలమిది 
కన్ను కానక వలచినందుకు తగిన శిక్షే నాకిదీ

ఎండమావిని ఏరని భ్రవియింది
ముందుకుసాగితే
ఏటికీ ఎదురీదితే నాలాంటి కన్నెలకీగతే




నీదాననురా నీ నీడనురా! పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.జానకి

సాకి:
నీపైన నా కెంతొ మనసుందిరా! 
నీవు రాకున్న నేను ఏమౌదునోరా

పల్లవి:
నీదాననురా నీ నీడనురా ! 
నారాజా నీవెకావాలిరా !

అనుపల్లవి:
నీకోసం వేచి ఉన్నారా ! 
ఏమైనా నిన్ను వదలనురా !

చరణం: 1
విరిసినపుడే కన్నెగులాబి?
వేడిలోనే తీపి జిలేబీ
వాసన చూడాలిరా
రుచిని చూడాలికా

మనను నీకుంటే మగసిరేవుంటే
మరులు తీరేనురా !

చరణం: 2
కన్నులు కలిపే చిన్నదివుంటే 
ఎందుకురా "షరాబు”
విరహము రేపే వెచ్చని వెన్నెల
కురిసెనురా దొరబాబు
ఇంకజాగేల లేచిరా వేల
ఈ రేయి నీ చేనురా





నీ సంగతి నాకు తెలుసు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు,  యస్.జానకి

నీ సంగతి నాకు తెలుసు 
నీకివ్వనురా నా మనసు 
ఒద్దంటున్నా ముద్దిమ్మంటే
నీకూ నాకూ తిరకాసు

ఊపేసే అందాలు చూపించితే
ఎటువంటి మొనగాడు బలాదూరురా 
మిసమిసలాడేటి గుసగుసలా డేటి 
సొగసులు నా వేనురా 

వన్నెలు చూశావు కన్నె వేశావు 
కానీ రానురా

నీలోన సరదాలు పొంగుకున్నవి 
నా లేత పరువాలు లొంగనన్నవి
మగసిరి బడాయి గడసరిలడాయి
నువ్వో రంగేళివా
మస్కా కొట్టకు చిట్కా లేయొద్దు
నేనూ కిల్లాడిరా




అందరిరాతలు రాసేది ఆ దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మణ రేఖ (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

అందరిరాతలు రాసేది ఆ దేవుడు 
ఆడదానిరాత రాసేది మగవాడు
పువ్వల్లే పుట్టాను నవ్వుతు పెరిగాను 
తేటివచ్చింది పాట పాడింది

తేనియ తాగింది తెల్లవారింది 
అప్పుడు తెలిసింది
ఏమని .?
నేకొల బోయాశని తావెళ్ళి పోయిందని 

అందరి రాతలు రాసేది ఆ దేవుడు 
ఆడదాని రాత రాసేది మగవాడు 
పువ్వులున్నవి కొల్లబోవుటకా 
తేటికి రెక్కలున్నది ఎగిరి వెళ్ళుటకా 
కన్నులున్నవి కన్నీటికా
కట్టిన తాళివున్నది ఎగతాళికా 

రసికులు వస్తారు ధనికులు వస్తారు 
రాత్రి మసకలో సొగసును కొంటారు
పగలు కాగానే మనసును చూసారు 
అప్పుడంటారు....
ఏమని ... ?
మనసుంటె మా కొద్ద ని 
అది మగవాళ్ళ సరిహద్దని

Palli Balakrishna Tuesday, October 24, 2023



చిత్రం: కొత్తకాపురం (1975)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్, ముద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ, భారతి, చంద్రమోహన్, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాత: జి. వెంకటరత్నం 
విడుదల తేది: 08.04.1975



సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి
2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి
3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి
4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి
5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి
6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి
7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి
8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి
9. మమత (1973) - బేబీ శ్రీదేవి
10. మీనా (1973) - బేబీ శ్రీదేవి
11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి
12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి

(1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)



Palli Balakrishna Saturday, June 10, 2023



చిత్రం: అభిమనవతి (1975)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 
నటీనటులు: కృష్ణ, వాణిశ్రీ 
దర్శకత్వం: డూండీ 
నిర్మాత: జి.సాంబశివరావు, పి.బాబ్జి 
విడుదల తేది: 28.02.1975



Songs List:



నీపై న నాకెంతో పాట సాహిత్యం

 
చిత్రం: అభిమనవతి (1975)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు

నీపై న నాకెంతో అనురాగముందని 
నిను వీడి క్షణమైన నేనుండలేనని
ఎలా ఎలా నీకెలా తెలిపేది

నీలి నింగిలో కోటితారలు మాలల్లి తేనా
అందమైన ఆ చందమామ
నీ కుదుమ తురుమవలేనా

అణువణువున నీవే వ్యాపించినావనీ
ఎలా ఎలా నీకెలా తెలిపేది

వలపు తెలియని మనసులోనికి
ఎందుకోసమని వచ్చావూ
మనసు దోచుకొని మమత పంచుకొని
మరలి వెళ్ళిపోతున్నావు

నిన్నే హృదయాన నిలిపాను నేననీ
ఎలా ఎలా నీకెలా తెలిపేది




ఏనాడూ లేని ఆనందం పాట సాహిత్యం

 
చిత్రం: అభిమనవతి (1975)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల 

ఏనాడూ లేని ఆనందం
ఈనాడు వేచె మా కోసం
సరాగమే తుషారమై
పదే పదే మురిపించి
నను మురిపించి మైమరపించె
లలల లలలా....

వీచెను శీతల పవనాలు
పూచెను, విలాస కుసుమాలు

వలపులు వేయి గులాబిలై 
వెదజల్లెను కోటి ఘుమఘుమలు
ఘుమఘుమలు ఘుమఘుమలు

గలగల పారే సెలయేరు
ఈరోజే కలకల నవ్వింది
లోకంనాకై చిగురించి
నా లోపల వీణలు మీటింది
మీటింది మీటింది



ఎట్టా పోనిత్తురా పాట సాహిత్యం

 
చిత్రం: అభిమనవతి (1975)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

ఎట్టా పోనిత్తురా చేతికి చిక్కినోణ్ణి 
నా సామిరంగ చిననాటి చెలికాణ్ణి 
ఎట్టా పోనివ్వవే గుట్టుగ ఉన్నవాణ్ణి 
ఓ యమ్మతల్లి చెట్టంత చినవాణ్ణి

ఉదయానికి మరో పేరేమిటి 
ఆఁ ! పొద్దు
కాదనటానికి మరో పేరేమిటి 
హుఁ  వద్దు....
ఇద్దరి నడుమ ఇపుడున్న దేమిటి
హ .... హ .... హ .... హ .... హద్దు ....
రెండు మేనులూ కలుసుకున్నపుడూ 
రెండు పెదవులూ హత్తుకున్నపుడూ 
ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి.... 
ముము... ము ము ... ముద్దు
ఆ ముద్దే  ఎంతో ముద్దూ
బాబోయ్ వద్దూ ఓయమ్మో పోనిద్దూ 
పోనిద్దు పోనిద్దు పోనిద్దు పోనిద్దు

ఒక చేయి భుజంమీద వెయ్యి
హుఁ !... వేశా ....
ఇంకొకచేత నడుం పైనవెయ్యి
అబ్బబ్బ వేశా
ఇపుడు నీ గుండె ఏమంటున్నది 
దడ దడ దడ ....
వయసు జల్లులా ముసురుతున్నపుడూ 
వలపు వెలువలా పొంగుతున్నపుడూ 
ఏమిటి ఏమిటి కలిగేదేమిటి.... 
హ....హ....హ...హ.... మోజు .... 
ఆ మోజే ఎంతో ముద్దు 
బాబోయ్ వద్దూ ఓయమ్మో పోనిద్దూ 
పోనిద్దు పోనిద్దు పోనిద్దు పోనిద్దు ॥ ఎట్టా పోనిత్తురా॥




మామిడి తోటలో పాట సాహిత్యం

 
చిత్రం: అభిమనవతి (1975)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

మామిడి తోటలో మల్లెల వేళలో
తుంటరి గాలిలో ఆహ, ఒహొ, హుహు ఎహే ....
ఒంటిగ నువ్వుంటే
సింగార మెగబోసె బంగారు బొమ్మా హఁ .... 
చేరవచ్చి మనసు చేతికిచ్చి
ఏమండీ మన పెళ్ళెప్పుడంటే

ఏమంటావు అప్పుడేమంటావు
బాబు నమస్కారం.
మామిడి తోటలో మల్లెల వేళలో
తుంటరి గాలిలో లలా-ఓహో- హెహే....
వంటిగ నేనుంటే
సింగార మెగబోసె బంగారు బొమ్మా...హ 

చేరవచ్చి మనసు చేతికిచ్చి
ఏమండీ మన పెళ్ళెప్పుడంటే
ఆగమంటాను డాడీ నడగమంటాను
ఏడిశాపు ఎవడ్రా వీడు
ప్రేమించు కోవడం సరద 
కాని పెళ్ళాడలంటేనె బెడద 
పెద్దల అనుమతి కావాలీ కాదా
చీ

హద్దులు దాటితే ఏం మర్యాద 
ఒరే సన్నాసీ
ప్రేమే ఒక దెవం పెళ్ళే ఒక యాగం
అందుకు అనుమతు లెందుకు
హద్దులు పద్దులు ఎందుకు
నిన్నే నమ్ముకున్న ఆ ముద్దు గుమ్మా.... హ... 
చేరవచ్చి మనసు చేతికిచ్చి
ఏమండీ మన పెళ్ళెప్పుడంటే

ఆగమంటావా డాడీనడగమంటావా
ఈడియట్
పోరా పోరా పోరా ఛీ పోరా....
రుక్మిణిని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోలేదా
లైలాకోసం మజ్ను అరచి చావలేదా ఆ ఆహా .... 

ఉన్నారు మగధీరులు అన్ని యుగాలలో
చచ్చైనా నడవరా వారి అడుగు జాడలో
ధన్యోస్మీ ధన్యోస్మీ
సోదరా నీ హితబోధ నా బ్రతుకుకే భగవద్గీత 
ఇక ఆగమన్న ఆగను అడుగువేసి తీయను 
నన్నే నమ్ముకున్న నా ముద్దు గుమ్మా... హా... 
చేరవచ్చి తాళి చేతికిచ్చి ఏమండీ మన పెళ్ళెప్పుడంటే
కాదంటానా తాళి కట్టేస్తాను
ఎవరే మన్నా అంతు తేల్చేస్తాను హాహా

డాడీ .... డాడీ .. డాడీ .... డాడీ.

Palli Balakrishna



చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి, డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు
గానం: పి.సుశీల, యస్.జానకి, వాణిజయరాం, యస్.పి. బాలు 
నటీనటులు: రవికాంత్ (నూతన నటుడు), కుమారి శ్రీదేవి, నాగబూషణం, రాజాబాబు 
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: కె,యస్.రామిరెడ్డి
నిర్మాత: యమ్.గోపాల కృష్ణారెడ్డి
విడుదల తేది: 23.05.1975



Songs List:



జాబిల్లి వెలిగే చల్లని వేళ పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

జాబిల్లి వెలిగే చల్లని వేళ 



ఏ తోడు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

ఏ తోడు లేదు 



కంటికి నిదురే రాదాయే పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల 

కంటికి నిదురే రాదాయే 




నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

నీ కళ్ళలోన వెలిగిస్తాను దీపాలు 




కొండంత దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: అనురాగాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు 

కొండంత దేవుడు 

Palli Balakrishna Tuesday, July 19, 2022



చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర, దాశరథి, కొసరజు, సినారె, వక్కలంక లక్ష్మీ పతిరావు, కె. కోదండపాణి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎస్.జానకి, వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, రమేష్, పుష్పలత, జె. గిరిజ 
నటీనటులు:  శారద, రంగనాథ్, గుమ్మడి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నవతా కృష్ణంరాజు
విడుదల తేది: 31.01.1975



Songs List:



ఇంటింటా దీపాలు వెలగాలి పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: నవకాంత్, జె. గిరిజ బృందం

ఇంటింటా దీపాలు వెలగాలి
మన ఊరంతా చీకట్లు తొలగాలి



ఈ లోకపు చదరంగంలో పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: వక్కలంక లక్ష్మీ పతిరావ
గానం: వి.రామకృష్ణ

ఈ లోకపు చదరంగంలో జీవులంతా పావులే




ఇది జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి

This is Love
This is Youth
ఇది జీవితం
ఇది యవ్వనం 





ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా 




మ్రోగింది వీణ పదే పదే (Female version) పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే

ఆధరాల మీద ఆడింది నామం
ఆధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన

సిరిమల్లె పువ్వు  కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే



మ్రోగింది వీణ ...పదే పదే (Male version) పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు

మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే

ఆధరాల మీద ఆడింది నామం
ఆధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన

సిరిమల్లె పువ్వు  కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన
ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే



మంగమ్మా నువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: కొసరాజు
గానం: రమేష్, పుష్పలత

సాకిరేవు కాడ నీ సోకు చూడగానే జిల్ అంది నాకు 
రాసి పెట్టి ఉన్నాది మనకు  ఇలా రాసి పెట్టి ఉన్నాది  మనకు 

మంగమ్మా నువ్వు  ఉతుకుతుంటే అందం అబ్బా వేశావే బంధం 





అబ్బ నా పాడు బ్రతుకు పాట సాహిత్యం

 
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975)
సంగీతం: జి.కె.వెంకటేష్ 
సాహిత్యం: కె. కోదండపాణి
గానం: ఎస్. జానకి

అబ్బ నా పాడు బ్రతుకు ఎవరితోటి సెప్పుకొందునే 


Palli Balakrishna Sunday, June 26, 2022




చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, మురళీమోహన్
దర్శకత్వం: వి.మధుసూధనా రావు 
నిర్మాత: వి.ఆర్.యేచేంద్ర, కె. చటర్జీ
విడుదల తేది: 14.08.1975



Songs List:



నీలాల నింగిలో పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో
మేఘాల తేరులో

చరణం: 1
ఆ నింగికి నీలం నీవై
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో
రేపూ మాపుల సంధ్యలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగా చల్లగా 
మెత్తగ ముద్దుగ హత్తుకుపోయి

నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో

చరణం: 2
ఆ హిమగిరి శిఖరం నీనై
నీ మమతల మంచును నేనై
ఆశలు కాసే వేసవిలో
తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
ఉరకలా పరుగులా 
పరువంలోనా ప్రణయంలోనా

నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో




రాధ అందించు పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రాధ అందించు 



గోవింద గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గోవింద గోవింద 




రేగాడు రేగాడు పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రేగాడు రేగాడు 



చల్లంగా వుండాలి పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, కె.చక్రవర్తి, ఎస్.జానకి 


చల్లంగా వుండాలి 



రామలింగం సోమలింగం పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రామలింగం సోమలింగం 

Palli Balakrishna Wednesday, June 9, 2021

Most Recent

Default