Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Hebah Patel"
Ala Ninnu Cheri (2023)



చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
నటీనటులు: దినేష్ తేజ్ హెబ్బ పటేల్ , పాయల్ రాధా కృష్ణ 
దర్శకత్వం: మరేష్  శివన్ 
నిర్మాత: కొమ్మలపాటి సాయి సుధాకర్ 
విడుదల తేది: 2023



Songs List:



కొద్ది కొద్దిగా ప్రేమిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: జావేద్ ఆలీ

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా
నిన్నటికంటే ఎక్కువగా నిను ప్రేమిస్తా
రేపటికంటే తక్కువగా నిను ప్రేమిస్తా

నిన్న నేడు రేపు నిన్ను
నిదురలోను వదలకుండా

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నీ రెండు పెదవులను
నిండుగా ప్రేమిస్తా
పెదవుల్లోని చిరునవ్వులను
పిచ్చిగా ప్రేమిస్తా

నీ నీలి కన్నులను
చూపుతో ప్రేమిస్తా
కన్నులలోని కలవరమంతా
మనసుతో ప్రేమిస్తా

నిన్నే ప్రేమించడం అంటే
నిన్నే ప్రేమించడం అంటే
నను నేను ప్రేమించడమే

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స ని ద మ ని ని సా

నీ నోటి ప్రతి మాట
మత్తుగా ప్రేమిస్తా
మాటల్లో పొరపాటు
పూర్తిగా ప్రేమిస్తా

నువ్వేసే ప్రతి అడుగు
అంతగా ప్రేమిస్తా
ఆ అడుగు నాతో వేస్తే
మరింతగా ప్రేమిస్తా

నీతో జీవించడం అంటే
నీతో జీవించడం అంటే
స్వప్నాన్ని జీవించడమే

కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చాలా కాలం ప్రేమిస్తా
కొద్ది కొద్దిగా ప్రేమిస్తా
చచ్చే దాకా ప్రేమిస్తా

స గ రి గ రి సా గా మా
స గ రి గ రి స అలా నిను చేరి



అబ్బా అనిపించాడే పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సింహ, ఇంద్రావతి చౌహాన్

బారుంది నాలో
బీరుంది నాలో

బారుంది నాలో
బీరుంది నాలో
రమ్ముంది, జిన్నుంది
నాలో నాలో

గ్లాసుంది నాలో
ఐసుంది నాలో
అందించే వయసుంది
నాలో నాలో

నాలోనే బేసుంది
నాలోనే బాసుంది
బద్మాషు మనసుంది
లేనిది ఏందీ




కోడి బాయే లచ్చమ్మది పాట సాహిత్యం

 
చిత్రం: అలా నిన్ను చేరి (2023)
సంగీతం: సుభాష్ ఆనంద్ 
సాహిత్యం: ట్రెడిషినల్ ఫోక్
గానం: మంగ్లీ

రేయ్ గణేష్..! మందేస్తే
మా ఊరు యాదికొస్తది
మా పాట యాదికొస్తది
మా ఆట యాదికొస్తది
మరింక లేటెందుకు షురు జేస్తా

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ, హీ

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఎడ్లు బాయే… గొడ్లు బాయే
యలమ దొరల మంద బాయే
ఎడ్లు బాయే… గొడ్లు బాయే
యలమ దొరల మంద బాయే
గొడ్లు నేను గాయబోతే
కందిరీగ కరిసిపాయే

కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మది
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మది

బర్లు బాయే… గొర్లు బాయే
బాటపొంటి బండి బాయే
బర్లు బాయే, గొర్లు బాయే
బాటపొంటి బండి బాయే
బండి మీద పోదమంటే
గిర్రలన్ని ఊసిపాయె

కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మది
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఈతకల్లు తాటికల్లు
రెండు కలిపి గుద్ధుతాంటే
మూతి కాడ రాఖపెట్టి
గుట్ట గుట్ట గుంజుతాంటే

బొబ్బర్ల గుడాలన్ని
బగ్గ బగ్గ బుక్కుతాంటే
బొబ్బర్ల గుడాలన్ని
బగ్గ బగ్గ బుక్కుతాంటే
పాణమంత అల్కగయ్యి
తల్కాయి తిరుగుతాంటే

సోయి బాయే లచ్చమ్మదీ
ఫుల్లు సోయి బాయే లచమ్మదీ
సొలుగుడాయే లచ్చమ్మదీ
పెయ్యి సొలుగుడాయే లచ్చమ్మదీ

కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ
కోడి బాయే లచ్చమ్మదీ
కోడి పుంజు బాయే లచ్చమ్మదీ

ఈని మీద దుమ్ము పడా
ఈని మీద దుబ్బ పడా
ఈని మీద శారడంత
దోషడంతా మన్నుబడా

దునియా నా ఎనకబడా
ఈనెనక నేనుబడా
అరె, దునియా నా ఎనకబడా
ఈనెనక నేనుబడా
దిల్లంతా ఊడిబడా
దిమాకంతా ఉలికిబడా

గడబిడాయే లచ్చమ్మదీ
గుండెల గుడగుడాయే లచ్చమ్మదీ
కిరికిరాయే లచ్చమ్మదీ
మాకి కిరికిరాయే లచ్చమ్మదీ
మాకి కిరికిరాయే లచ్చమ్మది
మాకి కిరికిరాయే లచ్చమ్మది
మాకీ– కిరికిరాయే లచ్చమ్–దీ


Palli Balakrishna Thursday, October 5, 2023
Naanna Nenu Naa Boyfriends (2016)
చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: రావురమేష్, హెబపటేల్ , అశ్విన్, నోయిల్ సేన్, కేరింత నూకరాజు, తేజస్వి మదివాడ
దర్శకత్వం: భాస్కర్ బండి
నిర్మాతలు: బెక్కం వేణుగోపాల్, మానస, మహలక్ష్మి
విడుదల తేది:  16.12.2016


చిత్రం: నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రకాశ్ పరిగోష్

మౌనమా ఓ మౌనమా మాటలేదుగా
పాదమా ఓ పాదమా బాటలేదుగా
తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

ఆశ ఆవిరైపోతుందే
శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి
చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరితీసి
బాధకు ఊపిరి పోసావే

సరదా సరదా స్వేచ్ఛను తెంచి
సంకెలలాగా మార్చావే
జతగా బ్రతికే బదులే వెతికి
జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి పోతుందే

తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ తప్పుకెళ్లి పోతుందే
తల్లకిందులై పోతుందే
ఆరి పోతుందే తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా
శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా
నొప్పి అనేది అందరికా

మూడే ముళ్ళు ప్రేమే కోరగ
మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగ
ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడాగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే
పారి పోతుందే చేయి జారి

చిక్కు పెద్దదై పోతుందే
దిక్కు తోచకుండ పోతుందే
లెక్క నేడు మారిపోతుందే
తీరి పోతుందే చేయి జారి పోతుందే



Palli Balakrishna Monday, March 1, 2021
Orey Bujjiga (2020)








చిత్రం: ఒరేయ్ బుజ్జిగా (2020)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్, పి. మేఘన
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నయ్యర్, హెబా పటేల్
దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
నిర్మాత: కె. కె. రాధామోహన్
విడుదల తేది: 02.10.2020

ఓ ఓ.. కురిసెనా కురిసెనా కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా..
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

ఓ ఓ.. కురిసెనా కురిసెనా 
తొలకరి వలపులే మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా

ఒక వరము అది… నన్ను నడిపింది
పసితనముకు తిరిగిక తరిమింది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపినది
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పుడులిప్పుడు అయ్యే.. ఏకం
హో..విలవిలలాడే… నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం…హో..

కొత్త మలుపు ఇది.. నిన్ను కలిపినది
నువ్వు ఎక్కడుంటే అక్కడికే తరిమినది
చిన్ని మనసు ఇది నిన్నే అడిగినది
ఎక్కడున్నా పక్కనుండే తలపు ఇది
నిన్న మొన్న బానే ఉన్నా
నిద్దుర మొత్తం పాడౌతున్నా
నువ్వే వచ్చే స్వప్నం కోసం వేచే ఉన్నా

కురిసెనా కురిసెనా తొలకరి వలపుల మనసున
మురిసెనా మురిసెనా కళలకి కనులకి కలిసేనా
నింగిలో తారలే జేబులో దూరెనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన

విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం…హో
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం



Palli Balakrishna Saturday, January 23, 2021
24 Kisses (2018)


చిత్రం: 24 కిస్సెస్ (2018)
సంగీతం: జాయ్ బారువ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రోహిత్, కావ్యా కుమార్
నటీనటులు: అదిత్ అరుణ్, హెబ్బా పటేల్
దర్శకత్వం: అయోధ్య కుమార్
నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి
విడుదల తేది: 23.11.2018

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
ఎంత సమ్మోహనం పెదాలతో ప్రేమ పానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

వన్ టూ త్రీ ఫోర్ అంటూ ట్వంటీఫోర్
కౌంటూ లెక్కపెట్టేసేయ్
వన్ బై వన్ను బేబీ ముద్దు జ్ఞాపకాలు
మూటకట్టేసేయ్
ప్రపంచమే నీ ఆశనీ తథాస్తనీ దీవించనీ..

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

ఏదో మైకం వేరే లోకం చూపుతోందే
హాయిగా ఉన్న ఇంత హైరానా
నిన్నలో లేనిది తప్పించుకోలేనిది

వన్ టూ త్రీ ఫోర్ అంటూ ట్వంటీఫోర్
కౌంటూ లెక్కపెట్టేసేయ్
వన్ బై వన్ను బేబీ ముద్దు జ్ఞాపకాలు
మూటకట్టేసేయ్
ప్రపంచమే నీ ఆశనీ తథాస్తనీ దీవించనీ..

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

ఊగే ప్రాయం ఆగేలాగ లేనె లేదే
మరో ముద్దేది ఎప్పుడంటుంది
మరింత కేరింతగా వేచి చూస్తున్నదీ
ఇరవై నాలుగన్న సంఖ్యలోనే
ఏదో మంత్రముందంటా
అదేమాట నమ్మి అన్ని
ముద్దులన్నీ అతనికిచ్చేస్తా
నా ప్రేమకూ బలం ఇదీ
నా నమ్మకం నిజం మరీ

ప్రాణ బృందావనం వింటున్నదీ వేణు గానం
లేలేత ప్రాయం పై ఆ మొదటి ముద్దు
మధురం మనోహరం

Palli Balakrishna Friday, January 25, 2019
Eedo Rakam Aado Rakam (2016)


చిత్రం: ఈడోరకం ఆడోరకం (2016)
సంగీతం: సాయి కార్తిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయి చరణ్, అపర్ణ
నటీనటులు: మంచు విష్ణు , సోనారిక భడోరియ, రాజ్ తరుణ్, హెబా పటేల్
దర్శకత్వం: సంపత్ గుండ్రారపు
నిర్మాత: సాయి తేజ నాయక్
విడుదల తేది: 14.04.2016

పట్టుకో నను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్నా
లవ్ లో లవ్ లో చెలియా నీతో లవ్ లో
అందుకో చెయ్ అందుకో అందుకో
నాతో నేనే విడిపోతుంన్నా
లేలో లేలో ముజ్కో దిల్ మే లేలో
డడడా డడడా ధడ్కన్ మే ఫుల్ డిస్కో డీజే సంబరమే
పటపట పటపట పటాసులై గుండెల్లో పేలెను ప్రేమే

ఓ సోనియే ఓ ఓ సోనియే
జర్ మే ఈ జిందగీ తేరేలియే
ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

నాలో ఏం చూశావే నిన్నే రాసిచ్చావే
అంతిదిగా నీ మనసుకు నే నచ్చేశానా
ప్రపంచమే నను కాదన్నా
నీ జంట కావాలనుకున్నా
ఫలించిన కల ఇవ్వాలిలా నీ కౌగిల్లో ఒదిగున్నా

ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

నిన్నా మొన్నల్లోనా నేనిట్టా లేనంటా
మల్టీ ప్లక్స్ బొమ్మల్లే రంగుల్లో మెరిశా
పదే పదే మరి ప్రేమంటే పదే పదే జరిగే ఉంటే
ఎన్నెన్ని మాయలు చూస్తావు నువ్వు నీ ప్రేమ తీరంటే

ఓ సోనియే ఓ ఓ సోనియే
ఎదలో నీ చిత్రమే గీశావులే

Palli Balakrishna Sunday, October 15, 2017
Kumari 21F (2015)


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సాగర్
నటీనటులు: రాజ్ తరుణ్, హేబా పటేల్
దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్
నిర్మాతలు: సుకుమార్ , విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి
విడుదల తేది: 20.11.2015

న న న నాన నా నా
న న న నాన నా నా
నీతొ తిరిగిన అడుగె యు టర్న్ తీసుకుందె
నా ఈ సింగల్ స్టేటస్ సడ్డెన్ గ నువ్విచ్చిందే
ఓహొ... ఓహొ...
నీ ప్లేస్ ఏ రీప్లేస్ అయ్యిందె
ఒహొ... ఓహొ...
కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందే

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me  (4)

నీ పాత కిస్సుల్లొ ఫ్లేవర్ కన్న
ఈ కొత్త కిస్సేదో టేస్టిగుందే
నీ పాత హగ్గుల్లొ వేడి కన్న
ఈ కొత్త టచ్ ఎదొ స్వీటుగుందె
ఒహొ... ఒహొ...
ఈ ఫ్రీడం నువ్విచ్చిందే
ఒహొ... ఒహొ...
నా సెల్ఫీ తన DP అయ్యిందె

Baby I Know You Gonna Miss Me (4)

నువు లవ్ చెసిన హార్ట్ పైన
తానోచ్చి తాపిగ తల వాల్చిందె
నువు చేతులేసేటి షోల్డర్ పైన
తన పంటి తొ టాట్టూ వెసెసిందె అ అ
ఒహొ... ఒహొ...
నీ కల్లల్లొ జలసి ఉందె
ఒహొ.. ఒహొ...

నీ మిస్టేక్ ఏ ప్లస్ అయ్యిందె

Baby I Know You Gonna Miss Me

Miss Me (7)

Baby I Know You Gonna Miss Me (3)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: యాజిన్ నజీర్

మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్ని నీ వల్లేనా
వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే
అది నీ అల్లరేనా..
ఓ చెట్టు నీడనైన లేనే పైన పూల వాన
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా
ఈ మాయలన్నీ నీ వల్లేనా

కోపముంటే నేరుగా చూపకుండా ఇలా
రాతిరంతా నిద్దురే పాడుచేస్తే ఎలా
నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా
మేలుకున్న కలలతో వేస్తావుగా సంకెల
పూట పూట పోలమరుతుంటే అసలింత జాలి లేదా
నేను కాక మరి నేలమీద తలిచేటి పేరు లేదా
క్షణమైనా నిలబడనిస్తే నీకు ఊసుపోదా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా..ఆఅ..

మాటలోన లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోన లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోన లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతదైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మద్య దారంకైన దారి ఎందుకంటా
మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన
రాగాలు తీసే నీ వల్లేనా
ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న
ఈ మాయలన్నీ నీ వల్లేనా
ఓ.ఉ.ఓ..


********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రనైనా రెడ్డి, రీటా

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

పార్టి పార్టి పార్టి
లెట్స్ టుగెదర్ పార్టి
క్యుటి క్యుటి క్యుటి
బేబి కమాన్ షేక్ యువర్ బూతి
నాటి నాటి
మేమంత చాల నాతి
కమాన్ బేబి
కమాన్ బేబి
లెట్స్ గెట్ డర్టి

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్
సింగ్ సొంగ్ పింగ్ పొంగ్
డింగ్ డింగ్ డింగ్ డొంగ్ డింగ్ డొంగ్
ఎం చెయాలొ చెసేధం
ఇంక అన్ని రైట్-అ నతింగ్ రోంగ్

మ్యుసిక్ ఒక్
దిస్కొ ఒక్
మూవ్ ఇట్ ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్
వాకింగ్ స్ట్రీట్ లొన మస్తి చెయలె
అరె రొక్కింగ్ చ్లుబ్ లొ
డంచె ఇర్రగదియ్యలె మారె

వొడ్క బొట్టిల్ మూత ఓపెన్ చెయ్యాలె ఇలా
ఫుల్ గ నిజం చెయ్యాలె
మిండ్ లొ ఉండె ప్రతి కల

బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

మస్సాజ్ ఒక్
సండ్విచ్ ఒక్
హ్యాప్పి ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

ప్రైవేట్ బూత్ లొన
మూన్ లైట్ నైట్ లొన
సే లొ సెంటర్ కెల్లి వాన్న హావ్ ఎ బాష్
తాఇలండ్ పాకిస్తాన్ ఒ పక్క
చైన కజకిస్తాన్ ఒ పక్క
సన్లైట్ వచ్చె వరకు
వాన్న హావ్ ఎ రొమాంటిక్ క్లాష్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్
బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్ బాంగ్కాక్
రారా బ్రదర్-ఉ సూపర్ వెదర్-ఉ
లెట్స్ రిలాక్ష్ అంద్ రోచ్క్

టూక్ టూక్ ఒక్
గొ గొ ఒక్
బూం బూం ఒక్
స్లోల్య్ స్లోల్య్ (2క్ష్)

సేం సేం బట్ డిఫరెంట్
నొ మనీ నొ హనీ
గుడ్ బొఇ గొస్ టూ హెవెన్
బాడ్ బొఇ గొస్ టూ బాంగ్కాక్



********   *********   ********

చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్. యమ్. మానసి

టంకు టకుం టం
టంకు టకుం టం
అంబర్పెట సెంటర్ నుండి
అమీర్పెటకు పొయెటప్పుడు
షేరె ఆటొ లొ
కలిసాడు సొఫ్ట్వేర్ కుర్రడు
టంకు టకుం టం
టంకు టకుం టం

నా ఫిగర్ మస్తని పొగిడాడు
ఫట్టున లవ్ లొ దింపాడు
స్త్రైట్ గ మాట్టర్ కొచాడు
గాటుగ ముద్దిమన్నడు
టంకు టకుం టం
టంకు టకుం టం

సిగ్గుతొ నేను ముద్ధిట్టాంతె
అరె రె సిగ్గుతొ నేను ముద్ధిటాంతె
చెల్ల్ ఫోన్లో సిత్రించడు
వద్దు వద్దు వద్దు అన్న
మాటె వినెలెదు
ఎహె నెనెవరికి చూపిస్తానె
నేను చూసుకొవటానికె
అంటూ ఇదరి మద్య
సిక్రెట్ సీన్
ఇంటర్నెట్లో ఎట్టెసాడు
ఇంటా బయటా ఇమేజ్ మొత్తం
డ్రైనేగ్ లోనె కలిపెసాడు

అంతె అప్పూ అప్పూ
ఐపొయింది బ్రేకప్పూ
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచప్పూ

అప్పుడప్పుడు ఐపొయింద బ్రేకప్పూ
అమ్మి అమ్మి రాయె అవుదాం పాచప్పూ

ఫేస్బూక్ లొని కలిసాడు
యుఎస్ లొని కుర్రొడు
సెలెబ్రిటీస్ తొని దిగిన
సెల్ఫీలెన్నొ పెట్టాడు
టంకు టకుం టం
ఆఇర్ఫొర్చె లొన
పెద ఉద్యొగం అని చెప్పడు
Yఔంగ్ తిగెర్ ణ్టృ ల
ఉన్నడని టెంప్ట్ అయ్యనొ
టంకు టకుం టం
ఎ చాట్టింగ్ లొన లవ్ అయ్యింది (2x)
మీటింగ్ అయ్యె టైం ఒచింది
యుఎస్ అంటె వుయ్యురు పక్కన
సంకరపల్లని తెలిసింది
ఆ ఎయిర్ ఫోర్స్  ఉద్యోగం అంటె
గాలి తిరుగుడు అని ఎరుకైంది
ఫొటొలన్ని ఫొటొషొప్
డప్పని ప్రూవ్ అయ్యింది
మరీ చాట్టింగ్ లోన చెసిందంత
చీటింగ్ అని తెలిసొచింది

అంతె ఉప్ ఉప్ పూ
ఐపొయింది బ్రేకుప్పూ
అబ్బి అబ్బి నీతొ ఔత
పాచుప్పూ

చెప్పిన టైం కి రాలేదని
చెప్పుల షొప్ టిప్పుతోటి
గుర్రు గుర్రు గురకెట్టాడని
గురువ రెద్ద్య్ కొడుకు తోటి
బ్రేకప్ బ్రేకప్
అ హెడ్ పైన డండ్రుఫ్ఫ్ ఉందని
హెడ్ కానిస్టేబుల్ తోటి
బెద్ మీద దుప్పట్టి మొతం
లాగేసాడని రెడ్డితోటి
బ్రేకప్ బ్రేక్ప్
నా కుక్కని చి చి అన్నాడని
నా కుక్కని చి చి అన్నాడని
లెక్కల మాస్టర్ విక్రంతోటి
పువ్వుల సొక్క ఏసాడని
స్టవ్ ల రిపేర్ షంకర్ తోటి
ఏగ్ దాచిపెట్టాడని
ఇన్సురెన్స్ ఏజెంట్ తోటి
మాటి మాటికి మూడె మార్చి
మ్యారేజ్ బ్యూరో నీరజతోటి
ఇట్టా సిల్లీ సిల్లీ రీజన్ తోటి
గల్లి గల్లి కొక్కడితొటి
అప్ అప్ అయిపోయింది బ్రేకప్
అబ్బి అబ్బి నీతో అవుతా
పాచ్ అప్ పూ

ఇంతె ఇంతె ఎ కాలంలో
బ్రేకప్
ఇట్టె ఇట్టె అయిపోతారు పాచప్ (2x)



********   *********   ********


చిత్రం: కుమారి 21 F (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నరేంద్ర

హేయ్ బార్ కెళ్తుంది బీర్ కొడుతుంది
పబ్ కెళ్తుంది డాన్స్ చేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

షార్ట్ లేస్తుంది హాట్ గుంటుంది,
దమ్ము కొడుతుంది చూయింగ్ గమ్ వేస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

హేయ్ వాట్సప్ లో  ఎయిట్ ఓ క్లాక్ కి గుడ్ నైటంది
కాని లాస్ట్ సీన్ టుడే 12.30 ఉంది
సాటర్ డే  నైట్ పార్టీకి రమ్మంది
ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

యో బోయ్ టెల్ మీ
లవ్ చెయ్యాలా వద్దా..?
ఎవ్రిబడి సే నౌ
లవ్ చెయ్యాలయ వద్ద..?
come on come on come on
పుట్ యువర్ హాండ్స్ అప్
లవ్ చెయ్యాలయ వద్ద..?
షేక్ఇట్ షేక్ఇట్ షేక్ఇట్ నౌ
లవ్ చెయ్యాలా వద్దా..?

హేయ్ లాంగ్ డ్రైవంటే లైక్ అంటుంది
ఎవడి బైకైనా మొగాడిలా  కూర్చుంటుంది .

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది
డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది
ఆ లిస్టులోన ఒక్కతైన అమ్మాయ్ లేకుంది
గుంట కొక్క selfie అపలోడ్ చేస్తుంది
కామెంట్ పెట్టిన ప్రతోడికి స్మైలే ఇస్తుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

ఫ్రీడమ్ అంటుంది ఫ్రీగా ఉంటుంది
ఫోనేమో అల్వేజ్ బిజీగా ఉంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

గుండెల్లో నేనే ఉన్నానంటుంది
కానీ fb లో ఫ్రొఫైల్ పిక్ బన్నీ దుంటుంది

లవ్ చెయ్యాలా వద్దా.. (2)

Palli Balakrishna Sunday, August 20, 2017
Ekkadiki Pothavu Chinnavada (2016)


చిత్రం: ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ధనుంజయ, స్వీకర్
నటీనటులు: నిఖిల్, హెబ పటేల్, పండిత శ్వేతా, అవికా గోర్
దర్శకత్వం: వి. ఆనంద్
నిర్మాత: పి. వి. రావ్
విడుదల తేది: 18.11.2016

హే పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన
అస్సలే నేను హైపరో హైపరో
అందులోన హ్యాపి మ్యటరో మ్యటరో
అగనంది స్పిడు మిటరో మిటరో
నాకు నేనే దొరకనట్టు స్పిడు పెంచి దుకుతున్నా
మళ్ళి మళ్ళి మళ్ళి రాణి రోజు
అందుకేగా ఇంత క్రేజో
ఆక్సిలేటర్ ఫుల్ రైజు
రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకున్న పిల్లదాన

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన

రిస్టు వాచ్ లోన ముళ్ళు కూడ చూడు
బండి చక్రమల్లె రయ్యమంది నేడు
ఎప్పుడెప్పుడంటు ఆగనంది మూడు
బ్రేక్ ఫెయిల్ చేసి తీసినాది దౌడు
సూపర్ సానిత్రి విమానంలో వచ్చి
చలియా నీ చెంత వాలిపోతా
జస్ట్ లవ్ ఫార్మాల్టీగానించి
అదే ఫ్లైట్లో హనీమూన్ కెత్తుకెళతా

వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో
వంద స్పీడ్దులో వంద స్పీడ్దులో
స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు స్పీడు

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పవర్ స్టార్ ఫిల్మ్  ఫస్ట్ డే ఫస్ట్ షో
చూసినట్టు పెరిగినాది పల్స్ రేటు
ఏవో నేలమీద తిరుగుతున్న గాని
అజ్ మేర దిల్ గాల్లో తేలే కైటు
రీవైండ్ చేసేసి చూస్తే పిల్లా
మన ఫ్లాష్ బ్యాక్ లవ్ సీన్లు గుర్తుకొచ్చనే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన బొమ్మే చూస్తే
మస్త్ కలర్లో మన ఫ్యూచర్ వెల్కమన్నదే

వంద స్పీడ్దులో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్న తెస్తున్న
గుండె బ్యాండ్ బాజా క్రేజీ సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోన
డండనక ఫుల్ గోలంట గోలంట
ధూమచ్చావు టైపు తుళ్ళింత ఒళ్ళంతా
ఫుల్ కోట్టినట్టు వీళ్లంత త్రిళ్లంతా
ఈ ఖుషీ ని బైట చేసి నీతో నేను పంచుకోన

పంచకట్టు క‌‌‌‌ట్టు సూపరో సుపరో
సిల్కు లాల్చి సుపరో సుపరో
బుగ్గ చుక్కా సుపరో సుపరో
సెల్ఫీ నేను తీసుకోన పెళ్లికోడుకు లుక్కులోన

Palli Balakrishna Tuesday, August 15, 2017
Andhhagadu (2017)

చిత్రం: అందగాడు (2017)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దనుంజయ , శేఖర్
నటీనటులు: రాజ్ తరుణ్, హెబా పటేల్
దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
నిర్మాత: రాంబ్రహ్మం సుంకర
విడుదల తేది: 02.06.2017

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే
నా జిందగీలోనె
ఫర్స్త్ టైమె సన్ రైస్ వొచ్చిందె
నీ వల్ల నీ వల్లె
ఫర్స్త్ టైమె నా లైఫె నచ్చిందె

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే

షి ఈస్ రీల్ల్య్ సూపర్, చేసింది ఫేవర్
ఇచ్చింది ఆఫ్ఫర్, మార్చింది ఫ్యుచర్
ఖుదిరింది మీటర్, మొదలైంది మాట్టర్
మర్రే ఆఫ్టర్, లైఫ్ హెలిచోఫ్టర్

టోర్చ్ లైట్ కోసం వెతికేస్తుంటె
సాటిలైట్ లాగ దూఇకెసావె
దారి తప్పిపొయి తిరిగేస్తుంటె
గూగుల్ మాప్ ఐ వచ్చెసావె

ఒక్క టచ్ కె గుండె హై పిచ్ లొ
అల్టిమేట్ లవ్ సోంగ్ పాడుతున్నదె
ఒక్క మాటకె చూడు కొత కైట్ లా
నా మనసు ఎగిరేసి
నీ చుట్టు తిరిగేసి
గిరికీలు కొడుతున్నదె

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

పర్ఫ్యుం నదిలొ ముంచేసినట్టుగ
వొల్లంత నీ ఫ్లేవర్ నింపెసావె
హై బీం లైతింగ్ కమ్మేసినట్టుగ
దిమాక్ మొతం కమ్మెసావె

ఒక్క స్మైల్ తొ లెక్కకందనంతగ
తిక్క తిక్క ఉక్కపోత పెంచెసావె
ఇప్పుడిప్పుడె లక్ దక్కుతుందిర
ఒ చిన్న తప్పైన
ఒ రాంగ్ స్టెప్ ఐన పడకుండ
చూడు దేవుడ

దెబ్బకి పోయె పోయె
నా మైండ్ పాగల్ ఐపోయె
దెబ్బకి పోయె పోయె
నిద్దరె కరువే ఐపొయే

దెబ్బకి పోయె పోయె
దిల్ మె ధగ్ ధగ్ మొదలాయె
దెబ్బకి పోయె పోయె
నా జన్మ ధన్యం ఐపొయే

నా హార్త్ బీట్ ఏమొ
ఫర్స్త్ టైమె ఐ లవ్ యు అంటోందే
నా పల్సె రేట్ ఏమొ
ఫర్స్త్ టైమె కంట్రోల్ తప్పిందే

Palli Balakrishna Monday, June 12, 2017

Most Recent

Default