Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్ర : కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: శోభన్ బాబు, శారద, మంజు భార్గవి, సంగీత
మాటలు: గొల్లపూడి మారుతిరావు 
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి
విడుదల తేది: 04.09.1980



Songs List:



ఆకలైనా ఆశలైనా పాట సాహిత్యం

 
చిత్ర : కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: వేటూరి / గోపి
గానం: యస్.పి బాలు, పి. సుశీల

పల్లవి:
ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే

చరణం: 1 
చీర నేనై  పైట నీవై సిగ్గుపడద్దామా
సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల పూలు కడద్దామా
ఆ.. వాన నేనై వరద నీవై పొంగిపోద్దామా
చినుకు ముగ్గుల జిలుగు ముంగిట తడిసిపోద్దామా

చీర నేనై  పైట నీవై సిగ్గుపడద్దామా
సిగ్గుమొగ్గల చిలిపి నవ్వుల పూలు కడద్దామా
ఆ.. వాన నేనై వరద నీవై పొంగిపోద్దామా
చినుకు ముగ్గుల జిలుగు ముంగిట తడిసిపోద్దామా

ఎవరు నీవూ ఎవరు నేను ఏకమైతే ఇద్దరం
ఏరు నేను నీరు నీవు వెల్లువైతే ఈ క్షణం

ఆకలైనా ఆశలైనా కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే


చరణం: 2 
ఇల్లు నేనై గడప నీవై చల్లగుంద్దామా
పైరు పచ్చల పందిరేసి వెచ్చగుంద్దామా
ఆ... హరివి నీవై సిరిని నేనై హాయిగుంద్దామా
ఆలుమగలై రేయి పగలు అల్లుకుంద్దామా

ఆ... ఇల్లు నేనై గడప నీవై చల్లగుంద్దామా
పైరు పచ్చల పందిరేసి వెచ్చగుంద్దామా
ఆ... హరివి నీవై సిరిని నేనై హాయిగుంద్దామా
ఆలుమగలై రేయి పగలు అల్లుకుంద్దామా

ఏది రాగం ఏది గీతం ఏకమైతే ఇద్దరం
ఏమి అందం ఎంత బంధం ఎల్లువైతే ఈ క్షణం

ఆకలైనా ఆశలైనా...  కౌగిలైనా జాబిలైనా
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే
సగము సగమేలే... మనమూ సగమూ సగమేలే 




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default