Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Inspector Bharya (1970)
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరధి, డా॥ సి.నారాయణరెడ్డి, అప్పలాచార్య
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, మోహన్ రాజు,  పిఠాపురం
నటీనటులు:  కృష్ణ, కృష్ణంరాజు, చంద్రకళ, ధూళిపాళ, అల్లు రామలింగయ్య, రాజబాబు, రమాప్రభ, జ్యోతిలక్ష్మి, హలం
కథ, స్క్రీన్ ప్లే, దర్శక పర్యవేక్షణ: ఎ.సి.త్రిలోక చందర్ 
దర్శకత్వం: పి.వి.సత్యన్నారాయణ రావు
నిర్మాత: కె.జయసేఖర్ 
విడుదల తేది: 25.08.1970Songs List:కోపం చాలించు కొంచం ప్రేమించు పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

ఓహో మై డార్లింగ్ 
కోపం చాలించు కొంచం ప్రేమించు 

నీకు పుణ్యం వుంటుంది
నాకు పెళ్ళి అవుతుంది
మరదలవని వచ్చానే
మనసు చేతికిచ్చానే
విసరిపారవేస్తావో
ప్రేమగానె చూస్తావో
దూరం దూరం తోసేస్తుంటే
దగ్గర దగ్గర కొచ్చెస్తుంటా- ఏమంటావ్ ?
వద్దంటా...

ఎంత అలసిపోయావో
ఎంత తడిసిపోయావో
ఇంక కలిసిపోరాదా
ఎంతైనా బావను కాదా
ఎప్పటి కైనా తప్పని బంధం
ఇప్పటి కైనా ఒప్పితే అందం.ఏమంటావ్ ?
పో పొమ్మంటా ...

నన్ను కాదు పొమ్మంటే
నీకు ఎవడు వస్తాడో
ఎంత బాధ పెడతాడో
ఎంత నలిగిపోతావో
కాదనవద్దూ కయ్యంరద్దూ
నాతో పెళ్ళి అయితే ముద్దు ఏమంటావ్ ?
రారమ్మంటా
వస్తున్నా ...నా వళ్ళంత బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

నా ఒళ్ళంతా బంగారం
నీ కళ్ళు చెదిరేసింగారం
అందిస్తా నిపుడు అందుకో
ఎక్కడిదక్కడ దాచుకో
గప్ చిప్ చిప్ ...

తొలి వలపుల చలితో
గౌనుమీద గౌనేసుకున్నా
నీ చూపుల వేడికి
తాళ లేక తీరేస్తున్నా

పరులకంట పడకుండా
పరువాలు దాచివుంచా
ఈ నిషా నుందిరంలో
దిల్ ఖుషీ చేసియిస్తా....
హరే రామ రామరామ హరేకృష్ణ

మనిషి మనిషిలో మైకమున్నది.
మసక చీకటి మధ్యనున్నది
అ రెంటికి నడుమ చెలిమియున్నది
ఆ చెలిమికి తోడీ చెలియ వున్నది
నకిలి సరుకుకాదు
మోసం ఏమీ లేదు
గీటురాతిపై గీసి చూసుకో
సాటిలేదని నమ్మి తీసుకో
హరేరామ రామరామ-హరేకృష్ణ
కృష్ణ కృష్ణ

పెళ్ళికి ఫలితం ఏమిటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల

పెళ్ళికి ఫలితం ఏమిటి ?
చల్లగ సాగే కాపురం
ఆఁ ... కాపురానికి ఫలిత మేమిటి?
రెండు తనువులొక కౌగిలిలో
కలిపేదే అనుబంధం 
రెండు మనసులొక ఊపిరిలో
నిలిపేదే అనురాగం...

ఇరువురి నడుమ ఏ మర్మమూలేని....
జీవనమే బృందావనం
నులివెచ్చగ సందిట చేరే
చెలియకు నేడెందుకో కోపం ?
చెలి కడుపున ఏ మొలకుందో
తెలియదు శ్రీవారికి పాపం
ఇన్నాళ్ళుగ నే వేచింది
ఈ వరాలమాట కోసం...
చిన్ని బాబు మోమును చూడు
అన్నీ నీ పోలికలే
ఆ చిలిపి నవ్యులు చూడు
అంతా నీ వాలకమే
ముద్దుపాప మురిపాలన్నీ
ఇద్దరికీ చెగిసగమే ...

రాధను నేనైతే... పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల  

పల్లవి:
రాధను నేనైతే... నీ రాధను నేనైతే
రాధను నేనైతే... నీ రాధను నేనైతే
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా

చరణం: 1
తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల.. తుమ్మేదలు
తోటనిండా.. మల్లియలు తుంటరి పాటల.. తుమ్మేదలు
అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
అల్లరి తుమ్మేదల అలికిడి వినగానె
మల్లెలు సవరించు పై ఎదలు

గడసరి చినవాడు తోడుగ ఉంటే
కరగును నునుసిగ్గు పరదాలు...
గడసరి చినవాడు తోడుగ ఉంటే
కరగును నునుసిగ్గు పరదాలు...
చిలిపిగ నను నీవు చేరుకుంటే..
జల జల పొంగును పరువాలు

రాధవు నీవైతే.. నా రాధవు నీవైతే
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగా

చరణం: 2
రాధ అంటే.. ఎవ్వరదీ
మాధవు పాదాల.. పువ్వు అది
రాధ అంటే.. ఎవ్వరదీ
మాధవు పాదాల.. పువ్వు అది
అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
అంతటి స్వామి.. చెంతగ ఉంటేనే
ఆమె మనసు పూచేది

తీయగ సోకే పిల్లగాలికి..
పూయని పువ్వే ఉంటుందా
తీయగ సోకే పిల్లగాలికి
పూయని పువ్వే ఉంటుందా
కన్నుగీటే వన్నెకానికి
కరగని జవ్వని వుంటుందా

రాధను నేనైతే...నీ రాధను నేనైతే
నిన్ను మలచుకుంటాను.. నా మురళిగా
నిన్ను చేసుకుంటాను.. నా తరుణిగాచూడు చూడు చూడు పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

చూడు చూడు చూడూ ... ఇది
చూడనోడులేడు 
ఒక్కసారి చూసినోడు
వదిలి పెట్టిపోడు -
చుక్కానీ సోకు చూడూ

సుందరమ్మ ఠీకు చూడు...
శ్రీకృష్ణుడి వేషంలో చిరునవ్వులు చిందించే
యన్. టి. రామారావు చూడు.. అందమైన
పోజు చూడు
తులాభారం తూచలేక ఓరకంట చూస్తున్న
సత్యభామ జమున చూడు చూపులోని
సొగసుచూడు
వగలమారి వాణిశ్రీ వయ్యారంగా పోతుంటే
అక్కినేని అడ్డమొచ్చి గడ్డమట్టుకొన్నాడు
పద్మనాభ మదిచూసి పకాపకా నవ్వాడు
సిగ్గుపడి వాళ్ళిద్దరూ చెట్టుచాటు కెళ్లారు.
గూఢచారి కృష్ణ చూడు గురి పెట్టే స్టయిలు చూడు
విజలలిత తళకు చూడు
విజయ శ్రీ కులుకు చూడు
జ్యోతిలక్ష్మి డ్యాన్సుచూడు
డ్యాన్సులోని చాన్సు చూడు
బతికుంటే ఒక్కసారి
మదరాసుకు పోయిచూడు

కృష్ణ దేవా దీనభాంధవ పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: 

కృష్ణా-కృష్ణా-కృష్ణా
దేవా ... దీనబాంధవా
అసహాయురాలరా కానరా- దేవా
ఒకటే చీరను కట్టినదానను
ఆరుగజాలు అయిపోతున్నవి
శరణము నీవె కనపడవేమి 
కురువృద్ధుల్ (పద్యం ) పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: పిఠాపురం నాగేశ్వరరావు

కురువృద్ధుల్  (పద్యం )

కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు
నేకుల్ చూచుచుండన్-మదోద్దరు డై
ద్రౌపదినిట్లు చేసిన ఖలున్
దుశ్శాసునున్ .. ఆయ్ ... లోక
భీకర లీలన్ వదియించి తద్విపుల
వక్ష శ్శైల రక్తౌగ నిర్జర ముర్వీపతి
చూచుచుండ ... అని
నాస్వాదింతు ను గాకృతిన్.పనికిమాలిన ఎవరూ (పద్యం ) పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: 

పనికిమాలిన ఎవరూ  (పద్యం )

పనికిమాలిన ఏవురు పతుల దేల
నే నొకండను చాలదు నెలత నీకు
రమ్ము నాతొడ పైన కూర్చుండరమ్ము
ప్రేమ మీర ఏలుకొందును నిన్ను నీరజాక్షిధారుణి రాజ్యసంపద (పద్యం ) పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: అప్పలాచార్య
గానం: పిఠాపురం నాగేశ్వరరావు

ధారుణి రాజ్యసంపద  (పద్యం )

ధారుని రాజ్యసంపద
మదమ్మున కోమలి కృష్ణ చూచి
రంభోరు నిజోరు దేశమున
నుండగ బిల్చిన యిద్దురాత్ము
దుర్వార మదీయ బాహు పరివరిత
చండగ ధాభిఘాత భగ్నోరు
తరోరుచే మీదు సుయోధను
సుగ్రగణాంత మ్మునన్

No comments

Most Recent

Default