Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aada Brathuku (1965)




చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
నటీనటులు: యన్.టి.రామారావు, దేవిక 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
నిర్మాత: యస్.యస్.వాసన్ 
విడుదల తేది: 12.11.1965



Songs List:



ఆహా - అందముచిందే పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: పి. సుశీల & కోరస్

పల్లవి:
ఆహా - అందముచిందే హృదయ కమలం
అందుకునే రాజొకడే - ఆహాహా!
అందుకునే రాజొకడే    "ఆహా"

ఆహా... అందముచిందే హృదయకమలం
అందుకునే రాజొకడే  "2"
వేలతారకల బృందములోన
వెలిగే చందురుడొకడే
వెలిగే చందురుడొకడే  

చరణం: 1
వెన్నెలరేకుల వాకిళ్లుతీసా
సన్నని వలపుల సాంబ్రాణి వేసి
ఎదురు చూసేది - ఎవరికోసమే
మదిలో దాగిన మరుని కోసమే
మదిలో దాగిన మరుని కోసమే

చరణం: 2
కత్తులు దూసి జడిపించువాడు
మెత్తని ప్రేమను సాధించలేడు
కన్నుల బాసలు తెలియనివాడు
కన్నియ మనసును గెలువగలేడు



కాలి మువ్వలు ఘల్లుమనే పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి 

కాలి మువ్వలు ఘల్లుమనే 



కనులు పలకరించెను పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
కనులు పలకరించెను పెదవులు పులకించెను
బుగ్గలపై లేతలేత సిగ్గులు చిగురించెను

చరణం: 1
నిన్ను నేను చూసేవేళా
నన్ను నీవు చూడవేలా
నేను పైకి చూడగానే
నీవు నన్ను చూతువేలా
తెలిసిపోయె నీలో ఏదో - వలపు తొంగి చూచెను

చరణం: 2
మొలక నవ్వు దాచుకోకు
జిలుగుపైట జారనీకు   (2)
కురులు చాటు చేసుకోకు
తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయే నీలో ఏదో - వలపుతొంగి చూచెను 

చరణం: 3
అందమైన ఈ జలపాతం
ఆలపించె తీయని గీతం "2''
కనిపించని నీ హృదయంలో
వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో - వలపు తొంగి చూచెను 




పిలిచే నా మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

పల్లవి:
పిలిచే నా మదిలో వలపే నీదెసుమా
పిలిచే నా మదిలో వలపే నీదెసుమా
రారాజు ఎవరైనా నారాజు నీవె సుమా

చరణం: 1
ప్రేమయే దైవమని భావించుకున్నాము
లోకమేమనుకున్నా ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా జంటగా వుందాము

చరణం: 2
చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ
ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే
ఈ ప్రేమ మారదులే ఈ జ్యోతి ఆరదులే
ఎన్ని జన్మలకైనా ఈ బంధముండునులే



విషమించిన పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

విషమించిన 



బుజ్జి బుజ్జి పాపాయీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
బుజ్జి బుజ్జి పాపాయీ బుల్లి బుల్లి పాపాయి (2)
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

చరణం: 1
పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను
బంగారు ఊయలలో పవళించి ఊగేను
ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

చరణం: 2
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా
ఇరు హృదయాలొక టైతే పాడేది లాలిరా

ఏ తల్లి కన్నదో... ఏ బంధమున్నదో...
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే

చరణం: 3
పూవంటి మనసులో ముల్లున్న జగతిరా
మోసాలు ద్వేషాలు ముసిరే బ్రతుకురా

నముకున్న నావారు నాకిదే నేర్పారు (2)
మనసే మురిసెనురా మమతే పెరిగెనురా
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోనే





నిత్య సుమంగళి నీవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

సాకీ:
ప్రేమే నీకు మాంగల్యం అది జన్మజన్మల అనుబంధం
చావు పుట్టుకలకందని బంధం దానికి లేదు వైధవ్యం
దానికి లేదు వైధవ్యం...

పల్లవి:
నిత్య సుమంగళి నీవమ్మా
నీకు అమంగళమేదమ్మా (2)
ప్రేమకు మృత్యువు లేదమ్మా
పెట్టిన బొట్టూ పోదమ్మా (2)

చరణం: 1
పది మాసాలు మోసావే
ప్రాణంగా కనిపెంచావే
విడనాడి వెళుతున్నావా
కడసారి లాలించేవా
ఎవరో నిను ముద్దాడేరూ
ఎక్కడ అమ్మాని అడిగేరు
నాన్నను చేరగ పోయెనని
నవ్వుతూ చెప్పరా నా తండ్రి (2)

చరణం: 2
తల్లిని కాను తనయను కాను
ఎవరికి నేను కోడలు కాను
దేవుడు లేక కోవెల లేదు
నా దైవం లేక నే లేను (2)





వస్తాడే వస్తాడే వన్నె పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

వస్తాడే వస్తాడే వన్నె 




తనువుకెన్ని గాయాలైనా పాట సాహిత్యం

 
చిత్రం: ఆడబ్రతుకు (1965)
సంగీతం: విశ్వనాథన్-రామమూర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునెలాగైనా
మనసుకొక్కగాయమైన మాసిపోదు చితిలోనైనా

చరణం: 1
ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు (2)
ఆడుకున్న ఫరవాలేదు పగులకొట్టి పోతారెందుకో
పగులకొట్టి పోతారెందుకో...

చరణం: 2
మగువులను పట్టించావే మా సుఖమునకే అన్నావే
అందుకే ధర తెమ్మన్నావే బ్రతుకే బలి ఇమ్మన్నావే
బ్రతుకే బలి ఇమ్మన్నావే...

No comments

Most Recent

Default