Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Idha Lokam (1973)




చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: శోభన్ బాబు, శారదా, ఆరతి, సుమ, సుజాత, చంద్రమోహన్
దర్శకత్వం: కె.యస్.ప్రకాశ  రావు
సహకార దర్శకుడు: కె.రాఘవేంద్రరావు
నిర్మాతలు: వి.ఆర్ యాచేంద్రా, పి.భలేరావు
విడుదల తేది: 12.10.1973



Songs List:



ఏటి ఒడ్డున కూర్చుంటే.. పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

పల్లవి:
ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే...
ఏటి ఒడ్డున కూర్చుంటే...ఏరు గల గలమంటుంటే...

నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే
నీటిలో మన నీడలు రెండూ...వాటేసుకుపోతూ ఉంటే...

ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా

ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...

చరణం: 1
పిల్లగాలీ వీస్తుంటే... ఒళ్లు జల జలమంటుంటే..
పిల్లగాలీ వీస్తుంటే ...ఒళ్లు జల జలమంటుంటే...
నిన్ను నీవే నీ కౌగిలో...నిన్ను నీవే నీ కౌగిలో..
నన్ను మరచి ...హత్తుకుంటే....

ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా...
ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...

చరణం: 2
చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే....
చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే....
మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు దిగులుగ చూస్తుంటే...
కళ్లల్లో కనిపించే దిగులే కలగా వస్తుందనుకుంటే...

ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి జానెడు దూరం..
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా

ఓ యబ్బ ఓ యబ్బాయి పిడికెడు మనసూ...
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్...

ఓ యమ్మ..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ...ఓ యబ్బా
లాలా..ల..లా ల.ల ..లా...
లాలా..ల..లా ...లల్ల..లా.. ..లా...
ఊహు..ఊహు..ఊహు..
ఊహు..ఊహు..ఊహు...




ఓ కోయిలా .. పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.పి. బాలు 

పల్లవి:
ఓ కోయిలా ..ఆ..ఆ...
ఓ కోయిలా ..ఆ..ఆ..
రమ్మన్న రామచిలుక బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా

ఓ కోయిలా ..ఆ..ఆ...
రమన్న చిన్నవాడు కళ్ళైన కదపడు మెదపడు
ఓ కోయిలా ఎందుకే కోయిలా

చరణం: 1
కొత్తగా ఒక కోరిక పుట్టింది....
మెత్తగా అది కలవర పెట్టింది...
ఊహు..ఊహు..లా..లా..లా

కొత్తగా ఒక కోరిక పుట్టింది..
మెత్తగా అది కలవర పెట్టింది

దయలేని పెదవుల పరదాలలో...
దయలేని పెదవుల పరదాలలో...
అది దాగుడుమూతలు ఆడుతుంది దాటిరాలేనంటుంది
ఆ..ఆ..ఆ...ఆ
ఓ కోయిలా ఎందుకే కోయిలా

చరణం: 2
వెచ్చగా తాకాలని ఉందీ..
వెన్నలా కరగాలని ఉందీ....
ఊహు..ఊహూ..లా..లా..లా..
వెచ్చగా తాకాలని ఉందీ..
వెన్నలా కరగాలని ఉందీ

తొలి ముద్దు కాజేసి వలపే పల్లవి చేసి
తొలి ముద్దు కాజేసి వలపే పల్లవి చేసి
బ్రతుకంతా పాడాలని ఉంది... పాటగా బ్రతకాలని ఉంది...
ఆ..ఆ.ఆ

ఓ కోయిలా ..ఆ..ఆ...
రమ్మన్న రామచిలుక బొమ్మలాగ ఉలకదు పలకదు
ఓ కోయిలా..ఆ..ఆ ఎందుకే కోయిలా..ఎందుకే కోయిలా..
ఎందుకే కోయిలా....ఎందుకే కోయిలా




గుడిలోన నా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం:  వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి
గానం: యస్. జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి 

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు, కానీ వీరిద్దరు పాటలు రచయితలు. ఈ పాట రాసింది వీటూరి వెంకట సత్య సూర్యనారాయణమూర్తి)

పల్లవి :
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే

గుడియెనక నా సామి..
గుడియెనక నా సామి...
గుర్రమెక్కి కూసున్నాడు
వాడి సోకు సూసి... గుండెల్లో
గుబులాయెనే... అబ్బబ్బబ్బబ్బ
ఒళ్ళంత ఏడెక్కెనే.. అయ్యయ్యయ్యో
ఒళ్ళంత ఏడెక్కెనే...
అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే

చరణం: 1
సోగ కన్నులవాడు చక్కనైనవాడు...
సోగ కన్నులవాడు చక్కనైనవాడు
మొలక నవ్వులే నవ్వుతూ..
వలపు చూపులే రువ్వుతూ
సకల చరాచర జగతికి నాథుడు
నిఖిల సురాసుర ముని గణ వంధ్యుడు
నీల జలద మోహనుడు... మాధవుడు

గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు..

సేవకు వేళాయెనే.. సేవకు వేళాయనే

చరణం: 2 
నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు...
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ

కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
ఎగాదిగా చూసి చూసి..
ఏమేమో అన్నాడమ్మో

గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు

ఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

గట్టునున్న చీరలే దాచినాడమ్మా
కన్నెల మనసులే దోచినాడమ్మా..
కన్నెల మనసులే దోచినాడమ్మా

ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా..





ఇదాలోకం ఇదాలోకం పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: దాశరథి 
గానం: యస్.పి. బాలు, టి. ఆర్. జయదేవ్, బి. వసంత 

ఇదాలోకం ఇదాలోకం



నీ మనసు నా మనసు ఏకమై.... పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ

నీ మనసు నా మనసు ఏకమై....
నీ నీడ అనురాగలోకమై 
ప్రతీ జన్మలోన....జతగానే ఉందాములే...ఏ..ఏ..ఎ
ఓ...ఓ....ఓహో
ఆఅఆఅ...ఆఅఆ...ఆఅఆఅ.ఆఆ

నీ మనసు నామనసు ఏకమై..

చలిగాలి తొలిమబ్బు పులకించి కలిసి
మనసైన చిరుజల్లు మన పైన కురిసి 
దూరాన గగనాల తీరాలు మెరిసె
మదిలోన శతకోటి ఉదయాలు విరిసె 
ఆఆ..ఆఅఆఆ.పరువాల బంగారు కిరణాలలో
ఆఆఆ.ఆఆఆఆకిరణాల జలతారు కెరటాలలో
నీవే నేనై ఉందాములే..
ఆఆ...ఓఓఓ...ఆఆఆ

నీ మనసు నా మనసు ఏకమై

ఆఆఆ..ఆఆ...ఏ నోములో నిన్ను నా చెంత నిలిపే
ఏ దైవమో నేదు నిన్ను నన్ను కలిపె 
నీ పొందులో ప్రేమనిధులెన్నో దొరికె
నీతోనే నా పంచ ప్రాణాలు పలికె 
ఈఈఈ.....ఈఈ..ఈ జగమంతా పగబూని ఎదిరించినా
ఆఆఆఆఆ....విధి ఎంత విషమించి వేధించినా
నీవే నేనై వుందాములే
ఆఆ...ఓఓఓ...ఆఆఆ

నీ మనసు నా మనసు ఏకమై...
నీ నీడ అనురాగ లోకమై...
ప్రతీ జన్మలోన..జతగానే ఉందాములే..ఏఏఏ




నిత్య సుమంగళి నీవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, బి. వసంత 

నిత్య సుమంగళి నీవమ్మ 



మనసా ఎందుకు నువ్వవంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇదాలోకం (1973)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు 

మనసా ఎందుకు నువ్వవంటే 


No comments

Most Recent

Default