-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడ
నటీనటులు: మురళీ మోహన్, జయసుధ, మోహన్ బాబు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాతలు: వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కనేని
విడుదల తేది: 1979


చిత్రం: కళ్యాణి (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

జవరాలి జడలోనా..ఆ... ఆ...
జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని ఆ... ఆ...
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ

జవరాలి జడలోన జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తానమాడిస్తావు 
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు

సుతిమెత్తగా నువ్వు ఆ... ఆ...
సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తానమాడిస్తావు
ఉల్లాసకేళికి ఆ... ఆ...
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళుమూస్తావు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా


No comments

Most Recent

Default