Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Regina Cassandra"



చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
నటీనటులు: రాణా  దగ్గుబాటి, రెజీనా కసండ్రా
దర్శకత్వం: సత్య శివ 
నిర్మాత: ఎస్.యన్.రాజరాజన్
విడుదల తేది: 07.01.2022



Songs List:



అల్లరి చేసే కల పాట సాహిత్యం

 
చిత్రం: 1945 (2022)
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హరిచరణ్ , ప్రియా మాలి 

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

వెల్లువలాంటి ప్రాణమే
వేచి వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా

ఆఆ ఆ, నమ్ముదుగా నమ్మవుగా
మేమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆదమరిచేనా

పెదవిపైన పెదవిలా
హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే
మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే
ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కల అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేదేలా

Palli Balakrishna Sunday, January 9, 2022
చిత్రం: చక్ర (2021)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిన్మయి శ్రీపాద, ప్రార్థన ఇంద్రజిత్
నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: యం. యస్. ఆనందన్
నిర్మాత: విశాల్
విడుదల తేది: 19.02.2021







అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంట
నీలో కనిపించేది నా రూపేనమ్మా

నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్ లేకుండా ఉండలేనే నేను క్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే

చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆఆ ఆఆ ఆఆ ఓఓ


Palli Balakrishna Sunday, March 21, 2021
చిత్రం: శంకర (2016)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: నారారోహిత్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాత: ఆర్. వి. చంద్రమౌళి
విడుదల తేది: 21.10.2016

Palli Balakrishna Sunday, February 28, 2021



చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, జగపతి బాబు, కళ్యాణి
దర్శకత్వం: మహేష్. పి
నిర్మాతలు: వంశీ కృష్ణ, శ్రీనివాస్
విడుదల తేది: 04.07.2014



Songs List:



హీరో హీరో పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తీక్ , అచ్చు రాజమణి

హీరో హీరో



రా రా కృష్ణయ్య పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అచ్చు రాజమణి, శ్రేయా ఘోషల్ , యాజిన్ నిజార్

రా రా కృష్ణయ్య



ఓనం ఓనం పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: శ్రీ మణి
గానం: అచ్చు రాజమణి, చిన్మయి

ఓనం ఓనం




వడరేయ్ మచాన్ పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: శ్రీ మణి
గానం: సుచిత్ర, అచ్చు రాజమణి

వడరేయ్ మచాన్



Come on Baby పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సౌమ్య, శ్రీ చిత్ర, సూరజ్ సంతోష్

Come on Baby



సీతా కల్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: రారా... కృష్ణయ్య (2014)
సంగీతం: అచ్చు రాజమణి
సాహిత్యం: Treditional
గానం: మహతి

సీతా కల్యాణం

Palli Balakrishna Thursday, February 11, 2021



చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నిర్మాత: చాణక్య బోనేటి
విడుదల తేది: 23.11.2012



Songs List:



నా మనసుపై పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్రీరామచంద్ర

నా మనసుపై




నీతోనే ఉన్నా పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: మిక్కీ జే మేయర్

నీతోనే ఉన్నా



వేళ తళుకుతారాలే పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: చిన్ని కృష్ణ
గానం: కార్తీక్

వేళ తళుకుతారాలే




యెప్పటికైనా పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: నరేష్ అయ్యర్

యెప్పటికైనా



నీ వరస నీదే పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్

నీ వరస నీదే



రొటీన్ లవ్ స్టోరీ థీమ్ పాట సాహిత్యం

 
చిత్రం: రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: 
గానం: దీపు 

రొటీన్ లవ్ స్టోరీ థీమ్

Palli Balakrishna



చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
నటీనటులు: అడవి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: వెంకట్ రామ్జీ
నిర్మాణ సంస్థ: పి. వి. పి. సినిమా
విడుదల తేది: 15.08.2019



Songs List:



ఎన్నెన్నో కథలె పాట సాహిత్యం

 
చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: LVN రమేష్
గానం: చిన్మయి శ్రీపాద

ఎన్నెన్నో కథలె చూసిన
ఏవేవో కలలె రేగెన
నిజమనిపించె ముసుగె తీసినా
మన రూపాలే నిదురే లేచెనా

ఏదొ ఏదొ కథ నీలోన నాలోనా
లోలోపలె కదా స్తిరై దాగెనా

ఎలా అలా ఇలా చూసెన ఎవరైనా
పదే పదే వ్యదై
నిను వెంటాడెనా

రగిలిన కణమైన, క్షనమైన అర చేతినా
ఆహుతి కాకుండ ఆగెనా
అంతె గతమైనా నిజమైన
నువు దాచిన యేదో రోజునా
నిన్నె సమిదే చేసెనా

నిజమనిపించె ముసుగే తీసినా
మన రూపాలె నిదురె లేచెనా

ఏదొ ఏదొ కథ నీలోనా నాలోనా
లోలోపలె కదా స్తిరై దాగెనా
ఎలా అలా ఇలా చూసేన ఎవరైనా
పదే పదే వ్యదై
నిను వెంటాడెనా

వెంటాడెనా
ఎల అలా
ఎల అలా



ఎదేమైన పాట సాహిత్యం

 
చిత్రం: ఎవరు (2019)
సంగీతం: శ్రీ చరణ్ పాకల
సాహిత్యం: LVN రమేష్
గానం: పూజాన్ కోహ్లి

రణమే రోజు ప్రతి వాడికి గెలిచేదెవ్వరో
క్షణమే చాలు పాపానికి బలిగా ఎవ్వరు
దొరికే వరకు రాదారులా తిరిగేదెవ్వరు
ముసుగే తీసి లోకానికి తెలిపే దెవ్వరో
రా అసురా అసురా
ఎయ్ వేసెయ్ ఎరా

ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా
ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా

ఎవరో ఎవరో ఎవరో

నువు చీకటి ఐతే మరి సూర్యుడు వీడు
నీడల్లె నిన్నే వెంటాడెస్తాడు
నీ గతమేదైన తెగ తవ్వేస్తాడు
నువు తాడిని తంతే తలదన్నే వీడు
రా అసురా అసురా
ఎయ్ వేసెయ్ ఎరా

ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా
ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా
ఎదురెవరున్న ఎదురెవరున్న
ఎదురెవరున్న వదలడుగా

Palli Balakrishna Tuesday, October 8, 2019







చిత్రం: శౌర్య (2016)
సంగీతం: వేద. కె
సాహిత్యం: బాలాజీ
గానం: రాంకీ, తేలు విజయ
నటీనటులు: మంచు మనోజ్, రెజీనా కాసాండ్రా
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: మల్కాపురం శివ కుమార్
విడుదల తేది: 04.03.2016

హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా

భూసామీ కామందు మోసాలకే మందు
ఊరి ఉసురు తగిలెనా బంద వడ్డీ పోయేన 
ఊరి ఉసురు తగిలెనా బంద వడ్డీ పోయేన 

పగలే కొట్టేసినాడు తోలు ఊడినట్లుగా
భయమే లేదంటూ తిప్పి వాతపెట్టుగా
వణుకే పుట్టింది వళ్ళు మంచమెక్కినట్టుగా
ముసుగే చూసాకే చావు కేక పెట్టగా

హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా 
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా

హే రచ్చకి రౌడీ వీడు
కాదన్నవాడి చుచ్చును పోయిస్తాడు
మిక్చర్ పొట్లం గాడు
అత్తంటే చాలు టార్చర్ పెట్టేస్తాడు

కుడి ఎడమై ఒకటడమై
ఇక భయమై ఆ వెన్నుపూస
వశమై వణికింది పొడి విస్తరాకులా
అడుగదుగు ఒక పిడుగై 
ముసుగేసి ముంచుకొచ్చే ముప్పిలా

హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా







చిత్రం:  శౌర్య (2008)
సంగీతం: వేద. కె
సాహిత్యం: బాలాజీ
గానం: విజయ ప్రకాష్ , రమ్యా బెహ్ర 

మొదట నిను కల అనుకున్న
మనసు పడి చెలి వనుకున్న
కలలు నిజమవుతుంటే
ఇది నమ్మలేకపోతున్న

మొదట నిను ఎవరనుకున్న
ఎదుట పడి పడదనుకున్న
చివరికది ప్రేమంటూ విడిచుండ లేకపోతున్న

తలచుకోలేదా ఇన్నాళ్ళు
పొలబారలేదసలు
మరిచిపోగాలనా నీ కథలు
పోగేసి దాచుకున్న ఆశలూ
ఇది నమ్మలేకపోతున్న

మొదట నిను కల అనుకున్న
మనసు పడి చెలి వనుకున్న
కలలు నిజమవుతుంటే
ఇది నమ్మలేకపోతున్న

తరిగెనిక దూరమే
కలిపినది ప్రేమే
నిన్నేనే కలిసిన క్షణములు
మిగిలుంటే నూరేళ్ళకు చాలు

నువ్వే నా ఎనిమిది దిక్కులు
ఎటువైపు నన్ను నీవే కనులు

మొదట నిను కల అనుకున్న
మనసు పడి చెలి వనుకున్న
కలలు నిజమవుతుంటే
ఇది నమ్మలేకపోతున్న

ఎవరికెవరో మనం
ఒకటి ఇక ప్రాణం
నీదే ఆ అలజడి గుండెలో
ప్రతిచోటా నీ గురుతులు నాలో
ఇలా నీ కబురుల మూటలు
ఈ జన్మ అందుకున్న వరములు

మొదట నిను కల అనుకున్న
మనసు పడి చెలి వనుకున్న
కలలు నిజమవుతుంటే
ఇది నమ్మలేకపోతున్న

తలచుకోలేదా ఇన్నాళ్ళు
పొలమారలేదసలు
మరిచిపోగాలనా నీ కథలు
పోగేసి దాచుకున్న ఆశలూ


Palli Balakrishna Tuesday, February 19, 2019


చిత్రం: SMS (2012)
సంగీతం: వి.సెల్వ గణేష్ , యువన్ శంకర్ రాజా (BGM)
సాహిత్యం: చైతన్య కృష్ణ , వనమాలి, అభిమన్యు శ్రీనివాస్
గానం: విజయ్ ప్రకాష్
నటీనటులు: సుధీర్ బాబు , రెజీనా కసండ్ర
కథ: యమ్.రాజేష్
మాటలు (డైలాగ్స్): నంద్యాల రవి
దర్శకత్వం: తాతినేని సత్య
నిర్మాత: విక్రమ్ రాజు
సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
ఎడిటర్: సతీష్ సూరియా
బ్యానర్: వేగా ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేది: 10.02.2012

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచం సుఖం కొంచం దుఃఖం
పంచేందుకే ప్రేమున్నదా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో

చరణం: 1
పొగరుకు రూపం నువ్వేనే పొరబడి స్నేహం చేశానే
మారువను మాత్రం మరిచానే
నిప్పని తెలిసినిలువెల్లా చొరవగ నిన్నే తాకానే
మంటలో హాయిగా రగిలానే
ఈ మనిషిని చంపే విషమైనా
కొంతసేపయ్యాకే ప్రాణం తీస్తుందే
ఈ ప్రేమ మాత్రం చిటికెలో చంపుతుందే
ఇంతకన్నా వింత ఎక్కడైనా ఉందా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో

చరణం: 2
నీ కలగంటూ లేస్తానే నీ మాటోకటే వింటానే
నీతో నీడై వస్తానే
నువ్విక దూరం అయ్యాక మిగిలిన బ్రతుకేం చెయ్యాలే
ఒంటరి వాడినై పోయానే
నీ పెదవులు తెలిపే చిరుమాటే
నా బతుకును నడిపే ఓ బాటే
నీ మౌనం వదిలే ఈ పూటే
ప్రేమంటేనే బాధ తీరే దారే లేదా

చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో
కొంచం సుఖం కొంచం దుఃఖం
పంచేందుకే ప్రేమున్నదా

ఓ..చెలియా నే ఇన్నాళ్లు నా ప్రేమే చూశానన్నా నీలో
ఇపుడే తొలి కన్నీళ్ల ఎన్నాళ్ళు దాచాలింక నాలో


Palli Balakrishna Tuesday, February 27, 2018


చిత్రం: సౌఖ్యం (2015)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కభట్ల , రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్
నటీనటులు: గోపిచంద్, రెజీనా కసండ్ర,
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
విడుదల తేది: 24.12.2015

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా
నాకేం తోచదే
నీ ప్రేమలో గడపని ఎ పూటైనా
ఏ చోట నేనున్నా నీతోనే కలిసున్నా
నీ ధ్యాస నన్ను వీడదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మీదటిగా ఏనాడో నిన్నెలా కలిశానో
మరిచి పోలేనే ఏనాడైనా
అక్కడే ఆ చోట ఆగి నిను చూస్తున్నా
నన్ను వీడి లోకం పరుగులైన
నువ్విలాగే నాకు దొరికేస్తావంటూ
ప్రేమగా తోడుగా నేను అనుకోలేదే
మల్లెల జల్లులా నువ్వే వస్తే
మనసు తేరుకోలేదే
తీపి దాహమేదో ఇంకా తీరదే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

మనసే పేపర్ పై రంగుల క్రియవై
ప్రేమనే చిత్రం గీశావే
పగటికి చీకటకి గీతలే చేరిపావే
కలలకే ప్రాణం పోశావే
నువ్వు తోడులేనిదే ఏక్షణమైనా
నన్ను చేరగా దరి రానే రాదే
నా దారి ప్రతి పేజ్ పైన పేరే నీదే
కాలమంతా నాకు చెలియా నీ కథే

నాకేం తోచదే తోచదే
నాకేం తోచదే
నిను చూడని క్షణము కలవని నిమిషం
నాకేం తోచదే
నిను తలవని సమయం ఏదైనా

Palli Balakrishna Wednesday, December 27, 2017

చిత్రం: బాలకృష్ణుడు (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: శ్రీవల్లి
గానం: అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి
నటీనటులు: నరారోహిత్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: పవన్ మల్లెల
నిర్మాతలు:  బి.మహేంద్ర బాబు, ముసునూరి వంశీ, శ్రీ వినోద్ నందమూరి
విడుదల తేది: 2017

రెండే రెండు కళ్ళు చాలవుగా
సంద్రంలా నా గుండె కన్నీళ్లు
రెండే రెండు కళ్ళు ఆగవుగా
ఊపిరినే నలిపేసే ఎక్కిళ్ళు
ఏమని నిమిషాన్ని అడగను నేను
నువులేని ఈ సున్యాన్ని ఏమనుకోను
మనసెంతో బాగుంది ఎప్పటివరకు
చేజారిపోయింది అశేపడకు
నీ రెక్కలు నాకిచ్చి నా స్వప్నము కదిలించి
సంతోషం తెలిశాక వెలిపోగలమా
నా రెప్పల బరువు నీ ఊసులు నడుగు
నా ప్రేమకు బదులు ఈ ప్రశ్నకు తెలుసు

రెండే రెండు కళ్ళు ఎందుకనో
కన్నీళ్లే వదిలేసే నన్ను
రెండే రెండు కళ్ళు ఎందుకని
నిలదీసి నన్ను అడిగెను
ఈ దూరం నీ దూరం తెలిసేలోపు
నీ ధ్యాసతో నా శ్వాసను కలిపేశావు
బాగుందే బాగుందే ఇప్పటివరకు
ఇకపైన కనపడదు మనసే పడకు
నీ నవ్వుల అద్దంలో నను నేను చూశాక
వెలితేదో తెలిసిందే వెలిపోయాక
నువ్వులేని రేపు ఏం తోచదు నాకు
తొలిసారి నాలో ఎండమావులు

Palli Balakrishna Saturday, November 11, 2017


చిత్రం: పిల్లా నువ్వులేని జీవితం (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: అనుదీప్ , రాహుల్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర
దర్శకత్వం: ఎ. యస్.రవికుమార్ చౌదరి
నిర్మాతలు: బన్నీ వాస్ , హర్షిత్
విడుదల తేది: 14.11.2014

అరె నిన్ను చూడగానే నా మనసులోనే
ఎదో ఎదో అయ్యిందే
ఓ పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే

ఓ మట్టిరోడ్డు లాంటి లైఫ్ లోకి
తారురోడ్డు లాగ వచ్చినావే
నువ్ రాకపోతే బ్రతుకుమొత్తం తారుమారయ్యేదే
సిగ్నల్స్ అందకుంటే ఏ ఫ్లైటూ తీరాన్ని చెేరుకోదే
నీ ప్రేమ అందకుంటే నా జిందగీ ఇట్టాగే నవ్వుకోదే
పిల్లా నా చేతులెత్తి ఏనాడు
పిల్లా ఏ దేవుడ్ని మోక్కలేదే
పిల్లా అయినా ఆ దేవుడు నిన్ను పంపితే
కాళ్ళు పట్టుకున్నా తప్పులేదే

అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే
పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే

ఓ వైట్ పేపరంటి మనసులోన కలర్ పెన్సిలెట్టి గీసినావే
నీ గురుతులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా
ఎక్కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్లుగ ఏమేమో అనుకున్నా
అదంత నీ తలపె అనిపుడే చిత్రంగ తెలుసుకున్నా
పిల్లా నీ రాకతోటి ఒక్కసారి
పిల్లా హార్ట్ డోరు ఓపెనయ్యే
పిల్లా ఇలా వేలు పట్టి చూపిస్తూ
నా ప్రేమ నిను చేరుకుందే

అరె నిన్ను చూడగానే నా మనసులోన
ఎదో ఎదో అయ్యిందే
పిల్లా నువ్వు లేని జీవితం నేనూహించుకోలేనే
అరె నిన్ను చూడగానే నా మనసులోనా
ఎదో ఎదో అయ్యిందే

Palli Balakrishna Thursday, October 12, 2017



చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రెజీనా కసండ్ర, ఆదా శర్మ
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 24.09.2015



Songs List:



సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: రాహుల్ నంబియార్

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  




I'm in love పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: ఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య అయ్యంగార్

తొలి తొలిగా తొలకరిగా తోసెను ముందుకు  తొందరలు 
కలివిడిగా కలిసెనుగా చూపుల దొంతరలు 
మనసును గట్టి మేళమే 
మనువుకు తట్టి లేపగా 
మెలకువలో కలలు కానీ మెలికలతో 
ఈ  సందల్లో సంద్రాలు నిలువెల్లముంచేస్తుంటే

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

దూరం  మాయం  కానీ ప్రాయం సాయం  రాని
నాలో  పొంగే  ప్రేమే  నీకే  సొంతం  కానీ 
మాటే  పలికే  మంత్రం 
మనసే  మంగళ  సూత్రం 
నీలో  నాలో  వయసుల  వేడే అగ్నిహోత్రం 
నీకు  నాకు  చేరువైన  ఈ  వరసలు  మారి
నీతో  సాగే  మనసు  నిన్ను  కోరి 
మగసిరికి  సొగసరికి మది  కలిసే  సుముహూర్తంలో
 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 

బిందె  లోతుల్లోన రింగ్ తీసే సీను 
గుండెలోతుల్లోంచి  లాగిందంట  నన్ను 
మనసే  చిటికెన  వేలై  కలిసే  ప్రేమకు  వేలై 
రోజు  చూస్తూ  ఉంది  నీకై  వేయి  కల్లై 
నువ్వు  నేను  ఆగలేని  ఈ  తొందర  తెలిసే 
గుండెల్లోనే  మంటపాలు  వెలిసి 
విరిసిన  ఈ  తలపులిలా 
కురిసేను  లే  అక్షింతలు  గా 

నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 
నాలో ఎం జరిగిందో ఏమో ఐఎం ఇన్ లవ్ 



ఆకాశం తస్సాదియ్య పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: కృష్ణ చైతన్య,  రమ్యా బెహ్రా

ఆకాశం తస్సాదియ్య




గువ్వ గోరింకతో పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, రమ్యా బెహ్రా

(ఈ పాట ఖైది నెం 786 (1988) సినిమాలో పాట దీన్ని రీమిక్స్ చేశారు, ఒరిజినల్ గా ఈ పాటకు రాజ్-కోటి సంగీతం అందించగా, యస్.పి.బాలు, యస్.జానకి గారు పాడారు)

గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై 

అరె గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట 
నిండు నాగుండెలో మ్రోగిందిలే వీణపాట 
 
జోడుకోసం గోడ దూకే వయసిది 
తెలుసుకో అమ్మాయిగారు 
అయ్యొపాపం అంత తాపం 
తగదులే తమరికి అబ్బాయిగారు 
ఆత్రమూ ఆరాటమూ చిందే వ్యామోహం 
ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం 
కోరుకున్నానని ఆట పట్టించకు 
చేరుకున్నానని నన్ను దోచేయకు  
చుట్టుకుంటాను సుడిగాలిలా...

అరె  గువ్వ - హా.., గోరింకతో  - హా.. 
ఆడిందిలే బొమ్మలాట 
హేయ్.. నిండు -  హా.. నా గుండెలో - అహా.. 
మ్రోగిందిలే వీణపాట హా హోయ్ హోయ్.. 

కొండనాగు తోడు చేరి 
నాగిని బుసలలో వచ్చే సంగీతం 
సందెకాడ అందగత్తె 
పొందులో ఉందిలే ఎంతో సంతోషం 
పువ్వులో మకరందము ఉందే నీ కోసం  
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం 
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు 
దూరముంటానులే దగ్గరయ్యేందుకు 
దాచిపెడతాను నా సర్వమూ... 
 
హేయ్... గువ్వ  - హాయ్.. గోరింకతో  - హాయ్.. 
ఆడిందిలే బొమ్మలాట 
అహ.. నిండు - హా.. నా గుండెలో - అహ
మ్రోగిందిలే వీణపాట 
ఆడుకోవాలి గువ్వలాగ 
పాడుకుంటాను నీ జంట గోరింకనై




తెలుగంటే పాట సాహిత్యం

 
చిత్రం: సుబ్రహ్మణ్యం ఫర్ సేల్  (2015)
సంగీతం: మిక్కీ జె మేయర్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

తెలుగంటే

Palli Balakrishna

చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భువన చంద్ర
గానం: సాహితి
నటీనటులు: అల్లు శిరీష్ , రెజీనా కసండ్ర
దర్శకత్వం: మారుతి
నిర్మాత: బన్నీ వాస్
విడుదల తేది: 01.05.2014

అటు అమలాపురం
ఇటు పెద్దాపురం మధ్య గోదావరీ
దాటేందుకూ...బోటున్నదీ...
రా సంతకీ... తస్సాదియ్యా ''అటు''

కోనసీమలో...కూరగాయలూ...
గోదారిలో... కొర్రమేనులూ
గంపలు రెండూ అమ్మకానికీ
రెడీ రెడీ రయ్యో....
తోటకూర గోంగూర బచ్చలకూర
కొత్తమేర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పైజంగిడిలో ఎజిటేరియనూ కొంటావా మామా
కింది గంపలో నానెజిటేరియన్ కావాలా బావా
సూపరు బజారు నేనే అనుకో
గంప దించుకుని సరుకు చూసుకో ''సూపరు''
బేరమాడుకో...తస్సాదియ్యా ''అటు''

తప్పుడు కథల అప్పలరాజూ....
జటకా ఎక్కు కోటిపల్లిలో...
కాకినాడకో మామిడాడకో
రూటు మార్చవయ్యో....
తోటకూర గోంగూర బచ్చలికూర
కొత్తిమీర కరేపాకూ
ఎండ్రొయ్యలు పచ్చిరొయ్యలు
బొమ్మిడాయిలు పీతలు పిత్తపరిగలూ
పెద్దపురము సంత చేరి
నా కాడికి రావయ్యో
గంపలోని సరుకులూ
ఎంతో నాణ్యవైనదయ్యో
హెలుసేలుగా బేరమాడుకో....
ఒకటే మాటా ఒకటే రేటూ ''ఒకటే మాటా''
రైటు చేసుకో... తస్సాదియ్యా...''అటు''


********  *******   ********


చిత్రం: కొత్తజంట (2014)
సంగీతం: JB ( జేబీ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: రమ్య

ఓహో.... ఎన్ని ఎన్ని ప్రేమలో...
ఓహో... ఎన్ని ఎన్ని పేరులో
కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
అమ్మా, బాబుకి మేటర్ లీకయ్యి
Left and right కోటింగ్ మొదలయ్యి
జిందగి మొత్తం  చిరిగీ చేటయ్యి... life long ఏడుస్తారే
ఇట్టా ఇట్టా ఎల్లాకిల్లా డల్లైపోయే మీకోసం
గండాలన్నీ గట్టెక్కించే కొత్త జంట మా ప్రోగ్రాం
లవ్వూ గివ్వూ లావాదేవీ క్షణాలలో తేలుస్తాం
ఇష్కే మీది రిస్కే మాది... బ్యాండు బాజా మోగిస్తాం

కళ్ళల్లోకీ కళ్ళే పెట్టేస్తూ
గుండెల్లోనా ఇల్లే కట్టేస్తూ
తిండి తిప్పల్ అన్నీ మానేస్తూ...
కాలం గడిపేస్తారే
ఆర్య సమాజూ... రిజిస్టార్ ఆఫీసూ
చర్చీ, మసీదులూ... వెడ్డింగ్ వెన్యూలే
ఎక్కడా లేనంతా... పక్కా గ్యారెంటీ

టైటూ సెక్యూరిటీ మేం అందిస్తంలే
కొత్తా జంటలకి ఊపిరిపోస్తాం
పెండింగ్ ప్రేమా కథలు సెటిలే చేస్తాం
బాబులకీ... బాంబులకీ...లొంగని మా...సత్తా చూపిస్తాం...

చలో చలో మీలో వున్న భయానికే బ్రేకేస్తాం
మీకూ మీకూ ఓకే ఐతే మిగతాదంతా మేం చూస్తాం
నిజంగానే మీ ప్రేమకి మా ప్రాణాలే అడ్డేస్తాం
నిఖార్సుగా నమ్మారంటే నిఖా షురూ చేసేస్తాం

Palli Balakrishna Tuesday, October 3, 2017


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: సింహా
నటీనటులు: నారారోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్రా
డైరెక్టర్: అవసరాల శ్రీనివాస్
నిర్మాత: సాయి కొర్రపాటి
విడుదల తేది: 09.09.2016

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 1
హే కథాకళీ చుశానీ నడకల్లో
చుశానీ నడకల్లో
హే హే నాగావళీ హొయలున్నవె మెలికల్లో ...
హొయలున్నవె మెలికల్లో
బుసకొట్టకే బంగారీ నస పెట్టకె నాంచారీ
తల తిప్పుకు పోకే టపక్కునా
ఇక పెట్టకు నన్నే ఇరుక్కునా
తెగ బెట్టుచేస్తవే బజారునా
చుట్టు జనాలు చూడాలనా ?
సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న

చరణం: 2
హే అనార్కలీ అరసున్నా నడుముల్లో
అరసున్నా నడుముల్లో
హే హే దీపావళీ వచ్చిందీ మే-నెల్లో
నడిరాతిరి తెల్లారీ పోతున్నా పొలమారీ
నువు కాదని అంటే పుసుక్కునా
నా ప్రాణం పోదా పుటుక్కునా
నా మనసునాపడం అయ్యేపనా ?
నువ్వు కారాలు నూరేసినా

ఆల్చిప్ప లాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరానా పెట్టకే పిల్లా పిల్లా
జాంకాయ లాగ మాంచి దోరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్లా పిల్లా
చక్కెర కలిపిన పటాసులా  ఆ చిటపట లేంటే బాలా ?
విప్పొదిలేసిన కుళాయిలా  చిరునవ్వులు రువ్వే గలా గలా
తొలిసారి ప్రేమలో ఇలా ఎలా జారి పడ్డాను వెల్లాకిల్లా

సువర్ణ సువర్ణ సువర్ణ నీ పేరుంది నాలుక చివర్న
సువర్ణ సువర్ణ సువర్ణ నన్ను కట్టెయ్యి కొంగుకి చివర్న


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కార్తీక్ ,  రమ్య బెహరా

పల్లవి:
ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా
కేరింతల్లో ఇలా సీతాకోకలా ఎగిరిందిలే మనస్సంతా
సంతోషం ఏదంటూ అందర్నీ అడగాలా
మనచుట్టే వుంటుందిగా చూస్తేఇలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది

ఆకుపచ్చని చందమామలా  మారిపోయె భూలోకం
ఈరోజే గమ్మత్తుగా
గోరువెచ్చనీ సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం
దాచెయ్యాలన్నంతగా

చరణం: 1
తరించే క్షణాలే ఏరి క్షణంలో నిధుల్లా మార్చుకుందాం
తమాషా కబుర్లే తెచ్చి మనస్సు అరల్లో పేర్చుకుందాం
వసారాలు దాటొచ్చాయీ వసంతాలు ఈ వేళా
తుషారాలు చిరునవ్వుల్లో కురిసేలా
ప్రతీ దారి ఓ మిణుగుర్లా మెరుస్తోంది ఈ వేళా
కలుస్తున్నవే నింగీనేలా

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ

చరణం: 2
భుజంతో భుజాన్నే తట్టి బలంగా భరోసా ఇచ్చుకుందాం
ఒకర్లో ఒకర్లా మారి నిదర్లో కలల్నే పంచుకుందాం
మహా మత్తులో ఈరోజే పడేస్తోంది ఈ గాలీ
సుగంధాలు ఏం జల్లిందో అడగాలీ
మరో పుట్టుకా అన్నట్టూ మరీ కొత్తగా వుందీ
ఇదేం చిత్రమో ఏమోగానీ

ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ
ఈ హాయి బాగున్నది
ఈ హాయి బాగున్నది
ఆహాహా బాగున్నదీ
ఆహాహా బాగున్నదీ


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (శ్రీ కళ్యాణ్ రమణ )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: శంకర్ మహాదేవన్

పల్లవి :
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా

చరణం: 1
ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ
కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ
పెదవంచు మీదా నవ్వునీ పూయించు కోడం నీ పనీ
నీ మౌనమే మాటాడితే దరి చేరుకోదా ఆమనీ

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా

చరణం: 2
అందనంత దూరమేలే  నింగికీ నేలకీ
వానజల్లే రాయబారం వాటికి
మనసుంటె మార్గం ఉండదా ? ప్రతి మనిషి  నీకే చెందడా ?
ఈ బంధమే ఆనందమే నువు మోసుకెళ్లే సంపదా

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా
తియ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా
కలబోసుకున్న ఊసులు  ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడిచేయవా ఎద మాటునా


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: కళ్యాణి మాలిక్ , హాయ్ రబ్బా స్మిత

ఇదేమి గారడీ ఇదేమి తాకిడీ భలేగ వుందిలే ఇదీ
ఇదేమి లాహిరీ ఇదేమి జాజిరీ తెలీదుగాని బాగుందీ
ఇదేమి అల్లరీ ఇదేమి గిల్లరీ పరాకు గుందిలే మదీ
అదేదొ మాదిరీ ఇదేమి ఆవిరీ మనస్సు ఊయలూగిందీ
ఎడారి దారిలో సుమాలు పూసినట్టు ఈ గాలి జోల పాడిందే
పెదాల గూటిలో పదాలు దాచినట్టు మహత్తుగున్నదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద


ఇదేమి ఉక్కిరీ ఇదేమి బిక్కిరీ భరించడంఎలా ఇదీ ?
గులాబి జాబిలీ గులేబకావళీ పడేసి ఆడుకుంటోందీ
ఇదేమి చిత్రమో ఇదేమి చోద్యమో తెలీని యాతనే ఇది
చమక్కు వెన్నెలా చురుక్కు ఎండలా
గుండెల్లో గుచ్చుకుంటోందీ
స్వరాల వీణలే చిరాకు పాట లాగ  చెవుల్లొ గోల చేస్తోందే
తరించు హాయిలో దహించు మంటలాగ సహించలేనిదీ ఇదీ

జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద
జ్యో అచ్యుతానంద


*********   ********   *********


చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి )
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: హరిణి రావు

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున

అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ ఆనకట్టే వేసుకోకూ వద్దనీ
కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ
దాచేయయకూ ఆపేయకూ అటు వైపు సాగే అడుగునీ

ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో

Palli Balakrishna Sunday, August 20, 2017



చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: సందీప్ కిషన్, రెజీనా కసండ్ర, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాతలు: కె. శ్రీనివాసులు, ఎస్. వేణుగోపాల్, సజ్జు
విడుదల తేది: 04.08.2017



Songs List:



హే లాయిరే లాయిరే పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: భీమ్స్ సిసిరోలియో , కాసర్ల శ్యామ్, రఘురాం

అహా... అహ... అహా...

హే లాయిరే లాయిరే లబ్బరు బొమ్మ 
ఫేసు చూస్తె బెల్లం దిమ్మ
దీని ఊపే గంజాయ్ గమ్మా 
రేసు గుర్రం ఇది జేజమ్మా... 

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో... 
దీని కల్లు చూస్తె సార పట్టిరో... 
ఇది కొయ్య మీద రొయ్య సట్టిరో... 
దీన్ని ముట్టుకోని సచ్చిపోతరో... 

బూరె బుగ్గలు తాటి ముంజలు 
గిల్లిగిచ్చి గిల్లిగంట ఆడమన్నయ్ రో 
దోర పెదవులు తేనె పెట్టెలు 
సూది గుచ్చి సుర్రు మంటు సుర్రు మన్నయ్రో... 
ఎర్రా పిల్లా తిప్పూతుంటె 
నిప్పు పుట్టి తప్పులెన్నొ చెయ్యమందిరో... 
బిర్రూగున్న సొత్తూలల్లా
ఊరుతున్న సోకులెన్నొ తోడమంది రో... 

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో... 
దీని కల్లు చూస్తె సార పట్టిరో... 

ఒక్కసారి దీని కాలు జారి మీద పడితె 
యాది తోటే వందేల్లు ఉండొచ్చురో... 
ఇంకొక్కసారి దీని పక్కచేరి 
పుట్టుమచ్చలు లెక్కపెడితె స్వర్గం చూడొచ్చురో... 

ఇచ్చేపోతా ఇచ్చేపోతా 
దీన్ని చూసి కళ్ళు దానమిచ్చేపోత 
సచ్చేపోతా సచ్చేపోతా 
ఒక్కసారి ముట్టుకోని సచ్చేపోతా 

దీని ఒల్లు చూస్తె పల్లి పట్టిరో... 
దీని కల్లు చూస్తె సార పట్టిరో...





పెదవికి నువ్వంటె ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నయనా నయ్యర్, అనురాగ్ కులకర్ణి

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో... 

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో

నువ్వెక్కడుంటె నా పక్కనుంటె 
కలతో పనిలేదు నా కల్లకీ 
నువు హత్తుకుంటె ఆ మత్తు కంటె 
గెలుపంటూ లేదు నా గుండెకీ 
నాతోన నువ్వుంటె నీలోన నేనే 
కరిగే క్షణమెంత బాగున్నదో 
ఈ జన్మ ముగిసేది నీ ముద్దుతోనే
అనిపించె హాయి ఏ జన్మదో 

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో

పెదవికి నువ్వంటె ప్రాణం
పెదవికి నువ్వంటె ప్రాణం
పిలవమని కలవమని అడిగినది ఆశతో
ఎదురుగ నువు నిలబడితె అదిరినది ఏమిటో




హెల్లొ పిల్లగాడ పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భరత్ మధుసూదనన్
సాహిత్యం: శ్రీమణి
గానం: ఐశ్వర్య దాసరి, సాయి చరణ్

హెల్లొ పిల్లగాడ 420 మాయగాడా... 
గుండెల్లోకె దూరి మా గుట్టే పట్టకు రా... 
హెల్లొ పిల్లగాడ మా కల్లోకె వచ్చేయ్కు రా 
మా సెల్లోకె నువ్ దూరి మరి సెల్ఫీ తియ్యకు రా... 

ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా... 
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా... 
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా... 
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా... 

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి 
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా... 
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి 
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె 

జిగేల్... జిగేల్... జిగేల్...

జిగేలంటు జిలుగులెన్నో చల్లుతున్నా నక్షత్రాన్ని 
ఒక్కసరి తాకి చూడర... 
విలాసాల కులాసాలె పరిమలించె సౌంధర్యాన్ని 
జన్మ కొక్క సారి పొందరా... 

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి 
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా... 
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి 
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె 

ఆడపిల్లంటేనె అగ్గికే అడ్రస్ రా... 
తట్టుకో గలననుంకుంటె టచ్చే చెయ్యరా... 
కన్నె పిల్లంటేనే ఎన్నెన్నొ సీక్రెట్స్ రా... 
తెలుసోకోవాలనుకుంటె ట్రయలే వెయ్యరా... 

అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది ఆటంబాంబు లేడి 
వెంటాడి వేటాడి నా గుండే పేల్చేరా... 
అమ్మమ్మమ్మొ కిల్లాడి ఇది గోల్దెన్ చుక్కల లేడి 
ఊరించి ఊరించి నా ఊపిరి తీసె తీసె





ఎ పాప ఏం పాపం పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: భీమ్స్ సిసిరోలియో

ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె 
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె 

ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె 
నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె 

చల్లర్చె మేగం లాంటి ముద్దుల్తొ మందే 
ఏ కొంచం దూరంగ ఉన్నా ఇబ్బందే... 

ఆ చూపుతో నా కల్లనే తాగెయ్కే... 
ఆ నవ్వుతో ప్రణాలనే తోడెయ్కే... 

నువ్ ఈ పూటకి నాకందితే జీవితం అంతే... 

అ పోయి పోయి నీ ఒంట్లో పడ్డా... 
అ మళ్ళీ మళ్ళీ పైకెట్టా వస్తా 

ఉన్నా ఉన్నా ఓ ఉక్కూ మనిషల్లే 
నన్నే లాగే ఐస్కాంతం అయ్యవే 
సంపేసెయ్ పర్లేదే ఇక ఇంకేం కావాలే... 




సుడిగాలల్లే పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: హరిగౌర
సాహిత్యం: బాలాజి
గానం: హరిగౌర

సుడిగాలల్లే దూసుకెళరా
గమ్యం ఎటు ఉన్నా 
తూఫానల్లే ఎగసిపడరా 
గమనం ఏదైనా 
కసి పెంచెయ్ రా 
కండలే కరిగించేయ్ రా 
కొలిమైపోరా నిప్పులే మరిగించెయ్ రా 
అడుగు అడుగున 

సుడిగాలల్లే దూసుకెళరా 
గమ్యం ఎటు ఉన్నా ఓఓఓఓ

ఓర్పుగ ఉంటే నేర్చుకుంటే
ఓటమె ఒక ఖడ్గం 
ఉప్పెనలున్నా నిప్పులున్నా 
వదలకు నీ లక్ష్యం 
నర నరమూ పిడికిలి చేసుకో 
ప్రతి క్షణమూ వరమని వాడుకో 
గురిపెడితే గుండెలు చీల్చరా 
తలతెగినా కల ఛేధించరా 
ఈ గాలి పంటిలో నీ పేరు మోసేలా 
ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా 

సుడిగాలల్లే దూసుకెళరా 
గమ్యం ఎటు ఉన్నా 
తూఫానల్లే ఎగసిపడరా 
గమనం ఏదైనా ఓఓఓ




టైం లేదు గురు పాట సాహిత్యం

 
చిత్రం: నక్షత్రం (2017)
సంగీతం: హరిగౌర
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: మోహన భోగరాజు

టైం లేదు గురు

Palli Balakrishna Saturday, July 15, 2017

Most Recent

Default