-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yamaleela (1994) Telugu Songs Lyrics Album Cover

Yamaleela (1994) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Yamaleela (1994)
Banner : Manisha Films
Music : S. V. Krishna Reddy
Director : S. V. Krishna Reddy
Producer : Achhi Reddy
Story & Screenplay : S. V. Krishna Reddy
Dialogues : Diwakar Babu
Starring : Ali, Indraja
Special Appearance : Krishna Ghattamaneni
Supporting Cast : Kaikala Satyanarayana, Tanikella Bharani, Brahmanandam, Kota Srinivasa Rao, Babu Mohan, Latha Sri
Release Date : 28 April 1994
MOVIE HIGHLIGHTS

• హాస్య నటుడు ఆలీని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి సోషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన 'యమలీల' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

• యమధర్మరాజుగా లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం భూలోకంలో పడే పాట్లు, వారి మధ్య సాగే హాస్యం తెలుగు సినిమా చరిత్రలోనే ఎవర్ గ్రీన్ కామెడీ ట్రాక్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.

• సూపర్ స్టార్ కృష్ణ చిత్రంలో ప్రత్యేక పాత్రలో మెరిసి "జుంబారే జూజుంబారే" పాటలో ఆలీతో కలిసి వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

• సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన "సిరులొలికించే చిన్ని నవ్వులే" గీతం మాతృప్రేమకు నిలువెత్తు రూపంగా నిలిచి ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించింది.

• ఈ సినిమా సాధించిన ఘనవిజయంతో హిందీలో జీతేంద్ర, సదాశివ్ అమ్రాపూర్కర్, కాదర్ ఖాన్‌లతో 'తక్దీర్‌వాలా' (Taqdeerwala - 1995) పేరుతో రీమేక్ చేయబడింది.

Nee Jeenu Pantu Choosi Bullemmoy Song Lyrics – Yamaleela (1994)

'Nee Jeenu Pantu Choosi Bullemmoy' is an energetic mass romantic dance number from Yamaleela (1994) movie, composed by S. V. Krishna Reddy, written by Bhuvana Chandra, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Nee Jeenu Pantu Choosi Bullemmoy
Movie : Yamaleela (1994)
Lyricist : Bhuvanachandra

Nee Jeenu Pantu Choosi Bullemmoy Song Lyrics in Telugu

ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో దిం దిం దిం ధింతనక జుం దిం దిం దిం ధింతనక జుం దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా దిం దిం దిం దిం దిం దిం ధింతనక ఉఁ హా ఆ... అప్పరాల చెరువులోన అమ్మడు ఉఁ హా కప్పపిల్ల బుస కొడితే అమ్మడు ఉఁ హా ఒళ్ళు జివ్వు జివ్వుమంటు అమ్మడు ఉఁ హా లవ్ పుట్టుకొస్తదంటా అమ్మడు ఉఁ హా తిమ్మరాజు రేవుకాడ పిల్లగో ఉఁ హా తొండ పిల్ల తొడగొడితే పిల్లగో ఉఁ హా తాటి మట్ట తగులుకోని పిల్లగో ఉఁ హా తాటలేసి పోతదంట పిల్లగో ఉఁ హా కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ ఆ ఆ నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆఁ హ హ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ... గోలిగూడా సెంటర్లో పిల్లగో ఉఁ హా గొడవ గొడవ చేసేస్తే పిల్లగో ఉఁ హా చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో ఉఁ హా చింతకాయ తినిపిస్తా పిల్లగో ఉఁ హా ఒట్టి ఊక దంపుడేలా అమ్మడు ఉఁ హా కొత్త పాట నేర్చుకోవే అమ్మడు ఉఁ హా మడతపేచి మానుకుంటే అమ్మడు ఉఁ హా తాళిబొట్టు కట్టిపెడతా అమ్మడు ఉఁ హా తాళిబొట్టు మోజు పెళ్ళికొడకు పోజు పక్కనెట్టి స్టెప్ లెయ్యారో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ ఆ... నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ ఆ... నీ జీను పేంటు చూసి బుల్లెమ్మోయ్ నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్ మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది హో వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ ఆ... నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ ఆ... నీ బేగి పేంటు చూసి బుల్లోడోయ్ నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్ వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తంది రో వయసు ఒనికేత్తంది ఒనికేత్తంది ఒనికేత్తంది రో హే ఎయ్రో సూత్తవేరో, హే ఎయ్రో సూత్తవేరో (2)

Nee Jeenu Pantu Choosi Bullemmoy Song Lyrics in English (Transliteration)

Aa... Nee jean pantu choosi bullemmoy Aa... Nee cycle chainu choosi pillammoy Aa... Nee jean pantu choosi bullemmoy Nee cycle chainu choosi pillammoy Manasu laagetthaandhi laagetthaandhi laagetthaandhi ho Vayasu oogetthaandhi oogetthaandhi oogetthaandhi haa Aa... Nee baggy pantu choosi bullodoy Aa... Nee kurachaa koatu choosi pillodoy Aa... Nee baggy pantu choosi bullodoy Nee kurachaa koatu choosi pillodoy Valapu oliketthaandhi oliketthaandhi oliketthaandhi ro Vayasu oniketthaandhi oniketthaandhi oniketthaandhi ro Hey eyro sootthaavero, hey eyro sootthaavero Dhim dhim dhim dhinthanaka jum Dhim dhim dhim dhinthanaka jum Dhim dhim dhim dhim dhim dhim dhinthanaka um haa Dhim dhim dhim dhim dhim dhim dhinthanaka um haa Aa... Apparaala cheruvulona ammadu um haa Kappapilla busa kodithe ammadu um haa Ollu jivvu jivvumantu ammadu um haa Love puttukosthadhantaa ammadu um haa Thimmaraaju revukaada pillago um haa Thonda pilla thodagodithe pillago um haa Thaati matta thagulukoni pillago um haa Thaathalesi pothadhanta pillago um haa Kopamela baala kongu chere vela Kurravaadi speedu choosuko Hey eyro sootthaavero, hey eyro sootthaavero Aa aa aa nee jean pantu choosi bullemmoy Aan ha ha nee cycle chainu choosi pillammoy Nee baggy pantu choosi bullodoy Nee kurachaa koatu choosi pillodoy Hey eyro sootthaavero, hey eyro sootthaavero Aa... Goliguda centerlo pillago um haa Godava godava chesesthe pillago um haa Chikkadapally centerlo pillago um haa Chinthakaaya thinipisthaa pillago um haa Otti ooka dhampudhela ammadu um haa Kottha paata nerchukove ammadu um haa Madathapechi maanukunte ammadu um haa Thaalibottu kattipedathaa ammadu um haa Thaalibottu moju pellikodaku Pose-u pakkanetti step-leyyaaro Hey eyro sootthaavero, hey eyro sootthaavero Aa... Nee jean pantu choosi bullemmoy Aa... Nee cycle chainu choosi pillammoy Aa... Nee jean pantu choosi bullemmoy Nee cycle chainu choosi pillammoy Manasu laagetthaandhi laagetthaandhi laagetthaandhi ho Vayasu oogetthaandhi oogetthaandhi oogetthaandhi haa Aa... Nee baggy pantu choosi bullodoy Aa... Nee kurachaa koatu choosi pillodoy Aa... Nee baggy pantu choosi bullodoy Nee kurachaa koatu choosi pillodoy Valapu oliketthaandhi oliketthaandhi oliketthaandhi ro Vayasu oniketthaandhi oniketthaandhi oniketthaandhi ro Hey eyro sootthaavero, hey eyro sootthaavero (2)

Sirulolikinche Chinni Navvule Song Lyrics – Yamaleela (1994)

'Sirulolikinche Chinni Navvule' is an emotional and touching mother-son sentiment song from Yamaleela (1994) movie, composed by S. V. Krishna Reddy, penned by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Sirulolikinche Chinni Navvule
Movie : Yamaleela (1994)

Sirulolikinche Chinni Navvule Song Lyrics in Telugu

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లీ చరణం: 1 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ మదిలో మచ్చలేని చందమామే నువ్వనీ ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ కలకాలము కనుపాపల్లే కాసుకోనీ నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు లాల లలలా లలలా లాలా లాల లలలా లలలా లాలల లాలల లాలల లాలల లాలల లాలల లాలల లాలల చరణం: 2 వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా తోడుండగా నను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

Sirulolikinche Chinni Navvule Song Lyrics in English (Transliteration)

Sirulolikinche chinninavvule mani maanikyaalu Cheekati yeragani baabu kannule malagani dheepaalu Budhibudhi nadakala thappatadugule Tharagani maanyaalu Chitipoti palukula muddhumootale Maa dhanadhaanyaalu Edhagaali inthaku inthai ee pasikoona Yelaali ee jagamanthaa eppatikainaa Maharaajulaa jeevinchaali nindu noorellu Sirulolikinche chinninavvule mani maanikyaalu Cheekati yeragani baabu kannule malagani dheepaalu Jaabilli jaabilli jaabilli Manchi jaabilli jaabilli jaabillee Charanam: 1 Naalo muripemanthaa paalabuvvai panchanee Lolo aashalanni nijamayelaa penchanee Madhilo macchaleni chandhamaame nuvvanee Ooru vaada ninne mecchukunte choodanee Kalakaalamu kanupaapalle kaasukonee Nee needalo pasipaapalle cherukonee Sirulolikinche chinninavvule mani maanikyaalu Cheekati yeragani baabu kannule malagani dheepaalu Budhibudhi nadakala thappatadugule Tharagani maanyaalu Chitipoti palukula muddhumootale Maa dhanadhaanyaalu Laala lalalaa lalalaa laalaa Laala lalalaa lalalaa Laalala laalala laalala laalala Laalala laalala laalala laalala Charanam: 2 Veshaa modhati adugu amma vele oothagaa Nerchaa modhati paluku amma pere aadhigaa Naalo anuvuu anuvuu aalayangaa maaragaa Nithyam koluchukonaa amma runame theeragaa Thodundagaa nanu dheevinche kanna prema Keedannadhe kanipinchenaa yennadainaa Sirulolikinche chinninavvule mani maanikyaalu Cheekati yeragani baabu kannule malagani dheepaalu Budhibudhi nadakala thappatadugule Tharagani maanyaalu Chitipoti palukula muddhumootale Maa dhanadhaanyaalu Edhagaali inthaku inthai ee pasikoona Yelaali ee jagamanthaa eppatikainaa Maharaajulaa jeevinchaali nindu noorellu Sirulolikinche chinninavvule mani maanikyaalu Cheekati yeragani baabu kannule malagani dheepaalu

Abhivandanam Yama Rajagrani Song Lyrics – Yamaleela (1994)

'Abhivandanam Yama Rajagrani' is a majestic praise song from Yamaleela (1994) movie, composed by S. V. Krishna Reddy, penned by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Abhivandanam Yama Rajagrani
Movie : Yamaleela (1994)

Abhivandanam Yama Rajagrani Song Lyrics in Telugu

ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా అభివందనం యమ రాజాగ్రణీ సుస్వాగతం సుర చూడామణీ తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ ఆ..ఆ.. అ అ అ అ ఏమీ శభాష్ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ..ఆ.. అ అ అ అ సరసాలు చవిచూడ ఇటురా దొరా నవమన్మథాకార నడుమందుకోరా రాకాసి కింకరుల రారాజునే నరకాన నీవంటి సరుకెపుడు కననే పాపాలు తెగ మోసి తల మాసెనేమో నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్ ఆ..ఆ.. అ అ అ అ అవశ్యము అటులనే కానిమ్ము నీ కౌగిలే నవ సింహాసనం రసలోకమే ఇక మన కాపురం యమ సరదాగా సాగాలి ఈ సంబరం ఆ..ఆ.. అ అ అ అ ఊర్వశికి నీవేమి కజినవుదువా కాకున్న నీకింత సౌందర్యమేల నరలోకమున ఊరికొక ఊర్వశి స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి ఊరించకే ఇక నా రాజహంస యమ హాయి నీదేలే రసికావతంస ఆ..ఆ.. అ అ అ అ రసికాగ్రేసరుండా యముండా మైకాలలో తమ మతిపోవగా నా కేళిలో పడి మునకేయగా గద వదిలేసి ఒడిలోకి రా దేవరా ఆ..ఆ.. అ అ అ అ మజ్జారే మదవతీ సెహబాసులే నర నారీమణి బహుబాగులే సుకుమారీమణి నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ ఆ..ఆ.. అ అ అ అ ధర్మపరిరక్షణ ధురంధరుండా సకలపాప శిక్షణ దక్షుండా చండతర దండథర బహుమండిత విగ్రహుండా నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా

Abhivandanam Yama Rajagrani Song Lyrics in English (Transliteration)

Dharmaparirakshana dhurandharundaa Sakalapaapa shikshana dhakshundaa Chandathara dhandadhara bahumanditha vigrahundaa Nikhila charaachara jeevapraana nirrmoolanaa Niyamundaa ha yamundaa Abhivandhanam yama raajaagranee Suswaagatham sura choodaamanee Thama sugunaalu palumaaru keerthinchanee Aa..aa.. A a a a Emee shabhaash sehabaasule nara naareemani Bahubaagule sukumaareemani Ninu mecchaanu vacchaanu raarammanee Aa..aa.. A a a a Sarasaalu chavichooda ituraa dhoraa Navamanmathaakaara nadumandhukoraa Raakaasi kinkarula raaraajune Narakaana neevanti sarukepudu kanane Paapaalu thega mosi thala maasenemo Naa paalabadi kaastha sukhamandhukovoy Aa..aa.. A a a a Avashyamu atulane kaanimmu Nee kowgile nava simhaasanam Rasalokame ika mana kaapuram Yama saradhaagaa saagaali ee sambaram Aa..aa.. A a a a Oorvashiki neevemi cousin-avudhuvaa Kaakunna neekintha soundharyamela Naralokamuna oorikoka oorvashi Swargaale dhigivacchu maa kuluku choosi Oorinchake ika naa raajahamsa Yama haayi needhele rasikaavathamsa Aa..aa.. A a a a Rasikaagresarundaa yamundaa Maikaalalo thama mathipovagaa Naa kelilo padi munakeyagaa Gadha vadhilesi odiloki raa dhevaraa Aa..aa.. A a a a Majjaare madhavathee Sehabaasule nara naareemani Bahubaagule sukumaareemani Ninu mecchaanu vacchaanu raarammanee Aa..aa.. A a a a Dharmaparirakshana dhurandharundaa Sakalapaapa shikshana dhakshundaa Chandathara dhandadhara bahumanditha vigrahundaa Nikhila charaachara jeevapraana nirrmoolanaa Niyamundaa ha yamundaa

Jumbare Joojumbare Song Lyrics – Yamaleela (1994)

'Jumbare Joojumbare' is a blockbuster celebratory dance number featuring Super Star Krishna alongside Ali, composed by S. V. Krishna Reddy, written by Jonnavithula Ramalingeswara Rao, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Jumbare Joojumbare
Movie : Yamaleela (1994)

Jumbare Joojumbare Song Lyrics in Telugu

జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా ఫ్రంటు సైడు ఆ రూపు… బ్యాకు సైడు ఈ షేపు మెంటలెక్కి పోయిందే నాకు ఫాస్టు బీటు నా రూటు… మూనులైటు నా ఫేటు సర్చులైటు నా సైటు నీటు నీ నడకలోన ఉంది స్నేకు డాన్సు, పీకాకు డాన్సు శభాష్ ప్రేమదాసు… బ్రేకు డాన్సు, నీ ఫోకు డాన్సు సగస గమగమ పమపనిప మ గ మ ప ని ప ని స ని జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె రింబరాహి రింబరాహి రీంబారే హ హ హ హ హ హ నువ్వు నేను టూ ఇన్ వన్… లవ్ మార్కు ఫైర్ ఇంజిన్ ముద్దులివ్వు వన్ బై వన్ బేబీ, హ రాసలీల రైల్ ఇంజిన్… ట్రాక్ మీద నో టెన్షన్ చేరుదాము లవ్ జంక్షన్ డైలీ నా జట్టు జూలియట్టు కొయిలాలో, గోల గోలా అబ్బాయి చూపులిక డబ్బనాలో అబ్బబ్బలాలో సగస గమగమ పమపనిప మ గ మ ప ని ప ని స ని జుంబారే జుజుంబరే జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె రింబరాహి రింబరాహి రీంబారే హెల్లో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా కొంటె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పుల్తో చూపిస్త జంజమా మైఖేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబారే జుజుంబరే… జుంబరాహి జుంబరాహి జుంబారే రీంబారే రిబ్బబ్బరె… రింబరాహి రింబరాహి రీంబారే

Jumbare Joojumbare Song Lyrics in English (Transliteration)

Jumbaare jujumbare… jumbaraahi jumbaraahi jumbaare Reembaare ribbabbare… rimbaraahi rimbaraahi reembaare Hello bullemma elloraa shilpamaa Konte kurrolla gundello rampamaa Kottha steppultho choopistha janjamaa Michael Jackson ke mathipoye bhangimaa Jumbaare jujumbare… jumbaraahi jumbaraahi jumbaare Reembaare ribbabbare… rimbaraahi rimbaraahi reembaare Hello bullemma elloraa shilpamaa Konte kurrolla gundello rampamaa Kottha steppultho choopistha janjamaa Michael Jackson ke mathipoye bhangimaa Frontu side-u aa roopu… back-u side-u ee shape-u Mentalekki poyindhe naaku Fast-u beat-u naa root-u… moon-u light-u naa fate-u Search-u light-u naa sight-u neetu Nee nadakalona undhi snake dance-u, peacock dance-u Shabhaash premadhaasu… break dance-u, nee folk dance-u Sagasa gamagama pamapanipa Ma ga ma pa ni pa ni sa ni Jumbaare jujumbare Jumbaraahi jumbaraahi jumbaare Reembaare ribbabbare Rimbaraahi rimbaraahi reembaare Ha ha ha ha ha ha Nuvvu nenu two in one… love mark-u fire engine Muddhullivvu one by one baby, ha Raasaleela rail engine… track meedha no tension Cherudhaamu love junction daily Naa jattu Juliettu koyilaalo, gola golaa Abbaayi choopulika dabbanaalo abbabbalaalo Sagasa gamagama pamapanipa Ma ga ma pa ni pa ni sa ni Jumbaare jujumbare Jumbaraahi jumbaraahi jumbaare Reembaare ribbabbare Rimbaraahi rimbaraahi reembaare Hello bullemma elloraa shilpamaa Konte kurrolla gundello rampamaa Kottha steppultho choopistha janjamaa Michael Jackson ke mathipoye bhangimaa Jumbaare jujumbare… jumbaraahi jumbaraahi jumbaare Reembaare ribbabbare… rimbaraahi rimbaraahi reembaare

Erra Kaluva Puvva Song Lyrics – Yamaleela (1994)

'Erra Kaluva Puvva' is a sweet, melodious romantic duet from Yamaleela (1994) movie, composed by S. V. Krishna Reddy, written by Jonnavithula Ramalingeswara Rao, and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra.

SONG INFORMATION
Song : Erra Kaluva Puvva
Movie : Yamaleela (1994)

Erra Kaluva Puvva Song Lyrics in Telugu

డింకు టకుమ్, టకుమ్, టకుమ్, టకుమ్ (5) ఓ... ఓ... ఓ... ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట ధింత నకిట తాత్త నకిట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా ధింత నకిట తాత్త నకిట ఎర్ర కలువ పువ్వా ఎద్దమా చలి మంట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా రా మరి చాటుకి సందామామ కౌగిలి విందుకి సందామామ సయ్యనె కాముడే సందామామ ఆశలే తీరని సందామామ సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా గాజుల మోతలో సందామామ మోజులే మోగని సందామామ తోడుగా సేరుకో సందామామ ప్రేమనె తోడుకో సందామామ రంప రపరి రంప రపరి రంప రపరి రా (2) గిలి గిలి సల్లగాలి తగిలిందే ఓ హంస సలి సలి సంబరాలు సాగిస్తే హైలెస్స కేరింత కెరటలా... మునగాలా కేరింత కెరటల ఊరంత మునగాల ఉపందుకోవాల నీ పొందు కావాలా నీ ఒడిలో తొంగుంట సందామామ నీ కలలో నేనుంటా సందామామ నా దొర నీవుర సందామామ ఉహాల రాణివె సందామామ సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా ఎన్నెలో ఎన్నెల ఎన్నెలో ఎన్నెల (2) హా..కులుకులు కుమ్మరించి మురిపాలే తేవాలా తళుకుల పూల తీగ సరసాల తేలాల వయ్యారి అందాలు... ఒడిలోనా హోయ్ వయ్యారి అందాలు గాంధాలు తీయాల మందారు బుగ్గల్లో మద్దెల్లు మోగాలా ఏడేడు జనమాలు సందామామ ఎలీకగ ఉంటనే సందామామ తానుకే నేనిక సందామామ నా ఎద నీదిక సందామామ ఎర్ర కాలువ పువ్వా ఎద్దమా చలి మంట ధింత నకిట తాత్త నకిట ఎవరు చూడని చోట పొగరాని పొదరింటా ధింత నకిట తాత్త నకిట సై రా సరదా గువ్వ పండించు నా పంట పదరా మధన జాతర చేద్దాము పడకింటా గాజుల మోతలో సందామామ మోజులే మోగని సందామామ తోడుగా సేరుకో సందామామ ప్రేమనె తోడుకో సందామామ

Erra Kaluva Puvva Song Lyrics in English (Transliteration)

Dinku takum, takum, takum, takum (5) O... O... O... Yerra kaluva puvvaa eddhamaa chali manta Dhintha nakita thaattha nakita Evaru choodani chota pogaraani podharintaa Dhintha nakita thaattha nakita Yerra kaluva puvvaa eddhamaa chali manta Evaru choodani chota pogaraani podharintaa Raa mari chaatuki sandhaamaama Kowgili vindhuki sandhaamaama Sayyane kaamude sandhaamaama Aashale theerani sandhaamaama Sai raa saradhaa guvva pandinchu naa panta Padharaa madhana jaathara cheddhaamu padakintaa Gaajula mothalo sandhaamaama Mojule mogani sandhaamaama Thodugaa seruko sandhaamaama Premane thoduko sandhaamaama Rampa rapari rampa rapari rampa rapari raa (2) Gili gili sallagaali thagilindhe o hamsa Sali sali sambaraalu saagisthe hailessa Kerintha keratalaa... Munagaalaa Kerintha keratala oorantha munagaala Upandhukovaala nee pondhu kaavaalaa Nee odilo thongunta sandhaamaama Nee kalalo nenuntaa sandhaamaama Naa dhora neevura sandhaamaama Uhaala raanive sandhaamaama Sai raa saradhaa guvva pandinchu naa panta Padharaa madhana jaathara cheddhaamu padakintaa Ennelo ennela ennelo ennela (2) Haa..kulukulu kummarinchi muripaale thevaalaa Thalukula poola theega sarasaala thelaala Vayyaari andhaalu... Odilonaa hoy Vayyaari andhaalu gaandhaalu theeyaala Mandhaaru buggallo maddhellu mogaalaa Yededu janamaalu sandhaamaama Eleekaga untane sandhaamaama Thaanuke nenika sandhaamaama Naa yedha needhika sandhaamaama Yerra kaaluva puvvaa eddhamaa chali manta Dhintha nakita thaattha nakita Evaru choodani chota pogaraani podharintaa Dhintha nakita thaattha nakita Sai raa saradhaa guvva pandinchu naa panta Padharaa madhana jaathara cheddhaamu padakintaa Gaajula mothalo sandhaamaama Mojule mogani sandhaamaama Thodugaa seruko sandhaamaama Premane thoduko sandhaamaama

No comments

Most Recent

Default