Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Tuck Jagadish (2021)
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్, గోపి సుందర్ 
నటీనటులు: నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ 
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల తేది: 23.04.2021Songs List:ఇంకోసారి ఇంకోసారి పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: శ్రేయా ఘోషల్ , కాల భైరవ

ఇంకోసారి  ఇంకోసారి 
నీ పిలుపే నా ఎదలో చేరి
మల్లోసారి మల్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి

మనసుకే మొదలిదే మొదటి మాటల్లో
వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో
తగదని తెలిసిన చివరి హద్దుల్లో

నా రహదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో
పున్నాగలా పూశావేమో

ఎగరేసే ఊహల్నే చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసే ఊహల్నే - ఎగరేసే ఊహల్నే
చెరిపేసే హద్దుల్నే - చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే - దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే - చూసేద్దాం చుక్కల్నే

కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో
గుండె అల్లాడేలా 
నవ్విస్తావు నీవు నీ కొంటె కోనాలతో 
చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది
కంటి పాపలో నిన్నే దాచింది
నిన్న లేని ఇబ్బంది బాగుంది
నిన్ను కోరి రమ్మంటోంది

నా రహదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో
పున్నాగలా పుశావేమో

ఎగరేసే ఊహల్నే చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే

ఎగరేసే ఊహల్నే - ఎగరేసే ఊహల్నే
చెరిపేసే హద్దుల్నే - చెరిపేసే హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే - దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే - చూసేద్దాం చుక్కల్నే

ఇంకోసారి  ఇంకోసారి 
నీ పిలుపే నా ఎదలో చేరి
మల్లోసారి మల్లోసారి
పిలవాలంది నువు ప్రతిసారి

కోలో కోలన్న పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్మాన్ మాలిక్, హరిణి ఇవటూరి, శ్రీ కృష్ణ

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏముంది,
చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీ వెంట కడదాకా నేనుంటా
రాళ్ళైనా, ముళ్ళైనా మన అడుగులు పడితే
పూలై పొంగాలా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

చినచిన్న ఆనందాలు చినబోని అనుబంధాలు
అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా
కలతా కన్నీళ్లు లేని చిననాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా

కదిలొస్తూ ఉంది చూడు కన్నులవిందుగా
ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా
హా... నలుగురితో చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా, తడిసేనా
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే,
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది
అంతా అయినోళ్లేగాని పరులెవ్వరూ
మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పదిమందికి ఆనందం పంచకపోదుగా

ఆ ఆ తగిన వరసైన తారక
తెరలు విడి ధరికి చేరగా
ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా
కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
ఓ ఓ... నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
నీటి నీటి సుక్కా పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీశ్ (2021)
సంగీతం: ఎస్. ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి
గానం: మోహన భోగరాజు

నీటి నీటి సుక్కా నీలాల సుక్కా
నిలబాడి కురవాలి నీరెండయేలా

వరినారు గుత్తంగా గొంతెత్తి కూసే
పూటుగా పండితే పుటమేసి నేను
పెదకాపు ఇచ్చేను సరిపుట్ల ఒడ్లు

కొరకొంచి సూసేటి కొత్త అలివేలు
మాగాడి దున్నేటి మొనగాడు ఎవరే
గరిగోళ్ళ పిలగాడే ఘనమైన వాడే

కిట్టయ్య కనికట్టు ఓ గొల్లభామా
ఎగదన్ని నిలుసున్నా నిలువెత్తు కంకి
నడుము వంచి వేసేటి నారు వల్లంకి

టక్ పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: గోపి సుందర్ 
సాహిత్యం: శివ నిర్వాణ
గానం:  శివ నిర్వాణ

టక్  
యేటికొక్క పూట పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: మోహన్ భోగరాజ్ 

యేటికొక్క పూట యానాది పాట
నాయుడోరి నోట నుంచి వచ్చిందే మాట

ముద్ద పసుపై కురిసే ముచ్చటైన బంధం
పద్దు రాయలేనిదంటా అమ్మ ముద్దు పాశం
కన్నపేగు పంచుకున్న అన్నగారు తోడు
అక్కసెల్లెలి సెలబా సెమ్మగిల్లనీడు
అంగిసుట్టు మడతేసి మంచిసెడు వడబోసి
సుట్టుముట్టుకుంటాడే సుట్టమల్లే కాపేసి

ఎర్రలెరువుగ మేసి ఎర్రబడ్డ భూదేవి
కుర్ర గాలి తగిలాక కళ్ళు తెర్సుకున్నాది
నిన్ను జూసి నికరంగా రొమ్ము ఇడ్సుకున్నాదినీది నాదంటూ పాట సాహిత్యం

 
చిత్రం: టక్ జగదీష్ (2021)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: శ్రీకృష్ణ 

నీది నాదంటూ 

No comments

Most Recent

Default