Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Marmayogi (1964)



చిత్రం: మర్మయోగి (1964)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారి, కాంతారావు
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు
నిర్మాత: ఎస్.కె.హాబీబుళ్ల
విడుదల తేది: 22.02.1964


చిత్రం: మర్మయోగి (1964)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, జమునా రాణి

పల్లవి:
రావాలి రావాలి రమ్మంటే రావాలి
రావాలి రావాలి
రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి
రాణిగారు తేవాలి

ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలీ
ఆగాలి ఆగాలి
ఆలుమగలమయ్యేదాకా అయ్యగారు ఆగాలి
అయ్యగారు ఆగాలి

ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలీ
ఆగాలి ఆగాలి

చరణం: 1
మదిలోన నేను మనువాడినాను మరి జాల మేలా
ఆ మనసులోనే అరుదైన హాయి ఊహించుకోవోయ్
ఊహలోనికైనా నీవు ఓదార్చరావే

ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలీ
ఆగాలి ఆగాలి
చరణం: 2
మగవారలయ్యో మది తెలుసుకోరు
తమ మాట తమదే
ఈ ఆడవారు ఎవరైన ఇంతే మురిపించిరారు
ఒక్కసారి వచ్చిన వనిత మరల వీడిపోదు

రావాలి రావాలి రమ్మంటే రావాలి
రావాలి రావాలి

చరణం: 3
సరదాలపైనా చన్నీళ్లు చల్లా మర్యాద కాదే
పగ్గాలు లేనీ ప్రణయాలలోనా సొగసేమికలదోయ్
సోగకంటి సైగలు తెలిసే సోధించరాదే

ఆగాలి ఆగాలి ఆగమంటే ఆగాలీ
ఆగాలి ఆగాలి
రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి
రాణిగారు తేవాలి

ఆహహ ఆహాహ ఆహహ ఆహాహా ఆహాహహాహాహా


****** ****** ******


చిత్రం: మర్మయోగి (1963)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. లీల

పల్లవి:
ఆ...ఆ...ఆ...ఓ...ఓ..ఓ..
నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

చరణం: 1
అనుకోని సుఖం పిలిచేను
అనురాగ మధువు వొలికేను
అనుకోని సుఖం పిలిచేను
అనురాగ మధువు వొలికేను
కొనగోటితో నిను తాకితే
పులకించవలయు ఈ మేను
అహ హ హ...

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి

చరణం: 2
నిదురించవోయి వడిలోన
నిను వలచెనోయి నెరజాణ
నిదురించవోయి వడిలోన
నిను వలచెనోయి నెరజాణ
అరచేతిలో వైకుంఠము
దొరికేను నీకు నిముషాన

నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
అది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి
ఆహా హ హా హా...
ఓహో హో హో హో...








Most Recent

Default

No comments