Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhimavaram Bullodu (2014)

చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: సునీల్, ఎస్తర్
దర్శకత్వం: ఉదయ్ శంకర్
నిర్మాత: డి. సురేశ్ బాబు
విడుదల తేది: 27.02.2014చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అంజనా సౌమ్య, భార్గవి పిళ్ళై, మేఘా రాజ్

హెయ్ ఆల్ ద పీపుల్ లిసన్ టు
ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
యా వీక్ లైక్ ఏ స్పైడర్ మ్యాన్
సోల్ లైక్ ఏ సూపర్ మ్యాన్
క్యాచ్ హిస్ పర్సనల్ సూపర్ హ్యూమన్
ఆల్ ద థింగ్స్ సెటిల్ డౌన్ హీ ఈస్
ది ఓన్లీ ఒన్ హూ కెన్ పుల్ ఆఫ్
ఆల్ ది స్టార్స్ అండ్ లీవ్ యు స్ట్రాంగ్

హీ ఈస్ బీమ్ బీమ్.. 
భీమవరం బుల్లోడు.. ఓయా 
కన్నె కథ బాగా లేనోడు
మన కథలోని నాయకుడు
పెళ్లి చూపులకు వెళతాడు
పిల్ల నచ్చెనని చెబుతాడు
ఆ పిల్లకు పెళ్లి అవుతుంది...
వేరే వాడితో 
ఈడి గుండెకు చిల్లి పడుతుంది పెళ్లి బాధతో పెళ్లికాని కుర్రాడు ప్రేమాచారము ఉన్నోడు 

వీడు వీడు వీడు...
వీడు.. బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు

బలహీనుడు తెలివైన వెర్రివాడు
ధైర్యమున్న పిరికివాడు
గంభీరమైన చిలిపోడు
అమ్మాయిని చూసాడు
ఆమెతో ప్రేమలో పడిపోయాడు 
అందరినెదిరించాడు ఆఖరికేమయ్యాడు
చావంటే భయమే లేనోడు
భయంతోటే చస్తూ బ్రతికేస్తాడు 
భయం వీడ్ని వీడిందా
మరి జయం వీడికి కలిగిందా 

దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ భీమవరం బుల్లోడు
హీ ఈస్ బీమ్ బీమ్.. భీమవరం బుల్లోడు..

భీమవరం బుల్లోడు..చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనూప్ రూబెన్స్, సైంధవి

హా ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

హో ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక మాటే దాస్తున్నామా
గాల్లో ఒక మాటే రాస్తున్నామా

హోగుండెల్లోన మాటే ఉంది
బయటికేమో రానంటుంది 
ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా 

హో అదిరే కుడి కన్ను కొన్నాళ్ళుగా
నాకేదో శుభవార్త చెబుతున్నాది
హో ఎడంవైపున నా యద సవ్వడి
సిరిమువ్వల సడిలా వినిపిస్తున్నది
హా అద్దం ముందు నా బొమ్మ నన్నే
ఎవరో అంటున్నది ఓ...
అర్ధం కాని ఆనందం ఏదో నీడై వస్తున్నది
అటు మొన్నలో నిన్నలో ఎన్నడు లేనిది మనసంతా బరువౌతుందే 
ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

హో చుట్టూ ఒకరైనా కనరాకున్నా
నాకు నేనే లోకంలా ఉందే ఇది
హొ చుట్టూ పదిమంది ఎవరున్నా లేరని
ఏదో మైకంలా ఉంది మది
అరె ముళ్ళురాళ్లు పూలైపోతాయే నిన్నే ఆలోచిస్తే నిమిషాలన్నీ నిలబడిపోతాయే నీలోనన్నే చూస్తే 
కనువిందుగ ఇంతటి వింతలు నేరుగా
మనసే గురి చూసాయంటే 

ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ ఇదిప్రేమ

ఒక వైపు నువ్వు ఒక వైపు నేను
ఒక వైపే చూస్తున్నామా 
అన్నీ ఒకలాగే చేస్తున్నామా

ఒక వైపు..ఒక వైపు.. ఒక వైపు.. ఒక వైపు..చిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాజా హాసన్, రమ్య యన్. యస్

అరె పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
హె అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్నై నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజా

పల్లకితో వస్తానే పిల్లదానా 
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా

ఓ పిల్లా నాలోన పొంగే ప్రేమంతా కట్టేస్తా పుస్తెల్లాగా
ఇలా నీలోన పుట్టే పులకింత పెట్టేయి మెట్టెల్లాగా
హే చిట్టి చిట్టి ముద్దు - సింధూరంలా దిద్దు
మహా బాగా మన షాదీ జరగాలి జాతరల్లే 

అరె భల్లే భల్లే భల్లే ఆ షామియానా
అరె భలే భలే భల్లే ఆ మల్లెల మేనా
భల్లే భల్లే భల్లే ఆ ఖానా పీనా
అరె భలే భలే భల్లే ఆ గానా బజానా 

హే పిల్ల నీపైన రెండు చేతుల్ని వేసేస్తా పూదండలా
ఇలా నాలోని నిండు గుండెల్ని పరిచేస్తా తలదిండులా 
చిందే చమట జల్లు - అక్షింతలే చెల్లు
ప్రతిరేయి జరగాలి సరికొత్త శోభనాలే 

భల్లే భల్లే భల్లే ఆ పళ్ల పల్లెం
అరె భలే భలే భల్లే ఆ తలుపుల గొళ్ళెం
ఏ భల్లే భల్లే భల్లే ఆ అగరు దూపం
అరె భలే భలే భల్లే ఆ అక్తరు తాపం 

పల్లకితో వస్తానే పిల్లదానా
నీలో పెళ్లికళే తెస్తానే కుర్రదానా 
యే అల్లుడివి నువ్వేరా అల్లరోడా
నీతో గిల్లుడుకే పెళ్లాన్ని నేనురానా 
అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ
తుళ్లి తుళ్లి పోవాలిలే 
ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగల్లే

భల్లే భల్లే భల్లే ఆ బ్యాండు బాజా
అరె భలే భలే భల్లే ఆ స్వీటు కాజా
భల్లే భల్లే భల్లే ఆ ప్రేమ పూజ 
అరె భలే భలే భల్లే నా జడ్లో రోజాచిత్రం: భీమవరం బుల్లోడు (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విజయ్ ప్రకాష్ , శ్రావణి

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా - ఓ గర్ల్ 
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా - లిసన్ టు మీ 

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా
హ మనసే లాగిందిరా తొలి మైకంలో
తనువే ఊగిందిరా 

అరె జల్లు జల్లునా ఆనందం అల్లేనా
ఘల్లు ఘల్లున అదృష్టం గిల్లేనా
మబ్బును మీటేస్తున్నా మెరుపును వాటేస్తున్నా
ఆకాశం దాటేస్తున్నా

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓయ్యయ్యయ్యో...

ప్రేమలో పడ్డానురా తొలిచూపుల్లో
నాకేదో అయ్యిందిరా 

ఓ నా పేరే అనుకుంటూ నీ పేరే నే రాస్తున్నా
ఇద్దరి పేర్లు ప్రేమే అంటున్నా ఓ సజ్నా
నా దారే అనుకుంటూ నీ దార్లో నేనొస్తున్నా
ప్రేమకు మనమే రహదారంటున్నా సంజోనా

హిందీలో దీన్ని ఇష్కన్నా
ఇష్కులోన రిస్కున్నా
చెన్నైలో కాదల్ అంటున్నా
అన్నిట్నీ కాదని అంటున్నా
నీకోసం దూకేస్తున్నా ఓ... 

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

ఓ.. వెన్నెల్లో పడుకున్నా కన్నులు మూయను క్షణమైనా
ప్రేమకు నిదరే శత్రువు అంటున్నా ఓ సజ్నా
ఎన్నెన్నో అనుకున్నా అన్నీ దాగును లోలోన
ప్రేమ గుబులు స్నేహితులంటున్నా సునోనా

ఇంగ్లీషులోన లవ్ అన్నా
స్పానిషులో ఆమోర్ అన్నా
బెంగుళూరులోన ప్రీతన్నా
బెంగాల్లో భాలో అంటున్నా

తెలుగులోనే ప్రేమిస్తున్నా ఓ...

జారే జారే జారే నా మనసే జారే
మారే మారే మారే నా వరసే మారే

No comments

Most Recent

Default