Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kanchana Ganga (1984)చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్, శరత్ బాబు, సరిత, స్వప్న
దర్శకత్వం: వి. మధుసూదనరావు
నిర్మాత: రామోజీ రావు
విడుదల తేది: 09.11.1984


చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్.పి.బాలు 

పల్లవి:
వనిత, లత, కవిత
మనలేవు లేక జత

వనిత, లత, కవిత
మనలేవు లేక జత

ఇవ్వాలి చేయూత 
మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత

వనిత, లత, కవిత
మనలేవు లేక జత

చరణం: 1
పూలురాలి నేలకూలి తీగబాల సాగలేదు
చెట్టులేక అలుకోక పూవు రాదు నవ్వలేదు
మోడు మోడుని తిట్టుకున్నా...తోడు విడిచేనా
పులకరించే కొత్త ఆశ  తొలగిపోయెనా

వనిత, లత, కవిత
మనలేవు లేక జత

చరణం: 2 
ఆదరించే ప్రభుతలేక కావ్యబాలా నిలువలేదు
కవిత ఐనా వనిత ఐనా ప్రేమలేకా పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా...చెలిమి విడిచేనా
చేదు మింగి... తీపి నీకై పంచమరిచేనా

వనిత, లత, కవిత
మనలేవు లేక జత

చరణం: 3 
తనది అన్న గూడులేక కన్నెబాల బతకలేదు
నాది అన్న తోడులేక నిలువలేదు విలువలేదు
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా
వెలుగులోన నీడలోన నిన్ను మరిచేనా

వనిత, లత, కవిత
మనలేవు లేక జత

ఇవ్వాలి చేయూత ..
మనసివ్వడమే మమత
మనసివ్వడమే మమత

వనిత, లత, కవిత
మనలేవు లేక జత


****** ****** ******


చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా
లాలలా లా ఆ ఆ ఆ...
నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం: 1
నీ అందమే అరుదైనదీ
నా కోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో 

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా 
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా 

చరణం: 2
ఆ... ఆ... ఆ...
ఏ గాలులూ నిను తాకినా
నా గుండెలో ఆవేదనా
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా 
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా 

నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా


****** ****** ******


చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్.జానకి

పల్లవి:
ఆఁహా ఆఁహ లలలలలల లలలలలల
లలల లలల లలల లలల లలల లలల లా

ఓ ప్రియతమా నా గగనమా
ఇంద్రుడెవ్వరూ చంద్రుడెవ్వరూ
సిరిగల మగసిరి నీ జంటలో

ఓ ప్రియతమా నా భువనమా
నవ్వులుండగా మల్లెలెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో

చరణం: 1
లేత రంగు నీలి మబ్బు చీర కట్టుకొస్తా
తారలన్ని కోసుకొచ్చి తోరణలు చేస్తా
చందమామ సాన మీద చందనాలు తీస్తా
ఎండ వెండి మువ్వలన్ని నీకు దండలేస్తా

నవ్వులోని రవ్వలన్ని దోచుకుంటే
వద్దంటూనే వడ్డించేది ఎలా?
నీ నోటి ముత్యాలు రాలవులే హే

చరణం: 2
ఓ ప్రియతమా నా గగనమా
ఇంద్రుడెవ్వరూ చంద్రుడెవ్వరూ
సిరిగల మగసిరి నీ జంటలో

ఓ ప్రియతమా నా భువనమా
రంభ ఎందుకూ ఊర్వశెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో

చరణం: 3
కొంగులేని క్రొత్త ఈడు కోక పట్టి చూడు
ముద్దులన్ని మూటబెట్టి ముందు ముచ్చటాడు
వానవిల్లు చీరలోని వన్నెలేమో ఏడు
చిన్నదాని చీరకున్న మూరలేమో మూడు

చెంపలోని కెంపులన్ని రాలకుండా
వయ్యారాలే వడ్డించే వేళా
ఆరారు కాలాలు చాలవులే... హే..

ఓ ప్రియతమా నా గగనమా
రంభ ఎందుకూ ఊర్వశెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో
No comments

Most Recent

Default